Pages

Showing posts with label తెలుగు భాష. Show all posts
Showing posts with label తెలుగు భాష. Show all posts

Tuesday, July 4, 2017

జై టెలుగు టళ్ళీ...!

జై టెలుగు టళ్ళీ...!


తెలుగెక్కడుందిరా తెలుగోడా...!
నీ తెలుగు తెల్లారె తెలుగోడా...!
అమ్మనే ఈజిప్టు మమ్మీని చేసావు
నాన్ననే డాడీకి డమ్మీని చేసావు
నీ బిడ్డ అఆలు దిద్దనే లేదు
తన భాష చదవడం రాయడం రాదు
తెలుగునే వెలి వేసె మన బడులు కూడా
తెలుగు మాట్లాడితే పగులుద్ది దౌడ

తెలుగెక్కడుందిరా తెలుగోడా...?
నీ తెలుగు తెల్లారె తెలుగోడా...!

లేత మనసుల్లోన నీతులే ముద్రించు
శతకాలు అటకెక్కి చెద పట్టినాయి
బతుకు పుటలను తెరచి వ్యాఖ్యానమొనరించు
మన తెలుగు సామెతలు మంట గలిసాయి
రామాయణం లేదు...భారతం లేదు
భాగవత పద్యాల్లొ ఒకటైన రాదు
కథలు చెప్పే బామ్మ అమ్మమ్మలేరి?
కదలరే టీవీల చుట్టూత చేరి...!

మమ్మీకి ఎల్ కే జి ర్యాంకులే ముఖ్యం
డాడీకి లైఫులో విజయమే లక్ష్యం

తెలుగెక్కడుందిరా తెలుగోడా...?
నీ తెలుగు తెల్లారె తెలుగోడా...!

మువ్వన్నె జెండాను తెగ ఊపుతున్నావు
దాన్ని చేసిన తెలుగువాడెవడొ తెలుసా?
వెండి తెర హీరోలు వీరులంటున్నావు
నిజ జీవితపు తెలుగు హీరోలు తెలుసా?
గుడి గుడీ గుంచాలు...కోతి కొమ్మచ్చి 
ఏళ్ళు గడిచెను తెలుగు ఆటలే చచ్చి
పసివాళ్ళ చేతులకు సెల్ ఫోనులిచ్చి
పెంచావు వీడియో గేమ్సుపై పిచ్చి

పోటీకి సయ్యంది నీ తెలుగు మేధ
ఉనికినే మరచింది  అది అసలు బాధ

తెలుగెక్కడుందిరా తెలుగోడా...?
నీ తెలుగు తెల్లారె తెలుగోడా...!

కూడు పెట్టని భాష 'భాష ' కాదన్నావు
డాలర్లు తెచ్చేదె అసలు చదువన్నావు
తెలుగు పండగలన్ని మొక్కుబడి చేసావు
కార్పొరేట్ పండగల ఉచ్చులో పడ్డావు
గ్లోబునే గెలిచాము చూడమన్నావు
తల్లి వేరును మటుకు తెగ నరికినావు
తెలుగు మొనగాణ్ణి అని తొడ చరిచినావు
తల్లి పేరడిగితే తెల్లబోయావు

నీ పిల్లలకు ఒక్క తెలుగు పేరుందా?
సెంటిమెంటల్ స్టంటు చాలు నీ బొందా!

తెలుగెక్కడుందిరా తెలుగోడా...?
నీ తెలుగు తెల్లారె తెలుగోడా...!




ఓ మంచిమాట

*👉చిన్న విత్తనం మొలకెత్తి పెద్ద చెట్టుగా మారేలోగా ఎన్ని అడ్డంకులు అవాంతరాలు. మొదట విత్తనం మట్టిలో ఉండగానే చీమలూ, పురుగులూ తినేసేయాలని చూస్తాయి.అది వాటిని తప్పించుకుని మొలకెత్తుతూ ఉంటే పక్షులు దాన్ని పసిగట్టి పొడుస్తూ తినేయాలని చూస్తాయి.ఆ తరువాత అది పెరుగుతూ ఉంటే పశువులూ దాని పని పట్టబోతాయి. అయినా అది ఎదిగి పెద్ద వృక్షంగా మారిందంటే, ఇంతకాలం దాని ఎదుగుదలకు అడ్డంకిగా ఉన్న ఆ జీవులన్నీ దాని నీడలోనే తలదాల్చుకుంటాయి.మనిషి ఎదుగుదలా సరిగ్గా ఇలాంటిదే..


Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

Friday, June 30, 2017

డు, ము, వు, లు ........ప్రధమా విభక్తి,

డు, ము, వు, లు ........ప్రధమా విభక్తి,

నిన్, నున్, లన్, కూర్చి, గురించి......ద్వితీయా విభక్తి.

తెలుగు మాస్టర్ గారి పాఠం సాగిపోతోంది. సూది మొన పడినా వినపడేంత నిశ్శబ్దం క్లాస్ రూమ్ లో. తెలుగు మాస్టర్ గారంటే ఆ క్లాస్ కే కాదు, స్కూల్ మొత్తం భయం. క్రమశిక్షణకు మారుపేరు మాస్టారు. అల్లరి చేసిన వాడి వీపు వంచి గుల్ల దెబ్బ ఒక్కటి వేసేరంటే చాలు, స్కూలు మొత్తం వినపడేది. ఆ శబ్దానికే పిల్లలకు చచ్చేంత భయం.   కర్ర విరగాకూడదు, పాము చావాకూడదు అనేది ఆయన సిధ్ధాంతం.   దెబ్బ తగిలేదు కాదు కానీ, ఆ శబ్దానికే బిక్క చచ్చి పోయేవారు కుర్రాళ్లంతా.

నేను ఈల వేస్తే గోలకొండ ఎగిరిపడతది.....నేను ఈల వేస్తే గోలకొండ అదిరిపడతది
దివికి దివికి దిమాడి.....గుబుకు గుబుకు గుమాడి.....దివికి దివికి దిమాడి ....గుబుకు గుబుకు గుమాడి.......
అంటూ పెద్ద గా ఈల వేసుకుంటూ,  ప్లే గ్రౌండ్ లో వున్న ఉసిరి చెట్టెక్కి కోసిన ఉసిరికాయలు ఒక ముచ్చికవర్ లో వేసుకుని, క్లాస్ రూమ్ లోకి అప్పుడే ఎంటర్ అయిన శీను గాడు పాఠం చెబుతున్న తెలుగు మాస్టర్ గారిని చూసి గతుక్కు మన్నాడు. భయంతో బిక్క చచ్చిపోయేడు. వాడి పై ప్రాణాలు పైనే పోయేయి. తెలుగు మాస్టర్ గారు ఆరోజు సెలవు, స్కూల్ కి రారు అనుకున్న శీను గాడికి పాపం మాస్టర్ గారు లీవ్ క్యాన్సల్ చేసుకుని క్లాస్ కి వచ్చేరన్న విషయం తెలీదు. ఎంచక్కా తెలుగు పీరియడ్ ని ఉసిరి కాయలకోసం కేటాయించుకున్నాడు.
ఒరేయ్....ఇలా రారా ! మాస్టారి కళ్ళు చింత నిప్పుల్లా వున్నాయి.
భయం తో ఉసిరికాయలన్నీ అక్కడే కిందన పడేసాడు.
పిల్లలంతా ఒకింత భయంతోనూ, ఒకింత ఆతృత తోను చూస్తున్నారు , ఏం జరగబోతుందా అని.
అంతలోనే ధామ్...ధామ్  అంటూ గట్టిగా రెండు శబ్దాలు వినపడేసరికి శీను గాడి పని అయిపోయిందివాళ అనుకున్నారంతా.

వెధవా......నీ తల్లి, తండ్రి అంతంత ఖర్చు పెట్టి నిన్ను చదివిస్తుంటే,  నువ్వు చేసే ఘన కార్యం ఇదా? చదువు లేకపోయినా ఫర్లేదు, క్రమశిక్షణ లేకపోతే ఎలా? పెద్దయ్యాక ఏం సాధిద్దామని? అంట్లు  తోముకుని బతుకుదామని అనుకుంటున్నావా? మాస్టర్ గారి తిట్ల సునామీ కి అడ్డుకట్టలేదు. అంత కోపం అతనిలో మునుపెన్నడూ చూడలేదు ఎవరూ. పిల్లలు క్రమశిక్షణ లేక చెడిపోతున్నారన్న బాధ, ఆయన కళ్ళల్లో రౌద్రమై తాండవిస్తోంది. శీను గాడు అది చూసి తట్టుకోలేకపోయేడు. ఒహటే ఏడుపు. ఇంతలో మిగిలిన క్లాస్ టీచర్స్, హెడ్ మాస్టర్ గారు వచ్చి తెలుగు మాస్టర్ గారిని శాంతింప చేయడంతో పరిస్థితి కుదుటపడింది.

తుఫాన్ తరువాత ప్రశాంతత ఎలా ఉంటుందో ఆ క్లాస్ రూమ్ ని చూస్తే అర్ధం అవుతుంది. కానీ ఈ సంఘటన తరువాత మాస్టర్ గారు అన్యమనస్కంగా వున్నారు. మిగిలిన పాఠం చెప్పే మూడ్ లేక , పిల్లలికి ఏదో వర్క్ ఇచ్చేసి అక్కడ నుండి వెళ్ళిపోయేరు.

ఈ ఘటన జరిగి చాలా రోజులైనా, శీను గాడికి మాత్రం మాస్టర్ గారిపై కోపం తగ్గలేదు. ఆయన అంటే బాగా అయిష్టం పెంచేసుకున్నాడు. అతనికి కనిపించకుండా తిరుగుతూ జాగ్రత్త పడుతుండేవాడు. ఏదో విధంగా టెన్త్ పరీక్షల్లో పాస్ అనిపించుకుని, స్కూల్ చివరి రోజున  కూడా మాస్టర్ గారికి కనిపించకుండా, కనీసం పలకరించకుండా వచ్చేశాడు. ఆ తరువాత శీను వాళ్ళ నాన్నగారికి వేరే వూరు బదిలీ అవడంతో , ఆ వూళ్ళో కాలేజీ లో చేరిపోయేడు.

రోజులు గడిచి పోతున్నాయి. క్యాలెండర్లు మారిపోతున్నాయి. అవి రోజులా....లేక కళ్ళాలు లేని గుర్రాలా అన్నట్టున్నాయి.

తెలుగు మాస్టారి చిన్న అమ్మాయి కి మంచి సంబంధం కుదిరింది. తను పనిచేసే రోజుల్లో యేవో లోన్లు అవీ పెట్టి మెల్లగా పెద్దమ్మాయి పెళ్లి చేసేరు. ఇప్పుడు చిన్నమ్మాయి పెళ్లి కోసం, తను జాగ్రత్త చేసి కొనుక్కున్న కొంత భూమిని అమ్మేద్దామని నిర్ణయించుకున్నారు.

కానీ తను, తనతో పాటు కొంతమంది కలిసి కొన్న ఆ జాగా వున్న ఏరియా లో యేవో కొన్ని వివాదాల కారణంగా భూమి ని అమ్మడానికి ప్రభుత్వ పరంగా కొన్ని అడ్డంకులు వున్నాయి. ఆ అడ్డంకులు తొలిగితే కానీ తాను అమ్మే పరిస్థితి కానరాకపోవడంతో, తెలిసిన వ్యక్తుల సలహా మేరకు జిల్లా కలెక్టర్ గారిని కలిస్తే పని జరగొచ్చు అని చెప్పడంతో కలెక్టర్ ని కలవడానికి అప్పోయింట్మెంట్ తీసుకున్నారు మాస్టర్ గారు.

అబ్బే.....కుదరదండి.   రూల్స్ ఒప్పుకోవు. ఇప్పుడున్న కండిషన్స్  ప్రకారం  అస్సలు కుదరదండి అంటూ పంపేశారు కలెక్టర్ గారు. రెండు, మూడు సార్లు అతని చుట్టూ తిరగవలసి వచ్చింది మాస్టారికి.
మీరు ఎన్ని సార్లు నా దగ్గరికి వచ్చినా ప్రయోజనం లేదు సార్! ఈ విషయం లో నేను ఏమీ చెయ్యలేను. నా పరిధి దాటిపోయింది. మీ వలన అవుతుంది అంటే వెళ్లి మంత్రి గారిని కలవండి. ఏమైనా  చెయ్యగలిగితే ఆయనే చెయ్యగలడు. దయచేసి వెళ్లిపోండి.......అంటూ ఖరాఖండి గ చెప్పేసేడు కలెక్టర్ శ్రీనివాస్.
చేసేది లేక మాష్టారు,  మంత్రి గారి అప్పోయింట్మెంట్ కోసం ప్రయత్నిచసాగేరు. ఎట్టకేలకు తనకు వున్న ఆ కాస్త పరిచయాల ద్వారా మంత్రి గారి అప్పోయింట్మెంట్ సాధించారు.

