Pages

Sunday, October 30, 2016

జర్నలిస్ట్ కావాలనుకుంటున్నారా ? Want to become a journalist?

Want to become a journalist?

Join

EENADU JOURNALISM SCHOOL

ఈనాడు స్కూల్ అఫ్ జర్నలిజం 

'POST GRADUATE DIPLOMA COURSE IN JOURNALISM'.


Qualifications:- Any Degree + Good knowledge in Telugu,
& knowledge in current affairs, English language, Social work, Social awareness,

Age limit:-
The candidate should not exceed the age of 28 years as on 01-01-2017.

Selection Process:-
  • Written test
  • Interview
  • Group Discussion
Duration:-
One(1) year Duration (Training).

Styphend:-
  • Rs. 12000/- for first 6 mnths
  • Rs. 14000/- after 6 months
  • Rs. 16000/- entered in job
  • Rs. 18000/- probation
  • Rs. 20000/- salary
How to Apply?
  • Apply ONLINE;- http://www.eenadu.net/ejs2016/ejs-notification.html
  • Online online applications will accept.
  • Apply from 26, Oct'2016
  • Closing Date:- 10.November'2016.
  • Application fee Rs. 200/- DD in favor of "USHODAYA ENTERPRISES PVT. LTD."
  • Payable at Hyderabad.
  • Take a Printout of ONLINE Application & Sign, 
  • Send it to;-
To,
Principal,
Eenadu Journalism School,
Ramoji Film City,
Hyderabad - 501512.



Monday, October 24, 2016

మానవ శరీరం గురించి అద్దిరిపోయే విషయాలు:

మానవ శరీరం గురించి అద్దిరిపోయే విషయాలు:


* మన కడుపులో ఉండే ఆమ్లము (acid) రేజర్ బ్లేడ్ లను కూడా కరిగించగలదు.

* మనం రోజుకి సగటున 40 నుండి 100 వెంట్రుకలు కోల్పోతున్నాం.

* మన ఒక్కో వెంట్రుక 3 నుండి 7 సంవత్సరాల వరకు పెరుగుతూనే ఉంటాయి.

తర్వాత అవి రాలిపోయి వాటి స్థానంలో వేరేవి పెరుగుతాయి

* ఒక్క అంగుళం చర్మం మీద 3 కోట్లకు పైగా బాక్టీరియా ఉంటుంది.

* రోజుకి మన గుండె ఉత్పత్తి చేసే శక్తితో ఓ సాధారణ ట్రక్ ని 30 కిలో మీటర్ల వరకు నడిపించవచ్చు.

* లేవకుండా ఒక మనిషి నిద్రించిన రికార్డు 11 రోజులు.

* 90 శాతం కి పైగా జబ్బులు స్ట్రెస్ వల్లనే అని తేలింది.

* శరీరం నుండి తల వేరు చేసినా.. తల 15 సెకన్ల వరకు స్పృహ కోల్పోదు.

* మీరు పడుకునే గది ఎంత చల్లగా ఉంటె... మీకు పీడ కలలు వచ్చే అవకాశాలు అంత పెరుగుతాయి.

* నిద్రించే సమయంలో మన వాసనా పీల్చే భావం పనిచేయదు.

* మనవ శరీరం లో ఉన్న DNA మరియు అరటిపండులో ఉన్న DNA 50 శాతం కలుస్తాయి.

* మనం తిన్నది అరగడానికి మన శరీరంలో ఏవైతే సహాయ పడతాయో... చనిపోయిన 3 రోజులకి అవే మనల్ని తినడం మొదలపెడతాయి.

* గుండె పోటు వల్ల చనిపోయే వారిలో 20 శాతం మంది సోమవారం నాడే చనిపోతారు.

* 7 గంటల కన్నా తక్కువ నిద్రిస్తే.. త్వరగా చనిపోతారు.

* వెలి ముద్రలు ఉన్నట్టే.. నాలుక ముద్రలు కూడా ఒకరితో ఒకరికి పోలిక లేకుండా ఉంటాయి.

* ఒకవేళ మన కళ్ళు కెమెరా అయితే.. 576 మెగా పిక్సెల్స్ ఉన్న కెమెరాలా ఉండేది.

* మనిషి కన్నుని తయ్యారుచేయాలంటే కొన్ని లక్షల కోట్లు కర్చవుతుందట.

* మన నోరు 100 కోట్లకు పైగా రుచులను గుర్తించగలదు.

* మీకు 60 ఏళ్ళు వచ్చే సరికి నోటిలో ఉండే టేస్ట్ బడ్స్ సగానికి పైగా చనిపోతాయి.

* మీకు ఎంత ఎక్కువ IQ ఉంటె.. అన్ని కలలుగంటారు.

* మన కాళ్ళ గోర్లకన్నా చేతి గోర్లు 4 రెట్లు త్వరగా పెరుగుతాయి.

* చింపాంజీ శరీరం పై ఉన్నన్ని వెంట్రుకలే మన శరీరం పై కూడా ఉంటాయి. కాకపోతే మనవి చాలా సన్నగా ఉంటాయి.

* మన శరీరం 30 నిమిషాలలో ఉత్పత్తి చేసే వేడితో 114 లీటర్ల నీటిని వేడి చేయవచ్చు.

* మన చర్మం నిమిషానికి 50000 సెల్స్ ని వదిలేస్తుంది. అంటే జీవిత కాలంలో అది 18 కిలోలనమాట.

* మీ బెడ్ పై ఉండే దుమ్ములో సగానికి పైగా మీ చర్మందే.

* మన బ్రెయిన్ 25 వాట్స్ విద్యుత్త్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ పవర్ తో ఓ బుల్బ్ ని వెలిగించవచ్చు.

* మీకు 40 ఏళ్ళు వచ్చే వరకు మీరు ఎదుగుతూనే ఉంటారు.

* మన బ్రెయిన్ పగటి పూటకన్నా రాత్రి పూటనే చురుకుగా పనిచేస్తుంది.

* ఒక సంవత్సరంలో 15000 కలలుగంటారట.

* మీరు వింటున్న మ్యూజిక్ కి తగ్గట్టుగా మీ గుండె కొట్టుకోవడం ప్రారంభమవుతుంది.

మీకు ఈ పోస్టు కనుక నచ్చితే షేర్ చేయడం మరువకండి..!!

ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీ ముందుకు తెచ్చేందుకు ఎల్లపుడు ముందుంటాను!!                       

మంచికథ......

 మంచికథ......


ఒక సారి చాణిక్యుని దగ్గరకు అతని మిత్రుడు ఒకడు వచ్చి నీకు తెలుసా నీ మిత్రుడు గురించి నేను ఒక విషయం విన్నాను" అని ఎంతో ఉత్సాహంగా ఇంకేదో చెప్పబోతున్న అతన్ని చాణిక్యుడు ఆపి "నీవు నా మిత్రుడు గురించి చెప్పబోయే ముందు ఒక్క నిముషం సావధానంగా నీవు చెప్పబోయే విషయాన్ని కొద్దిగా జల్లెడ పడదాం దీన్ని నేను "మూడు జల్లెడ్ల పరీక్ష (Triple Filter Test)" అంటాను అని అడగటం మొదలు పెట్టాడు.

మొదటి జల్లెడ"నిజం" - "నీవు నా స్నేహితుడి గురించి చెప్పబోయే విషయం ఖచ్చితంగా నిజమైనదని నీకు తెలుసా ?" అని అడిగాడు.

అందుకు ఆ స్నేహితుడు "లేదు, ఎవరో అంటుండగా విన్నాను" అని అన్నాడు.
"అంటే నీవు చెప్పబోయే విషయం నిజమైనదే అని నీకు తెలీదన్న మాట" అని చాణిక్యుడు అన్నాడు.

సరే రెండో జల్లెడ "మంచి " - " నీవు నాకు చెప్పబోయే విషయం నా మిత్రుని గురించిన మంచి విషయమా ?" అని అడిగాడు చాణిక్యుడు,

"కాదు" అన్నాడు చాణిక్యుని స్నేహితుడు .

"అంటే నీవు నా మిత్రుని గురించి చెడు చెప్పాలను కున్నావు, అది కుడా నీకు ఖచ్చితంగా నిజమని తెలీని విషయం- సరే ఇంక మూడో జల్లెడకు వెళదాం"అన్నాడు చాణిక్యుడు.

మూడో జల్లెడ "ఉపయోగం" - "నీవు నా మిత్రుని గురించి చెప్పబోయే విషయం నాకు ఉపయోగమైనదా ? " అని చాణిక్యుడు అడిగాడు.

"లేదు" అన్నాడు ఆ మిత్రుడు.

"అయితే నీవు చెప్పబోయే విషయం నిజమైనది, మంచిది, ఉపయోగకరమైనది కానపుడు నాకు చెప్పటం ఎందుకు ?" అని అన్నాడు చాణిక్యుడు

నీతి : మన గురించి, మన వాళ్ళ గురించి చెడు వార్తలను, విషయాలను మోసే వాళ్ళు చాలా మంది వుంటారు. ఒక విషయం (చాడి) వినేముందు ఈ మూడు జల్లెడల పద్ధతి అనుసరిస్తే, మన బంధాలు నిలబడతాయి, మంచి పెంపొందుతుంది. చాడీలు నివారించబడతాయి.        

"ఐక్యరాజ్య సమితి దినోత్సవము" సందర్భంగా సమాచారం

"ఐక్యరాజ్య సమితి దినోత్సవము" సందర్భంగా సమాచారం

🐔ఐక్యరాజ్య సమితి ( ఆంగ్లం: United Nations) అంతర్జాతీయ చట్టం, భద్రత, ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి మరియు మానవ హక్కులపై సమష్టి కృషి చేసేందుకు ప్రపంచ దేశాలు ఏర్పాటు చేసుకున్న ఒక అంతర్జాతీయ సంస్థ.

🐌మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఏర్పాటు చేసిన నానాజాతి సమితి (లీగ్ ఆఫ్ నేషన్స్)
రెండవ ప్రపంచ యుద్ధాన్ని నివారించుటలో విఫలమగుటచే దానికి ప్రత్యామ్నాయముగా 1945లో ఐక్యరాజ్య సమితి స్థాపించబడింది. ప్రస్తుతము 193 దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్యదేశాలుగా ఉన్నాయి. ఐక్యరాజ్య సమితిలో ప్రధానంగా 6 అంగాలు ఉన్నాయి.

🕌సర్వప్రతినిధి సభలో ఐక్యరాజ్య సమితిలో ప్రవేశించిన అన్ని దేశాలకు సభ్యత్వం ఉండగా, భద్రతామండలిలో 15 దేశాలకు మాత్రమే సభ్యత్వం ఉంటుంది. అందులో 10 దేశాలు రెండేళ్ళకోసారి ఎన్నిక ద్వారా సభ్యత్వం పొందగా, మరో 5 దేశాలు శాశ్వత సభ్య దేశాలు. అవి: అమెరికా , రష్యా , బ్రిటన్ , చైనా మరియు
ఫ్రాన్స్. ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరంలో ఉంది. దీని ప్రస్తుత ప్రధాన కార్యదర్శి
బాన్ కి-మూన్ .

🍒ఐక్యరాజ్య సమితి స్థాపించబడిన
అక్టోబరు 24వ తేదీని ప్రతి సంవత్సరం
ఐక్యరాజ్య సమితి దినోత్సవం గా పాటిస్తారు.
ఐక్య రాజ్య సమితి సభ్య దేశాలను, ఆయా దేశాల ఆధారిత భూభాగాలను (ఐ.రా.స. గుర్తింపు ప్రకారం)చూపే చిత్రపటం. - ఇందులో కలుపనివి : అంటార్కిటికా (అంటార్కిటికా ఒడంబడిక ప్రకారం నియంత్రింపబడుతున్నది), వాటికన్ నగరంలేదా హోలీ సీ (ఐ.రా.స. సాధారణ సభలో అబ్సర్వవర్ హోదా కలిగి ఉన్నది), పాలస్తీనా భూభాగాలు (ఐ.రా.స. అబ్సర్వర్), పశ్చిమ సహారా (మొరాకో , పోలిసారియో ఫ్రంట్ల మధ్య వివాదంలో ఉన్నది), తైవాన్ - (చైనా రిపబ్లిక్ (తైవాన్) అనబడే దీనిని పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలో ఒక భాగంగా ఐ.రా.స. గుర్తిస్తుంది.

🎲సమితి ఆవిర్భావం🎲

🍋రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలోనే 1941 ఆగస్టులో అమెరికా అధ్యక్షుడు థియోడార్ రూజ్వెల్ట్ మరియు బ్రిటిష్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ అట్లాంటిక్ సముద్రంలో ఒక ఓడలో సమావేశమై కుదుర్చుకొన్న ఒప్పందాన్ని అట్లాంటిక్ ఛార్టర్ అంటారు.

🐔 ప్రాదేశిక సమగ్రత కాపాడడం, యుద్ధభయాన్ని తొలగించడం, శాంతిని నెలకొల్పడం, నిరాయుధీకరణ వంటి ఎనిమిది అంశాలు ఈ ఒప్పందంలో ఉన్నాయి. ఈ ఒప్పందమే తరువాత ఐక్య రాజ్య సమితి సిద్ధాంతాలకు మౌలిక సూత్రాలుగా గుర్తింపు పొందినది.

🐠తరువాత 1944లో వాషింగ్టన్ లోని డంబార్టన్ ఓక్స్ వద్ద జరిగిన సమావేశంలో అమెరికా, బ్రిటన్, రష్యా ప్రతినిధులు ఐ.రా.స. ప్రకటన పత్రం ముసాయిదాను తయారు చేశారు. 1945 ఫిబ్రవరిలో
యాల్టా సమావేశంలో అమెరికా , బ్రిటన్ , రష్యా నేతలు ప్రపంచ శాంతి పరిరక్షణ కోసం ఒక అంతర్జాతీయ సంస్థను స్థాపించాలని తీర్మానం చేశారు. శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో 1945
ఏప్రిల్ 25నుండి జూన్ 26 వరకు జరిగిన అంతర్జాతీయ సమావేశంలో 51 దేశాల ప్రతినిధులు పాల్గొని ఐక్య రాజ్య సమితి ఛార్టర్
పై సంతకాలు చేశారు. 1945 అక్టోబర్ 24న
న్యూయార్క్ నగరంలో ఐక్య రాజ్య సమితి లాంఛనంగా ప్రారంభమైంది.

🎯సమితి ఆశయాలు🎯

🌹యుద్ధాలు జరగకుండా చూడటం,

🌹అంతర్జాతీయ తగాదాలను శాంతియుతంగా పరిష్కరించడం,

🌹దేశాల మధ్య స్నేహసంబంధాలను పెంపొందించడం,

🌹అంతర్జాతీయ బాధ్యతలను అన్ని దేశాలు గౌరవించేటట్లు చేయడం,

🌹సాంఘిక అభివృద్ధి సాధించి, మానవ జీవితాలను సుఖమయం చేయడం.

🍅ఐక్యరాజ్య సమితికి 6 ప్రధానాంగాలు ఉన్నాయి🍅

🍋సర్వ ప్రతినిధి సభ

🍋భద్రతా మండలి

🍋సచివాలయం

🍋ధర్మ కర్తృత్వ మండలి

🍋ఆర్థిక, సాంఘిక మండలి

🍋అంతర్జాతీయ న్యాయస్థానం      

నైట్రస్‌ ఆక్సైడు వాయువును నవ్వు పుట్టించే వాయువు అంటారు. దాన్ని పీలిస్తే నిజంగా నవ్వు వస్తుందా?

 ప్రశ్న: నైట్రస్‌ ఆక్సైడు వాయువును నవ్వు పుట్టించే వాయువు అంటారు. దాన్ని పీలిస్తే నిజంగా నవ్వు వస్తుందా?🌴
nitras oxide laughing gas in telugu


జవాబు: నైట్రస్‌ ఆక్సైడు (N2O)వాయువుకి రంగు ఉండదు. పీలిస్తే హాయిగా అనిపిస్తుంది. రుచికి తీయగా ఉంటుంది. నవ్వు పుట్టించే వాయువు (లాఫింగ్‌ గ్యాస్‌) అనే పేరున్నప్పటికీ దీన్ని పీలిస్తే ఎవరికీ నవ్వు రాదు. అయితే దీన్ని పీల్చినప్పుడు మత్తు కలుగుతుంది. అందుకే వైద్యులు రోగులకు శస్త్రచికిత్స చేయడానికి ముందు ఈ వాయువును ఉపయోగించి మత్తు కలిగిస్తారు. ఆందోళన, నొప్పి భావనలతో కాకుండా ఆహ్లాదకరమైన భావనతో మత్తులోకి పోయేలా చేయడం వల్ల దీనికా పేరు వచ్చింది.

అంతేతప్ప దీన్ని పీల్చినవారంతా విరగబడి నవ్వుతారని అనుకోకూడదు.                                         

ప్రశ్న : పెద్ద పెద్ద వృక్షాల వయసు ఎలా కనుగొంటారు?

జవాబు  : పెద్దపెద్ద వృక్షాల కాండాల అడ్డుకోతను పరిశీలించి ఆ వృక్షాల వయసును నిర్ధరిస్తారు. చెట్లు పెరగాలంటే అవి విధిగా నీటిని, లవణాలను భూమినుంచే తీసుకోవాలి. ఇందుకోసం వృక్షం కాండంలో ప్రత్యేకమైన వృక్ష కణజాలం (plant tissue) ఉంది. ఇందులో ప్రధానమైంది జైలం (xylem) కణజాలం. వృక్షాలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా తయారయిన చక్కెరలను ఇతర భాగాలకు సరఫరా చేసే మరో కణజాలం ఉంది. దాని పేరు ఫ్లోయం (floyem) . ఈ జైౖలం, ఫ్లోయం కణజాలాలు చెట్టు బెరడు (bark) కిందనే ఉంటాయి. ప్రతి సంవత్సరం ప్రత్యేక రుతువులో బాగా వర్షాలు పడ్డం వల్ల లవణాల్ని, నీటిని బాగా సరఫరా చేసేందుకు తయారైన ఆహారాన్ని రవాణా చేసేందుకు జైలం, ఫ్లోయంలు బాగా వదులుగా, పెద్దగా ఉండే కణాల సముదాయంగా ఉంటాయి. దీన్నే కేంద్రీయ పొర అంటారు. కానీ వర్షాలు ఆగిపోతే అనుకూల పరిస్థితులు లేకపోవడం వల్ల అవి గట్టిపడతాయి. ఆ తర్వాతి సంవత్సరం మళ్లీ కొత్త కేంద్రీయం పాత గట్టిపడ్డ పొరమీద ఏర్పడతాయి. అంటే ప్రతీ సంవత్సరం ఓ కొత్త వలయంలా కణజాలం వృద్ధి చెందుతుంది. ఇలా వలయాకారంలో ఏర్పడ్డ పాత, కొత్త రింగుల స్వరూపంలో తేడా ఉండడం వల్ల మనం సులభంగా వాటిని గుర్తించగలం. ఇలాంటి వలయాలను వార్షిక వలయాలు లేదా వృద్ధి వలయాలు అంటారు. వృక్షం కాండంలో ఉన్న వార్షిక వలయాల సంఖ్యే దాని వయసు. పడిపోయిన చెట్ల వయస్సును కార్బన్‌ డేటింగ్‌ అనే కేంద్రక భౌతిక సాంకేతిక పద్ధతి (nuclear physical radio method) ద్వారా కనుగొంటారు.                                                



 ప్రశ్న: ఇసుక నుంచి గాజును తయారు చేస్తారని చదివాను. ఎలా చేస్తారు?

