Pages

Sunday, January 29, 2017

దయ్యాల సంచి

 దయ్యాల సంచి


ఒకానొకప్పుడు ధనికులైన భార్యాభర్తలు ఉండేవారు. వారికి జిన్‌హో అనే కొడుకు ఉండేవాడు. కొడుకును పెంచడానికి వాన్‌క్యూన్‌ అనే ఒక వృద్ధ సేవకుణ్ణి ని…యమించారు. అతడు పిల్లవాడికి రకరకాల కథలు చెప్పేవాడు. పిల్లవాడు కథల్ని చాలా ఇష్టంగా వినేవాడు. ఆతడు చెప్పే కథల్లో భయంకరమైన వింతజంతువులు, క్రూరమైన పులులు, దేవదూతలు, అందమైన యువరాణులు, వీరులు, కరుణాహృదయులైన రాజులు వచ్చేవారు.
వీరితో పాటు ప్రతి కథలోనూ ఒకద…య్యం తప్పకుండా వచ్చేది. ఆ కథలు జిన్‌హోకు చాలా బాగా నచ్చాయి. అందువల్ల వాటిని తను మాత్రమే వినాలని పట్టుబట్టాడు. అందువల్ల ఆ కథల్ని సేవకుడు ఇతరులకు చెప్పడానికి అనుమతించేవాడు కాదు. తను కూడా విన్న కథలను వేరెవ్వరికీ చెప్పేవాడుకాదు. అలా చేయడం వల్ల కథల్లోని ద…య్యాలను మరెక్కడికీ వెళ్ళనివ్వకుండా కట్టిపడవేయవచ్చునన్న ఆలోచన!

కథలు చెప్పే సేవకుడైన వాన్‌క్యూన్‌ దయ్యాలకని ప్రత్యేకంగా ఉచ్చుదారంతో ఒక తోలు సంచీని తయారు చేసి, దాన్ని జిన్‌హో పడక గదిలోని గోడకు తగిలించాడు. ప్రతిరాత్రి జిన్‌హో నిద్రపోయే ముందు సేవకుడు సంచీని ఒడిలో వుంచుకుని కథ చెప్పేవాడు. కథ ముగుస్తున్నప్పుడు సంచీ మూతిని తెరిచేవాడు. కథలోని దయ్యం అందులోకి వెళ్ళేది. అదే కథను మళ్ళీ ఎవరైనా చెబితే తప్ప ఆదయ్యం ఆ సంచీ నుంచి వెలుపలికి రాలేదు. వాన్‌క్యూన్‌ సంచీ మూతిని గట్టిగా బిగించి మళ్ళీ గోడకు తగిలించేవాడు.

ఇలా రోజులూ, వారాలూ, నెలలూ, సంవత్సరాలూ గడిచాయి. వాన్‌క్యూన్‌ ఒకసారి చెప్పిన కథను మళ్ళీ ఎప్పుడూ ఎవరికీ చెప్పలేదు. జిన్‌హో కూడా తను విన్న కథను మరెవ్వరికీ చెప్పలేదు. సంచీలో చేరిన దయ్యాలు వెలుపలికి వచ్చే మార్గం లేక తపించసాగాయి. కథలు చెప్పడంలో వాన్‌క్యూన్‌, వినడంలో జిన్‌హో నిమగ్నులై పోవడం వల్ల తోలు సంచీలో దయ్యాలు బాధతో పుట్టించే శబ్దాలను వినలేకపోయేవారు అంతలోనే జిన్‌హో పదిహేనేళ్ళవాడయ్యాడు.