సర్....ఎవరో రిటైర్డ్ తెలుగు మాస్టర్ గారంట. ఈ జాగా విషయమై అడ్డంకులు తొలగడానికి మీ అనుమతి కావాలంటున్నారు....కుదరదంటే వినిపించుకోవట్లేదు. అమ్మాయి పెళ్లి అంట....ఎలాగైనా మిమ్మల్ని కలవాలంటున్నారు. ఇదిగో ఇవి అతని వివరాలు.....అంటూ ఆ ఫైల్ ని మంత్రి గారి టేబుల్ పైన పెట్టి వెళ్ళిపోయేడు సెక్రటరీ.

కాసేపు ఫైల్ ని క్షుణ్ణం గా పరిశీలించిన తరువాత మాస్టర్ గారిని లోపలికి పంపించ వలసిందిగా ఫోన్ చేసి సెక్రటరీ కి చెప్పారు మంత్రిగారు.

రండి....కూచోండి. మీ వివరాలన్నీ చూసాను. అంటూ  మాస్టర్ గారిని సాదరంగా ఆహ్వానించారు మంత్రివర్యులు. ఈ భూమి విషయమై కొన్ని అడ్డంకులు వున్న మాట వాస్తవమయినా, మీ కేసు జెన్యూన్ కాబట్టి తప్పకుండా సహాయం చేస్తాను. మరేమీ ఫర్లేదు...మీరు నిశ్చింతగా ఉండొచ్చు, అంటూ ఫైల్ మీద సంతకాలు పెట్టి, సెక్రటరీ ని పిలిచి, త్వరగా క్లియర్ చెయ్యమంటూ ఆదేశాలు జారీ చేసారు మంత్రిగారు.

మాస్టారు ఉప్పొంగిపోయేరు. గత మూడు నెలలనించీ తిరుగుతున్నా పని కాలేదు. మీ దయ వలన ఇప్పుడు పూర్తయ్యింది. అంటూ  కృతఙ్ఞతా పూర్వకంగా నమస్కరించబోయేరు మాస్టర్ గారు.

అయ్యో.....మీరు పెద్దవారు. మీరు నమస్కరించరాదు. మీ బోటి వారికి సేవ చెయ్యడమే మా లక్ష్యం అంటూ మాస్టర్ గారిని వారించారు మంత్రి గారు.
కృతఙ్ఞతా పూర్వకంగా ఆశీర్వదించి వెనుదిరిగి తలుపు తీసుకుంటూ వెళ్లబోయారు  తెలుగు మాస్టారు.

చేతన్, చెన్, తోడన్, తోన్......చేతనైన చేయూతనందించి తోడుగా నిలవడం....
తృతీయా విభక్తి...!

కొఱకున్, కై ......ప్రజల కొరకు , ప్రజల కోసం పోరాడటం.....
చతుర్ధీ విభక్తి ...!

వలనన్, కంటెన్, పట్టి.....ప్రజల వలన ఎన్నుకోబడిన నేను, వాళ్ళ కంటే గొప్పవాడినేమీ కాను, పట్టి పీడిస్తున్న సమస్యలను పరిష్కరించటమే.....పంచమీ విభక్తి ....!

కిన్, కున్, యొక్క, లోన్, లోపల.....వ్యవస్థ లోపల  వున్న కలుపు మొక్కల్ని ఏరి పారేసి, సంఘం యొక్క మేలు కోరడమే.....షష్టీ విభక్తి...!

అందున్, నన్.......అందుకు  కట్టుబడి వుంటాను, ఆ విధంగా నన్ను నేను మలుచుకుంటాను.....సప్తమీ విభక్తి...!

ఇదే మాకు మా గురుదేవులు నేర్పిన  పాఠం.....అందుకే మా తెలుగు మాస్టారంటే మాకు అమితమైన భక్తి !!! ఆయన నేర్పిన క్రమశిక్షణే మాకు యెనలేని శక్తి!!!!
అమాంతం వెనక్కి తిరిగి చూసిన తెలుగు మాస్టారి కళ్ళు (కన్) నీటి కుండల్లా వున్నాయి.

అవును మాస్టారు.....నేనే చిన్నప్పటి మీ శీను గాణ్ణి......అన్నాడు మంత్రి శీనయ్య!!!

నీటి పొరలు కప్పేయడం వలన ఏమో, ఒకరికొకరు మసక, మసక గా కనపడుతున్నారు. తన శిష్యుడి ఉన్నతి చూసి మురిసిపోయేరు మాస్టారు. గట్టిగా కౌగిలించుకున్నారు.

కాలేజీ చదువులు చదువుతున్నప్పుడు ఒక్కొక్కటిగా జీవితం పాఠాలను నేర్పసాగింది మాస్టారు.....అప్పుడు తెలిసి వచ్చింది మీరు క్రమశిక్షణపై ఎందుకు అంత శ్రద్ధ వహించేవారో , మమ్మల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి ఎంత కష్టపడేవారో! ఆ నాడు మీరు నేర్పిన పాఠాలను నెమరు వేసుకుంటూ.....నా బతుకు చిత్రాన్నేమార్చుకున్నాను. ప్రజాసేవ చేస్తూ దేశానికి ఎంతో కొంత ఋణం తీర్చుకోవాలనుకున్నా.....చూస్తున్నారుగా......ఇపుడిలా

మీరేమీ అనుకోక పోతే అమ్మాయి పెళ్లి కి నాకు చేతనైనంత సహాయం చేసి, మీకు గురుదక్షిణగా చెల్లించుకుంటా.......ఆ భూమి ని మాత్రం అమ్ముకోవద్దు. మీ జీవిత భద్రత కోసం మీ దగ్గరే అట్టే పెట్టుకోండి .....ఇది నా విన్నపం. కాదనకండి....అంటూ అభ్యర్ధించాడు మంత్రి శీనయ్య  ఉరఫ్ శీను.
గురుభక్తిని కాదనలేకపోయారు తెలుగు మాష్టారు. తన శిష్యుడు అంత ఎత్తుకి ఎదిగినందుకు సంబర పడిపోయారు.

సార్ .....మీ మొబైల్ అందుబాటులో లేనట్టుంది. మేడం గారు ఫోన్ చేసేరు. మీ చిన్నబ్బాయి స్కూల్ లో ఉసిరి చెట్టెక్కి కాయలు కోయబోతూ కింద పడ్డాడంట. మరేమి ఫరవాలేదు ....హి ఈస్ ఆల్రైట్ అని ప్రిన్సిపాల్ గారు ఫోన్ చేసి చెప్పారంట .....అంటూ మధ్యలో డిస్టర్బ్ చేసినందుకు క్షమాపణలు చెప్తూ .....వచ్చి చెప్పాడు సెక్రటరీ.

మరేమీ ఫర్వాలేదు ప్రిన్సిపాల్ గారిని వాడికి ఇంకో నాలుగు తగిలించమను. మరీ బుద్ధి లేకుండా తయారవుతున్నాడు ఈ మధ్య  అంటూ ......తెలుగు మాస్టర్ గారి ముఖం లోకి చూసారు సదరు  మంత్రి గారు.

ఆ ఇద్దరూ అంతలా పకా,పకా ఎందుకు నవ్వుతున్నారో ఓ పట్టాన అర్ధం కాలేదు సెక్రటరీ కి.....

