Pages

Showing posts with label కథలు. Show all posts
Showing posts with label కథలు. Show all posts

Sunday, January 29, 2017

దయ్యాల సంచి

 దయ్యాల సంచి


ఒకానొకప్పుడు ధనికులైన భార్యాభర్తలు ఉండేవారు. వారికి జిన్‌హో అనే కొడుకు ఉండేవాడు. కొడుకును పెంచడానికి వాన్‌క్యూన్‌ అనే ఒక వృద్ధ సేవకుణ్ణి ని…యమించారు. అతడు పిల్లవాడికి రకరకాల కథలు చెప్పేవాడు. పిల్లవాడు కథల్ని చాలా ఇష్టంగా వినేవాడు. ఆతడు చెప్పే కథల్లో భయంకరమైన వింతజంతువులు, క్రూరమైన పులులు, దేవదూతలు, అందమైన యువరాణులు, వీరులు, కరుణాహృదయులైన రాజులు వచ్చేవారు.
వీరితో పాటు ప్రతి కథలోనూ ఒకద…య్యం తప్పకుండా వచ్చేది. ఆ కథలు జిన్‌హోకు చాలా బాగా నచ్చాయి. అందువల్ల వాటిని తను మాత్రమే వినాలని పట్టుబట్టాడు. అందువల్ల ఆ కథల్ని సేవకుడు ఇతరులకు చెప్పడానికి అనుమతించేవాడు కాదు. తను కూడా విన్న కథలను వేరెవ్వరికీ చెప్పేవాడుకాదు. అలా చేయడం వల్ల కథల్లోని ద…య్యాలను మరెక్కడికీ వెళ్ళనివ్వకుండా కట్టిపడవేయవచ్చునన్న ఆలోచన!

కథలు చెప్పే సేవకుడైన వాన్‌క్యూన్‌ దయ్యాలకని ప్రత్యేకంగా ఉచ్చుదారంతో ఒక తోలు సంచీని తయారు చేసి, దాన్ని జిన్‌హో పడక గదిలోని గోడకు తగిలించాడు. ప్రతిరాత్రి జిన్‌హో నిద్రపోయే ముందు సేవకుడు సంచీని ఒడిలో వుంచుకుని కథ చెప్పేవాడు. కథ ముగుస్తున్నప్పుడు సంచీ మూతిని తెరిచేవాడు. కథలోని దయ్యం అందులోకి వెళ్ళేది. అదే కథను మళ్ళీ ఎవరైనా చెబితే తప్ప ఆదయ్యం ఆ సంచీ నుంచి వెలుపలికి రాలేదు. వాన్‌క్యూన్‌ సంచీ మూతిని గట్టిగా బిగించి మళ్ళీ గోడకు తగిలించేవాడు.

ఇలా రోజులూ, వారాలూ, నెలలూ, సంవత్సరాలూ గడిచాయి. వాన్‌క్యూన్‌ ఒకసారి చెప్పిన కథను మళ్ళీ ఎప్పుడూ ఎవరికీ చెప్పలేదు. జిన్‌హో కూడా తను విన్న కథను మరెవ్వరికీ చెప్పలేదు. సంచీలో చేరిన దయ్యాలు వెలుపలికి వచ్చే మార్గం లేక తపించసాగాయి. కథలు చెప్పడంలో వాన్‌క్యూన్‌, వినడంలో జిన్‌హో నిమగ్నులై పోవడం వల్ల తోలు సంచీలో దయ్యాలు బాధతో పుట్టించే శబ్దాలను వినలేకపోయేవారు అంతలోనే జిన్‌హో పదిహేనేళ్ళవాడయ్యాడు.

అప్పటి ఆచారం ప్రకారం పెళ్ళీడు కొచ్చాడు. వాడి తల్లి దండ్రులు ఒక చక్కని అమ్మాయిని తమ కోడలుగా చేసుకోవాలనుకున్నారు. ధనిక వర్తకుడి కూతురైన ఆ అందమైన అమ్మాయి పేరు మిన్‌జీ. పెళ్ళిరోజు రానేవచ్చింది.
పెళ్ళి కొడుకు జిన్‌హో, అతని తండ్రి పెళ్ళికూతురు ఇంటికి బయలుదేరడానికి ఉదయమే సిద్ధమ య్యారు. రానున్న పెళ్ళికూతురికి ఆప్యాయంగా స్వాగతం పలకడానికి ఇంట్లోని పనివాళ్ళందరూ ఏర్పాట్లలో, హడావుడిగా ఉన్నారు. ముసలి సేవకుడు వాన్‌క్యూన్‌, ఇంట్లోని ఒక్కొక్క గదినీ పరిశీలించి చూస్తూ, ఏర్పాట్లను గమనించసాగాడు.

అలా వస్తూ, జిన్‌హో గదిలోకి తొంగిచూశాడు.  ఏవో గుసగుసలు వినిపించాయి. ఒక్క అడుగు వెనక్కు వేసి సద్దు చేయకుండా ఆలకించాడు. విభిన్న కంఠస్వరాలు వినిపించాయి. ఎవరూ లేని చోట ఇన్ని కంఠస్వరాలు ఎలా వచ్చాయా అన్న ఆశ్చర్యంతో గది లోపలికి వెళ్ళాడు. అతని చూవులు తోలుసంచీ మీద పడ్డాయి. అది అటూ ఇటూ కదులుతోంది. ఆ సంచీలోంచే గుసగుసలు వినిపించాయన్న సంగతి అతడు ఊహించాడు. అవి ద…య్యాల మాటలు అని గ్రహించగానే అతడు, పిల్లిలా అడుగు మీద అడుగు వేసుకుంటూ వెళ్ళి, సంచీకి చెవులు ఆనించి గుసగుసలను విన్నాడు.

‘‘కురవ్రాడికి ఈరోజు పెళ్ళి కాబోతున్నది. మనల్ని ఇన్నాళ్ళిలా ఊపిరాడ కుండా బంధించినందుకు మన పగతీర్చుకోవడానికి ఇదే సరైన సమయం. మనం వాణ్ణి చంపేద్దాం. వాడు చచ్చాక, ఎవరో ఒకరు ఈ సంచీ మూతి విప్పి మనకు విముక్తి కలిగించకపోరు!’’ ‘‘అవును, అవును, అలాగే చంపేద్దాం. అయితే ఎలా?’’ ‘‘నేను విషపు బావి కథలోని దయ్యాన్ని. పెళ్ళికూతురు ఇంటికి వెళుతూన్న దారిలో నేనా బావిని వచ్చేలా చేస్తాను. దప్పిక గొన్న వాడు బావిని చూడగానే నీళ్ళు తాగడానికి ఆగుతాడు. అంతే ... ఆ పైన అంతే సంగతులు ఆ హా హా!’’ ‘‘బావుంది. ఒకవేళ వాడు బావివద్ద ఆగి నీళ్ళు తాగకుండానే వెళ్ళిపోయాడే అనుకుందాం. విషపు తుప్పపళ్ళ కథలోని ద…య్యమైన నేను ఊరుకుంటానా? దారికి పక్కనే చెట్టుగా చేతికి అందే పళ్ళతో కనిపించి ఊరిస్తాను.

పండు కోసి రుచి చూశాడంటే చాలు! వాడిపని అయిపోతుంది. ఆ హా హా!’’ ‘‘ఒకవేళ దానిని కూడా తప్పించుకుని పెళ్ళికూతురు ఇల్లు చేరుకున్నాడే అనుకుందాం. నా కథలో కనకనలాడే మేకు వుంది. దానిని నేను అతడు కాలు పెట్టే మెత్తకింద దాస్తాను. కాలు మోపగానే ... ఆ హా హా!’’ ‘‘దాన్ని కూడా తప్పించుకుంటే, నా కథలోని విష నాగ సర్పాన్ని పెళ్ళి కూతురు పడకకింద ఉంచుతాను.

అర్ధరాత్రి సమ…యంలో అది వెలుపలికి వచ్చి, వాణ్ణి కాటేస్తుంది... దాన్నుంచి తప్పించుకోవడం వాడితరంకాదు, ఆ హా హా!’’ దయ్యాల కుట్రను విన్న వాన్‌క్యూన్‌ దిగ్భ్రాంతి చెందాడు. అవి సంచిలోపల ఉన్నప్పటికీ హాని కలిగించగల శక్తి వాటికివున్న సంగతి అతనికి తెలుసు. వాన్‌క్యూన్‌ గబగబా ఇంటినుంచి వెలుపలికి వచ్చాడు. పెళ్ళికొడుకు తెల్లగుర్రం మీద వెళుతూన్న పరివారాన్ని చేరుకున్నాడు. తిన్నగా జిన్‌హో దగ్గరికి వెళ్ళి, ‘‘అ…య్యా, ఈ రోజు, నీ గుర్రాన్ని నేను ముందుండి నడుపుతాను,’’ అంటూ గుర్రం కళ్ళాన్ని పట్టుకున్నాడు. ‘‘వద్దు, నువ్వు ఇంటికి తిరిగివెళ్ళు. అక్కడ నీకు బోలెడన్ని పనులున్నాయి!’’ అన్నాడు జిన్‌హో.

వాన్‌క్యూన్‌ అక్కడి నుంచి …యజమానిని సమీపించి, ‘‘అయ్యా, ఈ రోజు చాలా గొప్ప రోజు కదా! ఈ రోజు చిన్న యజమాని గుర్రాన్ని నడిపించాలన్నది నా చిరకాల వాంఛ,’’ అన్నాడు.‘‘సరే, అలాగే కానివ్వు. అనుమతి ఇస్తున్నాను,’’ అన్నాడు జిన్‌హో తండ్రి. వాన్‌క్యూన్‌ పరమానందం చెందాడు. ఎలాగైనా చిన్న యజమానిని దయ్యాల నుంచి కాపాడాలన్న కృతనిశ్చయంతో, గుర్రం ముందు నడవసాగాడు. వాన్‌క్యూన్‌ అనుమానించినట్లే, దారి పక్కన బావి కనిపించగానే, నీళ్ళు తెమ్మన్నాడు జిన్‌హో. ‘‘అయ్యా, బావిలోనుంచి నీళ్ళు తోడడానికి చాలా సేపవుతుంది.

అంతసేపు మీరు ఈ మండే ఎండలో ఉన్నట్టయితే, పెళ్ళి దుస్తులు చెమటకు తడిసిపోగలవు,’’ అంటూ వాన్‌క్యూన్‌ ఆగకుండా ముందుకు వెళ్ళిపో…యాడు. దాహంగా ఉన్నప్పటికీ, సేవకుడి మాటల్లోనూ నిజం ఉందని గ్రహించిన జిన్‌హో మరేం మాట్లాడలేక పోయాడు. మరికొంతదూరం ముందుకు వెళ్ళాక, బాట పక్కన వున్న చెట్టుకు తుప్పపళ్ళు చేతికి అందేలా నేలబారుగా కనిపించడంతో, ‘‘వెళ్ళి ఆ పళ్ళు కోసుకురా.


వాటిని తిని దాహం చల్లార్చుకుంటాను,’’ అన్నాడు జిన్‌హో. ‘‘అయ్యా, ఇవాళ తమకు పెళ్ళి. వధువు గారి ఇంట షడ్రసోపేతంగా విందు కాచుకుని వున్నప్పుడు, ఈ తుప్పపళ్ళు తింటారా?’’ అంటూ, జిన్‌హో సమాధానానికి ఆగకుండా, గుర్రం కళ్ళాన్ని పట్టుకుని వేగంగా ముందుకు నడవసాగాడు. జిన్‌హో, సేవకుడితో వాదన ఎందుకని మౌనం వహించాడు. ఊరేగింపు ముందుకు సాగి కొంత సేపటికి పెళ్ళికూతురు ఇల్లు చేరుకున్నది. పెళ్ళి కొడుకు గుర్రంపై నుంచి కిందికి కాలుమోపి దిగడానికి వీలుగా, ఇద్దరు సేవకులు చిన్న మెత్తను తెచ్చివేశారు. వాన్‌క్యూన్‌, దాన్ని దూరంగా తీసివేస్తూ, ‘‘చూడండి, అవి ఎంతమెత్తగా ఉన్నాయో! మా యజమాని కాలు జారితే మరేమన్నా ఉందా. వెళ్ళి చెక్కబల్ల తీసుకు రండి,’’ అన్నాడు.

ఒక సేవకుడి దుందుడుకు ప్రవర్తనకు, జిన్‌హో, అతని తండ్రి, పెళ్ళికూతురు తండ్రితో సహా అక్కడవున్న వారందరూ విస్తుపోయారు. అయినా, సేవకులు వెళ్ళి కొయ్యబల్ల తెచ్చి వేయడంతో వాన్‌క్యూన్‌ చేయి అందివ్వగా, పెళ్ళికొడుకు గుర్రం పైనుంచి, కొయ్య బల్లపై అడుగు మోపి కిందికి దిగాడు. పెళ్ళికొడుకు బృందం అలంకరించబడిన ఉద్యానవనంలోకి చేరింది. అందమైన దుస్తులతో ఆభరణాలతో అలంకరించిన పెళ్ళి కూతురు మిన్‌జీని వేదిక మీదికి తీసుకువచ్చారు. పెళ్ళి ఘనంగా జరిగింది. విందు భోజనాలు ఏర్పాటయ్యాయి. అవి ముగిశాక, పెళ్ళికొడుకూ కూతురూ పడక గదికి చేరడానికి ముందే, వాన్‌క్యూన్‌ పెద్ద కత్తితో లోపలికి వెళ్ళాడు. పడక మీది పట్టుపరుపులను తొలగించి, వాటి కింద దాక్కునివున్న సర్పాన్ని తెగనరికాడు.