జవాబు: గాజు తయారీలో క్వార్ట్జ్‌ ఇసుక, సోడా తగుపాళ్లలో ఒక పెద్ద పాత్రలో ఉంచి ఆ మిశ్రమాన్ని యంత్రాల సాయంతో మెత్తని పొడిగా చేస్తారు. ఈ పొడిని ఒక గాజు బట్టీలో నింపి దాదాపు 1400 డిగ్రీల సెంటిగ్రేడు నుంచి 1600 డిగ్రీల సెంటిగ్రేడు ఉష్ణోగ్రత వరకు వేడి చేస్తారు. ఈ ఉష్ణోగ్రత వల్ల రసాయనిక చర్య జరిగి ఆ మిశ్రమం బుడగలతో కూడిన మెత్తని, జిగురులాంటి పదార్థంగా మారుతుంది. అంటుకుపోయే స్వభావం ఉన్న ఈ పదార్థాన్ని సుమారు 1000 డిగ్రీల సెంటిగ్రేడు వరకు చల్లారుస్తారు. ఈ దశలో మాంగనీస్‌ డై ఆక్సైడ్‌ కలుపుతారు. దీని వల్ల ఆ మిశ్రమంలో ఏమైనా మలినాలు ఉంటే తొలగిపోయి, స్వచ్ఛమైన పారదర్శకత కలిగిన గాజు పదార్థం తయారవుతుంది. ఈ ప్రక్రియలో కొన్ని లోహపు ఆక్సైడులను కలపడం ద్వారా కావలసిన రంగులు వచ్చేలా కూడా చేయవచ్చు. చల్లార్చిన గాజు పదార్థాన్ని అచ్చుల యంత్రాల సాయంతో కావలసిన మందం కలిగిన గాజు పలకలు, దిమ్మలు, కడ్డీల రూపంలోకి మలుస్తారు. ఆ తర్వాత మెరుగు పెట్టడం, చెక్కడం అదనంగా చేస్తారు.   


 "Whats app" చరిత్రలో మొట్టమొదటిసారిగా విద్యార్థులకు ఉపయోగపడే పోస్ట్..!!

(α+в+¢)²= α²+в²+¢²+2(αв+в¢+¢α)
1. (α+в)²= α²+2αв+в²
2. (α+в)²= (α-в)²+4αв b
3. (α-в)²= α²-2αв+в²
4. (α-в)²= f(α+в)²-4αв
5. α² + в²= (α+в)² - 2αв.
6. α² + в²= (α-в)² + 2αв.
7. α²-в² =(α + в)(α - в)
8. 2(α² + в²) = (α+ в)² + (α - в)²
9. 4αв = (α + в)² -(α-в)²
10. αв ={(α+в)/2}²-{(α-в)/2}²
11. (α + в + ¢)² = α² + в² + ¢² + 2(αв + в¢ + ¢α)
12. (α + в)³ = α³ + 3α²в + 3αв² + в³
13. (α + в)³ = α³ + в³ + 3αв(α + в)
14. (α-в)³=α³-3α²в+3αв²-в³
15. α³ + в³ = (α + в) (α² -αв + в²)
16. α³ + в³ = (α+ в)³ -3αв(α+ в)
17. α³ -в³ = (α -в) (α² + αв + в²)
18. α³ -в³ = (α-в)³ + 3αв(α-в)
ѕιη0° =0
ѕιη30° = 1/2
ѕιη45° = 1/√2
ѕιη60° = √3/2
ѕιη90° = 1
¢σѕ ιѕ σρρσѕιтє σƒ ѕιη
тαη0° = 0
тαη30° = 1/√3
тαη45° = 1
тαη60° = √3
тαη90° = ∞
¢σт ιѕ σρρσѕιтє σƒ тαη
ѕє¢0° = 1
ѕє¢30° = 2/√3
ѕє¢45° = √2
ѕє¢60° = 2
ѕє¢90° = ∞
¢σѕє¢ ιѕ σρρσѕιтє σƒ ѕє¢
2ѕιηα¢σѕв=ѕιη(α+в)+ѕιη(α-в)
2¢σѕαѕιηв=ѕιη(α+в)-ѕιη(α-в)
2¢σѕα¢σѕв=¢σѕ(α+в)+¢σѕ(α-в)
2ѕιηαѕιηв=¢σѕ(α-в)-¢σѕ(α+в)
ѕιη(α+в)=ѕιηα ¢σѕв+ ¢σѕα ѕιηв.
» ¢σѕ(α+в)=¢σѕα ¢σѕв - ѕιηα ѕιηв.
» ѕιη(α-в)=ѕιηα¢σѕв-¢σѕαѕιηв.
» ¢σѕ(α-в)=¢σѕα¢σѕв+ѕιηαѕιηв.
» тαη(α+в)= (тαηα + тαηв)/ (1−тαηαтαηв)
» тαη(α−в)= (тαηα − тαηв) / (1+ тαηαтαηв)
» ¢σт(α+в)= (¢σтα¢σтв −1) / (¢σтα + ¢σтв)
» ¢σт(α−в)= (¢σтα¢σтв + 1) / (¢σтв− ¢σтα)
» ѕιη(α+в)=ѕιηα ¢σѕв+ ¢σѕα ѕιηв.
» ¢σѕ(α+в)=¢σѕα ¢σѕв +ѕιηα ѕιηв.
» ѕιη(α-в)=ѕιηα¢σѕв-¢σѕαѕιηв.
» ¢σѕ(α-в)=¢σѕα¢σѕв+ѕιηαѕιηв.
» тαη(α+в)= (тαηα + тαηв)/ (1−тαηαтαηв)
» тαη(α−в)= (тαηα − тαηв) / (1+ тαηαтαηв)
» ¢σт(α+в)= (¢σтα¢σтв −1) / (¢σтα + ¢σтв)
» ¢σт(α−в)= (¢σтα¢σтв + 1) / (¢σтв− ¢σтα)
α/ѕιηα = в/ѕιηв = ¢/ѕιη¢ = 2я
» α = в ¢σѕ¢ + ¢ ¢σѕв
» в = α ¢σѕ¢ + ¢ ¢σѕα
» ¢ = α ¢σѕв + в ¢σѕα
» ¢σѕα = (в² + ¢²− α²) / 2в¢
» ¢σѕв = (¢² + α²− в²) / 2¢α
» ¢σѕ¢ = (α² + в²− ¢²) / 2¢α
» Δ = αв¢/4я
» ѕιηΘ = 0 тнєη,Θ = ηΠ
» ѕιηΘ = 1 тнєη,Θ = (4η + 1)Π/2
» ѕιηΘ =−1 тнєη,Θ = (4η− 1)Π/2
» ѕιηΘ = ѕιηα тнєη,Θ = ηΠ (−1)^ηα

1. ѕιη2α = 2ѕιηα¢σѕα
2. ¢σѕ2α = ¢σѕ²α − ѕιη²α
3. ¢σѕ2α = 2¢σѕ²α − 1
4. ¢σѕ2α = 1 − ѕιη²α
5. 2ѕιη²α = 1 − ¢σѕ2α
6. 1 + ѕιη2α = (ѕιηα + ¢σѕα)²
7. 1 − ѕιη2α = (ѕιηα − ¢σѕα)²
8. тαη2α = 2тαηα / (1 − тαη²α)
9. ѕιη2α = 2тαηα / (1 + тαη²α)
10. ¢σѕ2α = (1 − тαη²α) / (1 + тαη²α)
11. 4ѕιη³α = 3ѕιηα − ѕιη3α
12. 4¢σѕ³α = 3¢σѕα + ¢σѕ3α
🍄🍄🍄🍄🍄
» ѕιη²Θ+¢σѕ²Θ=1
» ѕє¢²Θ-тαη²Θ=1
» ¢σѕє¢²Θ-¢σт²Θ=1
» ѕιηΘ=1/¢σѕє¢Θ
» ¢σѕє¢Θ=1/ѕιηΘ
» ¢σѕΘ=1/ѕє¢Θ
» ѕє¢Θ=1/¢σѕΘ
» тαηΘ=1/¢σтΘ
» ¢σтΘ=1/тαηΘ
» тαηΘ=ѕιηΘ/¢σѕΘ

"భేష్"..
👇👇👇👇
9th,10th,11th,12th వరకు గణితంలో అన్ని ఫార్ములాలు ఉన్నాయి...
దయచేసి అందరి పిల్లల పేరెంట్స్ కి share చేయండి...

ఇంకా చాలా ఉపయోగకరమైన విషయాలు క్రింద పొందుపరచబడినవి..

Motivate Ur Self.

motivate

Motivate Ur Self.


కుదిరితే పరిగెత్తు.. ,
లేకపోతే నడువు...
అదీ చేతకాకపోతే...
పాకుతూ పో.... ,
       అంతేకానీ ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు...

ఉద్యోగం రాలేదని,
 వ్యాపారం దెబ్బతినిందని,
 స్నేహితుడొకడు మోసం చేశాడని,
ప్రేమించినవాళ్ళు వదిలి వెళ్ళి పోయారని...
      అలాగే ఉండిపోతే ఎలా?

 దేహానికి తప్ప,
 దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే...   

తలుచుకుంటే...
నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా...
నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది,
 అలాంటిది ఇప్పుడొచ్చిన ఆ కాస్త కష్టానికే తలొంచేస్తే ఎలా?

సృష్టిలో చలనం ఉన్నది ఏదీ ఆగిపోకూడదు...,
పారే నది..,
వీచే గాలి...,
 ఊగే చెట్టు...,
ఉదయించే సూర్యుడు....
 అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా ప్రవహిస్తుందే ఆ నెత్తురుతో సహా....,,
ఏదీ ఏది ఆగిపోడానికి వీల్లేదు..,

లే...
బయలుదేరు...
నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక భాదల సంకెళ్ళను తెంచేసుకో... ,
పడ్డ చోటు నుండే పరుగు మొదలుపెట్టు...

నువ్వు పడుకునే పరుపు...
నిన్ను చీదరించుకోకముందే బద్దకాన్ని వదిలేయ్... ,

నీ అద్దం....
నిన్ను ప్రశ్నించకముందే సమాదానం వెతుక్కో... ,

నీ నీడ నిన్ను వదిలేయకముందే వెలుగులోకి వచ్చేయ్..,

 మళ్ళీ చెప్తున్నా...
కన్నీళ్ళు కారిస్తే కాదు...,
చెమట చుక్కని చిందిస్తేనే చరిత్రను రాయగలవని తెలుసుకో..

*చదివితే ఇవి పదాలు మాత్రమే,
 ఆచరిస్తే...
 అస్త్రాలు.

