Pages

Tuesday, January 10, 2017

ఎవరు పడితే వారు మీ ఆధార్ కార్డు వివరాలను తీసుకునేందుకు వీలుండదు



ఆధార్ బయోమెట్రిక్ డేటాను లాక్ చేయండిలా.
   

ఒకప్పుడంటే కేవలం వంట గ్యాస్ సబ్సిడీ పొందేందుకు ఆధార్ కార్డును తీసుకున్నారు. కానీ దాంతో ఇప్పుడు అనేక ఉపయోగాలు ఉన్నాయి. పలు ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన సంస్థలు ఆధార్ కార్డుల ద్వారానే వినియోగదారులను గుర్తించి సేవలు అందిస్తున్నాయి. ప్రజల ఆధార్ కార్డులు ఆన్‌లైన్ డేటాబేస్‌లో ఉంచడం వల్లే వాటితో అనేక పనులను చేసుకోవడం సాధ్యమవుతోంది.

🌍ఈ క్రమంలో ఆన్‌లైన్ డేటాబేస్‌లో ఉన్న మన ఆధార్ కార్డ్ వివరాలను, బయోమెట్రిక్ డేటాను ఎవరు పడితే వారు యాక్సెస్ చేయకుండా ఉండాలంటే... అందుకు కింద చెప్పిన స్టెప్స్ పాటించాలి.

1. ముందుగా HTTPS://UIDAI.GOV.IN/BETA/ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అందులో కింద ఉండే ఆధార్ సర్వీసెస్ అనే విభాగంలో LOCK/UNLOCK BIOMETRICS అనే ఆప్షన్ దర్శనమిస్తుంది. దాన్ని క్లిక్ చేయాలి.

2. తరువాత వచ్చే విండోలో వినియోగదారులు తమ 12 అంకెల ఆధార్ నంబర్‌ను, కింద ఉండే సెక్యూరిటీ కోడ్‌ను ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ బటన్‌ను ప్రెస్ చేయాలి.

3. మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని అక్కడే కింద ఇచ్చిన బాక్స్‌లో ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలి.

4. అనంతరం మరో స్క్రీన్ ఓపెన్ అవుతుంది. అందులో కూడా ముందు లాగే సెక్యూరిటీ కోడ్‌ను ఎంటర్ చేసి అనంతరం కిందే ఉండే ENABLE అనే బటన్‌ను ప్రెస్ చేయాలి.

🔹అంతే, మీ ఆధార్ నంబర్‌కు చెందిన బయోమెట్రిక్ డేటా లాక్ అవుతుంది. దీంతో ఎవరు పడితే వారు మీ ఆధార్ కార్డు వివరాలను తీసుకునేందుకు వీలుండదు. దీంతో ఐడెంటిటీ థెఫ్ట్ వంటి సైబర్ క్రైంల బారిన పడకుండా సురక్షితంగా ఉండవచ్చు.   

No comments:

Post a Comment

.