అంతలో అందరూ అక్కడికి చేరారు. ఆ దృశ్యాన్ని చూసిన జిన్‌హో, ‘‘నాన్నా, వాన్‌క్యూన్‌ మన ప్రాణాలు కాపాడాడు!’’ అన్నాడు కృతజ్ఞతతో. మరునాడు జిన్‌హో పెళ్ళికూతురును వెంటబెట్టుకుని తన పరివారంతో స్వగృహానికి తిరిగివచ్చాడు. విందు జరుగుతున్న సమయంలో, వాన్‌క్యూన్‌ జిన్‌హోను సమీపించి, నిన్నటి తన వింత ప్రవర్తనకుగల కారణాన్నీ, సంచీలోని దయ్యాల గురించీ చెప్పాడు. అంతావిన్న పెళ్ళికూతురు భర్తతో, ‘‘జిన్‌హో! ఈరోజు నుంచి నువ్వు నాకు ఆ కథలు చెప్పు. ఒక్కొక్క దయ్యంగా వదిలిపెడదాం,’’ అన్నది సంతోషంగా. స్వస్తి. 

Monday, December 26, 2016

చక్కని కధ

చక్కని ఎద్దు... కధ.. 


అనగనగా గోపయ్య అనే రైతు దగ్గర ఒక గొప్ప ఎద్దు ఉండేది... అది చాలా బలంగా ఉండేది. అయినా అది చాలా శాంతంగా ఉండేది. గోపయ్య ఏ పని చెబితే దాన్ని, చాలా ఇష్టంగా చేసి పెట్టేది.

గోపయ్య కూడా ఆ ఎద్దును చాలా ప్రేమగా, జాగ్రత్తగా చూసుకునేవాడు. దాన్ని అస్సలు కొట్టేవాడు కాదు. దాని మీద ఈగను కూడా వాలనిచ్చేవాడు కాదు. ఆ ఎద్దు గురించి అందరితోనూ గొప్పగా చెప్పేవాడు.

ఒకసారి గోపయ్య ఊళ్ళో పెద్ద మనుషులతో మాట్లాడుతూ "నా ఎద్దు నూరు బండ్లను ఒకేసారి లాగేస్తుంది- కావాలంటే వెయ్యి నాణేలు పందెం" అనేశాడు. కొందరు ఆ మాటను వినీ విననట్టు ఊరుకున్నారు కానీ, గోపన్న అంటే సరిపోనివాళ్ళు కొందరు జట్టు కట్టి, "పందెం అంటే పందెం" అన్నారు.

పందెం రోజు రానే వచ్చింది. ఊళ్ళో వాళ్ళు నూరు బండ్లనూ వరుసగా ఒకదాని వెనుక ఒకటి కట్టి ఉంచారు. గోపయ్య ఎద్దును తెచ్చి మొదటి బండికి కట్టాడు. ఎద్దుకు ఇదంతా కొత్తగా ఉంది. అయినా యజమాని తెచ్చి నిలబెట్టాడు గనక, అట్లా ఊరికే నిలబడిందది. అందరూ 'లాగు లాగు' అన్నారు. కానీ ఎద్దు మాత్రం కదల్లేదు. గోపయ్య ఏం చెబుతాడోనని ఎదురు చూస్తూ అది అట్లానే నిలబడి ఉన్నది.

గోపయ్యకు తల తీసేసినట్లయింది. 'ఎద్దు బళ్ళను ఎందుకు లాగట్లేదు?' అని చికాకు మొదలైంది- ఆ చికాకులో 'తను దానికి లాగమని చెప్పనేలేదు' అని అతనికి గుర్తుకే రాలేదు. పైపెచ్చు, అది 'నా పరువు తీస్తోంది' అని చటుక్కున కోపం కూడా వచ్చేసింది: "వెయ్యి నాణేలు... పోగొట్టకు! వెయ్యి నాణేలు!! ఎప్పుడైనా చూశావా? అంత తిండి తినేది ఎందుకట, ఈ మాత్రం లాగలేవా?!" అని తిడుతూ, అందరు రైతుల లాగానే తనూ దాన్ని మొరటుగా చర్నాకోలతో కొట్టటం మొదలు పెట్టాడు అతను.

గోపయ్య అంతకు ముందు ఎన్నడూ దానితో కోపంగా మాట్లాడలేదు. ఏనాడూ దాన్ని తిట్టలేదు; ఒక్క దెబ్బకూడా వెయ్యలేదు! మరి ఇప్పుడు అతను అంత కోపంగా అరవటం, పైపెచ్చు చర్నాకోలతో కొట్టటం ఎద్దుకు ఏమాత్రం నచ్చలేదు. దాంతో అది పూర్తిగా మొండికేసింది- ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. దాన్ని కొట్టీ కొట్టీ అలసిపోయిన గోపయ్య పదిమందిలోనూ ఓటమిని అంగీకరించాల్సి వచ్చింది. డబ్బుతోబాటు పరువునూ పోగొట్టుకొని, తలవంచుకొని ఇల్లు చేరుకున్నాడతను.

"గతంలో అవసరం ఉన్నప్పుడు చాలా సార్లు ఈ ఎద్దే వంద బండ్లను అలవోకగా లాగేసింది గదా, మరి ఇవాళ్ల ఎందుకు లాగలేదు?!" అన్న ఆలోచన రాలేదు, కోపంతో రగిలిపోతున్న గోపయ్యకు. అయితే ఆరోజు సాయంత్రం చూసేసరికి, ఎద్దు మేత మేయకుండా- స్తబ్దుగా నిలబడి ఉన్నది. దాని ఒంటినిండా చర్నాకోల వాతలు- ఆ గాయాల చుట్టూ ఈగలు ముసురుతుంటే అది విసురుకోవటం కూడా లేదు. గోపయ్య వంకే చూస్తూ కన్నీరు కారుస్తున్నది!

దాన్ని చూసే సరికి గోపయ్య హృదయం ద్రవించింది. దాని గాయాలకు మలాం రాస్తూ అతను తన తప్పును గ్రహించాడు: 'ఈ మూగ జంతువుకూ హృదయం ఉంది. తన మాట నెగ్గాలన్న తొందరలో తను దాన్ని అనవసరంగా, కౄరంగా శిక్షించాడు. సున్నితమైన దాని మనసుకు గాయం కలిగించాడు!'

గోపయ్య కళ్ల నీళ్ళతో దానికి క్షమాపణ చెప్పుకొని, నిమిరి, ముద్దుచేసి, దగ్గర చేసుకున్నాడు. అతని మనసును గ్రహించిన ఎద్దు కూడా కొంత కుదుటపడ్డది.

తెలివి తెచ్చుకున్న గోపయ్య తర్వాతి రోజున మళ్ళీ గ్రామస్తులతో పందెం కాశాడు. 'ఈసారి పందెం రెండు వేల నాణేలు' అన్నారు గ్రామస్తులు. ఈసారి గోపయ్య ఎద్దుని కొట్టలేదు సరికదా, కనీసం అదిలించను కూడా లేదు. ప్రేమగా వీపు నిమిరి, 'లాగురా!' అనేసరికి, ఎద్దు వంద బండ్లనూ లాక్కొని ముందుకు ఉరికింది!

గోపయ్య పందెం నెగ్గటమే కాదు; జీవితాంతం‌ ఉపకరించే పాఠం ఒకటి నేర్చుకున్నాడు- 'ఎంత తొందర, ఎంత చికాకు ఉన్నా సరే, మనసుల్ని మటుకు గాయపరచకూడదు' అని.

చక్కని ఈ కథని మళ్ళీ ఓసారి చదవగలరని కోరుతూ...

జాగ్రత్తగా చూస్తే, పసి పిల్లలలో కూడా అనంతమైన శక్తి దాగి ఉన్నది.

ప్రేమ, ఆప్యాయతలు వాళ్ళు తమ ఈ శక్తిని వాస్తవీకరించుకునేందుకు సహాయపడతాయి. మంచి ఉపాధ్యాయులు అందరూ పిల్లల హృదయాల్ని అర్థం చేసుకొని సున్నితమైన మనసులతోటి సున్నితంగానే ప్రవర్తించాలి

ప్రతి ఒక్కరూ షేర్ చెయ్యండి.. సమాజంలో మార్పుకోసం కృషి చేయండి..





ధర్మం చేయండి బాబు


ఒక ఊళ్లో ఒక పేద పిల్లవాడు ఉండేవాడు. వాడికి తల్లిదండ్రులు లేరు. ఆ పిల్లవాడు చదువుకొనేందుకు అవసరమైన డబ్బులు కూడా ఉండేవి కావు వాడి దగ్గర. అందుకని వాడు ఇల్లిల్లూ తిరిగి, ఇంట్లోకి పనికి వచ్చే వస్తువులను అమ్మేవాడు. అలా వచ్చిన డబ్బుతో చదువుకొనేవాడు.

ఒకరోజున, అలా అమ్మకానికి పోయినప్పుడు, అతనికి బాగా ఆకలి వేసింది. ఎండ విపరీతంగా ఉన్నది; నీరసంగా ఉంది; ఇక తిరగలేని పరిస్థితి. చేతిలో ఒక్క రూపాయి మాత్రమే ఉంది. ఏంచేయాలి?

'అక్కడున్న ఇంటి తలుపుతట్టి, కొంచెం అన్నం పెట్టమని అడుగుదాం' అనుకున్నాడు అతను. వెళ్ళి ఇంటి తలుపు కొట్టాడు- అయితే ఓ చక్కని యువతి ఇంటి తలుపు తెరిచేసరికి, వాడికి ఇక ఏమి అడగాలో తోచలేదు- "ఒక గ్లాసు మంచినీళ్ళు ఇస్తారా?" అని మాత్రం అడగ గల్గాడు.అయితే, పిల్లవాడి ముఖం‌ చూస్తే, 'వాడికి ఆకలిగా ఉంది' అని ఎవరైనా కనుక్కోగలరు. అందుకని ఆమె మంచినీళ్లకు బదులు, వాడికి ఒక పెద్ద గ్లాసెడు పాలు తీసుకొచ్చి ఇచ్చింది. పిల్లవాడికి ప్రాణం లేచివచ్చినట్లైంది. సంతోషంగా గ్లాసెడు పాలూ త్రాగేశాడు- త్రాగేశాక మళ్ళీ గుర్తుకొచ్చింది- 'తన దగ్గర ఉన్నది ఒక్క రూపాయే!' అని.

పిల్లవాడికి చాలా సిగ్గు వేసింది. అయినా అడిగాడు, జేబులో‌చెయ్యి పెడుతూ- "మీకు ఎంత చెల్లించాలి?" అని.

"నువ్వు ఏమీ చెల్లించనవసరం లేదులే!"అన్నది ఆ యువతి నవ్వుతూ. "దయతో చేసిన పనికి ప్రతిఫలం తీసుకోకూడదట- మా అమ్మ చెప్పింది!" అన్నది.

పిల్లవాడి కళ్ళు చెమర్చాయి. "అయితే మీరు కనీసం నా హృదయపూర్వక కృతజ్ఞతలు స్వీకరించాలి" అని చెప్పి, వాడు అక్కడినుండి ముందుకు సాగాడు.

ఆ గ్లాసెడు పాలతో పిల్లవాడి ఆకలి అప్పటికి ఎలాగూ తీరింది- శారీరకంగా సత్తువ వచ్చింది. అయితే దానితోబాటు వాడి మనస్సూ మార్పుకు లోనైంది. మనిషిలోని మంచితనం పట్లా, దేవుని కరుణ పట్లా ఆ పసి హృదయంలో నమ్మకం ఒకటి, చిన్న విత్తనం మొలకెత్తినట్లు, మొలకెత్తింది. రాను రాను అది బలపడింది-
ఆ పిల్లవాడు పెద్దయ్యేసరికి, ఆ నమ్మకం అతనిలో వ్రేళ్ళూనుకున్నది.

చాలా సంవత్సరాలు గడిచాయి. రోజులు ఒకేలాగా ఉండవు. అప్పటి ఆ యువతి ఇప్పుడు పెద్దదైంది. ఏదో ప్రమాదకరమైన జబ్బుకు లోనై, ఆమె ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది. స్థానికంగా ఉన్న వైద్యులకు లొంగలేదు ఆ జబ్బు. వాళ్ళు ఆమెను పట్టణానికి వెళ్ళి ప్రత్యేక వైద్యులకు చూపించమన్నారు. ఆమెను చేర్చుకున్న ఆసుపత్రి వాళ్ళు ఆమె సమస్యను పెద్ద డాక్టరు గారికి అప్పగించ దలచారు. ఆమె వివరాలున్న ఫైలును డాక్టరుగారి దగ్గరికి పంపించారు. ఆమె ఊరి పేరు చూసిన డాక్టరుగారు వెంటనే లేచి, ఆమెను చూసేందుకు బయలుదేరి వచ్చారు.

