Pages

Showing posts with label కవితలు. Show all posts
Showing posts with label కవితలు. Show all posts

Wednesday, June 7, 2017

అమ్మ - నాన్న

కళ్ళు మూసుకుని ప్రేమించేది *ప్రియురాలు*
కళ్ళు తెరుచుకుని ప్రేమించేది *స్నేహితురాలు*
కళ్ళు ఉరిమి ప్రేమించేది *భార్య*
కళ్ళు మూసేవరకూ ప్రేమించేది "అమ్మ"*
కళ్ళల్లో ప్రేమ కనబడకుండా ప్రేమించేది "నాన్న.
నాన్నకి అంకితం*
అమ్మ .. ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది.
నాన్న .. ప్రపంచాన్ని నీకు పరిచయం చేస్తాడు.
జీవితం అమ్మది - జీవనం నాన్నది.*
ఆకలి తెలీయకుండా అమ్మ చూస్తుంది .
ఆకలి విలువ తెలిసెలా నాన్న చేస్తాడు .
అమ్మ భద్రత - నాన్న బాధ్యత.*
పడిపోకుండా పట్టుకోవాలని అమ్మ చూస్తుంది.
పడినా పైకి లేవాలని నాన్న చెప్తాడు
నడక అమ్మది - నడవడిక నాన్నది.*
తన అనుభవాలను విద్యలా బోధిస్తుంది అమ్మ.
నీ అనుభవమే విద్య అని తెలిసెలా చేస్తాడు నాన్న .
అమ్మ అలోచన-నాన్న ఆచరణ*
అమ్మ ప్రేమను నీ పసిప్రాయం నుండే తెలుసుకొగలవు.
But... కానీ ....
నాన్న ప్రేమను నువ్వు *నాన్నవు*అయ్యాకే తెలుసుకోగలవు...




 కొడుకు :ఈ రోజు నా గుండె operation నాన్న
నాన్న :తెలుసురా ఎందుకు బయపడుతున్నావ్ నేను ఉన్నానుకదా నీకు
కొడుకు :i love u నాన్న
నాన్న :i love u too ra చెపుతూ
 ఏడ్చాడు
Operastion తరువాత ఎప్పుడైతే ఆ అబ్బాయ్ కి మెలుకువ వచ్చిందో కళ్ళ ముందు ఒక్క ఫ్రెండ్ ఉన్నాడు
కొడుకు :మా నాన్న ఎక్కడా
ఫ్రెండ్ :నీకు తెలియదా నీకు గుండె ఏవరిచ్చారో  మీ నాన్నేనురా !
కొడుకు :గుండె పగిలేల ఏడవడం మొదలుపెట్టాడు
అప్పుడు గుండె నుండి ఒక్క శబ్దం వచ్చింది  ఏడవకురా నీ గుండె చప్పుడులో నేను ఎప్పుడు నీతో బ్రతికే ఉంటానురా
కొడుకు :i miss you నాన్న
మన కాళ్ల మీద మనం
నిలబడ్డామని అమ్మ నాన్నని దూరం పెట్టకు. మనం ఇలా నిలబడడానికి అమ్మ నాన్న మన ముందుండి  నడిపించారు మర్చిపోకు మన  భారాన్ని  అంత నాన్న మోస్తూ మనల్ని నడిపించాడు మనం సంతోషగా బ్రతకడానికి తన ప్రాణాలను  దరబోసే వాడు నాన్న


I love you నాన్న



Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

Monday, May 15, 2017

మితిమీరితే

మితిమీరితే ......... అతి_సర్వత్ర_వర్జయేత్..


మితిమీరిన ఖర్చు పేదరికం పాలు చేస్తుంది.
మితిమీరిన పొదుపు కష్టాల పాలు చేస్తుంది.
మితిమీరిన సంపాదన మనశ్శాంతిని లేకుండా చేస్తుంది.

మితిమీరిన కర్తవ్యం అగచాట్ల పాలు చేస్తుంది.
మితిమీరిన క్రమ శిక్షణ రక్త సంబధీకులను దూరం చేస్తుంది.

మితిమీరిన  బాధ్యతలు అప్పుల పాలు చేస్తుంది.
మితిమీరిన  హాస్యం నవ్వుల పాలు చేస్తుంది.

మితిమీరిన  కోపం శతృవులను వృద్ధి చేస్తుంది.
మితిమీరిన  ఆలోచనలు  జీవితాన్ని దుర్భరం చేస్తుంది.

మితిమీరిన వ్యసనాలు అపమృత్యు పాలు చేస్తుంది.
మితిమీరిన స్వార్ధం అందరినీ దూరం చేస్తుంది.

