Pages

Wednesday, November 22, 2017

సైంటిస్టులకు కూడా కనిపించిన దేవుడు - *మిస్టరీ* !

సైంటిస్టులకు  కూడా కనిపించిన దేవుడు -  *మిస్టరీ* !


ఇండియా అంటేనే మిస్టరీలకు పెట్టింది పేరు. భారతదేశంలో ఎక్కడ చూసినా దేవాలయాలు దర్శనమిస్తూనే వుంటాయి. అయితే వీటిలో కొన్ని మిస్టరీతో మిళితమై ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.అలాంటి మిస్టరీస్ ఇప్పటివరకూ వీడనే లేదు. మీలో అంతులేనిమన దేశంలో ఎన్నెన్నో మిస్టరీ దేవాలయాలు వున్నాయి. ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క ప్రత్యేకత కలిగివుంది. ఆలోచనాతరంగాలను రేకెత్తించే పుణ్యక్షేత్రాలు, వాటి విశేషాలు, వాటి మిస్టరీలు మీ కోసం.


తెప్పేరుమనల్లూర్;-

తమిళనాడులోని తెప్పేరుమనల్లూర్ శివాలయంలో చాలా ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఈ ఆలయంలో ఒక నాగుపాము స్వయంగా శివుడికి పూజ చేసి అందర్నీ ఆశ్చర్యపోయేలా చేసింది. 2010లో ఒక రోజు ఉదయం ఆలయపూజారి ఆలయానికి వచ్చి ద్వారాలు తెరిచే సమయానికి ఒక పాము శివలింగంపై వుండటం అతను ఆ తర్వాత ఆ పాము అక్కడ్నుంచి బిల్వాపత్రాలు సేకరించి ఆ తర్వాత శివలింగం దగ్గరకు చేరుకొని నోటిద్వారా ఆ బిల్వ పత్రాలను శివుడికి పూజ చేసింది. ఆ పాము అలా ఎందుకు చేసింది? ఆ పాముని ఆ శివుడే పంపించివుంటాడని ఇప్పటికీ భక్తుల నమ్మకం.కానీ ఈ మిస్టరీ మాత్రం ఇంతవరకూ వీడనేలేదు.


శని శింగనాపూర్

ఇది ఒక గ్రామం. మహారాష్ట్రలో వుంది. ఈ వూరిలోని ఏ ఒక్క ఇంటికి కూడా తలుపులుండవు. అయితే ఇక్కడ దొంగతనాలు జరిగిన సంఘటన ఒకటి కూడా లేవు.ఒకవేళ దొంగ తనం చేస్తే అక్కడ వుండే శనిదేవుడు శనిరూపంలో శిక్షిస్తాడని భక్తులనమ్మకం. మరో విశేషం ఏంటంటే డబ్బులు దాచిపెట్టే బ్యాంకులకు కూడా ఇక్కడ వారు తాళాలు వేయరు.అంత పవర్ ఆ శనిసింగనాపూర్ శనిదేవుడిది.


గురుద్వార్

గురుద్వార్ పంజాబ్ లోని మొహాలీలో వుంది.ఈ గురుద్వార్ లో ఆశ్చర్యం కలిగించే ఒక విషయం దాగి వుంది. ఇక్కడ ఒక మామిడి చెట్టు వుంది.సాధారణంగా మామిడికాయలు ఎండాకాలంలోనే కాస్తాయి. కాని ఇక్కడున్న మామిడిచెట్టుకి కాలాలతో సంబంధం లేదు. సీజన్ లతో సంబంధం లేకుండా ప్రతీరోజూ కాస్తూనే వుంటాయి. ఆ మామిడిచెట్టుకి ఎందుకు అలా కాయలు కాస్తున్నాయనేది ఎవరికీ అర్ధం గాని ప్రశ్న.


యాగంటి

యాగంటి ఆలయం ఆంధ్రప్రదేశ్ లో ప్రసిద్ధిచెందిన క్షేత్రం. ఇక్కడ వున్న నంది విగ్రహం మిస్టరీ ఇప్పటివరకూ వీడనేలేదు. మొదట్లో చిన్నగా వున్న నంది విగ్రహం రానురాను పెరుగుతూవచ్చి ఆలయప్రాంగణాన్ని ఆక్రమించుకుందని స్థానికులు చెబుతూవుంటారు.