ఆమెను చూడగానే పెద్ద డాక్టరుగారికి కళ్ళు చెమర్చాయి. 'ఎలాగైనా ఆమెను రక్షించాలి' అని నిశ్చయించుకొని, ఆయన ఆమె పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించారు. ఎట్టకేలకు ఆయన కృషి ఫలించింది- చాలా రోజుల పాటు మృత్యువుతో పోరాటం చేసిన తర్వాత, చివరికి ఆమె తన జబ్బు నుండి బయటపడింది!

ఇక ఆమె ఇంటికి వెళ్ళవచ్చు- వెళ్ళేముందు ఆసుపత్రికి చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించటమే తరువాయి: ఎంత ఖర్చు అయ్యిందో‌మరి! ఆమెకు బిల్లు పంపించేముందు దాన్ని తనకోసారి చూపించమని ఆసుపత్రి యాజమాన్యాన్ని ఆదేశించారు పెద్ద డాక్టరుగారు. దాన్ని చూసిన తరువాత, ఆయన ఆ బిల్లు చివరలో ఏదో రాసి, ఆమెకు అందజేసారు.
ఆమె ఆ బిల్లును చూసేందుకు కూడా భయపడింది- ఎందుకంటే, ఆమెకు తెలుసు- అంత పెద్ద మొత్తాన్ని తను జీవితాంతం కష్టపడినా చెల్లించలేదు! అయినా చేసేదేమీ లేదు- ఆసుపత్రికి డబ్బు కట్టాల్సిందే! వణికే చేతులతో కవరును తెరిచిందామె... బిల్లు చివర్లో‌ రంగు ఇంకుతో వ్రాసిన అక్షరాలు ఆమెను ఆకర్షించాయి:

ఒక పెద్ద గ్లాసెడు పాలద్వారా ఈ బిల్లు మొత్తం పూర్తిగా చెల్లించబడింది.
సం/-

దయ కలిగి ఉండాలి. ఇతరులకు సహాయం చేయాలి. మన కరుణ, సహాయం చేసే గుణం తిరిగి మనకెలా అక్కరకు వస్తాయో ఎవ్వరమూ చెప్పలేము!

మనం ఏపంట వేస్తే అదే పంట కోస్తాం మనం పుణ్యంచేస్తే ఆ పుణ్యమే మనల్ని కాపాడు తుంది అదే పాపం చేస్తే అదే పాపం మనల్ని భక్షిస్తూంది అందుకే మనం ధర్మం చెస్తూ మన పిల్లల చేత కూడా ఈ ధర్మం చేయుస్తూ ఉండాలి అప్పుడు వారు ఎంత పెద్దవారైనా ధర్మం చేయుటం మర్చి పోకుండా ఉంటారు ఆ ధర్మమే వారిని రక్షిస్తుంది.







అనగనగా ఒక ఊరు, ఆ ఊరిలో ఒక వ్యక్తి ఉండేవాడు. అతని దగ్గర ఒక ఆవు ఉండేది. అది ఒక రోజు ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడిపోయింది. అది సహాయం కోసం ఎన్నో గంటలు అరిచి గీపెట్టింది. చాలా సేపటి తర్వాత గాని ఆవు బావిలో పడిందని తెలుసుకోలేకపోయాడు ఆ యజమాని, ఇన్నాళ్లుగా తనకి ఎంతో సేవ చేసిన ఆవును కాపాడాలని అనుకోలేదు అతను. ఎందుకంటే ఆ ఆవును పైకి తీయడం అనవసరం ముసలిది అయినది అనుకున్నాడు.
అంతేకాక ఆ బావిని కూడా మూసేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. అందుకని దానిమీద మట్టి వేసి బావి నింపటం మంచిదని భావించాడు ఆ వ్యక్తి.
ఆ పనిచేయడానికి తనకు సహాయం చేయమని పక్కింటి వారిని కూడా పిలిచాడు.ఆతను పారతో బావిలోని ఆవుపై మట్టి వేయడం ప్రారంభించాడు. పక్కింటివారు కూడా పారలతో మట్టి వేస్తూ ఆయనకు సహాయం చేయసాగారు. ఏం జరుగుతోందో అర్ధం కాని ఆవు మొదట అంబా అరిచింది, తరువాత అరవకుండా ఉండిపోయింది. అమ్మయ్య ఆనుకున్నాడు.
కొద్దిసేపు పారతో మట్టి వేసిన తరువాత బావిలోకి చూసిన ఆయన ఆశ్చర్యపోయాడు. తనపైన మట్టిపడుతున్న ప్రతిసారి ఆవు మట్టిని విదుల్చుకుంటూ ఆ మట్టిమీదే నలబడి పైకి రాసాగింది.అతనికి,ఆతని పక్కింటి వారికి ఆశ్చర్యం కలిగింది. బావిలో నిండిన మట్టి మీదుగా ఎక్కి ఆవు పైకి వచ్చేసింది. ఆవు తెలివికి మెచ్చిన అతను,తన తప్పు తెలసుకొని, అప్పటి నుంచి ప్రేమగా చూడసాగాడు.

నీతి : ఈ ఆవులాగే మనమీద కుడా ఎంతో మంది దుమ్ము, మట్టి వేస్తుంటారు. కాని ఆ దుమ్మును, మట్టిని దులుపుకొని జీవితంలో పైకి వచ్చేవారే తెలివైనవారు.







గొప్ప గుణం💦💭
💦💭రవి చంచల 💭💦

💦💥  కొడంగల్ పట్టణం లోని కోస్గి లో సుదర్శన్ ,మాదవరెడ్డి  ,  అనే ఇద్దరు వడ్డీ వ్యాపారం చేస్తూ జీవించేవారు. వారిలో సుదర్శన్ తక్కువ వడ్డీ తీసుకొని అడిగిన వారికి లేదనక అప్పులిచ్చి అవసరాలలో ఆదుకొంటుండేవాడు. ఎవరైనా ఇచ్చిన అప్పును సకాలంలో తీర్చకపోతే పీడించేవాడుకాదు. అందువల్ల ఆ ఊరి ప్రజలకు సుదర్శన్  అంటే చాలా ఇష్టం. కాని  మాదవరెడ్డి మాత్రం పరమలోభి. అధిక వడ్డీలు గుంజి లక్షలకు లక్షలు సంపాదించాలని కలలు కనేవాడు. అప్పులు తీర్చకపోతే వారు తాకట్టు పెట్టిన భూములు, నగలను, ఇండ్లను తిరిగి ఇవ్వక వారికి నిలువ నీడ లేకుండా చేస్తాడు. ఆ ఊరి ప్రజలు అతనిని లోభి అని, చండాలుడని చెప్పుకొనేవారు. ప్రజల్లో సుదర్శన్ కున్న  గొప్ప పేరును చూసి  అసూయపడేవాడు. ఎలాగైనా సుదర్శన్ ను  దెబ్బ తీయాలని అనుకున్నాడు. ఆ ఊరివారందరూ కలిసి ఒక రామాలయం కట్టించారు. ఆ ఊరి జమిందారు నారయణ ఇచ్చిన విరాళంతో నగలను చేయించారు. ఆ గుడి తాళాలను నిజాయితీ పరుడైన  సుదర్శన్కు  అప్పగించారు. అది చూసి ఓర్వలేని మాదవరెడ్డి మండిపడ్డాడు. అతను బాగా ఆలోచించి ఒక పథకం వేశాడు.  సుదర్శన్ ఇంట్లో పనిచేసే రాజయ్యను రహస్యంగా కలిసాడు. ఎలాగైనా గుడి తాళాలను తెచ్చి ఇస్తే పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తానని ఆశ చూపాడు. మొదట్లో రాజయ్య దానికి ఒప్పుకోలేదు. కాని కుటుంబ అవసరాల వల్ల అతను ఆ పనికి ఒప్పుకున్నాడు.  గుడి తాళాలను పెట్టెలో పెట్టి సుదర్శన్ భద్రంగా వుంచాడు. రాజయ్య మాత్రం దానిని జాగ్రత్తగా గమనిస్తున్నాడు.

ఒక రోజు  సుదర్శన్ భార్య నగల కోసం పెట్టె తెరచి మరలా దానికి తాళం వేయడం మరచి లోనికి వెళ్ళిపోయింది. అదే అదనుగా భావించి చాటున ఉన్న రాజయ్య ఆ పెట్టెను తెరచి గుడి తాళాలను తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత ఆ గుడి తాళాలను  మాదవరెడ్డి చేతికిచ్చాడు. ఒకరోజు రాత్రి  మాదవరెడ్డి ఊరంతా గాఢ నిద్రలో ఉండగ గుడి తలుపులు తెరచి గర్భ గుడిలోనికి వెళ్ళాడు. అక్కడ దేవతలకు అలంకరించిన నగలను తీసి ఒక సంచిలో వేసుకొని అక్కడ నుంచి మెల్లగా జారుకున్నాడు. మరుసటి రోజు దేవుని నగలు దొంగిలించారన్న వార్త ఊరంతా పాకిపోయింది. గుడి తాళాలు సుదర్శన్ వద్ద ఉండగా దొంగతనం ఎలా జరిగిందోనని కొందరి మాటల్లో వినిపిస్తుంది. గ్రామ పెద్దవీరేశము  ఈ విషయాన్ని గూర్చి రచ్చబండ దగ్గర పంచాయితీ నిర్వహించారు. ఊరివారందరితో పాటు , సుదర్శన్ , మాదవరెడ్డి కూడా అక్కడికి చేరుకున్నారు. అప్పుడు గ్రామ పెద్ద వీరేశము , సుదర్శన్ తో  తాళాలు నీవద్ద ఉన్నాయి. మరీ దొంగతనం ఎలా జరిగింది? దీనికి నీ సంజాయిషీ ఏమిటీ? అని ప్రశ్నించాడు. సుదర్శన్  గ్రామ పెద్ద వంక చూసి "అయ్యా! గుడి తాళాలను పెట్టెలో భద్రంగా ఉంచాను. రెండు రోజులుగా అవి కనిపించలేదు. ఎంత వెతికినా వాటి ఆచూకీ తెలియలేదు" అని బదులిచ్చాడు. "ఈ  మోసకారి, తానే నగలు కాజేసి ఏమి తెలియదన్నట్లు నటిస్తునాడు. తగిన శిక్ష వేసి చెరసాలలో వేయించండని  మాదవరెడ్డి చెప్పాడు.

గ్రామ పెద్ద  వీరేశముకు  , మాదవరెడ్డి మాటలపై నమ్మకం కలుగలేదు.  సుదర్శన్ నిజాయితీ పరుడని నమ్ముతున్నాడు. ఇందులో ఏదో మోసం జరిగింది. అది తెలుసుకోవాలనుకున్నాడు. ఒకరోజు గ్రామ పెద్ద -సుదర్శన్  ఇంట్లో పని వారందరిని పిలిపించాడు. వారికి తలోక ఉంగరాన్ని ఇచ్చి ఇవి మహిమ కలవని, ఒక మునీశ్వరుని వద్ద నుండి సంపాదించానని చెప్పాడు. దొంగతనం చేయని వారి ఉంగరం ధగ ధగ మెరుస్తుందని నమ్మబలికాడు. వాటిని మరుసటి రోజు తిరిగి ఇవ్వమని చెప్పి వారిని పంపించాడు. రాజయ్య తాను తాళాలు దొంగిలించిన విషయం బయటకు తెలియకుండా తనకు తెలిసిన కంసాలి వద్ద ఉంగరాన్ని మెరుగు పట్టించాడు. మరుసటి రోజు వారు ఆ ఉంగరాలను వీరేశము కు   అందజేసారు.  ఆ ఉంగరాలను పరిశీలించి రాజయ్య ఉంగరం మెరుస్తుండడం గమనించాడు. అయనకు దొంగ ఎవరో తెలిసిపోయింది. వెంటనే "రాజయ్య నిజం చెప్పు? నగలను ఎక్కడ దాచావ్? అంటూ వీరేశము గద్దించాడు. అది విని రాజయ్య గజగజ వణికిపోయాడు. అయ్యా! నగలను గూర్చి నాకేం తెలియదు. బుద్ది గడ్డి తిని గుడి తాళాలను మాదవ రెడ్డి చేతికిచ్చాను. తర్వాత ఏమి జరిగిందో నాకు తెలియదని గ్రామ పెద్దను వేడుకొన్నాడు. రంగయ్య మాదవరెడ్డి తను చేసిన నేరం అందరికి తెలిసిపోయిందన్న విషయం గ్రహించి సిగ్గుతో తలవంచుకున్నాడు. అప్పుడు గ్రామపెద్ద - " మాదవరెడ్డి నీవు స్వార్థంతో అతి పవిత్రమైన దేవుని నగలను దొంగిలించావు! నిజాయతీ పరుడైన సుదర్శన్ పై  నేరాన్ని మోపి దోషిగా అందరి ముందు నిలబెట్టావు! అందువల్ల నీకు కఠిన శిక్ష విధించి చెరసాలలో వేయించాలని తీర్పు ఇస్తున్నాను" అన్నాడు. అప్పుడు   మాదవరెడ్డిని  క్షమించి వదిలివేయమని సుదర్శన్ గ్రామపెద్దను వేడుకున్నాడు.  సుదర్శన్  మాట కాదనలేక వీరేశము  మాదవరెడ్డి ను మందలించి వదిలివేశాడు. అపకారికి కూడా ఉపకారం చేసే  గొప్ప గుణానికి అక్కడున్న వారందరూ మెచ్చుకున్నారు. , మాదవరెడ్డి, సుదర్శన్  చేతులుపట్టుకొని "అసూయతో చేసిన నేరానికి క్షమించమని" అడిగాడు.  "ఇప్పుడైనా నీలో మార్పు వచ్చింది! అంతే చాలు అన్నాడ సుదర్శన్. తర్వాత ఇద్దరు ఎన్నో గొప్ప పనులు చేసి ఆ ఊరిని బాగు చేసారు. 💥💦ఈ కథ రాసినవారికి వందనాలు 💦పోస్ట్ ::రవి చంచల










Wednesday, December 7, 2016

"కూలీ"

 "కూలీ"

ఒకానొక ఊర్లో భీద కూలివాడు
ఉండేవాడు..
ఒకరోజు ఒక చెక్కల వ్యాపారి దగ్గరకు
వెళ్లి ఏదైనా పని చెప్పండి అని
బ్రతిమలాడేడు ...
చెక్కల వ్యాపారి సరే అని చెప్పి.
జీతం మాత్రం నువ్వు ఎంత చేస్తే అంత
అని చెప్పేడు..
.
కూలివాడు నాకు నా,పిల్లలకు రోజుకు
బ్రతకడానికి 100 రూపాయలు అవసరము
అవతాయి .కాబట్టి నాకు
100 రూపాయలు ఇస్తే చాలు అన్నాడు.
అప్పుడు కలప వ్యాపారం చేసే
యజమాని  అలా కుదరదు...
.
నీ పనికి తగ్గట్టుగా నీ జీతం
ఉంటుంది..
పని  ఎంత ఎక్కువగా
చేస్తే  అంత డబ్బు వస్తుంది..
అని బదులిచ్చాడు..
.
కూలివాడు తప్పక సరే అన్నాడు..