Wednesday, October 19, 2016

Devulapalli Krishna Sastry

Devulapalli Krishna Sastry

మనసున మల్లెల మాలలూగెనే అంటూ మధుర రాత్రులకు కొత్త అర్థాలు చెప్పినా…ఏడ తానున్నాడో బావ అంటూ విరహ వేదనలోని వివిధ కోణాలు మనకు రుచి చూపించినా…కుశలమా నీకూ కుశలమేనా అంటూ ఆలూ మగల మధ్యన ఉండాల్సిన అనురాగం గురించి కాబోయే దంపతులకు ప్రేమతో చెప్పినా…తొందరపడి ఒక కోయిల చేత కాస్తంత ముందే కూయించినా…
అది ఒక్క దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికే చెల్లింది..
సడి సేయకో గాలి సడి సేయ బోకే బడలి వొడిలో రాజు పవళిoచేనే అంటూ ప్రకృతి కాంతకు ప్రణమిల్లినా.. పగలయితే దొరవేరా…రాతిరి నా రాజువిరా అంటూ రసరమ్యమైన పదాలతో రంజింప చేసినా…పాలిచ్చే గోవులకూ పసుపూ కుంకం,పనిచేసే బసవడికీ పత్రీ పుష్పం సమర్పించి తెలుగు వారి లోగిళ్ళలో అక్షరాలతో అందాల సంక్రాంతి ముగ్గులు దిద్దించినా..
అది ఒక్క దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికే చెల్లింది..
మందారంలా పూస్తే మంచిమొగుదొస్తాడని…గన్నేరంలా పూస్తే కలవాదొస్తాదని…సింధూరంలా పూస్తే చిట్టీ చేయంతా…అందాల చందమామ అతడే దిగి వొస్తాడంటూ పెళ్ళికాని తెలుగమ్మాయిల కలలకు గోరింటాకు సొగసులద్దినా…గోరింకా పెళ్లై పోతే ఏ వంకో వెళ్ళీపోతే గూడంతా గుబులై పోదా గుండెల్లో దిగులై పోదా అంటూ భగ్న ప్రేమికుల గుండెల్లో గుబులును నింపి వారి మనసుల్ని దిగులులో ముంచెత్తినా…
అసలు ఏం చేసినా ఏం రాసినా అది ఒక్క దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికే చెల్లింది…ఇంకా చెప్పాలంటే అసలు తెలుగు భాషని గానీ తెలుగు వారిని కాని ఏమన్నా చేసుకునే హక్కు ఆయనకా పరమేశ్వరుదే ఇచ్చాదేమో. .
“జయ జయ జయ ప్రియభారత జనయిత్రీ దివ్య ధాత్రి” అంటూ తన అపారమైన దేశభక్తితో ఏకంగా భరత మాతనే పరవశింప చేసిన ఈ ధన్యజీవి తదనంతరం మన తెలుగు వారందరి కేర్ అఫ్ అడ్రెస్స్ గా మారారు…
మరి అంతటి కృష్ణ శాస్త్రి గారు తెలీని తెలుగు వారు ఎవరన్నా వున్నారంటే అది శాస్త్రి గారికి కాదు వారి సాటి తెలుగు వార మైన మనకే ఎంతో అవమానం…ఎన్నిసార్లు విన్నాఎన్ని తరాల తర్వాత విన్నాఇప్పటికీ ఎంతో కొత్తగా అనిపించే ఎన్నోఆణిముత్యాలను మన తెలుగు వారికందించిన ధన్య చరితులు శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు..
అటువంటి పరమ పుణ్యాత్ములైన శాస్త్రిగారు అదేమీ శాపమో గానీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎనలేని విషాదాన్ని చవి చూసారు..
“నావలోతానుండి మము నట్టేట నడిపే రామచరణం…త్రోవలో కారడవిలో తోత్తోడ నడిపే రామచరణం… నావ అయితే రామచరణం…త్రోవ అయితే రామచరణం…మాకు చాలును వికుంట మందిర తోరణం శ్రీరామ చరణం..”
అంటూ మనకు తత్వ బోధన చేసిన కృష్ణ శాస్త్రి గారు కాన్సర్ తో తన మాట్లాడే శక్తిని పూర్తిగా కోల్పోయినా పెద్దగా బాధ పడలేదు గానీ తన కంటి వెలుగైన తన ముద్దుల గారాల పట్టి సీత అకాల మరణాన్నిమాత్రం జీర్ణించుకోలేక పొయారు…
కూతురిని కోల్పోయిన బాధ కృష్ణ శాస్త్రి గారిని మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా బాగా కుంగ తీసిందనే చెప్పాలి…అదే సమయంలో ఆర్థిక సమస్యలు కూడా వారిని చుట్టు ముట్టి మరింత ఉక్కిరి బిక్కిరి చేసాయి…
“..ఈ గంగాకెంత గుబులు…ఈ గాలికెంత దిగులు.. ” అంటూ ప్రకృతిలోని ఎన్నిటి గురించో దిగులు పడ్డ శాస్త్రి గారు తన వ్యక్తిగత జీవితంలో మాత్రం చెప్పు కోలేని బాధలనుభవించారు…
సరిగ్గా ఆ సమయంలోనే మరపురాని ఓ చిన్న సంఘటన ఆ రోజుల్లో జరిగింది..
చిన్నదే అయినా ఆ తరవాతి కాలంలో ఈ మహత్తర సంఘటన వలన మనం కొన్ని మధురమైన పాటల్ని వినగాలిగాం…తెలుగు చిత్ర పరిశ్రమలో బహుశా కొద్ది మందికి మాత్రమె తెలిసిన ఈ సంఘటన 1974-75 ప్రాంతంలో మదరాసు మహాపట్టణం లోని ప్రముఖ సంభాషణల రచయిత గొల్లపూడి మారుతీ రావు గారింట్లో జరిగింది..
మద్రాసు కేంద్రంగా తెలుగు చిత్ర పరిశ్రమ మూడు పువ్వులూ ఆరు కాయలుగా కళ కళ లాడుతుందే రొజులవి…చిత్ర పరిస్రమకు సంబందించిన చిన్నాపెద్దా అందరూ అప్పట్లో మద్రాసులోనే వుండేవారు..
గొల్లపూడి మారుతీ రావు గారు కూడా మద్రాసులోనే వుండేవారు..
ఈ మహత్తరమైన సంఘటన జరిగిన రోజున పొద్దున్న పూట ఎప్పట్లాగే తన పనులు ముగించుకొని ఉదయం 8.30 గంటల సమయంలోమారుతీరావు గారు బయటి కెళ్ళటానికి సిద్దమవుతుండగా ఒక ఫియట్ కారొచ్చి ఆయన ఇంటి ముందాగింది ..
“.. పొద్దున్నేఎవరో మహానుభావులు..” అనుకుంటూ మారుతి రావు గారు కొద్దిగా ఆశ్చర్యంగా చూస్తూ నిలబడి పోయారు..
ఆయన్ని మరింత ఆశ్చర్యానికి గురి చేస్తూ కారు లోంచి మహా కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు కిందకి దిగారు..అంతటి మహనీయులు తన ఇంటికొచ్చారనే ఆనందంతో కాసేపు ఉబ్బితబ్బిబ్బయినా వెంటనే తేరుకొని మారుతీ రావు గారు శాస్త్రి గారికి ఎదురెళ్లి సాదరంగా వారిని ఇంట్లోకి ఆహ్వానించారు..
కాఫీ ఫలహారాలు అవీ పూర్తయిం తరువాత శాస్త్రిగారు తన కేదో విషయం చెప్పాలనుకొని కూడా చెప్పటానికి సంశయిస్తున్నారని అర్థం అయ్యింది మారుతీ రావు గారికి..
మెల్లిగా తను కూర్చున్న కుర్చీ లోంచి లేచి.. శాస్త్రి గారికి దగ్గరగా వచ్చి.. ముందు కొంగి..ఆయన మోకాళ్ళ మీద చేతులేసి.. ఆయన మొహంలోకి చూస్తూ…లోగొంతుకలో ఎంతో ఆప్యాయంగా అడిగారు మారుతీ రావు గారు..
“మాస్టారూ మీరు నాతో ఏదో చెప్పాలనుకొని కూడా చెప్పలేక పోతున్నారు..నా దగ్గర కూడా సంశయిస్తె ఎట్లా చెప్పండి.. అంత మరీ పరాయి వాడినయి పోయానంటారా …”
తానెంతో ఆరాధించే తన గురువు గారు తన ముందు గూడా మొహమాట పడుతున్నారన్నఅక్కసుతో కావాలనే కాస్త నిష్టూరాలాడుతూ మాట్లాడారు మారుతీరావు గారు..
అప్పుడు జరిగిందండీ ఆ సంఘటన..
ఎంతటి వాడి చేత నైనా కంట తడి పెట్టించే ఒక విషాదకరమైన ఘటన…
మీరే చదవండి .తెలుస్తుంది .
శాస్త్రిగారికి ఆ రోజుల్లో స్వర పేటికకి కాన్సర్ సోకటం వలన గొంతు పూర్తిగా మూగ బోయింది…అందుకని ఆయన ఎక్కడికెళ్ళినా ఒక పలకా బలపం చేతిలో పట్టుకొని వెళ్ళేవారు…ఎవరికేం చెప్పదలుచుకున్నా ఆ పలక మీదనే రాసి చూపించేవారు…
మారుతీ రావు గారు తన దగ్గరికొచ్చిఅలా అడగంగానే శాస్త్రి గారు ముందుగా ఒక పేలవ మయిన జీవం లేని నవ్వు నవ్వారు…
ఆ తరువాత తల వొంచుకొని పలక మీద చిన్నచిన్న అక్షరాలతో దాదాపు ఓ రెండు నిమిషాలపాటు చాలా పొందికగా ఏదో రాస్తూ ఉండిపోయారు…ఆ తరువాత అదేంటో చదవమని పలక మారుతీ రావు గారి చేతి కిచ్చారు…
అందులో ఏముందో చదవటానికి మారుతీ రావు గారికి ముందొక పావు నిమిషం పట్టింది…ఆ తరువాత అందులోని విషయాన్నిసంగ్రహించి జీర్ణించు కోవటానికింకో అర నిమిషం పట్టింది…ఆ పైన లోపలి నుండి తన్నుకుంటూ వొస్తున్న దుంఖాన్ని ఆపుకోవటానికి మరో నిమిషం పట్టింది…
“.. నాకుషస్సులు లేవు..ఉగాదులు లేవు.. ” అంటూ తెలుగు సాహితీ లోకాన్నిఉర్రూతలూగించిన ఈ మహా మనీషి జీవితంలోంచి నిజంగానే ఉషస్సులూ  ఉగాదులూ  వెళ్లిపోయాయా అనుకుంటూ కాసేపలా మౌనంగా ఉండిపోయారు మారుతీ రావు గారు…
ఏం సమాధానం చెప్పాలో వెంటనే అర్థం కాలేదు…అసలు అట్లాంటి విపత్కర పరిస్థితి ఒకటి తన జీవితంలో వొస్తుందని కూడా ఆయన ఏనాడు ఊహించలేదు…అయినా వెంటనే తనను తాను తమాయించుకొని తలఎత్తి శాస్త్రిగారే వేపు కాసేపలా చూస్తూ ఉండి పోయారు..
“..పెరిగి విరిగితి విరిగి పెరిగితి…కష్ట సుఖముల సార మెరిగితి…పండుచున్నవి ఆశ లెన్నొ…ఎండి రాలగ పోగిలితిన్…” అన్నంత దీనంగా వుంది అప్పటి కృష్ణ శాస్త్రి గారి ముఖస్థితి..
ఎప్పుడూ తళతళ లాడే జరీ అంచు వున్నపట్టు పంచెలొ కనపడే శాస్త్రి గారు ఆ సమయంలో కేవలం ఒక మామూలు ముతక పంచెలో కనపడ్డారు…చాలా బేలగా మారుతీరావు గారి వేపు చూస్తున్నారు…
దుంఖాన్ని దిగమింగుకొని మారుతీరావు గారు మళ్ళీ పలక వేపు చూసారు…
“మారుతీ రావూ…నా పరిస్థితులేమి బాగా లేవయ్యా…చాలా ఇబ్బందుల్లో వున్నాను…ఓ ఇరవై వేలు అర్జెంటుగా కావాలి…అందుకని నా కారు అమ్మేద్దామనుకుంటున్నాను…నీ ఎరకలో ఎవరన్నా స్తితిమంతులుంటే చెప్పు…అమ్మేద్దాం…నాకు తెలుసు నువ్వు చాలా బిజీగా ఉంటావని…కానీ తప్పలేదు.. అందుకే పొద్దున్నే వచ్చినిన్ను ఇబ్బంది పెట్టాల్సోచ్చింది…నా కోసం ఈ పని చేసి పెట్టవయ్యా మారుతీ రావు…గొప్పసాయం చేసిన వాదివవుతావ్…”
తన కనురెప్పలు వాలిస్తే ఎక్కడ తన కంట్లో నీళ్ళు జారిపది మాస్టారిని మరింత బాధ పెడతాయో అని తనను తాను సంభాళించుకుంటూ మారుతీ రావు గారు శాస్త్రి గారి మొహంలోకి కాసేపలా తదేకంగా చూస్తూ ఉండిపోయారు..
ఆ తరువాత మెల్లిగా లేచి వెళ్ళి శాస్త్రిగారి కాళ్ళ దగ్గర కూర్చొని
“..మాస్టారు…మీ పరిస్థితి నాకర్ధమయ్యిందండీ..కాని కారు గూడా లేకుండా ఈ మహ పట్టణం లో ఏమవస్థలు పడతారు చెప్పండి…మీరు  అన్యధా భావించనంటే ఒక్క మాట…చెప్పమంటారా..” అంటూ ఆయన మొహంలోకి చూస్తూ ఆయన అనుమతి కోసమన్నట్టుగా ఆగారు మారుతీరావు గారు…
అదే పేలవమయిన నవ్వుతో చెప్పూ అన్నట్టుగా తలాదించారు శాస్త్రిగారు…
“..ఆ ఇరవై వేలు నేను సర్దుబాటు చేస్తాను…ఆహా…అప్పుగానే లెండి…మీకు వీలు చిక్కినపుడు ఇద్దురు గాని…నాకేమంత తొందరా లేదు అవసరమూ లేదు…దయచేసి నా మాట కాదనకండి …”
వెంటనే తల వొంచుకొని శాస్త్రిగారు మళ్ళీ పలక మీద ఏదో రాసి మారుతీరావు గారికి చూపించారు…
“..నా వల్ల నువ్వు ఇబ్బంది పడటం నాకిష్టం లేదయ్యా..”.. ఇదీ శాస్త్రిగారు రాసింది..
“….అయ్యా నాకేమి ఇబ్బంది లేదండి…తండ్రి లాంటి వారు మీరు ఇబ్బందుల్లో వుంటే చూస్తూ వూరుకోమంటారా చెప్పండి…అయినా దేవుడి దయ వలన నా పరిస్థితి బానే వుంది లెండి…ఇంక మీరు దయ చేసి నా మాట కాదనకండి…”
దానికి శాస్త్రిగారు ముందు కాస్త పేలవంగా నవ్వినా ఆ తరువాత కష్టాల నెన్నిటినో కడుపులో దాచుకొని తన పిల్లల కోసం ఒక నాన్న నవ్వే ప్రేమ పూరితమైన చిరు నవ్వు నవ్వారు.. దాన్నే అంగీకార సూచకంగా భావించి మారుతీరావు గారన్నారు..
“..మాస్టారూ..ప్రస్తుతానికి అంత డబ్బు ఇంట్లో లేదు…బ్యాంకు నుండి తీసుకురావాలి..సాయంత్రం కల్లా తెప్పించి పెడతాను…పర్వాలేదు కదా…”
“.. ఏమీ పర్వాలేదు ” అన్నట్టుగా తలూపారు శాస్త్రిగారు…
ఆ తర్వాత ఇంక బయలుదేరుతాను అన్నట్టుగా లేచి నిలబడ్డారు..
వారిని సాగనంపటం కోసం గేటు దాకా వచ్చి కార్ డోర్ తీసి నిలబడ్డారు మారుతీరావు గారు…
కారెక్కుతుండగా ఆగి మళ్ళీ తన చేతిలో పలక మీద ఏదో రాసి మారుతీరావు గారికి చూపించారు శాస్త్రిగారు…
“..డబ్బులు తీసుకోవటానికి సాయంత్రం నన్ను ఎన్నింటికి రమ్మంటావ్..”..ఇదీ దాని సారాంశం…
గుండె  పగిలినట్టుగా అనిపించింది మారుతీ రావు గారికి….కొద్దిగా నొచ్చుకున్నట్టుగా అన్నారు..
“..అయ్యా డబ్బులు తీసుకోవటం కోసం మిమ్మల్నిమళ్ళీ మా ఇంటికి రప్పించి పాపం మూట గట్టు కోమంటారా చెప్పండి …మీకా శ్రమ అక్కర్లేదు లెండి…. సాయంత్రం నేనే డబ్బు తీసుకొని మీ ఇంటికి వస్తాను… సరేనా “
“..సరే…అట్లాగే  రావయ్యా …వచ్చి భోంచేసి వెళ్ళదు గాని…'” అని మళ్ళీ పలక మీద రాసి మారుతీరావు గారికి చూపించి కారేక్కారు శాస్త్రిగారు..
వారి సంస్కారానికి ఓ నమస్కారం చేసి వారిని సాగ నంపారు మారుతీ రావు గారు…
అన్నట్టుగానే ఆ సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో డబ్బు తీసుకుని శాస్త్రి గారింటికి వెళ్ళారు మారుతీ రావు గారు…
వారికి డబ్బులందించి భోజనాలు చేసి బయలు దేరే ముందు శాస్త్రి గారితో అన్నారు మారుతీ రావు గారు…
“..మాస్టారు…మరీ చనువు తీసుకుంటున్నాననునుకోకపోతే ఓ మాట అడగచ్చంటారా..”
అడుగు అన్నట్టుగా తలూపారు శాస్త్రిగారు..
“..వీలయితే మళ్ళీ పాటలు రాస్తారా….నవతా వాళ్ళేదో కొత్త సినిమా తీస్తున్నారుట…దాంట్లో ఏదో తెలుగు భాషకు సంబంధించి ఒక పాట పెడదా మనుకుంటున్నారట..మిమ్మల్ని అడిగే ధైర్యం లేక నన్నడిగారు.. కనుక్కొని చెబుతానన్నాను…మళ్ళీ పాటలు రాయకూడదూ..మీకూ కాస్త వ్యాపకంగా వుంటుందీ..ఏదో వేన్నీళ్ళకు చన్నీళ్ళ మాదిరి నాలుగు రాళ్ళూ వస్తాయి…ఏం చెప్పమంటారు…”
“..సరే కానీవయ్యా.. నీ మాటెందుకు కాదనాలి..”..పలక మీద రాసి చూపించారు శాస్త్రిగారు…
ఆ తర్వాత కొన్నాళ్ళకు నవతా వారి సినిమా సాంగ్ రికార్డింగ్ A V M స్టూడియో లో ప్రారంభ మయ్యింది….
ఆ రోజక్కడ రికార్డింగ్ లో సంగీత దర్శకులు జి కే వెంకటేష్ గారు,కృష్ణశాస్త్రి గారూ,ప్రముఖ గాయని సుశీల వంటి మరి కొంతమంది ప్రముఖులు కూడా  వున్నారు…అందరూ కూడా శాస్త్రిగారు రావటంతో చాల సంతోషంగా వున్నారు..
ముందుగా శాస్త్రిగారి పాటతో రికార్డింగ్ మొదలయ్యింది..
మధ్యలో శాస్త్రి గారు రాసిన చరణంలో ఎక్కడో ఒక చిన్న డౌట్ వచ్చి జి కే వెంకటేష్ గారు శాస్త్రి గారి దగ్గర కొచ్చి ఏదో చెవిటి వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగా చాలా పెద్ద గొంతుతో అడిగారు
“…అయ్యా  మీరిక్కదేదో రాసారు గాని మీటర్ ప్రాబ్లం వచ్చేలా ఉంది…ఈ పద మేమన్నా కొంచెం మార్చ గల రేమో చూస్తారా  ” అని…
దానికి సమాధానంగా శాస్త్రిగారు తన పలక మీద ఇలా రాసారు..
“.. దానికేం భాగ్యం..తప్పకుండా మారుస్తాను.. కానీ  ఒక చిన్న విషయం…నేను మాట్లాడలేను గాని నా చెవులు బాగానే పని చేస్తున్నాయి…గమనించ గలరని మనవి “..
అది చదివి జి కే వెంకటేష్ గారితో సహా అక్కడున్న పెద్దలందరూ శాస్త్రి గారి సెన్స్ అఫ్ హ్యుమర్ కి హాయిగా నవ్వేశారు…
ఆ తర్వాత శాస్త్రిగారి పాటతో సహా ఆ సినిమాలోని అన్ని పాటల రికార్డింగ్ పూర్తయిపోయాయి..సినిమా కూడా షూటింగ్ ముగించుకొని విడుదలై పెద్ద హిట్ అయ్యింది..
ఆ సినిమా కోసం శాస్త్రిగారు రాసిన పాట ఇప్పటికీ మన తెలుగు రాష్ట్రంలో ఏదో మూల వినపడుతూనే ఉంది ..
ఆ పాటే…
అమెరికా అమ్మాయి లోని “…పాడనా తెలుగు పాట…పరవశమై మీ ఎదుట మీ పాట..”
ఉపసంహారం
ఆ తర్వాత కృష్ణశాస్త్రి గారు మరికొన్ని మంచి పాటలు మనకందించారు…వాటిల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి…
“..ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం..”,(కార్తీక దీపం) “.. గొరింటా పూసింది కొమ్మా లేకుండా…”,(గోరింటాకు) “..ఈ గంగకెంత దిగులు…ఈ గాలి కెంత గుబులు..”,(శ్రీరామ పట్టాభిషేకం) “..ఆకులో ఆకునై పూవు లో పూవునై..” (మేఘసందేశం) మొదలైనవి…ఆ తరువాత వయోభారం వలన శాస్త్రిగారు పాటలు రాయటం పూర్తిగా తగ్గించేసారు..
“..నారాయణ నారాయణ అల్లా అల్లా…నారాయణ మూర్తి నీ పిల్లల మేమెల్లా..” అంటూ పరబ్రహ్మ ఒక్కడే అని ఎంతో సున్నితంగా లోకానికి చాటి చెప్పిన విశ్వకవి శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు తన కవితామృతం తో తెలుగు శ్రోతల్నిఅమరుల్నిచేసినా తాను  మాత్రం నింపాదిగా మనదరినీ వదిలేసి “..నీ పదములే చాలూ…  రామా…నీ పద ధూళియే పదివేలూ ..” అంటూ ఫిబ్రవరి 24,1980 నాడు తన శ్రీరాముడి పాద ధూళిని వెతుక్కుంటూ వేరే లోకాల వేపు సాగిపోయారు..
ముక్తాయింపు
“…అంత లజ్జా విషాద దురంత భార…సహనమున కోర్వలేని ఈ పాడు బ్రతుకు…మూగవోయిన నా గళమ్మునను గూడ…నిదుర వోయిన సెలయేటి రొదలు గలవు…ఇక నేమాయె…” --కృష్ణపక్షం    

తల్లి కడుపున పుట్టిన వారు చదవండి.

తల్లి కడుపున పుట్టిన వారు చదవండి.

