Pages

Showing posts with label ఆరోగ్యం. Show all posts
Showing posts with label ఆరోగ్యం. Show all posts

Tuesday, July 11, 2017

పేనుకొరుకుడు

బొప్పాయి పువ్వుని నలిపి పేనుకొరుకుడు (తాత్కాలికంగా తలమీద వచ్చే బట్టతల మచ్చ) వచ్చినచోట రుద్దితే వెంట్రుకలు పెరుగుతాయి. ఈ చర్మవ్యాధికి ఎలర్జీ ముఖ్యకారణం. ఈ వ్యాధిలో స్థిరాయిడ్స్ కు సంబంధించిన చుక్కల మందుతో రుద్దితే వెంట్రకలు వస్తాయి. కానీ, కొందరికి రాకపోవచ్చు, కొందరిలో వెంట్రకకలు కుప్పలు కుప్పలుగా రాలిపోయి పెద్దపెద్ద బట్టతల మచ్చలు ఏర్పడుతూ వుంటాయి. అలాంటప్పుడు బొప్పాయి పూలను వాడితే ఫలితం కన్పించవచ్చు..

ప్రయత్నించిచూడండి. రోజూ రెండు మూడు సార్లు కొన్నాళ్ళపాటు వాడితే మంచిది.


2. *బొప్పాయి చెట్టుకి గీత పెట్టి పాలను సెకరించి దానికి సమానంగా నీరు కలిపి పలచగా గజ్జి, తామర మచ్చల పైన రాస్తే చర్మవ్యాధి కారకాలైన సూక్ష్మజీవులను నశిస్తాయి.*

3. *బొప్పాయి పాలని చిన్న అగ్గిపుల్లతో పురిపిడికాయపైన ఆరగా పెడితే పురిపిడి కాయలు రాలిపోతాయి.*

4. *బొప్పాయికాయనుగానీ, ఆకునుగానీ, ఆకునుగానీ దంచి, మెత్తగా పేస్ట్ లా చేసి ఆరికాళ్ళ ఆనే మీద కడితే ఆనెలు మెత్తపడతాయి.*

5. *బొప్పాయి కాయని దంచి రసం తీసి ఆ రసాన్ని ముఖానికి రాసుకుంటే మొటమల తీవ్రత తగ్గుతుంది.*

6. *ముఖంమీద నల్లచుక్కలు కూడా ఈ ప్రయోగంతో తగ్గుతాయి.*
7. *శోభి మచ్చలమీద కూడా బొప్పాయికాయ రసం బాగా పనిచేస్తుంది.*
8. *బొప్పాయి గింజల్ని`కూడ పేస్టులా చేసి పైన చెప్పిన వ్యాధులన్నింటిలోనూ వాడవచ్చు.*,
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

Friday, June 30, 2017

నడకకు కాలంతో పనిలేదు

నడకకు కాలంతో పనిలేదు

కాళ్ళతోనే !!
2. కాళ్ళు కష్టపడితే ,  ఒళ్ళు సుఖపడుతుంది !
3. కాళ్ళు ముందడుగువేస్తే
రోగం  వెనుకంజ  వేస్తుంది !
4. నడక ఆరోగ్యాన్నే కాదు ,
       పరిచయాలనీ మెరుగుపరుస్తుంది
5. కాళ్ళు రోడ్డునపడితే ఒళ్ళు తేలికపడుతుంది
6. నవ్వుతూ నడవండి   సుఖంగా బ్రతకండి !
7. ఆయుహ్ ప్రమాణం పెరగాలంటే
     కాళ్ళమీద ప్రయాణం కావాలోయ్ !
8. కలసి నడుద్దాం ,  వెతలు మరుద్దాం !
9. కాళ్ళు రోడ్డున పడితే  జబ్బులు దిగాలు పడతాయి !
10. రోగానికి లింగభేదం లేదు!
        వయోభేదం లేదు !
        కులమతాల రిజర్వేషన్లు అసలులేవు !
        నడకకూ అంతే !
11. ఉదయపు నడకకు రారండి !
       ఉచితంగా విటమిన్  " డి " పొందండి !
12. stay fit ,  walk a bit

13. long walk everyday !
       keeps ది medicin away !