 .
కూలివాడు యజమాని  చెప్పిన
ఒప్పందం కి సరే అని చెప్పేడు.
అప్పుడు ఆ యజమాని  ఆ కూలివాడుకి
ఒక మంచి బలమైన  కత్తి ఒకటిచ్చి
అడవిలో పెద్ద పెద్ద చెట్ల మ్రానులను
నరికి తెమ్మన్నాడు...
.
కూలివాడు సరే అని వెళ్లి అడవిలో
చెట్లను నరకడం మొదలుపెట్టేడు..
ఎలాయితేనే  పొద్దు కునికే సరికి
15 చెట్లను నరికి వాటిని తెచ్చి
యజమానుడుకి అప్పజేప్పేడు.
యజమానుడు భళా  దాసుడా..
ఎవరైనా ఒక్కరోజులో 7 చేట్లకంటే
ఎక్కువగా నరకలేరు...
నువ్వు ఏకం గా 15 చెట్లు నరికావు...
భళా అని పొగిడి..
నువ్వు మొదటి రోజే చాల ఎక్కువ
కష్టపడ్డావ్ అని మెచ్చుకుని.
చెట్టుకు 10 రూపాయలు చప్పున
ఆ కూలివాడుకి 150రూపాయలు
ఇచ్చాడు..
.
ఆ  కూలివాడు మరుసటి రోజు
అడవికి వెళ్లి ఇంకా ఎక్కువ కష్టపడితే
ఇంకా డబ్బులువస్తాయి కదా అని
మొదటి రోజు కంటే ఎక్కువ సేపు
కష్టపడి పోద్దు కున్కేసరికి 10 చెట్లను
నరికి తెచ్చి యజమానుడుకి చెట్టుకు
10 రూపాయలు చప్పున 10 చెట్లు అప్పజెప్పి
100 రూపాయలు కూలి  తీసుకున్నాడు..
.
మూడవరోజు కూలివాడు  ఇంకా కష్టపడి
పనిచేసి పోద్దు కునికేసరికి 5 చెట్లు
నరికి  యజమానుడుకి అప్పజెప్పి
చెట్టుకు 10 రూపాయలు చప్పున
50 రూపాయలు తీసుకుని
వెళ్ళిపోయాడు...
మరుసటి రోజు ఎలా అయిన
ఎక్కువ చెట్లు నరకాలని వేకువ
జామున చీకటితో బయలుదేరివెల్లి
ఆ అడవిలో  ఎన్నడులేనంత గా
కష్టపడి వేకువజామున నుండి చీకటి
 పడేవరకు  కష్టపడి
ఒకే ఒక చెట్టు నరికి యజమానుడుకి
అప్పజేప్పేడు .
.
అప్పుడు ఆ యజమానుడు చెట్టుకు
10 రూపాయలు చప్పున పది
రూపాయలు తీసి ఆ పనివాడి చేతిలో
పెట్టేడు.
పనివాడు పది రూపాయల నోటు
 వైపు దీనముగా చూస్తూ శాయశక్తులా కష్టం
పెంచినా ఫలితం పది రూపాయలేే
అని తలంచి...
ఎంత చేస్తే అంత అన్నయజమానుడితో
ఉన్న ఒప్పందం గుర్తెరిగి
చేసేది ఏమీ లేక...
వెళ్ళిపోతూ  వెళ్లిపోతూ
.
అయ్యగారు నా కష్టం లో ఎటువంటి
లోపం లేదు..
చీకటి పడేవరకు చెమట ఓర్చి
శ్రమించాను కాని ఒకటి కంటే
ఎక్కువ నరకలేకపోయాను...
అని దీనముగా అన్నాడు..
.
అపుడు యజమానుడు నేను నీకు
ఇచ్చిన కత్తికి పదును పెట్టి ఎన్నాళ్ళు
అవుతుంది ??అని అడగగానే.
కూలివాడు నేను రోజు నా  పనిలో
మునిగిపోవడంవలన కత్తికి పదును
పెట్టె సమయం నాకు లేదు...
అందుకే కత్తికి ఒక్కసారికూడా
పదును పెట్టలేదు అని అన్నాడు...
అపుడు యజమానుడు 
అర్ధం లేని నీ శ్రమకు ,
ఆర్ధిక పతనానికి 
శరీర శ్రమలకి 
కారణం కత్తికి పదును లేకపోవడమే.

.
పదును పలితం...
ఎటువంటి సమస్యనైనా సులువుగా 
కోసిపారేయడమే

మార్పు  లేని జీవితం , పదును లేని
మొద్దుబారిన కత్తిలాంటిది..
ఏవేవో శ్రమలు పడతాం కాని
ఫలితం ఆవిరి.....
కష్టపడుతున్న..
కష్టపెట్టే పరిస్థితులు మాత్రం
మారనే మారవు
పదునైన ఆలోచనలతో మాత్రమె
గోప్పవిజయాలు సాధించగలము..




మనసుకు హత్తుకునే కథ

 మనసుకు హత్తుకునే కథ

.
భార్య భర్తల మధ్య ప్రేమనీ చూడండ
.
ఆరోజు వారి పెళ్ళిరోజు, నీలిమ భర్త సoతోష్ కోసం ఎదురుచూస్తూ వుంది....
.
వారికి పెళ్లయి కొన్ని సoవత్సరాలు అయ్యింది. మొదట్లో చాలా సంతోషంగా వారి జీవితం సాగింది. రాను రాను చిన్న చిన్న సందర్భాలకి గొడవలు మొదలయ్యాయి. ఒకరితో ఒకరు మాట్లాడు కోవడం లేదు, కాని ఇద్దరు ఒకే ఇంట్లోనే వుంటున్నారు...
.
నీలిమ ఆలోచన అoతా ఒకటే !
ఈరోజు తమ పెళ్ళిరోజు గుర్తున్నదా లేదా అని....
.
అంతలొ కాలింగ్ బెల్ మోగింది. నీలిమ ఆనందంతొ తలుపు తెరిచింది...
.
వర్షంలొ తడిసి వున్నాడు, చేతిలో పువ్వుల బోకే వుంది. ఇద్దరు గత స్మృతులలోకి వెళ్ళి మాట్లాడు కుంటున్నారు....
.
అంతలో ఫొన్ రింగ్ వినపడింది. నీలిమ పక్క గదిలోకి వెళ్లి ఫోన్ తీసింది....
.
అటువైపునుండి . . . ఇది సంతోష్ గుప్త గారి ఇల్లేనా? సారి మేడమ్ ఇక్కడ ఒక accident అయ్యింది. ఒకతను చనిపోయాడు, పర్సులో మీ భర్త గారి ఫొటో వుంది, మీరు వచ్చి శవాన్ని తీసుకెళ్ళండి.....
.
నీలిమ ఒక్కసారి shock!!!!!!..
.
అయిన వెంటనే తేరుకొని నా భర్త నా దగ్గరే వున్నాడు. అది ఎలా సాద్యం? ..
.
లేదు మేడమ్ ఈరోజు 4. 30pm కి train accident జరిగింది , మీ భర్త పర్సు వుంది ఇక్కడ....
.
నీలిమ పరుగు పరుగున ఆ గదిలోకి వెల్లి చూస్తే సంతోష్ లేడు...
.
నీలిమ ఒక్కసారి కూలబడింది. ఎవురు మరి? సంతోష్ ఆత్మ ? చివరగా నన్ను సంతోష పెట్టడానికి ఆత్మరూపంలో వచ్చాడా !!!! ..
.
దేవుడు నాకు ఒక్క ఛాన్స్ ఇస్తే బాగుండు. నేను కూడ అతనితో పాటు చనిపోతే బాగుండు. ..
.
.
మరో జన్మలోనైనా కలిసి వుండేవాళ్ళం. ఒకటే ఆవేదన !ఆవేదన .
.
ఇంతలొ బాత్రూమ్ తెరుచుకున్న సౌండు , ఎదురుగా సంతోష్...
.
.
సారీ నీలిమ నీకొక విషయం చెప్పడం మరిచాను. ఈరోజు station లో
నా పర్సు పోయింది అని ఇంకా ఏదో చెపుతున్నాడు...
.
అవి ఏవీ నీలిమ చెవిని చేరడం లేదు ! అతనికోసo తన గుండె వేదన ! తనకున్న పట్టరాని సంతొషంతొ !!!!! ఒక్కసారి వెళ్ళి మనసారా హత్తుకుంది....
.
జీవితo అనేది ఇంకొక అవకాశం కోసం కాదు , అది వున్నప్పుడే మనం ఉపయోగిన్చుకోవాలి., ఆనందంగా వుండాలి...
.
ఈజన్మలో .......
అది అమ్మ - -నాన్నలతో
అది మన జీవిత బాగస్వాములతో అది మన తోబుట్టులతో,....,
అది మన మిత్రులతో . . .
జీవితం ఆస్వాదించండి ! ఆనందంగా వుండండి .....
Please Share to All.

Friday, December 2, 2016

ఏకత్వానుభూతి

ఏకత్వానుభూతి

🎊పూర్వకాలమున భూత్పూరు రాజ్యం లోని అమిస్తపురములో రామప్రభు అనే  గురువుండెడివాడు. అతనికొక యాదయ్య అనే  శిష్యుడుండెను. గురువున కాతడు సేవాశుశ్రూషలు గావించుచుండెను. ఇట్లుండ కొంతకాలమున కా గురువుయొద్ద మరియొక  శిష్యుడు గౌరీ శంకర్ రెడ్డి  వచ్చి చేరెను. ఇరువురును భక్తితో గురువును సేవించుచుండిరి. ఒకనాడు మధ్యాహ్నా సమయమున గురువు దూరప్రదేశము నుండి తిరిగివచ్చి బడలికచే చాపపై ఒకింత సేపు విశ్రమించెను. పరుండబోవునప్పుడు తన మొదటి శిష్యుడు యాదయ్య ను  పిలిచి 'ఒరే! నాయనా! కాళ్లునొప్పిగా నున్నవి. కొంచెము సేపు ఒత్తరా!' యని ఆదేశించెను. అతడట్లే గురువును సేవించుటకు వచ్చుచుండగా, ఇంతలో రెండవ శిష్యుడు గౌరీ శంకర్ రెడ్డి ఒక ఆక్షేపణ తెచ్చెను. అతడు గురువుతో "మహాత్మా! ఇతడు పాతవాడు. చాలాకాలము నుండియు తమ సేవ చేయుచున్నాడు. తత్ఫలితముగా ఇప్పటికే బండెడు పుణ్యమును ముటకట్టుకొని వేసెను. నేనింతవరకు గురుసేవాలభ్యమగు రవ్వంత పుణ్యమునైనను నోచుకొన లేదు. ఉన్న కాస్త పుణ్యమును,ఇరువురును పంచుకొనవలెనే కాని అంతయు అతని పాలిటనే పడుట న్యాయవిదూరము. కాబట్టి నేటి కతని నిలిపివైచి నాకే ఈ అవకాశము నిప్పించవేడెద!' అని ప్రార్థించాడు.