అప్పటి ఆచారం ప్రకారం పెళ్ళీడు కొచ్చాడు. వాడి తల్లి దండ్రులు ఒక చక్కని అమ్మాయిని తమ కోడలుగా చేసుకోవాలనుకున్నారు. ధనిక వర్తకుడి కూతురైన ఆ అందమైన అమ్మాయి పేరు మిన్‌జీ. పెళ్ళిరోజు రానేవచ్చింది.
పెళ్ళి కొడుకు జిన్‌హో, అతని తండ్రి పెళ్ళికూతురు ఇంటికి బయలుదేరడానికి ఉదయమే సిద్ధమ య్యారు. రానున్న పెళ్ళికూతురికి ఆప్యాయంగా స్వాగతం పలకడానికి ఇంట్లోని పనివాళ్ళందరూ ఏర్పాట్లలో, హడావుడిగా ఉన్నారు. ముసలి సేవకుడు వాన్‌క్యూన్‌, ఇంట్లోని ఒక్కొక్క గదినీ పరిశీలించి చూస్తూ, ఏర్పాట్లను గమనించసాగాడు.

అలా వస్తూ, జిన్‌హో గదిలోకి తొంగిచూశాడు.  ఏవో గుసగుసలు వినిపించాయి. ఒక్క అడుగు వెనక్కు వేసి సద్దు చేయకుండా ఆలకించాడు. విభిన్న కంఠస్వరాలు వినిపించాయి. ఎవరూ లేని చోట ఇన్ని కంఠస్వరాలు ఎలా వచ్చాయా అన్న ఆశ్చర్యంతో గది లోపలికి వెళ్ళాడు. అతని చూవులు తోలుసంచీ మీద పడ్డాయి. అది అటూ ఇటూ కదులుతోంది. ఆ సంచీలోంచే గుసగుసలు వినిపించాయన్న సంగతి అతడు ఊహించాడు. అవి ద…య్యాల మాటలు అని గ్రహించగానే అతడు, పిల్లిలా అడుగు మీద అడుగు వేసుకుంటూ వెళ్ళి, సంచీకి చెవులు ఆనించి గుసగుసలను విన్నాడు.

‘‘కురవ్రాడికి ఈరోజు పెళ్ళి కాబోతున్నది. మనల్ని ఇన్నాళ్ళిలా ఊపిరాడ కుండా బంధించినందుకు మన పగతీర్చుకోవడానికి ఇదే సరైన సమయం. మనం వాణ్ణి చంపేద్దాం. వాడు చచ్చాక, ఎవరో ఒకరు ఈ సంచీ మూతి విప్పి మనకు విముక్తి కలిగించకపోరు!’’ ‘‘అవును, అవును, అలాగే చంపేద్దాం. అయితే ఎలా?’’ ‘‘నేను విషపు బావి కథలోని దయ్యాన్ని. పెళ్ళికూతురు ఇంటికి వెళుతూన్న దారిలో నేనా బావిని వచ్చేలా చేస్తాను. దప్పిక గొన్న వాడు బావిని చూడగానే నీళ్ళు తాగడానికి ఆగుతాడు. అంతే ... ఆ పైన అంతే సంగతులు ఆ హా హా!’’ ‘‘బావుంది. ఒకవేళ వాడు బావివద్ద ఆగి నీళ్ళు తాగకుండానే వెళ్ళిపోయాడే అనుకుందాం. విషపు తుప్పపళ్ళ కథలోని ద…య్యమైన నేను ఊరుకుంటానా? దారికి పక్కనే చెట్టుగా చేతికి అందే పళ్ళతో కనిపించి ఊరిస్తాను.

పండు కోసి రుచి చూశాడంటే చాలు! వాడిపని అయిపోతుంది. ఆ హా హా!’’ ‘‘ఒకవేళ దానిని కూడా తప్పించుకుని పెళ్ళికూతురు ఇల్లు చేరుకున్నాడే అనుకుందాం. నా కథలో కనకనలాడే మేకు వుంది. దానిని నేను అతడు కాలు పెట్టే మెత్తకింద దాస్తాను. కాలు మోపగానే ... ఆ హా హా!’’ ‘‘దాన్ని కూడా తప్పించుకుంటే, నా కథలోని విష నాగ సర్పాన్ని పెళ్ళి కూతురు పడకకింద ఉంచుతాను.