సుధాకర్ ఆఫీసులో UDC గా పని చేస్తున్నాడు,మనిషి మంచివాడే కానీ పూర్తిగా భార్యా విధేయుడని మిగతా స్టాఫంతా చెవులు కోరుక్కుంటుటారు   ,
సుధాకర్ ఆరోజు ఎందుకో చాలా చిరాకుగా ఉన్నాడు
ఆఫీసు ప్యూన్ వచ్చి మిమ్మల్ని బాస్ పిలుస్తున్నారు వెళ్ళమని చెప్పేసరికి ఆ చిరాకు ఇంకా నషాళానికంటింది,
ఆ(..ఏంటట ?వెళ్తాలే అన్నాడు మరింత చిరాకుగా..ఈయన గారి వాలకం చూసిన ప్యూను నాకెందుకులే అని వెళ్ళిపోయాడు,
వెళ్ళకపోతే బావుండదు,
పైగా బాస్,
ఆవులిస్తే పేగులు లెక్కపెట్టే రకం,
పైకి ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు కానీ ఆ కళ్ళే చెపుతాయి ఆయన పట్టుదలను, అందుకే ఆయన కళ్ళు చూస్తే అబద్దం చెప్పలేం బాబోయ్ అంటుంటారు స్టాఫంతా.
అలాగని చెడ్డవాడూ కాదు,
మెున్న ప్యూను కూతురుకి మంచి మార్కులు వస్తే పై చదువులకు డబ్బు లేకపోతే తనే స్వయంగా వెళ్ళి ఆ అమ్మాయిని కాలేజి లో చేర్పించాడు,స్టాఫ్ లో అందరూ ఓకరికి తెలియకుండా ఓకరు ఆయన సాయం పోందిన వారే..
అందుకే ఆయనంటే భయంతో కూడిన అభిమానం అందరికీ..
ఎట్టకేల కి బాస్ రూం లోకి అడుగుపెట్టి విష్ చేసాడు సుధాకర్..
బాస్ సుధాకర్ వైపు చూడకుండానే ఫైలు చూసుకుంటూ
ఏమయ్యా సుధాకర్? ఏంటి ఇవాళ చిరాగ్గా ఉన్నావ్,ఎనీ ప్రాబ్లెం ?అన్నాడు
సుధాకర్ కు చిరాకంతా ఎగిరిపోయింది,చిరాకు స్ధానం లో కన్ఫ్యూషన్ చోటు చేసుకుంది,నేను చిరాగ్గా ఉన్నట్టు మీరెలా కనుక్కున్నారు సర్ ?అని మనసులో మాట బయటకు అనేసి నాలుక్కరచుకున్నాడు..
బాస్ నవ్వుతూ..నీవు ఎప్పుడూ అంత విసురుగా నా కేబిన్ డోరు తీయలేదు అందుకే అడిగాను ఎనీ ప్రాబ్లం ?
అవును సర్..మా అమ్మ నే ప్రాబ్లం సర్ !
మీ అమ్మ ప్రాబ్లమా ? ఆశ్చర్యపోయాడు బాస్.
ఇఫ్ యు డోంట్ మైన్,
నీ పర్సనల్ విషయం లో తల దూర్చరాదు,
కానీ మీ అమ్మ ఎలా ప్రాబ్లమో చెప్పగలవా? ముందు కూర్చో...అన్నారు
కూర్చోగానే ధైర్యం వచ్చేసింది సుధాకర్ కు,ఇక చెప్పసాగాడు తన తల్లి గురించి,
చాలా ప్రాబ్లం గా ఉంది సర్ మా అమ్మతో
రాత్రుల్లు దగ్గుతూ నిద్ర లేకుండా చేస్తుంది, మేం చేసిన వంట ఆమెకు రుచించదు, బాత్రూం అంతా గలీజు చేస్తుంది, ఓక్కోసారి బట్టల్లోనే ఓంటికి, రెంటికి కూడా చేసుకుంటుంది సర్, భరించలేకున్నాం సర్ కంపుతో, నాభార్య తో మా అమ్మ గురించి రోజూ గోడవనే సర్, చివరకు నా భార్య పోరు పడలేక మూడురోజుల క్రితం వ్రుధ్ధాశ్రమం లో వదిలేసి వచ్చా సర్, వదిలేసి వచ్చినప్పటినుండి ఈరోజు వరకు భోజనం చేయటం లేదట, వ్రుధ్ధాశ్రమం వారు గంట, గంటకు ఫోన్ చేసి మీ అమ్మను తీసికెళ్ళమని ఫోన్ లతో చంపేస్తున్నారు సర్, ఏదో ఇంత ముద్ద తిని చావచ్చు గదా, మా ప్రాణాలు తీయకుంటే..అందుకే ఈ చిరాకు సర్.. క్షమించండి సర్. అన్నాడు
అంతా విన్న బాస్ గట్టిగా నిట్టూర్పు వదలి నిజమే సుధాకర్, ఈ తల్లిదండ్రులు కడదాక మనతోనే ఉండాలనుకుంటారు, కానీ ఇది వారనుకున్నట్టు సత్తెకాలం కాదు కదా, పరిస్థితి బట్టి వారూ మారాలి, ఎనీ హౌ చాలా సఫర్ అవుతున్నావు సుధాకర్, ఈ చిరాకు పని మీద చూపించకు.. ఓకే..
అబ్బే లేదు సర్...
సరే, నీకు పర్శనల్ గా చెపుతున్నాను, నీమీద నమ్మకంతో.. ఈ రెడ్ కలర్ ఫైలు చాలా కాన్ఫిడెన్షియల్.. నాకు ఆఫీసులో నమ్మకం లేదు, అందుకే నీ దగ్గర ఉంచుతున్నాను, నేను ఎప్పుడు అడిగితే అప్పుడు చూపాలి, ఆఫీసులో ఎట్టి పరిస్థితి లో పెట్టరాదు, ఎప్పుడూ నీ వెంటే ఉంచుకోవాలి, ఈ పని నీవు చెయ్యగలవా?
నామీద మీరంత నమ్మకం పట్టుకున్నాక ఈ పని నేను చెయ్యలేక పోవడం ఏంటి సర్? చేస్తాను, అని ఫైలు తీసుకుని బయట పడ్డాడు,
ఆరోజు నుండి మెుదలైంది తలనోప్పి సుధాకర్ కు, బాస్ చీటికి, మాటికి ఆఖరుకు రాత్రిపూట కూడా ఫోన్ చేసి మరీ ఫైలు చెక్ చేసుకునే వాడు, తిరగలేక ,మెుయ్యలేక చివరకు ఫైలు చూస్తేనే దడ పుడుతుంది సుధాకర్ కు,
ఓరోజు బాస్ సుధాకర్ తో మనిద్దరం బెంగుళూరు కు వెళుతున్నాం, ఫైలు తో రెడీగా ఉండు, నీ లగేజ్ సర్జుకుని రమ్మన్నాడు, ఇంతమంది స్టాఫ్ లో నన్నోకరినే తీసుకెళుతుంటే లోలోపల గర్వంగా కూడా ఫీలయ్యాడు, అప్పటికే సుధాకర్ బాస్ కు దగ్గరయ్యాడని స్టాఫ్ లో క్రేజ్ కూడా పెరిగింది, ఇద్దరూ రైలులో ప్రయాణం చేస్తున్నారు, TC గారు టికెట్ చెకింగ్ కు వచ్చారు,బాస్ సుధాకర్ టికెట్స్ చూపించమన్నారు,సుధాకర్ అవాక్కయ్యాడు,నా దగ్గర టికెట్స్ లేవు,మీరెప్పుడిచ్చారు ?
బాస్ కు చిర్రెత్తుకోచ్చింది,
యూ ఫూల్ ! టికెట్స్ బుక్ చేయమని కూడా నేను నీకు చెప్పాలా ?నీకు తెలియదా ?అనేసరికి గడ,గడ వణికిపోయాడు సుధాకర్..ఇప్పుడెలా ?
సర్,మీరెలాగో అడ్జస్ట్ అవండి,నేను టాయ్ లెట్ లో దూరిపోతాను అని బాస్ సమాధానం కోసం కూడా ఎదురుచూడకుండా టాయ్ లెట్ లో దూరిపోయాడు,రాత్రంతా టాయ్ లెట్ కంపుతో వాంతులయ్యాయి,తలపట్టేసింది,
మెుత్తానికి బెంగుళూరు చేరారు,
సారీ ,సుధాకర్..నీకు నేను చెప్పాల్సింది,TC ఓక్కరికి అడ్జస్ట్ చేసాడు నా పాత పరిచయం వల్ల..అయాం సారీ..
బాస్ అంతటవాడు సారీ చెప్పే సరికి మనవాడికి ఛాతీ ఉప్పోంగి ..సర్ విత్ ప్లెజర్ సర్ అన్నాడు..
బెంగుళూర్ లో తనఇంటికి తీసుకెళ్ళాడు సుధాకర్ ను,
బాస్ ఇల్లు ఇంద్ర భవనం లా ఉంది
ముఖ్యం గా బాస్ తల్లిగారు రాజమాత ఉన్నారు ...బెడ్ మీద
బాస్ ఇంట్లోకి వెళ్తూనే సరాసరి తన తల్లి ఉన్న గది కి వెళ్ళి ఆమె పాదాలు స్ప్రుశించాడు.. ఆమె కళ్ళు తెరచి కోడుకుని చూసి ఏరా? ఇదేనా రావడం? భోంచేసావా?
ఇంకా లేదమ్మా,
ముందు స్నానం చేసి భోం చెయ్,
అలాగే నమ్మా..
పనివాడి కన్నా హీనం గా ఆమె ముందు నిలబడ్డ తన బాస్ ను చూసి ఈయన మా బాసేనా?  అన్న అనుమానం వచ్చింది సుధాకర్ కు, అన్నింటికన్నా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే స్వయానా బాస్ భార్యనే దగ్గరుండి అత్తగారికి సపర్యలు చేయడం,
సుధాకర్ లో ఇవన్నీ చూసిన వెంటనే తనలో అంతర్మధనం మెుదలైంది,
తనకు, తన బాస్ కు ఎంత తేడా?
అంత హోదాలో ఉన్నా కూడా ఇసుమంతైనా విసుగు లేకపోవడం ఎలా సాధ్యం?
ఈ ఆలోచన లతో రాత్రి నిద్ర రాలేదు, తన తల్లి రూపమే కళ్ళముందు కనబడుతుంది,
తెల్లారింది.. రాత్రంతా నిద్ర లేక సుధాకర్ కళ్ళు ఎర్రబడ్డాయి..
బాస్ సుధాకర్ ను పిలిచి ఏమోయ్ సుధాకర్ క్రోత్త చోటు నిద్ర వచ్చినట్టుగా లేదు కదా,
అవును సర్,
సరే, స్నానము చేసి టిఫిన్ చేయ్, ముందు ఆ ఫైలు తీసుకురా,
ఫైలు అనగానే సుధాకర్ కు చిర్రెత్తు కోచ్చింది, ఏమైనా కానిమ్మని సర్, ఇక ఆ ఫైలు నేను మోయలేను, నన్నోదియ్యండి ప్లీజ్.. అన్నాడు
ఏం? అంత బరువు గా ఉందా ఆఫైల్?
ఫైలు బరువు కాదు దాన్ని మెయింటనెన్స్ చేయడమే బరువైంది సర్..
బాస్ కొద్ది నిముషాలు మౌనం గా ఉన్నాడు, నేను తోందరపడ్డానా? అనే అపరాధభావం సుధాకర్ మెుహం లో కోట్టోచ్చినట్టుగా కనబడుతుంది.
తరువాత బాస్ మెల్లగా లేచి సుధాకర్ భుజం పై చేయి వేసి
వంద గ్రాముల బరువు కూడా చెయ్యని ఫైలు ను నీవు కనీసం మూడురోజులు మెుయ్యలేక పోయావే, మరి నిన్ను మీ అమ్మ తన కడుపులో తోమ్మిది నెలలు ఎలా మోసిందంటావ్?
ఊహించని ప్రశ్న కు సుధాకర్ కు దిమ్మ తిరిగిపోయింది..
సర్.. అంటూ నీళ్ళు నమిలాడు
ఎవరెవరో వాడిన టాయ్ లెట్ ను రాత్రంతా భరించావు,
మరి నీ కన్నతల్లి వాసనని భరించలేక పోయావా?
సుధాకర్ కళ్ళు నీళ్ళ సుడులయ్యాయి, ఆమె తిన్న ఆహారం తోనే నీవు ఆమె కడుపులో తోమ్మిది నెలలు బ్రతికావు, అప్పుడు రాలేదా వాసన?
నిన్ను కనడానికి ఆమె ఎంత నోప్పి ని భరించిందో నీవు ఊహించగలవా?
నీ పుట్టుక తో ఆమె కళాకాంతులు కోల్పోయిన సంగతైనవనీకు తెలుసా?
భూమి మీద పడ్డాక నీ ముడ్డి నీవే కడుక్కున్నావా?
ఎన్ని సంవత్సరాలు ఆమె నీకు ఊడిగం చేసిందో చెప్పగలవా?
నాన్న తన్నుల నుండి నిన్ను ఎన్ని సార్లు కాపాడిందో గుర్తుకు తెచ్చుకో సుధాకర్? స్రుష్టి లో మనకు బలమైన మద్దతుదారు అంటే ఆ ఓక్కరు అమ్మనే ..
నీ కడుపు నింపడానికి ఆమె ఎన్ని సార్లు కడుపు కాల్చుకుందో నీకు తెలుసా? కనీసం ఆ కోణం లో ఆలోచించావా?
నీవు ఆమెను వ్రుధ్ధాశ్రమం లో వదిలినట్టుగా
ఆరోజుల్లో ఆమె కూడా నిన్ను అనాథ శరణాలయం లో వదిలేలింటే నీ గతి ఏమయ్యేది ?
సుధాకర్ కు నోట మాట రావడం లేదు,
కళ్ళలో నీరు ధారాపాతంగా తనకు తెలియకుండానే కారిపోతున్నాయి,
అమాంతంగా తన బాస్ కాళ్ళ మీద పడ్డాడు,తన కళ్ళనీరు బాస్ పాదాలను తడిపేస్తున్నాయి..
నన్ను క్షమించండి సర్, నేను ఎంత పెద్ద తప్పు చేసానో తెలిసి వచ్చింది ,బుద్ధి వచ్చింది..
బాస్ నవ్వుతూ సుధాకర్ ను లేపి నీకు తెలిసిరావాలనే ఇదంతాచేసాను అంటూ ఆ ఎర్రఫైలు తెరిచి చూపాడు, అందులో నాలుగు తెల్ల కాగితాలు తప్ప మరేమీ లేవు,
సుధాకర్ వెంటనే బాస్ తల్లి పాదాలకు నమస్కరించాడు
బాస్ తో సర్ నాకు సెలవు కావాలి సర్!
దేనికి?
"మా అమ్మను వ్రుధ్ధాశ్రమం నుండి నా ఇంటికి తెచ్చుకోడానికి "

మాత్రుదేవోభవ

అమ్మ ని నాన్న ని....
భారం..... అనుకోవద్దు....
వారు...
మన బంధం...
మన బాధ్యత..
మన ప్రాణం.             

ఎనిమిది శాతం బాలల్లో దృష్టి లోపం

సవాలుగా మారిన సూపర్‌బగ్‌
రోగకారక క్రిములు గతం కంటే శక్తివంతంగా తయారై క్రిమినాశక ఔషధాలను తట్టుకుని నిలబడగల బ్యాక్టీరి యాను ‘సూపర్‌బగ్‌ అంటారు. బ్యాక్టీరియా కారణం గా వచ్చే వ్యాధులను నయం చేయడానికి యాంటీబయోటిక్స్‌ను వినియోగిస్తుంటారు. ఇటువంటిబ్యాక్టీరియా వృద్ధిచెందకుండా అడ్డు కోగలిగిన ఉనికిని నిర్వీర్యం చేయగలిగిన శక్తి యాంటిబయోటిక్స్‌ కు తగ్గినప్పుడు సూపర్‌ బగ్‌లు తయారవ్ఞతాయి. ప్రతి సంవత్స రం మనదేశంలో సూపర్‌బగ్‌ వల్ల దాదాపు 58వేలమంది పసిపిల్ల లు మృత్యువాతపడుతున్నారు. దేశంలో రోజూ 70వేల మంది శిశువ్ఞలు జన్మిస్తున్నారు. ఈ పసికందులకు వచ్చే 80శాతం అంటు వ్యాధులు శక్తివంతమైన క్రిమినాశక ఔషధాలను కూడా తట్టుకోగ లుగుతాయి. అయితే 2050 నాటికి సూపర్‌ బగ్‌లు కోటి మంది ప్రాణాలను బలిగొంటాయని ఓపరిశీలనలోవెల్లడైంది. అంటే క్యాన్సర్‌ మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోయిన వారికంటే సూపర్‌ బగ్‌ వల్ల మృతి చెందిన వారి సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. వైద్యు లు రాసిచ్చిన మందులను పూర్తిగా వాడకుండా మధ్యలోనే అర్థాంత రంగా ఆపేయడం, లేదా డాక్టర్ల వద్దకు వెళ్లకుండా మెడికల్‌ షాపుల వారినడిగి ఏవో మందులు ఇష్టం వచ్చినట్టువాడడం ఇవన్నీ సూపర్‌ బగ్‌లకు కారణాలవ్ఞతున్నాయి. ఫలితంగా వ్యాధి పదేపదే తిరగబెట్ట డం, రోగకారకక్రిములు గతంకంటే శక్తివంతంగా తయారై సూపర్‌ బగ్‌లుగా తయారవ్ఞతుంటాయి. ఈ కారణంగా రోగి వైద్యపరంగానే కాక ఆర్థికపరంగా కూడా ఎక్కువ ఖర్చు చేయవలసి వస్తుంది. అంతేకాదు కొన్నేళ్ల పాటు అనారోగ్యంతో సతమతపై చివరకు ప్రాణాలను కోల్పోవలసి వస్తుంది. సూపర్‌బగ్‌లో సులువ్ఞగా జంతువ్ఞల నుంచి మనుషులకు సంక్ర మిస్తుంటాయి.ఆస్పత్రుల్లో రోగనిరోధకవ్యవస్థ చాలా బలహీనంగా ఉండేవారికి గాయాలు,ఆపరేషన్‌ సమయాల్లో చేసిన కత్తిగాట్లు,సెలై న్లు, వెంటిలేటర్ల ద్వారా కూడా ఇవి బయ��                                                 

ఎనిమిది శాతం బాలల్లో దృష్టి లోపం


- బోధన రీతులూ కారణమే
- టివిలు, సెల్‌ ఫోన్లతో చేటు
- స్కూల్‌ హెల్త్‌కు మంగళం
ప్రజాశక్తి-విజయవాడ ప్రతినిధి :
                           సర్వేంధ్రియానం నయనం ప్రధానం.. అన్నారు. వృద్ధులకే కాదు..నేడు వయసుతో సంబంధం లేకుండా అనేక మందికి పిన్న వయసులోనే కంటిచూపు మందగిస్తోంది. కంటి చూపు తగ్గుతున్న పిల్లల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పట్టుమని పదేళ్లు నిండని చిన్నారులూ దృష్టి లోపంతో బాధపడుతున్నారు. ప్రతి వంద మంది పిల్లల్లో ఎనిమిది మందికి దృష్టి లోపం ఉంటోందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. వీరిలో ఎక్కువగా 11 నుంచి 14 ఏళ్ల వయసు లోపు వారే కావడం గమనార్హం. ఇందుకు ప్రధానంగా జన్యుపరమైన సమస్య ఒక కారణమైతే, బాలలకు విటమిన్‌-ఎ లోపమూ మరో ముఖ్య కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. చీకటి గదుల్లో విద్యా బోధన, టివి చూడటం, కంప్యూటర్‌, వీడియో గేమ్స్‌, సెల్‌ఫోన్‌ చిత్రాలు చూడటం వంటి కారణాలతో పిల్లల్లో కంటిచూపు తగ్గుతున్నట్లు వారు వెల్లడిస్తున్నారు. కంటిచూపు సమస్యతో బాధపడే వారిలో ప్రైవేటు పాఠశాలల విద్యార్థులే ఎక్కువ. తగినంత వెలుతురు, గాలి లేని తరగతి గదుల్లో బోధనే అందుకు కారణం. తరగతి గదుల్లో బ్లాక్‌ బోర్డులే వాడాలి. నల్లని బోర్డుపై చాక్‌పీస్‌తో తెల్లగా రాసే అక్షరాలు దూరం నుంచి కూడా కళ్లపై ఒత్తిడి లేకుండా స్పష్టంగా కనిపిస్తాయి. కానీ వివిధ ప్రయివేట్‌ పాఠశాలల్లో బ్లాక్‌బోర్డుల స్థానే తెల్ల, పచ్చ తదతర రంగుల బోర్డులు వాడుతున్నారు. కార్పొరేట్‌ పాఠశాలల్లో ఎక్కువగా తెల్లబోర్డులనే వాడుతున్నారు. ఆ బోర్డులపై మార్కర్లు వాడడం వల్ల కళ్లపై ఒత్తిడి పడుతోందంటున్నారు. ఈతరం పిల్లలకు బడిలో కంప్యూటర్‌ పాఠాలుంటే, ఇంటికొచ్చి టివిలకు, లేదా స్మార్ట్‌ ఫోన్లకు అతుక్కు పోతున్నారు. పుస్తకాల్లోని అక్షరాలూ చిన్నవిగా ముద్రించడం వల్లా

కోటీశ్వరులు కావడం అందరికీ సాధ్యం కాదు

 జీవితం లో నేర్చుకోవాల్సినవి కొన్ని

👉1. కోటీశ్వరులు కావడం అందరికీ సాధ్యం కాదు, కానీ నిజాయితీపరులు కావడం ప్రతి ఒక్కరికీ సాధ్యమే.

👉2. సుత్తితో ఒక్క దెబ్బ వెయ్యగానే బండరాయి ముక్కలవదు. దెబ్బ వెనుక దెబ్బ వెయ్యాలి. ఒక్క ప్రయత్నంలోనే విజయం సిద్థించదు. ఎడతెగని ప్రయత్నం కావాలి.
👉3. ఒకసారి బట్టలు మాసిపోతే మనిషి ఎక్కడ కూర్చోడాన్కిఅయినా సిద్దపడతాడు. అలాగే ఒకసారి నడత చెడిందంటే ఎలాంటి పనులుచేయడానికైనా సందేహించడు మనిషి.
👉4. మనం మన ఆలోచనలకు బందీలం. ఆలోచనలను మార్చుకోనిదే దేన్ని మార్చలేం.
👉5. గొడుగు వర్షాన్ని ఆపలేకపోవచ్చు. కానీ వర్షంలో తడిసిపోకుండా రక్షణ ఇస్తుంది. అలాగే ఆత్మ విశ్వాసం విజయాన్ని తెచ్చిపెట్టలేకపోవచ్చు. కానీ విజయపథలో ఎదురయ్యే అవరోధాలను అధిగమించగల శక్తిని ఇస్తుంది.
👉6. బలవంతుడికీ బలహీనుడికీ మధ్య జరిగే ఘర్షణలో ప్రేక్షకపాత్ర వహించడమంటే.. తటస్థంగా ఉన్నట్లు కాదు. బలవంతుడి పక్షం వహించినట్లు.
👉7. అతి నిద్ర, బద్దకం, భయం, కోపం, నిరాశావాదం- ఈ ఐదు అతి చెడ్డ గుణాలు. వీటిని పొరపాటున దగ్గరకు రానిచ్చినా జీవితంలో పైకి రావడం, సుఖపడడం జరగదు.
👉8. అహంకారము ప్రతి ఒక్కరినుంచీ – అఖరికి భగవంతుడి నుంచి కూడా దూరం చేస్తుంది.
👉9. ఉపాయాన్నిఅలోచించేటప్పుడే రాగల అపాయాన్ని కూడా అంచనా వేయాలి.
👉10. నీ తప్పును ఈరోజు కప్పిపుచ్చకలిగినా రేపటి దాని పర్యవసానాన్ని మాత్రం తప్పించుకోలేవు.
👉11. మంచివారు దూరం కావడం, చెడ్డవారు దగ్గర కావడమే దుఃఖాని కి నిదర్శనం.
👉12. బలహీనుడిని బలవంతుడు కొడితే బలవంతుడిని భగవంతుడు కొడతాడు.
👉13. కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటగలవు. కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేవు.
👉14. పక్షులకు కొంత ధాన్యం, పశువులకి కొంత గ్రాసం, మనిషికి కొంత సాయం… ఇదే జీవితం.
👉15. ఉత్తమ గుణాల వల్ల మవిషి ఉన్నతుడవుతాడు కానీ ఉన్నత పదవి వల్ల కాదు… - శిఖరం మీద కూర్చొన్నంత మాత్రాన కాకి గరుడ పక్షి కాలేదు.
👉16. తలపై మోసే భారాన్ని ఇతరులు కొంత పంచుకుంటే బాధ తగ్గుతుంది. కానీ ఆకలి బాధనూ, అజ్ఞాన బాధనూ ఎవరికి వారే తగ్గించుకోవాలి.
👉17. మంచివారు దూరంకావడం, చెడ్డవారు దగ్గరకావడమే దుఃఖానికి నిదర్శనం.
👉18. మెరుగు పెట్టకుండా రత్నానికి, - కష్టాలు ఎదుర్కోకుండా మనిషికి గుర్తింపు రాదు.
👉19. కేవలం డబ్బుంటే సరిపోదు. మంచి వ్యక్తిత్వం ఉంటనే సమాజం గౌరవిస్తుంది.
👉20. ఎవరి వయస్సుకు తగ్గంటు వారి ఆలోచనలు, ప్రవర్తన ఉంటనే ఆ వ్యక్తికి గౌరవం ఉంటుంది.          

Sunday, October 16, 2016

మీరు పుట్టిన తెలుగు సంవత్సరం ఏమిటో మీకు తెలుసా?

మీరు పుట్టిన తెలుగు సంవత్సరం ఏమిటో మీకు తెలుసా?


మీరు ఏ సంవ‌త్స‌రంలో పుట్టారు... అంటే ఠ‌క్కున చెప్పేస్తారు. కానీ, ఏ తెలుగు సంవ‌త్స‌రంలో పుట్టారు అంటే చెప్ప‌లేం. అందుకే మీ కోసం ఆ తెలుగు వ‌త్స‌రాలు ఇస్తున్నాం. మీరు ఏ తెలుగు సంవ‌త్స‌రంలో పుట్టారో తెలుసుకోండి.