మొదటి శిష్యుడు ఏమియు తక్కువ తినినవాడు కాడు. అతడు వెంటనే ఉగ్రుడై "స్వామీ! గురువర్యా! అతని వాక్యములను వినకుడు. క్రొత్తగా వచ్చెను కనుక కాళ్లు పిసుకుట అతనికి సరిగా తెలియదు. అనవసరముగా తమరు బాధకు గురియగుదురు. ఏ ఉద్యోగము నందైనను అనుభవమునకే ఎక్కువ ప్రాధాన్య మొసంగుట లోకధర్మము. తమకు తెలియనిది ఏమున్నది?" యని చెప్పి యూకకుండెను. ఈ ప్రకారముగా ఆ యిద్దరు శిష్యులు గురువునకు లేనిపోని ఒక సమస్యను తెచ్చిపెట్టిరి. మాయాబంధము భేదించి వేయుట గూడ ఆ గురువునకు సులభమనిపించెను గాని ఈ పరమానంద శిష్యులిరువురికిని రాజీ చేయుట మాత్రము మహాదుస్తర మనిపించింది.

ఏమి చేయుటకు తోచక, తుదకొక మధ్యేమార్గ మవలంబింప నిశ్చయించి, ఇరువురిని దగ్గరకు పిలిచి 'ఒరే నాయనలారా! తగవులాడు కొనకుడు. భగవంతుడు నాకు రెండుకాళ్లు ఇచ్చియిన్నాడు. కనుక చెరియొక కాలు పంచుకొని సేవించుడు. ఈ పీడకు ఇదియే విరుగుడు' అని చెప్పి పరుండెను.

శిష్యులిద్దరున్ను భేష్ భేష్ అని సంతోషించి అట్లే చెరియొక కాలు పంచుకొని సేవించుచుండిరి. వైమనస్యము అసలు ఉండరాదు. ఉండినచో అది యేదియో ఒక రూపమున బయటకు వెడల గ్రక్కబడుచునే యుండును. ఈ శిష్యుల విషయ మట్లే అయినది. పొరపాటున ఒకరు పిసుకుచుండిన కాలు మరియొక దానికి కొద్దిగ తగిలెను. అవతలివాడు కోపగించి, "ఏమిరా! ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచెయ్యి " అని మందలించి, ప్రతీకారచర్యగా తాను ఒత్తుచుండిన గురువుకాలు ఎత్తి అమాంతముగ అవతలిదానిమీద విసరివేసెను. వాడున్ను రుద్రాకారమును ధరించి "ఒరే! నాకాలిని కొట్టెదవా? నీకాలు పనిపట్టెదను చూడు" అని రోషారుణిత నేత్రుడై దగ్గరనేయున్న గురువుగారి కమండలమును తీసుకొని దానితో అవతలి కాలిమీద బలవంతముగ కొట్టెను. వాడున్ను ప్రళయాకృతి వహించి, గురువుగారి యోగదండము తీసికొని ఇవతలికాలిని చావమోదెను.

ఈ 'గలాటా' అంతయు చూచి, గురువుగారు నిద్రలేచిరి. శిష్యుడు శిష్యుడు పోట్లాడుకొని, గురువు రామప్రభు కాళ్ళు చప్పగా నాశనము చేసిరి. గురువు బాధతో "ఏమిట్రా ఈ గల్లంతు!" అని అరవగా ఆ శిష్యులిరువురును, 'మహాత్మా! తాము పరుండుడు! ఇది మా అంతరంగ వ్యవహారము ఇదేదో తేలవలె. వాడి కాలు గొప్పో, నాకాలు గొప్పో, అని పలికిరి. అంతట గురువు "ఓరే నీకాలు, వాడి కాలు ఏమిట్రా? ఆ రెండును నా కాళ్లేకదరా! ఎంత తెలివితక్కువ వారురా మీరు?' అని తిట్టి ఇరువురిని దూరముగా పంపివేసెను.

💗అట్లే ప్రపంచమందలి జీవరాసులందరును పరమాత్మయొక్క అవయవములు వేరువేరుగా కనిపించినను, "అవయవ" దృష్ట్యా వానియన్నింటియందును ఏకత్వమే కలదు. దృష్టాంతమందలి గురువు గారి ఒకకాలు మరియొక కాలిని దన్నుట ఎంత హాస్యాస్పద మయిన విషయమో, ఒక ప్రాణి మరియొక ప్రాణితో పోట్లాడుట, అతనిని ద్వేషించుట హింసించుట అంత హాస్యాస్పదమే యగును.

💗నీతి: ప్రపంచమంతయు భగవత్స్వరూపమని యెంచి సర్వుల యెడ ప్రేమ దయ కలిగియుండుము. ఎవరినీ ద్వేషింపరాదు.

ఈ కథ రాసినోల్లకు వందనాలు

చైతన్య శక్తిని

ఒక ఊళ్ళో గుడి ఎదురుగా కూచుని ఓ గుడ్డి వాడు అడుక్కుంటూ ఉండేవాడు.


 చెట్టు నీడనే విశ్రాంతి పొందుతూ కాలక్షేపం చేసేవాడు.
 రోజూ ఓ భక్తుడు గుడిని సందర్శించి, తిరిగి వెళ్ళే సమయంలో ఈ బిచ్చగాడి పాత్రలో ఓ నాణెం వేసేవాడు.
 ఆ భక్తుడి నడక చప్పుడు, అతడు నాణేన్ని వేసినప్పుడు అయ్యే శబ్దం బిచ్చగాడికి స్పష్టంగా ఎరుకే.

ఈ భక్తుడికి, ఆ భిక్షగాడికి మధ్య ఏదో తెలియని అనుబంధం ఏర్పడింది.

 బిచ్చగాడు బాగా ముసలివాడై పోయాడు.
చివరి క్షణాలు సమీపించాయని అతడికి అనిపించింది.

తను అభిమానం పెంచుకున్న ఆ భక్తునితో తన మనసులోని ఆఖరి కోరికను విన్నవించాడు.
 తను దేహం చాలించిన తర్వాత, తను నివాసమున్న స్థలం లోనే ఆ దేహాన్ని సమాధి చేయాలని కోరాడు.
భక్తుడు సరేనన్నాడు.
ఆ ఘడియ రానే వచ్చింది.
 బిచ్చగాడు తుది శ్వాస విడిచాడు.

భక్తుడు అతడడిగిన స్థలంలోనే గొయ్యి తవ్వసాగాడు.
 ఆశ్చర్యం ......!
దాని నుండి నిధి బయటపడింది.
వెండి, బంగారు నాణేలు దానిలో ఉన్నాయి.
 అవన్నీ అతడి సొంతమయ్యాయి.

మృతి చెందిన బిచ్చగాడు స్వర్గానికి చేరుకున్నాడు.
 అక్కడ అతడికి ఈ సంగతి తెలిసింది.
జరిగిన దానికి సంతోషపడ్డాడు.
 కానీ, ఒక సందేహం అతడిని పీడించింది.

నిధి మీదే కూచున్నాను కానీ జీవితమంతా అడుక్కుంటూ బిచ్చగాడి గానే ఉండిపోయాను.
దారిన పోయే దానయ్య కోటీశ్వరుడు అయ్యాడు.
 ఏమిటయ్యా ఇది!
అని ఇంద్రుణ్ణి ప్రశ్నించాడు.

 అతడికి ఇంద్రుడు సమాధానం చెబుతూ,
నీ జీవితమంతా భగవంతుని సన్నిధిలోనే కూచుని, భగవన్నామాన్నే ఉచ్చరిస్తూ గడిపావు.
 అందుకే నీకు స్వర్గప్రాప్తి కలిగింది.
అతడు రోజూ భగవత్సేవ చేస్తూ, నీకు యదా శక్తిగా తనకు చేతనైనంత దానం చేశాడు.
 నీ కోరికను తీర్చేందుకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు.
 అందుకే అతనికి సిరిసంపదలు లభించాయి
 అన్నాడు ఇంద్రుడు.

వ్యక్తి తనలో నిక్షిప్తమైన అనంత చైతన్య శక్తిని గుర్తించలేక దానిని విస్మరించి,
 గుడ్డి వాడిలా బయటే ఏదో ఉందని పరిభ్రమించడం ఆగాలి.
తప్పక అంతర్ముఖుడు కావాలి!

 JOY OF SHARING

Saturday, November 19, 2016

ఈ కథ ను ప్రతీ ఒక్కరూ మిస్ అవ్వకుండా చదవాలి.Stories in telugu

ఈ కథ ను ప్రతీ ఒక్కరూ మిస్ అవ్వకుండా చదవాలి.stories in telugu


చీకటి కావస్తుండగా ప్రయాణికులతో పూర్తిగా నిండి , రద్దీగా ఉన్న ఒక బస్సు తన గమ్యస్థానానికి బయలుదేరింది.

ఆ బస్సు ఒక అడవి గుండా ఘాట్ రోడ్డు పై ప్రయాణిస్తుండగా అకస్మత్తుగా వాతావరణం మారిపోయి భయంకరమైన ఉరుములు, మెరుపులతో కూడిన ⛈ కుండపోత వర్షం ప్రారంభమైంది.

ప్రయాణికులందరు చూస్తుండగానే ఒక  ⚡పిడుగుపాటు వల్ల బస్సుకు 50 అడుగుల దూరంలో ఒక చెట్టు పడిపోయింది. డ్రైవర్ చాకచక్యంతో బస్సును ఆపివేశాడు.ఆ చెట్టు మరో ప్రక్కకు ఉన్న లోయ వైపు విరిగిపడడం వల్ల వీరి మార్గానికి అడ్డు రాలేదు.

కొద్దిసేపటి తరువాత మళ్లి బస్సు బయలుదేరింది. ప్రయాణికులలో భయం ప్రారంభమైంది. ప్రయాణికులందరు ఊపిరి బిగపట్టుకుని కూర్చున్నారు.

ఆ బస్సు రెండు కిలోమీటర్లు వెళ్లిందో లేదో మరో ⚡పిడుగు బస్సుకు 40 అడుగుల దూరంలోని చెట్టుకు కొట్టింది. డ్రైవర్ చాకచక్యంతో మళ్లి బస్సును ఆపివేశాడు.

ఇలా మూడు సార్లు జరిగింది. మూడోసారి పిడుగు 30అడుగుల దగ్గరలో కొట్టింది.ప్రయాణికులలో భయం తారాస్థాయికి చేరుకుంది. అరుపులు, ఏడుపులు ప్రారంభమయ్యాయి.

అందులోంచి ఒక పెద్దమనిషి ఇలా అన్నాడు.”చూడండీ! మనందరిలో ఈ రోజు ‘పిడుగు ద్వారా మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ‘ఎవరో ఉన్నారు. అతని కర్మ మనకు చుట్టుకుని మనందరం కూడా అతనితో పాటు చావవలసి వస్తుంది.

నేను చేప్పేది జాగ్రత్తగా వినండి!
ఈ బస్సులో నుంచి ఒక్కొక్క ప్రయాణికుడు క్రిందికి దిగి,
అదిగో!ఎదురుగా ఉన్న ఆ 🌳చెట్టును ముట్టుకుని మళ్లి బస్సులో వచ్చి కూర్చోండి.
మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ఆ చెట్టును ముట్టుకోగానే పిడుగుపాటు తగిలి మరణిస్తాడు.
మిగిలిన వాళ్లం క్షేమంగా వెళ్లవచ్చు!
ఒక్కరి కోసం అందరు చస్తారో ? అందరి కోసం ఒక్కరు చస్తారో? ఆలోచించుకోండీ! ” అన్నాడు.

చివరకు ఒక్కొక్కరుగా వెళ్లి ఆ చెట్టును ముట్టుకుని రావడానికి సిద్ధపడ్డారు.
మొదట ఆ పెద్దమనిషే మనుసులో చాలా భయపడుతూనే వెళ్లి ఆ చెట్టును ముట్టుకున్నాడు.ఏమీ జరగలేదు.
అతడు ఊపిరి పీల్చుకుని క్షేమంగా వచ్చి బస్సులో కూర్చున్నాడు….

ఇలా ఒక్కొక్కరు భయపడుతూనే వెళ్లి ఆ చెట్టును ముట్టుకుని వచ్చి కూర్చోసాగారు.
చివరికి ఒకే ఒక ప్రయాణికుడు మిగిలాడు.ఇక మరణించేది అతడే! అని అందరికీ పూర్తిగా నిశ్చయమైపోయింది.

చాలా మంది అతని వైపు అసహ్యంతో,కోపంతోచూడసాగారు.కొందరు జాలి పడుతూ చూడసాగారు.అతను కూడా భయపడుతూ బస్సు దిగి చెట్టును ముట్టుకోవడానికినిరాకరించాడు.

కాని, బస్సులోని ప్రయాణికులందరు”నీవల్ల మేమందరం మరణించాలా? వీల్లేదు.టూ బస్సు నుంచి బలవంతంగా క్రిందికి నెట్టారు.

చేసేది లేక ఆ చివరి వ్యక్తి వెళ్లి చెట్టును ముట్టుకున్నాడు.వెంటనే పెద్ద మెరుపులతో పిడుగు వచ్చి కొట్టింది. తరువాత భయంకరమైన శబ్దం వచ్చింది.కాని పిడుగు వచ్చి కొట్టింది ఆ చివరి వ్యక్తిపై కాదు!

బస్సుపై…అవును.. 🚌 బస్సుపై పిడుగు పడి అందులోని ప్రయాణికులందరూ మరణించారు.

నిజానికి ఈ చివరి వ్యక్తి ఆ బస్సులో ఉండడం వల్లనే ఇంతవరకు ఆ బస్సు కు ప్రమాదం జరగలేదు.ఇతని పుణ్యఫలం, దీర్ఘాయుస్సు వారినందరిని కాపాడింది.