అర్ధరాత్రి సమ…యంలో అది వెలుపలికి వచ్చి, వాణ్ణి కాటేస్తుంది... దాన్నుంచి తప్పించుకోవడం వాడితరంకాదు, ఆ హా హా!’’ దయ్యాల కుట్రను విన్న వాన్‌క్యూన్‌ దిగ్భ్రాంతి చెందాడు. అవి సంచిలోపల ఉన్నప్పటికీ హాని కలిగించగల శక్తి వాటికివున్న సంగతి అతనికి తెలుసు. వాన్‌క్యూన్‌ గబగబా ఇంటినుంచి వెలుపలికి వచ్చాడు. పెళ్ళికొడుకు తెల్లగుర్రం మీద వెళుతూన్న పరివారాన్ని చేరుకున్నాడు. తిన్నగా జిన్‌హో దగ్గరికి వెళ్ళి, ‘‘అ…య్యా, ఈ రోజు, నీ గుర్రాన్ని నేను ముందుండి నడుపుతాను,’’ అంటూ గుర్రం కళ్ళాన్ని పట్టుకున్నాడు. ‘‘వద్దు, నువ్వు ఇంటికి తిరిగివెళ్ళు. అక్కడ నీకు బోలెడన్ని పనులున్నాయి!’’ అన్నాడు జిన్‌హో.

వాన్‌క్యూన్‌ అక్కడి నుంచి …యజమానిని సమీపించి, ‘‘అయ్యా, ఈ రోజు చాలా గొప్ప రోజు కదా! ఈ రోజు చిన్న యజమాని గుర్రాన్ని నడిపించాలన్నది నా చిరకాల వాంఛ,’’ అన్నాడు.‘‘సరే, అలాగే కానివ్వు. అనుమతి ఇస్తున్నాను,’’ అన్నాడు జిన్‌హో తండ్రి. వాన్‌క్యూన్‌ పరమానందం చెందాడు. ఎలాగైనా చిన్న యజమానిని దయ్యాల నుంచి కాపాడాలన్న కృతనిశ్చయంతో, గుర్రం ముందు నడవసాగాడు. వాన్‌క్యూన్‌ అనుమానించినట్లే, దారి పక్కన బావి కనిపించగానే, నీళ్ళు తెమ్మన్నాడు జిన్‌హో. ‘‘అయ్యా, బావిలోనుంచి నీళ్ళు తోడడానికి చాలా సేపవుతుంది.

అంతసేపు మీరు ఈ మండే ఎండలో ఉన్నట్టయితే, పెళ్ళి దుస్తులు చెమటకు తడిసిపోగలవు,’’ అంటూ వాన్‌క్యూన్‌ ఆగకుండా ముందుకు వెళ్ళిపో…యాడు. దాహంగా ఉన్నప్పటికీ, సేవకుడి మాటల్లోనూ నిజం ఉందని గ్రహించిన జిన్‌హో మరేం మాట్లాడలేక పోయాడు. మరికొంతదూరం ముందుకు వెళ్ళాక, బాట పక్కన వున్న చెట్టుకు తుప్పపళ్ళు చేతికి అందేలా నేలబారుగా కనిపించడంతో, ‘‘వెళ్ళి ఆ పళ్ళు కోసుకురా.


వాటిని తిని దాహం చల్లార్చుకుంటాను,’’ అన్నాడు జిన్‌హో. ‘‘అయ్యా, ఇవాళ తమకు పెళ్ళి. వధువు గారి ఇంట షడ్రసోపేతంగా విందు కాచుకుని వున్నప్పుడు, ఈ తుప్పపళ్ళు తింటారా?’’ అంటూ, జిన్‌హో సమాధానానికి ఆగకుండా, గుర్రం కళ్ళాన్ని పట్టుకుని వేగంగా ముందుకు నడవసాగాడు. జిన్‌హో, సేవకుడితో వాదన ఎందుకని మౌనం వహించాడు. ఊరేగింపు ముందుకు సాగి కొంత సేపటికి పెళ్ళికూతురు ఇల్లు చేరుకున్నది. పెళ్ళి కొడుకు గుర్రంపై నుంచి కిందికి కాలుమోపి దిగడానికి వీలుగా, ఇద్దరు సేవకులు చిన్న మెత్తను తెచ్చివేశారు. వాన్‌క్యూన్‌, దాన్ని దూరంగా తీసివేస్తూ, ‘‘చూడండి, అవి ఎంతమెత్తగా ఉన్నాయో! మా యజమాని కాలు జారితే మరేమన్నా ఉందా. వెళ్ళి చెక్కబల్ల తీసుకు రండి,’’ అన్నాడు.