15. కాళ్ళు రోడ్డెక్కి తే
        రోగం అటకెక్కుతుంది !. Yes a good message, WALKING is
Mother of Health
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

Sunday, May 28, 2017

గుండె పోటు.

గుండె పోటు.

దయచేసి మీరు మీ రెండు నిమిషాల సమయం వెచ్చించి దీన్ని చదవండి.
1అది రాత్రి7.25 గం.లనుకొందాం. ఆ రోజున ఎన్నడు లేనంతగా విపరీతంగా పనిలో శ్రమించి ఇంటికి మరలా లనుకొందాం(కాకపోతే ఒంటరిగా).
2మీరు నిజంగానే బాగా అలసి, విసిగి వేసారి ఉన్నారు.
3 ఉన్నట్టుండి మీకు ఛాతీ లో తీవ్రమైన నెప్పనిపిస్తూవుంది
ఆ నెప్పి మీ దవడ లోపలి నుండి మీ చేయి వరకూ గుంజేస్తూ వుంటుంది.
మీ ఇంటి నుండి ఏదేనీ దగ్గరగా వుండే ఆసుపత్రికి మధ్య దూరం 5 కి.మీ. అనుకొందాం.
4దురదృష్టవశాత్తు, అంతవరకూ మీరు చేరుకోగలరో లేదో మీకు తెలియదనుకొందాం.
5 మీరు CPR లో శిక్షణ పొందిన వారైయుండొచ్చును గానీ ఆ శిక్షణనిచ్చినతను అది మీకు మీరే ఎలా చేసుకోవాలో నేర్పలేదనుకొందాం.
6 మీరు ఎవరూ పక్కన లేని ఒంటరి సమయంలో వచ్చే గుండె పోటుని తట్టుకొని తేరుకుని బతికేదెలా?
చాలా మంది గుండె పోటు ఎదురైనప్పుడు  సాయం చేయటానికి పక్కన ఎవరు లేక ఒంటరిగా వుంటారు.
వారి గుండె అస్తవ్యస్తంగా కొట్టుకొంటూవుంటుంది.బాగా నీరసం అనిపిస్తుంది. ఇక స్పృహ కోల్పోవటానికి కేవలం పదే పది క్షణాలు మిగిలి వుండొచ్చు.
7అయినా సరే ఈ భాధితులు పదేపదే బాగా గట్టిగా దగ్గేయడం ద్వారా తమకు తామే సాయంచేసుకొని  రక్షించుకోవచ్చు.
దగ్గే ప్రతీసారి బాగా వూపిరి తీసుకోవాలి.ఆ దగ్గు కూడా బాగా గొంతు లోపలనుండి వచ్చేలా కాస్తంత ఎక్కువ సేపు దగ్గాలి.అదీనూ ఛాతీ లోలోపల నుంచి కళ్ళె బయటకు కక్కేలా/ఊసేలా.
ఏదేనీ సాయం అందేవరకీ,లేదా గుండె మరల మామూలు గానే పనిచేస్తుంది అని మీకు అనిపించేంత వరకూ ఎడతెరిపి లేకుండా ప్రతీ రెండు సెకన్లకొకసారి మార్చి ,మార్చి ఊపిరి తీసుకొంటూ గట్టిగా దగ్గుతూ వుండాలి.
8 గట్టిగా తీసుకొనే ఊపిరి ఆక్సిజన్ ని ఊపిరి తిత్తులకు చేరవేస్తుంది.గట్టిగా దగ్గే దగ్గు కదలికల వల్ల గుండెని నొక్కినట్టై రక్తప్రసరణ కొనసాగుతుంది.
బాగా నొక్కపెట్టినట్టు అనిపించే ఒత్తిడి కూడా గుండె తిరిగి యథాస్థితిలో పని చేయటానికి దోహదం చేస్తుంది.
ఇలాగా గుండె పోటు భాధితులు ఏదేనీ ఓ ఆసుపత్రికి చేరేలోపున ప్రమాదాన్ని దూరంగా పెట్టొచ్చు.
9ఈ విషయాన్ని వీలైనంత ఎక్కువగా ఇతరులకు చెప్పండి. అది వారి ప్రాణాలు కాపాడవచ్చు.
10ఓ హృద్రోగ నిపుణులు ఏమంటారంటే ఈ సందేశం అందుకొన్న ఎవరైనా దయతో మరో పది మందికి పంపుదురు అని .ఇలా చేసి కనీసం ఒక్క ప్రాణాన్ని అయినా కాపాడలేమా అని మీరు సవాలుగా తీసుకోవాలని.
11జోకులు గట్రా పంపటం లాంటివి కన్నా దయచేసి ఓ వ్యక్తి ప్రాణం నిలిపే ఈ సందేశాన్ని పదిమందికి
తెలియజేయండి.
12 ఇదే సందేశం పంపిన మీకే మరలా పదే పదే వస్తుంటే దయచేసి చికాకు పడకండి.
మీరంటే శ్రద్దతో  ,ప్రేమతో ఈ గుండె పోటుని ఎలా ఎదుర్కోవాలో తెలియచేసే మిత్రులు ఇందరున్నారా అని మీరు సంతోషపడే విషయం సుమా ఇది
మీ కోసం  ఈ సందేశం పంపిన వారు.
డా.ఎన్. శివ
హృద్రోగ నిపుణులు.     