ఈ కథలో లాగానే మనం జీవితంలో సాధించిన విజయాలలో కానీ, ఆపదల నుండి రక్షించబడిన సందర్భాలలో కానీ, ఆ క్రెడిటంతా మనదేననుకుంటాము.

కాని, ఆ పుణ్యఫలం
🔸మన తల్లిదండ్రులది కావచ్చు!
🔸జీవిత భాగస్వామిది కావచ్చు!
🔸పిల్లలది కావచ్చు!
🔸తోబుట్టువులది కావచ్చు!
🔸మన క్రింద పని చేసే వారిది కావచ్చు! లేదా
🔸మన శ్రేయస్సును కోరే స్నేహితులది – బంధువులది కావచ్చు!
మనం ఈ రోజు ఇలా ఉన్నామంటే అది మన ఒక్కరి కృషి ఫలితమే కాదు.
ఎంతో మంది పుణ్య ఫలితం, ఆశీర్వాద బలం, వారు వారి అదృష్టాన్ని పంచడం కూడా కారణమై ఉంటాయి.

ఒక సినిమాలో చెప్పినట్లు…”బాగుండడం” అంటే బాగా ఉండడం కాదు. అందరితో కలిసి ఆనందంగా ఉండడం.

ఒక్కరుగా మనసులోనే నవ్వుకోగలము.
కాని, అందరితో మనస్పూర్తిగా ఆ నవ్వును పంచుకోగలము – పెంచుకోగలము
stories in telugu

Thursday, November 10, 2016

ఒక చీమ రోజు ఆఫీసు కి వెళ్తుండేది

ఒక చీమ రోజు ఆఫీసు కి వెళ్తుండేది . ఆడుతూ పాడుతూ పని చేసిది . అది పని చేసే చోట మంచి ఉత్పత్తి వచ్చేది . సీఈఓ సింహం రోజూ చీమని చూసి సంతోసించేవాడు . ఒక రోజు అతను ఇలా ఆలోచించాడు . చీమ దానంతటది పని చేస్తేనే ఇంత బాగా చేస్తోంది , దీని పైన ఒక సూపర్ వైజర్ ని పెడితే ఇంక ఎంత బాగా చేస్తుందో అని . ఆలోచన వచ్చిందే తడవుగా ఒక బొద్దింకను సూపర్ వైజర్ గ నియమించాడు . బొద్దింక అప్పటిదాకా లేని నివేదికలు,అటెండేన్స్ లు ప్రవేశ పెట్టింది . వీటన్నిటిని చుసుకోవడానికి ఒక సాలీడు ని సెక్రటరీ గ నియమించుకుంది . సింహం గారు మెచ్చుకుంటూనే ఈ మార్పుల వాళ్ళ ఎంత ఉత్పత్తి పెరిగింది , పని విదానానికి సంబందించిన రిపోర్ట్ లు వగైరా అడిగారు . ఇవన్ని చేయడానికి బొద్దింక ఒక కంప్యూటర్ ని ఒక ప్రింటర్ ని తెప్పించుకొని వాటిని ఆపరేట్ చేయడానికి ఒక ఈగని నియమించింది . మరో వైపు ఆడుతూ పాడుతూ పని చేసే చీమ నీరసించడం మొదలు పెట్టింది . అది చేసే పని కి తోడూ పై అదికారులతో మీటింగ్ లు , ఎప్పటికప్పుడు అంద చేయాలసిన రిపోర్ట్ లు దాని నెత్తి మీదకొచ్చి పడ్డాయి . ఈ లోగ బొద్దింక అధికారికి తోడూ మరో మేనేజర్ ,వీళ్ళ హోదా కి తగినట్లు ఆఫీసు కు కొత్త హంగులు ,ఆర్భాటాలు మొదలైనాయి . క్రమంగా చీమ కే కాదు ఆఫీసు లో ఎవరికీ పని పట్ల ఆసక్తి లేకుండా పోయింది . ఉత్పత్తి పడిపోయింది . సిఈఓ సింహం గారు ఈ సమస్యని పరిష్కరించే పనిని కన్సల్టెంట్ గుడ్ల గూబ కి అప్పగించారు . ఇలాంటి సమస్యలకు పరిష్కారం కనుక్కోవడం లో ప్రపంచ ప్రసిద్ది గాంచిన గుడ్లగూబ గారు ఆఫీసు స్తితిగతులని అద్యయనం చేసి అక్కడ అనవసర సిబ్బంది చాలా ఎక్కువగా ఉన్నారని తేల్చి చెప్పారు . వెంటనే సింహం ,బొద్దింక మీటింగ్ పెట్టుకొని చాలా కాలంగా అలసత్వం ప్రదర్శిస్తున్న చీమని పనిలో నుండి
తొలగించాలని తీర్మానించాయి.
.


Monday, October 24, 2016

మంచికథ......

 మంచికథ......


ఒక సారి చాణిక్యుని దగ్గరకు అతని మిత్రుడు ఒకడు వచ్చి నీకు తెలుసా నీ మిత్రుడు గురించి నేను ఒక విషయం విన్నాను" అని ఎంతో ఉత్సాహంగా ఇంకేదో చెప్పబోతున్న అతన్ని చాణిక్యుడు ఆపి "నీవు నా మిత్రుడు గురించి చెప్పబోయే ముందు ఒక్క నిముషం సావధానంగా నీవు చెప్పబోయే విషయాన్ని కొద్దిగా జల్లెడ పడదాం దీన్ని నేను "మూడు జల్లెడ్ల పరీక్ష (Triple Filter Test)" అంటాను అని అడగటం మొదలు పెట్టాడు.

మొదటి జల్లెడ"నిజం" - "నీవు నా స్నేహితుడి గురించి చెప్పబోయే విషయం ఖచ్చితంగా నిజమైనదని నీకు తెలుసా ?" అని అడిగాడు.

అందుకు ఆ స్నేహితుడు "లేదు, ఎవరో అంటుండగా విన్నాను" అని అన్నాడు.
"అంటే నీవు చెప్పబోయే విషయం నిజమైనదే అని నీకు తెలీదన్న మాట" అని చాణిక్యుడు అన్నాడు.

సరే రెండో జల్లెడ "మంచి " - " నీవు నాకు చెప్పబోయే విషయం నా మిత్రుని గురించిన మంచి విషయమా ?" అని అడిగాడు చాణిక్యుడు,

"కాదు" అన్నాడు చాణిక్యుని స్నేహితుడు .

"అంటే నీవు నా మిత్రుని గురించి చెడు చెప్పాలను కున్నావు, అది కుడా నీకు ఖచ్చితంగా నిజమని తెలీని విషయం- సరే ఇంక మూడో జల్లెడకు వెళదాం"అన్నాడు చాణిక్యుడు.

మూడో జల్లెడ "ఉపయోగం" - "నీవు నా మిత్రుని గురించి చెప్పబోయే విషయం నాకు ఉపయోగమైనదా ? " అని చాణిక్యుడు అడిగాడు.

"లేదు" అన్నాడు ఆ మిత్రుడు.

"అయితే నీవు చెప్పబోయే విషయం నిజమైనది, మంచిది, ఉపయోగకరమైనది కానపుడు నాకు చెప్పటం ఎందుకు ?" అని అన్నాడు చాణిక్యుడు

నీతి : మన గురించి, మన వాళ్ళ గురించి చెడు వార్తలను, విషయాలను మోసే వాళ్ళు చాలా మంది వుంటారు. ఒక విషయం (చాడి) వినేముందు ఈ మూడు జల్లెడల పద్ధతి అనుసరిస్తే, మన బంధాలు నిలబడతాయి, మంచి పెంపొందుతుంది. చాడీలు నివారించబడతాయి.        

Sunday, October 16, 2016

చిట్టికథ

 చిట్టికథ

ఒక సారి సోక్రటీస్ దగ్గరకు అతని మిత్రుడు ఒకడు వచ్చి నీకు తెలుసా నీ మిత్రుడు గురించి నీను ఒక విషయం విన్నాను" అని ఎంతో ఉత్సాహంగా ఇంకేదో చెప్పబోతున్న అతన్ని సోక్రటీస్ ఆపి "నీవు నా మిత్రుడు గురించి చెప్పబోయే ముందు ఒక్క నిముషం సావధానంగా నీవు చెప్పబోయే విషయాన్ని కోద్దిగా జల్లెడ పడదాం దీన్ని నీను "మూడు జల్లెడ్ల పరీక్ష (Triple Filter Test)" అంటాను అని అడగటం మొదలు పెట్టాడు.

మొదటి జల్లెడ"నిజం" - "నీవు నా స్నేహితుడి గురించి చెప్పాబోయే విషయం ఖచ్చితంగా నిజమైనదని నీకు తెలుసా ?" అని అడిగాడు.

అందుకు ఆ స్నేహితుడు "లేదు, ఎవరో అంటుండగా విన్నాను" అని అన్నాడు.
"అంటే నీవు చెప్పబోయే విషయం నిజమైనదే అని నీకు తెలీదన్న మాట" అని సోక్రటీస్ అన్నాడు.

సరే రెండో జల్లెడ "మంచి " - " నీవు నాకు చెప్పబోయే విషయం నా మిత్రుని గురించిన మంచి విషయమా ?" అని అడిగాడు సోక్రటీస్.

"కాదు" అన్నాడు సోక్రటీస్ స్నేహితుడు .

"అంటే నీవు నా మిత్రుని గురించి చెడు చెప్పాలను కున్నావు, అది కుడా నీకు కచ్చితంగా నిజమని తెలీని విషయం- సరే ఇంక మూడో జల్లెడకు వెళదాం"అన్నాడు సోక్రటీస్.

మూడో జల్లెడ "ఉపయోగం" - "నీవు నా మిత్రుని గురించి చెప్పబోయే విషయం నాకు వుపయోగామైనదా ? " అని సోక్రటీస్ అడిగాడు.

"లేదు" అన్నాడు ఆ మిత్రుడు.

"అయితే నీవు చెప్పబోయే విషయం నిజమైనది, మంచిది, వుపయోగకరమైనది కానపుడు నాకు చెప్పటం ఎందుకు ?" అని సోక్రటీస్ అన్నాడు.

నీతి : మన గురించి, మన వాళ్ళ గురించి చెడు వార్తలను, విషయాలను మోసే వాళ్ళు చాలా మంది వుంటారు. ఒక విషయం (చాడి) వినేముందు ఈ మూడు జల్లెడల పద్ధతి అనుసరిస్తే, మన బంధాలు నిలబడతాయి, మంచి పెంపొందుతుంది. చాడీలు నివారిన్చబడతాయి. 

మాతృభాష

కల్వరాల రాజ్యాన్ని వీరరాఘవుడనే మహారాజు పరిపాలించేవాడు. అతడు వివిధ రాజ్యాల కళాకారులను ఆహ్వానించి, వారితో కళా ప్రదర్శనలు ఇప్పించి, మంచి బహుమతులు ఇచ్చేవాడు. ఒక రోజు వారి రాజ్యానికి అమరేశప్ప అనే పండితుడు వచ్చ్హాడు. అతడు అనేక భాషలను అనర్గళంగా మాట్లాడగలడు.

"మహారాజా! మీ పండితులెవరైనా నా మాతృభాష కనుక్కోగలరా?" అని అమరేశప్ప  సవాలు విసిరాడు.

ఆస్ధాన పండితులంతా వేర్వేరు భాషలలో వివిధ ప్రశ్నలు అడిగారు. ఏ భాషలో ఏ ప్రశ్న అడిగినా ఆ పండితుడు ఏ మాత్రం తడుముకోకుండా, ఆ భాషే తన మాతృభాష అయినట్లుగా సమాధానం చెప్పసాగాడు. చివరికి ఆస్ధానపండితులు చేతులెత్తేశారు.

"మీ రాజ్యంలో నా మాతృభాషను కనిరపెట్టగల మేధావులే లేరా?" అన్నాడు ఆ పండితుడు మహారాజు మహామంత్రివైపు చూశాడు.

మహామంత్రి ఆ పండితుడిని తనకు తెలిసిన కొన్ని భాషలలో ప్రశ్నలు అడగసాగాడు. ఆ పండితుడు తడుముకోకుండా జవాబులు చెప్ప సాగాడు. చివరికి విసుగు చెందిన, మహామంత్రి కోపంతో ఒక సైనికుడి ఖడ్గం తీసుకొని పండితుడిపై వేటు వేయబోయాడు.
"అమ్మో! కాపాడండి!" అని అరిచాడు ఆ పండితుడు కన్నడంలో.

మహామంత్రి ఖడ్గాన్ని దించి, చిరునవ్వుతో "మహారాజా! ఆ పండితుడి మాతృభాష కన్నడం, మనం ఆపదలో ఉన్నప్పుడు మనం మాట్లాడే మాటలు మాతృభాషలోనే ఉంటాయి." అని చెప్పాడు.
పండితుడు మాతృభాష కన్నడమే అని అంగీకరించాడు. ఓటమితో తలదించుకుని సభ నుండి వెళ్ళిపోయాడు.

Monday, September 26, 2016

విమానం లో భోజనం

విమానం లో భోజనం
.
విమానం లో నా సీట్ లో కూర్చున్నాను. ఢిల్లీ కు ఆరేడు గంటల ప్రయాణం . మంచి పుస్తకం చదువుకోవడం , ఒక గంట నిద్ర పోవడం --- ఇవీ నా ప్రయాణం లో నేను చేయ్యాలనుకున్నవి .