మితిమీరిన పోటీ నష్టాల పాలు చేస్తుంది.
మితిమీరిన  లాభార్జన వ్యాపార ఉనికికే మోసం తెస్తుంది.

మితిమీరిన  వస్తూత్పత్తి నాణ్యతా ప్రమాణాల దెబ్బ తీస్తుంది.
మితిమీరిన  గర్వాహంకారం ఆపదలు కొని తెస్తుంది.

మితిమీరిన అలంకారం వెగటు పుట్టిస్తుంది.
మితిమీరిన  శృంగారం వైరాగ్యాన్ని కలిగిస్తుంది.

మితిమీరిన  కామాంధకారం జీవచ్చవాన్ని చేస్తుంది.
మితిమీరిన  దారిద్రయం నేరాల పాలు చేస్తుంది.

మితిమీరిన  అధికార దాహం హత్యా రాజకీయాలను ప్రేరేపిస్తుంది.

మితిమీరిన త్యాగం కడగండ్ల పాలు చేస్తుంది.
మితిమీరిన  వ్యావసాయకోత్పత్తి భూమిని నిస్సారం చేస్తుంది.

మితిమీరిన  జనాభా పెరుగుదల దేశ ప్రగతిని త్రొక్కేస్తుంది.
మితిమీరిన  స్నేహాలు అభిప్రాయ భేదాలను సృష్టిస్తుంది.

మితిమీరిన  గారాబం చెడు స్నేహాల పాలు చేస్తుంది.
మితిమీరిన వేదాంతం  వెటకారం పాలు చేస్తుంది.

మితిమీరిన ఈర్ష్ర్యాసూయాద్వేషాలు నిద్రా సుఖాన్ని దూరం చేస్తుంది.
మితిమీరిన భక్తి మూర్ఛల పాలు చేస్తుంది.

మితిమీరిన  తీర్ధ యాత్రలు నాస్తికత్వానికి నాంది పలుకుతుంది.
మితిమీరిన  ఉపవాసాలు నిస్రాణతకు దారి తీస్తుంది.

మితిమీరిన  ప్రేమ అనుమానాలకు దారి తీస్తుంది.
మితిమీరిన  నమ్మకం ద్రోహానికి దోహదం చేస్తుంది.

మితిమీరిన  విశ్వాసం లోకువ పాలు చేస్తుంది.
మితిమీరిన  ఋణం మరణం పాలు చేస్తుంది.

మితిమీరిన  అభిరుచి దుబారాకు దారి తీస్తుంది.
మితిమీరిన  కీర్తి దాహం ఆదాయాన్ని మింగేస్తుంది.

అతి సర్వత్ర వర్జయేత్..

మితా హారం
మిత భాషణం
మితమైన నిద్ర
మిత సంసారం
మిత సంపాదన
మనో కాలుష్య రహితంగా జీవన యానం సాగిస్తే
పరిపూర్ణమైన జీవితానంద ప్రక్రియకు అదే రాచబాట

Tuesday, October 4, 2016

Heart wrenching message.

1. జీవితంలో ఎప్పుడైనా
       ఎవరి నైనా పనికి రాని వారిగా
         పరిగణించ వద్దు ఎందుకంటే
           చెడిపోయిన గడియారం
             కూడ రోజుకు రెండు సార్లు
               సరైన సమయం
                  సూచిస్తుంది

2. ఎప్పుడూ ఇతరుల తప్పులను
      అన్వేషించే వ్యక్తి అందమైన
         పుష్పాల పరిమళాలను
           వదలి పుండు మీద వాలే
             ఈగ లాంటి వాడు

3. పేదరికం ధరిచేరినప్పుడు
      ఆప్తమిత్రులు కూడ
        దూరమైతారు అదే
          ధనవంతులైనప్పుడు
            తెలియని వారు కూడ
               మిత్రులవుతారు

4. ఒక్క సారి నవ్వుతూ చూడు
      ప్రపంచంలో ఉండే అందాలన్ని
        నీ సొంతమవ్వుతాయి కానీ
          తడిసిన కనురెప్పలతో
             చూసే అద్దంకూడ మసక
                బారి పోతుంది

5. తొందరగా దొరికేది ఏదైనా
       ఎక్కువకాలం మన్నికరాదు
         ఎక్కువకాలం మన్నిక
           వచ్చేది అంతతొందరగా
              దొరకదు

6. జీవితంలో వచ్చే చెడు రోజులు
      కూడా మన మంచి కొరకే
        అనుకోవాలి అప్పుడే
          తెలుస్తుంది నిజమైన
            స్నేహితులు ఎవరైనది

