Pages

Wednesday, May 31, 2017

గుంటూరు శేషేంద్ర శర్మ

నోబెల్ కు నామినేట్ కాబడ్డ ప్రముఖసాహితీవేత్త.."గుంటూరు శేషేంద్ర శర్మ" గారివర్దంతి నేడు..

"జన బాహుళ్యంలో శేషేంద్ర గా సుపరిచు తులైన గుంటూరు శేషేంద్రశర్మ,  ప్రముఖ తెలుగు కవి, విమర్శకుడు, సాహితీవేత్త. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత".

 ఆధునిక సాహిత్యంపై తనదైన ముద్ర వేసిన గుంటూరు శేషేంద్ర శర్మ 30కి పైగా రచనలు చేసారు.ఈయన రచనలు అంతర్జాతీయ ఖ్యాతి గాంచాయి."నా దేశం-నా ప్రజలు" 2004 నోబెల్ సాహిత్య పురస్కారానికి నామినేట్ అయ్యింది..

రచనలు...
1951-"సోహ్రాబ్ - రుస్తుమ్" అనే పారశీక రచన తెలుగు అనువాదం (ఆంగ్ల రచన నుండి)1968-72 - శేషజ్యోత్స్న - కవిత, వచన రచనల సంకలనం1974 - మండే సూర్యుడు,1974 - రక్తరేఖ,1975 - నా దేశం - నా ప్రజలు,1976 - నీరై పారిపోయింది ,1977 - గొరిల్లా నరుడు ,- నక్షత్రాలుషోడశి - రామాయణ రహస్యములు,స్వర్ణ హంస, ఆధునిక మహాభారతం ,జనవంశం, కాలరేఖ  (సాహిత్య అకాడమీ అవార్డు) కవిసేన మేనిఫెస్టో , మబ్బుల్లో దర్బార్...1968 - సాహిత్య కౌముది,ఋతు ఘోష ,ప్రేమ లేఖలు.

ఆయన కవిత్వం..
కోపం కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుందో చూసారా ?
బాధ కన్నీరు పెడితే ఏమవుతుందో తెలుసా?
ఆవేశం అరుపు ఎప్పుడైనా విన్నారా?
భావావేశం బులెట్ లా మారుతుందని కలగన్నారా ?

పోనీ… కనీసం
రక్తం మరిగి రచనలా పలుకుతుందని,
హృదయం కరిగి కవితలా మారుతుందని,
ప్రేమ పొంగి పద్యమై పాడుతుందని,
ద్వేషం పెరిగి దండయాత్ర చేస్తుందని మీరెప్పుడైన అనుకున్నారా. కనీసం ఎవరైనా అంటుంటే విన్నారా. లేదు కదా. అయితే ఈ వ్యాసం చదవాల్సిందేనండి(తెలిసినా చదవండి తప్పు లేదు కదా).

పదండి…

 పైన చెప్పిన వాటిని అన్నిటిని అనుభవించిన వ్యక్తి ఒకరు ఉన్నారు, ఆయన గురించి ఇప్పటివరకు మనం వినకపోయుండొచ్చు, మన పెద్దోళ్ళు చెప్పకపోయుండొచ్చు, వాళ్ళ పెద్దొళ్ళకి తెలియకపోయుండొచ్చు.కాని, అలాంటి వ్యక్తి గురించి మన తరానికి తెలియాల్సిన అవసరం చాలా అంటే చాలా ఉంది.

 ఆయన తను అనుభవించిన ప్రతీది ప్రజలందరికి పంచాలని కవితలు ,పద్యాలూ, వ్యాసాలు, కథలు ఇలా ఉన్న పద్దతులు అన్నిటిలో ప్రయత్నించారు. కనుక, ఆయన రచనలలోని కొన్ని ముఖ్య పంక్తులు అయినా మనకి తెలిసుంటే బావుంటుంది అనే ఉద్దేశంతో…

తామే గొప్ప, తాము చేసిందే వేదం,తాము లేకపోతె అసలు సృష్టే లేదు అన్నటు ప్రవర్తించే వారిని ఉద్దేశించి…
 రాహువుపట్టిన పట్టు
ఒక సెకండు ఆఖండమైనా
లోక బాంధవుడు  అస్సలే
రాకుండా పోతాడా ?

 మూర్ఖులు  గడియారంలో..
ముళ్లు తిరగనీయకుంటే
ధారాగమనం  అంతటితో
ఆగిపోతుందా..?

 కుటిలాత్మతుల  కూటమికొక
తృటికాలం విజయము వస్తే
విశ్వస్రుష్టి పరినామం
విచ్చిన్నమౌవుతుందా..?

తాము చెప్పినట్టు జరుగుతుంది, తమకు ఎదురు నిలిచే వారే లేరు అన్నట్టు ప్రవర్తించే వారిని ఉద్దేశించి…

 సముద్రం ఒకడి కాళ్ళ దగ్గర
కూర్చొని మొరగదు
తుఫాను ఒకడికి ఛిత్తం
అనటం ఎరగదు
పర్వతము ఎవ్వడికి వంగి
సలాం చేయదు..

జరుగుతున్నా పరిణామాలకు ఏమి చేయలేక…

 గడిచిన  చరిత్రలో నాకు తావు లేదు
నడుస్తున్న చరిత్రకు నీతి లేదు..
డాములెందుకు  కడుతున్నారో..
భూములెందుకు దున్నుతున్నారో..
నాకే తెలీదు ....నా బ్రతుకొక సున్నా
కానీ నడుస్తున్నా..

ప్రకృతిలో తానూ ఒక భాగం అంటూ…

 "కొండలతో సముద్రాలతో కలసిబ్రతికేవాడికి తుఫానులో లెక్కా?

తుఫాను తుఫానులే ఎగిరిపోతున్నాయి
ఈగల్లా ఎగిరే ఈ క్షుద్ర బాధలో లెక్కా..?"

నీకెందుకింత అశాంతి, నీకెందుకింత ఆవేశం అంటే…
 సముద్రాన్ని అడుగు..
నీకెందుకింత అశాంతి అని
ఝుంఝుమారుతాన్ని అడుగు
నీకెందుకింత ఆవేశం అని"

ఏది లేకపోయినా…
 కాలాన్ని నా కాగితం చేసుకుంటా..
దాని మీద లోకానికి ఒక స్వప్నం రాసిస్తా
దాని కింద నా ఊపిరితో సంతకం చేస్తా!!

ఎందుకు ప్రజలకు జ్ఞానం భోదపడదు అన్నప్పుడు…

 తిండిలేని వారి ఆకలి
తియ్యటి కావ్యాలు తీరుస్తాయా?
దేశం సుబిక్షంగా ఉన్నపుడే
విద్య వికాసమౌతుంది..

పట్నం జీవితంలో ఇమడలేక…
 "ఈ చెట్లుందుకు పూలే పూస్థాయి
ఈ నికృష్టపు నాగరికత విడిచే
బొగ్గుపులుసు వాయువు పీలుస్తూ..
ఇవి బుల్లెట్లెందుకు పూయవు?"

జీవితం గురించి ఒక్క మాటలో…

"ఇక్కడ జీవితం ఎవడిని వదిలిపెట్టదు
మనిషి నించి మనిషికి నిప్పింటిస్తుంది.."

మీరెలా ఇలా కవితలు రాయగలరు అన్నప్పుడు…

"కవిత్వం ఎర్రరంగు గుర్రంలా వస్తుంది
రక్తంలో ముంచిన బాణంలా..
...వీరుడు విడిచిన ప్రాణంలా..!

నిజంగా కోల్పోవటం అంటే…

"వసంతం అంటే అందరికి తెలీదు
కోకిలను కోల్పోయిన కొమ్మలకి తెలుసు
పాటలను కోల్పోయిన పక్షులకు తెలుసు

ఈ దేశంలో బ్రతకటం గురించి…

 నా దేశపు పగలు రాళ్ళుకు తగిలి
పగులుతున్న పడవలు
నా దేశపు రాత్రులు గుండెకు
తగిలి రగులుతున్న గొడవలు..

దేశం లోని దౌర్జన్యాలు చూడలేక…

 "అరే , ఈ కొండలు ఆరవవెం..
ఈ రాత్రుల కాపాలాలు పగలవేం..
ఈ నక్షత్రలు చచ్చి నెలకు రాలవేం..
ఈ గుంపు వినరే నా మాట..
నా దేశంలో నా గొంతు
పరాయిదైపోయింది..!

ఆత్మాభిమానం గురించి…
 "నాఅవయవాలకు నీచంగా వంగే
భంగిమలు తెలియవు..
-నేను సత్యాగ్రహి
          సత్యం
నా గుండెల్లో బడ్డలవుతున్న అగ్నిపర్వతం
నా గొంతులో గర్జిస్తున్న జలపాతం..

 రవీంద్ర నాథ్ టాగూర్ తర్వాత నోబుల్ సాహిత్య పురస్కారానికి నామినేట్ చేయబడిన సాహితీవేత్త… గుంటూరు శేషేంద్ర శర్మ గారు!

అవార్డులు..

1993 - సుబ్రహ్మణ్య భారతి రాష్ట్రీయ సాహిత్య పురస్కారం
1999 -సాహిత్య అకాడమీ అవార్డు
రాష్ట్రీయ సంస్కృత ఏకతా పురస్కారం
1994 - తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ .

విశేషాలు..

 శేషేంద్ర శర్మ, 1975లో విడుదలైన ప్రముఖ  తెలుగు సినిమా ముత్యాలముగ్గు లో  "నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది" అనే ప్రసిద్ధమైన పాట రాశాడు.ఆ సినిమాలో అధిక భాగం శేషేంద్ర నివాసమైన జ్ఞానబాగ్ పాలెస్ లో చిత్రీకరించబడింది. ఇది ఈయన  సినిమాలకోసం రాసిన ఒకేఒక్క పాట.

మరణం..

శేషేంద్రశర్మ మే 30, 2007వ తేదీ రాత్రి గుండెపోటుతో కన్నుమూశాడు.  ఈ కార్యక్రమానికి అనేకమంది సాహితీప్రియులు, అధికారులు, రాజకీయవేత్తలు, సామాజిక సేవాసంస్థల ప్రతినిధులు హాజరైనారు.

 ఆయన, జనం మేలుకొని ప్రభంజనం అవ్వాలని కోరుకున్నారు. నేల విడిచి సాము చేయటం మాని, నేల సాగు చేయటం తెలుసు కోవాలన్నారు. పట్నం లో ఇనుప గోడల మధ్య బందీగా ఉండటం కన్నా, పొలంలో దుక్కి దున్నటం గొప్పని ఆయన అభిప్రాయం. ఆయన రచనలు చదివితే ఉత్తెజితులు అవ్వటం ఖాయం. కుదిరితే ప్రయత్నించండి,

(జ:అక్టోబర్ 20,1927-మ:మే 30, 2007)






Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

SMART PHONES _ PROBLEM & SOLUTION

SMART PHONES _ PROBLEM & SOLUTION


ఎంతటి గొప్ప స్మార్ట్‌ఫోన్‌లో అయినా ఏదో ఒక సమయంలో ఏదో ఒక సాంకేతిక లోపం తలెత్తక తప్పదు. అలాగే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలోనూ సాంకేతిక లోపాలు తలెత్తటం సహజం. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో తలెత్తే పలు సమస్యలు, వాటిని పరిష్కరించుకునేందుకు సులువైన మార్గాలను మీకు సూచించటం జరుగుతోంది..

సమస్య: ఇంటర్నల్ మెమరీ తక్కువుగా ఉంది.

పరిష్కారం: ఫోన్‌లో పేరుకుపోయి ఉన్న బ్రౌజింగ్ హిస్టరీతో పాటు క్యాచీలను తొలగించటం ద్వారా ఫోన్ ఇంటర్నల్ మెమరీని పెంచుకోవచ్చు.


సమస్య: బ్లూటూత్ పని చేయటం లేదు

పరిష్కారం: ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసి రిస్టార్ట్ చేయటం ద్వారా సమస్య పరిష్కారమయ్యే అవకాశముంది. బ్లూటూత్ షేర్ క్యాచీని తొలగించటం ద్వారా బ్లుటూత్ అంతరాయం లేకుండా పనిచేస్తుంది.

సమస్య : బ్యాటరీ బ్యాకప్ త్వరగా తగ్గిపోతోంది.

పరిష్కారం: ఫోన్‌లోని కనెక్టువిటీ ఫీచర్లుతో పాటు బ్యాక్ గ్రౌండ్ అప్లికేషన్‌లను నిలిపి వేయటం ద్వారా బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకోవచ్చు.

సమస్య: ఆండ్రాయిడ్ ఫోన్ మెమురీ కార్డును గుర్తించటం లేదు.

పరిష్కారం: సదరు మెమరీ కార్డును ఫార్మాట్ చేయటం ద్వారా సమస్య పరిష్కారమవుతుంది. ఇలా చేయాలంటే.. Go to settings > Storage > Format SD card > Ok

సమస్య: ఫోన్ సిమ్‌కార్డ్‌‌ను గుర్తించటం లేదు

పరిష్కారం: ముందుగా వేరే సిమ్‌లను వేసి ప్రయత్నించిండి. ఒకవేళ సమస్య మీ సిమ్ కార్డ్‌లో ఉంటే పరిష్కరించుకోవచ్చు. మీరు అడాప్టర్‌తో కూడిన మైక్రోసిమ్‌ను వినియోగిస్తున్నట్లయితే నానో సిమ్‌గా మార్చి ప్రయత్నించండి.

