Pages

Showing posts with label కలాం. Show all posts
Showing posts with label కలాం. Show all posts

Sunday, August 13, 2017

ఎ.పి.జె. అబ్దుల్ కలాం.

ఎ.పి.జె. అబ్దుల్ కలాం. 

APJ ABDUL KALAM HISTORY IN TELUGU

APJ ABDUL KALAM BIOGRAPHY IN TELUGU

Dare to dream but care to achieve*_
 ఆయన పూర్తి పేరు అవుల్ ఫకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం. ఆయన 1931, అక్టోబర్ 15 న రామేశ్వరంలో జన్మించారు. అప్పటికే వారి కుటుంబం పేదరికంలో ఉంది. వారి పూర్వీకుల నాటి పెంకుటిల్లు తప్ప వారికేమీ లేదు. ఆ రామేశ్వరంలోనే, ఆ చిన్నతనం లోనే బహుశా ఈనాటి కలాంకు బీజాలు పడ్డాయి.*

 ఆయనలోని మత సామరస్యానికి, మానవత్వానికీ చిన్నతనంలో రామేశ్వరం ప్రధాన ఆలయ పూజారి కొడుకుతో స్నేహమే కారణమేమో.*

 అలాగే కలాంను చిన్నతనంలో ఆకర్షించి, ఒక స్పేస్ సైంటిస్ట్ కావడానికి కారణం – రామేశ్వరం సముద్రపు ఒడ్డున నడుస్తూ పైకి చూసిన చిన్ని కలాంకు ఆకాశంలో ఎగురుతూ కనిపించిన పక్షులే. వాటి నుంచి స్ఫూర్తి పొందిన కలాం ఒక ఫైటర్ పైలట్ కావాలనుకున్నారు.*

 అలాగే చిన్న నాటి నుండి తాను మరణించే వరకూ ఆయన స్నేహం చేసింది పుస్తకాలతోనే. రామేశ్వరంలోని గ్రంధాలయానికి వెళ్లి తాను కొనలేని ఎన్నో పుస్తకాలను అక్కడే చదివేవారు ఆయన. అలాగే కుటుంబ పోషణకు, అన్నలకు సహాయం చేయాలని పేపర్ బాయ్ గా కూడా పని చేయడానికి సిగ్గు పడలేదు ఆయన.*

 అలాగే చదువు విషయానికి వస్తే తాను యావరేజ్ స్టూడెంట్ నని ఆయనే తన ఆత్మ కధలో రాసుకున్నారు. అయితే చదువు మీద ఆసక్తితో కష్టపడి చదివేవారు. అలా ఆయన తిరుచ్చిరాపల్లిలోని సెయింట్ జోసెఫ్ కళాశాల లో 1954 లో ఫిజిక్స్ లో గ్రాడ్యుయేషన్ చేసారు. దాని తరువాత మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో 1955 లో ఏరో స్పేస్ ఇంజనీరింగ్ చేశారు.*

 చదువు తరువాత IAF లో చేరాలన్న తన పైలట్ కల తృటిలో తప్పిపోయింది. ఆయన పరీక్షలో 9వ స్థానంలో నిలిచారు. కానీ అప్పటికి భారత వాయుదళంలో ఎనిమిది స్థానాలే ఖాళీగా ఉండటంతో పైలట్ కావాలన్న ఆయన కల తృటిలో తప్పిపోయింది.*

ఇక అక్కడి నుంచి ఆయన సాగించిన పయనం, గగనతలంలో భారతీయ జెండా ను రెపరెపలాడేలా చేసింది. ఆయన DRDO లో సైంటిస్ట్ గా చేరారు. అక్కడి నుంచి ఆయన ISRO లో చేరారు. అక్కడ ప్రొ. విక్రం సారాభాయ్, సతీష్ ధావన్ ల నుంచి స్ఫూర్తిని పొందారు. అక్కడ ఆయన దేశానికి అనన్యసామాన్యమైన సేవలందించారు.*

 ఆయన పి ఎన్ ఎల్ వి, ఎస్ ఎల్ వి – III, అగ్ని, పృథ్వి, వంటి క్షిపణులను తయారు చేశారు. అలాగే పోక్రాన్ న్యూక్లియర్ పరీక్షలను సైతం విజయవంతం చేశారు. తన సేవలకు గాను ఆయన మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా గా పేరొందారు.*