7. మనిషికి రోగాలు కుందేలు లాగా
      వస్తాయి తాబేలు లాగా
        వెళ్లుతాయి కానీ డబ్బులు
          తాబేలు లాగ వస్తాయి
             కుందేలు లాగా
                వెళ్లుతాయి

8. చిన్న చిన్న మాటల్లో ఆనందాన్ని
       వెతకటం అలవాటు
         చేసుకోవాలి ఎందుకంటే
           పెద్ద పెద్ద మాటలు
             జీవితంలో చాలా
                అరుదుగా చోటు
                   చేసుకుంటాయి

9. ఈశ్వరుని ప్రార్ధించినప్పుడు
      నాకు ఏమి ఇవ్వలేదని
        బాధపడకు ఎందుకంటే
          నీకు అక్కడ ఇవ్వక
            పోయినా నీకు నచ్చిన
              చోట నీకు ఈశ్వరుడు
                నచ్చినవిధంగా ఇస్తాడు

10. నిత్యము ఎదురయ్యే
        అపజయాలను చూసి
          నిరాశ చెందకు కానీ
            ఒక్కోసారి తాళం చెవి
              గుచ్చంలో ఉండే ఆఖరి
                తాళం చెవి కూడ తాళం
                   తెరుస్తుందని
                      గమనించు

11. ఈ సమాజంలో నేను ఒక్కడిని
         ఏంచేయగలననీ ప్రతి మనిషీ
           నిరాశ చెందుతుంటాడు
             కానీ ఒక్క సారి తలపైకెత్తి
               చూడు ప్రపంచానికి
                వెలుగునిచ్చే సూర్యుడు
                   కూడ ఒక్కడేనని 

12. బంధవులు ఎంత చెడ్డ వారైనా
         సరే వదులుకోవద్దు
           ఎందుకంటే మురికి నీరు
             దప్పిక తీర్చలేక పోయిన
               కనీసం అగ్గి మంటలు
                 ఆర్పటానికి పనికి
                    వస్తాయి

13. నమ్మక ద్రోహి స్నేహితునికన్నా
        దురాశపరుడు సన్నిహితుడు
          మిన్న మట్టితో చేసిన
            మనుషులు కాగితాలకు
               అమ్ముడు పోతారు

14. మనిషి గా మాట్లాడుట
         రాక పోయినా కనీసం
           పశువుల్లా మౌనంగా
             ఉండటమే ఉత్తమం

15. మనకు మాటలు రాక ముందు
       మనముఏంచెప్పబోతున్నామో
         అమ్మకు అర్థమయ్యేది కాని
           మనము మాటలు అన్ని
             నేర్చిన తరువాత ఇప్పుడు
                మాటమాటకు ప్రతిసారి
                   అమ్మా నీకు అర్థం
                      కాదులే అంటాం

16. కష్టాల్లో ఉన్నప్పుడు మిత్రులు
          దూరమైనారని బాధపడకు
            ఎందుకంటే నీవు ఒక్కనివే
               జయించగలవని వారు
                 నమ్మినందుకు నీవు
                     సంతోషించు

17. సిగ్గు మర్యాద లేని
        ధనవంతు కన్నా
          మంచి మానవత్వం ఉన్న
            పేదరికమే మిన్న

18. జీవితంలో హెచ్చుతగ్గులు
         రావటంకూడ మన మంచి
           కోసమే అనుకోవాలి
             ఎందుకంటే ECG లొ
               వచ్చే సరళరేఖా కూడ
                  మృత్యువును
                     సూచిస్తుంది

19. ఈ రోజుల్లో సంబంధాలు
         రొట్టె తొ సమానమైనవి
           ఎందుకంటే కొద్దిగా మంట
             ఎక్కవైందొలెదో రొట్టె
               మాడి మసి కావటం
                   ఖాయం

20. జీవితంలో మంచి వారి కోసం అన్వేషించ వద్దు ముందు నీవు మంచిగా మారు బహుశా నిన్ను కలిసిన వ్యక్తికి మంచి మనిషి అన్వేషణ పూర్తి
 కావచ్చు నేమో.  


ఏరా నాన్న!
బావున్నావా!?
రొంపా,జ్వరమొ చ్చిందని విన్నాను?
జాగ్రత్త నాన్న!!
వర్షంలో తిరగకురా,
నీకది పడదు!
మీ అమ్మే ఉంటే -
వేడినీళ్ళలో విక్సేసి
నీకు ఆవిరి పట్టుండేది!
కోడలిపిల్లకది తెలియదాయే!!