సమస్య: కెమెరా స్టార్ట్ అవటం లేదు

పరిష్కారం: ముందుగా సెట్టింగ్స్‌లోని యాప్స్ మెనూలోకి ప్రవేశించి కెమెరా యాప్‌ను సెలక్ట్ చేసుకోండి. కెమెరా యాప్ ఓపెన్ అయిన తరువాత 'Force stop' 'clear data', 'clear cache' ఆప్షన్‌లను 'Apply' చేయండి. చాట్ మెసెంజర్స్ వంటి థర్డ్ పార్టీ యాప్స్ కూడా ఈ సమస్యకు కారణం కావచ్చు. కాబట్టి కెమెరాను యాప్‌ను రీఇన్‌స్టాల్ చేసే ముందు ఓసారి వాటిని తొలగించి చూడండి. సమస్యకు పరిష్కారం లభించవచ్చు.

సమస్య: బ్యాటరీ చార్జ్ అవటనాకి ఎక్కువ సమయం పడుతోంది....?

పరిష్కారం: మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లోని బ్యాటరీ పూర్తిగా చార్జ్ అవటానికి ఎక్కువ సమయం తీసకుంటుందా..? అయితే ఇది హార్డ్‌వేర్ సమస్యే, చార్జర్‌కు సంబంధించిన యూఎస్బీ కేబుల్‌ను మార్చటం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు.

సమస్య : ఫోన్ హ్యాంగ్ అయిన సమయంలో ఏం చేయాలి

పరిష్కారం: రీస్టార్ట్ చేయటం ద్వారా ఫోన్ ను సాధారణ స్థితికి తీసుకురావచ్చు. తరచూ ఇలాను జరుగుతున్నట్లయితే ఖచ్చితంగా ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయవల్సిందే.⁠⁠⁠⁠
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

బస్సులకు బ్రేక్‌ వేస్తే కొద్ది దూరానికే ఆగిపోతాయి. కానీ రైలు ఆగదెందుకు?

ప్రశ్న:బస్సులకు బ్రేక్‌ వేస్తే కొద్ది దూరానికే ఆగిపోతాయి. కానీ రైలుకు అదాటుగా బ్రేకులు వేస్తే ఆగదెందుకు?

జవాబు: వేగంగా ప్రయాణించే వస్తువును ఆపడమంటే దాని వేగాన్ని శూన్యం చేయడమే. బ్రేకులు వేసినపుడు బస్సు చక్రాల వేగాన్ని శూన్యం చేసేలా నిరోధక బలం (Retardation force) పనిచేస్తుంది. వస్తువు వేగంలో మార్పును కలిగించే గుణం కేవలం బలానికే ఉంటుంది. ఆ బలం ప్రమాణం వేగం మీద, ఆ వాహనం ద్రవ్యరాశి మీద ఆధారపడి ఉంటుంది. ద్రవ్యరాశి, వేగాల లబ్దమే (product of mas and velocity) బలాన్ని నిర్దేశిస్తుందంటారు. ఈ లబ్దాన్ని ద్రవ్య వేగం (momentum)అంటారు. కాబట్టి ద్రవ్య వేగాన్ని శూన్యం చేయడానికే బ్రేకులు వేస్తారు. కథ ఇక్కడితో ఆగిపోదు. ఈ ద్రవ్య వేగాన్ని ఎంత కాలంలో శూన్యం చేస్తామన్న విషయం కూడా బలాన్ని నిర్దేశిస్తుంది. ఉదాహరణకు గంటకు 100 కి.మీ. వేగంతో ప్రయాణిస్తున్న 10 టన్నుల ద్రవ్యరాశిగల బస్సును ఒక సెకను కాలంలోనే ఆపాలంటే కావలసిన బలం విలువ పదికోట్ల న్యూటన్లవుతుంది. కానీ రైలు ద్రవ్యరాశి వేల టన్నులుంటుంది. అంటే అన్ని రెట్లు ఎక్కువ న్యూటన్ల బలాన్ని ప్రయోగించాలన్నమాట. అంత బలాన్ని రైలు చక్రాల మీద బ్రేకులతో ప్రయోగిస్తే ఏర్పడే ఘర్షణ శక్తి చాలా ఎక్కువ ఉంటుంది. అప్పుడు విపరీతమైన శబ్దంతో పాటు మంటలు వస్తాయి. ఆ వేడికి చక్రాలు కరిగిపోయే ప్రమాదం ఉంది. అలాగే రైలు పట్టాలు నునుపుగా ఉండడం వల్ల కూడా రైలును వెంటనే ఆపలేము.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌
రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

12 గంటల కాలంలో రెండు ముళ్ల మధ్య లంబం?

12 గంటల కాలంలో రెండు ముళ్ల మధ్య లంబం?

-కాలాన్ని కొలుచుటకు లేదా తెలుసుకొనుటకు ఉపయోగించే పరికరాన్ని గడియారం అంటారు.
-గడియారం అనేది ఆవర్తన సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది.
-గడియారంలోని మొత్తం భాగాల సంఖ్య 211.
-లోలకాన్ని కనుగొన్నది గెలీలియో.-గడియారంలోని లోలకం పొడవు 100 సెం.మీ.
-గడియారంలోని లోలకం అటు, ఇటు తిరుగుటనే డోలనావర్తన కాలం అంటారు.
-ఈ డోలనావర్తన కాలం విలువ 2 సెకన్లు అయితే దాన్ని సెకన్ల లోలకం లేదా సామాన్య లోలకం అంటారు.
-లోలకంలో ఒక కంపనానికి పట్టేకాలం ఒక సెకన్.
-గడియారంతో కాలాన్ని గంటలు, నిమిషాలు, సెకన్లలో తెలుసుకోవచ్చు.
-గడియారంలోని ముఖ్యమైన భాగాలు

1. డయల్
2. గంటల ముల్లు
3. నిమిషాల ముల్లు
4. సెకన్ల ముల్లు
 
డయల్
-డయల్ అనేది ఒక గడియారం బాహ్యభాగం. దీని లోపల ఒక వృత్తాకరపు లోహపు పలకపై 1 నుంచి 12 వరకు గల అంకెలు సమానదూరాల్లో ఉంటాయి. ఒక్కొక్క అంకె ఒక్కొక్క గంటను సూచిస్తుంది. మొత్తం మీద గడియారం 12 గంటలను సూచిస్తుంది. ఒక పూర్తిరోజు (24 గంటలు) గడువాలంటే గంటల ముల్లు రెండు పూర్తి భ్రమణాలు పూర్తిచేయాలి.

-గడియారంలోని ముళ్ల చలనాన్ని కోణాల్లో తీసుకున్నట్లయితే ప్రతిముల్లు ఒక పూర్తి భ్రమణానికి 360 డిగ్రీల కోణం చేస్తుంది.

-గడియారంలోని 12 గంటల మధ్యదూరాన్ని కోణాల్లో తెలియజేసినపుడు రెండు పక్కపక్క అంకెల మధ్యదూరం 360/12 = 30 డిగ్రీలకు సమానం.


☮గంటల ముల్లు (చిన్న ముల్లు)

-ఒక గడియారంలో గంటల ముల్లు అన్ని ముల్లుల కంటె చిన్నది.

-చిన్న ముల్లు ఒక పూర్తి భ్రమణం చేయడానికి పట్టేకాలం - 12 గంటలు.

-అంటే 12 గంటల్లో చిన్న ముల్లు చేసే కోణం - 3600

-ఒక గంటలో చిన్న ముల్లు చేసే కోణం - 360/12 = 300

-60 నిమిషాల్లో చిన్న ముల్లు చేసే కోణం - 300

-ఒక నిమిషంలో చిన్న ముల్లు చేసే కోణం - 30/60 = 1/2 డిగ్రీలు.

-60 సెకన్లలో చిన్న ముల్లు చేసే కోణం - 1/2 డిగ్రీలు

-1 సెకన్లో చిన్న ముల్లు చేసే కోణం - 1/120 డిగ్రీలు


❇పెద్దముల్లు (నిమిషాల ముల్లు)

-ఒక గడియారంలో నిమిషాల ముల్లు గంటల ముల్లు కంటె పెద్దది, సెకన్ల ముల్లు కంటె చిన్నది.

-నిమిషాల ముల్లు ఒక పూర్తి భ్రమణం చేయడానికి పట్టుకాలం = ఒక గంట లేదా 60 నిమిషాలు.

-అంటే నిమిషాల ముల్లు 60 నిమిషాల్లో చేసే కోణం - 3600

-ఒక నిమిషంలో పెద్దముల్లు చేసే కోణం - 360/60 = 60

-నిమిషాల ముల్లు ఒక నిమిషంలో చేసే కోణం - 60

-అంటే నిమిషాల ముల్లు 60 సెకన్లలో చేసే కోణం - 60

-నిమిషాల ముల్లు ఒక సెకన్లో చేసే కోణం - 6/60 = 1/10 డిగ్రీలు.

సెకన్ల ముల్లు

-ఒక గడియాంలో అన్ని ముళ్లలోకి పొడవైనది సెకన్ల ముల్లు.

-అంతేగాక గంటల ముల్లు, నిమిషాల ముల్లు కంటే సెకన్ల ముల్లు వేగంగా కదులుతుంది.

-సెకన్ల ముల్లు ఒక పూర్తి భ్రమణం చేయడానికి ఒక నిమిషం పడుతుంది.

-అంటే 60 సెకన్లు పూర్తి చేయడానికి 360 డిగ్రీల కోణం చేస్తుంది.

-ఒక సెకనుకు 6 డిగ్రీల కోణం చేస్తుంది.

-సెకన్ల ముల్లు వేగం = 360 డిగ్రీలు/ నిమిషం = 6 డిగ్రీలు/సెకన్

గమనిక-1
-గడియారంలో పెద్ద, చిన్న ముల్లుల నిష్పత్తి..

= 6 : 1/2
= 12 : 1
= 360 : 30

-గడియారంలో పెద్ద, చిన్న ముల్లుల సాపేక్ష వేగం/ఉమ్మడి వేగం = 6 -1/2 = 11/2 డిగ్రీలు = 51/2 డిగ్రీలు.


గమనిక-2
-గడియారంలో ఒంటి గంట సమయంలో రెండు ముళ్ల మధ్య కోణం - 30 డిగ్రీలు.
-గడియారంలో రెండు గంటల సమయమప్పుడు రెండు ముళ్ల మధ్య కోణం - 2 (30) = 60 డిగ్రీలు.
-గడియారంలో నాలుగు గంటల సమయమప్పుడు రెండు ముళ్ల మధ్యకోణం = 4(30) = 120 డిగ్రీలు
-గడియారంలో ఐదు గంటల సమయమప్పుడు రెండు ముళ్ల మధ్య కోణం = 5(30) = 150 డిగ్రీలు
-గడియారంలో ఎనిమిది గంటల సమయమప్పుడు రెండు ముళ్ల మధ్య కోణం = 8(30) = 240 డిగ్రీలు
-గంటల ముల్లు, నిమిషాల ముల్లుల మధ్య కోణం = 30h-(11/2)m లేదా (11/2)m-30h
-ఇక్కడ అంటే పరమమూల్యం విలువ అని అర్థం. ఈ రెండు గీతల మధ్య ఉన్న విలువను ఎల్లప్పుడు ధనాత్మకంగా తీసుకోవాలి.

మోడల్-1
సమయం ఇచ్చినప్పుడు రెండు ముల్లుల మధ్యకోణం కనుగొనుట

ఉదా-1: గడియారంలో సమయం 2 గంటల 30 నిమిషాలప్పుడు రెండు ముళ్ల మధ్య కోణం ఎంత?

ఎ. 1650 బి. 1050
సి. 1110 డి. 1100

-సమాధానం-బి


వివరణ

-కోణం = 30h-(11/2)m
-ఇక్కడ h = 2, m = 30 ప్రతిక్షేపించగా = 30(2)-(11/2)(30) = 1050

షార్ట్కట్
-గంటల సంఖ్యను 30తో గుణించి, నిమిషాల సంఖ్య సగం చేసి వాటిని కలపాలి. నిమిషాల సంఖ్యను ఆరుతో గుణించి రెండింటిని తీసివేయాలి.
-కోణం = (2(30)+(30/2))-30(6)
= 75-180
= 105 (రుణ గుర్తును విస్మరించాలి)

ఉదా-2:
ఒక గడియారంలో సమయం 7 గంటల 30 నిమిషాలు అయినప్పుడు రెండు ముళ్ల మధ్య కోణం ఎంత?

వివరణ
(210 + 15)-180 = 450


మోడల్-2

☮గడియారంలోని రెండు వరుస గంటల మధ్య ముళ్లు ఏకీభవించునప్పుడు సమయాన్ని కనుగొనుట

-ఒక గడియారంలోని గంటల ముల్లు, నిమిషాల ముల్లు ఒకదానిపై మరొకటి చేరి రెండు ఒకే దిశను చూపించిన ఆ స్థితిని ఈక్వినాక్టికల్ స్థితి అంటారు. దీనినే ముల్లు ఏకీభవించు స్థితి అంటారు.


