డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలాం- Dr.A.P.J. Abdul Kalam
పేద
కుటుంబంలో పుట్టిన ఓ కుర్రాడు చిన్నప్పుడు చింతపిక్కలు ఏరి అమ్మాడు... పేపర్లు
పంచాడు... అయినా చదువును వదల్లేదు... ఆ చదువే అతడికి సోపానమైంది... పెరిగి పెద్దయి
దేశంలోనే అత్యున్నత పదవిని అందుకున్నాడు! ఎందరికో స్ఫూర్తిని పంచాడు! ఆయనే
శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్!
పుట్టిన రోజు ఇవాళే- 1931 అక్టోబర్ 15న.
మిసైల్
మ్యాన్ ఆఫ్ ఇండియా... పీపుల్స్ ప్రెసిడెంట్... ఈ పేర్లను ఎవరిని ఉద్దేశించి
చెబుతారో తెలుసా? డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్
కలాం గురించే! దేశ అత్యున్నత పీఠమైన రాష్ట్రపతి పదవిని అలంకరించడమే కాదు, దేశ అత్యున్నత పురస్కారమైన
భారతరత్నను కూడా పొందిన గొప్ప శాస్త్రవేత్త ఆయన. భారతదేశం అమ్ములపొదిలో అగ్ని, పృథ్వి, ఆకాశ్, త్రిశూల్, నాగ క్షిపణులు చేరడం వెనుక ఆయన
పాత్ర మరువలేనిది. దేశ పటిష్ఠతకు దోహదపడుతూనే చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకూ
అందరికీ అందుబాటులో ఉంటూ 'ప్రజల రాష్ట్రపతి'గా కలాం మన్ననలు పొందారు.
రామేశ్వరంలో
ఓ పేద ముస్లిం కుటుంబంలో 1931 అక్టోబర్ 15న పుట్టిన అవుల్ పకీర్
జైనులబ్దీన్ అబ్దుల్ కలాం కష్టపడి పైకెదికిన వ్యక్తి. తండ్రి ఒక దశలో పడవ
నడిపేవాడు. పాత ఇంట్లో ఎక్కువ మంది సభ్యులున్న కుటుంబంలో ఒకడైన కలాం, బడిలో చదువుకునే రోజుల్లో
మేనమామతో కలిసి దినపత్రికలు పంచడం, చింతపిక్కలు ఏరి అమ్మడం లాంటి పనులు చేసేవాడు. గాలి పటాలు
ఎగరేసినా, ఎగిరే పక్షుల్ని చూసినా
చిన్నారి కలాం ఆకాశంలో విహరించాలని కలలు కనేవాడు. ఓసారి ఉపాధ్యాయుడితో ఆ సంగతే
చెబితే ఆయన 'నువ్వు ఏం కావాలనుకున్నా
అవగలవు. కలలు కని, అందుకు తగిన కృషి చెయ్యి' అన్నారు. ఆ మాటలు కలాం మనసులో
నాటుకుపోయాయి.
ఎలాంటి
పరిస్థితులు ఎదురైనా కలాం చదువును నిర్లక్ష్యం చేయకుండా మద్రాసు ఇన్‌స్టిట్యూట్
ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోనాటికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఆపై డీఆర్‌డీవో
(డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్), ఇస్రో (ఇండియన్ స్పేస్
రీసెర్చ్ ఆర్గనైజేషన్)లలో పనిచేశారు. శత్రు లక్ష్యాలను ఛేదించే అగ్ని, పృథ్వి క్షిపణులకు ప్రత్యక్షంగా
రూపకల్పన చేశారు. తొలి దేశీయ ఉపగ్రహ ప్రయోగ నౌక (ఎస్‌ఎల్‌వీత్రీ) రూపకల్పనలో
పాల్గొన్నారు. దేశం విజయవంతంగా నిర్వర్తించిన అణుబాంబు పరీక్షలో కీలక పాత్ర
వహించారు. అంచెలంచెలుగా భారత రక్షణ శాఖకు సలహాలందించే శాస్త్రవేత్తగా ఎదిగారు. ఆయన
కృషికి గుర్తింపుగా పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారత రత్న పురస్కారాలు
లభించాయి. దేశవిదేశాల్లోని 30
విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లతో పాటు అంతర్జాతీయ అవార్డులు పొందారు. మన
దేశపు ప్రతిష్ఠాత్మక అంతరిక్ష కార్యక్రమం చంద్రయాన్‌కి సలహా సహకారాలు అందించారు.
పోలియో బాధితుల కోసం తేలికైన కాలిపర్ తయారీలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందజేశారు.
జీవితానుభవాలతో
ఆయన రాసిన 'వింగ్స్ ఆఫ్ ఫైర్', 'ఇగ్నైటెడ్ మైండ్స్', 'ఇండియా2020', 'మై జర్నీ' పుస్తకాలు తప్పక చదవవలసినవి.