Wednesday, May 24, 2017

ఆయుర్వేద గ్రంధాలలో చెప్పబడిన రహస్య ఆరోగ్య సూక్తులు


ఆయుర్వేద గ్రంధాలలో చెప్పబడిన రహస్య ఆరోగ్య సూక్తులు

 రాత్రి యొక్క ఆఖరి ఆయామం అనగా బ్రహ్మముహూర్తం నందు నిద్ర నుండి మేల్కోవాలి.
 ఉదయం , సాయంసమయం నందు స్నానం ఆచరించవలెను.
 మలమూత్ర మార్గములను , పాదములను ఎల్లప్పుడు శుభ్రముగా ఉంచుకొనవలెను.
 నిత్యం శిరస్సు , ముక్కు, పాదముల యందు తైలము ను ఉపయోగించుకొనవలెను
 వెంట్రుకలు , గోళ్లు , గడ్డము నందు రోమములు 15 రోజులకు మూడుసార్లు హరించవలెను
 పితృదేవతలకు పిండప్రదానం చేయువాడిగా ఉండవలెను .
 భయము లేకుండా దైర్యవంతునిగా ఉండవలెను . భయము కలుగుటచే రోగములు ఉద్భవించును.
 గొడుగు, తలపాగా, కర్ర సహాయంగా ఉంచుకొనుము . కొండలు ,సంచారం లేని ప్రదేశం నందు ఒంటరిగా ఇవి లేకుండా సంచరించరాదు.
 శ్రమ చేయుటకు ముందు శరీరముకు విశ్రాంతి ఇవ్వుము.
 ఆలోచనలతో భోజనము చేయరాదు. సకాలం నందు భొజనం చేయవలెను .
 రాత్రి కాని పగలు కాని భోజనం చేయకుండా ఉండటం వలన ఆయుక్షీణం .
 అజీర్ణం చేయుట , తినినవెంటనే మరలా తినుట వలన గ్రహణి వ్యాధికి కారణం అగును.
 కాలంకాని కాలము నందు ఆహారాం తీసుకోవడం వలన జఠరాగ్ని చెడును .
 అన్ని రకాల రుచులు అనగా తీపి , చేదు , కారం , వగరు , పులుపు , ఉప్పు ప్రతిరోజు తీసుకొనుట అలవాటుగా చేసుకొనవలెను . ఎల్లప్పుడూ ఒకేరూచి తీసుకోవడం బలహీనతకి కారణం అగును.
 ఆహారం అతిగా తీసుకోవడం వలన ఆమము శరీరం నందు సంచరించును. అనేక రోగాలు శరీరం నందు ఉద్భవించును.
 విరుద్ద ఆహారపదార్థాలు స్వీకరించరాదు.
 పాలు , నెయ్యి తృప్తిగా తినుటవలన ముసలితనం తొందరగా దరిచేరనివ్వదు.
 మజ్జిగ భోజనం చేసినతరువాత ప్రతిరోజు తీసుకోవడం వలన అగ్నిని వృద్ధి చేయను , విరుద్ద ఆహారపదార్థాలు తీసుకోవడం వలన కలుగు విషములను , గ్రహణి , మొలలు మొదలగు రోగములను నివారించును . పెరుగు నందు నాలుగోవ వంతు నీరు చేర్చిన ఆ మజ్జిగను తక్రమగును .ఇది అత్యంత గుణకారి .
 ప్రతి ఉదయం నోటి యందు నువ్వులనూనె పొసుకొని తెల్లటి నురుగు వచ్చేవరకు పుక్కిలించి బయటకి విడువవలెను . దీనిని దంతధావనం చేయుటకు పూర్వం చేయవలెను . ఆయిల్ పుల్లింగ్ అని వ్యవహరిస్తారు. దీనివలన దంతములు కు బలం కలుగును.దంతవ్యాధులు రానివ్వదు . నములువానికి రుచి తెలియును .