-ఒక గడియారంలోని గంటల ముల్లు, నిమిషాల ముల్లు ప్రతి గంటకు ఒకేసారి ఒకే దిశలో ఏకీభవిస్తాయి. కానీ 11 -12 గంటల మధ్య, 12 - ఒంటి గంటల మధ్య ఈ స్థితి రాదు. కచ్చితంగా 12 గంటలకు రెండు ముళ్లు ఏకీభవిస్తాయి.

-అంటే 12 గంటల కాలంలో 11 సార్లు, 24 గంటల కాలంలో 22 సార్లు ముళ్లు ఏకీభవిస్తాయి. ఈ స్థితిలో ముళ్ల మధ్య కోణం 0 డిగ్రీలుగా ఉంటుంది.

ఉదా-1

: 3, 4 గంటల మధ్య ఏ సమయంలో గడియారంలోని రెండు ముళ్లు కలిసి ఉంటాయి?

వివరణ

కోణం = 30h-(11/2)m
0 = 30(3)-(11/2)m
(11/2)m = 90
m =90(2/11) = 180/11 = 16 4/11నిమిషాలు

-3 గంటల 16 4/11 నిమిషాలు సమయప్పుడు రెండు ముళ్లు ఏకీభవిస్తాయి.

షార్ట్కట్

-3(30) = 90(2/11) = 180/11 = 16 4/11నిమిషాలు
(మొదట గంటలను 30తో గుణించి దానికి 2/11చే గుణించి మిశ్రమ భిన్నం చేయాలి)

ఉదా-2

: 9, 10 గంటల మధ్య ఏ సమయంలో గడియారంలోని రెండు ముళ్లు కలిసి ఉంటాయి?
వివరణ

-9(30) = 270(2/11)=540/11
= 49 1/11నిమిషాలు

మోడల్-3
గడియారంలోని గంటల ముల్లు, నిమిషాల ముల్లు మధ్యకోణం లంబకోణం అగుట

-ఒక గడియారంలోని గంటల ముల్లు, నిమిషాల ముల్లుల మధ్య కోణం 90 డిగ్రీలు ఉంటే ఈ రెండు ముళ్లు లంబంగా ఉన్నాయని అర్థం.

ఉదా-1: గడియారంలో 4, 5 గంటల మధ్య ఏ సమయంలో రెండు ముళ్ల మధ్య కోణం 90 డిగ్రీలుగా ఉంటుంది?

ఎ. 4 గంటల 38 2/11 నిమిషాలు
బి. 5 గంటల 38 2/11 నిమిషాలు
సి. 4 గంటల 30 2/11 నిమిషాలు
డి. 5 గంటల 30 2/11 నిమిషాలు

-సమాధానం-ఎ

వివరణ
-షార్ట్కట్
4(30)+90 = 120+90 = 210(2/11) = 420/11 = 38 2/11 నిమిషాలు
4(30)-90 = 120-90 = 30(2/11) = 60/11 = 5 5/11 నిమిషాలు

-అంటే 4 గంటల 38 2/11 నిమిషాలు, 4 గంటల 5 5/11 నిమిషాల సమయమప్పుడు రెండు ముళ్ల మధ్య కోణం 90 డిగ్రీలుగా ఉంటుంది.

గమనిక
-గడియారంలో ప్రతి గంటకు రెండుసార్లు రెండు ముళ్ల మధ్య కోణం లంబంగా ఉంటుంది.
 కానీ 12 గంటల కాలంలో 22 సార్లు, 24 గంటల కాలంలో 44 సార్లు రెండు ముళ్లు లంబకోణాలను ఏర్పరిచే విధంగా కలుస్తాయి.


మోడల్-4

ఉదా-1
: 4, 5 గంటల మధ్య గడియారంలోని రెండు ముళ్లు ఎప్పుడు సరళకోణంలోకి వస్తాయి?
ఎ. 4 గంటల 54 2/11 నిమిషాలు
బి. 4 గంటల 54 6/11 నిమిషాలు
సి. 5 గంటల 54 2/11 నిమిషాలు
డి. 5 గంటల 54 6/11 నిమిషాలు

-సమాధానం-బి
గమనిక
-6 గంటలకు ముందు ఉంటే 180 కలుపాలి.
-6 గంటలకు తర్వాత ఉంటే 180 తీసివేయాలి.

వివరణ

4(30) = 120 + 180 = 300(2/11) = 600/11 = 54 6/11 నిమిషాలు
-అంటే 4 గంటల 54 6/11 నిమిషాల సమయమప్పుడు రెండు ముళ్లు వ్యతిరేక దిశలో ఉంటాయి.

ఉదా-2

: 7, 8 గంటల మధ్య రెండు ముళ్లు ఎప్పుడు సరళకోణంలోకి వస్తాయి?
ఎ. 7 గంటల 5 2/11 నిమిషాలు
బి. 7 గంటల 5 5/11 నిమిషాలు
సి. 7 గంటల 5 6/11 నిమిషాలు
డి. 7 గంటల 5 3/11 నిమిషాలు
-సమాధానం-బి

వివరణ

-7(30) = 210 - 180 = 30(2/11) = 60/11 = 5 5/11 నిమిషాలు
-అంటే 7 గంటల 5 5/11 నిమిషాల సమయమప్పుడు రెండు ముళ్లు వ్యతిరేక దిశలో ఉంటాయి.

గ్రీన్ టీ దీన్ని ఎలా త‌యారుచేస్తారో,ఎవ‌రు తాగ‌కూడ‌దో తెలుసా ?

గ్రీన్ టీ దీన్ని ఎలా త‌యారుచేస్తారో,ఎవ‌రు తాగ‌కూడ‌దో తెలుసా ?


గ్రీన్ టీ… నేడు చాలా మంది నోట వినిపిస్తున్న మాట ఇది. గ్రీన్ టీ తాగితే బ‌రువు త‌గ్గుతామ‌ని, సాధార‌ణ టీ క‌న్నా గ్రీన్ టీ ఎంతో బెట‌ర‌ని ఇప్పుడు చాలా మంది దీన్ని తాగేందుకు ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తున్నారు. అయితే నిజానికి గ్రీన్ టీ అంటే ఏమిటి..? ఆ టీ పొడిని ఏ ఆకుల‌తో త‌యారు చేస్తారు..? అస‌లు గ్రీన్ టీ వల్ల కేవ‌లం బ‌రువు మాత్ర‌మే త‌గ్గుతారా..? ఇంకా మ‌న‌కు దాని వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయి..? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

Camellia sinensis అనే మొక్క‌కు చెందిన ఆకుల‌నే గ్రీన్ టీ పొడిగా త‌యారు చేస్తారు. అది ఈ పొడి త‌యారీ సాధార‌ణ టీ పొడి త‌యారీలా ఉండ‌దు. వేరేగా ఉంటుంది. ఎలా అంటే… ఈ మొక్క ఆకులు లేత నుంచి కొద్దిగా ముదురుకు మారాక వాటిపై ఎండ త‌గ‌ల‌కుండా ప‌ర‌దా వంటివి క‌ప్పుతారు. దీంతో ఆ మొక్క‌ల‌కు ఉన్న ఆకులు రంగు మార‌తాయి. ఇలా కొద్ది రోజులు ఉంచాక ఆ ఆకుల‌ను తెంపి మ‌ళ్లీ వాటిని నీడ‌లో ఎండ‌బెట్టి రోలింగ్ చేస్తారు. ఆ త‌రువాత పొడి చేసి ప్యాక్ చేస్తారు. మొత్తం స‌హ‌జ‌సిద్ధ‌మైన ప‌ధ్ద‌తిలోనే జ‌రుగుతుంది. క‌నుక ఈ టీ పొడి మ‌న‌కు చాలా మంచిది. దీంతో త‌యారు చేసిన గ్రీన్ టీని తాగితే మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

గ్రీన్ టీని త‌యారు చేయాలంటే ఒక క‌ప్పు వేడి నీటికి ఒక టీస్పూన్ పొడి వేస్తే చాలు. అయితే నీటిని బాగా మ‌రిగించాక మాత్ర‌మే ఈ పొడిని వేసి 4 – 5 నిమిషాలు వేచి ఉండాలి. ఆ త‌రువాత వ‌చ్చే మిశ్ర‌మాన్ని వ‌డ క‌డితే గ్రీన్ టీ త‌యారైన‌ట్టే. అయితే నేడు చాలా మంది గ్రీన్ టీలోనూ చ‌క్కెర క‌లుపుకుని తాగుతున్నారు. కానీ అలా తాగితే మ‌ళ్లీ సాధార‌ణ టీ తాగిన‌ట్టే అవుతుంది. క‌నుక చ‌క్కెర లేకుండా అలాగే డైరెక్ట్‌గా తాగితేనే కింద చెప్పిన ఫ‌లితాలు క‌లుగుతాయి. అవేమిటంటే…

1. గ్రీన్ టీని రోజూ ఉద‌యం, సాయంత్రం తాగ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు త‌గ్గుతాయి. సైంటిస్టులు చేసిన ప‌రిశోధ‌న‌ల్లో తేలిన నిజ‌మిది. క్యాన్స‌ర్ క‌ణాల‌కు వ్య‌తిరేకంగా పోరాడే గుణాలు గ్రీన్ టీలో ఉంటాయి.

2. గ్రీన్ టీలో ప‌వ‌ర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మ‌న శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. ఇన్‌ఫెక్ష‌న్ల బారి నుంచి ర‌క్షిస్తాయి. ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం వంటి వ్యాధులు రాకుండా చూస్తాయి.

3. గ్రీన్ టీని రోజూ తాగితే గుండె సంబంధ స‌మ‌స్య‌లు రావు. ర‌క్త స‌రఫ‌రా మెరుగు ప‌డుతుంది.

4. మ‌ధుమేహం ఉన్న‌వారు గ్రీన్ టీ తాగితే వారి బ్ల‌డ్ షుగ‌ర్ కంట్రోల్ అవుతుంది.

5. గ్రీన్ టీ తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ పోతుంది. మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది. దీంతోపాటు కొవ్వు కూడా కరిగి అధిక బ‌రువు త‌గ్గుతారు.

6. నొప్పులు, వాపుల‌ను త‌గ్గించ‌డంలోనూ గ్రీన్ టీ ఎఫెక్టివ్‌గా ప‌నిచేస్తుంది.

7. గ్రీన్ టీని ఎప్ప‌టికీ తాగే వారి ఆయుష్షు కూడా పెరుగుతుంద‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి.

8. శ‌రీరంలో పేరుకుపోయిన వ్య‌ర్థ‌, విష ప‌దార్థాలు తొల‌గిపోతాయి. లివ‌ర్ శుభ్ర‌మ‌వుతుంది.

ఈ విష‌యాలు గుర్తు పెట్టుకోవాలి…

1. గ‌ర్భిణీలు మాత్రం డాక్ట‌ర్ల స‌ల‌హా మేర‌కు గ్రీన్ టీ తాగితే మంచిది. ఎందుకంటే ఇందులో ఉండే కొన్ని ఔష‌ధ గుణాలు క‌డుపులో ఉండే పిండాల‌కు ప‌డ‌క‌పోవ‌చ్చు.

2. గ్రీన్ టీ అనేది కేవ‌లం పెద్ద‌లు మాత్ర‌మే తాగాలి. పిల్ల‌లు తాగ‌కూడ‌దు. తాగితే వారికి పోష‌ణ స‌రిగ్గా అంద‌క వారు ఎద‌గ‌రు.

3. ర‌క్త‌హీన‌తతో బాధ‌ప‌డేవారు కూడా గ్రీన్ టీ తాగ‌కూడ‌దు. ఎందుకంటే గ్రీన్ టీ వ‌ల్ల శ‌రీరం ఆహారంలో ఉండే ఐర‌న్‌ను ఎక్కువ‌గా గ్ర‌హించ‌దు.

4. నిద్రలేమి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారు కూడా గ్రీన్ టీ తాగ‌కూడ‌దు. లేదంటే ఆ స‌మ‌స్య ఇంకా ఎక్కువ‌య్యేందుకు అవ‌కాశం ఉంటుంది.