( 1867, 1927,1987,) ప్రభవ
(1868,1928,1988) విభవ
(1869,1929,1989) శుక్ల
(1870,1930,1990)ప్రమోదూత
(1871,1931,1991)ప్రజోత్పత్తి
(1872,1932,1992)అంగీరస
(1873,1933,1993)శ్రీముఖ
(1874,1934,1994)భావ
(1875,1935,1995)యువ
(1876,1936,1996)ధాత
(1877,1937,1997) ఈశ్వర
(1878,1938,1998)బహుధాన్య
(1879,1939,1999)ప్రమాది
(1880,1940,2000)విక్రమ
(1881,1941,2001)వృష
(1882,1942,2002)చిత్రభాను
(1883,1943,2003)స్వభాను
(1884,1944,2004)తారణ
(1885,1945,2005)పార్థివ
(1886,1946,2006)వ్యయ
(1887,1947,2007)సర్వజిత్
(1888,1948,2008)సర్వదారి
(1889,1949,2009)విరోది
(1890,1950,2010)వికృతి
(1891,1951,2011)ఖర
(1892,1952,2012)...నందన
(1893,1953,2013)...విజయ
(1894,1954,2014)...జయ
(1895,1955,2015)...మన్మద
(1896,1956,2016)...దుర్ముఖి
(1897,1957,2017)...హేవిళంబి
(1898,1958,2018)...విళంబి
(1899,1959,2019)...వికారి
(1900,1960,2020)...శార్వరి
(1901,1961,2021)...ప్లవ
(1902,1962,2022)...శుభకృత్
(1903,1963,2023)...శోభకృత్
(1904,1964,2024)...క్రోది
(1905,1965,2025)...విశ్వావసు
(1906,1966,2026)...పరాభవ
(1907,1967,2027)...ప్లవంగ
(1908,1968,2028)...కీలక
(1909,1969,2029)...సౌమ్య
(1910,1970,2030)...సాదారణ
(1911,1971,2031)...విరోదికృత్
(1912,1972,2032)...పరీదావి
(1913,1973,2033)...ప్రమాది
(1914,1974,2034)...ఆనంద
(1915,1975,2035)...రాక్షస
(1916,1976,2036)...నల
(1917,1977,2037)...పింగళ
(1918,1978,2038)...కాళయుక్తి
(1919,1979,2039)...సిద్దార్థి
(1920,1980,2040)...రౌద్రి
(1921,1981,2041)...దుర్మతి
(1922,1982,2042)...దుందుభి
(1923,1983,2043)...రుదిరోద్గారి
(1924,1984,2044)...రక్తాక్షి
(1925,1985,2045)...క్రోదన
(1926,1986,2046)...అక్షయ

భారత రాజ్యాంగానికి ఆధారాలు

భారత రాజ్యాంగానికి ఆధారాలు


భారత రాజ్యాంగానికి ప్రధాన ఆధారం - 1935 భారత ప్రభుత్వ చట్టం.భారత రాజ్యాంగ పరిషత్ సుమారు 60 దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసారు.

ఆధారం            
- అంశం

1.అమెరికా రాజ్యాంగం
-ప్రాధమిక హక్కులు

2.అమెరికా రాజ్యాంగం
-స్వతంత్ర న్యాయవ్యవస్థ

3.అమెరికా రాజ్యాంగం
-న్యాయ సమీక్షాదికారం

4.అమెరికా రాజ్యాంగం
-సుప్రీంకోర్టు న్యాయమూర్తుల తొలగింపు

5.అమెరికా రాజ్యాంగం
-హైకోర్టు న్యాయమూర్తుల తొలగింపు

6.అమెరికా రాజ్యాంగం
-రాష్ట్రపతి తొలగింపు

7.అమెరికా రాజ్యాంగం
-ఉపరాష్ట్రపతి నియామకం

8.బ్రిటీషు రాజ్యాంగం
-సమన్యాయపాలన

9.బ్రిటీషు రాజ్యాంగం
-పార్లమెంటరీ విధానం

10.బ్రిటీషు రాజ్యాంగం
-కేబినేట్ తరహా పార్లమెంటరీ విధానం

11.బ్రిటీషు రాజ్యాంగం
-బిల్లుల ఆమోదం

12.బ్రిటీషు రాజ్యాంగంస్పీకరు
-హోదా మరియు విధులు

13.బ్రిటీషు రాజ్యాంగం
-ద్విసభా విధానం

14.బ్రిటీషు రాజ్యాంగం
-నామమాత్రపు దేశాధినేత

15.బ్రిటీషు రాజ్యాంగం
-అఖిల భారత సర్వీసులు

16.బ్రిటీషు రాజ్యాంగం
-రిట్స్ జారీ చేయడం

17.బ్రిటీషు రాజ్యాంగం
-ఏక పౌరసత్వం

18.ఫ్రెంచ్ రాజ్యాంగం
-స్వేచ్చ,సమానత్వం,సౌబ్రాతృత్వం అనే అంశాలు రాజ్యాంగ ప్రవేశిక లోకి చేర్చటం

19.ఫ్రెంచ్ రాజ్యాంగం
-గణతంత్ర వ్యవస్థ

20.ఫ్రెంచ్ రాజ్యాంగం
-బహు పార్టీ విధానం

21.ఫ్రెంచ్ రాజ్యాంగం
-ప్రజాస్వామ్యము

22.సోవియట్ యూనియన్ రాజ్యాంగం
-ప్రాధమిక విధులు

23.సోవియట్ యూనియన్ రాజ్యాంగం
-సామ్యవాద సూత్రాలు

24.సోవియట్ యూనియన్ రాజ్యాంగం
-సామాజిక,ఆర్ధిక,రాజకీయ న్యాయ ప్రవేశికలో చేర్చుట

25.ఐరిష్ రాజ్యాంగం
-ఆదేశిక సూత్రాలు

26.ఐరిష్ రాజ్యాంగం
-రాజ్యసభకు సభ్యులను నామినేట్ చేయటం

27.ఐరిష్ రాజ్యాంగం
-రాష్ట్రపతి ఎన్నిక(ఓటు బదలాయింపు పద్ధతి ద్వారా)

28.కెనడా రాజ్యాంగం
-కేంద్ర ప్రభుత్వానికి అవశిష్టాధికారాలు ఉండటం

29.కెనడా రాజ్యాంగం
-సమాఖ్య వ్యవస్థ

30.కెనడా రాజ్యాంగం
-గవర్నర్ ను నియమించటం

31.కెనడా రాజ్యాంగం
-అధికారాలను కేంద్ర,రాష్ట్ర జాబితాల క్రింద విభజించటం

32.కెనడా రాజ్యాంగం
-సుప్రీంకోర్టు సలహా పూర్వక పరిధి

33.కెనడా రాజ్యాంగం
-బలమైన కేంద్ర ప్రభుత్వం

34.జపాన్ రాజ్యాంగం
-ఎమర్జన్సీ సమయంలో జీవించే హక్కు రద్దు కాకుండా చూడటం

35.జపాన్ రాజ్యాంగం
-చట్టం నిర్ధారించిన పధ్ధతి

36.వైమర్/జర్మనీ రాజ్యాంగం
-అత్యవసర పరిస్థితులలో ప్రాధమిక హక్కులను తాత్కాలికంగా రద్దు చేయడానికి రాష్ట్రపతికి గల అధికారం

37.దక్షిణాఫ్రికా రాజ్యాంగం
-రాజ్యాంగ సవరణ విధానం

38.దక్షిణాఫ్రికా రాజ్యాంగం
-రాజ్యసభ సభ్యుల ఎంపిక

39.ఆస్ట్రేలియా రాజ్యాంగం
-ఉమ్మడి జాబితా

40.ఆస్ట్రేలియా రాజ్యాంగం
-ఉభయ సభల సంయుక్త సమావేశం

41.ఆస్ట్రేలియా రాజ్యాంగం
-పార్లమెంటు,శాసనసభ సభ్యుల ప్రత్యేక హక్కులు

42.నార్వే రాజ్యాంగం
-వివిధ రాష్ట్రాలలోని శాసనసభ,శాసన మండలి సభ్యులను ఎన్నుకొనే విధానం

43.1935 భారత ప్రభుత్వ చట్టం
-కేంద్ర,రాష్ట్ర సంబంధాలు

44.1935 భారత ప్రభుత్వ చట్టం
-ఫెడరల్ న్యాయస్థానం

చిట్టికథ

 చిట్టికథ

ఒక సారి సోక్రటీస్ దగ్గరకు అతని మిత్రుడు ఒకడు వచ్చి నీకు తెలుసా నీ మిత్రుడు గురించి నీను ఒక విషయం విన్నాను" అని ఎంతో ఉత్సాహంగా ఇంకేదో చెప్పబోతున్న అతన్ని సోక్రటీస్ ఆపి "నీవు నా మిత్రుడు గురించి చెప్పబోయే ముందు ఒక్క నిముషం సావధానంగా నీవు చెప్పబోయే విషయాన్ని కోద్దిగా జల్లెడ పడదాం దీన్ని నీను "మూడు జల్లెడ్ల పరీక్ష (Triple Filter Test)" అంటాను అని అడగటం మొదలు పెట్టాడు.

మొదటి జల్లెడ"నిజం" - "నీవు నా స్నేహితుడి గురించి చెప్పాబోయే విషయం ఖచ్చితంగా నిజమైనదని నీకు తెలుసా ?" అని అడిగాడు.

అందుకు ఆ స్నేహితుడు "లేదు, ఎవరో అంటుండగా విన్నాను" అని అన్నాడు.
"అంటే నీవు చెప్పబోయే విషయం నిజమైనదే అని నీకు తెలీదన్న మాట" అని సోక్రటీస్ అన్నాడు.

సరే రెండో జల్లెడ "మంచి " - " నీవు నాకు చెప్పబోయే విషయం నా మిత్రుని గురించిన మంచి విషయమా ?" అని అడిగాడు సోక్రటీస్.

"కాదు" అన్నాడు సోక్రటీస్ స్నేహితుడు .

"అంటే నీవు నా మిత్రుని గురించి చెడు చెప్పాలను కున్నావు, అది కుడా నీకు కచ్చితంగా నిజమని తెలీని విషయం- సరే ఇంక మూడో జల్లెడకు వెళదాం"అన్నాడు సోక్రటీస్.

మూడో జల్లెడ "ఉపయోగం" - "నీవు నా మిత్రుని గురించి చెప్పబోయే విషయం నాకు వుపయోగామైనదా ? " అని సోక్రటీస్ అడిగాడు.

"లేదు" అన్నాడు ఆ మిత్రుడు.

"అయితే నీవు చెప్పబోయే విషయం నిజమైనది, మంచిది, వుపయోగకరమైనది కానపుడు నాకు చెప్పటం ఎందుకు ?" అని సోక్రటీస్ అన్నాడు.

నీతి : మన గురించి, మన వాళ్ళ గురించి చెడు వార్తలను, విషయాలను మోసే వాళ్ళు చాలా మంది వుంటారు. ఒక విషయం (చాడి) వినేముందు ఈ మూడు జల్లెడల పద్ధతి అనుసరిస్తే, మన బంధాలు నిలబడతాయి, మంచి పెంపొందుతుంది. చాడీలు నివారిన్చబడతాయి. 

మాతృభాష

కల్వరాల రాజ్యాన్ని వీరరాఘవుడనే మహారాజు పరిపాలించేవాడు. అతడు వివిధ రాజ్యాల కళాకారులను ఆహ్వానించి, వారితో కళా ప్రదర్శనలు ఇప్పించి, మంచి బహుమతులు ఇచ్చేవాడు. ఒక రోజు వారి రాజ్యానికి అమరేశప్ప అనే పండితుడు వచ్చ్హాడు. అతడు అనేక భాషలను అనర్గళంగా మాట్లాడగలడు.

"మహారాజా! మీ పండితులెవరైనా నా మాతృభాష కనుక్కోగలరా?" అని అమరేశప్ప  సవాలు విసిరాడు.

ఆస్ధాన పండితులంతా వేర్వేరు భాషలలో వివిధ ప్రశ్నలు అడిగారు. ఏ భాషలో ఏ ప్రశ్న అడిగినా ఆ పండితుడు ఏ మాత్రం తడుముకోకుండా, ఆ భాషే తన మాతృభాష అయినట్లుగా సమాధానం చెప్పసాగాడు. చివరికి ఆస్ధానపండితులు చేతులెత్తేశారు.

"మీ రాజ్యంలో నా మాతృభాషను కనిరపెట్టగల మేధావులే లేరా?" అన్నాడు ఆ పండితుడు మహారాజు మహామంత్రివైపు చూశాడు.

మహామంత్రి ఆ పండితుడిని తనకు తెలిసిన కొన్ని భాషలలో ప్రశ్నలు అడగసాగాడు. ఆ పండితుడు తడుముకోకుండా జవాబులు చెప్ప సాగాడు. చివరికి విసుగు చెందిన, మహామంత్రి కోపంతో ఒక సైనికుడి ఖడ్గం తీసుకొని పండితుడిపై వేటు వేయబోయాడు.
"అమ్మో! కాపాడండి!" అని అరిచాడు ఆ పండితుడు కన్నడంలో.

మహామంత్రి ఖడ్గాన్ని దించి, చిరునవ్వుతో "మహారాజా! ఆ పండితుడి మాతృభాష కన్నడం, మనం ఆపదలో ఉన్నప్పుడు మనం మాట్లాడే మాటలు మాతృభాషలోనే ఉంటాయి." అని చెప్పాడు.
పండితుడు మాతృభాష కన్నడమే అని అంగీకరించాడు. ఓటమితో తలదించుకుని సభ నుండి వెళ్ళిపోయాడు.

బ్రహ్మా ముహూర్తం అంటే ఏంటి ? బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేవాలా ?

బ్రహ్మా  ముహూర్తం అంటే ఏంటి ?

బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేవాలా ?

బ్రహ్మా ముహూర్తం..!! ఈ పదాన్ని మనం చిన్నప్పటి నుంచి వినే ఉంటాం. కానీ.. దీనికి సరైన అర్థం, పరమార్థం మాత్రం చాలామందికి తెలియదు. బ్రహ్మా ముహూర్తం తెల్లవారుజామున అని తెలుసు కానీ.. కరెక్ట్ సమయం మాత్రం చాలామందికి తెలియదు.అసలు బ్రహ్మా ముహూర్తం అంటే ఏంటి ? బ్రహ్మాముహూర్తంలో నిద్రలేవాలని, పూజ చేయాలని, పిల్లలు చదువుకోవాలని ఎందుకు సూచిస్తారు ? బ్రహ్మా ముహూర్తానికి ఎందుకంత ప్రాధాన్యత ? బ్రహ్మ ముహూర్తంలోనే ఎందుకు నిద్రలేవాలి ? ఇలాంటి అనుమానాలన్నింటికీ.. పరిష్కారం దొరికింది. తెలుసుకోవాలని ఉందా.. అయితే.. ఈ ఆర్టికల్ లోకి ఎంటర్ అయిపోండి.

బ్రాహ్మా  ముహూర్తం

సుర్యోదయానికి 48 నిమిషాల ముందు సమయాన్ని బ్రాహ్మా  ముహూర్తం అంటారు.

ఆఖరి నిమిషాలు

రాత్రిభాగంలోని ఆఖరి 48 నిమిషాలను.. సూర్యోదయానికి ముందు 48 నిమిషాలను బ్రహ్మా  ముహూర్తం అంటారు.
  
పూజలు
బ్రహ్మా ముహూర్తం పూజలు, జపాలకు మంత్ర సాధనకు విశిష్టమైన సమయంగా చెబుతారు.

విద్యార్థులకు

విద్యార్థులు బ్రాహ్మా ముహూర్తం లో లేచి చదువుకుంటే బాగా గుర్తుంటుందని నమ్ముతారు.
  
జీవక్రియలు

మన శరీరంలో జీవ గడియారం ఉంటుంది. దీన్ని అనుసరించే మన జీవక్రియలన్నీ జరుగుతాయి. అలాగే ఉదయం మనలో కార్టిసోల్ హార్మోన్ ఎక్కువ మోతాదులో విడుదల అవుతుంది. ఈ హార్మోన్ మనలోని ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపుతుంది. అందుకే పిల్లలు బ్రహ్మా ముహూర్తంలో చదువుకుంటే చక్కగా గుర్తుంటుందట.
  
ఒత్తిడి
అలాగే ముందు రోజు భరించిన ఒత్తిడులు అన్ని నిద్రలో మరిచిపోతాం కాబట్టి మెదడు ఉత్తేజంతో ఉంటుంది. పరిసరాలు కూడా నిశ్శబ్దంగా ఉంటాయి. ఈ అన్ని కారణాల వల్ల చదివినది మెదడులో జాగ్రత్తగా నిక్షిప్తం అవుతుంది.

పెద్దవాళ్లు ఎందుకు లేవాలి ?

ఆయుర్వేదం ప్రకారం రాత్రి తోందరగా నిద్రపోయి ఉదయం సూర్యోదయానికి ముందే నిద్ర లేచేవారికి ఆరోగ్య సమస్యలు రావు.

ఫ్రెష్ ఆక్సిజన్

రాత్రంతా చెట్లు వదిలిన ఆక్సిజన్ వేకువ జామున కాలుష్యం బారిన పడకుండా ఎక్కువ పరిమాణం లో మనకు అందుబాటులో ఉంటుంది. వాకింగ్ కు వెళ్లేవారికి ఇది చాలా ఉపయెాగ పడుతుంది.

గృహిణులు ఎందుకు లేవాలి.?

గృహిణులకు నిద్ర లేచిన దగ్గర నుంచి ఎన్నో పనులు , పిల్లల సంరక్షణ, ఇంట్లో పెద్దవారి సంరక్షణ , వంట పనులు,ఇంటి పనులతో క్షణం తీరిక లేకూండా గడుపుతారు. అలాంటి వారికి ఒత్తిడి లేని మానసిక ,శారీరక ఆరోగ్యం చాలా అవసరం.

ఆందోళన

బ్రహ్మా ముహూర్తంలో లేవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది.ఉదయాన్నే నిద్రలేస్తే...ఇంటిపనులన్ని... ఆందోళన లేకుండా అయిపోతాయి....

సూర్యోదయము
ప్రతిరోజూ సూర్యోదయము చూసే అలవాటు ఉన్నవారికి గుండె,మెదడు,ప్రశాంతంగా ఆరోగ్యంగ ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి....

ఆరోగ్యము

బ్రహ్మా ముహూర్తంలో  నిద్రలేవడం వల్ల సూర్యుని లేలేత కిరణాలు మన పైన ప్రసరిస్తాయి సూర్యరశ్మి లో ఉండే విటమిన్ డి ఎముకల బలానికి సహయపడుతుంది.....              

పొర‌పాటున సొమ్ము వేరే ఖాతాలోకి ట్రాన్స్‌ఫ‌ర్ చేస్తే... ఏం చేయాలి?

పొర‌పాటున సొమ్ము వేరే ఖాతాలోకి ట్రాన్స్‌ఫ‌ర్ చేస్తే... ఏం చేయాలి?

  transfered in to a wrong account
 బ‌్యాంకింగ్ రంగంలో ఒక్కోసారి పొర‌పాట్లు దొర్లుతుంటాయి. అయితే, ఇది డ‌బ్బుతో ముడిప‌డింది కాబ‌ట్టి చాలా జాగ్ర‌త్త కావాలి. ఒకప్పుడు ఎవరికైనా డబ్బు ఇవ్వాలంటే బ్యాంకు బేరర్ చెక్ ఇచ్చేవాళ్లం. కానీ, నేడు దాదాపుగా అందరూ నెట్ బ్యాంకింగ్ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాం. ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్ మనీ ట్రాన్స్‌ఫర్ సమయాల్లో ఒక్క డిజిట్ తేడా వచ్చినా నగదు వేరే వారి ఖాతాకు బదిలీ అయిపోతుంది. ఒకవేళ వేరే ఖాతాకు బదిలీ అయిపోతే పరిస్థితి ఏంటి? మన నగదు వెనక్కి వస్తుందా? నిబంధనలు ఏం చెబుతున్నాయి? ఒకవేళ పొరపాటుగా భారీ మొత్తంలో నగదు వచ్చి మన ఖాతాలో జమ అయితే… మూడో కంటికి తెలియకుండా ఉంచేసుకోవాలా? లేక బ్యాంకుకు తెలియజేసి నిజాయతీ చాటుకోవాలా?