 రాత్రి సమయం నందు పెరుగు నిషిద్ధం .
 అన్ని పాలకంటే ఆవుపాలు శ్రేష్టం .
 వృక్షసంభందమైన నూనెలలో అన్నింటికంటే నువ్వులనూనె శ్రేష్టమైనది .
 నెయ్యిలన్నింటిలో ఆవునెయ్యి శ్రేష్టమైనది.
 పప్పుధాన్యాలలో అన్నింటికంటే పెసలు శ్రేష్టమైనవి .
 ఆకుకూరలలో పాలకూర శ్రేష్టం .
 దుంపజాతుల్లో అల్లం శ్రేష్టం .
 ఫలములలో ద్రాక్ష శ్రేష్టం .
 ఉప్పులలో సైన్ధవ లవణం శ్రేష్టం .
 చెరుకు నుండి తయారగు పంచదార శ్రేష్టం
 మినుములు అతిగా వాడరాదు.
 వర్షాకాలం నందు నదుల యందు ఉండు వర్షపు నీరు ప్రకృతి హితం కాదు.
 చవిటి ఉప్పు మంచిది కాదు.
 గొర్రెపాలు , గొర్రెనెయ్యి వాడకం మంచిది కాదు.
 పండ్లలో నిమ్మపండు అతిగా వాడరాదు.
 దుంపల యందు బంగాళాదుంప అతిగా వాడరాదు.
 మలమూత్ర వేగములను ఆపరాదు .
 ఆహారం అరగనప్పుడు ఉప్పు నీటిలో వేసి తాగిన ఆహారమని ద్రవరూపంలో మార్చి అరిగించును.
 హృదయముకి మేలు చేయటంలో ఆమ్లరసం శ్రేష్టమైనది .
 స్నానం శ్రమని తొలగించడంలో శ్రేష్టమైనది .
 విరిగిన పెరుగు మలమూత్ర మార్గములను అడ్డగించును.
 గేదెపాలు నిద్రని కలిగించడంలో శ్రేష్టమైనవి .
 ఉసిరికపచ్చడి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి తీసుకొవడం వలన వయస్సు నిలుపును .
 నెయ్యి వాతముని , పిత్తమును తగ్గించును
 నువ్వులనూనె వాతముని , శ్లేష్మముని తగ్గించును .
 తేనె శ్లేష్మమును , పిత్తమును తగ్గించును .
 కరక్కాయ ఎల్లకాలములలో వాడుకొనవచ్చు.
 ఇంగువ వాతమును , కఫమును తగ్గించును . ఆహారదోషములను కడుపు నుంచి మలరూపంలో బయటికి తోసివేయును జఠరాగ్ని వృద్ధిపరచును. .
 ఉలవలు అమ్లపిత్త వ్యాధిని కలుగజేయును .
 మినుములు శ్లేష్మముని , పిత్తమును వృద్ధిచేయును .
 అరటిపండు పాలతో , మజ్జిగతో తినకూడదు హానికరం .
 నిమ్మకాయ పాలతో , పెరుగుతో , మినపప్పు తో కూడి తినకూడదు .
 పాలుత్రాగడానికి ముందు గాని , పాలుత్రాగిన అనంతరం గాని నిమ్మరసం వాడరాదు .
 స్మృతి మద్యం వలన హరించును . మద్యం తాగరాదు.