యాగంటి

దీనికి సైంటిస్టులు చెప్పేమాటేమిటంటే ఆరాయి పెరిగే స్వభావగుణాన్ని కలిగివుందని అందుకే ప్రతి 20ఏళ్ళకు ఒక ఇంచు చొప్పున పెరుగుతూవుంటుందని అంటూవుంటారు. అయితే భక్తులనమ్మకం మాత్రం అది కాదు.యుగాంతంలో ఆ నంది పైకిలేచి రంకె వేస్తుందని అందరి భక్తులూ నమ్ముతూవుంటారు.


ఆంధ్ర ప్రదేశ్ లో వున్న మరో మిస్టరీ లేపాక్షి

లేపాక్షీ అనంతపురం జిల్లాలో వుంది. ఇక్కడ వున్న స్థంభాలు చాలా మిస్టరీగా మిగిలిపోయాయి. ఈ ఆలయాన్ని 16వ శతాబ్దంలో నిర్మించారు. ఈ స్థంభం క్రింద పేపర్ కానీ, క్లాత్ కానీ ఈజీగా పట్టించేయోచ్చు.


ఆంధ్ర ప్రదేశ్ లో వున్న మరో మిస్టరీ లేపాక్షి

అంటే స్థంభానికి కింద ఫ్లోర్ గ్యాప్ ఉంటుందన్నమాట. స్థంభం క్రింద ఫ్లోర్ ఏ సపోర్ట్ లేకుండా ఆలయాన్ని మోస్తుందని అర్థం. స్థంభం గ్రౌండ్ ని తాకకుండా ఆలయాన్ని ఎలా మోస్తుందో, ఇంతవరకు ఎవ్వరూ చెప్పలేకపోయారు.


దార్వేష్ దర్గా, పూణే

ఇది పూణే లో వుంది.90కేజీల రాయి పూణేలోని చిన్న దర్గాలో ప్రత్యేకఆకర్షణ. ఇక్కడ కరెక్ట్ గా 11మంది కలిసి ఒక రాయిని కేవలం 1 వేలితో పైకి లేపాలి.రాయిని ముట్టుకున్న వెంటనే హజరత్ కమార్ అలీదర్వేష్ అని పలుకుతూ రాయిని పైకెత్తాలి.

దార్వేష్ దర్గా, పూణే

ఇలా చేసిన వెంటనే ఆ రాయి 10 నుంచి 10అడుగుల ఎత్తులోకి వెళ్లి అలా గాల్లో తేలుతూనే వుంటుంది.ఇది ఎలా జరుగుతుందో కూడా ఇంతవరకూ ఎవరికీ అంతుచిక్క లేదు.


మరో మిస్టరీ తంజావూరులో వుంది

తంజావూరులోని బృహదీశ్వరాలయం ఇప్పటికి ఒక మిస్టరీగానే వుంది. దీనిని రాజరాజచోళుడు 11 వ శతాబ్దంలో నిర్మించాడు.ఈ ఆలయంలో రహస్యం దాగి వుంది. ఈ ఆలయంలో దాగిన రహస్యం నీడ. ఈ ఆలయంలోని నీడ. ఈ ఆలయం నీడలు ఎవరికి కనిపించవు.


మరో మిస్టరీ తంజావూరులో వుంది

సంవత్సరం పొడుగునా ఏ రోజు చూసినా సాయంత్రంవేళ ఆ దేవాలయం నీడలు భూమిమీద పడక పోవడంతో ఇది ఎవరికీ అంతుచిక్కని రహస్యంగా మిగిలిపోయింది. అలాగే ఆ ఆలయానికి ఉపయోగించిన గ్రానైట్ కూడా ఎక్కడనుండి తీసుకోచ్చారనేది కూడా తెలియదు. ఇలాగే మరొకటి కూడా వుంది.


పూరీజగన్నాథ్ ఆలయం

పూరీజగన్నాథ్ ఆలయంలో నీడ ఎలాంటి సమయంలో కూడా కనిపించదు. అంతేకాదు పూరీక్షేత్రానికి సమీపంలో బంగాళాఖాతం సముద్రం వుంది. ఆ సముద్రపు శబ్దంకూడా ఈ ఆలయంలోకి వినిపించదు. ఆలయ సింహద్వారం వరకూ సముద్రఘోష వినిపిస్తుంది.అది దాటి లోపలికి వెళ్తే శబ్దం అనేదే వుండదు.మరి ఆ టెక్నాలజీ ఏంటో కూడా అంతుచిక్కలేదు.