కోడలంటే గుర్తొచ్చింది
అమ్మాయెలా ఉంది!?
పిల్లలు బావున్నారా!?
నాన్న రేపు వినాయక చవితి కదా -
ఇల్లు శుభ్రంగా కడిగించి,
గుమ్మాలకు నాల్గు మామిడాకులు కట్టు!
పిల్లలు,కోడలితో కలసి
వ్రతపూజ చేసుకోనాన్న!
మంచిజరుగుద్ది!!
వీలైతే బీరువాలో
అమ్మ కోడలిపిల్లకు ఇష్టపడి
కొన్న పట్టుచీరుంటుంది,
పూజనాడైనా కట్టుకోమను
కళకళలాడుతూ లక్ష్మీదేవిలా ఉంటుంది!
తనకిష్టం లేదంటే బలవంత పెట్టకు నాన్న!!

పిల్లలు బాగా చదువుకుంటున్నారా!?
ఎప్పుడూ పననక
వాళ్ళతో కూడా కొంచెం గడపరా!
పాపం పసివాళ్ళు బెంగపెట్టుకు పోతారు!!
రాత్రులు నీతికథలు చెప్పు
హాయిగా నిద్రపోతారు!!

ఇక నాగురించంటావా!?
బానే ఉన్నానురా!
నువ్వీ ఆశ్రమంలో చెర్పించి
వెళ్ళిననాటి నుండి ఏదో అలా కాలక్షేపమైపోతుంది!
నాలాంటి వయసు పైబడిన వాళ్ళందరం
గతాన్ని నెమరేసుకుంటూ గడిపేస్తున్నాం!!

ఈమద్య మోకాళ్ళు
కొంచెం నొప్పెడుతున్నాయి.
అయినా పర్లేదులే పోయిన పండుగకు
నువ్వు కొనిచ్చిన జండూబాం అలాగే ఉంది!
అది రాసుకుంటున్నానులే!!

అన్నట్లు చెప్పడం మరిచా -
మొన్న ఆశ్రమానికి దొరలొచ్చి
మాకు రెండేసి జతల బట్టలిచ్చి వెళ్ళారు!
నాకీ సంవత్సరానికి అవి సరిపోతాయి
కాబట్టి నాకు బట్టలేం కొనకు,
ఆ డబ్బులతో కోడలుపిల్లకు
ఓ చీర కొనిపెట్టు సంతోషిస్తుంది!
ఈమద్య చూపు సరిగా ఆనక
అక్షరాలు కుదురుగా రావడం లేదు,
వయసు పైబడిందేమో
చేతులు కూడా కాస్త వణుకుతున్నాయ్!

అన్నట్లు మొన్నొకటోతారీఖున
అందుకున్న పెంక్షన్ డబ్బులు
నువ్వు పంపిన కుర్రోడికిచ్చాను అందాయా?!
ఇక్కడివాళ్ళు కళ్ళజోడు మార్పించుకోమన్నారు.
కానీ నీకేదో అవసరమన్నావు కదా
అందుకే పంపేసాను!
అవసరం తీరిందా నాన్న!

బాబూ ఒక్క విషయంరా....!
ఈమద్య ఎందుకో అస్తమాను
మీ అమ్మ గుర్తొస్తుంది!
నీరసమెక్కువై గుండె దడగా కూడా ఉంటుంది,
మొన్నామద్య రెండు,మూడు సార్లు
బాత్రూంలో తూలి పడిపోయాను కూడా
పెద్దగా ఏమీ కాలేదు గానీ,
తలకు చిన్న దెబ్బ తగిలిందంతే!!
నాకెందుకో పదేపదే
నువ్వే గుర్తొస్తున్నావు నాన్న!

నీకేమైనా ఖాళీ ఐతే -
ఈ నాన్ననొచ్చి ఒకసారి చూసిపోరా!
ఆ తరువాత నాకేమైనా హాయిగా పోతాను!!

చివరిగా ఒక్క కోరిక నాన్న!
నాకేమన్నా అయ్యి
నువ్వు రాకుండానే నే పోతే -
నన్నిక్కడ ఆనాధలా ఒదిలేయక -
మనపొలంలో మీ అమ్మకు నే కట్టించిన
సమాధి ప్రక్కనే నన్నూ పండించరా!!
ఈ ఒక్క కోరికా తీర్చు నాన్న!!
ఇక నేనేమీ కోరుకోను!!

విసిగిస్తున్నానేమో..
ఉంటాను నాన్న!!
ఆరోగ్యం జాగ్రత్త!!
                          ప్రేమతో,
                         నీ నాన్న!!

No words, Heart wrenching message.