5. హై బీపీ ఉన్న‌వారు కూడా గ్రీన్ టీ తాగ‌కూడ‌దు. ఎందుకంటే ర‌క్త‌స‌ర‌ఫ‌రా ఎక్కువ‌గా అవ‌డం వ‌ల్ల బీపీ ఇంకా పెరిగేందుకు అవ‌కాశం ఉంటుంది.
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

Monday, May 29, 2017

తెలుగులో వంద ఉత్తమ పుస్తకాలు

తెలుగులో వంద ఉత్తమ పుస్తకాలు


కన్యాశుల్కం - గురజాడ అప్పారావు
మహాప్రస్థానం- శ్రీశ్రీ
ఆంధ్ర మహాభారతం - కవిత్రయం
మాలపల్లి - ఉన్నవ లక్ష్మినారాయణ
చివరకు మిగిలేది - బుచ్చిబాబు
అసమర్థుని జీవయాత్ర - గోపీచంద్
అమృతం కురిసిన రాత్రి - దేవరకొండ బాలగంగాధర తిలక్
కాలాతీత వ్యక్తులు - డాక్టర్‌ శ్రీదేవి
వేయి పడగలు - విశ్వనాథ సత్యనారాయణ
కళాపూర్ణోదయం - పింగళి సూరన
సాక్షి - పానుగంటి లక్ష్మీనారాయణ
గబ్బిలం - గుఱ్ఱం జాషువా
వసు చరిత్ర - భట్టుమూర్తి
అతడు ఆమె - ఉప్పల లక్ష్మణరావు
అనుభవాలూ..జ్ఞాపకాలు - శ్రీపాద సుబ్రమణ్యశాస్త్రి
అముక్త మాల్యద - శ్రీకృష్ణదేవరాయులు
చదువు - కొడవగంటి కుటుంబరావు
ఎంకి పాటలు - నండూరి సుబ్బారావు
కవిత్వ తత్వ విచారము - డాక్టర్‌ సిఆర్‌ రెడ్డి
వేమన పద్యాలు - వేమన
కృష్ణపక్షం - కృష్ణశాస్త్రి
మట్టిమనిషి - వాసిరెడ్డి సీతాదేవి
అల్పజీవి - రావిశాస్త్రి
ఆంధ్రుల సాంఘిక చరిత్ర - సురవరం ప్రతాపరెడ్డి
ఆంధ్ర మహాభాగవతం - పోతన
బారిస్టరు పార్వతీశం - మెక్కుపాటి నరసింహశాస్త్రి
మొల్ల రామాయణం - మొల్ల
అన్నమాచార్య కీర్తనలు - అన్నమాచార్య
హంపీ నుంచి హరప్పా దాకా - తిరుమల రామచంద్ర
కాశీయాత్రా చరిత్ర - ఏనుగుల వీరాస్వామయ్య
మైదానం - చలం
వైతాళికులు - ముద్దుకృష్ణ
ఫిడేలు రాగాల డజన్‌ - పఠాభి
సౌందర నందము - పింగళి, కాటూరి
విజయవిలాసం - చేమకూర వేంకటకవి
కీలుబొమ్మలు - జివి కృష్ణారావు
కొల్లాయి గడితేనేమి - మహీధర రామమోహనరావు
మ్యూజింగ్స్‌ - చలం
మనుచరిత్ర- అల్లసాని పెద్దన
పాండురంగ మహత్యం - తెనాలి రామకృష్ణ
ప్రజల మనిషి - వట్టికోట ఆళ్వార్‌ స్వామి
పాండవోద్యోగ విజయములు - తిరుపతి వేంకటకవులు
సమగ్ర ఆంధ్ర సాహిత్యం - ఆరుద్ర
దిగంబర కవిత - దిగంబర కవులు
ఇల్లాలి ముచ్చట్లు - పురాణం సుబ్రమణ్యశర్మ
నీలిమేఘాలు - ఓల్గా
పానశాల - దువ్వూరి రామిరెడ్డి
శివతాండవం - పుట్టపర్తి నారాయణాచార్యులు
అంపశయ్య - నవీన్
చిల్లర దేవుళ్లు - దాశరథి రంగాచార్య
గణపతి - చిలకమర్తి లక్ష్మీనరసింహం
జానకి విముక్తి - రంగనాయకమ్మ
స్వీయ చరిత్ర - కందుకూరి
మ¬దయం - కెవి రమణారెడ్డి
నారాయణరావు - అడవి బాపిరాజు
విశ్వంభర - సినారె
దాశరథి కవిత - దాశరథి
కథాశిల్పం - వల్లంపాటి వెంకటసుబ్బయ్య
నేను.. నా దేశం - దర్శి చెంచయ్య
నీతి చంద్రిక - చిన్నయ సూరి
పెన్నేటి పాట - విద్వాన్‌ విశ్వం
ప్రతాపరుద్రీయం - వేదం వెంకటరాయశాస్త్రి
పారిజాతాపహరణం - నంది తిమ్మన
పల్నాటి వీర చరిత్ర - శ్రీనాథుడు
రాజశేఖర చరిత్ర - కందుకూరి
రాధికా సాంత్వనము - ముద్దు పళని
స్వప్ప లిపి - అజంతా
సారస్వత వివేచన - రాచమల్లు రామచంద్రారెడ్డి
శృంగార నైషధం - శ్రీనాథుడు
ఉత్తర రామాయణము - కంకంటి పాపరాజు
విశ్వ దర్శనం - నండూరి రామమోహనరావు
అను క్షణికం - వడ్డెర చండీదాస్
ఆధునిక మహాభారతం - గుంటూరు శేషేంద్రశర్మ
అడవి ఉప్పొంగిన రాత్రి - విమల
చంఘీజ్‌ ఖాన్‌ - తెన్నేటి సూరి
చాటు పద్య మంజరి - వేటూరి ప్రభాకరశాస్త్రి
చిక్కనవుతున్న పాట - జి లక్ష్మినరసయ్య, త్రిపురనేని శ్రీనివాస్
చితి.. చింత - వేగుంట మోహనప్రసాద్
గద్దర్‌ పాటలు - గద్దర్
హాంగ్‌ మీ క్విక్‌ - బీనాదేవి
ఇస్మాయిల్‌ కవిత - ఇస్మాయిల్
కుమార సంభవం - నన్నే చోడుడు
కొయ్య గుర్రం - నగ్నముని
మైనా - శీలా వీర్రాజు
మాభూమి - సుంకర, వాసిరెడ్డి
మోహన వంశీ - లత
నగరంలో వాన - కుందుర్తి
రాముడుండాడు రాజ్యముండాది - కేశవరెడ్డి
రంగనాథ రామాయణం - గోన బుద్దారెడ్డి
సౌభద్రుని ప్రణయయాత్ర - నాయని సుబ్బారావు
సూత పురాణం - త్రిపురనేని రామస్వామిచౌదరి
శివారెడ్డి కవిత - శివారెడ్డి
సాహిత్యంలో దృక్పథాలు - ఆర్ఎస్‌ సుదర్శనం
స్వేచ్ఛ - ఓల్గా
తెలుగులో కవితా విప్లవాల స్వరూపం - వేల్చేరు నారాయణరావు
కరుణశ్రీ - జంధ్యాల పాపయ్యశాస్త్రి

Sunday, May 28, 2017

ఏయే ఆల్క‌హాల్ డ్రింక్స్‌ను తాగితే ఎలాంటి ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు తెలుసా?

ఏయే ఆల్క‌హాల్ డ్రింక్స్‌ను తాగితే ఎలాంటి ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు ఉంటాయో తెలుసా..?

మ‌ద్యం సేవించ‌డం ఆరోగ్యానికి హానిక‌రం అని అంద‌రికీ తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ ఆ అల‌వాటును చాలా మంది మానుకోలేరు. కొంద‌రు ఆల్క‌హాల్‌ను లిమిట్‌లో తీసుకుంటే కొంద‌రు రోజూ అదే ప‌నిలో ఉంటారు. సరే… ఇది ఎలా ఉన్న‌ప్ప‌టికీ బీర్‌, విస్కీ, వోడ్కా, వైన్‌, బ్రాందీ… ఇలా ఆల్క‌హాల్‌లో ఉన్న ఒక్కో ర‌కం డ్రింక్‌ను మితంగా తీసుకుంటే దాంతో ప‌లు ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ట‌. ఇది మేం చెబుతోంది కాదు, సైంటిస్టుల ప‌రిశోధ‌న‌లో తేలిన నిజం. ఇంత‌కీ ఆ ప్ర‌యోజ‌నాలేంటో, ఏ డ్రింక్‌ను తాగితే ఏం లాభం క‌లుగుతుందో ఇప్పుడు తెలుసుకుందామా..!


విస్కీ…
వారానికి ఒక‌టి, రెండు పెగ్గుల విస్కీ తాగితే క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు చాలా త‌క్కువగా ఉంటాయ‌ట‌. గుండె స‌మ‌స్య‌లు కూడా రావ‌ట‌. గుండె ఆరోగ్యానికి మంచిద‌ట‌. బ‌రువు నియంత్ర‌ణ‌లో ఉంటుంది. దెమెంతియా, అల్జీమర్స్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.


వోడ్కా…
వోడ్కా తాగితే ఒత్తిడి, ఆందోళ‌న వంటివి దూర‌మ‌వుతాయ‌ట‌. డిప్రెష‌న్ త‌గ్గుతుంద‌ట‌. అంతేకాదు, నోటి దుర్వాస‌న పోతుంద‌ట‌. జుట్టు స‌మ‌స్య‌లు పోయి వెంట్రుక‌లు ఆరోగ్యంగా మారుతాయ‌ట‌. జుట్టు ఒత్తుగా పెరుగుతుంద‌ట‌. చుండ్రు త‌గ్గుతుంద‌ట‌. అధిక బ‌రువు త‌గ్గుతారు. బీపీ కంట్రోల్ అవుతుంది. దంతాల నొప్పులు పోతాయి.

రెడ్ వైన్‌…
రెడ్‌వైన్ తాగితే శ‌రీరంలో ఏర్ప‌డే హార్మోన్ అస‌మ‌తుల్య‌త‌లు త‌గ్గిపోతాయి. అన్ని అవ‌య‌వాలు స‌క్ర‌మంగా ప‌నిచేస్తాయి. మెట‌బాలిక్ రేట్ నియంత్ర‌ణ‌లోఉంటుంది. గుండె సంబంధ జ‌బ్బులు రావు. అంతేకాదు, రెడ్ వైన్ తాగేవారి ఆయువు పెరుగుతుంద‌ట‌. ఇత‌రుల‌తో పోలిస్తే వీరి ఆయుర్దాయం 34 శాతం పెరుగుతుంద‌ట‌.


టెకీలా…
దీన్ని సేవిస్తే గుండె జ‌బ్బులు రావు. జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు పోతాయి. గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్దకం ఉండ‌దు. జీర్ణ వ్య‌వ‌స్థ శుభ్ర‌మ‌వుతుంది. జీర్ణాశ‌యంలో ఉండే క్రిములు చ‌నిపోతాయి. ఆందోళ‌న‌, కంగారు వంటివి త‌గ్గుతాయి. అయితే దీన్ని వారానికి ఒక పెగ్గు మాత్ర‌మే తాగాలి సుమా..! లేదంటే ఆరోగ్యం క‌ల‌గ‌క‌పోగా, అనారోగ్యం బారిన ప‌డేందుకు అవ‌కాశం ఉంటుంది.


బ్రాందీ…
బ్రాందీ తాగితే నిద్ర చ‌క్క‌గా ప‌డుతుంది. నిద్ర స‌మ‌స్య‌లు ఉన్న‌వారు ఒక్క పెగ్గు బ్రాందీ తాగి ప‌డుకుంటే చాలు, హాయిగా నిద్ర‌పోవ‌చ్చ‌ట‌. శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఇన్‌ఫెక్ష‌న్లు న‌య‌మ‌వుతాయి. జ‌లుబు, ద‌గ్గు వంటివి త‌గ్గుతాయి. చెడు కొలెస్ట్రాల్ పోతుంది. చ‌లికాలంలో తాగితే రెట్టింపు లాభాలు క‌లుగుతాయి.


బీర్‌…
బీరు తాగితే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. వెంట్రుక‌లు దృఢంగా పెరుగుతాయి. ప్ర‌కాశ‌వంతంగా మారుతాయి. హైప‌ర్ టెన్ష‌న్ త‌గ్గుతుంది. మెద‌డు ప‌దునుగా మారుతుంది. గుండె ఆరోగ్యం చ‌క్క‌బ‌డుతుంది. క్యాన్స‌ర్ వంటి వ్యాధులు రావు. డ‌యాబెటిస్ రిస్క్ త‌గ్గుతుంది. కిడ్నీల‌కు చాలా మంచిది. విట‌మిన్లు శ‌రీరానికి అందుతాయి.


షాంపేన్‌…
షాంపేన్ వ‌ల్ల జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుంది. చ‌ర్మ స‌మ‌స్య‌లు పోతాయి. చ‌ర్మం మృదువుగా, ప్ర‌కాశవంతంగా మారుతుంది. మొటిమ‌లు, మ‌చ్చ‌లు, ముడ‌త‌లు పోతాయి. అధిక బ‌రువు తగ్గుతారు. గుండె ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. అల్జీమ‌ర్స్ వంటి వ్యాధులు రావు. దంత స‌మ‌స్య‌లు పోతాయి.


వైట్ వైన్‌…
వైట్ వైన్ వల్ల ఊపిరితిత్తులు శుభ్ర‌మ‌వుతాయి. దాని సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి. చ‌ర్మ స‌మ‌స్య‌లు పోతాయి. శ‌క్తి పెరుగుతుంది. రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. స్త్రీల‌లో బ్రెస్ట్ క్యాన్సర్ వ‌చ్చే ముప్పు త‌గ్గుతుంది. గుండె సంబంధ స‌మ‌స్య‌లు రావు. వ‌య‌స్సు మీద ప‌డ‌డం కార‌ణంగా వ‌చ్చే ముడ‌త‌లు పోతాయి. ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగుప‌డుతుం

సింపుల్ గా జీవించు వినమ్రతతో మెలుగు !

సింపుల్ గా జీవించు  వినమ్రతతో మెలుగు !


మనసారా ప్రేమించు !   .....    తృప్తిగా ఉండు !
 వింబుల్డన్ ప్లేయర్ Arthur Ashe మనకు అందిస్తున్న ఈ మెస్సేజ్ చదివితే మనం ఎలా ఆలోచించాలో తెలుస్తుంది .

1983 లో ఆర్థర్ గుండె ఆపరేషన్ కోసం రక్తం ఎక్కించుకోవలసి వచ్చింది . ఆ రక్తం ద్వారా అతడికి వచ్చింది AIDS
ఈ విషయం పేపర్లద్వారా ప్రపంచం అంతటా తెలిసింది . .
అనేక ఉత్తరాలు . మెయిళ్ళు. అతడికి ఎన్నెన్నో సానుభూతి వచనాలు . అందులో ఒక మె యిలు లో ఇలా ఉంది .