ఒక సేవకుడి దుందుడుకు ప్రవర్తనకు, జిన్‌హో, అతని తండ్రి, పెళ్ళికూతురు తండ్రితో సహా అక్కడవున్న వారందరూ విస్తుపోయారు. అయినా, సేవకులు వెళ్ళి కొయ్యబల్ల తెచ్చి వేయడంతో వాన్‌క్యూన్‌ చేయి అందివ్వగా, పెళ్ళికొడుకు గుర్రం పైనుంచి, కొయ్య బల్లపై అడుగు మోపి కిందికి దిగాడు. పెళ్ళికొడుకు బృందం అలంకరించబడిన ఉద్యానవనంలోకి చేరింది. అందమైన దుస్తులతో ఆభరణాలతో అలంకరించిన పెళ్ళి కూతురు మిన్‌జీని వేదిక మీదికి తీసుకువచ్చారు. పెళ్ళి ఘనంగా జరిగింది. విందు భోజనాలు ఏర్పాటయ్యాయి. అవి ముగిశాక, పెళ్ళికొడుకూ కూతురూ పడక గదికి చేరడానికి ముందే, వాన్‌క్యూన్‌ పెద్ద కత్తితో లోపలికి వెళ్ళాడు. పడక మీది పట్టుపరుపులను తొలగించి, వాటి కింద దాక్కునివున్న సర్పాన్ని తెగనరికాడు.

అంతలో అందరూ అక్కడికి చేరారు. ఆ దృశ్యాన్ని చూసిన జిన్‌హో, ‘‘నాన్నా, వాన్‌క్యూన్‌ మన ప్రాణాలు కాపాడాడు!’’ అన్నాడు కృతజ్ఞతతో. మరునాడు జిన్‌హో పెళ్ళికూతురును వెంటబెట్టుకుని తన పరివారంతో స్వగృహానికి తిరిగివచ్చాడు. విందు జరుగుతున్న సమయంలో, వాన్‌క్యూన్‌ జిన్‌హోను సమీపించి, నిన్నటి తన వింత ప్రవర్తనకుగల కారణాన్నీ, సంచీలోని దయ్యాల గురించీ చెప్పాడు. అంతావిన్న పెళ్ళికూతురు భర్తతో, ‘‘జిన్‌హో! ఈరోజు నుంచి నువ్వు నాకు ఆ కథలు చెప్పు. ఒక్కొక్క దయ్యంగా వదిలిపెడదాం,’’ అన్నది సంతోషంగా. స్వస్తి. 