అకౌంట్ నంబర్, ఖాతాదారుని పేరు, ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌తో నెట్ బ్యాంకింగ్‌లో బెనిఫీషియరీ వివరాలను యాడ్ చేసుకుంటామని తెలిసిందే. అకౌంట్ నంబర్, పేరు మ్యాచ్ అవకపోతే లావాదేవీ ఫెయిల్ అవుతుందని చాలామంది అనుకుంటుంటారు. కానీ ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం నగదు ట్రాన్స్‌ఫర్‌కు ఖాతా నంబరే ముఖ్యం. ఖాతాదారుని పేరు, ఐఎఫ్ఎస్సీ నంబర్ అనేవి బ్యాంకు తరఫున చెక్ చేసుకునేందుకు ఇచ్చే అదనపు సమాచారం మాత్రమే. ప్రతీ లావాదేవీ సమయంలో ఖాతాదారుని పేరు, ఐఎఫ్ఎస్సీ కోడ్‌ను కూడా మ్యాచ్ చేసి చూడాలని ఆర్బీఐ బ్యాంకులకు సూచించింది. కానీ ఇది సూచన మాత్రమే. తప్పనిసరి కాదు.


జమ చేసేవారిదే బాధ్యత
ఆర్బీఐ మార్గదర్శకాలు ఏం చెబుతున్నాయంటే… ఖాతా నంబర్, ఖాతాదారుని పేరు, నగదు మొత్తం సహా అన్ని వివరాలను ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాల్సిన బాధ్యత నగదు పంపిస్తున్నవారి పైనే ఉంటుంది. పొరపాటుగా వెళ్లి ఆ నగదు వేరొకరి ఖాతాలో జమ అయితే బాధ్యత అవతలి వారిపై ఉండదు. ఇలా పొరపాటుగా పంపించిన వారు తిరిగి తమ నగుదును వెనక్కి పొందడం అన్నది చాలా కష్టమైన ప్రక్రియ.


ఎందుకంటే… మనీ ట్రాన్స్‌ఫర్ సమయంలో ఖాతా వివరాలను చెక్ చేసుకోవాల్సిన బాధ్యత పంపించే వారిపైనే ఉంటుంది. అయితే, పొరపాటుగా వేరొక ఖాతా నంబర్ ఎంటర్ చేసినట్టయితే నిజానికి ఆ నంబర్ పైన ఎలాంటి ఖాతా లేకుంటే మాత్రం ఆ నగదు వెనక్కి వస్తుంది. ఒక్కోసారి ఐఎఫ్ఎస్సీ కోడ్లో తప్పు ఉన్నా లావాదేవీ ఫెయిల్ అయ్యి నగదు వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా ఫెయిల్ అయిన లావాదేవీల నగదును బ్యాంకులు తిరిగి ఖాతాలో జమ చేస్తాయి. ఒక్కోసారి ఆర్టీజీఎస్ సస్పెన్స్ అకౌంట్లో కూడా ఉంచవచ్చు. అప్పుడు ఖాతాదారులే స్వయంగా ఫిర్యాదు ద్వారా క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది.


పొరపాటుగా పంపిస్తే పరిష్కారం ఏంటి? 

ఒకవేళ పొరపాటుగా వేరే ఖాతా నంబర్‌కు నగదు వెళ్లినట్టు గుర్తిస్తే వెంటనే బ్యాంకుకు సమాచారం అందించాలి. అప్పుడు బ్యాంకు సిబ్బంది బెనిఫీషియరీతో మాట్లాడి జరిగిన తప్పిదాన్ని వివరిస్తారు. పొరపాటుగా జమ అయిన ఆ మొత్తాన్ని రివర్ట్ చేసుకునేందుకు అనుమతి కోరతారు. వారు సరేనంటే సమస్య పరిష్కారమైనట్టే. ఒకవేళ మీ సొంత బ్యాంకు శాఖ మేనేజర్ సరిగా స్పందించకుంటే ఆ నగదు పొరపాటుగా క్రెడిట్ అయిన బ్యాంకు శాఖను సంప్రదించాలి. అకౌంట్ స్టేట్‌మెంట్, పాస్‌బుక్, ఐడీ, అడ్రస్ ప్రూఫ్ అన్నీ వెంట తీసుకెళ్లి జరిగిన సందర్భాన్ని వివరించడం ద్వారా సాయం పొందవచ్చు. కానీ, కొంతమంది మాత్రం డబ్బును వెనక్కి ఇచ్చేందుకు ఒప్పుకోరు. అప్పటికే ఖర్చు కూడా చేసి ఉంటారు. ముఖ్యంగా ఎక్కువ మొత్తాల్లో ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఖాతాదారుడు డ్రా చేసుకున్న తర్వాత అప్పుడు బ్యాంకులు కూడా ఏమీ చేయలేవు. పొరపాటుగా పంపిన వారికి నగదు వెనక్కి రావడం దుర్లభం.


అయినా మీకు న్యాయం లభించకుంటే న్యాయపరమైన ప్రక్రియను అనుసరించడమే మిగిలి ఉన్న మార్గం. కానీ న్యాయవ్యవస్థ ద్వారా పరిష్కారం అంటే ధన వ్యయం, కాల వ్యయంతో కూడుకుని ఉంటుందన్న విషయాన్ని ముందుగానే తెలుసుకోవాలి. పైగా కోర్టులో లావాదేవీ మీ తప్పిదం కారణంగానే జరిగిందని నిరూపించుకోవాల్సి ఉంటుంది.


ఒకవేళ మీ ఖాతాలోనే పొరపాటుగా నగదు జమ అయితే?
పైన చెప్పుకున్నట్టు మీ ఖాతాకు వేరెవరో పొరపాటుగా నగదు జమ చేస్తే ఇవ్వడం, ఇవ్వకపోవడం అన్నది మీ ఇష్టమే. కానీ, పంపిన వారు కోర్టును ఆశ్రయిస్తే అప్పుడు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. జమ ఎవరి నుంచి, ఎందుకు వచ్చిందన్న వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ సమర్పించలేకపోతే నగదును వెనక్కి తిరిగి ఇవ్వడంతోపాటు జైలు శిక్షను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. నగదు మీదే అని చెబితే ఆదాయపన్ను కట్టాల్సి ఉంటుంది. రూ.50 వేలకు మించి నగదు లావాదేవీలపై ఆదాయపన్ను శాఖ యంత్రాంగం కన్నేసి ఉంచింది. వారు నోటీసు ఇస్తే సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది.


నగదు పంపే ముందు ఇలా చేస్తే బెటర్!

మనవైపు పొరపాటు ఉంచుకుని నెపం బ్యాంకులపైన, మన నగదును అందుకున్న అజ్ఞాత వ్యక్తిపైన మోపితే లాభం లేదు. ముందు జాగ్రత్తలు అవసరం. నెట్ బ్యాంకింగ్ లావాదేవీలకు సంబంధించి బెనిఫీషియరీ ఖాతా నంబర్, ఐఎఫ్ఎస్సీ నంబర్లను యాడ్ చేసుకునే సమయాల్లో ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకోవాలి. సాధారణంగా ఖాతా నంబర్‌ను ఎడమవైపు నుంచి కుడి వైపునకు చదవడం మనకు అలవాటు. అయితే, నగదు లావాదేవీల సమయంలో ఖాతా నంబర్లను ఒకసారి కుడిచేతి వైపు నుంచి ఎడమవైపునకు చదివి క్రాస్ చెక్ చేసుకోవడం మంచి విధానం. దీనికంటే ఉత్తమమైనది ఏమంటే…? ముందు అకౌంట్ డిటైల్స్ యాడ్ చేసుకుని ఎన్ఈఎఫ్టీ లావాదేవీలో కేవలం ఒక రూపాయిని  మాత్రమే మొదటిసారి ట్రాన్స్ ఫర్ చేసి చూడాలి. అది అవతలి వ్యక్తి ఖాతాను చేరిందా? లేదా? చూసుకుని అప్పుడు అసలు మొత్తాన్ని కావాలనుకుంటే ఎన్ఈఎఫ్టీలోనూ లేదంటే ఆర్టీజీఎస్ లోనూ పంపించుకుంటే సరి.

Tuesday, October 4, 2016

Heart wrenching message.

1. జీవితంలో ఎప్పుడైనా
       ఎవరి నైనా పనికి రాని వారిగా
         పరిగణించ వద్దు ఎందుకంటే
           చెడిపోయిన గడియారం
             కూడ రోజుకు రెండు సార్లు
               సరైన సమయం
                  సూచిస్తుంది

2. ఎప్పుడూ ఇతరుల తప్పులను
      అన్వేషించే వ్యక్తి అందమైన
         పుష్పాల పరిమళాలను
           వదలి పుండు మీద వాలే
             ఈగ లాంటి వాడు

3. పేదరికం ధరిచేరినప్పుడు
      ఆప్తమిత్రులు కూడ
        దూరమైతారు అదే
          ధనవంతులైనప్పుడు
            తెలియని వారు కూడ
               మిత్రులవుతారు

4. ఒక్క సారి నవ్వుతూ చూడు
      ప్రపంచంలో ఉండే అందాలన్ని
        నీ సొంతమవ్వుతాయి కానీ
          తడిసిన కనురెప్పలతో
             చూసే అద్దంకూడ మసక
                బారి పోతుంది

5. తొందరగా దొరికేది ఏదైనా
       ఎక్కువకాలం మన్నికరాదు
         ఎక్కువకాలం మన్నిక
           వచ్చేది అంతతొందరగా
              దొరకదు

6. జీవితంలో వచ్చే చెడు రోజులు
      కూడా మన మంచి కొరకే
        అనుకోవాలి అప్పుడే
          తెలుస్తుంది నిజమైన
            స్నేహితులు ఎవరైనది

7. మనిషికి రోగాలు కుందేలు లాగా
      వస్తాయి తాబేలు లాగా
        వెళ్లుతాయి కానీ డబ్బులు
          తాబేలు లాగ వస్తాయి
             కుందేలు లాగా
                వెళ్లుతాయి

8. చిన్న చిన్న మాటల్లో ఆనందాన్ని
       వెతకటం అలవాటు
         చేసుకోవాలి ఎందుకంటే
           పెద్ద పెద్ద మాటలు
             జీవితంలో చాలా
                అరుదుగా చోటు
                   చేసుకుంటాయి

9. ఈశ్వరుని ప్రార్ధించినప్పుడు
      నాకు ఏమి ఇవ్వలేదని
        బాధపడకు ఎందుకంటే
          నీకు అక్కడ ఇవ్వక
            పోయినా నీకు నచ్చిన
              చోట నీకు ఈశ్వరుడు
                నచ్చినవిధంగా ఇస్తాడు

10. నిత్యము ఎదురయ్యే
        అపజయాలను చూసి
          నిరాశ చెందకు కానీ
            ఒక్కోసారి తాళం చెవి
              గుచ్చంలో ఉండే ఆఖరి
                తాళం చెవి కూడ తాళం
                   తెరుస్తుందని
                      గమనించు

11. ఈ సమాజంలో నేను ఒక్కడిని
         ఏంచేయగలననీ ప్రతి మనిషీ
           నిరాశ చెందుతుంటాడు
             కానీ ఒక్క సారి తలపైకెత్తి
               చూడు ప్రపంచానికి
                వెలుగునిచ్చే సూర్యుడు
                   కూడ ఒక్కడేనని 

12. బంధవులు ఎంత చెడ్డ వారైనా
         సరే వదులుకోవద్దు
           ఎందుకంటే మురికి నీరు
             దప్పిక తీర్చలేక పోయిన
               కనీసం అగ్గి మంటలు
                 ఆర్పటానికి పనికి
                    వస్తాయి

13. నమ్మక ద్రోహి స్నేహితునికన్నా
        దురాశపరుడు సన్నిహితుడు
          మిన్న మట్టితో చేసిన
            మనుషులు కాగితాలకు
               అమ్ముడు పోతారు

14. మనిషి గా మాట్లాడుట
         రాక పోయినా కనీసం
           పశువుల్లా మౌనంగా
             ఉండటమే ఉత్తమం

15. మనకు మాటలు రాక ముందు
       మనముఏంచెప్పబోతున్నామో
         అమ్మకు అర్థమయ్యేది కాని
           మనము మాటలు అన్ని
             నేర్చిన తరువాత ఇప్పుడు
                మాటమాటకు ప్రతిసారి
                   అమ్మా నీకు అర్థం
                      కాదులే అంటాం

16. కష్టాల్లో ఉన్నప్పుడు మిత్రులు
          దూరమైనారని బాధపడకు
            ఎందుకంటే నీవు ఒక్కనివే
               జయించగలవని వారు
                 నమ్మినందుకు నీవు
                     సంతోషించు

17. సిగ్గు మర్యాద లేని
        ధనవంతు కన్నా
          మంచి మానవత్వం ఉన్న
            పేదరికమే మిన్న

18. జీవితంలో హెచ్చుతగ్గులు
         రావటంకూడ మన మంచి
           కోసమే అనుకోవాలి
             ఎందుకంటే ECG లొ
               వచ్చే సరళరేఖా కూడ
                  మృత్యువును
                     సూచిస్తుంది

19. ఈ రోజుల్లో సంబంధాలు
         రొట్టె తొ సమానమైనవి
           ఎందుకంటే కొద్దిగా మంట
             ఎక్కవైందొలెదో రొట్టె
               మాడి మసి కావటం
                   ఖాయం

20. జీవితంలో మంచి వారి కోసం అన్వేషించ వద్దు ముందు నీవు మంచిగా మారు బహుశా నిన్ను కలిసిన వ్యక్తికి మంచి మనిషి అన్వేషణ పూర్తి
 కావచ్చు నేమో.  


ఏరా నాన్న!
బావున్నావా!?
రొంపా,జ్వరమొ చ్చిందని విన్నాను?
జాగ్రత్త నాన్న!!
వర్షంలో తిరగకురా,
నీకది పడదు!
మీ అమ్మే ఉంటే -
వేడినీళ్ళలో విక్సేసి
నీకు ఆవిరి పట్టుండేది!
కోడలిపిల్లకది తెలియదాయే!!

కోడలంటే గుర్తొచ్చింది
అమ్మాయెలా ఉంది!?
పిల్లలు బావున్నారా!?
నాన్న రేపు వినాయక చవితి కదా -
ఇల్లు శుభ్రంగా కడిగించి,
గుమ్మాలకు నాల్గు మామిడాకులు కట్టు!
పిల్లలు,కోడలితో కలసి
వ్రతపూజ చేసుకోనాన్న!
మంచిజరుగుద్ది!!
వీలైతే బీరువాలో
అమ్మ కోడలిపిల్లకు ఇష్టపడి
కొన్న పట్టుచీరుంటుంది,
పూజనాడైనా కట్టుకోమను
కళకళలాడుతూ లక్ష్మీదేవిలా ఉంటుంది!
తనకిష్టం లేదంటే బలవంత పెట్టకు నాన్న!!

పిల్లలు బాగా చదువుకుంటున్నారా!?
ఎప్పుడూ పననక
వాళ్ళతో కూడా కొంచెం గడపరా!
పాపం పసివాళ్ళు బెంగపెట్టుకు పోతారు!!
రాత్రులు నీతికథలు చెప్పు
హాయిగా నిద్రపోతారు!!

ఇక నాగురించంటావా!?
బానే ఉన్నానురా!
నువ్వీ ఆశ్రమంలో చెర్పించి
వెళ్ళిననాటి నుండి ఏదో అలా కాలక్షేపమైపోతుంది!
నాలాంటి వయసు పైబడిన వాళ్ళందరం
గతాన్ని నెమరేసుకుంటూ గడిపేస్తున్నాం!!

ఈమద్య మోకాళ్ళు
కొంచెం నొప్పెడుతున్నాయి.
అయినా పర్లేదులే పోయిన పండుగకు
నువ్వు కొనిచ్చిన జండూబాం అలాగే ఉంది!
అది రాసుకుంటున్నానులే!!

అన్నట్లు చెప్పడం మరిచా -
మొన్న ఆశ్రమానికి దొరలొచ్చి
మాకు రెండేసి జతల బట్టలిచ్చి వెళ్ళారు!
నాకీ సంవత్సరానికి అవి సరిపోతాయి
కాబట్టి నాకు బట్టలేం కొనకు,
ఆ డబ్బులతో కోడలుపిల్లకు
ఓ చీర కొనిపెట్టు సంతోషిస్తుంది!
ఈమద్య చూపు సరిగా ఆనక
అక్షరాలు కుదురుగా రావడం లేదు,
వయసు పైబడిందేమో
చేతులు కూడా కాస్త వణుకుతున్నాయ్!

అన్నట్లు మొన్నొకటోతారీఖున
అందుకున్న పెంక్షన్ డబ్బులు
నువ్వు పంపిన కుర్రోడికిచ్చాను అందాయా?!
ఇక్కడివాళ్ళు కళ్ళజోడు మార్పించుకోమన్నారు.
కానీ నీకేదో అవసరమన్నావు కదా
అందుకే పంపేసాను!
అవసరం తీరిందా నాన్న!

బాబూ ఒక్క విషయంరా....!
ఈమద్య ఎందుకో అస్తమాను
మీ అమ్మ గుర్తొస్తుంది!
నీరసమెక్కువై గుండె దడగా కూడా ఉంటుంది,
మొన్నామద్య రెండు,మూడు సార్లు
బాత్రూంలో తూలి పడిపోయాను కూడా
పెద్దగా ఏమీ కాలేదు గానీ,
తలకు చిన్న దెబ్బ తగిలిందంతే!!
నాకెందుకో పదేపదే
నువ్వే గుర్తొస్తున్నావు నాన్న!

నీకేమైనా ఖాళీ ఐతే -
ఈ నాన్ననొచ్చి ఒకసారి చూసిపోరా!
ఆ తరువాత నాకేమైనా హాయిగా పోతాను!!

చివరిగా ఒక్క కోరిక నాన్న!
నాకేమన్నా అయ్యి
నువ్వు రాకుండానే నే పోతే -
నన్నిక్కడ ఆనాధలా ఒదిలేయక -
మనపొలంలో మీ అమ్మకు నే కట్టించిన
సమాధి ప్రక్కనే నన్నూ పండించరా!!
ఈ ఒక్క కోరికా తీర్చు నాన్న!!
ఇక నేనేమీ కోరుకోను!!

విసిగిస్తున్నానేమో..
ఉంటాను నాన్న!!
ఆరోగ్యం జాగ్రత్త!!
                          ప్రేమతో,
                         నీ నాన్న!!

No words, Heart wrenching message.

-కవిత...
క- గుణింతముతో వ్రాసానో కవితను..
కా-స్తంత మీ సమయాన్ని వెచ్చించి చదవమంటాను..
కిం-చిత్ దయ ఎదుటివారిపై చూపమంటాను..
కీ-ర్తి ప్రతిష్ఠలకై ప్రాకులాడడం ఏలంటాను..
కు-బేరుడేల కుచేలుడిలా ఉండమంటాను..
కూ-డబెట్టినవి ఏవీ మనవెంట రావని అంటాను..
కృ-త్రిమమైన ప్రేమాభిమానాలు వలదంటాను..
కౄ-రత్వాన్ని మించిన పాపమేదీ లేదంటాను..
కెం-పులు, కాసులు మనకెందుకని అంటాను..
కే-టుగాళ్ళతో సహవాసమే మనకి వద్దని అంటాను..
కై-లాసగిరికి మార్గము మంచితనమేనంటాను..
కొ-ద్దో గొప్పో మంచిపేరుంటే అదే చాలనుకుంటాను..
కో-టి విద్యల కూడులో కొంతైనా పరులకి పెట్టాలంటాను..
కౌ-సల్య సుప్రజా రామలకి కొంత సమయం కేటాయించమంటాను..
కం-టికి కునుకు పడ్డాక పరుపైనా కటికనేలైనా ఒకటేనంటాను..
కః-తో ఏదైనా ఒక మంచి మాటని సెలవీయండని అంటాను.