“ ఆర్ధర్ ! నీకే ఇలా అయ్యింది ఏమిటి ? ఇంతటి భయంకరమైన వ్యాధికి దేవుడు నిన్నే ఎంచుకున్నాడేమిటి ?”
.
ఈ మెయిలు చదివిన ఆర్థర్ దానికి సమాధానం ఇలా ఇచ్చాడు .

“డియర్ మిస్టర్ ! మీ మెయిలు నన్ను ఆలోచింప చేసింది .

5 కోట్ల మంది పిల్లలు టెన్నిస్ ఆడడం మొదలు పెడితే ,

500 000 మంది మాత్రమె ప్రొఫెషనల్ టెన్నిస్ లోకి వచ్చారు ,

వారిలో

50 వేల మంది మాత్రమె Circuit దశకు చేరుకున్నారు .

వారిలో

5 వేల మంది మాత్రమె గ్రాండ్ స్లామ్ కి చేరుకోగలిగారు.

వారిలో

50 మంది మాత్రమె వింబుల్డన్ కి వచ్చారు .

వారిలో

4 గురు మాత్రమె సెమీ ఫైనల్స్ కి వచ్చారు .

వారిలో

ఇద్దరు మాత్రమె ఫైనల్స్ కి వచ్చారు .

వారిలో

నేను మాత్రమె టైటిల్ గెలుచుకున్నాను .

మిత్రమా ? అప్పుడు నేను అడిగానా ?
 .
నాకు మాత్రమె ఈ గెలుపును ఎందుకు ఇచ్చావు అని దేముడిని నేను అడగలేదు కదా !

నాకు అంతటి సంతోషాన్ని ఇచ్చినప్పుడు ఆయనను ఎందుకు ఇచ్చావు అని అడగం
.
బాధను కలుగచేసినపుడు ఎందుకు అడగాలి ?

సంతోషం నిన్ను ఆహ్లాదపరుస్తుంది . పరీక్షలు నిన్ను ధైర్యవంతుడిని చేస్తాయి 🌴

బాధలు నిన్ను మానవుడిని చేస్తాయి . ఓటమి నీకు వినయాన్ని నేర్పుతుంది 🌴

విజయం నిన్ను ఆనందపరుస్తుంది . నమ్మకం నిన్ను నడిపిస్తుంది 🌴

నీ జీవితం నీకు ఆనందం కలిగించకపోవచ్చు  నీలా జీవించాలని కలలు కనే వాళ్ళు ఎందఱో ఉంటారు🌴

ఆకాశం లో ఎగిరే విమానాన్ని చూసి అందులో వెడితే ఎంతో బాగుంటుంది అని ఒక పిల్లవాడు అనుకుంటాడు .🌴కిందని ఉన్న మనుషులను చూసిఇంటికి ఎప్పుడు వెడదామా అని ఆ విమానం నడిపే పైలట్ అనుకుంటాడు అదే జీవితం !

డబ్బే ఆనందం అనుకుంటే డబ్బు ఉన్న ఆసామీలు అందరూ రోడ్ల మీద డాన్స్ లు చేస్తూ కనిపించాలి . కానీ రోడ్డుమీద నిక్కరు లేకుండా ఉండే పిల్లలు హాయిగా ఆనందంగా ఆడుకుంటూ కనిపిస్తారు 🌴
అధికారమే భద్రత అనుకుంటే VIP లు అందరూ ఎటువంటి రక్షణా లేకుండా తిరగాలి . కానీ అలా జరగడం లేదు .సింపుల్ గా ఉండే వాళ్ళే హాయిగా తిరుగుతున్నారు . హాయిగా నిద్రపోతున్నారు 🌴

చూడు నేస్తం !
.సింపుల్ గా జీవించు !
వినమ్రతతో మెలుగు !
మనసారా ప్రేమించు !
తృప్తిగా ఉండు !

నేటి పల్లెటూరు

నేటి పల్లెటూరు


..ఖాతాలుపెట్టి...
క్వార్టర్లు తాగుతుంటే...
తెల్లకార్డు... వాళ్ళ ఆరోగ్యాలకి జవాబుదారీగా మారిపోయింది.

ఇప్పుడు ఆ పల్లె.‌. నేల నిండా ఏదో విషాదం దాక్కోని ఉన్నది.
చెట్ల ఆకులక్కూడ ఏదో గుర్తించలేని
మాయదారి రోగం పీక్కు తింటున్నట్లు
బ్రతకలేక బ్రతుకుతున్నాయి .

కంది చేను ..శెనగ చేను..
వరి చేను..జొన్న చేను..
అన్నీ ..రైతుల కన్నీళ్ళతో పండుతున్నట్లు ధాన్యంలో అంతా తాలు గింజలే .

ఎటు చూసినా దిక్కుతెలియని స్తబ్దత...
ఎటు చూసినా అంతు తెలియని విష సాంద్రత.‌..
ఎటు చూసినా అర్ధం కాని  ఆమ్ల  క్షారత...

విత్తనాల్లో ఉండాల్సిన
మాతృబిందువు కూడా ఎక్కడా.. ఎవ్వరికీ.. కనిపించకుండా..
మాయం చేస్తూ...ఏదో దుష్ట శక్తి పల్లెటూర్లనన్నీటినీ.. దురాక్రమణ చేసింది.

రచ్చబండ లేదు...
ఊరిపెద్దలంటూ ఎవ్వరూ లేరు...
పెద్దవాళ్ళంతా ..కొత్త తరాలకి
వెర్రివాళ్ళైపోయారు.

ఏవడికి వాడే గాంధీ.‌.
ఏవడికి వాడే సూపర్ హీరో...
అడ్దగోలు దొంగ వ్యాపారాలు చేసినోడు
అడ్డ దారిలో దేవుడయిపోయాడు.
పైకి రావాలంటే అడ్డదారినే రావాలనంటూ
రుజువు చేసిన అతడి దారిలో దేశాన్ని అమ్మటానికి
యువకులంతా సిద్ధమై పోయారు.

ప్రభుత్వ పాఠశాలలన్నీ..
పనిచెయ్యకుండా ప్రభుత్వపు సొమ్ము తినే
పనికి రాని ..మనుషులకు
పనికి ఆహర పథకాలయ్యాయి.

చదువు చెప్పే టీఛర్లు..పిల్లలకు
తాము చదువు చెప్పుతున్నట్లు విపరీతంగా నటిస్తున్నారు.
పిల్లలు తాము చదువు నేర్చుకుంటున్నట్లు
విపరీతంగా నటించేస్తున్నారు.
తమ పిల్లలు  చదువు నేర్చుకుంటున్నట్లు
తల్లిదండ్రులు విపరీతంగా నమ్మేస్తున్నారు.

ఏటు చూసినా అంతా నటనే..
నిజాలు తెలిసినా ఎవరూ నమ్మకుండా.. మాట్లాడకుండా
అందరూ నటించటానికి అలవాటయిపోయారు

పశువుల డాక్టర్ వుద్యొగాన్ని
చేస్తున్నట్టు నటిస్తాడు.
మనుషుల డాక్టర్ కూడా వుద్యోగాన్ని
చేస్తున్నట్టు నటిస్తాడు.
కూలి పనికొచ్చిన వాళ్ళు
కూలి పనిచేస్తున్నట్టు నటించేస్తున్నారు..

పల్లెటూర్లు ఇప్పుడు
అమాయకపు పల్లెటూర్లు కావు..
పల్లెటూర్లన్నీ ఫిల్మ్ ఇన్సిట్యూట్లయ్యాయి
ప్రతిమనిషీ నటన నేర్చుకున్న మహా నటుడే.

పల్లెటూర్లల్లో ఒకప్పుడు 
గ్రామ వ్యక్తిత్వానికి హీరోలు ఉండే వాళ్ళు.
ఇప్పూడు హీరోలు లేరు.
కన్న తల్లి కడుపులో ఉండగానే..
తెలుగు టీవీ సాడిస్ట్ సీరియళ్ళు  చూసి..చూసి..
పళ్ళు పటపట కొరుకుతూ
పుట్టటమే విలన్లుగా పుడుతున్నారు.
మనుషులంతా  తమ అసలు రూపాలను
మర్చిపోయి మారువేషాలనే ..
అసలువేషాలుగా చేసుకోని..
నటన తెలీని వాళ్ళని పిచ్చివాళ్ళని
ప్రచారం చేస్తూ సుఖంగా  బ్రతుకు తున్నారు.

అర్ధరాత్రి దాక వచ్చేనిద్రని ఆపుకుంటూ
టీవీ సీరియల్స్ చూస్తూ మేల్కోవటం అలవాటయిపోయింది.
ఆంతరంగికంగా పీడకలలు కంటూ..
నిద్రని వెతుక్కోవటానికి అలవాటు పడిపోయారు.
బాహ్యశబ్దాలని చర్మేంద్రియాలద్వారా వింటూ
పగటిపూట కోడి నిద్రని అలవాటు చేసుకున్నారు.

గ్రామపంచాయతీ పంపునీళ్ళొస్తున్నాయని
వీధిబావుల్ని చెత్త చెదారాలు వేసి మరీ
పూడ్చేసుకున్నారు.
ఇప్పుడు ఊరు తగలబడిపోయినా
ఫైరింజన్ రావాల్సిందే..
అందరూ ఏడుస్తూ
నీళ్ళు లేక  కట్టుబట్టలతో నిలబడాల్సిందే.
కరెంటు లేకపోతే
అందరూ వీధి బావుల్ని
పల్లెటూర్లల్లో అప్పటికప్పుడు కొత్తగా తవ్వుకోవాల్సిందే.
ఊరు బాగుండాలని కోరుకునే వాళ్ళెప్పుడో పోయారు..
అందరూ నేను బాగుండాలని కోరుకునే వాళ్ళే...
నన్ను బాగుచేసేదే న్యాయం...
నాకు లాభాన్ని తెచ్చేదే ..ధర్మం .
నాకు డబ్బులోచ్చేలా చేసేదే నీతి.

పల్లెటూర్లల్లో కూడా మనిషి మనుగడకు
అర్ధాలు ..వ్యర్ధాలెప్పుడో అయిపోయాయి.
ప్రభుత్వం దెగ్గిరనించి ఏ పథకం వస్తుందా
ఏంత నొక్కేద్దామా
అని ఆలొచించేవాళ్ళే అందరూ..

పల్లెటూర్లు నాశనమవ్వటానికి
అగ్గి రాజేస్తున్నదెవ్వరు?
బుగ్గి పాలవుతున్నదెవ్వరు?
పల్లెటూర్లు నాశనమవ్వటానికి
మంటలు మండిస్తున్న దెవ్వరు?
మంటల్లో పడి నాశన మవుతున్నదెవ్వరు? 

ఇళ్ళల్లో గడ్డి వాములు లేవు.
ధాన్యాన్ని దాచే కొట్లు కూడా లేవు.
దాన్యాన్ని అటునించి అటే మార్కెట్ కి పంపేసి
స్టొర్ నించి కేజీ రెండు రూపాయల బియ్యాన్ని
తెచ్చుకోని మరీ..పొదుపు చేసినందుకు ఆనంద పడుతున్నారు.
పాడి బర్రెను మేపే ఓపిక లేక... చాలామంది
పొట్లాలపాలు తెచ్చుకోని
టీలు చేసుకుంటున్నారు.

జీవితాల్లో ప్రొడక్టివిటీ ఉన్నదన్న విషయాన్ని మర్చిపోయి
అందరూ టైంపాస్ కోసం టీవీల ముందు కూచోని
ప్రభుత్వం మాకేమీ చేయటల్లేదని
సామూహికంగా ఏడుస్తున్నారు

పల్లెటూర్లల్లో ఒకప్పటి ప్రాకృతిక
హృదయంగత  సంగీతం లేదు.
నిశ్శబ్దంగా వినిపించే ఒక అసాధారణ శబ్ద
సౌందర్యమూ లేదు.
ఒకప్పటి నిశ్శబ్దపు
కవిత్వమూ లేదు.
అనాదిగా కనిపించిన పురాతన
ప్రేమత్వమూ లేదు.

ఊళ్లల్లో బావులు ఎండిపొయాయి
ఊళ్ళల్లో మనుషులు ఎండిపొయారు.
ఊళ్ళల్లో చెరువులూ ఎండిపోయాయి.
పూవులు లేవు..పండ్లూ లేవు.

మనుషులు కేజీల లెక్కన అమ్ముడయి పోతున్నారు.
మనుషులని కేజీల లెక్కన కొంటున్నారు.

తారు రోడ్ల పక్కన పొలాలన్నీ...
రియల్ ఎస్టేట్ దెయ్యాల  వెంచర్లు అవుతున్నాయి.

పల్లెటూరి గుండెల్లోంచి పైకి తన్నుకొచ్చిన
కాంక్రీటు ముళ్ళలా... పొలాలల్లో
ఎటు చూసిన సరిహద్దు రాళ్ళే దర్శనమిస్తున్నాయి.

తరాలు మారకమందే ..
చూస్తూండగానే..
పల్లెటూర్లకు వృద్ధాప్యమొచ్చింది.