వివేకానందుడు ఒక కథ చెబుతుండేవాడు



 వివేకానందుడు ఒక్క వాక్యం, కేవలం ఒక్కటంటే ఒక్క వాక్యంతో  ఒక వ్యక్తిలో, ఓ సమూహంలో, కొన్ని దేశాలకి, ప్రపంచానికే ధైర్యం నింపగల ధీరుడు, ఇతను మన భారతీయుడు అని సగర్వంగా చెప్పుకోవచ్చు, ఇప్పుడు ఎలాంటి వాళ్ళకయినా ఓ మాట చెప్తున్నాము , కొన్ని రోజులు వివేకానందుడు సూక్తులు, కథలు చదవండి. మొదటలో మామూలుగా అనిపించొచ్చు, చదవటం అలవాటు తక్కువగా కనుక ఉండుంటే అలానే అనిపిస్తుంది కూడా, కానీ నమ్మకంతో అలా కొన్ని రోజులు కొనసాగించండి. ఇతనప్పుడు మీకు వ్యసనం అవుతాడు, బాగు పరిచే వ్యసనం అవుతాడు. ఇప్పుడు మీకోసం వివేకానందుడు చెప్పిన ఒక గొప్ప కథని తీసుకొచ్చాం. ఒకసారి చదివి అతని భావాలని హత్తుకోండి, జీవితాంతం మిమ్మిల్ని గెలిపించేందుకు అలా మీ గుండెల్లో ఒదిగిపోతాడు..

వివేకానందుడు ఒక కథ చెబుతుండేవాడు

ఒక రైతు దగ్గర ఒక ముసలి గాడిద ఉండేది.
ఒకరోజు దారి సరిగా కనబడక పాడుబడ్డ నూతిలో పడిపోయింది.
రైతు ఆ గాడిదను పైకి తీసే ప్రయత్నం చేశాడు. కుదరలేదు. ‘‘ఇది ముసలిదైపోయింది.
ఎక్కువ కాలం ఉపయోగపడదు. దీన్ని కష్టపడి పైకి తీసే కన్నా, నేను మరో బలమైన గాడిదను తెచ్చుకోవడం మేలు.
అది కూడా దీనిలాగా ఈ బావిలో పడిపోతే మళ్లీ మరో గాడిద కొనుక్కోవాలి.
ముసలి గాడిద ఎటూ పడిపోయింది కనుక,
దీనిని మట్టితో కప్పేస్తే అప్పుడు బావి కూడా పూడిపోతుంది కనుక కొత్త గాడిద పడే సమస్య ఉండదు’’ అనుకుని చుట్టుపక్కల రైతులను పిలిచాడు.
తలా ఒక తట్ట మట్టి తెచ్చి పోస్తున్నారు.
యజమాని వైఖరికి లోపలున్న గాడిద ఖిన్నురాలైపోయి ఎంత దారుణం అనుకుంది.
ఒక్క క్షణం ఆలోచించింది. ఇక నేను నా గురించి ఆలోచిస్తాను.
తప్పుకునే మార్గాన్ని చూసుకుంటాను అనుకుంది.
ఒకసారి సంకల్పం చేసుకున్నాక ధైర్యం వచ్చి లోపల గోడకు బాగా దగ్గరకు వెళ్లి నిలబడింది.
పైనుంచి మట్టి పోస్తున్నారు. తనమీద పడిన దాన్ని దులుపుకుంటున్నది.
పక్కన పడ్డ మట్టి ఒక దిబ్బగా మారగానే దాని మీదకు చేరుతున్నది.
అలా లోపల మట్టి లెవల్ పెరిగే కొద్దీ అది కూడా పైకి జరుగుతూ బావి పైఅంచు దగ్గరకు రాగానే ఒక్కసారి శక్తి కూడదీసుకుని బావి బయటకు దూకి పారిపోయింది.
ధైర్యంగా కష్టాన్ని ఎదుర్కోలేకపోయి ఉంటే, ఆ గాడిద కూడా ఒక అవశేషంగా మిగిలిపోయి ఉండేది.

స్వామి వివేకానంద యువకులకు ఈ కథ చెబుతూ ‘‘భీరువులై (పిరికివారై) బతక్కండి, ధైర్యంగా నిలబడి కష్టాన్ని ఎదుర్కోండి’’ అని చెప్పేవారు

BHEEM APP - ‘భీం’యాప్‌ ఎలా వాడాలి!