 అలాగే ఆయన ప్రధానికి చీఫ్ సైంటిస్ట్ అడ్వైజర్ గా కూడా పని చేశారు. ఈ సేవలే ఆయనకి 2002 – 2007 కాలానికి భారత దేశ పదకొండవ రాష్ట్రపతిగా పని చేసేలా చేశాయి. ఈ సమయంలో ఎంతో మంది ఉరి శిక్ష పడ్డ ఖైదీలకు ప్రాణ భిక్ష పెట్టారు. అంత పెద్ద రాష్ట్రపతి భవన్ లో సైతం ఆయన ఒక్క గదిలో, గది నిండా పుస్తాకాలతో మాత్రమే జీవించారు. రాష్ట్రపతి భవన్ లో ఇచ్చే విలాస విందులను తిరస్కరించారు. ఏమైనా వండి పెట్ట గల వంట వాళ్ళతో కేవలం ఇడ్లి సాంబారు మాత్రమే వండించుకున్న ఆయన నిరాడంబరత మనందరికీ ఆదర్శం.*

 తాను మరిణించిన రోజును సెలవు దినంగా ప్రకటించ వద్దని కోరిన మహనీయుడు. ప్రెసిడెంట్ గా ఉన్న రోజుల్లో కూడా ఎన్నో విద్యాలయాలకు వెళ్లి అక్కడి విద్యార్థులకు బోధించేవారు. మీరు పెళ్లి ఎందుకు చేసుకోలేదు అన్న ప్రశ్న కు – ఆ ఆలోచనే రాలేదు, అన్న ఆయన నుంచి వృత్తి పట్ల అంకిత భావం నేర్చుకోవచ్చు.*

 ఆయన పదవీ కాలం పూర్తయ్యాక అదే పనిగా ఎన్నో విద్యాలయాలకు వెళ్లి ఎంతో మంది విద్యార్థులకి బోధించారు. పిల్లలకు, విద్యార్థులకు బోధించడం ఆయనకెంతో ఇష్టమైన పని.*

 భారతదేశపు అత్యున్నత పురస్కారమైన భారతరత్న 1997 లో ఆయన్ని వరించింది. అంతకు ముందే పద్మ భూషణ్ ను 1981 లో, పద్మ విభూషణ్ ను 1990 లో అందుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 40 విశ్వ విద్యాలయాలు ఆయన్ని డాక్టరేట్ తో సత్కరించాయి.*

 ఇంతే కాక ఆయన ఎన్నో సామాజిక కార్యక్రమాలను కూడా చేపట్టారు. కార్డియాలజిస్ట్ సోమరాజుతో కలిసి ఆయన సామాన్యులకు అందుబాటు ధరలో ఒక స్టంట్ ను తయారు చేశారు. దానికి రాజు కలాం స్టంట్ అని పేరు వచ్చింది*

 ఆయన మరణించే సమయానికి తన పేరు మీద ఆస్తులేమీ లేవంటే, ఆయన నిరాడంబరతకీ, వ్యక్తిత్వానికీ ఇది పరాకాష్ట.*

 ఆయన ఎన్నో కవితలూ, పుస్తకాలూ రాశారు. Wings of Fire, Ignited Minds, India 2020 వంటి పుస్తకాలతో ఆయన ఆలోచనలనూ, భావాలనూ మనతో పంచుకున్నారు.*

 విశ్వశాంతికి మనిషి సత్ప్రవర్తనే మూలమని కలాం చెప్పిన వ్యాఖ్యలకు యూరోపియన్ పార్లమెంట్‌ కరతాళ ధ్వనులతో మారుమోగింది..! యూరోపియన్ పార్లమెంట్‌లో కలాం చేసిన ఈ ప్రసంగం ప్రపంచలోనే వన్ ఆఫ్‌ ది బెస్ట్ స్పీచ్‌గా పేరుగాంచింది..!*

 సృజనాత్మకత, సత్ప్రవర్తన, ధైర్యం మూడింటి మేళవింపును నిజమైన జ్ఞానంగా కలాం ఉద్బోధించారు..! మార్కుల కొలమానమే జ్ఞానంగా మారిన మన విద్యా వ్యవస్థ మారాలని అబ్దుల్ కలాం బలంగా ఆకాంక్షించారు..! విలువలతో కూడిన విద్యను అందించినవే పరిపూర్ణ విశ్వవిద్యాలయాలని తెలిపారు..!*