షోలాపూర్

మహారాష్ట్రలోని షోలాపూర్ మనం రోజూ వుపయోగించే బెడ్ షీట్ లకు పెట్టిందిపేరు. ఇక్కడ ఒక వింత గ్రామం వుంది. షెత్పల్ అనే గ్రామంలో పాములకు పూజ చేయటం ఆనవాయితీ. ఈ గ్రామంలో ప్రతిఇంట్లో పాములకు కూడా ఒక గదివుంటుంది.


షోలాపూర్

ప్రతి ఇంట్లో మనుష్యులు తిరిగినట్టే పాములు కూడా తిరుగుతూవుంటాయి.కాని ఇంతవరకూ ఆ గ్రామంలో ఏ పాము ఎవరినీ కరిచినట్టు కంప్లైంట్స్ కూడా లేవు. ఏమైనా పాము తిరుగుతుంది అంటేనే భయమేస్తుంది కదూ.


మరో మిస్టరీ కబీస్ బాబా ఆలయం

ఓ దేవుడు లేని ఆలయం.ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ జిల్లాలోని కబీస్ బాబా ఆలయం చాలా విచిత్రం.ఈ ఆలయంలో విగ్రహం వుండదు.పూజారి కూడా వుండడు. ఈ ఆలయం 150ఏళ్ల క్రితం నిర్మించారని అక్కడివారు చెపుతున్నారు.


మరో మిస్టరీ కబీస్ బాబా ఆలయం

అయితే అక్కడ ఓ శివభక్తుడు కబీస్ బాబా వుంటారు. ఆయన సాయంత్రం వేళ భక్తులు సమర్పించే మద్యంసేవించి భక్తుల అనారోగ్య సమస్యలను నయంచేస్తాడని ఇక్కడి వారు నమ్ముతూవుంటారు.


అమ్రోహా

ఉత్తరప్రదేశ్ లోని అమ్రోహా షర్ఫుద్దీన్ షావిలాయత్ కు ప్రసిద్ధిచెందింది. ఈ పుణ్యక్షేత్రం చుట్టూ కాపలాగా ఎవరుంటారో తెలుసా? తేళ్ళు. అవును.ఇక్కడ ఆలయంలోపల ఆలయం చుట్టూ తేళ్ళు తిరుగుతూనే వుంటాయి. ఒకటికాదు, రెండుకాదు వేలసంఖ్యలో.అయితే ఇవి అక్కడకు వచ్చే భక్తులను కుట్టవు. వారు వాటిని పట్టుకుంటారు కూడా. ఇలాంటి మరో ఆలయం ఆంధ్రప్రదేశ్ లో కూడా వుంది.


మిస్టరీమమ్మీ

మరో విచిత్రం అతి భయంకరం కూడా మన ఇండియాలో మిస్టరీగానే మిగిలిపోయింది. అదే ఓ మిస్టరీమమ్మీ. మమ్మీ అంటే గుర్తొచ్చేది ఈజిప్ట్.కాని హిమాచలప్రదేశ్ లో గ్యూఅనే గ్రామంలో 500ఏళ్ల ఒక మమ్మీ అందరికి షాక్ ఇస్తోంది. సంగాతెన్జింగ్ అనే టిబెట్ కు చెందిన ఒక బౌద్ధసన్యాసి మమ్మీ అక్కడ కూర్చొనివుంది.


మిస్టరీమమ్మీ

ఆ మమ్మీ 500ఏళ్ల నాటిది.అయితే అది చెక్కుచెదరని చర్మం,జుట్టుతో అలాగే వుంది.అయితే ఇదేమి విచిత్రం అనేది ఎవరికీతెలీదు. తెలుసుకున్నారుగా మన ఇండియాలో దాగున్న మిస్టరీలు.   శుభోదయం ...
   

Saturday, November 11, 2017

Scholarships for High School Students

Scholarships for High School Students     Scholarships for High School Students


.