BHEEM APP  - ‘భీం

సంచలనం సృష్టిస్తున్న సర్కారీ యాప్‌ BHEEM app

ఒక్కో బ్యాంకుకు ఒక్కో యాప్‌ వాడుతాం. ఒక్కో ఖాతాకు ఒక్కో యూపీఐ చిరునామా సృష్టిస్తాం. కానీ.. చివరకు అంతా గందరగోళం. ఏ యూపీఐ ఏ బ్యాంకుదో.. ఏ యాప్‌కి ఏ పిన్‌ పెట్టామో గుర్తుండదు. ఇప్పటికే చాలా మందికి ఇలాంటి అనుభవాలు ఎదురై ఉంటాయి. పైగా కొన్ని బ్యాంకులు ఇంకా యూపీఐ ఫీచర్‌ను అందుబాటులోకి తేలేదు. ఇలా మొబైల్‌ బ్యాంకింగ్‌కి సంబంధించి ఒక్కొక్కరూ ఒక్కో విధంగా ఇబ్బందిపడే ఉంటారు. వీటికి పరిష్కారమే భీం యాప్‌. జాతీయ చెల్లింపుల సంస్థ అభివృద్ధి చేసిన ఈ యాప్‌ను వినియోగించడం చాలా సులభం. అందువల్లే ఈ యాప్‌.. విడుదలైన వారంలోపే గూగుల్‌ ప్లేస్టోర్‌లో టాప్‌లో నిలిచింది. కొన్ని లక్షల మంది దీనిని డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నారు. ఈ యాప్‌ ద్వారా లావాదేవీలూ ఊపందుకున్నాయి. ఇప్పుడు రోజుకు 70000 లావాదేవీలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో ఈ సంఖ్యను మరింత పెంచాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం కేవలం డబ్బుల లావాదేవీలకే పరిమితమైన ఈ యాప్‌ను భవిష్యత్తులో వాలెట్‌లాగా కూడా మార్చాలని ప్రభుత్వం అనుకుంటోంది. అలా మారిస్తే ఈ యాప్‌ నుంచే డబ్బులు పంపడంతో పాటు.. ఆన్‌లైన్‌లో వస్తువులను కొనుగోలు చేయొచ్చు. సేవలకు రుసుములు చెల్లించొచ్చు. బిల్లులూ కట్టొచ్చు. దీంతో ఈ యాప్‌లో ప్రత్యేకత ఏంటో.. ఆసక్తి నెలకొంది

ఎలా వాడాలి!
ఈ యాప్‌ ప్రస్తుతం ఆండ్రాయడ్‌ ఫోన్లకే పరిమితం. ఈ నెల 10వ తేదీలోపు ఐవోఎస్‌, విండోస్‌ ఫోన్లకు కూడా అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు. ఈ యాప్‌ నెట్‌ లేకుంటే పని చేయదు
ప్లేస్టోర్‌లోకి వెళ్లి భీం (బీహెచ్‌ఐఎం) పేరిట ఉన్న యాప్‌ను మీ స్మార్ట్‌ ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి.
 యాప్‌లో వచ్చే సూచనలు పాటించి పిన్‌.. యూపీఐ పిన్‌ సృష్టించుకోవాలి
సులభంగా అనుసంధానం
ఈ యాప్‌తో మీ ఖాతాకు అనుసంధానం కావడం చాలా సులభం. మీ బ్యాంకు వివరాలు, బ్రాంచ్‌ కోడ్‌లు ఇక్కడ నమోదు చేయాల్సిన అవసరం లేదు. మీ ఖాతా ఉన్న బ్యాంకును ఎంపిక చేసుకుంటే చాలు ఆ బ్యాంకులో మీ ఖాతాకు ఈ యాప్‌ అనుసంధానమవుతుంది. మీరు ఎవరికైనా డబ్బులు పంపినా.. ఎవరి నుంచైనా డబ్బులు తీసుకున్నా ఈ ఖాతా ద్వారానే సాధ్యమవుతుంది. ఒకవేళ ఈ ఖాతా అవసరం లేదు.. మరో బ్యాంకు ఖాతాకు అనుసంధానం అవుదామనుకుంటే.. యాప్‌లో మొదట ఉన్న ఖాతాను తొలగించి.. కొత్త ఖాతాను యాడ్‌ చేసుకోవచ్చు. ప్రస్తుత్య ఒక్కసారి ఒక ఖాతాకే అనుసందానం కాగలం. వీురు ఇలా ఖాతాకు నుసందానవెుౖన వెంటనే మీవెుుబైల్‌ నంబరు పరిట ఒక యఐ చిరునామాూ వస్తుంది.

