Pages

Showing posts with label సత్ ప్రవర్తన. Show all posts
Showing posts with label సత్ ప్రవర్తన. Show all posts

Friday, June 30, 2017

ఒక కోటీశ్వరుడు

బ్రెజిల్ దేశంలో ఒక కోటీశ్వరుడు...తన వన్ మిలియన్ డాలర్ ఖరీదుగల

బెంట్లీ కారుని పలానా రోజు పాతిపెడుతున్నాను అని పత్రికా ప్రకటన ఇచ్చాడు..!!
నేను ఈ కారుని ఎందుకు పాతి పెడుతున్నానంటే..
నా మరణానంతరం కూడా ఈ కారు నాకు పనికివస్తుంది అని చెప్పాడు..!!
అప్పుడు ఈ కోటీశ్వరుడుని అందరూ..ఈయన ఒక పెద్ద అవివేకి అని...
వన్ మిలియన్ డాలర్ కారుని వృధా చేస్తున్నాడు అని విమర్శించారు..!!
మీడియా మరియు మిగిలిన ప్రజలు అతనికి చాలా తిట్టారు కూడా..!!
అతను పాతిపెట్టే రోజు ఏమి జరుగుతుందో అని..
చాలామంది చూడటానికి ఆత్రంగా జనం అంతా పోగై ఆ చోటికి వచ్చి ఉన్నారు..!!
పెద్ద కారుని పాతిపెట్టడానికి అక్కడ ఒక పెద్ద గొయ్యి తవ్వి పెట్టారు..!!
ఆ తతంగాన్నిఅందరూ ఉత్సుకతతో మరియు ఆత్రుతతో చూస్తూ ఉన్నారు..!!
కారుని పాతిపెట్టడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి..ఇంతలో అక్కడికి ఆ కోటీశ్వరుడు వచ్చాడు..!!
అక్కడికి వచ్చిన ప్రజలు అతన్ని తిడుతూ కోపంగా..
ఎందుకు మీరు ఈ కారుని ఇలా పాతిపెట్టి వృధా చేస్తున్నారు..??
మీ మరణానంతరం ఇది మీకు ఏ విధంగా పనికి రాదు..!!
దీనిని వేరోకరికైనా దీనిని ఇవ్వచ్చు కదా..అని పదిమంది పదిరకాలుగా ప్రశ్నించారు..!!
అప్పుడు ఆ కోటీశ్వరుడు చిరునవ్వుతో ఇలా సమాధానం ఇచ్చాడు..!!
"నేను నా కారుని ఇలా సమాధి చేయడానికి నేనేమి అవివేకిని కాను..!!
దీని ద్వారా నేను మీకు ఒక సందేశాన్ని ఇవ్వాలని కోరుకున్నాను..!!
ఈ కారు ధర కేవలం 1 మిలియన్ డాలర్.. నేను దాన్ని పాతిపెట్టే నిర్ణయం
తీసుకున్నందుకు మీ అందరికి నా మీద మీకు ఇంత కోపం వచ్చింది..!! నిజమే..!!
కానీ మీరు మాత్రం...
వెలకట్టలేని...
మీ(మన) గుండె...
కళ్ళు...
ఊపిరితిత్తులు..
మూత్రపిండాలు..ఎత్చ్..
ఇలా మన శరీరంలోని ప్రతి అవయవమూ మానవ సమాజానికి ఉపయోగపడతాయి..!!
ఈ అవయవాలన్నీ మనతోపాటే అనవసరంగా..వృధాగా మట్టిలో కలిసిపోతున్నాయి..!!
వాటి గురించి మీకు ఏ మాత్రం చింతకాని..ఆలోచన కాని లేదు..!! ఎందుకు..??
కారు పోయినా..డబ్బు పోయినా మళ్ళి తిరిగి వస్తుంది..!!
మరి మన అవయవాలు తిరిగి వస్తాయా..?? వాటికి విలువ కట్టగలమా..??
.
.
మరి మనం ఎందుకు వాటిని ఒక బహుమతిగా ఇతరులకి దానం చెయ్యలేము..!!
కొన్ని లక్షలమంది ప్రజలు అవయవదానం కోసం ఎదురు చూస్తున్నారు..!!
మనం అంతా ఎందుకు వారికి సాయం చెయ్యకూడదు..??
ఆలోచించండి..!! అవయవదానం చెయ్యడానికి నడుం బిగించండి..!!
మీ అందరిలో అవయవదానం ప్రాముఖ్యత గ్రహించేలా చేయడానికే నేను ఈ నాటకం ఆడాను..!! " అని చెప్పాడు.







నవ్వుతూ ఉన్నవాడు...నాలుగు రకాలుగా మాట్లాడతాడు.
బాధతో ఉన్నవాడు...భావంతో మాట్లాడతాడు.
ప్రేమతో ఉన్నవాడు...చనువుతో మాట్లాడతాడు
కోపంతో ఉన్నవాడు...కేకలు వేసి మాట్లాడతాడు
మంచివాడు...మార్పుకోసం మాట్లాడతాడు
అసూయతో ఉన్నవాడు...చులకనగా మాట్లాడతాడు
కానీ జ్ఞానం కలవాడు మౌనంగా ఆలోచించి మాట్లాడతాడు
నిజానికి మాట మనిషిని మారుస్తుంది
మౌనం మన మనస్సుని మారుస్తుంది.

Sunday, May 21, 2017

సత్ ప్రవర్తన


సత్ ప్రవర్తన


నువ్వు ఫోన్ మాట్లాడితే.. పక్కవాళ్ళకు డిస్ట్రబ్ కాకూడదు!
నువ్వు బండి నడిపితే.. రోడ్డుపై ప్రయాణం చేసేవారు భయపడకూడదు!
నువ్వు తినేటప్పుడు.. పక్కకు కూర్చున్నవాళ్ళు నిన్ను చూసి చీదరించుకోకూడదు!
నువ్వు మాట్లాడితే.. ఎదుటివాళ్ళు ఎప్పుడు ఆపుతావో అని ఎదురుచూడొద్దు!
నువ్వు రాసింది.. చదివేవాళ్ళు అర్ధంచేసుకోవడానికి జుట్టు పీక్కోవద్దు!
నువ్వు ధియేటర్ కు వెళ్ళినప్పుడు.. నీ ప్రవర్తన ఇతర ప్రేక్షకులకు భంగం కలిగించకూడదు!
నువ్వు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటావననే నమ్మకాని ఎదుటివారికి కలిగించాలి!
నువ్వు పేసు బుక్ లో పోస్టు పెడితే.. ఏ ఒక్కరికైనా ఉపయోగపడాలి!
నువ్వు వాట్స్ ఆప్ లో ఏదైనా పంపిస్తే.. ఏదైనా కొత్త విషయమై ఉండాలి!
ఎక్కడైనా.. ఎప్పుడైనా.. నీవల్ల ఇతరులు ఇబ్బంది పడకూడదు.⁠⁠⁠⁠
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends
.