Monday, April 24, 2017

తెలంగాణా పదకోశం

తెలంగాణా పదకోశం

తూటు : రంధ్రం
ఏతులు : గొప్పలు
మలుపు : మూల
తాపతాపకు : మాటిమాటికి
జల్ది : త్వరగా
కొత్తలు : డబ్బులు
ఏంచు : లెక్కించు
నాదాన : బలహీనం
నప్పతట్లోడు: పనికి మాలినవాడు
ల్యాగ : ఆవు దూడ
గుపాయించు: జొరబడు
కూకొ : కూర్చో
కూనం : గుర్తు
మడిగ : దుకాణం
పొట్లం : ప్యాకింగ్
బత్తీసలు : అప్పడాలు
పతంగి : గాలిపటం
సోంచాయించు: ఆలోచించు
పయఖాన : టాయిలెట్
మోసంబి : బత్తాయి
అంగూర్ : ద్రాక్ష
కష్‌కష్ : గసాలు
కైంచిపలంగ్ : మడత మంచం
చెత్రి : గొడుగు
కల్యామాకు : కరివేపాకు
మచ్చర్‌దాన్ : దోమతెర
మడుగుబూలు: మురుకులు
జమీర్‌ఖాన్ : భూస్వామి
జాగా : స్థలం
తండా : చల్లని
గర్మి : వేడి
వూకె : ఉట్టిగా
సిలుం : తుప్పు
నియ్యత్ : నిజాయితీ
తపాలు : గిన్నె
తైదలు : రాగులు
పలంగి : మంచము
బలంగ్రి : డ్రాయింగ్ రూం
సల్ప : నున్నని రాయి
దప్పడం : చారు
గెదుముట : పరిగెత్తించుట
తొక్కు : పచ్చడి
కిసా : జేబు
సల్ల : మజ్జిగ
అర్ర : గది
బుడ్డలు : పల్లీలు
గడెం : నాగలి
గాండ్లు : బండి చక్రాలు
కందెన : ఇంధనం
ఉప్పిండి : ఉప్మా
చిమ్ని : బుగ్గదీపం
తపుకు : ప్లేటు
ముగ్గ : చాలా
కందీలు : లాంతరు
బటువు : ఉంగరం
బాండ్లి : మూకుడు
సలాకి : అట్లకాడ
ఈలపీట : కత్తిపీట
గనుపట్ల : గడప దగ్గర
గుండ్లు : రాళ్ళు
సల్వ : చల్లదనం
ఏట కూర : మేక మాంసం
గాలిపంక : ఫ్యాను
షాపలు : చేపలు
సౌంర్త పండుగ: పుష్పాలంకరణ
కుమ్మరావి : కుండలబట్టి
లోట : డబ్బ
ఇడుపు : గోడంచు
సౌరం : క్షవరం
శిబ్బి : తీగల జల్లెడ
తూటు : రంధ్రం
శిరాపురి : పరమాన్నం
తీట : కోపం
పటువ : కుండ
తలె : పల్లెం
పొర్క : చీపురు
సపారం : పందిరి
సర్కార్ ముల్లు: కంపముల్లు
దేవులాడు : వెతుకు
వాగు : నది
సడాకు : రోడ్డు
చిత్పలకాయ: సీతాఫలం
ఏమది : ఏమిటి
లచ్చమ్మ : లక్ష్మమ్మ
రామండెం : రామాయణం
తక్కడి : త్రాసు
గంటె : చెంచా
కాందాని : పరువు
బూగ : తూనీగ
సందుగు : పెట్టె
బిటాయించు: కూర్చోమను
జొన్న గటుక: జొన్న గింజల అన్నం
కంచె : సరిహద్దు
లైయ్ : అతికించే పదార్థం
బాపు : నాన్న
ఆనతి : అభయం
సోలుపు : వరుస
పీనోడు : పెండ్లి కొడుకు
దురస్తు : బాగుచేయు
శిరాలు : మెడ
కందీలు : లాంతరు
ఆర్సీలు : కళ్ళజోడు
మక్కెండ్లు : మొక్కజొన్న
సుట్టాలు : బంధువులు
మాలస : ఎక్కువ
కైకిలి : కూలి
కొయ్‌గూర : గొంగూర
కూడు : అన్నం
అసంత : దూరంగ
సిబ్బి : గుల్ల
పావుడ : పార
సలమల : వేడిలో మరగడం
ఊకో : కాముగా ఉండు
జల్దిరా : తొందరగా రా
తపుకు : మూత
తువ్వాల : చేతి రుమాలు
లాగు : నెక్కరు
కాయిసు : ఇష్టం
బుగులు : భయం
ఉర్కుడు : పరుగెత్తుడు
శానా : చాల
గట్లనే : అలాగే
గిట్లాంటి : ఇలాంటి
బర్కత్ : లాభం
కుసో : కూర్చొండి
తర్జుమా : అనువాదం
నెరసు : చాలా చిన్నదైన
బకాయి : చెల్లించవలసిన మొత్తం
తోఫా : కానుక
ఇలాక : ప్రాంతం
బరాబరి : సరి సమానం
ఉసికే : ఇసుక
తోముట : రుద్దుట
గీరె : గిరక
బొంది : శరీరం
ఉలికిపడుట : అదిరిపడుట
ఈడు : వయసు
జోడు : జంట
కూడు : అన్నం
గోడు : లొల్లి
అల్లుట : పురి వేయుట
నుల్క : మంచానికి అల్లే తాడు
శెల్క : తెల్లభూమి
మొల్క : పుట్టిన మొక్క
శిల్క : చిలుక
పల్కు : మాట్లాడు
ఈతల : ఈవల
ఆతల : ఆవల
తను : అతడు
దిడ్డి ధర్వాజ : మరో ద్వారం
కొట్టం : పశువుల పాక
గూటం : పశువుల కట్టేసే గుంజ
పగ్గం : తాడు
శాయిపత్తి : తేయాకు
పెంక : పెనం
సుంకం : పన్ను
లెంకు : వెతుకు
తొంట చెయ్యి : ఎడమ చెయ్యి
తక్కెడు : ముప్పావు కిలో
దేవులాడు : వెతుకు
నడిమీలకు : మధ్యలకు
పుండు కోరుడు : వివాదాస్పదుడు
పత్యం : నియమాహారం
పాకులాడు : ప్రయత్నించు
పగిటీలి : పగటి పూట
పొడవూత : పొడవునా
పొద్దుగాల : ఉదయం
బరిగె : బెత్తం
బంజరు : ప్రభుత్వ భూమి
దెంకపోవుట : పారిపోవుట
నజీబ్ : అదృష్టం
మాలేస్క : ఎక్కువ
మతులాబ్ : విషయం
మనుండంగ : ప్రాణంతో ఉండగ
సటుక్కున : తొందరగా
సముదాయించుట : నచ్చ జెప్పుట
సైలేని : చక్కగా లేని
ఇకమతు : ఉపాయం
ఎక్క : దీపం
ఆలి : పెండ్లం
దుత్త : చిన్న మట్టి కుండ
ఎళ్ళింది : పోయింది
గైండ్ల : వాకిట్ల
తలగాయిండ్ల: వాకిలి ముందు
అంబలి : జావ
దప్పడం : సాంబారు, పప్పుల పులుసు
కుడుము : ఇడ్లీ
ఎసల : వండులకు ఉపయోగించే కుండ
నాలె : నేల
ఓరకు : పక్కకు
ఒల్లె : చీర
తాతిపారం : మెల్లగ
ఎరుక : తెలుసు
మొరగు : అరచు
అంబాడు : చిన్నపిల్లల పాకుడు
అర్సుకొనుట: పరామర్శించుట
ఊసు : కండ్ల నుండి వచ్చే మలినం
ఎటమటం : అస్తవ్యస్తం
ఎఱ్ఱ : వానపాము
కూడు : అన్నం
చిలుక్కొయ్య: కొక్కెము
గులుగుట : లోలోపల మాట్లాడుట
గువ్వము : గుజ్జు
జీవిలి : చెవిలోని మలినం
జోకు : తూకం
తాంబాళం : పెద్ద పళ్ళెం
నసుకు : చెప్పుటకై వెనకాముందాడుట
నెరి : పూర్తిగా
బీరిపోవు : ఆశ్చర్యపడు
మాగికాలం : పగలు తక్కువగా ఉండే కాలం
వొయ్య : పుస్తకం
సోయి : స్పృహ
బిశాది : విలువ
పతార : పలుకుబడి
పజీత : పరువు
సాపిచ్చుట : తిట్టుట
పస్కలు : కామెర్లు
గౌర : గరాటు
గాసం : దాన
బల్గం : బంధుజనం
సొరికి : సొరంగం
సౌలతు : వసతి
బోలెడు : చాల
ఓపాలి : ఓసారి
యాల్ల : సమయం
కారటు : ఉత్తరం
డోకు : వాంతి
టప్పా : పోస్టు
సూటి : గురి
సోల్తి : జాడ
సోపతి : స్నేహం
ఎర్కలే : జ్ఞాపకం లేదు
ఉత్తగ : ఊరికే
నువద్ది : నిజంగా
పైలం : జాగ్రత్త
శరం : సిగ్గు
ఛిద్రం : రంధ్రం
మతలబు : విషయం
ఎండ్రికాయ : పీత
జబర్‌దస్తీ : బలవంతం
కనరు : వెగటు
ఇడిసిపెట్టు : వదిలిపెట్టు
గత్తర : కలరా
ఇగురం : వివరం
పరదా : తెర
గుర్రు పెట్టుట: గురక పెట్టుట
గులగుల : దురద
గులాం : బానిస
గిచ్చుట : గిల్లుట
పిసరంత : కొద్దిగా
గుత్త : మొత్తం ఒకేసారి
గుండిగ : వెడల్పు మూతి గల ఇత్తడి పాత్ర
శిట్టశిట్ట : తొందరగా
బర్ఖతక్కువ : వృద్దిలేని
వుర్కు : పరుగెత్తు
సర్రున : వెంటనే
మొస : శ్వాస
బుదగరింపు: ఓదార్పు
ఓమానంగా : అతి కష్టంగా
గల్మ : ద్వారం
పొల్ల : అమ్మాయి
ఆయమన్న : ఉన్నదాంట్లో మంచిది
లొల్లి చప్పుడు
ఇషారా : వివరాలు
కారెడ్డెం : మనసులో ఒకటి పైకి ఒకటి చెప్పడం
దూప : దాహం
తొవ్వ : దారి
లగ్గం : పెళ్ళి
సోయి : స్పృహ
ఏసిడి : చెడుకాలం
జరంత : కొద్దిగా
పైలం : పదిలం
యాదుందా : జ్ఞాపకం ఉందా
ఎక్కిరింత : వెక్కిరించుట
సవుసు : ఆగు
చితల్‌పండు : సీతాఫలం
కాలం చేసుడు: మరణించుట
మస్తుగ : మంచిగ
నిరుడు : గత సంవత్సరం
ఎర్కలే : జ్ఞాపకం లేదు
పోవట్టిన : వెళ్తున్న
కూకొ : కూర్చో
పొద్మికి : సాయంత్రం
ఉత్తగ : ఊరకే
బుదగరిచ్చి : బతిలాడి
యాష్ట : విసుగు
తెగదెంపులు: విడాకులు
సాయిత : దంట
లొల్లి : గోల
పాయిద : లాభం
తోడెం : కొంచెం
భేట్ : కలయిక
కీలు : తాళం
జల్ది : త్వరగా
ఫకత్ : ఎల్లప్పుడు
పంఖా : విసనకర్ర
గూసలాట : పొట్లాటా
ఝగడ్ : జగడం
నిత్తె : ప్రతి దినం
గాయి : అల్లరి
సెక : మంట
మస్కున : మసక చీకటిలో
తోగరుపప్పు: కందిపప్పు
అయి : అమ్మ
గాడికా : అక్కడికా
లెంకుట : వెదుకుట
పక్కా : నిశ్చయము
ఉండి : వరకట్నం
లాగు : నెక్కరు
బుడ్డోడు : చిన్నవాడు
మెత్త : దిండు
అడ్డెనిగా : భోజన స్లాండు
పదిలెము : క్షేమం
సర్వపిండి : కారం రొట్టె
బొక్కెన : నీరుతోడే బక్కెట్
వొర్రకు : అరువకు
గౌసెను : దిండు కవరు
కైకిలి : కూలీ
చెల్క : వర్షధార పొలం
గౌడి : కోట
ముల్లె : మూట
దర్వాజ : తలుపు
కొట్టము : గోశాల
తనాబ్బి : షెల్పు
ముంత : చెంబు
ఉరుకు : పరుగెత్తు
ఆత్రము : తొందర
సౌసు : ఆగు
శిబ్బి : అన్నం వంపే మూత
తల్లి గుంజ : పెళ్ళి పందిరికి తల్లి వంటిది
లగ్గం : పెండ్లి
నాగెల్లి : నాగవెల్లి
పైలము : జాగ్రత్త
దౌతి : సిరాబుడ్డి
ఎగిర్త : తొందర
అడ్లు : వరిధాన్యం
పుస్తె : తాళి
నొసలు : లలాటము
తోల్త : పంపిస్త
బాట : దారి
లెంకు : వెతుకు
మంకు : బుద్ధిమాంద్యం
పత్త : చిరునామా
ఇకమత్ : తెల్వి
తకరారు : సతాయించుడు
తోడం : కొంచెం
పడిశం : సర్ధి
బలుపు : మదము
కండువ : టవల్
అంగి : చొక్కా
బౌగొనె : గిన్నె
బువ్వ : అన్నం
ఎయ్యి : పెట్టు
ఎక్క : దీపం
గూడు : సెల్ఫ్
నెత్తి : తల
వర్రుడు : బాగా మాట్లాడు
ఉరికిరా : పరిగెత్తుకుని రా
మాలెసా : బాగా
మడిగెలు : షెట్టర్లు
నూకు : వుడ్చుడు
ఉబ్బర : ఉక్కపోత
యాడికి : ఎక్కడికి
కుకొ : కూర్చుండు
జర ఆగు : కొద్దిగుండు
కంకలు : ఎడ్లు
మొగులు : ఆకాశం
నెత్తి : తల
ఇకమతు : ఉపాయం
మలగడం : తిరగడం
దబ్బన : తొందర
మారాజ్ : పూజారి
లడిక : గరాటు
శారాన : పావుల
బారాన : మూడు పావులాలు
కుర్స : పొట్టి
మోటు : గడుసు
గోసి : పంచ
బాపు : తండ్రి
కాక : బాబాయి
పెదబాపు : పెద్ద నాన్న
పెద్దాయి : పెద్దమ్మ