 ఏ మనిషీ సాధించని విజయం సాధించాలంటే గతంలో ఎవ్వరూ చేయని యుద్ధం చేయమని యువతకు ఉద్బోధించారు కలాం..!  కలలంటే నిద్రలో వచ్చేవని అందరికీ తెలుసు… కానీ మనిషిని నిద్ర పోనీయకుండా చేసేవే కలలని కలాం కొత్త అర్థం చెప్పారు..! సూర్యుడిలా ప్రకాశించాలంటే సూర్యుడిలా పేదరికం లేని దేశం..! ఆకలి చావులు లేని రాజ్యం..! పట్టణ, పల్లె ప్రాంతాలకు వ్యత్యాసం లేని దేశం..! వ్యవసాయ, పారిశ్రామక, సేవా రంగాలు కలగలిసి ప్రగతి దిశగా సాగే దేశం..! అవినీతి రహిత, పక్షపాత రహిత పాలన గల దేశం..!… మహిళలు, పిల్లల హక్కులకు సంపూర్ణ రక్షణ గల దేశం..! ఇదీ 1998లో అబ్దుల్ కలాం కలలుగన్న భారత దేశం..! మిషన్‌2020 పేరుతో భారతావనికి నిజమైన అభివృద్ధి పథాన్ని చూపించిన దార్శనికుడు అబ్దుల్ కలాం..!*

 మీ లక్ష్యసాధనలో అవరోధాలు ఎదురైనాయా ? గమ్యాన్ని చేరడం కష్టమనిపిస్తుందా ..? నీరసం, నిస్సత్తువ ఆవహించిందా..? ఏం ఫర్వాలేదు… ఒక్కసారి కలాం ప్రసంగం వినండి… రెట్టించిన ఉత్సాహం నిండుకుంటుంది..! లక్ష్యసాధన దిశగా మిమ్మల్ని పరుగులు పెట్టిస్తుంది..!*

ప్రస్తుత సామాజిక రాజకీయ సమాజంలో ఉన్నప్పటికీ, ఎన్ని కీలకమైన పదవులు అలంకరించినప్పటికి తామరాకు మీద నీటి బొట్టు లాగా వాటికి అతీతంగా ఉండడం బహుశా ఆయనకే సాధ్యమేమో.*

 ఇక కలాం జీవితం గురించి చెప్పుకున్నట్టె ఆయన మరణం గురించి కూడా చెప్పుకోవాలి. చివరి శ్వాస వరకు కూడా ఆయన విద్యా బోధనకే అంకితం అయిన మహా మనీషి ఆయన. షిల్లాంగ్ లో IIM విద్యార్ధులకు బోధిస్తూ కుప్పకూలి పోయారు. హాస్పిటల్ కు తీసుకువెళ్ళి చికిత్స చేస్తున్నప్పుడే కన్ను మూశారు. అసలు అటువంటి మరణం చరిత్రలో ఇంత వరకూ ఎవరికీ రాలేదనే చెప్పాలి.*

 వయసు మీద పడుతున్న సరే, విద్యా బోధనే లక్ష్యంగా సాగిపోయిన ఆయనను అపర భీష్ముడు అన్నా అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే 83 ఏళ్ల వయసులో జీవితం తుది శ్వాస వరకూ తనమేధస్సునూ, శక్తి సామర్ధ్యాలనూ ఈ జాతికి అంకితం చేసి, తనకు ఎంత అధికారం వున్నా తనకోసం ఒక్క రూపాయి కూడా దాచుకోకుండా జీవితాన్ని గడిపిన ఆయన వెళ్ళిపోయిన లోటు ఈ దేశానికి తీరనిది.*

 ఆయన మేధస్సుకు కొలమానం లేదు, ఆయన వ్యక్తిత్వానికి సాటి లేదు. వినయశీలి, నిగర్వి, సమయపాలన, సేవా నిరతి, శ్రమ జీవి, నిరాడంబరత ఇలా ఎన్నో సుగుణాలు ఆయన జీవితం నుంచి మనం నేర్చుకోవాలి.   ఆయన నుంచి స్ఫూర్తి పొందిన మరో కలాం మళ్ళీ ఎప్పటికి పుడతాడో ....*