మనుషులందరూ బతికుండగానే
ఊరు మాత్రం కళేబరమయిపోయింది

మనుషుల అస్థిత్వం అబద్ధమయిపోయాక
ఊర్లన్నీ ఊసర క్షేత్రాలయ్యాక
ఊర్లన్నీ...అస్థిపంజారాలుగా మిగిలి పోతున్నాయి
మనుషులందరూ ఆదిమానవుల కాలం నాటికి..
పరుగెత్తుకుంటూ వెనక్కి వెళ్ళిపోతున్నారు..

భవిష్యత్తులో..
పల్లెటూర్లంటే..
కాలిపొయిన పున్నాగ వృక్షాలు..
పాడు పడ్డ రామాలయాలు..
నిర్జీవమయిన ఉదయ సాయంకాలాలు మాత్రమే.
..
ఎన్నడూ లేనిది..ఆ పల్లెటూర్లో
గుడి ముందు ధ్వజస్థంభం మీద
రాబందులు గూళ్ళు కట్టుకున్నాయి..
ఇళ్ళల్లో ఉన్న తులసి మొక్కల మీద
పిచ్చుకలు గడ్డితో ఆవాసం ఏర్పరచుకున్నాయి.
పట్ట పగలు మనుషులంటే ఏ మాత్రం బెరుకు లేకుండా
గుడ్లగూబలు.. ఇళ్ళల్లో ఆహారాన్ని వెతుకుతున్నాయి.

అది..అక్షరాలా.. కన్నతల్లే
ఇది..అక్షరాలా..  పల్లేటూరే

ఇప్పుడు ఆ పల్లెటూళ్లలో.
మనుషులు నవ్వటం మర్చిపోయారు.
మనుషులు తనివితీరా ఏడవటానికి సదా
యుద్ధ సన్నద్ధంగా ఉన్నారు.

ఇప్పుడు ఆ ఊళ్లల్లో నాగరికత పేరుతో
మనుషులు ప్లాస్టిక్ గ్లాసులతో
నీళ్ళు తాగుతున్నారు.

మోదుగాకు విస్తరాకుల బదులు.. బద్ధకించి రెడీమేడ్ ప్లాస్టిక్ ప్లేట్లు
గొప్పతనంగా ఇళ్ళకి  తెచ్చుకుంటున్నారు.

ఇప్పుడు ఆ పల్లెటూరి గాలిలో
ఎవరికీ తెలియకుండా
నగరపు యంత్రభూతాలు..
ఇంటింటికీ జేరిపోయాయి..

చాకలితో పని లేదు...వాషింగ్ మెషీన్ ఉన్నది.
కుమ్మరితో పని లేదు...ఫ్రిజ్ ఉన్నది.
మంగలితో పనిలేదు...షేవర్లు ఉన్నాయి.

దొడ్లో విశాలంగా పెరగాల్సిన మొక్కలని కూడా
చాకిరీ ఎవడు చెయ్యాలని...
కుండీలల్లోకి మార్చేసి..
వారానికోసారి చావకుండా నీళ్ళు పడుతున్నారు.

ఇంట్లో బర్రె పాలని ..
డైరీ ఫాం లకు పోసి..
అంతా బలం కోసం
రోజుకో బీ.కాంప్లెక్స్ గొలీలని మింగుతున్నారు.

మొగాళ్ళంతా బెల్టు షాపుల్లో

నా ఈ రాజ్యం లో పల్లెటూర్లు దేశానికి పట్టుకొమ్మ లు అనడం మర్చి పోవాలేమో.          

మనం గుడ్ ఇండియన్స్ కాదు. ఎందుకంటే.?

మనం గుడ్ ఇండియన్స్ కాదు. ఎందుకంటే.?


1) మాతృదేవోభవ , పితృదేవోభవ అని చెప్పిన దేశం భారత దేశం.      కానీ దానిని ఆచరించేది  ఆస్ట్రేలియా. ( పిల్లలు తల్లిదండ్రులను గౌరవించడంలో మొదటి స్థానం అస్ట్రేలియాది)

2) గురుదేవోభవ అని చెప్పినదేశం భారతదేశం..కానీ దానిని ఆచరించేది చైనా. ( గురువులను గౌరవించడంలో చైనా మొదటి స్థానంలో ఉంది.)

3) యత్ర నార్యంతు పూజ్యతే .... అని చెప్పిన దేశం భారతదేశం. కానీ ఆచరించేది నార్వే. ( మహిళలకు భద్రత మరియు గౌరవం ఇవ్వడంలో నార్వేది మొదటిస్థానం)

4) పెద్దలను , వృద్ధులను గౌరవించమని చెప్పిన దేశం భారత దేశం. కానీ ఆచరించేది ఐస్ ల్యాండ్. (మొదటి స్థానం ఐస్ ల్యాండ్ దే.)

5) సత్యమేవజయతే అని చెప్పిన దేశం భారత్ దేశం. కానీ దానిని ఆచరిస్తున్నది యూకే. (నిజాయితీ మొదటి స్థానం యునైటెడ్ కింగ్ డం దే.)

6) కష్టేఫలి , కృషితో నాస్తి దుర్భిక్షం.. అని చెప్పిన దేశం భారత దేశం. కానీ ఆచరిస్తున్నది దక్షిణ కొరియా. ( హార్డ్ వర్క్ లో మొదటి స్థానం సౌత్ కొరియా దే)

7) ప్రపంచానికి శాంతి సందేశం అందించిన దేశం భారతదేశం. కానీ ఆచరిస్తున్నది నార్వే.( ప్రశాంతత లో మొదటి స్థానం నార్వే దే.)

8) భగవద్గీత బోధించిన దేశం భారత దేశం. కానీ ఆచరిస్తున్నది జపాన్ .( కర్తవ్య నిర్వహణలో అంకితభావంలో  మొదటి స్థానం జపాన్ దే)

9) ఎన్నో నీతి నియమాలను నిర్దేశించిన దేశం భారత దేశం. కానీ ఆచరిస్తున్నది సింగపూర్.( క్రమ శిక్షణ లో మొదటి స్థానం సింగపూర్ దే)

10) విద్య ను, జ్ఞానాన్ని ప్రవచించిన దేశం భారత దేశం. కానీ నిలబెట్టుకున్నది ఫిన్లాండ్. ( విద్య , విలువలు  లో మొదటి స్థానం ఫిన్ ల్యాండ్ దే)

పై విషయాలలో స్వల్ప తేడాలతో టాప్ ట్వంటీ లో ఉన్న  దేశాలు ఇవి.. నార్వే, ఐస్ ల్యాండ్, డెన్మార్క్, స్వీడన్, ఫిన్ ల్యాండ్, జపాన్, యూకే, చైనా, స్విట్జర్లాండ్,  న్యూజిలాండ్, సింగపూర్ , దక్షిణ కొరియా, నెదర్లాండ్స్, యూఏఈ, ఆస్ట్రేలియా . చెప్పడం కాదు. చేసి చూపిస్తేనే విలువుంటుంది. లేకపోతె చెప్పేవి శ్రీరంగనీతులు అవుతాయి. పై విషయాలన్నింటిలో భారతదేశం యొక్క స్థానం అట్టడుగున ఉంది.
చెప్పేటందుకే నీతులు ఉన్నాయ్ అనే విధానం లో భారతదేశం మొదటి స్థానం లో ఉంది..

చెప్పటం మాని ఆచరించేే రోజు వస్తుందని ఆశిద్దాం.

పుస్తకాలు లేకపోతే అది ఇల్లే కాదు

పుస్తకాలు లేకపోతే అది ఇల్లే కాదు


పుస్తకానికి ప్రత్యామ్నాయం లేదు. మొబైలే సర్వస్వం కాదు. ఇంటర్నెట్‌ సకలం అందించదు. సరికొత్త చూపు కోసం చదువు మాత్రమే ఉపకరణం. నూతన ఆలోచనలకు అధ్యయనమే మార్గం. అందుకే ప్రతి నెల మనం ఏం చదివామో ఒకసారి బేరీజు వేసుకోవాలి. ఇది నెలాఖరు సమయం. ఈ నెలలో ఇప్పటివరకు ఏం పుస్తకాలు చదివారో పరిశీలించుకోవాలి. ఒక జాబితా తయారు చేసుకోండి. 'పుస్తకాలు లేని ఇల్లు దయ్యాల కొంప వంటిది' అన్నారో సిసిరో అనే తత్వవేత్త. అందుకే పుస్తకాలు లేకపోతే అది ఇల్లే కాదు. కనుక మీకు ఇష్టమైన పుస్తకాలేవో మీ ఇంట్లో ఉండాలి. ఏ రంగానికి సంబంధించిన వారయినా, తమ అభిరుచులకు అనుగుణమైన పుస్తకాలు మీ ఇంట ఉండాలి. ప్రతి ఆదివారం ఓ స్పెషల్‌ వంటకాన్ని తిన్నట్టుగానే ప్రతివారం ఓ కొత్త పుస్తకం చదవాలి.
పాత పుస్తకమైనా బాగా ఇష్టమైన పుస్తకాన్ని మరల మరల చదవాలి. బుచ్చిబాబు 'చివరకు మిగిలేది' నవల వడ్డెర చండీదాస్‌కు నిత్య పారాయణ గ్రంథం. చాలామంది శ్రీశ్రీ, తిలక్‌, బైరాగి, వజీర్‌ రెహమన్‌, శివసాగర్‌ వంటి కవుల పుస్తకాల్ని అప్పుడప్పుడు చదువుతుంటారు. విన్న పాటనే పదే పదే ఇష్టంగా విన్నట్టు, చదివిన పుస్తకాన్నే మరల చదవడం ఓ వినూత్న అనుభవం. ఇలా మీకు ఇష్టమైన పుస్తకాలు మీ ఇంట ఉండాలి. చలం 'మ్యూజింగ్స్‌' కూడా ఇలాంటి పుస్తకమే. చదివిన ప్రతి పర్యాయం ఓ కొత్త అనుభూతినీ, కొత్త ఆలోచననీ ప్రోది చేస్తుంటుంది.
జీవితచరిత్రలు గొప్ప స్ఫూర్తినిస్తాయి. ఉత్తేజాన్ని అందిస్తాయి. మన పూర్వులు జీవించిన కాలాన్ని, జీవితాన్ని మన ముందు దర్శింపజేస్తాయి. ఒకనాటి మనుషుల అనుభవాల పరంపరని రూపు గట్టిస్తాయి. ఆ వెలుగులో మన జీవితాల్ని మరింత మెరుగు పరుచుకోడానికి తోడ్పడతాయి. మనుషుల్ని మరింత మానవీయంగా మార్చే క్రమానికి దోహదం చేస్తాయి. అందువల్ల పుస్తకాల్ని చదవాలి. అరుదైన మంచి పుస్తకాల్ని వెదుక్కొని మరీ చదవాలి.
తెలుగులో, ఇంగ్లీషులో క్లాసిక్స్‌ అన్నీ చదవాలి. ఎవరి వృత్తి వ్యాపకాలు ఎలా వున్నా తెలుగులో 100 గొప్ప పుస్తకాలు చదవాలి. రామాయణం, మహాభారతం వంటి గ్రంథాలు చదవడమే కాదు, వాటిని ప్రశ్నించే పుస్తకాల్ని సైతం అధ్యయనం చేయాలి. మన ప్రాపంచిక దృక్పథం విస్తృతం కావడానికి చదువే ఆధారం. అందుకని ఎప్పటికప్పుడు మనల్ని మనం చెక్‌ చేసుకోవాలి. పుస్తకాలు చదవకుండానే వారాలు, నెలలు గడిచిపోతే కాలాన్ని వృధా చేస్తున్నట్టే. 2017లో అయిదో నెల కూడా గడిచిపోతోంది. ఈ అయిదు నెలల కాలంలో ఏం చదివారో గుర్తు చేసుకోండి. కనీసం జూన్‌లో ఏం చదవాలో ఇప్పుడే నిర్ణయించుకోండి. చదవాలనుకుంటూ చదవలేకపోతున్న పుస్తకాల జాబితా ఒక డైరీలోనో, మొబైల్‌ నోట్‌బుక్‌లోనే రాయండి. ఎందుకంటే చదవడానికి సైతం ప్లాన్‌ చేసుకోవాలి. లేదంటే కాలం మన మీంచి నిశ్శబ్దంగా వెళ్ళిపోతుంది. మనం మాత్రం నిలువనీరులా ఉండిపోతాం. ప్రవాహగుణాన్ని కోల్పోతాం. నిత్యం చదువుతున్న వారే ప్రవాహశీలతని సంతరించుకుంటారు. తద్వారా తమ జీవితాన్ని సృజనాత్మకంగా మలుచుకుంటారు. ప్రపంచ గమనాన్ని ఆకళింపు చేసుకుంటూ బతుకును సౌందర్యమయం చేసుకుంటారు. అందుకే పుస్తకాలు చదవడం దైనందిన జీవితంలో అంతర్భాగమై ఉండాలి.

గుండె పోటు.

గుండె పోటు.