యారాలు : తోటి కోడలు
సడ్డకుడు : తోడల్లుడు
సాలెగాడు : బావమర్ది
తమ్మి : తమ్ముడు
దన్ననరా : త్వరగా రా
జల్దిరా : జెప్పున రా
ఊకో : ఆగు
సోపాల : ఒడి
ఓమాడి : పొదుపు
పురాత : పూర్తిగా
పైలంగరా : మెల్లగ రా
ఆడికేంచి : అక్కడి నుండి
లగు : బలుపు
పరేషాన్ : అలసట
ఇమ్మతి : సాయం
ఇమాకత్ : గర్వం
జాతర : తీర్ధం
పనుగడి : కొష్టం దరువాజ
సిడీలు : మెట్లు
తట్టి : పళ్ళెం
ఊరబిస్క : ఊరపిచ్చుక
ఆవలికి : బయటకు
పాయిరం : పావురం
ఆయేటిబూనంగ : తొలకరి
సడుగు : రోడ్డు
దొరింపు : మార్గం
కుందాపన : దిగులు
పిడుస : ముద్ద
దుబ్బ : మట్టి
చెండు : బంతి
బగ్గ : బాగా
బొచ్చెడు : చాలా
యాపాకులు: వేపాకులు
గాయిదోడు : ఆవారా
నడిమిట్ల : మధ్యన
సూరు : చూరు
పయ్య : చక్రం
ఒంటేలు : మూత్రం
రాతెండి : అల్యూమినియం
బర్మా : రంధ్రాలు చేసే సాధనం
ఇగురం : ఉపాయం
దిడ్డి : కిటికీ
ఇల వరుస : పద్ధతి
బుట్టాలు : లోలాకులు
గరిమి : వేడి
కచ్చురం : ఎడ్ల బండి
పెనిమిటి : భర్త
అర్ర : గది
గలుమ : తలుపు
తల్వాలు : తలంబ్రాలు
పరాశికం : నవ్వులాట
మబ్బుల : వేకువ జామున
చిడిమెల : తొందరగా
- రొడ్డ రవీందర్, మంచిర్యాల
కాపాయం : పొదుపు
యవ్వారం : వ్యవహారం
కైకిలి : కూలి
అలిమిబలిమి: ఇష్టాయిష్టాలు
మనాది : బెంగ
ఎటమటం : బెడిసికొట్టు
మొగులు : ఆకాశం
రంది : దిగులు
సడుగు : తొవ్వ
బాలకాలి : పిల్ల చేష్టలు
అగ్వ : చౌక
గాడ్పు : గాలి
ఇంగలం : నిప్పు
మాల్‌గాడి : గూడ్సు బండి
ఎక్వ తక్వ : హెచ్చుతగ్గులు
గిర్వి : తాకట్టు
కొలువు : నౌకరు
పాలోళ్ళు : దాయాదులు
పొద్దుగూకి : సాయంత్రం
నెత్తి : తల
జంగుబట్టింది: తుప్పుబట్టింది
మొగురం : కట్టెస్తంభం
గావురం : ప్రేమ
ఒద్దులు : దినములు
గలుమ : ద్వారము
లగాంచి : జోరుగా
రికాం : తీరిక
సుంసాం : నిశ్శబ్దం
తట్టు : గోనె సంచి
గత్తర : కలరా
తొట్టె : ఊయల
ఇగం : అతి చల్లని
గవాబు : సాక్ష్యం
తాపతాపకు : మాటిమాటికి
పైకం : డబ్బులు
తపుకు : మూత గిన్నె
బుగులు : భయం
సుతారం : సున్నితం
తోలుట : నడుపుట
కోల్యాగ : ఆవుదూడ
సొక్కంపూస: నీతిమంతుడు
బుదగరించుట: బుజ్జగించుట
బరివాత : నగ్నంగ
కోసులు : మైళ్ళు
తనాబ్బి : కప్ బోర్డు
వరపూజ : నిశ్చితార్థం
రయికె : జాకెట్టు
తనాబి : షెల్ఫ్
తంతెలు : మెట్లు
ఆనక్కాయ : సొరకాయ
కలెగూర : తోటకూర
తొక్కు : ఊరగాయ
బుక్కెడు : ఒక ముద్ద
గంటే : గరిటే
గరిమికోటు : రెయిన్ కోటు
గంజు : వంట పాత్ర
రంజన్ : కూజ
నూతి : బావి
గడెంచే : నులకమంచం
అవతల : ఆరు బయట
గొడిసేపు : కాసేపు
నిరుడు యేడు: గత సంవత్సరం
కల్ప : మంగలి పెట్టే
టొక్క : పారిపోవడం
పత్తి : పాళీ
కందిలి : చిన్న దీపం
సోల్తి : జాడ
పొంతన : పోలిక
మోపున : జాగ్రత్తగ
పోగులు : కుప్పలు
ఎటమటం : పొరపాటు
సర్సుట : కొట్టుట
కాన్గి బడి : ప్రైవేటు బడి
లగ్గం : పెళ్ళి
మర్లబడుట : తిరగబడుట
తాషిలి : కీడు
కాంచి : సీటుపై కూర్చోకుండ సైకిల్ తొక్కుట
దడ్లబురి : మగ కోతి
మొస : అధిక శ్వాస
డొక్క : కడుపు
అముడాల : కవల
ఆపతి పడుట: ప్రసవ వేదన
ఇగం : చల్లగ, హిమం
ఇడుపులు : ప్రవేశ ద్వార ప్రాంతం
ఇమానం : ప్రమాణం
ఎనుగు : ముండ్ల కంచె
ఏతులు : హెచ్చులు, గొప్పలు
బగరుకొట్టుట: వేగంగా శ్వాసించుట
కంచె : గడ్డి బీడు
కైలాట్కం : కలహం, కొట్లాట
జిట్టి : దృష్టి
జిమ్మ : జిహ్వ
తుత్తుర్లు : వెంట్రుకలు
దంచుట : దండించుట, కొట్టుట
దంగుట : తఱుగుట
నీయత్ : నిజాయితీ
పాసంగం : మొగ్గు
పురుసత్ : విశ్రాంతి
మిత్తి : వడ్డి
ఆయిటి : తొలకరి
ఇగురు : చిగురు
ఇగురం : వ్యూహం
ఇగ్గుట : సంకోచించుట
ఇచ్చంత్రం : విచిత్రం
ఒళ్ళక్కం : అబద్దం
కువారం : చెడ్డబుద్ధి
కైగట్టుట : కవిత్వం రాయుట
దసుకుట : కుంగుట
నక్కు : అతుకు
నాదాను : బలహీనం
నేఱివడుట : అలసిపోవుట
పతార : పరపతి
పుల్లసీలుట : అలసిపోవుట
బొండిగ : గొంతు
మాల్యం : దయ గలుగుట
మాయిల్యమే: వెంటనే, తొందరగ
మోర్‌దోపు : ప్రమాదకరమైన
తొవ్వ : బాట
మంకు : మొండితనం
నొసలు : నుదురు
దొబ్బు : నెట్టు
దీపంత : ప్రమిద
కాయిసు : ఇష్టం
యాల్ల : సమయం
రౌతు : రాయి
పసిరికెలు : కామెర్లు
పటువ : కుండ
ఉబ్బు : ఉత్సాహం
పెయ్యి : వొళ్ళు
యాష్ట : విసుగు
అంబటియాల : అంటి తాగే సమయం
ఆనగపు కాయ: సోరకాయ
ఇసుర్రాయి : విసురు రాయి
ఉలువచారు : ఉలువ కట్టు
ఎచ్చాలు : గరం మసాలా వస్తువులు
ఎసరు : అన్నం ఉడకడానికి పెట్టుకునే నీరు
ఒత్తి పొయ్యి : పొంత పొయ్యి
కడువ : నీరు తెచ్చుకునే మట్టి కుండ
గాబు : ధాన్యం నిల్వ ఉంచుకొనేందుకు మట్టితో చేసింది.
గుమ్మి : నిల్వ ఉంచుకొనేందుకు ఈత సువ్వలతో అల్లినది.
వత్తు : కట్టెల పొయ్యికి ఆనుకొని వుండే కుండ (వేడినీళ్ళకై ఉపయోగిస్తరు).
కురాడు : బియ్యాన్ని ఉడికించుటకు వాడే, కలి నీళ్ళను నిల్వవుంచే కుండ.
సాయబాన్ : దంపతుల పడకగది.
సానుపు : పొద్దున ఇంటిముందు పేడతో కలిపి చల్లే నీళ్ళు.
గిరుక : బావిలోని నీటిని తోడుటకు ఉపయోగపడేది.
కంచుడు : పులుపు కూరలను వండుటకు వాడే మట్టి కుండ.
గోరు కొయ్యలు : రాత్రివేళ ఆకాశంలో వరుసగా వుండే మూడు నక్షత్రాలు.
ఇకమత్ : ఉపాయం
మిడుకుడు : ఈర్శ
గడ్డపార : మొగులు
శిర్రగోనె : గూటి బిల్ల
సాన్పి : కళ్ళాపి
పొద్మీకి : సాయంకాలం
బుగ్గ : బల్బు
పైలు : ఒకటో తేది
బేస్తారం : గురువారం
ఐతారం : ఆదివారం
బిరాన : తొందరగా
మలాస : ఎక్కువ
పైలం : జాగ్రత్త
ఏంటికి : ఎందుకు
గులగుల : చెక్కిలిగింతలు
అంగి : చొక్కా
నడ్మ : మధ్యలో
ఆల్చం : లేటు
అసంతకు : పక్కకు
సైసు : ఆగు
అద్దాలు : కళ్ళజోడు
అట్లనా : అవునా
ఇల్టెపల్లుడు : ఇల్లరికపు అల్లుడు
తియ్యి : తీయు
శాతాడు : చేతాడు
పోతడు : వెళ్ళగలడు
అస్తడు : వస్తాడు
మొగురం : ఇంటిలో స్తంభం
ఆసం : పైకప్పు కర్ర
నడ్డి : నడుము
చెడ్డి : డ్రాయరు
ఎడ్డి : తెల్విలేని తనం
దుడ్లు : పైసలు
అడ్లు : వరి ధాన్యం
మడి : భూమి గుంట
పుస్తె : తాళి
గుత్త : ఒక్క మొకాన
సగురం : కొప్పుకు జతపరిచేది
అందాద : సుమారు
ఆయిల్ల : క్రితం రాత్రి
కడ్డు : మొండి
నసీవ : అదృష్టం
ఎగిర్తం : తొందర
ఎచ్చిరికం : అతి
బరివాత : నగ్నం
అర్ర : స్టోర్ రూమ్
నిరుడు : క్రితం సంవత్సరం
సై చూడు : రుచి చూడు
ఇమానం : ఒట్టు
పైలం : జాగ్రత్త
పెయిసబ్బు : స్నానం సబ్బు
కుత్తెం : ఇరుకు
బల్లిపాతర : బూజు
బుక్కుట : తినుట
తుట్టి : నష్టం
ఓరకు పెట్టుట: దాచి పెట్టుట
తట్టి : పళ్లెం
మత్తి : పొగరు
ఎకసెక్కాలు : పరాష్కాలు
ఇకిలించుట : నవ్వుట
గలుమ : గడప
కాకిరి బీకిరి : గజిబిజి
బుజ్జగించి : లాలించి
ప్రభోజనం : ఫంక్షన్
గుత్పలు : పెద్ద కర్రలు
దుడ్లు : డబ్బులు
పజీత : సతాయించడం
మెడకొడం : వెంబడి తగలడం
లెంకుట : వెతుకుట
ఊకుట : ఊడ్వడం
లాగం : అలవాటు
ఉల్లెక్కాలు : పరిహాసం
బరివాతల : దిగంబరంగా
శవ్వా : చీచీ
లగ్గం : పెళ్ళి
పట్టగొల్సులు : కాళ్ళ వెండిపట్టీలు
కార్జం : మేక కాలెయం
సోల్‌పూత : వరుసగా
ఉల్లుల్లు : వదులుగా చేయుట
డల్లు : కొద్దిసేపు
లాలపోయుట: స్నానం పోయుట
సల్లు : నీరు కారుట
పాసంగం : బరువులో తేడా
గతుకులు : ఎగుడు దిగుడు
గడ్కోటి : గడియకోసారి
దస్కుట : కుంగిపోవుట
పొతం : చక్కగా అమర్చడం
సనుగు : ఒక వస్తువు
దొరింపు : సమకూర్చుట
సుమీ : హెచ్చరిక చేయడం
నివద్దే : నిజమే
కీస్ పిట్ట : విజిల్
పీక : బూర
చెండు : బంతి
పుడా : ప్యాకెట్
రికాం : తీరిక
సలువలు : చెమటలు
మాడ : తలపై భాగం
ఒంటేలు : మూత్రం
గొట్టు : కఠినమైన
బర్ర : గాయపు మచ్చ
పులగండు : తిండిబోతు
అగడు : అత్యాశ
మార్వానం : రెండో పెళ్ళి
చిలుము : తుప్పు
పుర్సత్ : నిమ్మలం
పిసరు : చిన్నముక్క
పిడాత : అకస్మాత్తుగా
తెరువకు : జోలికి
యాట : గొర్రె/మేక
మొగురం : కర్ర స్తంభం
ఇసురుగ : గొప్పగా
సిన్నగా : మెల్లగా
రంది : బాధ
పసిది : చిన్నది
బోళ్ళు : గిన్నెలు
ఇడుపు : విడాకులు
కారటు : ఉత్తరం
పొద్దుగాల : వేకువ జామున
అగ్గువ : చౌక
బయాన : అడ్వాన్సు
మడిగె : దుకాణం
బీమారి : రోగం
సోల : కిలో
సంత : అంగడి
ఇనాం : బహుమతి
తలె : పళ్ళెం
పత్తాలాట : పేకాట
ముచ్చెట్లు : మాటలు
అక్కెర : అవసరం
ఏశాలు : నాటకాలు
కట్టె సర్సుడు : బిగుసుకుపోవడం
కమిలింది : కందిపోయింది
గద్దరించు : గట్టిగా అరుచు
గట్లనే : అట్లాగే
గతిమెల్ల : దిక్కులేని
గత్తర : కలరా
గర్క : గరిక
గాయింత పని : మిగిలిన పని
గంతే : అంతే
గుత్తేదారు : కాంట్రాక్టరు
గుత్ప : దుడ్డుకర్ర
గొర్రెంక : గోరువంక
గోలం : నీళ్ల తొట్టి
తిత్తి : తోలు సంచి
తువాల : తుండు గుడ్డ
తత్తర : తడబడు
తతెలంగాణా పదకోశం
తూటు : రంధ్రం
ఏతులు : గొప్పలు
మలుపు : మూల