Sunday, January 29, 2017

అబ్దుల్ కలాం గారి చిన్నప్పటి ఒక సంఘటన:



 అబ్దుల్ కలాం గారి చిన్నప్పటి ఒక సంఘటన:

ఒకరోజు పగలంతా ఎక్కువగా పని ఉండటంతో
అబ్దుల్ కలాం గారి వాళ్ళమ్మ బాగా అలసిపోయింది.
🔸ఆ రోజు రాత్రి వంట పూర్తయిందనీ...........,
భోజనానికి రమ్మని....... ఆమె పిలవడంతో
అబ్దుల్ కలాం గారు, తన తండ్రితో కలిసి భోజనం
చేయడానికి సిద్దపడ్డారు.
🔸తన తండ్రి ముందు ఒక ప్లేట్ లో పెట్టిన
రొట్టెలు బాగా మాడిపోయి ఉండటాన్ని చూసిన
అబ్దుల్ కలాం గారు, ఆయన వాటిని తినే ముందు
తన తల్లిని ఏమైనా కోప్పడతారేమోనని............,
మౌనంగా అలాగే చూస్తూ ఉండిపోయారు.
🔸కానీ ఆయన ఆ రొట్టెలను తిని........., ఆమెను
ఏమీ అనకుండా లేచి వెళ్ళిపోయాడు.
🔸కొద్దిసేపటికి ఆమె, తన భర్త దగ్గరకు
వెళ్ళి........ రొట్టెలు మాడిపోయినందుకు
క్షమించమని.......కోరింది.
వెంటనే ఆయన, “ నాకు మాడిపోయిన రొట్టెలంటే
చాలా ఇష్టం..... అని ఎంతో ప్రేమగా ఆమెతో
అన్నారు.
🔸ఇదంతా గమనించిన అబ్దుల్ కలాం గారు,
కొద్దిసేపటి తర్వాత తన తండ్రి దగ్గరకు వెళ్ళి
మీకు నిజంగా మాడిపోయిన రొట్టెలు అంటే అంత
ఇష్టమా.....? అని అడిగారు.
🔸ఆయన అబ్దుల్ కలాం గారి తల నిమురుతూ......,
మీ అమ్మ పగలంతా కష్టపడి ఎంతో
అలసిపోయింది.
🔸అంత అలసటలో కూడా విసుగు
లేకుండా వంట చేసింది.
🔸ఒక్కపూట మాడిపోయిన రొట్టెలు తింటే మనకేమీ
కాదు.
🔸 కానీ ఆ రొట్టెలు మాడిపోయాయని
విమర్శిస్తే........, ఆమె మనసు ఎంతగానో బాధ
పడుతుంది.
🔹అలా బాధ పెట్టడం నాకిష్టం లేదు.
🔸జీవితంలో ఎవరైనా కొన్ని సందర్భాలలో పొరపాట్లు
చేయడం సహజం.
🔸ఆ పొరపాట్లను ఆధారంగా చేసుకొని విమర్శించడం
మంచిది కాదని........ఆయన అన్నారు.
🔹ఈ సంఘటన ద్వారా అబ్దుల్ కలాం గారు చెప్పిన
విషయం,
ఎదుటివారు చేసిన పొరపాట్లను చూసి తొందరపడి
విమర్శించి వారి మనసులను బాధ పెట్టకండి.
🔹బంధాలను బలపరుచుకుంటూ జీవితాలను
కొనసాగించండి   

Sunday, July 31, 2016

డాక్టర్‌ ఎ.పి.జె. అబ్దుల్‌ కలాం- Dr.A.P.J. Abdul Kalam



 డాక్టర్‌ ఎ.పి.జె. అబ్దుల్‌ కలాం- Dr.A.P.J. Abdul Kalam

పేద కుటుంబంలో పుట్టిన ఓ కుర్రాడు చిన్నప్పుడు చింతపిక్కలు ఏరి అమ్మాడు... పేపర్లు పంచాడు... అయినా చదువును వదల్లేదు... ఆ చదువే అతడికి సోపానమైంది... పెరిగి పెద్దయి దేశంలోనే అత్యున్నత పదవిని అందుకున్నాడు! ఎందరికో స్ఫూర్తిని పంచాడు! ఆయనే శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలామ్‌! పుట్టిన రోజు ఇవాళే- 1931 అక్టోబర్‌ 15న.