దయచేసి మీరు మీ రెండు నిమిషాల సమయం వెచ్చించి దీన్ని చదవండి.
1అది రాత్రి7.25 గం.లనుకొందాం. ఆ రోజున ఎన్నడు లేనంతగా విపరీతంగా పనిలో శ్రమించి ఇంటికి మరలా లనుకొందాం(కాకపోతే ఒంటరిగా).
2మీరు నిజంగానే బాగా అలసి, విసిగి వేసారి ఉన్నారు.
3 ఉన్నట్టుండి మీకు ఛాతీ లో తీవ్రమైన నెప్పనిపిస్తూవుంది
ఆ నెప్పి మీ దవడ లోపలి నుండి మీ చేయి వరకూ గుంజేస్తూ వుంటుంది.
మీ ఇంటి నుండి ఏదేనీ దగ్గరగా వుండే ఆసుపత్రికి మధ్య దూరం 5 కి.మీ. అనుకొందాం.
4దురదృష్టవశాత్తు, అంతవరకూ మీరు చేరుకోగలరో లేదో మీకు తెలియదనుకొందాం.
5 మీరు CPR లో శిక్షణ పొందిన వారైయుండొచ్చును గానీ ఆ శిక్షణనిచ్చినతను అది మీకు మీరే ఎలా చేసుకోవాలో నేర్పలేదనుకొందాం.
6 మీరు ఎవరూ పక్కన లేని ఒంటరి సమయంలో వచ్చే గుండె పోటుని తట్టుకొని తేరుకుని బతికేదెలా?
చాలా మంది గుండె పోటు ఎదురైనప్పుడు  సాయం చేయటానికి పక్కన ఎవరు లేక ఒంటరిగా వుంటారు.
వారి గుండె అస్తవ్యస్తంగా కొట్టుకొంటూవుంటుంది.బాగా నీరసం అనిపిస్తుంది. ఇక స్పృహ కోల్పోవటానికి కేవలం పదే పది క్షణాలు మిగిలి వుండొచ్చు.
7అయినా సరే ఈ భాధితులు పదేపదే బాగా గట్టిగా దగ్గేయడం ద్వారా తమకు తామే సాయంచేసుకొని  రక్షించుకోవచ్చు.
దగ్గే ప్రతీసారి బాగా వూపిరి తీసుకోవాలి.ఆ దగ్గు కూడా బాగా గొంతు లోపలనుండి వచ్చేలా కాస్తంత ఎక్కువ సేపు దగ్గాలి.అదీనూ ఛాతీ లోలోపల నుంచి కళ్ళె బయటకు కక్కేలా/ఊసేలా.
ఏదేనీ సాయం అందేవరకీ,లేదా గుండె మరల మామూలు గానే పనిచేస్తుంది అని మీకు అనిపించేంత వరకూ ఎడతెరిపి లేకుండా ప్రతీ రెండు సెకన్లకొకసారి మార్చి ,మార్చి ఊపిరి తీసుకొంటూ గట్టిగా దగ్గుతూ వుండాలి.
8 గట్టిగా తీసుకొనే ఊపిరి ఆక్సిజన్ ని ఊపిరి తిత్తులకు చేరవేస్తుంది.గట్టిగా దగ్గే దగ్గు కదలికల వల్ల గుండెని నొక్కినట్టై రక్తప్రసరణ కొనసాగుతుంది.
బాగా నొక్కపెట్టినట్టు అనిపించే ఒత్తిడి కూడా గుండె తిరిగి యథాస్థితిలో పని చేయటానికి దోహదం చేస్తుంది.
ఇలాగా గుండె పోటు భాధితులు ఏదేనీ ఓ ఆసుపత్రికి చేరేలోపున ప్రమాదాన్ని దూరంగా పెట్టొచ్చు.
9ఈ విషయాన్ని వీలైనంత ఎక్కువగా ఇతరులకు చెప్పండి. అది వారి ప్రాణాలు కాపాడవచ్చు.
10ఓ హృద్రోగ నిపుణులు ఏమంటారంటే ఈ సందేశం అందుకొన్న ఎవరైనా దయతో మరో పది మందికి పంపుదురు అని .ఇలా చేసి కనీసం ఒక్క ప్రాణాన్ని అయినా కాపాడలేమా అని మీరు సవాలుగా తీసుకోవాలని.
11జోకులు గట్రా పంపటం లాంటివి కన్నా దయచేసి ఓ వ్యక్తి ప్రాణం నిలిపే ఈ సందేశాన్ని పదిమందికి
తెలియజేయండి.
12 ఇదే సందేశం పంపిన మీకే మరలా పదే పదే వస్తుంటే దయచేసి చికాకు పడకండి.
మీరంటే శ్రద్దతో  ,ప్రేమతో ఈ గుండె పోటుని ఎలా ఎదుర్కోవాలో తెలియచేసే మిత్రులు ఇందరున్నారా అని మీరు సంతోషపడే విషయం సుమా ఇది
మీ కోసం  ఈ సందేశం పంపిన వారు.
డా.ఎన్. శివ
హృద్రోగ నిపుణులు.     

మీకు ధ్రువీకరణ పత్రాలు అవసరమా..? అయితే ఇలా చేయండి!

మీకు ధ్రువీకరణ పత్రాలు అవసరమా..? అయితే ఇలా చేయండి!


కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతోంది. జూన్‌ మాసంలో కళాశాలలు, పాఠశాలలు పున:ప్రారంభమవుతున్న నేపథ్యంలో చాలా మంది విద్యార్థులకు, ఉద్యోగులకు, ప్రభుత్వం నుంచి సబ్సిడీ రుణాలు పొందే వారికి ధ్రువీకరణ పత్రాలు అవసరమవుతాయి. పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఇంటర్మీడియట్‌లో సీటును పొందే వారికి విధిగా కళాశాలలో కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు అవసరం అవుతాయి. వీటి ఆధారంగానే రిజర్వేషన్లతో పాటు స్థానికతను విద్యాసంస్థలు తెలుసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు ఉన్నత విద్యనభ్యసించే విద్యార్థులకు ప్రభుత్వం అందజేసే స్కాలర్‌షిప్‌కు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి కావడంతో ప్రస్తుతం మండల కార్యాలయాల్లో చాలా మంది ఈ ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకుం టున్నారు. నిబంధనలు తెలియక మధ్య దళారులను ఆశ్రయి స్తూ వారికి లంచాలు ఇస్తున్నారు. ధ్రువీకరణ పత్రాలు పొందడం అతి తేలికని, అందరూ నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చని తహసీల్దార్‌ కార్యాలయం చెప్తోంది. ఈ ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకునే వివరాలు మీ కోసం..

ఆదాయ ధ్రువీకరణ పత్రం కోసం..

ఆదాయ ధ్రువీకరణ పత్రం కోసం మీ సేవలో దరఖాస్తును నింపి దాంతో పాటు ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఆదాయ డిక్లరేషన్‌ లేదా వేతన సర్టిఫి కెట్‌ను జతచేయాలి. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారు వారి రేషన్‌ కార్డులో సూచిం చిన ఆదాయం ధ్రువీకరణ సరిపోతుంది. వీటితో పాటు అడ్రస్‌ ప్రూఫ్‌, ఐడెం టిటీ ప్రూఫ్‌ పత్రాలను జతచేస్తే తహసీల్దార్‌ కార్యాలయం సిబ్బంది విచారించి అర్హుల కు ధ్రువీకరణ పత్రాన్ని ఇస్తారు. గరిష్టంగా 7 పనిది నాలలోపు ఆదాయ ధ్రువీకరణపత్రం, తహసీల్దార్‌ కార్యాలయాల్లో అందించాలి.

గ్యాప్‌ సర్టిఫికెట్‌...

మండల కార్యాలయాల్లో గ్యాప్‌ సర్టిఫికెట్‌ కూడా లభిస్తుంది. విద్యలో వెనుకబడ్డ విద్యార్థులు, అనారోగ్య కారణాలతో చదవలేని వారు విధిగా ఉన్నత విద్య కోసం ఈ గ్యాప్‌ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ద్వారా స్కాలర్‌షిప్‌లు పొందేం దుకు ఈ సర్టిఫికెట్‌ విధిగా అవసరం అవుతుంది. దీని కోసం మీ సేవా కేంద్రాల్లో 10రూపాయల స్టాంప్‌ పేపర్‌పైన అఫిడవిట్‌ (విద్యలో ఎందుకు గ్యాప్‌ వచ్చిందో సూచిస్తూ) దాని నోటరీ, ఇద్దరు గెజిటెడ్‌ అధికారుల సంతకాలతో కూడిన సర్టిఫికెట్లు, విద్యార్హతల సర్టిఫికెట్లు, అనారోగ్య కారణాలతో చదువులో గ్యాప్‌ వస్తే వాటి మెడికల్‌ సర్టిఫికెట్లు జతచేయాలి. వీటిని పరిశీలించిన అనంతరం 15 పనిదినాల్లోపు మండల కార్యాలయం గ్యాప్‌ సర్టిఫికె ట్‌ను ఇస్తుంది.

నివాస ధ్రువీకరణ కోసం..

నివాస ధ్రువీకరణ కోసం దరఖాస్తుదారులు మీ సేవా కేంద్రాల్లో లభించే దరఖాస్తు పత్రాన్ని నింపాలి. దీంతోపాటు అన్ని విద్యార్హతల బోనోఫైడ్‌ సర్టిఫికె ట్లు, అడ్రస్‌ ప్రూఫ్‌, ఐడెంటిటీ ప్రూఫ్‌ జత చేసి 45రూపా యలు ఫీజును చెల్లిం చాలి. ఇది తహసీల్దార్‌ కార్యాల యానికి చేరుకున్న అనంతరం వీఆర్వోలు విచా రించి అన్ని సజావుగా ఉంటే ఏడు పనిదినాల్లో ధ్రువీకరణ పత్రాన్ని ఇస్తారు.

కుల ధ్రువీకరణ కోసం...

కుల ధ్రువీకరణ పత్రం పొందేందుకు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు పత్రాలు అన్ని మీసేవా కేంద్రాల్లో లభిస్తాయి. వాటిని పూర్తిగా నింపి దరఖాస్తుదారుడి చిరునామా ధ్రువీకరణ, ఫోటో ధ్రువీకరణ, కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఒకరిది పాత కులధ్రువీకరణ పత్రం లేక కుల సంఘం వారితో సర్టిఫికెట్‌, విద్యాసంస్థల నుంచి టీసీ, బోనోపైడ్‌ సర్టిఫికెట్‌ను జత చేసి 45రూపాయల ఫీజుతోపాటు మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలి. అక్కడ నుంచి తహసీల్దార్‌ కార్యాలయానికి దర ఖాస్తు చేరిన అనంతరం వీఆర్వో విచారణ చేసి సెక్షన్‌కు పంపుతారు. అక్కడి నుంచి డిప్యూటీ తహసీల్దార్‌, తహసీల్దార్‌ ధ్రువీకరణ అనంతరం ఆన్‌లైన్‌ చేసి మీ సేవ కేంద్రాల ద్వారా కుల ధ్రువీక రణపత్రం దరఖాస్తుదారుడికి అందుతుంది. ఈ పత్రం అన్ని తహసీల్దార్‌ కార్యాలయాల్లో 30 పనిదినాలలోపు అందించాలి. ధ్రువీకరణ పత్రాలు జతచేయకపోతే వాటిని తిరస్కరించే అధికారం కార్యాలయానికి ఉంది.

ఈబీసీ సర్టిఫికెట్‌..

ఈబీసీ సర్టిఫికెట్‌ అంటే ఎకనామికల్లీ బ్యాక్‌ వర్డ్‌ సర్టిఫికెట్‌(ఆర్థికంగా వెనుకబడ్డ ఉన్నత వర్గాలు) దీనిని ఓసీ కులస్తులు బ్రాహ్మణ, రెడ్డి, నాయుడు, కాపు, చౌదరి, వైశ్య తదితర ఉన్నత వర్గాల వారు మీ సేవా కేంద్రాల్లో దర ఖాస్తు చేసుకోవాలి. ఈబీసీ సర్టిఫికెట్‌ ఉంటే ప్రభుత్వం విద్య కోసం స్కాలర్‌ షిప్‌లను ఇస్తుంది. వీటి కోసం ఆదాయ పత్రాలు, రేషన్‌ కార్డు, వేతన స్లిప్‌, విద్యాసంస్థల టీసీ, కుల సంఘాల సర్టిఫికెట్‌, అడ్రస్‌, ఐడీ ప్రూఫ్‌లతో పాటు దరఖాస్తు చేసుకుంటే 7 పనిదినాల్లో సర్టిఫికెట్‌ను ఇస్తారు.

ఓబీసీ సర్టిఫికెట్‌..

ఓబీసీ సర్టిఫికెట్‌ పొందేందుకు దరఖాస్తుదారుడు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తును నింపి వాటితో పాటు కులాన్ని సూచించే సాక్ష్యంతో కూడిన పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు(ఆదాయ పన్ను కట్టేవా రు మూడు సంవత్సరాల ఐటీ రిటర్న్స్‌) ప్రైవేటు ఉద్యోగులు వేతన స్లిప్‌, దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారు రేషన్‌ కార్డు, విద్యార్హతల పత్రాలు జత చేసి మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలి. వీటిని విచారించి అర్హులైన వారికి 15పనిదినాల్లో ధ్రువీకరణ పత్రాన్ని ఇస్తారు.

దళారులను ఆశ్రయించవద్దు..