తాపతాపకు : మాటిమాటికి
జల్ది : త్వరగా
కొత్తలు : డబ్బులు
ఏంచు : లెక్కించు
నాదాన : బలహీనం
నప్పతట్లోడు: పనికి మాలినవాడు
ల్యాగ : ఆవు దూడ
గుపాయించు: జొరబడు
కూకొ : కూర్చో
కూనం : గుర్తు
మడిగ : దుకాణం
పొట్లం : ప్యాకింగ్
బత్తీసలు : అప్పడాలు
పతంగి : గాలిపటం
సోంచాయించు: ఆలోచించు
పయఖాన : టాయిలెట్
మోసంబి : బత్తాయి
అంగూర్ : ద్రాక్ష
కష్‌కష్ : గసాలు
కైంచిపలంగ్ : మడత మంచం
చెత్రి : గొడుగు
కల్యామాకు : కరివేపాకు
మచ్చర్‌దాన్ : దోమతెర
మడుగుబూలు: మురుకులు
జమీర్‌ఖాన్ : భూస్వామి
జాగా : స్థలం
తండా : చల్లని
గర్మి : వేడి
వూకె : ఉట్టిగా
సిలుం : తుప్పు
నియ్యత్ : నిజాయితీ
తపాలు : గిన్నె
తైదలు : రాగులు
పలంగి : మంచము
బలంగ్రి : డ్రాయింగ్ రూం
సల్ప : నున్నని రాయి
దప్పడం : చారు
గెదుముట : పరిగెత్తించుట
తొక్కు : పచ్చడి
కిసా : జేబు
సల్ల : మజ్జిగ
అర్ర : గది
బుడ్డలు : పల్లీలు
గడెం : నాగలి
గాండ్లు : బండి చక్రాలు
కందెన : ఇంధనం
ఉప్పిండి : ఉప్మా
చిమ్ని : బుగ్గదీపం
తపుకు : ప్లేటు
ముగ్గ : చాలా
కందీలు : లాంతరు
బటువు : ఉంగరం
బాండ్లి : మూకుడు
సలాకి : అట్లకాడ
ఈలపీట : కత్తిపీట
గనుపట్ల : గడప దగ్గర
గుండ్లు : రాళ్ళు
సల్వ : చల్లదనం
ఏట కూర : మేక మాంసం
గాలిపంక : ఫ్యాను
షాపలు : చేపలు
సౌంర్త పండుగ: పుష్పాలంకరణ
కుమ్మరావి : కుండలబట్టి
లోట : డబ్బ
ఇడుపు : గోడంచు
సౌరం : క్షవరం
శిబ్బి : తీగల జల్లెడ
తూటు : రంధ్రం
శిరాపురి : పరమాన్నం
తీట : కోపం
పటువ : కుండ
తలె : పల్లెం
పొర్క : చీపురు
సపారం : పందిరి
సర్కార్ ముల్లు: కంపముల్లు
దేవులాడు : వెతుకు
వాగు : నది
సడాకు : రోడ్డు
చిత్పలకాయ: సీతాఫలం
ఏమది : ఏమిటి
లచ్చమ్మ : లక్ష్మమ్మ
రామండెం : రామాయణం
తక్కడి : త్రాసు
గంటె : చెంచా
కాందాని : పరువు
బూగ : తూనీగ
సందుగు : పెట్టె
బిటాయించు: కూర్చోమను
జొన్న గటుక: జొన్న గింజల అన్నం
కంచె : సరిహద్దు
లైయ్ : అతికించే పదార్థం
బాపు : నాన్న
ఆనతి : అభయం
సోలుపు : వరుస
పీనోడు : పెండ్లి కొడుకు
దురస్తు : బాగుచేయు
శిరాలు : మెడ
కందీలు : లాంతరు
ఆర్సీలు : కళ్ళజోడు
మక్కెండ్లు : మొక్కజొన్న
సుట్టాలు : బంధువులు
మాలస : ఎక్కువ
కైకిలి : కూలి
కొయ్‌గూర : గొంగూర
కూడు : అన్నం
అసంత : దూరంగ
సిబ్బి : గుల్ల
పావుడ : పార
సలమల : వేడిలో మరగడం
ఊకో : కాముగా ఉండు
జల్దిరా : తొందరగా రా
తపుకు : మూత
తువ్వాల : చేతి రుమాలు
లాగు : నెక్కరు
కాయిసు : ఇష్టం
బుగులు : భయం
ఉర్కుడు : పరుగెత్తుడు
శానా : చాల
గట్లనే : అలాగే
గిట్లాంటి : ఇలాంటి
బర్కత్ : లాభం
కుసో : కూర్చొండి
తర్జుమా : అనువాదం
నెరసు : చాలా చిన్నదైన
బకాయి : చెల్లించవలసిన మొత్తం
తోఫా : కానుక
ఇలాక : ప్రాంతం
బరాబరి : సరి సమానం
ఉసికే : ఇసుక
తోముట : రుద్దుట
గీరె : గిరక
బొంది : శరీరం
ఉలికిపడుట : అదిరిపడుట
ఈడు : వయసు
జోడు : జంట
కూడు : అన్నం
గోడు : లొల్లి
అల్లుట : పురి వేయుట
నుల్క : మంచానికి అల్లే తాడు
శెల్క : తెల్లభూమి
మొల్క : పుట్టిన మొక్క
శిల్క : చిలుక
పల్కు : మాట్లాడు
ఈతల : ఈవల
ఆతల : ఆవల
తను : అతడు
దిడ్డి ధర్వాజ : మరో ద్వారం
కొట్టం : పశువుల పాక
గూటం : పశువుల కట్టేసే గుంజ
పగ్గం : తాడు
శాయిపత్తి : తేయాకు
పెంక : పెనం
సుంకం : పన్ను
లెంకు : వెతుకు
తొంట చెయ్యి : ఎడమ చెయ్యి
తక్కెడు : ముప్పావు కిలో
దేవులాడు : వెతుకు
నడిమీలకు : మధ్యలకు
పుండు కోరుడు : వివాదాస్పదుడు
పత్యం : నియమాహారం
పాకులాడు : ప్రయత్నించు
పగిటీలి : పగటి పూట
పొడవూత : పొడవునా
పొద్దుగాల : ఉదయం
బరిగె : బెత్తం
బంజరు : ప్రభుత్వ భూమి
దెంకపోవుట : పారిపోవుట
నజీబ్ : అదృష్టం
మాలేస్క : ఎక్కువ
మతులాబ్ : విషయం
మనుండంగ : ప్రాణంతో ఉండగ
సటుక్కున : తొందరగా
సముదాయించుట : నచ్చ జెప్పుట
సైలేని : చక్కగా లేని
ఇకమతు : ఉపాయం
ఎక్క : దీపం
ఆలి : పెండ్లం
దుత్త : చిన్న మట్టి కుండ
ఎళ్ళింది : పోయింది
గైండ్ల : వాకిట్ల
తలగాయిండ్ల: వాకిలి ముందు
అంబలి : జావ
దప్పడం : సాంబారు, పప్పుల పులుసు
కుడుము : ఇడ్లీ
ఎసల : వండులకు ఉపయోగించే కుండ
నాలె : నేల
ఓరకు : పక్కకు
ఒల్లె : చీర
తాతిపారం : మెల్లగ
ఎరుక : తెలుసు
మొరగు : అరచు
అంబాడు : చిన్నపిల్లల పాకుడు
అర్సుకొనుట: పరామర్శించుట
ఊసు : కండ్ల నుండి వచ్చే మలినం
ఎటమటం : అస్తవ్యస్తం
ఎఱ్ఱ : వానపాము
కూడు : అన్నం
చిలుక్కొయ్య: కొక్కెము
గులుగుట : లోలోపల మాట్లాడుట
గువ్వము : గుజ్జు
జీవిలి : చెవిలోని మలినం
జోకు : తూకం
తాంబాళం : పెద్ద పళ్ళెం
నసుకు : చెప్పుటకై వెనకాముందాడుట
నెరి : పూర్తిగా
బీరిపోవు : ఆశ్చర్యపడు
మాగికాలం : పగలు తక్కువగా ఉండే కాలం
వొయ్య : పుస్తకం
సోయి : స్పృహ
బిశాది : విలువ
పతార : పలుకుబడి
పజీత : పరువు
సాపిచ్చుట : తిట్టుట
పస్కలు : కామెర్లు
గౌర : గరాటు
గాసం : దాన
బల్గం : బంధుజనం
సొరికి : సొరంగం
సౌలతు : వసతి
బోలెడు : చాల
ఓపాలి : ఓసారి
యాల్ల : సమయం
కారటు : ఉత్తరం
డోకు : వాంతి
టప్పా : పోస్టు
సూటి : గురి
సోల్తి : జాడ
సోపతి : స్నేహం
ఎర్కలే : జ్ఞాపకం లేదు
ఉత్తగ : ఊరికే
నువద్ది : నిజంగా
పైలం : జాగ్రత్త
శరం : సిగ్గు
ఛిద్రం : రంధ్రం
మతలబు : విషయం
ఎండ్రికాయ : పీత
జబర్‌దస్తీ : బలవంతం
కనరు : వెగటు
ఇడిసిపెట్టు : వదిలిపెట్టు
గత్తర : కలరా
ఇగురం : వివరం
పరదా : తెర
గుర్రు పెట్టుట: గురక పెట్టుట
గులగుల : దురద
గులాం : బానిస
గిచ్చుట : గిల్లుట
పిసరంత : కొద్దిగా
గుత్త : మొత్తం ఒకేసారి
గుండిగ : వెడల్పు మూతి గల ఇత్తడి పాత్ర
శిట్టశిట్ట : తొందరగా
బర్ఖతక్కువ : వృద్దిలేని
వుర్కు : పరుగెత్తు
సర్రున : వెంటనే
మొస : శ్వాస
బుదగరింపు: ఓదార్పు
ఓమానంగా : అతి కష్టంగా
గల్మ : ద్వారం
పొల్ల : అమ్మాయి
ఆయమన్న : ఉన్నదాంట్లో మంచిది
లొల్లి చప్పుడు
ఇషారా : వివరాలు
కారెడ్డెం : మనసులో ఒకటి పైకి ఒకటి చెప్పడం
దూప : దాహం
తొవ్వ : దారి
లగ్గం : పెళ్ళి
సోయి : స్పృహ
ఏసిడి : చెడుకాలం
జరంత : కొద్దిగా
పైలం : పదిలం
యాదుందా : జ్ఞాపకం ఉందా
ఎక్కిరింత : వెక్కిరించుట
సవుసు : ఆగు
చితల్‌పండు : సీతాఫలం
కాలం చేసుడు: మరణించుట
మస్తుగ : మంచిగ
నిరుడు : గత సంవత్సరం
ఎర్కలే : జ్ఞాపకం లేదు
పోవట్టిన : వెళ్తున్న
కూకొ : కూర్చో
పొద్మికి : సాయంత్రం
ఉత్తగ : ఊరకే
బుదగరిచ్చి : బతిలాడి
యాష్ట : విసుగు
తెగదెంపులు: విడాకులు
సాయిత : దంట
లొల్లి : గోల
పాయిద : లాభం
తోడెం : కొంచెం
భేట్ : కలయిక
కీలు : తాళం
జల్ది : త్వరగా
ఫకత్ : ఎల్లప్పుడు
పంఖా : విసనకర్ర
గూసలాట : పొట్లాటా
ఝగడ్ : జగడం
నిత్తె : ప్రతి దినం
గాయి : అల్లరి
సెక : మంట
మస్కున : మసక చీకటిలో
తోగరుపప్పు: కందిపప్పు
అయి : అమ్మ
గాడికా : అక్కడికా
లెంకుట : వెదుకుట
పక్కా : నిశ్చయము
ఉండి : వరకట్నం
లాగు : నెక్కరు
బుడ్డోడు : చిన్నవాడు
మెత్త : దిండు
అడ్డెనిగా : భోజన స్లాండు
పదిలెము : క్షేమం
సర్వపిండి : కారం రొట్టె
బొక్కెన : నీరుతోడే బక్కెట్
వొర్రకు : అరువకు
గౌసెను : దిండు కవరు
కైకిలి : కూలీ
చెల్క : వర్షధార పొలం
గౌడి : కోట
ముల్లె : మూట
దర్వాజ : తలుపు
కొట్టము : గోశాల
తనాబ్బి : షెల్పు
ముంత : చెంబు
ఉరుకు : పరుగెత్తు
ఆత్రము : తొందర
సౌసు : ఆగు
శిబ్బి : అన్నం వంపే మూత
తల్లి గుంజ : పెళ్ళి పందిరికి తల్లి వంటిది
లగ్గం : పెండ్లి
నాగెల్లి : నాగవెల్లి
పైలము : జాగ్రత్త
దౌతి : సిరాబుడ్డి
ఎగిర్త : తొందర
అడ్లు : వరిధాన్యం
పుస్తె : తాళి
నొసలు : లలాటము
తోల్త : పంపిస్త
బాట : దారి
లెంకు : వెతుకు
మంకు : బుద్ధిమాంద్యం
పత్త : చిరునామా
ఇకమత్ : తెల్వి
తకరారు : సతాయించుడు
తోడం : కొంచెం
పడిశం : సర్ధి
బలుపు : మదము
కండువ : టవల్
అంగి : చొక్కా
బౌగొనె : గిన్నె
బువ్వ : అన్నం
ఎయ్యి : పెట్టు
ఎక్క : దీపం
గూడు : సెల్ఫ్
నెత్తి : తల
వర్రుడు : బాగా మాట్లాడు
ఉరికిరా : పరిగెత్తుకుని రా
మాలెసా : బాగా
మడిగెలు : షెట్టర్లు
నూకు : వుడ్చుడు
ఉబ్బర : ఉక్కపోత
యాడికి : ఎక్కడికి
కుకొ : కూర్చుండు
జర ఆగు : కొద్దిగుండు
కంకలు : ఎడ్లు
మొగులు : ఆకాశం
నెత్తి : తల
ఇకమతు : ఉపాయం
మలగడం : తిరగడం
దబ్బన : తొందర
మారాజ్ : పూజారి
లడిక : గరాటు
శారాన : పావుల
బారాన : మూడు పావులాలు
కుర్స : పొట్టి
మోటు : గడుసు
గోసి : పంచ
బాపు : తండ్రి
కాక : బాబాయి
పెదబాపు : పెద్ద నాన్న
పెద్దాయి : పెద్దమ్మ
యారాలు : తోటి కోడలు
సడ్డకుడు : తోడల్లుడు
సాలెగాడు : బావమర్ది
తమ్మి : తమ్ముడు
దన్ననరా : త్వరగా రా