 ఆహారానికి ముందు వ్యాయమం చేయవలెను . వ్యాయామం వలన శరీరభాగములు స్థిరత్వం పొందును .
 బ్రహ్మచర్యం ఆయువుని వృద్ధిపొందించును .
 నెలసరి సమయంలో స్త్రీ సంగమం వలన రోగాలు సంప్రాప్తిన్చును . నపుంసకత్వం సంభవించును.
 గర్భవతి వ్యాయాయం , తీక్షణమైన ఔషదాలు విడువవలెను .
 మలమూత్ర సమయం నందు వేరే కార్యక్రమాలు చేయరాదు .
 పిల్లలు , ముసలివారు , మూర్ఖులు , నపుంసకులు వీరితో ఎల్లప్పుడు సఖ్యం చేయరాదు .
 సంధ్యాకాలం నందు భోజనం , అధ్యయనం , స్త్రీసంగమం , నిద్ర చేయరాదు .
 రాత్రి సంచరించకూడని ప్రదేశములు యందు సంచరించకూడదు.
 మిక్కిలి వేగముగా ప్రవహించు జలం నందు స్నానం చేయరాదు .
 స్నానం చేసిన వస్త్రముతో తలని తుడుచుకోకూడదు .
 బడలిక తీరకుండా, ముఖం కడుగుకొనకుండా , వస్త్రము లేకుండా స్నానం చేయరాదు .
 నొటికి ఆచ్చాదన లేకుండా , ఆవలింత, తుమ్ము , నవ్వు ప్రవరింప చేయకూడదు .
 భూమిని గీయకూడదు , గడ్డి తుంచకూడదు.
 మట్టిబెడ్డలు చేతితో నలపకూడదు .
 అవయవములతో విషమమగు చేష్టలు చేయరాదు .
 ముక్కుతో శబ్దం చేయకూడదు .
 పళ్ళు కొరకకూడదు .
     పైన చెప్పబడిన ఆరోగ్యరహస్య సూక్తులు తప్పక పాటించవలెను . ప్రతి 40 రోజులకు శరీరం నందు అనేక మార్పులు జరుగుతుంటాయి . ఈ రోజు మీరు తీసుకున్న ఆహారం యెక్క రస ప్రభావం 40 రొజుల వరకు మీ శరీరం పైన ఉంటుంది. అందుకే దీక్షలు మండలం రోజులు ఉంటాయి . మండలం అనగా ఆయుర్వేద శాస్త్ర ప్రకారం 40 రోజులు . ఈ 40 రొజులు శుద్ధమైన ఆహారం , సాత్విక ఆహారం తీసుకొనడం వలన శరీరం శుద్ది అవుతుంది. అదేవిదంగా ప్రతి 28 రోజులకి మనిషి రక్తంలో మార్పు సంభంవించును . పాము కుబుసం విడిచినట్లే మనిషి కూడా చర్మ కణాలను విడుస్తాడు . వాటిని మృతకణాలు అంటారు. ఆంగ్లము నందు Dead Skin Cells అంటారు. ఇవి అత్యంత సూక్ష్మరూపంలో ఉంటాయి. వీటిగురించి ఆయుర్వేదం ఎప్పుడో వివరించింది.  రక్తం నందు మర్పు సంభవించు సమయంలో ఆ రోజంతా మగతగా ఉంటుంది. వొళ్ళు విరవడం ఎక్కువుగా జరుగును.  ఇలాంటివన్నీ ఆయుర్వేద గ్రంథాలలో నిగూఢముగా ఉన్నాయి .⁠⁠⁠⁠
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

















.