తహసీల్దార్‌ కార్యాలయాల్లో ధ్రువీకరణ పత్రాల కోసం నేరుగా దరఖాస్తు చేసుకోవాలి. మధ్య దళారులను ఎవరూ నమ్మరాదు. అన్ని అవసరమైన పత్రాలు జతచేస్తే నిర్ణీత కాల వ్యవధిలో ధ్రువీకర ణపత్రాలను ఇస్తాం. కుల, ఆదాయ, నివాస ధ్రు వీకరణ పత్రాల కోసం నోటరీ అఫిడవిట్‌, గెజిటెడ్‌ అధికారుల సంతకాలు తప్పనిసరి ఏమాత్రం కాదు. పాత ధ్రువీకరణ పత్రాలను లేదా కుటుంబసభ్యుల్లో ఎవరిదైనా పాత ధ్రువీకరణ పత్రాలు జతచేస్తే విచా రణలో మాకు సులభంగా ఉంటుంది. నిర్ణీత కాల వ్యవధిలో ధ్రువీకరణ పత్రాలను ఇస్తున్నాం. అం దరూ ఈ సేవలను వినియోగించుకోవచ్చు.

Friday, May 26, 2017

Telugu Messages Quotations Images for Whatsapp FB

Telugu Messages Quotations Images for Whatsapp FB





















corona telugu song dj, corona telugu news today, corona test procedure, corona telangana tv9, corona telugu whatsapp status, corona telangana live news, corona telugu news latest ap, corona telugu virus, corona telugu song, corona test kit, corona telugu news today, corona telugu song tik tok, corona telugu dj, corona telugu dj remix, corona telugu news latest live,  corona telugu web series, corona weather telugu, corona wellness telugu, corona what telugu, coronavirus telugu whatsapp status, corona holidays telugu whatsapp status, corona telugu dj whatsapp status, coronavirus telugu water, corona jokes telugu whatsapp status, corona dj song telugu whatsapp status, corona effect telugu whatsapp status, corons troll telugu whatsapp status, corona jokes telugu whatsapp status, coronavirus funny whatsapp status telugu, corona comedy videos telugu whatsapp status, coronavirus songs telugu whatsapp status, corona telugu funny videos, corona telugu funny song, corona telugu funny memes, coronavirus funny telugu, corona effect telgu funny whatsapp status, tiktok corona funny telugu, corona tiktok funny telugu, corona jokes tik tok telugu, corona jokes telugu lo, coronavirus joke tik tok in telugu, coronavirus funny jokes tok tok, funny videos on coronavirus in telugu, funny song on coronavirus in telugu, coronavirus comedy scenes telugu, telugu koronavirus dj songs, telugu koronavirus gurinchi, telugu koronavirus story, telugu coronavirus viral video, telugu corona comedy, telugu corona viruses news, coronavirus telangana telugu lo, coronavirus in telangana telugu news today, coronavirus video telangana in telugu, coronavirus death cases in telangana today, coronavirus in telangana tv9, coronavirus in andhra pradesh in telugu latest, coronavirus in andhra pradesh in telugu holidays, coronavirus in india andhra pradesh in telugu, coronavirus in ap in telugu nellore, comedy videos telugu funny, comedy videos telugu lo, comedy videos telugu tik tok, comedy videos telugu movies latest.

Wednesday, May 24, 2017

ఆయుర్వేద గ్రంధాలలో చెప్పబడిన రహస్య ఆరోగ్య సూక్తులు


ఆయుర్వేద గ్రంధాలలో చెప్పబడిన రహస్య ఆరోగ్య సూక్తులు

 రాత్రి యొక్క ఆఖరి ఆయామం అనగా బ్రహ్మముహూర్తం నందు నిద్ర నుండి మేల్కోవాలి.
 ఉదయం , సాయంసమయం నందు స్నానం ఆచరించవలెను.
 మలమూత్ర మార్గములను , పాదములను ఎల్లప్పుడు శుభ్రముగా ఉంచుకొనవలెను.
 నిత్యం శిరస్సు , ముక్కు, పాదముల యందు తైలము ను ఉపయోగించుకొనవలెను
 వెంట్రుకలు , గోళ్లు , గడ్డము నందు రోమములు 15 రోజులకు మూడుసార్లు హరించవలెను
 పితృదేవతలకు పిండప్రదానం చేయువాడిగా ఉండవలెను .
 భయము లేకుండా దైర్యవంతునిగా ఉండవలెను . భయము కలుగుటచే రోగములు ఉద్భవించును.
 గొడుగు, తలపాగా, కర్ర సహాయంగా ఉంచుకొనుము . కొండలు ,సంచారం లేని ప్రదేశం నందు ఒంటరిగా ఇవి లేకుండా సంచరించరాదు.
 శ్రమ చేయుటకు ముందు శరీరముకు విశ్రాంతి ఇవ్వుము.
 ఆలోచనలతో భోజనము చేయరాదు. సకాలం నందు భొజనం చేయవలెను .
 రాత్రి కాని పగలు కాని భోజనం చేయకుండా ఉండటం వలన ఆయుక్షీణం .
 అజీర్ణం చేయుట , తినినవెంటనే మరలా తినుట వలన గ్రహణి వ్యాధికి కారణం అగును.
 కాలంకాని కాలము నందు ఆహారాం తీసుకోవడం వలన జఠరాగ్ని చెడును .
 అన్ని రకాల రుచులు అనగా తీపి , చేదు , కారం , వగరు , పులుపు , ఉప్పు ప్రతిరోజు తీసుకొనుట అలవాటుగా చేసుకొనవలెను . ఎల్లప్పుడూ ఒకేరూచి తీసుకోవడం బలహీనతకి కారణం అగును.
 ఆహారం అతిగా తీసుకోవడం వలన ఆమము శరీరం నందు సంచరించును. అనేక రోగాలు శరీరం నందు ఉద్భవించును.
 విరుద్ద ఆహారపదార్థాలు స్వీకరించరాదు.
 పాలు , నెయ్యి తృప్తిగా తినుటవలన ముసలితనం తొందరగా దరిచేరనివ్వదు.
 మజ్జిగ భోజనం చేసినతరువాత ప్రతిరోజు తీసుకోవడం వలన అగ్నిని వృద్ధి చేయను , విరుద్ద ఆహారపదార్థాలు తీసుకోవడం వలన కలుగు విషములను , గ్రహణి , మొలలు మొదలగు రోగములను నివారించును . పెరుగు నందు నాలుగోవ వంతు నీరు చేర్చిన ఆ మజ్జిగను తక్రమగును .ఇది అత్యంత గుణకారి .
 ప్రతి ఉదయం నోటి యందు నువ్వులనూనె పొసుకొని తెల్లటి నురుగు వచ్చేవరకు పుక్కిలించి బయటకి విడువవలెను . దీనిని దంతధావనం చేయుటకు పూర్వం చేయవలెను . ఆయిల్ పుల్లింగ్ అని వ్యవహరిస్తారు. దీనివలన దంతములు కు బలం కలుగును.దంతవ్యాధులు రానివ్వదు . నములువానికి రుచి తెలియును .
 రాత్రి సమయం నందు పెరుగు నిషిద్ధం .
 అన్ని పాలకంటే ఆవుపాలు శ్రేష్టం .
 వృక్షసంభందమైన నూనెలలో అన్నింటికంటే నువ్వులనూనె శ్రేష్టమైనది .
 నెయ్యిలన్నింటిలో ఆవునెయ్యి శ్రేష్టమైనది.
 పప్పుధాన్యాలలో అన్నింటికంటే పెసలు శ్రేష్టమైనవి .
 ఆకుకూరలలో పాలకూర శ్రేష్టం .
 దుంపజాతుల్లో అల్లం శ్రేష్టం .
 ఫలములలో ద్రాక్ష శ్రేష్టం .
 ఉప్పులలో సైన్ధవ లవణం శ్రేష్టం .
 చెరుకు నుండి తయారగు పంచదార శ్రేష్టం
 మినుములు అతిగా వాడరాదు.
 వర్షాకాలం నందు నదుల యందు ఉండు వర్షపు నీరు ప్రకృతి హితం కాదు.
 చవిటి ఉప్పు మంచిది కాదు.
 గొర్రెపాలు , గొర్రెనెయ్యి వాడకం మంచిది కాదు.
 పండ్లలో నిమ్మపండు అతిగా వాడరాదు.
 దుంపల యందు బంగాళాదుంప అతిగా వాడరాదు.
 మలమూత్ర వేగములను ఆపరాదు .
 ఆహారం అరగనప్పుడు ఉప్పు నీటిలో వేసి తాగిన ఆహారమని ద్రవరూపంలో మార్చి అరిగించును.
 హృదయముకి మేలు చేయటంలో ఆమ్లరసం శ్రేష్టమైనది .
 స్నానం శ్రమని తొలగించడంలో శ్రేష్టమైనది .
 విరిగిన పెరుగు మలమూత్ర మార్గములను అడ్డగించును.
 గేదెపాలు నిద్రని కలిగించడంలో శ్రేష్టమైనవి .
 ఉసిరికపచ్చడి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి తీసుకొవడం వలన వయస్సు నిలుపును .
 నెయ్యి వాతముని , పిత్తమును తగ్గించును
 నువ్వులనూనె వాతముని , శ్లేష్మముని తగ్గించును .
 తేనె శ్లేష్మమును , పిత్తమును తగ్గించును .
 కరక్కాయ ఎల్లకాలములలో వాడుకొనవచ్చు.
 ఇంగువ వాతమును , కఫమును తగ్గించును . ఆహారదోషములను కడుపు నుంచి మలరూపంలో బయటికి తోసివేయును జఠరాగ్ని వృద్ధిపరచును. .
 ఉలవలు అమ్లపిత్త వ్యాధిని కలుగజేయును .
 మినుములు శ్లేష్మముని , పిత్తమును వృద్ధిచేయును .
 అరటిపండు పాలతో , మజ్జిగతో తినకూడదు హానికరం .
 నిమ్మకాయ పాలతో , పెరుగుతో , మినపప్పు తో కూడి తినకూడదు .
 పాలుత్రాగడానికి ముందు గాని , పాలుత్రాగిన అనంతరం గాని నిమ్మరసం వాడరాదు .
 స్మృతి మద్యం వలన హరించును . మద్యం తాగరాదు.
 ఆహారానికి ముందు వ్యాయమం చేయవలెను . వ్యాయామం వలన శరీరభాగములు స్థిరత్వం పొందును .
 బ్రహ్మచర్యం ఆయువుని వృద్ధిపొందించును .
 నెలసరి సమయంలో స్త్రీ సంగమం వలన రోగాలు సంప్రాప్తిన్చును . నపుంసకత్వం సంభవించును.
 గర్భవతి వ్యాయాయం , తీక్షణమైన ఔషదాలు విడువవలెను .
 మలమూత్ర సమయం నందు వేరే కార్యక్రమాలు చేయరాదు .
 పిల్లలు , ముసలివారు , మూర్ఖులు , నపుంసకులు వీరితో ఎల్లప్పుడు సఖ్యం చేయరాదు .
 సంధ్యాకాలం నందు భోజనం , అధ్యయనం , స్త్రీసంగమం , నిద్ర చేయరాదు .
 రాత్రి సంచరించకూడని ప్రదేశములు యందు సంచరించకూడదు.
 మిక్కిలి వేగముగా ప్రవహించు జలం నందు స్నానం చేయరాదు .
 స్నానం చేసిన వస్త్రముతో తలని తుడుచుకోకూడదు .
 బడలిక తీరకుండా, ముఖం కడుగుకొనకుండా , వస్త్రము లేకుండా స్నానం చేయరాదు .
 నొటికి ఆచ్చాదన లేకుండా , ఆవలింత, తుమ్ము , నవ్వు ప్రవరింప చేయకూడదు .
 భూమిని గీయకూడదు , గడ్డి తుంచకూడదు.
 మట్టిబెడ్డలు చేతితో నలపకూడదు .
 అవయవములతో విషమమగు చేష్టలు చేయరాదు .
 ముక్కుతో శబ్దం చేయకూడదు .
 పళ్ళు కొరకకూడదు .
     పైన చెప్పబడిన ఆరోగ్యరహస్య సూక్తులు తప్పక పాటించవలెను . ప్రతి 40 రోజులకు శరీరం నందు అనేక మార్పులు జరుగుతుంటాయి . ఈ రోజు మీరు తీసుకున్న ఆహారం యెక్క రస ప్రభావం 40 రొజుల వరకు మీ శరీరం పైన ఉంటుంది. అందుకే దీక్షలు మండలం రోజులు ఉంటాయి . మండలం అనగా ఆయుర్వేద శాస్త్ర ప్రకారం 40 రోజులు . ఈ 40 రొజులు శుద్ధమైన ఆహారం , సాత్విక ఆహారం తీసుకొనడం వలన శరీరం శుద్ది అవుతుంది. అదేవిదంగా ప్రతి 28 రోజులకి మనిషి రక్తంలో మార్పు సంభంవించును . పాము కుబుసం విడిచినట్లే మనిషి కూడా చర్మ కణాలను విడుస్తాడు . వాటిని మృతకణాలు అంటారు. ఆంగ్లము నందు Dead Skin Cells అంటారు. ఇవి అత్యంత సూక్ష్మరూపంలో ఉంటాయి. వీటిగురించి ఆయుర్వేదం ఎప్పుడో వివరించింది.  రక్తం నందు మర్పు సంభవించు సమయంలో ఆ రోజంతా మగతగా ఉంటుంది. వొళ్ళు విరవడం ఎక్కువుగా జరుగును.  ఇలాంటివన్నీ ఆయుర్వేద గ్రంథాలలో నిగూఢముగా ఉన్నాయి .⁠⁠⁠⁠
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

















.