జల్దిరా : జెప్పున రా
ఊకో : ఆగు
సోపాల : ఒడి
ఓమాడి : పొదుపు
పురాత : పూర్తిగా
పైలంగరా : మెల్లగ రా
ఆడికేంచి : అక్కడి నుండి
లగు : బలుపు
పరేషాన్ : అలసట
ఇమ్మతి : సాయం
ఇమాకత్ : గర్వం
జాతర : తీర్ధం
పనుగడి : కొష్టం దరువాజ
సిడీలు : మెట్లు
తట్టి : పళ్ళెం
ఊరబిస్క : ఊరపిచ్చుక
ఆవలికి : బయటకు
పాయిరం : పావురం
ఆయేటిబూనంగ : తొలకరి
సడుగు : రోడ్డు
దొరింపు : మార్గం
కుందాపన : దిగులు
పిడుస : ముద్ద
దుబ్బ : మట్టి
చెండు : బంతి
బగ్గ : బాగా
బొచ్చెడు : చాలా
యాపాకులు: వేపాకులు
గాయిదోడు : ఆవారా
నడిమిట్ల : మధ్యన
సూరు : చూరు
పయ్య : చక్రం
ఒంటేలు : మూత్రం
రాతెండి : అల్యూమినియం
బర్మా : రంధ్రాలు చేసే సాధనం
ఇగురం : ఉపాయం
దిడ్డి : కిటికీ
ఇల వరుస : పద్ధతి
బుట్టాలు : లోలాకులు
గరిమి : వేడి
కచ్చురం : ఎడ్ల బండి
పెనిమిటి : భర్త
అర్ర : గది
గలుమ : తలుపు
తల్వాలు : తలంబ్రాలు
పరాశికం : నవ్వులాట
మబ్బుల : వేకువ జామున
చిడిమెల : తొందరగా
- రొడ్డ రవీందర్, మంచిర్యాల
కాపాయం : పొదుపు
యవ్వారం : వ్యవహారం
కైకిలి : కూలి
అలిమిబలిమి: ఇష్టాయిష్టాలు
మనాది : బెంగ
ఎటమటం : బెడిసికొట్టు
మొగులు : ఆకాశం
రంది : దిగులు
సడుగు : తొవ్వ
బాలకాలి : పిల్ల చేష్టలు
అగ్వ : చౌక
గాడ్పు : గాలి
ఇంగలం : నిప్పు
మాల్‌గాడి : గూడ్సు బండి
ఎక్వ తక్వ : హెచ్చుతగ్గులు
గిర్వి : తాకట్టు
కొలువు : నౌకరు
పాలోళ్ళు : దాయాదులు
పొద్దుగూకి : సాయంత్రం
నెత్తి : తల
జంగుబట్టింది: తుప్పుబట్టింది
మొగురం : కట్టెస్తంభం
గావురం : ప్రేమ
ఒద్దులు : దినములు
గలుమ : ద్వారము
లగాంచి : జోరుగా
రికాం : తీరిక
సుంసాం : నిశ్శబ్దం
తట్టు : గోనె సంచి
గత్తర : కలరా
తొట్టె : ఊయల
ఇగం : అతి చల్లని
గవాబు : సాక్ష్యం
తాపతాపకు : మాటిమాటికి
పైకం : డబ్బులు
తపుకు : మూత గిన్నె
బుగులు : భయం
సుతారం : సున్నితం
తోలుట : నడుపుట
కోల్యాగ : ఆవుదూడ
సొక్కంపూస: నీతిమంతుడు
బుదగరించుట: బుజ్జగించుట
బరివాత : నగ్నంగ
కోసులు : మైళ్ళు
తనాబ్బి : కప్ బోర్డు
వరపూజ : నిశ్చితార్థం
రయికె : జాకెట్టు
తనాబి : షెల్ఫ్
తంతెలు : మెట్లు
ఆనక్కాయ : సొరకాయ
కలెగూర : తోటకూర
తొక్కు : ఊరగాయ
బుక్కెడు : ఒక ముద్ద
గంటే : గరిటే
గరిమికోటు : రెయిన్ కోటు
గంజు : వంట పాత్ర
రంజన్ : కూజ
నూతి : బావి
గడెంచే : నులకమంచం
అవతల : ఆరు బయట
గొడిసేపు : కాసేపు
నిరుడు యేడు: గత సంవత్సరం
కల్ప : మంగలి పెట్టే
టొక్క : పారిపోవడం
పత్తి : పాళీ
కందిలి : చిన్న దీపం
సోల్తి : జాడ
పొంతన : పోలిక
మోపున : జాగ్రత్తగ
పోగులు : కుప్పలు
ఎటమటం : పొరపాటు
సర్సుట : కొట్టుట
కాన్గి బడి : ప్రైవేటు బడి
లగ్గం : పెళ్ళి
మర్లబడుట : తిరగబడుట
తాషిలి : కీడు
కాంచి : సీటుపై కూర్చోకుండ సైకిల్ తొక్కుట
దడ్లబురి : మగ కోతి
మొస : అధిక శ్వాస
డొక్క : కడుపు
అముడాల : కవల
ఆపతి పడుట: ప్రసవ వేదన
ఇగం : చల్లగ, హిమం
ఇడుపులు : ప్రవేశ ద్వార ప్రాంతం
ఇమానం : ప్రమాణం
ఎనుగు : ముండ్ల కంచె
ఏతులు : హెచ్చులు, గొప్పలు
బగరుకొట్టుట: వేగంగా శ్వాసించుట
కంచె : గడ్డి బీడు
కైలాట్కం : కలహం, కొట్లాట
జిట్టి : దృష్టి
జిమ్మ : జిహ్వ
తుత్తుర్లు : వెంట్రుకలు
దంచుట : దండించుట, కొట్టుట
దంగుట : తఱుగుట
నీయత్ : నిజాయితీ
పాసంగం : మొగ్గు
పురుసత్ : విశ్రాంతి
మిత్తి : వడ్డి
ఆయిటి : తొలకరి
ఇగురు : చిగురు
ఇగురం : వ్యూహం
ఇగ్గుట : సంకోచించుట
ఇచ్చంత్రం : విచిత్రం
ఒళ్ళక్కం : అబద్దం
కువారం : చెడ్డబుద్ధి
కైగట్టుట : కవిత్వం రాయుట
దసుకుట : కుంగుట
నక్కు : అతుకు
నాదాను : బలహీనం
నేఱివడుట : అలసిపోవుట
పతార : పరపతి
పుల్లసీలుట : అలసిపోవుట
బొండిగ : గొంతు
మాల్యం : దయ గలుగుట
మాయిల్యమే: వెంటనే, తొందరగ
మోర్‌దోపు : ప్రమాదకరమైన
తొవ్వ : బాట
మంకు : మొండితనం
నొసలు : నుదురు
దొబ్బు : నెట్టు
దీపంత : ప్రమిద
కాయిసు : ఇష్టం
యాల్ల : సమయం
రౌతు : రాయి
పసిరికెలు : కామెర్లు
పటువ : కుండ
ఉబ్బు : ఉత్సాహం
పెయ్యి : వొళ్ళు
యాష్ట : విసుగు
అంబటియాల : అంటి తాగే సమయం
ఆనగపు కాయ: సోరకాయ
ఇసుర్రాయి : విసురు రాయి
ఉలువచారు : ఉలువ కట్టు
ఎచ్చాలు : గరం మసాలా వస్తువులు
ఎసరు : అన్నం ఉడకడానికి పెట్టుకునే నీరు
ఒత్తి పొయ్యి : పొంత పొయ్యి
కడువ : నీరు తెచ్చుకునే మట్టి కుండ
గాబు : ధాన్యం నిల్వ ఉంచుకొనేందుకు మట్టితో చేసింది.
గుమ్మి : నిల్వ ఉంచుకొనేందుకు ఈత సువ్వలతో అల్లినది.
వత్తు : కట్టెల పొయ్యికి ఆనుకొని వుండే కుండ (వేడినీళ్ళకై ఉపయోగిస్తరు).
కురాడు : బియ్యాన్ని ఉడికించుటకు వాడే, కలి నీళ్ళను నిల్వవుంచే కుండ.
సాయబాన్ : దంపతుల పడకగది.
సానుపు : పొద్దున ఇంటిముందు పేడతో కలిపి చల్లే నీళ్ళు.
గిరుక : బావిలోని నీటిని తోడుటకు ఉపయోగపడేది.
కంచుడు : పులుపు కూరలను వండుటకు వాడే మట్టి కుండ.
గోరు కొయ్యలు : రాత్రివేళ ఆకాశంలో వరుసగా వుండే మూడు నక్షత్రాలు.
ఇకమత్ : ఉపాయం
మిడుకుడు : ఈర్శ
గడ్డపార : మొగులు
శిర్రగోనె : గూటి బిల్ల
సాన్పి : కళ్ళాపి
పొద్మీకి : సాయంకాలం
బుగ్గ : బల్బు
పైలు : ఒకటో తేది
బేస్తారం : గురువారం
ఐతారం : ఆదివారం
బిరాన : తొందరగా
మలాస : ఎక్కువ
పైలం : జాగ్రత్త
ఏంటికి : ఎందుకు
గులగుల : చెక్కిలిగింతలు
అంగి : చొక్కా
నడ్మ : మధ్యలో
ఆల్చం : లేటు
అసంతకు : పక్కకు
సైసు : ఆగు
అద్దాలు : కళ్ళజోడు
అట్లనా : అవునా
ఇల్టెపల్లుడు : ఇల్లరికపు అల్లుడు
తియ్యి : తీయు
శాతాడు : చేతాడు
పోతడు : వెళ్ళగలడు
అస్తడు : వస్తాడు
మొగురం : ఇంటిలో స్తంభం
ఆసం : పైకప్పు కర్ర
నడ్డి : నడుము
చెడ్డి : డ్రాయరు
ఎడ్డి : తెల్విలేని తనం
దుడ్లు : పైసలు
అడ్లు : వరి ధాన్యం
మడి : భూమి గుంట
పుస్తె : తాళి
గుత్త : ఒక్క మొకాన
సగురం : కొప్పుకు జతపరిచేది
అందాద : సుమారు
ఆయిల్ల : క్రితం రాత్రి
కడ్డు : మొండి
నసీవ : అదృష్టం
ఎగిర్తం : తొందర
ఎచ్చిరికం : అతి
బరివాత : నగ్నం
అర్ర : స్టోర్ రూమ్
నిరుడు : క్రితం సంవత్సరం
సై చూడు : రుచి చూడు
ఇమానం : ఒట్టు
పైలం : జాగ్రత్త
పెయిసబ్బు : స్నానం సబ్బు
కుత్తెం : ఇరుకు
బల్లిపాతర : బూజు
బుక్కుట : తినుట
తుట్టి : నష్టం
ఓరకు పెట్టుట: దాచి పెట్టుట
తట్టి : పళ్లెం
మత్తి : పొగరు
ఎకసెక్కాలు : పరాష్కాలు
ఇకిలించుట : నవ్వుట
గలుమ : గడప
కాకిరి బీకిరి : గజిబిజి
బుజ్జగించి : లాలించి
ప్రభోజనం : ఫంక్షన్
గుత్పలు : పెద్ద కర్రలు
దుడ్లు : డబ్బులు
పజీత : సతాయించడం
మెడకొడం : వెంబడి తగలడం
లెంకుట : వెతుకుట
ఊకుట : ఊడ్వడం
లాగం : అలవాటు
ఉల్లెక్కాలు : పరిహాసం
బరివాతల : దిగంబరంగా
శవ్వా : చీచీ
లగ్గం : పెళ్ళి
పట్టగొల్సులు : కాళ్ళ వెండిపట్టీలు
కార్జం : మేక కాలెయం
సోల్‌పూత : వరుసగా
ఉల్లుల్లు : వదులుగా చేయుట
డల్లు : కొద్దిసేపు
లాలపోయుట: స్నానం పోయుట
సల్లు : నీరు కారుట
పాసంగం : బరువులో తేడా
గతుకులు : ఎగుడు దిగుడు
గడ్కోటి : గడియకోసారి
దస్కుట : కుంగిపోవుట
పొతం : చక్కగా అమర్చడం
సనుగు : ఒక వస్తువు
దొరింపు : సమకూర్చుట
సుమీ : హెచ్చరిక చేయడం
నివద్దే : నిజమే
కీస్ పిట్ట : విజిల్
పీక : బూర
చెండు : బంతి
పుడా : ప్యాకెట్
రికాం : తీరిక
సలువలు : చెమటలు
మాడ : తలపై భాగం
ఒంటేలు : మూత్రం
గొట్టు : కఠినమైన
బర్ర : గాయపు మచ్చ
పులగండు : తిండిబోతు
అగడు : అత్యాశ
మార్వానం : రెండో పెళ్ళి
చిలుము : తుప్పు
పుర్సత్ : నిమ్మలం
పిసరు : చిన్నముక్క
పిడాత : అకస్మాత్తుగా
తెరువకు : జోలికి
యాట : గొర్రె/మేక
మొగురం : కర్ర స్తంభం
ఇసురుగ : గొప్పగా
సిన్నగా : మెల్లగా
రంది : బాధ
పసిది : చిన్నది
బోళ్ళు : గిన్నెలు
ఇడుపు : విడాకులు
కారటు : ఉత్తరం
పొద్దుగాల : వేకువ జామున
అగ్గువ : చౌక
బయాన : అడ్వాన్సు
మడిగె : దుకాణం
బీమారి : రోగం
సోల : కిలో
సంత : అంగడి
ఇనాం : బహుమతి
తలె : పళ్ళెం
పత్తాలాట : పేకాట
ముచ్చెట్లు : మాటలు
అక్కెర : అవసరం
ఏశాలు : నాటకాలు
కట్టె సర్సుడు : బిగుసుకుపోవడం
కమిలింది : కందిపోయింది
గద్దరించు : గట్టిగా అరుచు
గట్లనే : అట్లాగే
గతిమెల్ల : దిక్కులేని
గత్తర : కలరా
గర్క : గరిక
గాయింత పని : మిగిలిన పని
గంతే : అంతే
గుత్తేదారు : కాంట్రాక్టరు
గుత్ప : దుడ్డుకర్ర
గొర్రెంక : గోరువంక
గోలం : నీళ్ల తొట్టి
తిత్తి : తోలు సంచి
తువాల : తుండు గుడ్డ
తత్తర : తడబడు
తుంట : దుంగ
తొంట చెయ్యి : ఎడమ చెయ్యి
తోలుడు : నడపడం
తోల్కపోవు : తీసుకెళ్లుుంట : దుంగ
తొంట చెయ్యి : ఎడమ చెయ్యి
తోలుడు : నడపడం
తోల్కపోవు : తీసుకెళ్లు