సరిగ్గా టేకాఫ్ కి ముందు నా చుట్టూ ఉన్న సీట్ల లో10 మంది సైనికులు వచ్చి కూర్చున్నారు . అన్నీ నిండి పోయాయి . కాలక్షేపంగా ఉంటుందని పక్కన కూర్చున్న సైనికుడిని అడిగాను . " ఎక్కడకి వెడుతున్నారు ?" అని
" ఆగ్రా సర్ ! అక్కడ రెండు వారాలు శిక్షణ. తర్వాత ఆపరేషన్ కి పంపిస్తారు " అన్నాడు అతను .

ఒక గంట గడిచింది . అనౌన్సమెంట్ వినబడింది . కావలసిన వారు డబ్బులు చెల్లించి లంచ్ చేయవచ్చు అని . సరే ఇంకా చాలా టైం గడపాలి కదా అని లంచ్ చేస్తే ఓ పని అయిపోతుందనిపించింది . నేను పర్సు తీసుకుని లంచ్ బుక్ చేద్దామనుకుంటూ అనుకుంటుండగా మాటలు వినిపించాయి
.
" మనం కూడా లంచ్ చేద్దామా ?" అడిగాడు ఆ సైనికులలో ఒకరు
" వద్దు ! వీళ్ళ లంచ్ ఖరీదు ఎక్కువ. విమానం దిగాక సాధారణ హోటల్ లో తిందాం లే !
" సరే ! "
నేను ఫ్లైట్ అటెండెంట్ దగ్గరకి వెళ్ళాను . ఆమెతో " వాళ్ళందరికీ కూడా లంచ్ ఇవ్వండి. " అని మొత్తం అందరి లంచ్ లకి డబ్బులు ఇచ్చాను .

" ఆమె కళ్ళల్లో నీరు " నా తమ్ముడు కార్గిల్ లో ఉన్నాడు సర్ ! వాడికి మీరు భోజనం పెట్టినట్టు అనిపిస్తోంది సర్ ! " అంటూ దణ్ణం పెట్టింది. నాకేదో గా అనిపించింది క్షణ కాలం...
నేను నా సీట్ లోకి వచ్చి కూర్చున్నాను .

అరగంటలో అందరికీ లంచ్ బాక్స్ లు వచ్చేసాయి...
నేను భోజనం ముగించి విమానం వెనక వున్న వాష్రూం కి వెళుతున్నాను .
వెనుక సీట్ లో నుండి ఒక ముసలాయన వచ్చాడు .
నేను అంతా గమనించాను . మీకు అభినందనలు .
ఆ మంచి పనిలో నాకూ భాగస్వామ్యం ఇవ్వండి అంటూ చేతిలో చేయి కలిపారు.
ఆ చేతిలో 500 రూపాయలు నోటు నా చేతికి తగిలింది...
మీ ఆనందం లో నా వంతు అన్నారాయన .

నేను వెనుకకు వచ్చేశాను. నా సీట్ లో కూర్చున్నాను. ఒక అరగంట గడిచింది. విమానం పైలట్ సీట్ నెంబర్లు వెతుక్కుంటూ నా దగ్గరకి వచ్చాడు. నా వైపు చూసి చిరునవ్వు నవ్వాడు.
" మీకు షేక్ హ్యాండ్ ఇద్దామనుకుంటున్నాను అన్నాడు ."
నేను సీట్ బెల్ట్ విప్పి లేచి నిలబడ్డాను .
అతడు షేక్ హేండ్ ఇస్తూ " నేను గతం లో యుధ్ధవిమాన ఫైలట్ గా పనిచేశాను . అపుడు ఎవరో ఒకాయన మీలాగే నాకు భోజనం కొని పెట్టారు .
అది మీలోని ప్రేమకు చిహ్నం . నేను దానిని మరువలేను " అన్నాడు
విమానం లోని పాసింజర్లు చప్పట్లు కొట్టారు . నాకు కొంచెం సిగ్గు గా అనిపించింది . నేను చేసింది ఒక మంచి పని అని చేశానంతే కానీ నేను పొగడ్తల కోసం చెయ్యలేదు.

నేను లేచి కొంచెం ముందు సీట్ల వైపు వెళ్లాను . ఒక 18 సంవత్సరాల కుర్రాడు నా ముందు షేక్ హేండ్ ఇస్తూ ఒక నోటు పెట్టాడు .
ప్రయాణం ముగిసింది .

నేను దిగడం కోసం డోర్ దగ్గర నిలబడ్డాను . ఒకాయన మాట్లాడకుండా నా జేబులో ఏదో పెట్టి వెళ్లి పోయాడు . ఇంకో నోటు

నేను దిగి బయటకు వెళ్లేలోగా నాతో పాటు దిగిన సైనికులు అందరూ ఒక చోట కలుసుకుంటున్నారు. నేను గబగబా వాళ్ళ దగ్గరకి వెళ్లి, నాకు విమానం లోపల తోటి పాసింజర్లు ఇచ్చిన నోట్లు జేబులో నుండి తీసి వాళ్ళకు ఇస్తూ " మీరు మీ ట్రైనింగ్ చోటుకి వెళ్ళే లోపులో ఈ డబ్బు మీకు ఏదన్నా తినడానికి పనికి వస్తాయి . మీరు మాకిచ్చే రక్షణ తో పోలిస్తే మేము ఏమి ఇచ్చినా తక్కువే ! మీరు ఈ దేశానికి చేస్తున్న పనికి మీకు ధన్య వాదాలు . భగవంతుడు మిమ్మల్ని , మీ కుటుంబాలను ప్రేమతో చూడాలి ! " అన్నాను . నా కళ్ళలో చిరు తడి .
.
ఆ పది మంది సైనికులు విమానం లోని అందరు ప్రయాణికుల ప్రేమను వాళ్ళతో తీసుకు వెలుతున్నారు . నేను నా కారు ఎక్కుతూ తమ జీవితాలను ఈ దేశం కోసం ఇచ్చేయ్యబోతున్న వారిని దీర్ఘాయువులుగా చూడు స్వామీ ! అని దేవుడిని మనస్పూర్తి గా కోరుకున్నాను.

ఒక సైనికుడు అంటే తన జీవితాన్ని ఇండియా కు చెల్లించబడే బ్లాంక్ చెక్కు లాంటి వాడు.
" బ్రతికినంత కాలమూ, జీవితాన్ని చెల్లించే ఖాళీ చెక్కు "

ఇంకా వారి గొప్పతనాన్ని తెలియని వారెందరో ఉన్నారు !
(Soumendra Bandopadhyay గారి పోస్టు అనువాదం)
మీరు షేర్ చేసినా సరే , కాపీ పేస్ట్ చేసినా సరే ! మీ ఇష్టం !

ఎన్ని సార్లు చదివినా కంటతడి పెట్టించేదే ఈ విషయం చదవండి, ఇంకొకరికి పంపండి ఈ భరత మాత ముద్దు బిడ్డలను  గౌరవించడమంటే మనల్ని మనం గౌరవించకోవటమే.
          


Tuesday, September 20, 2016

కథలు,

 కొన్ని వేల సంవత్సరాల క్రితం సత్యవ్రతుడనే రాజు ఉండేవాడు. ఆయన గుణగణాలు, పరిపాలనా దక్షత తెలియనివారు లేరు. ఆయన ధర్మదీక్ష, కీర్తి ప్రతిష్ఠలు దేవలోకం వరకు వ్యాపించి ఉండేవి.

అటువంటి ఆ మహారాజు ఒకనాటి రాత్రి రెండవజామున రాజ్యపు దక్షిణద్వారం వద్ద పచార్లు చేస్తున్నాడు. ఆ సమయంలో ఎవరో ఒక దేవతా స్త్రీ మూర్తి రాజ్యపు ప్రధాన ద్వారాన్ని దాటుకొని పోతూ కనబడ్డది ఆయనకు.

ఆయన ఆమెను ఆపి, గౌరవంగా "ఎవరు తల్లీ, నువ్వు? ఇంత రాత్రి సమయంలో రాజ్యాన్ని విడిచి ఎందుకు వెళ్తున్నావు?" అని అడిగాడు.

"రాజా, నేను ధనలక్ష్మిని. ఏ ఒక్కచోటా ఆగటం నా స్వభావంలో లేదు. అయినా ఇన్నేళ్లుగా నీ రాజ్యంలో నేను ఆగిపోయాను. ఇక ఆగను. వెళ్లేందుకు నన్ను అనుమతించు" అన్నది ఆమె.

మహారాజు "తల్లీ! నిన్ను ఆపటం నావల్ల ఎలాగూ కాదు. సంతోషంగా వెళ్లు" అని ఆమెను సాగనంపాడు.

ఆమె అటు వెళ్లిందో, లేదో- ఇటుగా ఒక దివ్య పురుషుడు బయలు దేరాడు బయటికి. "అయ్యా! మీరెవరు? ఎటు వెళ్తున్నారు?" అని అడిగాడు రాజు, ఆయనను.

"రాజా నేను దానాన్ని. ధనం ఉన్నచోట దానం ఉంటుంది. ధన సంపద లేని నీ రాజ్యం ఇప్పుడు నాకు న్యాయం చేయజాలదు. నేనూ ధనాన్ని అనుసరించాల్సిందే. నీ రాజ్యాన్ని విడిచి వెళ్లేందుకు నన్ను అనుమతించు" అన్నాడు ఆ దివ్య పురుషుడు.

"సంతోషంగా వెళ్లండి" అని సాగనంపాడు మహారాజు.

అంతలోనే మరొక దేవతామూర్తి బయటికి పోతూ కనబడింది ఆయనకు. "తల్లీ! నువ్వెవ్వరు? ఎందుకు నన్ను వదిలి పోతున్నావు?" అడిగాడు రాజు.

"రాజా! నేను కీర్తికాంతను. ధన సంపత్తీ, దాన సంపదా లేని ఈ రాజ్యంలో నేను ఉండజాలను. నన్ను వెళ్లనివ్వు" అన్నది ఆ దేవతామూర్తి.

"సరేనమ్మా! నీ ఇష్టం వచ్చినట్లే కానివ్వు." అన్నాడు రాజు.

ఇంకొంతసేపటికి మరొక దివ్య మూర్తి బయటి దారి పట్టింది. రాజుగారు అడిగారు "స్వామీ! మీరెవ్వరు?" అని.

"రాజా! నేను శుభాన్ని. సంపదా, దానం, కీర్తీ లేని ఈ రాజ్యంలో నేను ఉండీ ప్రయోజనం లేదు. అందువల్ల నేను వారిని అనుసరించి పోవటమే మంచిది. నన్ను క్షమించి, పోనివ్వు" అన్నాడా దివ్యమూర్తి. రాజుగారు శుభాన్నీ సాగనంపారు.

'ఇంకా ఏమి చూడాల్సి వస్తుందోనని రాజుగారు విచార పడుతుండగానే మరో దేవతా మూర్తి బయటికి పోతూ కనబడ్డది. "తల్లీ! నువ్వెవ్వరు?" అని అడిగాడు సత్యవ్రతుడు.

"రాజా, నేను సత్య లక్ష్మిని. ధనలక్ష్మీ, దాన లక్ష్మీ, యశోలక్ష్మీ, సౌభాగ్యలక్ష్మీ నిన్ను విడిచి వెళ్ళిపోయారు. ఇక నీకు నా అవసరం ఉండదని, నేనూ పోనెంచాను. నాకూ అనుమతినివ్వు" అన్నది సత్యం.

రాజుగారు వెంటనే ఆమె పాదాలపై పడి " తల్లీ! నీకు ఆ అవసరం ఏమున్నది? వేరే ఏ సంపదనూ నేను కోరలేదు- వారంతట వారువచ్చారు; వారంతట వారు వెళ్ళారు. కానీ తల్లీ, నేను నీ పూజారిని. సత్యాన్ని కోరి, సత్యం కోసమే జీవించే నన్ను వదిలి వెళ్లటం నీకు భావ్యం కాదు. నన్ను వదిలి వెళ్ళకు!" అన్నాడు.

సత్యం సంతోషపడింది. సరేలెమ్మన్నది. తిరిగి రాజ్యంలోకి వెళ్లిపోయింది.

రాజుగారు నిట్టూర్చారు. సూర్యోదయం కాబోతున్నది. రాజుగారు కూడా వెనుదిరిగి తమ మందిరానికి పోబోతున్నారు- అంతలోనే ఒక దివ్యమూర్తి- ఈమారు ఆమె ప్రధాన ద్వారం గుండా రాజ్యంలోనికి ప్రవేశిస్తూ కనబడింది; చూడగా, ఆమె ధనలక్ష్మి! "ఏం తల్లీ! మళ్ళీ వస్తున్నావు?" అడిగారు రాజుగారు.

"అవును సత్య వ్రతా! సత్యం లేనిచోట నేనూ ఉండలేను. అందుకే తిరిగి వస్తున్నాను" అన్నది ధనలక్ష్మి.

అంతలోనే దానలక్ష్మీ, ఆపైన యశోలక్ష్మీ, సౌభాగ్యలక్ష్మీ ఒకరి తరువాత ఒకరు తిరిగి వచ్చారు రాజ్యానికి.