హైం ద వ సం స్కృ తి లో 8, 18 అం కె ల కు గ ల ప్రా ధా న్య త

హైం ద వ సం స్కృ తి లో 8, 18     అం కె ల కు  గ ల  ప్రా ధా న్య త


అష్ట లక్ష్మి: ఆది లక్ష్మి, ధాన్యలక్ష్మి , ధైర్యలక్ష్మి , గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి

అష్టాదశ పీఠాలు:

1. శ్రీ శాంకరీదేవి ( ఎకోమలి , శ్రీలంక )
2. శ్రీ కామాక్షీదేవి (కంచి, తమిళనాడు)
3. శ్రీ శృంఖలాదేవి ( ప్రదుమ్నం, గుజరాత్)
4. శ్రీ చాముండేశ్వరీదేవి ( మైసూరు,కర్నాటక)
5. శ్రీ జోగులాంబాదేవి (అల్లంపురం, ఆంధ్రప్రదేశ్)
6. శ్రీ భ్రమరాంబాదేవి ( శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్)
7. శ్రీమహాలక్ష్మి దేవి ( కొల్హాపూర్, మహారాష్ట్ర)
8. శ్రీ ఏకవీరాదేవి ( నాందేడ్ , మహారాష్ట్ర )
9. శ్రీమహాకాళీదేవి ( ఉజ్జయినీ, మధ్యప్రదేశ్ )
10. శ్రీ పురుహూతికాదేవి (పీఠాపురం, ఆంధ్రప్రదేశ్ )
11. శ్రీ గిరిజాదేవి ( కటక్, ఒరిస్సా)
12. శ్రీ మానిక్యాంబాదేవి ( ద్రాక్షారామం, ఆంధ్రప్రదేశ్)
13. శ్రీ కామరూపిణీదేవి (గౌహతి, అస్సాం)
14. శ్రీ మాధవేశ్వరి దేవి ( ప్రయాగ, ఉత్తరప్రదేశ్)
15. శ్రీ వైష్ణవీదేవి ( జ్వాలాకేతం, హిమాచలప్రదేశ్)
16. శ్రీ మాంగల్య గౌరీదేవి ( గయా, బీహార్)
17. శ్రీ విశాలాక్షీదేవి ( వారణాశి, ఉత్తరప్రదేశ్)
18. శ్రీ సరస్వతీదేవి ( జమ్మూ కాశ్మీర్)


అష్టా దశ పురాణాలు:

1. బ్రహ్మపురాణం
2. పద్మపురాణం
3. నారద పురాణం
4. మార్కండేయపురాణం
5. విష్ణుపురాణం
6. శివపురాణం
7. భాగవతపురాణం
8. అగ్నిపురాణం
9. భవిష్యపురాణం
10. బ్రహ్మవైవర్త పురాణం
11. లింగపురాణం
12. వరాహపురాణం
13. స్కందపురాణం
14. వామనపురాణం
15. కుర్మపురాణం
16. మత్స్యపురాణం
17. గరుడపురాణం
18. బ్రహ్మాండపురాణం


అయ్యప్ప స్వామి గుడి మెట్లు:18

1. పొన్నంబలమేడు
2. గౌదేంమల
3. నాగమల
4. సుందరమల
5. చిత్తంబలమల
6. ఖల్గిమల
7. మాతంగమల
8. మైలదుమల
9. శ్రీపదమల
10. దేవరమల
11. నిలక్కలమల
12. తలప్పరమల
13. నీలిమల
14. కరిమల
15. పుతుసేరిమల
16. కలకేట్టిమల
17. ఇంచిప్పరమల
18. శబరిమల


అష్టదిక్పాలకులు:

1. తూర్పు (ఇంద్రుడు)
2. ఆగ్నేయం (అగ్ని)
3. దక్షిణం (యముడు)
4. నైరుతి (నిరుతి)
5. పశ్చిమం (వరుణుడు)
6. వాయువ్యం (వాయువు)
7. ఉత్తరం (కుబేరుడు)
8. ఈశాన్యం (ఈశానుడు)


అష్టమూర్తులు:

1. భూమి
2. ఆకాశం
3. వాయువు
4. జలము
5. అగ్ని
6. సూర్యుడు
7. చంద్రుడు
8. యజ్గ్యము చేసిన పురుషుడు.


అష్టఐశ్వర్యాలు:

1. ధనము
2. ధాన్యము
3. వాహనాలు
4. బంధువులు
5. మిత్రులు
6. బృత్యులు
7. పుత్రసంతానం
8. దాసిజనపరివారము


అష్టకష్టాలు:

1. అప్పు
2. యాచన
3. ముసలితనం
4. వ్యభిచారం
5. చోరత్వం
6. దారిద్యం
7. రోగం
8. ఎంగిలి భోజనం


అష్టఆవరణాలు:

1. విభూది
2. రుద్రాక్ష
3. మంత్రము
4. గురువు
5. లింగము
6. జంగమ మాహేశ్వరుడు
7. తీర్థము
8. ప్రసాదము


అష్టవిధ వివాహములు:

1. బ్రాహ్మం
2. దైవం
3. ఆర్షం
4. ప్రాజాపత్యం
5. ఆసురం
6. గాంధర్వం
7. రాక్షసం
8. ఫైశాచం


అష్టభోగాలు:

1. గంధం
2. తాంబూలం
3. పుష్పం
4. భోజనం
5. వస్త్రం
6. సతి
7. స్నానం
8. సంయోగం


అష్టాంగ యోగములు:

1. యమము
2. నియమము
3. ఆసనము
4. ప్రాణాయామము
5. ప్రత్యాహారము
6. ధారణ
7. ద్యానము
8. సమాధి

.     

నీరు త్రాగేవిధానము

నీరు త్రాగేవిధానము

drinking water method for good healthజీవిత ఉపయెాగాలు

1. ఉదయం లేచిన వెంటనే నీరు ఎలా త్రాగాలి

జ. గోరు వెచ్చనివి.

2.నీరు త్రాగేవిధానము

జ. క్రింద కూర్చుని నెమ్మదిగా త్రాగాలి.

3.ఆహరం ఎన్ని సార్లు నమలాలి

జ.32 సార్లు.

4. భోజనం నిండుగ ఎప్పుడు తినాలి
జ. ఉదయం.

5. ఉదయం ఎన్ని గంటలలోపు టిఫిన్ తినాలి
జ. సూర్యోదయం అయ్ న 2.30 గం" లోపు.

6.ఉదయం పూట టిఫిన్ తో ఏమి త్రాగాలి
జ. ఫల రసాలు(fruit juice).

7. మధ్యానము భోజనం తర్వాత ఏమిత్రాగాలి
జ. లస్సీ, మజ్జిగ.

8. రాత్రి భోజనం తో ఏమి త్రాగాలి
జ. పాలు.

9. పుల్లటి ఫలములు ఎప్పుటు తినకూడదు
జ. రాత్రి.

10. ఐస్ క్రీం ఎప్పుడు తినాలి
జ. ఎప్పుడూ తినకూడదు.

11.ఫ్రిజ్ లోంచి తీసిన పదార్దాలు ఎంత సేపటికి తినవలెను
జ. గంట తర్వాత.

12. శీతల పానియాలు త్రాగవచ్చున( cool drink )
జ. త్రాగకూడదు.

13. వండిన వంటలను ఎంత సేపటిలో తినాలి
జ. 40 ని.

14.రాత్రి పూట ఎంత తినాలి
జ.  చాలా తక్కువగా, అసలు తిననట్టు.

15. రాత్రి భోజనం ఏ సమయంలో చేయాలి
జ. సూర్యాస్తమయం లోపు.

16. మంచినీళ్ళు భోజనానికి ఎంత ముందు త్రాగాలి
జ. 48 ని.

17. రాత్రిపూట లస్సీ, మజ్జిగ త్రాగవచ్చునా
జ. త్రాగకూడదు.

18. ఉదయం టిఫిన్ తిన్నాక ఏమిచేయాలి
జ. పని.

19.మధ్యాహ్నం భోజనం తర్వాత ఏమి చేయాలి
జ. విశ్రాంతి తీసుకోవాలి.

20.రాత్రి భోజనం తర్వాత ఏమి చేయాలి
జ. 500 అడుగులు నడవాలి.

21. అన్ని వేళలా భోజనం చేసిన తర్వాత ఏమి చేయాలి
జ. వజ్రాసనం వేయాలి.

22. వజ్రాసనం ఎంత సేపు వేయాలి
జ. 5 - 10 ని.

23. ఉదయం లేచిన తర్వాత కళ్ళలో ఏమి వేయాలి
జ. లాలాజలం,( saliva ).

24. రాత్రి ఎన్నింటికి పడుకోవాలి
జ. 9 - 10 గం.

25. 3 విషముల పేర్లు
జ. పంచదార, మైదా, తెల్లటి ఉప్పు.

26. మధ్యాన్నం తినే కూరల్లో ఏమి వేసి తినాలి
జ. వాము.

27. రాత్రి పూట సలాడ్ తినవచ్చునా
జ. తినరాదు.

28. ఎల్లప్పుడూ భోజనం ఎలా చేయాలి
జ. క్రింద కూర్చుని మరియు బాగా నమిలి .

29. విదేశీ వస్తువులను కోనవచ్చునా
జ. ఎప్పుడూ కోనరాదు (Buy) .‌

30. టీ ఎప్పుడు త్రాగాలి
జ. అసలు ఎప్పుడు త్రాగకూడదు.

31. పాలలో ఏమి వేసుకుని త్రగాలి
జ. పసుపు.

32. పాలలో పసుపు వేసుకోని ఎందుకు త్రాగాలి
జ. క్యాసర్ రానివ్వకుండా ఉంటుంది.

33. ఏ చికిత్సా విధానం  మంచిది
జ. ఆయుర్వేదం.

34. వెండి, బంగారు పాత్రల్లో నీరు ఎప్పుడు త్రాగాలి
జ. అక్టోబరు నుంచి మార్చ్ ( చలికాలంలో).

35. రాగి పాత్రలో నీరు ఎప్పుడు త్రాగాలి
జ. జూన్ నుంచి సెప్ట్ంబర్ ( వర్షాకాలంలో).

36. మట్టి పాత్రలో నీరు ఎప్పుడు త్రాగాలి
జ. మార్చ్ నుంచి జూన్ ( ఎండాకాలంలో).

37. ఉదయం పూట మంచినీరు ఎంత తీసుకోవాలి
జ. సుమారు 2,3 గ్లాసులు.

38. ఉదయం ఎన్ని గంటలకు నిద్రలేవాలి
జ. సూర్యోదయాని 1.30 ముందుగా.

మిత్రులారా ఈ post నచ్చితే share చేయటం మర్చిపోకండి...  

Saturday, October 1, 2016

జోక్స్,

 టీచర్ : సతీ సావిత్రి కధ లో  నువ్వు  తెలుసుకున్నది  ఏమిటి? చెప్పరా.


స్టూడెంట్  : భార్య నుండి  భర్తను  ఆ  యముడు కూడా  కాపాడలేడని!!


😀😝

సరసు(డాక్టర్ తో): మా వారు రాత్రిళ్ళు నిద్ర పోకుండా ఒకటే మాటలాడుతున్నారండి.
డాక్టర్: మీ వారికి పగలు మాటలాడే అవకాశం ఇవ్వమ్మా.

😁😁😁😁

బంటి (చంటి తో) : పెళ్లిచూపులకు వెళితే తన్ని పంపించారురా.
చంటి : ఎందుకు?
బంటి : మా అమ్మాయి బంగారం అన్నారురా , అయితే తాకట్టు పెట్టుకోవచ్చా అని అడిగానంతే.

😛😛😛😛

(అమ్ములు వాళ్ళ నాన్నా వెంకటప్పతో )
అమ్ములు:"మన కుటుంబానికి ఇంత అన్యాయము చేసిన ఆ చంటిగాడిని
చంపి పగ తీర్చుకుంటా నాన్నా!" పిడికిలి బిగించి శపథం చేసింది
అమ్ములు వాళ్ళ నాన్నాతో.
వెంకటప్ప:"ఒకేసారి చంపకు.........పెళ్ళిచేసుకో............
.ప్రతిక్షణం కుళ్ళి కుళ్ళి చావాలివాడు" చెప్పాడు వాళ్ళ నాన్న

😄😄😄😄

ముత్యాలరావు(సుబ్బారావుతో):"ఆ డాక్టర్ నిజంగా దేవుడే! మా ఆవిడ బద్దకాన్ని, ఆయాసాన్నిచిటికెలో పోగొట్టాడు తెలుసా?" అన్నాడు ముత్యాల రావు.
సుబ్బారావు:ఎలా?
ముత్యాలరావు: "వయసు పెరుగుతోంది కదమ్మా అన్నాడు. అంతే ఆ మరుసటి రోజు నుండే చకచక అన్ని పనులు చేస్తోంది."

😀😀😀😀

చింతామణి:(అప్పారావు తో): ఏమండీ శాంపిల్ అంటే ఏమిటి?
అప్పారావు: పెళ్లి చూపుల్లో నువ్వు చూపిన వినయం లాటింది!

😀😀😀😄

(చింతామణి, వరహాల రావు భార్యాభర్తలు)
ఇద్దరు ఒక సాయంత్రం నడుస్తుండగా గాడిద ఎదురొచ్చింది.
వరహాల రావుని ఆట పట్టించాలనుకున్న చింతామణి "ఏమండీ మీ బంధువొస్తోంది...పలకరించండి"
అంది నవ్వుతూ.
వరహాల రావు: "నమస్తే అత్త గారు..............బాగున్నారా?"
నేను మీ అమ్మాయి "Evening Walk" కి బయలుదేరామండి" అని
పలకరించాడు వరహాల రావు.

😀😀😄😄

అప్పారావు:-- "ఇలా మనం పార్కులో కబుర్లు చెబుతూ ఈ చిప్స్ తింటుంటే నీకే మనిపిస్తోంది?"
.
ఐశ్వర్య :-- నువ్వే ఎక్కువ తింటున్నావనిపిస్తోంది!

😀😀😄😄

దోమకు చీమ కి పెళ్లి అయింది,
ఫస్ట్ నైట్ రోజున దోమ బయట కూర్చున్నది,
ఆ దారంట వెళ్తున్న ఏనుగు ఏంటి కొత్తగా పెళ్లి చేసుకొని బయట కూర్చున్నావేంటీ?
దోమ : దొంగ ముండ ఆల్ ఔట్ ఆన్ చేసి పడుకుంది సార్ ..

😄😄😄😄

ఇక మన పెళ్ళి జరగదు
నిన్న మీ ఇంటికి వెళ్ళా... అప్పుడే అర్దమైంది ఇక మన పెళ్ళి జరగదని..
ఎమైంది. మానాన్నని కలిసావా ?
.
-
లేదు. మీ చెల్లిని చూసా. కత్తిలా ఉంది.

😄😄😄😄

భర్త భార్యతో : నేను పోయినతరువాత నాలాంటివాడు నీకు దొరకడు తెలుసా?
.

భార్య: అప్పుడు కుడా మీలాంటి వాడు ఎందుకు లెండి.


😄😄😄😄

పంతులు : ఒరేయ్ బబ్లూ వాస్తవానికి భ్రమకి తేడా ఏంటి రా ?
.
బబ్లూ : మీరు  చెప్పడం వాస్తవం అది మేము వింటున్నామనుకోవడం భ్రమ

 ఒక రోజు అడవిలో ఒక చిరుత పులి సిగిరెట్ తాగుతుంది...

 ఇంతలో అక్కడికి ఒక చిట్టెలుక వచ్చి, " సోదరా ఇలాంటి అలవాట్లు మానెయ్. పద మన అడవి ఎంత అందంగా ఉంటుందో చూపిస్తాను ".

సరే అని చిరుత సిగరెట్ పక్కన పడేసి దాని వెంట వెళ్ళింది.

కొంత దూరం వెళ్ళాక ఒక ఏనుగు గంజాయి తీసుకుంటూ కనిపించింది. దానికి కూడా అలానే చెప్పి వెంట తీసుకు వెళ్ళింది చిట్టెలుక.

ఇంకొంత దూరం వెళ్ళాక ఒక సింహం విస్కీ తాగుతూ కనిపించింది. ఆ సింహానికి కూడా అదే మాట చెప్పింది.

సింహం తన చేతిలో ఉన్న గ్లాస్ పక్కన పెట్టి ఆ చిట్టెలుకని నాలుగు పీకింది..

అది చూసి ఏనుగుకి కోపం వచ్చింది.. " ఎందుకు పాపం దాన్ని అలా కొడతావ్? "


" ఇది నిన్న కూడా ఇలానే '  ' తాగి వచ్చి నన్ను 3 గంటలు అడవి అంతా తిప్పింది..."

మీ శరీరం గురించి మీకు తెలియని అద్దిరిపోయే విషయాలు! తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

: : మీ శరీరం గురించి మీకు తెలియని అద్దిరిపోయే విషయాలు! తెలిస్తే షాక్ అవ్వాల్సిందే


మానవ శరీరంలో మీరు ఊహించని ఎన్నో అధ్బుతాలు దాగి ఉన్నాయి. మీ గురించి మీరు అంచనా వేసిన దానికంటే కూడా ఎన్నో రెట్లు ఎక్కువ సామర్ధ్యం మీలో ఉందన్న విషయం మీకు తెలిసుండకపోవచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు వింటే ఆశ్చర్యపోక మానరు..!!

మానవ శరీరం గురించి అద్దిరిపోయే విషయాలు:

* మన కడుపులో ఉండే ఆమ్లము (acid) రేజర్ బ్లేడ్ లను కూడా కరిగించగలదు.

అలాగని ట్రై చేసేరు..!!

* మనం రోజుకి సగటున 40 నుండి 100 వెంట్రుకలు కోల్పోతున్నాం.

కొత్తవి కూడా వస్తాయి లెండి..!!

* మన ఒక్కో వెంట్రుక 3 నుండి 7 సంవత్సరాల వరకు పెరుగుతూనే ఉంటాయి.

తర్వాత అవి రాలిపోయి వాటి స్థానంలో వేరేవి పెరుగుతాయిలెండి..!!

* ఒక్క అంగుళం చర్మం మీద 3 కోట్లకు పైగా బాక్టీరియా ఉంటుంది.

ఎం బంటీ నీ సబ్బు స్లో నా ఏంటి..??

* రోజుకి మన గుండె ఉత్పత్తి చేసే శక్తితో ఓ సాధారణ ట్రక్ ని 30 కిలో మీటర్ల వరకు నడిపించవచ్చు.

ఇంకెప్పుడైనా పెట్రోల్ అయిపోతే ఇది ట్రై చేయండి..!!

* లేవకుండా ఒక మనిషి నిద్రించిన రికార్డు 11 రోజులు.

మీరు ఆ రికార్డు బ్రేక్ చేస్తారా..??

* 90 శాతం కి పైగా జబ్బులు స్ట్రెస్ వల్లనే అని తేలింది.

కొన్ని విషయాలు లైట్ తీసుకో భయ్యా..!!

* శరీరం నుండి తల వేరు చేసినా.. తల 15 సెకన్ల వరకు స్పృహ కోల్పోదు.

ఎమన్నా చెప్పాలనుకుంటే త్వరగా చెప్పేయ్..!!

* మీరు పడుకునే గది ఎంత చల్లగా ఉంటె... మీకు పీడ కలలు వచ్చే అవకాశాలు అంత పెరుగుతాయి.

వెచ్చగా ఉంటె కలలోకి అప్సరసలు వస్తారని కాదు..!!

* నిద్రించే సమయంలో మన వాసనా పీల్చే భావం పనిచేయదు.

గ్యాస్ స్టవ్ సరిగ్గా కట్టేసారో లేదో చూసుకోండి..!!

* మనవ శరీరం లో ఉన్న DNA మరియు అరటిపండులో ఉన్న DNA 50 శాతం కలుస్తాయి.

అరటిపండులో మీ చుట్టాలెవరైనా ఉన్నారేమో చెక్ చేసుకోండి..!!

* మనం తిన్నది అరగడానికి మన శరీరంలో ఏవైతే సహాయ పడతాయో... చనిపోయిన 3 రోజులకి అవే మనల్ని తినడం మొదలపెడతాయి.

బాస్ అంటే ఎంత మర్యాదో చూడండి..!!

* గుండె పోటు వల్ల చనిపోయే వారిలో 20 శాతం మంది సోమవారం నాడే చనిపోతారు.

ఉద్యోగం తల్చుకుంటే అంత భయం మరి..!!