Tuesday, January 17, 2017

భాషా చమత్కారాలు

 భాషా చమత్కారాలు


*మహాకవి శ్రీశ్రీ మద్రాసులో ఓ చిన్న హోటల్ కెళ్ళాడు. "టిఫినేముంది?" అనడిగాడు. "దోసై" అన్నాడు హోటల్ వాడు. "సరే వేసై" అన్నాడు శ్రీశ్రీ.

మరోసారి వైజాగ్ లో ఓ హోటల్ కి వెళ్లి టిఫినేముంది ఆని అడిగాడు. "అట్లు" తప్ప మరేం లేవు సర్ అన్నాడు వాడు. "సరే అట్లే కానీ" అన్నాడు శ్రీశ్రీ.

ఇంకోసారి ఓ మిత్రుడు ఊరెళ్తూంటే వీడ్కోలివ్వటానికి మద్రాస్ సెంట్రల్ స్టేషన్ కెళ్ళాడు. ప్లాట్ ఫాం పై ఓ పరిచయస్తుడు కనిపించి "ఊరికేనా?" అనడిగాడు. "లేదు ఊరికే" అని బదులిచ్చాడు శ్రీశ్రీ.

ఒక ఊరిలో ఒక చోట ఒక బోర్డ్ పై "ఇక్కడ వేడి తేనీరు దొరుకును" అని వ్రాసి ఉండటంతో "అరే ! ఇక్కడ వేడితే కాని నీరు దొరకదా?" అనడిగాడు.

ఓ ఇంటి ముందు "కుక్కలున్నవి జాగ్రత్త" అనే బోర్డ్ చూసి, ఆశ్చర్యం నటిస్తూ "అరే ఇంతకుముందిక్కడ మనుషులుండే వారే" అనన్నాడు.

ఓ కుర్రాడు ఒక పద్యం వల్లె వేస్తున్నాడు "ఎవడు రాత్రి లోకకంఠకుడు,"అని వల్లె వేయటం విని "ఒరే ! మొద్దబ్బాయ్ ! అలాకాదురా ! అది 'ఎవడురా త్రిలోక కంఠకుడు" అని సరి చేశాడు.                      

శ్రీ గరికపాటివారి చమత్కారాలు!!

ప్రశ్న:
ఉదయం లేవగానే
మహిళలు..మంగళసూత్రాలు 
కళ్ళకద్దుకుంటారు.దేనికి?
జవాబు:
వాటిమీదున్న గౌరవంతో మాత్రం కాదు!
భర్త మంగళసూత్రాలు ఉంచాడా,
అర్ధరాత్రివేళ ఏ అవసరానికో లాగేశాడా
అన్న అనుమానంతో చూసి,
ఆ పూటకు దక్కాయన్న సంతోషంతో కళ్ళకద్దుకుంటారు!


ప్రశ్న:
పెళ్ళిలో పెళ్ళికూతురు గౌరీపూజ చేస్తుంది కదా! మరి పెళ్ళికొడుకు ఏ పూజ చేస్తాడు?
జవాబు:
 'డౌరీ' పూజ!!

ప్రశ్న:
ఆడవాళ్ళు అవధానం చెబితే?
జవాబు :
ఏముంది.! 'గ్రామర్' తగ్గి 'గ్లామర్' పెరుగుతుంది!!

ప్రశ్న :
మన టీవీ యాంకర్లకి ఒత్తులు పలకడం సరిగా రావడం లేదు! ఏం చేయాలి?
జవాబు:
లక్ష 'ఒత్తుల' నోము చేయిస్తే సరి!

Wednesday, December 7, 2016

మన తెనుగు (తేనె+అగు) లేదా తెలుగు (తేనె+అలుగు) భాష వయస్సు దాదాపు 2000 సంవత్సరముల పైమాటే.

 మన తెనుగు (తేనె+అగు) లేదా తెలుగు (తేనె+అలుగు) భాష వయస్సు దాదాపు 2000 సంవత్సరముల పైమాటే.11 వ శతాబ్దంలో నన్నయ తెలుగు వ్యాకరణం సమకూర్చి, సంస్కృతంలో వ్యాసుడు వ్రాసిన మహాభారతాన్ని, తెలుగు భాషలోకి అనువదించాడు. మహాభారతం మన మొదటి సాహిత్య పద్య గద్య ఇతిహాసం.


తెలుగు అజంత భాష. ప్రతి పదం అచ్చుతోనే ముగిసి పదానికి అందం తెస్తుంది. తేనె కన్నా తీయనిది తెనుగు భాష. తెలుగు భాష గొప్పదనమంతా అక్షరాల అల్లికలోనే వుంది. ఇంటి ముందు చక్కని ముగ్గును చూసినంత ఆనందం కలుగుతుంది.

మొదట్లో 16 అచ్చులు, 3 విశేష అచ్చులు, 41 హల్లులు కలిపి 60 అక్షరాలుండేవి. కాలక్రమేణా, కొన్ని అక్షరాల వాడకం తగ్గి 56, 54, 52 గా పరిణమించాయి. ఇప్పుడు  12 అచ్చులు, 31 హల్లులు, నకార పొల్లు, నిండు సున్న, వెరసి 45 అక్షరాలను మాత్రం వాడుతున్నాము. అరసున్న, విసర్గం వాడకం చాలా వరకు తగ్గిపోయింది.

మన దేహానికంతా వ్యాయామ సౌకర్యం వుంది. ముఖానికి మాత్రం లేదు. తెలుగు అచ్చులు (అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఋ, ౠ, ఎ, ఏ, ఐ, ఒ, ఓ, ఔ, అం, అః) పలికే టప్పుడు, ముఖకదలికతో ముఖానికి మంచి వ్యాయామం చేకూరుతుంది. అలాగే హల్లుల వల్ల ముఖం అన్ని భాగాలకు, ఈ క్రింది విధంగా వ్యాయామం కలుగుతుంది.

                     క ఖ గ ఘ ఙ ......................... కంఠ భాగము
                     చ ఛ జ ఝ ఞ ......................నాలుక మొదటి భాగము
                     ట ఠ డ ఢ ణ ..........................నాలుక మధ్య భాగము
                     త థ ద ధ న ..........................నాలుక కొన భాగము
                     ప ఫ బ భ మ .........................పెదవులకు
                    య ర ల వ శ ష స హ ళ క్ష ఱ ..పూర్తి నోరు భాగమంతా

అయితే, ఇప్పుడు నేను, నా వాళ్లయిన అందరు తెలుగు ప్రజలు, బంధువులు, స్నేహితుల కోసం, నా చిన్నతనంలో నేర్చుకున్న 52 అక్షరాలను 'అ నుంచి ఱ' వఱకు ఆయా అక్షరాలతో ప్రారంభమయ్యే చిన్న వాక్యాలతో చిన్న పిల్లల చేష్టలను వర్ణిస్తూ, ఒక సరదా సంఘటనను సృష్టించుకొని, ఒక చిన్న కథగా చెప్పి, సంతోషపఱుస్తాను.

        (అ)మ్మ చేతి గోరుముద్దలు తినిన పిల్లలు
        (ఆ)నందంగా పాఠశాలకు వెళ్లబోతూ,
        (ఇ)ళ్లలోంచి బయట పడుతూనే
        (ఈ)లల గోలల మోతలతో,
        (ఉ)రుకులు పరుగులతో హడావుడిగా వెళ్లి, బడిలో
        (ఊ)యల, ఉడతల కథలు హాయిగా వింటారు.
        (ఋ)ణ, సంబంధ ఇక్కట్లు తెలియక
        (ౠ) అని తమాషాగా దీర్ఘం తీసుకుంటూ,
        (ఎ)ఱుపు, నలుపు, పసుపు,తెలుపు రంగులు కల
        (ఏ)డు రంగులు కలబోసిన సీతాకోకచిలుకల్లాగా,
        (ఐ)దారుగురు ఆడ,మగ స్నేహితులు కలిసి సరదాగా
        (ఒ)ప్పుల కుప్ప ఒయ్యారి భామా ఆటాడుకుంటూ,
        (ఓ)డల ఒంటెల కథలు ఒకరికొకరు చెప్పుకుంటూ,
        (ఔ)రా నువ్వెంత? నేనే బాగా చెప్పానని విఱ్ఱవీగుతూ, ఇలా
        (అం)దరూ ఎంతగానో సంతోషిస్తూ, ఆనందంగా
        (అః) అః అహహహా అంటూ ముద్దులొలికే నవ్వులతో ఇంటికి వచ్చేస్తారు.

        (క)డుపాత్రం ఎఱిగిన తల్లి అయ్యోపాపమంటూ, అతి ప్రేమగా
        (ఖ)ర్జూరపు పండ్లు నోటిలో దట్టించి పెట్టగా,
        (గ)బ గబా తినేసిన బుజ్జాయిలు, అలా తినిన
        (ఘ)నాహారం జీర్ణమయ్యే వఱకు ఆడుకుంటూ, ఆటల పాటలను
        (జ్ఞ)ప్తికి తెచ్చుకొని, నెమరేసుకుంటూ ఇంటికొచ్చి, తిని, నిద్దరోతారు.

