సైబర్ మోసాలు తస్మత్ జాగ్రత్త,
చాలా మంది చాలా సరదాగా3G ఫ్రీఅని , 4G ఫ్రీ అని , పెన్ డ్రైవ్ ఫ్రీ అని, 1GB Data ఫ్రీ , 10000 రూపాయల ఫోన్ ఫ్రీ అని పోస్ట్ చేస్తున్నారు. ఏదో చిన్న ఆశ ఏమైనా రాకపోతుందా?. . . అని.అది మానవ సహజం.కాదనడం లేదు.
కాని మనం ఆలోచించ వలసిన విషయం ఇక్కడ ఒకటుంది.మీరు ఈ ఆఫర్ పోందాలంటే ముందు మీరు తప్పనిసరిగా మీ మొబైల్ నెంబరు ,మీ ఈ మైయిల్ అడ్రస్ ను వారి వెబ్ సైట్ లో నమోదు చేయవలసి ఉంటుంది.
ఎప్పుడైతే ఆ వివరాలు నమోదు చేసారో మీ పూర్తి వివరాలు అంటే మీ పూర్తి పేరు , అడ్రస్ , ఆధార్ వివరాలు తదితరమైన అన్ని వివరాలు ఆ వెబ్ సైట్ లో చేరిపోతాయి.
అంటే మనకు మనంగా దొంగలకు మన సమాచారాన్ని మనం వారికి అందజేసినట్టే.
మీరు సైబర్ నేరాలు అనే మాట వినే ఉంటారు. వారి పనంతా రకరకాల వ్యక్తుల నుండి వారి విలువైన సమాచారాన్ని దొంగిలించడం.అంటే మన వివరాలతో మరింత మన రహస్య సమాచారాన్ని కూడా తెలుసుకొని వారు వారికి నచ్చిన విధంగా వినియోగించుకుంటారు.
అంటే మన ATM కార్డ్ యొక్క నకలు తయారు చేయడం,
మన బ్యాంకులకు సంబందించిన సమాచారాన్ని దొంగిలించడం.
ఆన్ లైన్ వ్యాపారానికి సంబందించిన సమాచారాన్ని దొంగిలించి మీ అకౌంటు ద్వార విలువైన కొనుగోళ్ళు చేయడం
కాబట్టి జాగ్రత్త పడండి.మోసపోయిన వాళ్ళలో మొట్ట మొదటి వారం మనమే అవుతాం.
No comments:
Post a Comment