మిసైల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా... పీపుల్స్‌ ప్రెసిడెంట్‌... ఈ పేర్లను ఎవరిని ఉద్దేశించి చెబుతారో తెలుసా? డాక్టర్‌ ఎ.పి.జె. అబ్దుల్‌ కలాం గురించే! దేశ అత్యున్నత పీఠమైన రాష్ట్రపతి పదవిని అలంకరించడమే కాదు, దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్నను కూడా పొందిన గొప్ప శాస్త్రవేత్త ఆయన. భారతదేశం అమ్ములపొదిలో అగ్ని, పృథ్వి, ఆకాశ్‌, త్రిశూల్‌, నాగ క్షిపణులు చేరడం వెనుక ఆయన పాత్ర మరువలేనిది. దేశ పటిష్ఠతకు దోహదపడుతూనే చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకూ అందరికీ అందుబాటులో ఉంటూ 'ప్రజల రాష్ట్రపతి'గా కలాం మన్ననలు పొందారు.

రామేశ్వరంలో ఓ పేద ముస్లిం కుటుంబంలో 1931 అక్టోబర్‌ 15న పుట్టిన అవుల్‌ పకీర్‌ జైనులబ్దీన్‌ అబ్దుల్‌ కలాం కష్టపడి పైకెదికిన వ్యక్తి. తండ్రి ఒక దశలో పడవ నడిపేవాడు. పాత ఇంట్లో ఎక్కువ మంది సభ్యులున్న కుటుంబంలో ఒకడైన కలాం, బడిలో చదువుకునే రోజుల్లో మేనమామతో కలిసి దినపత్రికలు పంచడం, చింతపిక్కలు ఏరి అమ్మడం లాంటి పనులు చేసేవాడు. గాలి పటాలు ఎగరేసినా, ఎగిరే పక్షుల్ని చూసినా చిన్నారి కలాం ఆకాశంలో విహరించాలని కలలు కనేవాడు. ఓసారి ఉపాధ్యాయుడితో ఆ సంగతే చెబితే ఆయన 'నువ్వు ఏం కావాలనుకున్నా అవగలవు. కలలు కని, అందుకు తగిన కృషి చెయ్యి' అన్నారు. ఆ మాటలు కలాం మనసులో నాటుకుపోయాయి.

ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కలాం చదువును నిర్లక్ష్యం చేయకుండా మద్రాసు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. ఆపై డీఆర్‌డీవో (డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌), ఇస్రో (ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌)లలో పనిచేశారు. శత్రు లక్ష్యాలను ఛేదించే అగ్ని, పృథ్వి క్షిపణులకు ప్రత్యక్షంగా రూపకల్పన చేశారు. తొలి దేశీయ ఉపగ్రహ ప్రయోగ నౌక (ఎస్‌ఎల్‌వీత్రీ) రూపకల్పనలో పాల్గొన్నారు. దేశం విజయవంతంగా నిర్వర్తించిన అణుబాంబు పరీక్షలో కీలక పాత్ర వహించారు. అంచెలంచెలుగా భారత రక్షణ శాఖకు సలహాలందించే శాస్త్రవేత్తగా ఎదిగారు. ఆయన కృషికి గుర్తింపుగా పద్మభూషణ్‌, పద్మవిభూషణ్‌, భారత రత్న పురస్కారాలు లభించాయి. దేశవిదేశాల్లోని 30 విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లతో పాటు అంతర్జాతీయ అవార్డులు పొందారు. మన దేశపు ప్రతిష్ఠాత్మక అంతరిక్ష కార్యక్రమం చంద్రయాన్‌కి సలహా సహకారాలు అందించారు. పోలియో బాధితుల కోసం తేలికైన కాలిపర్‌ తయారీలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందజేశారు.

జీవితానుభవాలతో ఆయన రాసిన 'వింగ్స్‌ ఆఫ్‌ ఫైర్‌', 'ఇగ్నైటెడ్‌ మైండ్స్‌', 'ఇండియా2020', 'మై జర్నీ' పుస్తకాలు తప్పక చదవవలసినవి.