మళ్లీ మరుసటి రోజు యథాప్రకారంగా, అమ్మ పిలుపుతో లేచి,........

        (చ)క చకా తయారై, పాఠశాలకు వెళ్లిపోయి, ప్రార్థన తర్వాత
        (ఛ)లో అనుకుంటూ తరగతుల్లోకి చేరుకోని,
        (జ)తలు జతలుగా పిల్లలంతా కలసికట్టుగా వెళ్లి
        (ఝ)మ్మని ఎవరి సీట్లలో వాళ్లు సర్దుకొంటుండగా, మాస్టారొచ్చి
        (ఞ) అక్షరాన్ని వ్రాయమంటే, రాక, బిక్కమొహం వేస్తారు.

        (ట)క్కుటమారు విద్యలనారితేరిన, టక్కరి తుంటరి పిల్లలు
        (ఠ)పీ, ఠపీమని బల్లలపై శబ్దాలు చేస్తుంటే,
        (డ)ప్పుల మోతల్ని మించిన శబ్దాలను విన్న మాస్టారు
        (ఢ)క్కాలు బద్దలు కొట్టినట్లుగా ఎవర్రా అది, అని అరుస్తూండగానే,
        (ణ)ణణణణణ ణ, ణ, ణ అని ఇంటి గంట మోగిన క్షణంలోనే...

        (త)లుపులు తోసేసుకుంటూ,
        (థ)పా థపా మనే శబ్దాలు చేసుకుంటూ,
        (ద)బ్బు దబ్బున తరగతిలోని పిల్లలందరూ
        (ధ)న ధనామంటూ కాళ్ల నడకల శబ్దాల ప్రతిధ్వనులతో
        (న)లువైపులా పరికిస్తూ, గుడి లాంటి బడి గడప దాటిన పిల్లలు,

        (ప)రుగు పరుగున కొందరు,
        (ఫ)స్టు నేనంటే నేనని పోటీపడుతూ ఇంకొందరు,
        (బ)యటకు పూర్తిగా వచ్చేసి,
        (భ)లే భలే, ఎవరు ఇళ్లకు ముందుగా చెరుతారని పందెంతో కొందరు,
        (మ)న స్కూలు, 'చాలా మంచి స్కూలబ్బా' అని, ఇంకొందరు,

        (య)థాలాపంగా, ఏ హావభావాలూ లేకుండా కొందరు,
        (ర)య్ రయ్ మంటూ పిచ్చి శబ్దాలతో ఇంకొందరు,
        (ల)గెత్తుకొని, తోటి పిల్లలను తోసేసుకుంటూ,
        (వ)చ్చి పోయే వ్యక్తులను ఓర కంటితో చూస్తూ, దారిపై వచ్చిపోయే
        (శ)కటములను తమాషాగా తప్పించుకుంటూంటే,
        (ష)రా మామూలే, 'వీళ్లెప్పుడూ మారర్రా' అని కొందరనుకుంటుండగా,
        (స)రదాగా అల్లరి చేసుకుంటూ, ఆనందంతో
        (హ)ర్షాతిరేకాలు మిన్ను ముట్టగా, గందరగో-
        (ళ) కోలాహల కలకలాతో రేపు ఆదివారం, సెలవు అనుకుంటూ
        (క్ష)ణాలలో వారి వారి ఇళ్లకంతా, మన కొ-
        (ఱ)కరాని కొయ్యలందరూ తల్లుల ఒడిలోకి చేరి తరిస్తారు.

ఇలా, తమాషాగా 'అఆ ఇఈ లతో, కఖ గఘ లతో' అందమైన ఒక సంఘటనను వర్ణించి చెప్పుకొని ఆనందించవచ్చు. ఇది చదివిన ఉత్సాహవంతులు, భాష మీది అభిమానంతో, తెలుగు భాష మీది పట్టుతో, అచ్చులతో హల్లులతో ఇంకా ఎన్నెన్నో అర్థవంతమైన, అందమైన కథలను, సంఘటనలను సృష్టించుకొని, వారి ప్రతిభకు సాన పెట్టవచ్చు. అలాగే, మీ మీ పిల్లలకు ఇలా వ్రాయలని మార్గ దర్శకులు కావచ్చు.

అతి సుందరమైన, సుమధురమైన, సౌమ్యమైన, కమ్మదనం కలబోసిన, తేట తేట తెలుగును, మృదుత్వంతో కూడిన తెలుగునే మాట్లాడండి. తెలుగులోనే వ్రాయండి. తెలుగు పుస్తకాలు చదవండి, చదివించండి. తేనె లొలుకు తెలుగు తియ్యందనాన్ని తనివితీరా జుఱ్ఱుకొని, మనస్పూర్తిగా ఆస్వాదించండి, ఆస్వాదింపజేయండి.

చదివినందులకు ధన్యవాదములు.

Sunday, October 16, 2016

మీరు పుట్టిన తెలుగు సంవత్సరం ఏమిటో మీకు తెలుసా?

మీరు పుట్టిన తెలుగు సంవత్సరం ఏమిటో మీకు తెలుసా?


మీరు ఏ సంవ‌త్స‌రంలో పుట్టారు... అంటే ఠ‌క్కున చెప్పేస్తారు. కానీ, ఏ తెలుగు సంవ‌త్స‌రంలో పుట్టారు అంటే చెప్ప‌లేం. అందుకే మీ కోసం ఆ తెలుగు వ‌త్స‌రాలు ఇస్తున్నాం. మీరు ఏ తెలుగు సంవ‌త్స‌రంలో పుట్టారో తెలుసుకోండి.

( 1867, 1927,1987,) ప్రభవ
(1868,1928,1988) విభవ
(1869,1929,1989) శుక్ల
(1870,1930,1990)ప్రమోదూత
(1871,1931,1991)ప్రజోత్పత్తి
(1872,1932,1992)అంగీరస
(1873,1933,1993)శ్రీముఖ
(1874,1934,1994)భావ
(1875,1935,1995)యువ
(1876,1936,1996)ధాత
(1877,1937,1997) ఈశ్వర
(1878,1938,1998)బహుధాన్య
(1879,1939,1999)ప్రమాది
(1880,1940,2000)విక్రమ
(1881,1941,2001)వృష
(1882,1942,2002)చిత్రభాను
(1883,1943,2003)స్వభాను
(1884,1944,2004)తారణ
(1885,1945,2005)పార్థివ
(1886,1946,2006)వ్యయ
(1887,1947,2007)సర్వజిత్
(1888,1948,2008)సర్వదారి
(1889,1949,2009)విరోది
(1890,1950,2010)వికృతి
(1891,1951,2011)ఖర
(1892,1952,2012)...నందన
(1893,1953,2013)...విజయ
(1894,1954,2014)...జయ
(1895,1955,2015)...మన్మద
(1896,1956,2016)...దుర్ముఖి
(1897,1957,2017)...హేవిళంబి
(1898,1958,2018)...విళంబి
(1899,1959,2019)...వికారి
(1900,1960,2020)...శార్వరి
(1901,1961,2021)...ప్లవ
(1902,1962,2022)...శుభకృత్
(1903,1963,2023)...శోభకృత్
(1904,1964,2024)...క్రోది
(1905,1965,2025)...విశ్వావసు
(1906,1966,2026)...పరాభవ
(1907,1967,2027)...ప్లవంగ
(1908,1968,2028)...కీలక
(1909,1969,2029)...సౌమ్య
(1910,1970,2030)...సాదారణ
(1911,1971,2031)...విరోదికృత్
(1912,1972,2032)...పరీదావి
(1913,1973,2033)...ప్రమాది
(1914,1974,2034)...ఆనంద
(1915,1975,2035)...రాక్షస
(1916,1976,2036)...నల
(1917,1977,2037)...పింగళ
(1918,1978,2038)...కాళయుక్తి
(1919,1979,2039)...సిద్దార్థి
(1920,1980,2040)...రౌద్రి
(1921,1981,2041)...దుర్మతి
(1922,1982,2042)...దుందుభి
(1923,1983,2043)...రుదిరోద్గారి
(1924,1984,2044)...రక్తాక్షి
(1925,1985,2045)...క్రోదన
(1926,1986,2046)...అక్షయ

Friday, June 10, 2016

alphabets in telugu and its uses

అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అ: ఇలా అచ్చులను పలకడం వలన ముఖమంతా కదులుతూ వ్యాయామం జరుగుతుంది.
తేట తేట తెనుగులా....
మన తెలుగు భాష గొప్పదనం ముందుగా అక్షరమాల అల్లికలోనే ఉంది.
పూర్వం గురువులు పిల్లలతో వర్ణమాలను వల్లె వేయించేవారు. అలా కంఠస్ధం చేయించడంవల్ల కంఠం నుంచి ముఖం వరకు వ్యాయామం తెలియకుండానే జరుగుతుంది
ఏలాఅంటే
=======
అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అ:
ఇలా అచ్చులను పలకడం వలన ముఖమంతా కదులుతూ వ్యాయామం జరుగుతుంది.
క ఖ గ ఘ ఙ……..కంఠ భాగం
చ ఛ జ ఝ ఞ……..కంఠంపైన నాలుక మొదటి భాగం
ట ఠ డ ఢ ణ……నాలుక మధ్యభాగం
త థ ద ధ న……నాలుక కొస భాగం
ప ఫ బ భ మ……..పెదవులకు
య ర ల వ శ ష స హ ళ క్ష ఱ……నోరంతా
ఇలా ముఖమంతా హల్లులతో వ్యాయామం జరుగుతుంది.
సుందర సుమధుర సౌమ్యమైన కమ్మని మృదుత్వంతో కూడిన తియ్యని తేనేలాంటిది మన భాష. ఆనందంగా మనసుకు హాయి గొలిపే విధంగా వినసొంపైన మాటలు మనందరి నోటంట వెలువడుతే ఎంత బాగుంటుంది.
తెలుగు భాషను అందంగా వ్రాసే వారికి చిత్రకళ సొంతమవుతుందంట ఎందుకంటే మన వర్ణమాలతో అన్ని మెలికలు ఉన్నాయి.
మనలోని భావాన్ని మాతృభాషలో వర్ణించినంత వివరంగా ఏ భాషలోను వ్రాయలేరు. తెలుగువారింటి ముంగిట ముగ్గును చూస్తే ఎంత ఆహ్లదభరితంగా చూడముచ్చటగా ఉంటుందో తెలుగువారి మనస్సు అంత అందంగా ఉంటుంది.
తెలుగులో మాట్లాడండి. .
తెలుగులో వ్రాయండి. . .
తెలుగు పుస్తకాలు చదవండి..చదివించండి..
తేనెలొలికే తెలుగు భాష తియ్యదనం ఆస్వాదించండి

Monday, May 9, 2016

Numbers in Telugu language

Do you know the numbers in telugu?

“” క్రింది తెలుగు సంఖ్యలు అన్నీ మీకు తెలుసా?””
సంఖ్యామానం:    
ఒకటి =1
పది =10                                   
వంద =100
వెయ్యి =1000
పదివేలు =10000.             
లక్ష =100000
పదిలక్షలు =1000000
కోటి =10000000
పది కోట్లు= 100000000
శతకోటి         =1000000000
సహస్త్ర కోటి       =10000000000  
అనంతకోటి       =100000000000
న్యార్భుద్ధం             =1000000000000
ఖర్వం                     =10000000000000
మహాఖర్వం             =100000000000000
పద్మం                      =1000000000000000
మహాపద్మం              =10000000000000000
క్షోణి                         =100000000000000000
మహాక్షోణి                 =1000000000000000000
శంఖం                      =10000000000000000000
మహాశంఖం              =100000000000000000000
క్షితి                         =1000000000000000000000
మహాక్షితి                 =10000000000000000000000
క్షోబం                       =100000000000000000000000
మహా క్షోబం              =1000000000000000000000000
నిధి                         =10000000000000000000000000
మహానిధి                 =100000000000000000000000000
పరాటం                    =1000000000000000000000000000
పరార్థం                    =10000000000000000000000000000
అనంతం                  =100000000000000000000000000000
సాగరం                   =1000000000000000000000000000000
అవ్యయం                =10000000000000000000000000000000
అమృతం                 =100000000000000000000000000000000
అచింత్యం                =1000000000000000000000000000000000
అమేయం                =10000000000000000000000000000000000
భూరి                       =100000000000000000000000000000000000
మహాభూరి               =1000000000000000000000000000000000000
.