భారతరత్న అబ్దుల్ కలాం
వర్ధంతి
సందర్భంగా... స్ఫూర్తినిచ్చే సూక్తులు...
బుధవారం, 27 జూలై 2016
👏1.
వర్షం
వస్తే పక్షులన్నీ వాటివాటి గూళ్లలో దాక్కుంటాయి. కానీ గద్ద మాత్రం వానకు అందనంత
దూరంలో మేఘాల పైన ఎగురుతూ ఉంటుంది.
👏2.
మానవుడికి
కష్టాలు కావాలి ఎందుకంటే విజయం సాధించినప్పుడు ఆనందించడానికి.
👏3.
నీ
భాగస్వామ్యం లేనిదే నీ విజయం సాధ్యం కాదు. నీ భాగస్వామ్యం లేనిదే నీ అపజయానికీ
తావులేదు.
👏4.
మనం
కేవలం విజయాల మీద నుంచే పైకి రాలేము. అపజయాల పై నుంచి కూడా ఎదగడం నేర్చుకోవాలి.
👏5.
కలలు
కనండి వాటిని సాకారం చేసుకోండి.
॥👏6. మనుషులు రకరకాల శక్తి
సదుపాయాలతో జన్మిస్తారు. తొందరగా శక్తిని ఖర్చు చేసుకుని అలసిపోయినవాడికే
అందరికన్నా ముందుగా బలాన్ని పుంజుకునే అవకాశం చిక్కుతుంది._
👏7.
నీకో
లక్ష్యముండటమే కాదు దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాధించుకునే వ్యూహ
నైపుణ్యం కూడా ఉండాలి.
👏8.
ఒక
సంక్షోభాన్ని ఎదుర్కొనే క్రమంలోనే మన ప్రతిభ మనకు తెలిసేది.
👏9.
ఒక
నాయకుడు తనచుట్టూ ఏమి జరుగుతుందో తెలుసుకోగలిగినప్పుడే తన బృందాన్ని స్వేచ్చగా
నడిపించగలడు.
👏10.
నువ్వొక
మనిషిని అవమానిస్తూ అతడి నుంచి ఫలితాలు రాబట్టుకోలేవు. అతన్ని ద్వేషిస్తూ, దూషిస్తూ అతనిలోని సృజనాత్మకతను
వెలికి తియ్యలేవు.
👏11.
హృదయాలతో
పనిచెయ్యని వాళ్ళ విజయం బోలుగా ఉండటమే కాక అది తన చుట్టూ వెగటుతనాన్నే వ్యాపింప
చేస్తుంది
హిందూ
ధర్మచక్రం
*అబ్దుల్ కలాం పూర్తిగా
శాకాహారి. మధ్యపాన వ్యతిరేకి. బ్రహ్మచారి. ఖచ్చితమైన వ్యక్తిగత క్రమశిక్షణను
పాటిస్తారు. "ప్రజలు.. తమ భార్యాపిల్లలకు తమ పిల్లల పిల్లలకూ ఆస్తులు
సంపాదించి పెట్టడం కోసమే అవినీతిపరులౌతారు" అంటూ ఆయన బ్రహ్మచర్యాన్ని
స్వీకరించారు. ఇస్లాం ప్రకారమైతే ప్రతి ముస్లిమూ పెళ్ళి చేసుకోవాలి.
[21:54,
27/7/2016] +91 94411 68368: కానీ, కలాం ఖురాన్‌తో పాటు, భగవద్గీతను కూడా చదువుతారు.
మతఘర్షణలను నిరసించే శాంతికాముకుడిగా పేరుగడించారు. ఈయన వింగ్స్ ఆఫ్ ఫైర్, సైంటిస్ట్ టు ప్రెసిడెంట్ వంటి
అనేక పుస్తకాలను రచించారు. ఎందరికో మార్గదర్శకులైన అబ్దుల్ కలాం జులై 27, 2015న సుదూర లోకాలకు
తరలివెళ్లిపోయారు.*
కొంతమంది
మనుషులు సైన్స్ అనేది వేరే ఒక అంశమనట్టుగా, అది మనిషిని భగవంతుడి నుంచి దూరం చేస్తుందన్నట్టుగా ఎందుకు
మాట్లాడుతారో నాకు అర్థం కాదు. విజ్ఞాన శాస్త్ర పథం మానవ హృదయ వీధుల్లోంచి సాగి
పోయేదే. నాకయితే సైన్స్ ఎప్పుడూ ఆధ్యాత్మిక ఉన్నతికీ, ఆత్మ సాక్షాత్కారానికి
మార్గంగానే ఉంటూ వచ్చింది.
No comments:
Post a Comment