అబ్దుల్ కలాం గారి చిన్నప్పటి ఒక సంఘటన:
ఒకరోజు పగలంతా ఎక్కువగా పని ఉండటంతో
అబ్దుల్ కలాం
గారి వాళ్ళమ్మ బాగా అలసిపోయింది.
🔸ఆ రోజు రాత్రి వంట పూర్తయిందనీ...........,
భోజనానికి
రమ్మని....... ఆమె పిలవడంతో
అబ్దుల్ కలాం
గారు, తన తండ్రితో
కలిసి భోజనం
చేయడానికి
సిద్దపడ్డారు.
🔸తన తండ్రి ముందు ఒక ప్లేట్ లో పెట్టిన
రొట్టెలు బాగా
మాడిపోయి ఉండటాన్ని చూసిన
అబ్దుల్ కలాం
గారు, ఆయన వాటిని తినే
ముందు
తన తల్లిని ఏమైనా
కోప్పడతారేమోనని............,
మౌనంగా అలాగే
చూస్తూ ఉండిపోయారు.
🔸కానీ ఆయన ఆ రొట్టెలను తిని........., ఆమెను
ఏమీ అనకుండా లేచి
వెళ్ళిపోయాడు.
🔸కొద్దిసేపటికి ఆమె, తన భర్త దగ్గరకు
వెళ్ళి........ “
రొట్టెలు మాడిపోయినందుకు
క్షమించమని.......”
కోరింది.
వెంటనే ఆయన,
“ నాకు మాడిపోయిన
రొట్టెలంటే
చాలా ఇష్టం..... “
అని ఎంతో ప్రేమగా ఆమెతో
అన్నారు.
🔸ఇదంతా గమనించిన అబ్దుల్ కలాం గారు,
కొద్దిసేపటి
తర్వాత తన తండ్రి దగ్గరకు వెళ్ళి “
మీకు నిజంగా
మాడిపోయిన రొట్టెలు అంటే అంత
ఇష్టమా.....?
అని అడిగారు.
🔸ఆయన అబ్దుల్ కలాం గారి తల నిమురుతూ......,
“ మీ అమ్మ పగలంతా
కష్టపడి ఎంతో
అలసిపోయింది.
🔸అంత అలసటలో కూడా విసుగు
లేకుండా వంట
చేసింది.
🔸ఒక్కపూట మాడిపోయిన రొట్టెలు తింటే మనకేమీ
కాదు.
🔸 కానీ ఆ రొట్టెలు మాడిపోయాయని
విమర్శిస్తే........,
ఆమె మనసు ఎంతగానో బాధ
పడుతుంది.
🔹అలా బాధ పెట్టడం నాకిష్టం లేదు.
🔸జీవితంలో ఎవరైనా కొన్ని సందర్భాలలో పొరపాట్లు
చేయడం సహజం.
🔸ఆ పొరపాట్లను ఆధారంగా చేసుకొని విమర్శించడం
మంచిది
కాదని........” ఆయన అన్నారు.
🔹ఈ సంఘటన ద్వారా అబ్దుల్ కలాం గారు చెప్పిన
విషయం,
ఎదుటివారు చేసిన
పొరపాట్లను చూసి తొందరపడి
విమర్శించి వారి
మనసులను బాధ పెట్టకండి.
🔹బంధాలను బలపరుచుకుంటూ జీవితాలను
కొనసాగించండి
No comments:
Post a Comment