మళ్లీ రాజ్యం కళకళలాడింది.

ఉపనిషత్తులలోని ఈ కథ, సత్యం ఎంత గొప్ప సంపదో వివరిస్తున్నది. అన్ని విషయాల్లోనూ నిజం చెప్పగల్గటం అన్నది నిజంగానే గొప్ప సంపద. ప్రపంచంలో మనకు అబద్ధమే రాజ్యమేలుతున్నట్లు అనిపిస్తుంది కానీ, అంతిమంగా నిలిచేది సత్యమే, సందేహం లేదు. సత్యాన్ని జీవితంలోకి ఆహ్వానించి, అడుగడుగునా  నిజం చెబుదాం; వాస్తవంగా బ్రతుకుదాం. -ఏమంటారు?                        




కథ


🎯స్వశక్తి🎯

కేశవాపురం అనే ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు.
 అతనికి రాము, సోము అనే ఇద్దరు కొడుకులు.
ఇద్దరికీ పెళ్ళిళ్ళు జరిగాయి.
ఇల్లు పెద్దది కావటము వలన అందరూ కలసే ఉన్నారు.

 😘 రాము పెద్దవాడు.
 ఉదయమేలేచి పొలము పనికి వెళ్ళి తండ్రికి సాయపడుతూ ఉండేవాడు.

 సోము సోమరిగా 😴 ఉంటూ పగటి పనికి వెళ్ళి కలలు కంటూ కాలక్షేపము చేసేవాడు.
 ఎవరు చెప్పినా ఏ పని చేయక పడుకొని ఉండేవాడు.
 కొంతకాలము గడిచింది.

ఆ ఊరికి  🎩 ఒక మెజీషియన్ వచ్చాడు. అనేక విద్యలు ప్రదర్శించాడు.
 చివరగా ధాన్యమును బంగారముగా మార్చాడు. సోమూకి ఆశ్చర్యము కలిగింది.
🎩 మెజీషియన్ ప్రదర్శన పూర్తి అయిన పిదప అతన్ని కలిసి ధాన్యము బంగారముగా మార్చే విధము చెప్పమని అడిగాడు.
అంతకుముందే అతని గురించి తెలుసుకున్న మెజీషియన్ రేపు చెప్తానన్నాడు.

అతని ఇంటికి వెళ్ళి ఆ రాత్రి బసచేసి మరుసటి రోజు
"సొంతముగా నీవు నీ భార్యా కలసి పంట పండించిన ధాన్యముతోనే ఇది సాధ్యమవుతుంది.
 నీకు బంగారము తయారయ్యాక నీ భార్యకి నగలు చేయించాలి సుమా!
అంతేకాదు మీ ఇంట్లో అందరితో కలసి పనులు చేయాలి.
 పగలు నిద్రించరాదు"
అని చెప్పాడు.

బంగారము తయారు చెయ్యాలనే ఉద్దేశముతో తండ్రితో చెప్పి తనవాట పొలము తీసుకొని భార్య సహాయంతో కష్టపడి ఎక్కువ ధాన్యము పండించాలని కృషి చేశాడు.
అతని అదృష్టము వలన పంటలు బాగా పండాయి.
ధాన్యరాసులు ఇంటికి వచ్చాయి. మెజీషియన్ కొరకు ఎదురుచూడసాగాడు.

ఒకరోజున మెజీషియన్ వచ్చాడు.
అందరికీ సహాయపడుతూ ఉన్న సోమూని చూసి ఆనందించి
 "నీ భార్యకి నగలు చేయించావా? "
అని అడిగాడు.

ఆమె ముసిముసి నవ్వులు నవ్వసాగింది.
"మీరు మాకు బంగారము తయారుచేయిస్తానన్నారుకదా!"
అని అమాయకంగా అడిగాడు.

ధాన్యపు బస్తాలను చూపుతూ
"ఇవి బంగారము కాదా!" అన్నాడు.
అప్పుడు ఆ వస్తువు చూసి ధాన్యము ఒక ప్రక్క, బంగారము వలెనున్న ఇత్తడి ముక్క ఒక ప్రక్క చూపించి నవ్వుతూ

" నీ గురించి విని, నీ పగటికలలకు స్వస్తి చెప్పాలనే, నాచెల్లెలు కాపురం ఆనందంగా ఉండాలనే ఈ ఎత్తువేశాను.
నేను నీకు బావని.
మీ పెళ్ళికి రాలేకపోయాను.
 ఫ్రెండ్స్ సహకారంతో ఈ నాటకం ఆడాను.
 మాచెల్లెలు నన్ను గుర్తించింది. నీకు చెప్పవద్దని ప్రమాణం చేయించుకున్నా.
 మీ అన్నయ్య ద్వారా నీ విషయము తెలుసుకొని అందరికీ నీవు బాగుపడటమే ఆనందమని తెలిసి మౌనం వహించారు"
అని చెప్పాడు.

 ఆ రోజు అందరూ కలిసి చలోక్తులతో మాట్లాడుకున్నారు.
 అన్న గారితో పొలము పనులలో సహాయము చేస్తూ సుఖసంతోషాలతో గడిపాడు.

💝 కలసి వుంటే కలదు సుఖం


👉మంత్రికి
          తెలివుండాలి,
     

బంటుకి
       భక్తుండాలి...


గుర్రానికి
       వేగముండాలి


ఏనుగుకి
        బలముండాలి...


సేనాధిపతికి
     వ్యూహముండాలి,


సైనికుడికి
           తెగింపుండాలి...


యుద్ధం నెగ్గాలంటే,
   వీళ్ళందరి వెనుక
     
కసి వున్న ఒక రాజుండాలి!

👉మనందరిలో ఒక రాజుంటాడు...


కానీ మనమే,
రాజులా ఆలోచించడం
           

Monday, September 12, 2016

Telugu Stories



కథ


అబద్దం తెచ్చిన అనర్థం
జగన్నాధం, శారదాదేవి దంపతుల ఏకైక కుమారుడు వాసు.
 వాసు కొంటెకుర్రవాడు.
 అల్లరి చిల్లర పనులు చేస్తే స్కూలుకి డుమ్మాలు కొట్టేవాడు.
 తల్లిదండ్రులకు ఇవన్నీ తెలిసేవికావు.
 ఒకరోజు వాసు స్కూలుకి ఎగనామంబెట్టి ఒక సైకిలు అద్దెకు తీసుకొని తిరుగుతూ ఉన్నాడు.
 అనుకోకుండా సైకిలు ఒక రాయికి గుద్దుకొని సైకిలు కిందపడి వాసుకి సైకిలు బ్రేక్స్ గుచ్చుకొని రక్తం కారుతుంది.
ఎలాగో లేచి కుంటుకుంటూ వెళ్ళి సైకిల్ను షాపు యజమానికి ఇచ్చాడు.
 ఆ షాపు యజమాని జరిగినదంతా తెలుసుకొని
బాబూ!
నీకు ఇనుము గుచ్చుకుంది కాబట్టి సెప్టిక్ అవుతుంది.
 నువ్వు వెంటనే వెళ్ళి డాక్టర్కు చూపించుకో అని సలహా ఇచ్చాడు.
 ఇంటిలోకి వెళ్ళగానే వాసుని చూసి
 ఏంటిరా! కాలికి ఏమి అయింది?
 ఎందుకు అలా కాలు కుంటుతున్నావు?
అని అడిగింది ఆదుర్దాగా వాసు తల్లి.
బడి నుంచి ఇంటికి వస్తుంటే దారిలో కాలికి రాయితగిలి కింద పడ్డాను అని జవాబిచ్చాడు.
 బడికి ఎగనామం పెట్టి సైకిల్పై తిరుగుతూ క్రింద పడ్డానని చెబితే అమ్మ తిడుతుందని అబద్దం చెప్పాడు వాసు.
చూడు ఎంత పెద్ద దెబ్బ తగిలిందో అంటూ కాలికి పసుపు రాసింది.
అలా రెండు రోజులు గడిచిపోయాయి.
 వాసు కాలు బాగా వాచింది. కాలు కదపడానికి రావడం లేదు.
అప్పుడు జగన్నాథం వాసుని డాక్టరు దగ్గరికి తీసుకెళ్ళాడు.
అప్పుడు డాక్టరు కాలికి దెబ్బను చూసి ఎలా తగిలింది అని అడిగాడు.
బడి నుంచి వస్తుంటే జారి క్రిందపడ్డాను. రాయి గుచ్చుకుంది.
అని మరలా అబద్దం చెప్పాడు వాసు.
 నిజం చెప్పకపోతే నీ కాలు తీసేయాల్సివస్తుంది అని డాక్టరు చెప్పేసరికి జరిగినదంతా చెప్పాడు వాసు.
చూశారండీ మీ వాడు మీతో అబద్దం చెప్పాడు.
ఇంకా రెండు రోజులు అలాగే ఉంటే సెప్టిక్ అయి కాలు తీసేయవలసి వచ్చేది.
 అంటూ టి.టి ఇంజక్షన్లు, మందులు ఇచ్చాడు.
 ఛీ! ఛీ! కనీసం సైకిలుషాపు యజమాని చెప్పినప్పుడే డాక్టరు దగ్గరికి వెళ్ళివుంటే ఎంత బాగుండేది.
నిజం దాచిపెట్టినందుకు నా ప్రాణానికే ముప్పు వచ్చింది
అందుకే పెద్దలు
అబద్దం ఆడకు నిజం దాచకు అంటారు.
ఇంకెప్పుడూ ఇలా చేయకూడదు అనుకున్నాడు వాసు మనసులో.
ఆరోజు నుంచి వాసు అబద్దం ఆడడం మానేశాడు.
 బడికి సక్రమంగా వెళుతూ, పాఠాలు బాగా చదువుతూ మంచి మార్కులతో పాసయ్యాడు.
చిన్న వయసులో తప్పులు తెలుసుకున్న వాసుకి మంచి భవిషత్తు వుంటుంది.

ఆమెకి అత్తగారితో అస్సలు పడటం లేదు.



ఆమెకి అత్తగారితో అస్సలు పడటం లేదు.

ఆమెతో నిత్యం వాదులాటే... రోజూ మాటలయుద్ధమే.
ఇక ఉండలేననుకుంది.

తండ్రి దగ్గరకి వచ్చి "నాన్నా.... ఈ అత్తని అంతం చేసెయ్యాలి... అది బతికున్నంతకాలం నాకు శాంతి లేదు. కాసింత విషం ఇవ్వు నాన్నా
.....ఆ ముసలి దాన్ని చంపేస్తాను.
పీడ విరగడౌతుంది." అంది.

తండ్రి "సరేనమ్మా... అయితే ఆమె ఉన్నట్టుండి చనిపోతే అందరికీ నీ మీదే అనుమానం వస్తుంది. కాబట్టి నెమ్మదినెమ్మదిగా పనిచేసే విష మూలికలు ఇస్తాను.

అన్నంలో కలిపి ఇవ్వు. ఎవ్వరికీ అనుమానం రాకుండా ఆమెతో ప్రేమ నటించు. ఆమె చెప్పినట్టుచెయ్యి.
ఆమెకి కూడా నువ్వు విషo ఇస్తున్నట్టు అనుమానం రాకూడదు. నీ భర్తకూ అనుమానం రాకూడదు." అన్నాడు.

ఆయన విషం ఇచ్చాడు.
కూతురు తెచ్చుకుంది.

రోజుకింత అన్నంలో కలిపి అత్తకు పెట్టడం మొదలుపెట్టింది.
ఆమె పట్ల ప్రేమగా వ్యవహరించేది. అత్తా అత్తా అంటూ ఆమె చుట్టూ తిరిగేది.

అత్త మాటలన్నా పట్టించుకునేది కాదు. సేవలు చేస్తూనే ఉండేది.
అటు అత్తలోనూ క్రమీపీ మార్పు రావడం మొదలైంది.
"నా కోడలు బంగారం" అంటూ పదిమందికీ చెప్పుకోవడం మొదలుపెట్టింది.
కూతురు పట్ల ఎంత ప్రేమ చూపేదో కోడలు పట్లా అంతే ప్రేమ చూపించేది.

ఇంకొన్నాళ్లకి కోడలు మనసులో పశ్చాత్తాపం మొదలైంది.
"అయ్యో ఇంత మంచి అత్తను చంపుకుంటున్నానా... నా' చేజేతులా విషం పెడుతున్నానా?" అని బాధ పడసాగింది.

ఉండబట్టలేక తండ్రి దగ్గరికి పరుగుపరుగున వెళ్లింది.

"నాన్నా ... విషానికి విరుగుడు ఇవ్వు నాన్నా... అంత మంచి ఆమెను చంపుకోలేను. ఆమె నాకు అమ్మ తరువాత అమ్మ లాంటిది." అంటూ కన్నీరు పెట్టుకుంది.

తండ్రి నవ్వాడు.

"అమ్మా... నేనిచ్చిన దానిలో విషం లేదు. అవి బలం మూలికలు మాత్రమే... వాటిలో విషం లేదు...

విషం నీ మనసులో ఉండేది... ఇప్పుడు అది కూడా విరుగుడైపోయింది." అన్నాడు.

ఈ స్టోరీ  అందరూ  షేర్ చేయండి 
కొంత  మందికి అయ్యిన కనువిప్పు కలుగుతుంది ఈ స్టోరీ చదువుతే.

.