-కవిత...
క- గుణింతముతో వ్రాసానో కవితను..
కా-స్తంత మీ సమయాన్ని వెచ్చించి చదవమంటాను..
కిం-చిత్ దయ ఎదుటివారిపై చూపమంటాను..
కీ-ర్తి ప్రతిష్ఠలకై ప్రాకులాడడం ఏలంటాను..
కు-బేరుడేల కుచేలుడిలా ఉండమంటాను..
కూ-డబెట్టినవి ఏవీ మనవెంట రావని అంటాను..
కృ-త్రిమమైన ప్రేమాభిమానాలు వలదంటాను..
కౄ-రత్వాన్ని మించిన పాపమేదీ లేదంటాను..
కెం-పులు, కాసులు మనకెందుకని అంటాను..
కే-టుగాళ్ళతో సహవాసమే మనకి వద్దని అంటాను..
కై-లాసగిరికి మార్గము మంచితనమేనంటాను..
కొ-ద్దో గొప్పో మంచిపేరుంటే అదే చాలనుకుంటాను..
కో-టి విద్యల కూడులో కొంతైనా పరులకి పెట్టాలంటాను..
కౌ-సల్య సుప్రజా రామలకి కొంత సమయం కేటాయించమంటాను..
కం-టికి కునుకు పడ్డాక పరుపైనా కటికనేలైనా ఒకటేనంటాను..
కః-తో ఏదైనా ఒక మంచి మాటని సెలవీయండని అంటాను.

Wednesday, September 21, 2016

అంజలి

 అంజలి

శతృవు
చిటికెన వేలంతే
అయినా అనాదిగా
సరిహద్దులు రక్తంతో తడుస్తునే ఉన్నాయి!

పెద్దరికమా
ఇకనైనా నీ ఓపికను
బేరీజు వేసుకో!

కవ్వింపు చర్యలతో
కాగల కార్యాలేవీ లేవు
శతృవు మన ఉప్పుతిన్న
విశ్వాస ఘాతకుడు!

నిరంతర అనుమానాల మధ్య
వానితో చేసే చెలిమేదైనా
భ్రమే!

అవసరాలకోసమే
మిత్ర కూటాలేర్పడుతున్నప్పుడు
మన వాళ్ళంటూ
ఎవరూ ఉండరు
అంతా పగవాళ్ళే!

కడుపులో కత్తులు దాచుకున్న వానితో
ఎంత కాలం కౌగిలించుకుంటావ్?

హద్దు మీరినప్పుడే కదా
సరి హద్దుల్ని చెరిపే మోకా
దొరికేది!

యుద్ధం వాంఛనీయం కాకపోవచ్చు
అనివార్యమైనప్పుడన్నా
విజయంతోనే అమరులకు
అంజలి ఘటించాలి!
అంజలి ఘటించాలి!!





Monday, September 12, 2016

Happy Teacher's day



గుండెలోని
రుధిరధారలను
వూపిరిగా మలచి
అజ్ఞానాంధకారాల్ని
విజ్ఞానజ్యోతితో పారదోలి
జీవన సత్యాన్ని తెలియజేసే
నిస్వార్ధపర అల్పసంతోషులు
గురువులు!
మందీ,మార్భలమున్న
మహారాజునైనా,
సాయుధబలగాలున్న
సైన్యాధిపతినైనా,
కూడుకీ, గుడ్డకీి లేని
కడుపేద కుచేలుడినైనా
కుబేరునిగా చేసే గురువు,
తన జీవితాన్ని
కొవ్వొత్తిలా కరిగించి
విద్యార్ధుల జీవితాల్ని వెలిగించి
వారికి చేయూతనిచ్చి
సత్సమాజాన్ని నిర్మించి
లోకాన్ని రక్షించి
మార్గనిర్దేశం చేసే
ప్రతిభాన్విత మహిమాశిరోమణి
గురువు!
అమ్మ మాటను నేర్ఫితే
గురువు రాతను, చేతను
నడకను, నడతను
విలువలను, విజయాలను
అణువణువునా స్ఫూర్తిని నింపి
సమాజంలో సగర్వంగా నిలబెడతారు!
అమ్మ ప్రేమకు
కన్న పేగుకైనా
విలువ కట్టే ,ఈ రోజులే కాదు
యుగాలు మారిన
జగాలు చెదరిన
నాటికి, నేటికి, ఎన్నటికీ
మారని స్థానం గురువు!
అమ్మ బతుకునిస్తే,
గురువు బతుకునూ,భవిష్యత్తునూ
అక్షరాలనూ నేర్ఫించి
అక్షరులుగా జేసే
విజ్ఞాన విధాతలైన గురువులకు
మేన ప్రాణం మెదిలినంతకాలం
మదిలో, హృదిలో స్మరిస్తూ
సదా! సర్వదా గౌరవిద్దాం!
ఉపాధ్యాయ లోకానికి
ముకుళిత హస్తాలతో ప్రణమిల్లుదాం!.