* 7 గంటల కన్నా తక్కువ నిద్రిస్తే.. త్వరగా చనిపోతారు.

ఫోన్ ని పక్కకు పెట్టి నిద్ర పై ద్యాస పెట్టండి. ఏమో మీరు చనిపోయే టైం కి కొత్త ఫోన్ వస్తే అది వాడకుండానే చనిపోతారేమో..!! ఒక్కసారి ఆలోచించండి.

* వెలి ముద్రలు ఉన్నట్టే.. నాలుక ముద్రలు కూడా ఒకరితో ఒకరికి పోలిక లేకుండా ఉంటాయి.

బలవంతంగా ఎవరైనా మీ ఆస్తి లాక్కుందాం అనుకుంటే.. నేను వెలి ముద్ర వేయను.. నాలుక ముద్ర వేస్తాను అని చెప్పండి..!!

* ఒకవేళ మన కళ్ళు కెమెరా అయితే.. 576 మెగా పిక్సెల్స్ ఉన్న కెమెరాలా ఉండేది.

ప్రపంచంలో ఉన్న బెస్ట్ కెమెరా మీ దగ్గరే ఉంది.!!

* మనిషి కన్నుని తయ్యారుచేయాలంటే కొన్ని లక్షల కోట్లు కర్చవుతుందట.

వాటిని అమ్మితే అంత రావులెండి..!!

* మన నోరు 100 కోట్లకు పైగా రుచులను గుర్తించగలదు.

ఏదిపడితే అది ట్రై చేయకండి..!!

* మీకు 60 ఏళ్ళు వచ్చే సరికి నోటిలో ఉండే టేస్ట్ బడ్స్ సగానికి పైగా చనిపోతాయి.

అంత లోపే ఎం తినాలనుకుంటున్నారో అవి తినేయండి..!!

* మీకు ఎంత ఎక్కువ IQ ఉంటె.. అన్ని కలలుగంటారు.

కలలు రాకపోతే మీకు IQ లేదని కాదులెండి..!!

* మన కాళ్ళ గోర్లకన్నా చేతి గోర్లు 4 రెట్లు త్వరగా పెరుగుతాయి.

అంటే చేతి గోర్లు వారానికోసారి కట్ చేసుకుంటే... కాళ్ళ గోర్లు ఎన్ని రోజులకి కట్ చేయాలి..??

* చింపాంజీ శరీరం పై ఉన్నన్ని వెంట్రుకలే మన శరీరం పై కూడా ఉంటాయి. కాకపోతే మనవి చాలా సన్నగా ఉంటాయి.

కావాలంటే ఈ సారి చింపాంజీ కనిపించినప్పుడు లెక్కపెట్టుకోండి..!!

* మన శరీరం 30 నిమిషాలలో ఉత్పత్తి చేసే వేడితో 114 లీటర్ల నీటిని వేడి చేయవచ్చు.

రేపటి నుండి హీటర్ వాడడం మానేయండి..!!

* మన చర్మం నిమిషానికి 50000 సెల్స్ ని వదిలేస్తుంది. అంటే జీవిత కాలంలో అది 18 కిలోలనమాట.

పౌడర్ అవసరం లేదిక..!!

* మీ బెడ్ పై ఉండే దుమ్ములో సగానికి పైగా మీ చర్మందే.

ఇకనుండి బయట దుమ్ము ఎక్కువగా ఉందని బాధపడకండి..!!

* మన బ్రెయిన్ 25 వాట్స్ విద్యుత్త్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ పవర్ తో ఓ బుల్బ్ ని వెలిగించవచ్చు.

ఇంకెప్పుడైనా రాత్రి పూట కరెంటు పోతే భయపడకండి..!!

* మీకు 40 ఏళ్ళు వచ్చే వరకు మీరు ఎదుగుతూనే ఉంటారు.

రోజు కొల్చుకోండి..!!

* మన బ్రెయిన్ పగటి పూటకన్నా రాత్రి పూటనే చురుకుగా పనిచేస్తుంది.

అందుకే కదా ఆఫీస్ లో కన్నా.. పార్టీలలో ఎక్కువ యాక్టివ్ గా ఉంటారు..!!

* ఒక సంవత్సరంలో 15000 కలలుగంటారట.

మీకు వాటిలో ఎన్ని గుర్తున్నాయి..??

* మీరు వింటున్న మ్యూజిక్ కి తగ్గట్టుగా మీ గుండె కొట్టుకోవడం ప్రారంభమవుతుంది.

జాగ్రత్త మరీ స్లోగా ఉన్న సాంగ్ వినకండి..!!

మీకు ఈ పోస్టు కనుక నచ్చితే షేర్ చేయడం మరువకండి..!! ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీ ముందుకు తెచ్చేందుకు  ఎల్లపుడు ముందుంటాను!!

భక్తుడి తపస్సుకు మెచ్చి దేవుడు ప్రత్యక్షమయ్యాడు

భక్తుడి  తపస్సుకు మెచ్చి 

దేవుడు

ప్రత్యక్షమయ్యాడు ....

ఏమి వరం కావాలి భక్తా ?????

భక్తుడు = ఈ ప్రపంచం లో ఉన్న వాళ్ళందరకు ఒక్కొక్కరికి 100 కోట్లు ఇవ్వండి!

దేవుడు = ఒకే ఇస్తాను .....  అలా వచ్చిన డబ్బుతో ఏమి చేస్తావు ???

భక్తుడు = డబ్బు వుంటే ఏదైనా చెయ్యొచ్చు .... ముందుగా ఒక ఇల్లు కట్టుకొంటాను

 దేవుడు = ఎవరు కడతారు ????

భక్తుడు = ఎవరేమిటి డబ్బు పారేస్తే ఈ వూళ్ళో ఎవరినా కడతారు

 దేవుడు = ఎవరికీ పారేస్తావు ???  వాళ్ళ దగ్గర కుడా 100 కోట్లు డబ్బు ఉంటుంది కదా ....  వాళ్ళే నీకు పారేస్తారు ఇల్లు కట్టివ్విమని......

భక్తుడు = ఈ ఊళ్ళో ఎవరు కట్టకపోతే ప్రక్క ఊరినుంచి కూలిలను తెప్పిస్తాను ఎక్కువ డబ్బు ఇచ్చి .....

 దేవుడు = ఆ పక్క ఊరిలో వాళ్ళందరి దగ్గర కుడా 100 కోట్లు వుంటాయి కదా

భక్తుడు =  ఎవరు కట్టటానికి ముందుకు రాకపోతే మంచి కట్టిన ఇంటినే కొంటాను నాకు డబ్బుకు లోటు లేదు కదా.......

దేవుడు = ఎవరు అమ్ముతారు ????  ఎవరికీ డబ్బు అవసరం ఉంటుంది ?????  అందరి దగ్గర 100 కోట్లు వుంటాయి కదా

భక్తుడు =  సరే ఇదే పాకలో ఉంటాను ..... రోజు మంచి తిండి తింటాను

దేవుడు =  ఎక్కడా ????
⭕ భక్తుడు = ఈ వూళ్ళో అనేక హోటల్ వున్నాయి తిండికి లోటేమిటి ??

దేవుడు = ఎవరు వండుతారు ?????
⭕ భక్తుడు = హోటల్ కాకపొతే మంచి బియ్యం కొనుక్కొంటాం!

దేవుడు =  ఎవరు పండిస్తారు ??? అందరి దగ్గరా డబ్బులు వుంటాయి కదా ...

భక్తుడు = అసలు నీ ఉదేశ్యం ఏమిటి స్వామి ??????

దేవుడు =  అందరి దగ్గరా అవసరానికి మించి డబ్బులు వున్నప్పుడు ఎవరు మాత్రం కష్టపడతారు ?????  అందరు కూర్చొని తిన్దామనుకొంటారు కదా ....

భక్తుడు =  నిజమే సామి నాకు అర్ధం అయ్యింది ......

దేవుడు =  అందుకే  కష్టే ఫలి అన్నారు .....  కష్టానికి తగ్గ ఫలితమే రావాలి కాని అంతకు మించి వస్తే అనర్ధమే ...... 

భక్తుడు =  సామీ నా కళ్ళు తెరిపించావు ...  😜నాకు ఒక్కడికే 100 కోట్లు ఇవ్వు సామి! ఇంకెవరికి ఇవ్వకు! .....

దేవుడు = మీరు మారరురా! మారరు గాక మారరు.....!                                       




మానవ శరీరంలో మీరు ఊహించని ఎన్నో అధ్బుతాలు దాగి ఉన్నాయి. మీ గురించి మీరు అంచనా వేసిన దానికంటే కూడా ఎన్నో రెట్లు ఎక్కువ సామర్ధ్యం మీలో ఉందన్న విషయం మీకు తెలిసుండకపోవచ్చు. ఇప్పుడు మేము చెప్పబోయే విషయాలు వింటే ఆశ్చర్యపోక మానరు..!!

మానవ శరీరం గురించి అద్దిరిపోయే విషయాలు:

* మన కడుపులో ఉండే ఆమ్లము (acid) రేజర్ బ్లేడ్ లను కూడా కరిగించగలదు.

అలాగని ట్రై చేసేరు..!!

* మనం రోజుకి సగటున 40 నుండి 100 వెంట్రుకలు కోల్పోతున్నాం.

కొత్తవి కూడా వస్తాయి లెండి..!!

* మన ఒక్కో వెంట్రుక 3 నుండి 7 సంవత్సరాల వరకు పెరుగుతూనే ఉంటాయి.

తర్వాత అవి రాలిపోయి వాటి స్థానంలో వేరేవి పెరుగుతాయిలెండి..!!

* ఒక్క అంగుళం చర్మం మీద 3 కోట్లకు పైగా బాక్టీరియా ఉంటుంది.

ఎం బంటీ నీ సబ్బు స్లో నా ఏంటి..??

* రోజుకి మన గుండె ఉత్పత్తి చేసే శక్తితో ఓ సాధారణ ట్రక్ ని 30 కిలో మీటర్ల వరకు నడిపించవచ్చు.

ఇంకెప్పుడైనా పెట్రోల్ అయిపోతే ఇది ట్రై చేయండి..!!

* లేవకుండా ఒక మనిషి నిద్రించిన రికార్డు 11 రోజులు.

మీరు ఆ రికార్డు బ్రేక్ చేస్తారా..??

* 90 శాతం కి పైగా జబ్బులు స్ట్రెస్ వల్లనే అని తేలింది.

కొన్ని విషయాలు లైట్ తీసుకో భయ్యా..!!

* శరీరం నుండి తల వేరు చేసినా.. తల 15 సెకన్ల వరకు స్పృహ కోల్పోదు.

ఎమన్నా చెప్పాలనుకుంటే త్వరగా చెప్పేయ్..!!

* మీరు పడుకునే గది ఎంత చల్లగా ఉంటె... మీకు పీడ కలలు వచ్చే అవకాశాలు అంత పెరుగుతాయి.

వెచ్చగా ఉంటె కలలోకి అప్సరసలు వస్తారని కాదు..!!

* నిద్రించే సమయంలో మన వాసనా పీల్చే భావం పనిచేయదు.

గ్యాస్ స్టవ్ సరిగ్గా కట్టేసారో లేదో చూసుకోండి..!!

* మనవ శరీరం లో ఉన్న DNA మరియు అరటిపండులో ఉన్న DNA 50 శాతం కలుస్తాయి.

అరటిపండులో మీ చుట్టాలెవరైనా ఉన్నారేమో చెక్ చేసుకోండి..!!

* మనం తిన్నది అరగడానికి మన శరీరంలో ఏవైతే సహాయ పడతాయో... చనిపోయిన 3 రోజులకి అవే మనల్ని తినడం మొదలపెడతాయి.

బాస్ అంటే ఎంత మర్యాదో చూడండి..!!

* గుండె పోటు వల్ల చనిపోయే వారిలో 20 శాతం మంది సోమవారం నాడే చనిపోతారు.

ఉద్యోగం తల్చుకుంటే అంత భయం మరి..!!

* 7 గంటల కన్నా తక్కువ నిద్రిస్తే.. త్వరగా చనిపోతారు.

ఫోన్ ని పక్కకు పెట్టి నిద్ర పై ద్యాస పెట్టండి. ఏమో మీరు చనిపోయే టైం కి కొత్త ఫోన్ వస్తే అది వాడకుండానే చనిపోతారేమో..!! ఒక్కసారి ఆలోచించండి.

* వెలి ముద్రలు ఉన్నట్టే.. నాలుక ముద్రలు కూడా ఒకరితో ఒకరికి పోలిక లేకుండా ఉంటాయి.

బలవంతంగా ఎవరైనా మీ ఆస్తి లాక్కుందాం అనుకుంటే.. నేను వెలి ముద్ర వేయను.. నాలుక ముద్ర వేస్తాను అని చెప్పండి..!!

* ఒకవేళ మన కళ్ళు కెమెరా అయితే.. 576 మెగా పిక్సెల్స్ ఉన్న కెమెరాలా ఉండేది.

ప్రపంచంలో ఉన్న బెస్ట్ కెమెరా మీ దగ్గరే ఉంది.!!

* మనిషి కన్నుని తయ్యారుచేయాలంటే కొన్ని లక్షల కోట్లు కర్చవుతుందట.

వాటిని అమ్మితే అంత రావులెండి..!!

* మన నోరు 100 కోట్లకు పైగా రుచులను గుర్తించగలదు.

ఏదిపడితే అది ట్రై చేయకండి..!!

* మీకు 60 ఏళ్ళు వచ్చే సరికి నోటిలో ఉండే టేస్ట్ బడ్స్ సగానికి పైగా చనిపోతాయి.

అంత లోపే ఎం తినాలనుకుంటున్నారో అవి తినేయండి..!!

* మీకు ఎంత ఎక్కువ IQ ఉంటె.. అన్ని కలలుగంటారు.

కలలు రాకపోతే మీకు IQ లేదని కాదులెండి..!!

* మన కాళ్ళ గోర్లకన్నా చేతి గోర్లు 4 రెట్లు త్వరగా పెరుగుతాయి.

అంటే చేతి గోర్లు వారానికోసారి కట్ చేసుకుంటే... కాళ్ళ గోర్లు ఎన్ని రోజులకి కట్ చేయాలి..??

* చింపాంజీ శరీరం పై ఉన్నన్ని వెంట్రుకలే మన శరీరం పై కూడా ఉంటాయి. కాకపోతే మనవి చాలా సన్నగా ఉంటాయి.

కావాలంటే ఈ సారి చింపాంజీ కనిపించినప్పుడు లెక్కపెట్టుకోండి..!!

* మన శరీరం 30 నిమిషాలలో ఉత్పత్తి చేసే వేడితో 114 లీటర్ల నీటిని వేడి చేయవచ్చు.

రేపటి నుండి హీటర్ వాడడం మానేయండి..!!

* మన చర్మం నిమిషానికి 50000 సెల్స్ ని వదిలేస్తుంది. అంటే జీవిత కాలంలో అది 18 కిలోలనమాట.

పౌడర్ అవసరం లేదిక..!!

* మీ బెడ్ పై ఉండే దుమ్ములో సగానికి పైగా మీ చర్మందే.

ఇకనుండి బయట దుమ్ము ఎక్కువగా ఉందని బాధపడకండి..!!

* మన బ్రెయిన్ 25 వాట్స్ విద్యుత్త్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ పవర్ తో ఓ బుల్బ్ ని వెలిగించవచ్చు.

ఇంకెప్పుడైనా రాత్రి పూట కరెంటు పోతే భయపడకండి..!!

* మీకు 40 ఏళ్ళు వచ్చే వరకు మీరు ఎదుగుతూనే ఉంటారు.

రోజు కొల్చుకోండి..!!

* మన బ్రెయిన్ పగటి పూటకన్నా రాత్రి పూటనే చురుకుగా పనిచేస్తుంది.

అందుకే కదా ఆఫీస్ లో కన్నా.. పార్టీలలో ఎక్కువ యాక్టివ్ గా ఉంటారు..!!

* ఒక సంవత్సరంలో 15000 కలలుగంటారట.

మీకు వాటిలో ఎన్ని గుర్తున్నాయి..??

* మీరు వింటున్న మ్యూజిక్ కి తగ్గట్టుగా మీ గుండె కొట్టుకోవడం ప్రారంభమవుతుంది.

జాగ్రత్త మరీ స్లోగా ఉన్న సాంగ్ వినకండి..!!

మీకు ఈ పోస్టు కనుక నచ్చితే షేర్ చేయడం మరువకండి..!!                        


ఏమి మనిషి జీవితం రా ఇది.....

ఒక రోజు దేవుడు ఓ కుక్కని తయారు చేసాడు.

దేవుడు అన్నాడు: రోజంతా ఇంటి ముందు కూర్చో.
ఎవరైనా తెలియని వాళ్ళు వస్తే
అరువు.
నేను నీకు 20 ఏళ్ళు ఆయుషుని ఇస్తాను.🤘🏼

🐕కుక్క: స్వామి ఇదేమి బాలేదు… నేను అన్ని
ఏళ్ళు అరవలెను.
 కాబట్టి ఇదుగో 10
ఏళ్ళు నీకు ఇచెస్తను.
10 ఏళ్ళు మాత్రమే
అరుస్తాను సరేనా !

దేవుడు: సరే..👍🏼

ఆ తర్వాతి రోజు దేవుడు ఒక కోతి ని తయారు చేసాడు.

దేవుడు: నీ కోతి చేష్టలు చేస్తూ జనాల్ని సంతోష పరుచు.
నీకు 20 ఏళ్ళు ఆయుషు
 ఇస్తున్నాను.🤘🏼

🐒కోతి: ఏంటి  !!
కోతి చేష్టలు 20 ఏళ్ళ ! అమ్మో!
కుక్క తన 10 ఏళ్ళు నీకు ఇచ్చింది గా !
నేను అలాగే ఇస్తాను.

దేవుడు  : సరే…👍🏼

మరుసటి రోజు దేవుడు మరల ఒక ఆవుని తయారు చేసాడు.

దేవుడు: నువ్వు రైతుతో పాటు పొలానికి వెళ్లి రోజంతా
 ఎండలో కస్టపడి
సాయత్రం పాలు ఇస్తూ,
 రైతుకి సహాయం చేయి.
నీకు 60 ఏళ్ళు ఆయుషు ఇస్తునాను.🤘🏼

🐄ఆవు: 60 ఏళ్ళు ఈ గొడ్డు చాకిరీ నేను చేయలేను.
నాకు కూడా 20 ఏళ్ళు ఇచి
మిగతా 40 ఏళ్ళు నువ్వే తీసుకో…
దేవుడు: సరే…👍🏼

తర్వాత రోజు దేవుడు మనిషి ని తయారు చేసాడు.

దేవుడు: తిను, తాగు , ఆడుకో, పెళ్లి చేసుకో,
నీ జీవితాన్ని ఆనందించు..
 నేను నీకు 20 ఏళ్ళు
 ఆయుషు ని ఇస్తునాను.🤘🏼

🤔మనిషి: ఏంటి? 20 ఏళ్లే నా? చూడు , నా 20 ఏళ్ళు తో పాటు ఆవు నీకు ఇచ్చిన 40,
  కోతి మరియు కుక్కకి ఇచిన
 10 +10 మొత్తం : 80 ఏళ్ళు
కావాలి…

దేవుడు: సరే…👍🏼

అందుకే మొదట 20 ఏళ్ళు మనిషి తింటున్నాడు,
నిద్రపోతున్నాడు, ఆడుకుంటున్నాడు,
ఆనందిస్తున్నాడు.. 😍😜

తరవాత 40 ఏళ్ళు
 ఆవు చేస్తున్నాటు తన కుటుంభానికి
సహాయం చేయటానికి గొడ్డు చాకిరీ చేస్తున్నాడు.🐄

 ఆ తర్వాత 10 ఏళ్ళు
 కోతి చేష్టలు చేస్తూ తన
 మనవల్లు , మనవరల్లని
నవ్విస్తున్నాడు.. 🐒

తరవాత 10 ....
ఇంటి ముందు కూర్చొని
 వచ్చే పోయే వాళ్ళని
అరుస్తుంటాడు….🐕

*ఏమి మనిషి జీవితం రా ఇది..
.