 భారతరత్న అబ్దుల్ కలాం
వర్ధంతి సందర్భంగా... స్ఫూర్తినిచ్చే సూక్తులు...
బుధవారం, 27 జూలై 2016
👏1. వర్షం వస్తే పక్షులన్నీ వాటివాటి గూళ్లలో దాక్కుంటాయి. కానీ గద్ద మాత్రం వానకు అందనంత దూరంలో మేఘాల పైన ఎగురుతూ ఉంటుంది.
👏2. మానవుడికి కష్టాలు కావాలి ఎందుకంటే విజయం సాధించినప్పుడు ఆనందించడానికి.
👏3. నీ భాగస్వామ్యం లేనిదే నీ విజయం సాధ్యం కాదు. నీ భాగస్వామ్యం లేనిదే నీ అపజయానికీ తావులేదు.
👏4. మనం కేవలం విజయాల మీద నుంచే పైకి రాలేము. అపజయాల పై నుంచి కూడా ఎదగడం నేర్చుకోవాలి.
👏5. కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి.
👏6. మనుషులు రకరకాల శక్తి సదుపాయాలతో జన్మిస్తారు. తొందరగా శక్తిని ఖర్చు చేసుకుని అలసిపోయినవాడికే అందరికన్నా ముందుగా బలాన్ని పుంజుకునే అవకాశం చిక్కుతుంది._
👏7. నీకో లక్ష్యముండటమే కాదు దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాధించుకునే వ్యూహ నైపుణ్యం కూడా ఉండాలి.
👏8. ఒక సంక్షోభాన్ని ఎదుర్కొనే క్రమంలోనే మన ప్రతిభ మనకు తెలిసేది.
👏9. ఒక నాయకుడు తనచుట్టూ ఏమి జరుగుతుందో తెలుసుకోగలిగినప్పుడే తన బృందాన్ని స్వేచ్చగా నడిపించగలడు.
👏10. నువ్వొక మనిషిని అవమానిస్తూ అతడి నుంచి ఫలితాలు రాబట్టుకోలేవు. అతన్ని ద్వేషిస్తూ, దూషిస్తూ అతనిలోని సృజనాత్మకతను వెలికి తియ్యలేవు.
👏11. హృదయాలతో పనిచెయ్యని వాళ్ళ విజయం బోలుగా ఉండటమే కాక అది తన చుట్టూ వెగటుతనాన్నే వ్యాపింప చేస్తుంది
హిందూ ధర్మచక్రం
*అబ్దుల్ కలాం పూర్తిగా శాకాహారి. మధ్యపాన వ్యతిరేకి. బ్రహ్మచారి. ఖచ్చితమైన వ్యక్తిగత క్రమశిక్షణను పాటిస్తారు. "ప్రజలు.. తమ భార్యాపిల్లలకు తమ పిల్లల పిల్లలకూ ఆస్తులు సంపాదించి పెట్టడం కోసమే అవినీతిపరులౌతారు" అంటూ ఆయన బ్రహ్మచర్యాన్ని స్వీకరించారు. ఇస్లాం ప్రకారమైతే ప్రతి ముస్లిమూ పెళ్ళి చేసుకోవాలి.
[21:54, 27/7/2016] +91 94411 68368: కానీ, కలాం ఖురాన్‌తో పాటు, భగవద్గీత‌ను కూడా చదువుతారు. మతఘర్షణలను నిరసించే శాంతికాముకుడిగా పేరుగడించారు. ఈయన వింగ్స్ ఆఫ్ ఫైర్, సైంటిస్ట్ టు ప్రెసిడెంట్‌ వంటి అనేక పుస్తకాలను రచించారు. ఎందరికో మార్గదర్శకులైన అబ్దుల్ కలాం జులై 27, 2015న సుదూర లోకాలకు తరలివెళ్లిపోయారు.*
కొంతమంది మనుషులు సైన్స్ అనేది వేరే ఒక అంశమనట్టుగా, అది మనిషిని భగవంతుడి నుంచి దూరం చేస్తుందన్నట్టుగా ఎందుకు మాట్లాడుతారో నాకు అర్థం కాదు. విజ్ఞాన శాస్త్ర పథం మానవ హృదయ వీధుల్లోంచి సాగి పోయేదే. నాకయితే సైన్స్ ఎప్పుడూ ఆధ్యాత్మిక ఉన్నతికీ, ఆత్మ సాక్షాత్కారానికి మార్గంగానే ఉంటూ వచ్చింది.
 
.