Tree



ఎన్నో శాఖలతో విస్తరించి వున్న నేను...
కొన్ని చోట్ల ఆకు  పచ్చని ఆకులతో..
ఇంకొన్ని చోట్ల విచ్చుకున్న  పువ్వు లతో..
మరికొన్ని చోట్ల ఎండిన ఆకులతో..
నన్నే నమ్ముకొని..
నాపై నమ్మకం ఉంచి..
నా మీదే గూడు కట్టుకొన్న..
పక్షి జాతులు..
నా క్రింద నా నీడలో వుండే వివిధ
మతాలు..
జాతులు..
మనుష్యులు..
జంతు జాతులు..  
ఎండలో నా నీడతో..
వర్షంలో నా ఆకుల గొడుగుతో..
చలిలో నా వొడిలో..
సేదతీరతాయి..
తెలంగాణ ప్రజల గొంతుకను నేను..
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడానికి కారణం నేను..
ఒక నమ్మకం.. ఒక భరోసా..ఒక విశ్వాసం.. సమస్త  హరితం తో  
అలరారుతున్న వృక్షాన్ని నేను..
పిల్లల మర్రి వృక్షాన్ని నేను..
కానీ త్వరలో.. అతి త్వరలో..
నేను మోడు బార  బోతున్నాను
నా కొమ్మలు కొమ్మలు కొట్టి వేయ బడుతున్నాయి..
వికసించే నా పువ్వులు విసిరేయబడుతున్నాయి..
తలలేని మొండెం లా..
చేతులు లేని కాయం లా..
నీరే నా జీవనాధారం, దాన్ని తీసుకెళుతున్నారు..
ప్రకృతే నా సహచరి దానిని దూరం చేస్తున్నారు..
మనుషులే నా  గొంతుక ఆ ధ్వనిని మూగ బోయేలా చేస్తున్నారు..
నా చుట్టూ వుండే ప్రకృతిని, నాకున్న నీటి లభ్యతను, నాకున్న గాలిని..
నాకు దూరం చేస్తూ నన్ను మూడు భాగాలుగా విడగొడవుతున్నారు..
త్వరలోనే నేనొక మోడు బారే కాండాన్ని..
నేనే.. నేనే.. మీ పాలమూరును.
మీరు పిలుచుకునే మహబూబునగర్ ను ..!
నేను చేసిన తప్పు ఒకటే అసమర్థులకు  ఆశ్రయం ఇవ్వడమే....

Monday, August 29, 2016

నాకు మరణం లేదు నేను అమరజీవిని

నాకు మరణం లేదు
నేను అమరజీవిని
నేను మరణించిన నా కళ్ళు ఈ లోకాన్ని చూడగలవు
నా గుండె ఇంకా లబ్ డబ్ మని కొట్టుకోగలదు
నా కాలేయం యధావిధిగా పనిచేస్తుంది
నా మూత్రపిండాలు కూడా పని చేస్తాయి
అంటే నాకు మరణం లేదు
నేను అమరజీవిని
నా కళ్లు ఇద్దరికి చూపునిస్తాయి
నా గుండె ఒక్కరిని బతికిస్తుంది
నా కాలేయం ముగ్గురికి ఉపయోగపడుతుంది
నా కిడ్నీలు, కర్ణ భేరులు నలుగురి కి ఉపయోగపడుతాయి
పురాణాల్లో అమృతం తాగితే అమరులవుతారట వారికి మరణం ఉండదట
అలాగే నేను నా అవయవదాన అంగీకారపత్రం పై సంతకం చేసి అమరుడనయ్యాను
నాకింక మరణం లేదు
నేను అమృతం తాగాను
ఆ అంగీకారపత్రం మిాద సంతకం చేస్తే అమృతం తాగినట్టే
    మరి మిారు ఇంత మందిని కాపాడాలనుకుంటున్నారా?
    అయితే వెంటనే అవయవదాన అంగీకార పత్రంపై సంతకం చేసి కాపాడండి.
    మన వల్ల ఇంకొందరి ప్రాణాలను కాపాడండి.
   “చనిపోయాక శరీరాన్ని కాల్చితే బూడిద అవుతుంది
       పూడ్చితే మట్టి అవుతుంది
       దానం చేస్తే అమరత్వం సిద్దిస్తుంది”
 www.jeevandan.gov.in లో రిజిస్ట్రేషన్ చేసుకొండి.

గురువులం

గురువులం

మేమిలాగే ఉంటాం,
 ఎప్పటిలాగే ఉంటాం
ఎందుకంటే, మేం కేవలం గురువులం!
నీడనిచ్చు చెట్టులా, వాననిచ్చు మబ్బులా!
వెంటపడే నాన్నలా, పక్కనుండే అమ్మలా!
మాలో మార్పు లేదు, ఓర్పు మాత్రమే ఉంది!
అవే చూపులు, అవే మాటలు
అవే పాఠాలు, అవే నల్లబల్లలు
అవే సుద్దముక్కలు, అవే రాతలు!
విసుగు చెందని మనసులు మావి
విరామమెరుగని వృత్తులు మావి!
సంపాదించే వ్యాపారులం కాము
పాలించే నాయకులం కాము!
చిన్నచూపు చూసినా చింతించం
పెద్ద మనసు చేసినా గర్వించం!
నాలుగు గోడలే మా ప్రపంచం
విద్యాలయమే మా విశ్వనగరం!
ఎందుకంటే, మేం కేవలం గురువులం!

ఎన్నో కళ్ళు మావైపు చూస్తుంటాయి
రెండే కళ్లు మిమ్మల్ని అదుపు చేస్తుంటాయి!
మీ రాతలను, గీతలను సరిచేస్తూ
మీ మాటలను, చేతలను సవరిస్తూ
మీ చదువే మా చదువుగా
మీ మార్కులే మా మార్కులుగా!
మంచి కోసమే నిందిస్తాం
బాగు కోసమే బాధిస్తాం!
ఎదుగుతూ ఒదుగుతూ
ఎక్కడికో ఎగిరెగిరి పోతుంటారు
ఎక్కడినుండో ఏనాటికో వాలిపోతారు!
మీరే స్థితిలో ఉన్నా మహదానందం
మీ పలకరింపే పరమానందం!
గురువును మించిన శిష్యులైనా
కొండ అద్దమందు చిన్నదవదా!
మీరెంత ఎత్తుకు ఎదిగినా
మాముందు చిన్నపిల్లలే కదా!
ఎందుకంటే, మేం కేవలం గురువులం!

ఎగతాళి చేసిన మీ చేతులే భక్తితో జోడిస్తాయి
వెక్కిరించిన మీ మాటలే వినయంగా వినిపిస్తాయి!
మీ బాల్యస్మృతులకు చిరునామా మేము
మీ భవిష్యత్తుకు నజరానా మేము!
మీరంటే ఒక జలపాతం, ఒక నదీ ప్రవాహం!
నిలకడలేని ఆపసోపాల ప్రయాణం మీది
నిశ్చలమైన నిలువెత్తు నిగ్రహం మాది!
నేర్చుకుంటూ జ్ఞానతృష్ణతో వెళ్ళిపోతుంటారు
నేర్పిస్తూ లక్ష్యాన్ని చూపిస్తూ నిలిచిపోతుంటాం!
మా క్షేమం కన్నా మీ సంక్షేమం మిన్న
మా ఆనందం కన్నా మీ ఆశయం మిన్న
ఎందుకంటే, మేం కేవలం గురువులం

Friday, July 29, 2016

శ్రీ శ్రీ అక్షర ఆయుధాలు

 శ్రీ శ్రీ అక్షర ఆయుధాలు

కుదిరితే పరిగెత్తు.. ,
లేకపోతే నడువు...
అదీ చేతకాకపోతే...
పాకుతూ పో.... ,
 అంతేకానీ ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు...

ఉద్యోగం రాలేదని,
వ్యాపారం దెబ్బతినిందని,
స్నేహితుడొకడు మోసం చేశాడని,
ప్రేమించినవాళ్ళు వదిలి వెళ్ళి పోయారని...
అలాగే ఉండిపోతే ఎలా?

దేహానికి తప్ప,
దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే...   
తలుచుకుంటే...
నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా...
నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది,
అలాంటిది ఇప్పుడొచ్చిన ఆ కాస్త కష్టానికే తలొంచేస్తే ఎలా?

సృష్టిలో చలనం ఉన్నది ఏదీ ఆగిపోకూడదు...,
పారే నది..,
వీచే గాలి...,
 ఊగే చెట్టు...,
ఉదయించే సూర్యుడు....
 అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా ప్రవహిస్తుందే ఆ నెత్తురుతో సహా....,,
ఏదీ ఏది ఆగిపోడానికి వీల్లేదు..

లే...
బయలుదేరు...
నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక భాదల సంకెళ్ళను తెంచేసుకో... ,
పడ్డ చోటు నుండే పరుగు మొదలుపెట్టు...

నువ్వు పడుకునే పరుపు...
నిన్ను చీదరించుకోకముందే బద్దకాన్ని వదిలేయ్... ,

నీ అద్దం....
నిన్ను ప్రశ్నించకముందే సమాదానం వెతుక్కో... ,

నీ నీడ నిన్ను వదిలేయకముందే వెలుగులోకి వచ్చేయ్..

 మళ్ళీ చెప్తున్నా.....!
కన్నీళ్ళు కారిస్తే కాదు....
చెమట చుక్కని చిందిస్తేనే చరిత్రను రాయగలవని తెలుసుకో ..!

చదివితే ఇవి పదాలు మాత్రమే,
 ఆచరిస్తే...
 అస్త్రాలు.

Sunday, May 15, 2016

corporate colleges

నేల మీది నక్షత్రాలు.!

వీళ్ళు...
కార్పోరేట్బందెల దొడ్డుల్లోని గొర్రెలు కాదు...
ఎ.సి. పంజరాలలో బందీలైన చిలకలూ కాదు...
మమ్మీల అంతులేని అత్యాశల్ని, 
డాడీల నిరర్ధక స్వప్నాల్ని నిజం చేసేందుకు...
డబ్బు గబ్బు కొట్టే కాన్వెంటు కొట్టాల్లో
నిద్దర లేకుండా తిరుగాడుతున్న
బొద్దింకలూ  కాదు...
లోకజ్ఞాన సౌరభం శూన్యం అయినా,
ఐ.ఐ.టి. కాంక్రీట్ ఫౌండేషన్లో
ఏపుగా ఎదుగుతున్న
భవిష్యత్ డాలర్ పిచ్చిమొక్కలు కాదు...
పిజ్జాలతో బొజ్జల్ని,
బర్గర్లతో బుగ్గల్ని నింపేసి,
పుస్తకాల్ని పిప్పి చేసేసి, నమిలేసి...
రేంకుల రేసుల్లో దౌడు తీస్తున్న..
నవనాగరిక నగర విద్యాశ్వాలు 
అంతకన్నా కాదు...
***
వీళ్ళు....
అర్ధాకలితో పస్తులుంటున్నా...
చల్లని చదువులతోనే
కడుపులు నింపుకొనే వాళ్ళు...
అక్షరాన్ని తాకిన తొలితరం అయినా...
ఆరాధనగా మనసుకు హత్తుకోనేవాళ్ళు...
పరభాషలో బానిస బాణీలు పాడకున్నా..
అమ్మ భాషలో వినయంగా ప్రార్ధిస్తూ...
సరస్వతిని ఆవాహన చేసుకున్నవాళ్ళు...
***
వీళ్ళు...
అరకొర సౌకర్యాలు...
అంతంత మాత్రం ప్రోత్సాహకాలు..
నిరంతరం
నిరుత్సాహానికి గురి చేస్తున్నా...
వెన్ను తట్టి ప్రోత్సహించే,
వెన్నంటి ఉండి చదివించే...
గురువుల ఋణం తీర్చుకొనేందుకు
పట్టుదలతో కృషి చేసే
సాందీపని శిష్యులు...
విజయాల సాధనకోసం
బాధల భేతాళుల్ని
అలవోకగా భుజాలపై మోసే
విక్రమార్కులు,
అక్షరధనానికి నోచుకోని వంశాలను
జ్ఞానగంగతో పునీతం చేస్తున్న
భగీరధులు...
***
వీళ్ళు...
మీడియాల కవరేజులకు,
ప్రకటనల ప్రలోభాలకు,
చెవులు  చిల్లులుపడే
శబ్దకాలుష్యాలకు దూరంగా,,,
పదికి పది సాధించినా
పదిలంగా, వినయంగా, మౌనంగా...
చిరునవ్వులు చిందించే
ఋషి తుల్యులు...
ఉచిత విద్యతో ఉన్నతంగా ఎదిగిన
(అ)సామాన్య సరస్వతులు...
సర్కారు బడుల ఆశాజ్యోతులు...
***
వీళ్ళు...
నిర్లక్ష్యం చిదిమేయకుండా ఉంటే...
ప్రోత్సాహం అడుగంటకుండా ఉంటే...
భవిష్యత్ భారతాన్ని వెలిగించే
బంగారు దివ్వెలు...
నేలమీది నక్షత్రాలు...!

(ప్రతికూల పరిస్థితులలోను, పదవతరగతిలో అసామాన్య ఫలితాలు సాధిస్తున్న ప్రభుత్వ విద్యార్ధులకు అభినందనలతో, వారివెన్నంటి ప్రోత్సహిస్తూ వారి విజయ సాధనలోనే తమ ఆనందాన్ని చూసుకొనే ప్రభుత్వ ఉపాధ్యాయులకు హృదయపూర్వక  నమస్కారాలతో ..
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends
.