యుూపీఐ
ఈ యాప్‌ నుంచి డబ్బులు పంపాలంటే ముందుగా యుూపీఐ పిన్‌ను జనరేట్‌ చేసుకోవాలి. యాప్‌లో బ్యాంక్‌ అకౌంట్‌ వద్దకు వెళ్తే రీసెట్‌ యుూపీఐ పిన్‌ అనే ఆప్షన్‌ ఉంటుంది. దాన్ని క్లిక్‌ చేసి సదరు బ్యాంకు డెబిట్‌ కార్డు వివరాలు నమోదు చేసి పిన్‌ను క్రియేట్‌ చేసుకోవాలి.

ఎంత వరకు సేఫ్!
ఇప్పటి వరకు ఉన్న బ్యాంక్‌ యాప్‌లలో ఇది చాలా సఫ్‌ని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. వీురు యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసిన వెంటనే వెుుబైల్‌ ఐడీ, నంబరును ఇది సర్వర్‌కు పంపుతుంది. వీురు నవెూదు చేసుకున్న తర్వాత సాదారణ పాస్‌వర్డ్‌, యుూపి్‌ క్రియేట్‌ చేసుకోవాలి. మీ మెుబైల్‌ను ఎవరైనా చోరీ చేసేఈ రెండు పాస్‌వర్డ్‌లు తెలిసేనీ యాప్‌ను వాడలేరు. ఒక పాస్‌వర్డ్‌ను బ్రేక్‌ చేసినా.. మరో పాస్‌వర్డ్‌ను బ్రేక్‌ చేయడం కష్టం. పాస్‌వర్డ్‌లు పదే పదే తప్పుగా ఎంటర్‌ చేసినపుడు లాక్‌ చేసే ఫీచర్‌ ఉంటే మరింత సురక్షితంగా ఉండేది.

ప్రత్యేకతలు
అన్ని బ్యాంకులకూ ఒకేయాప్‌ యూపీఐ, క్యూఆర్‌ కోడ్‌ ఫీచర్‌ మొబైల్‌నంబరుఅనుసంధానమైతే చాలు
ఇంటర్‌ఫేస్‌చాలాసులభంగాఉండటం  ఎన్ని బ్యాంకులైనా నిర్వహించుకొనే వీలు ఏ బ్యాంకు నుంచి ఏ బ్యాంకుకైనా నగదు బదిలీ దుర్వినియోగం కాకుండా అధిక భద్రత మొబైల్‌ నంబరే యూపీఐ చిరునామ
డౌన్‌లోడ్‌ ఇలా
ప్రధాని మోదీ భీం యాప్‌ను అలా ఆవిష్కరించారో లేదో.. ప్లేస్టోర్‌లో పదుల సంఖ్యలో నకిలీ భీం యాప్‌లు వచ్చేశాయి. దీంతో అసలు భీం యాప్‌ ఏదో తెలుసుకోవడం చాలా మందికి కష్టంగా మారింది. భీం (బీహెచ్‌ఐఎమ్‌) దాని కింద నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ అనే ఉన్న యాప్‌నే డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.
డబ్బులెలా పంపాలి
ఈ యాప్‌లో స్కాన్‌ అండ్‌ పే ఆప్షన్‌ ఉంది. మీరు యాప్‌ ఓపెన్‌ చేసినపుడు మీ కోసం ఒక క్యూఆర్‌ కోడ్‌ను ఇస్తుంది. దాన్ని అవతలి వారికి పంపితే.. వారు స్కాన్‌ చేసి మీకు డబ్బులు చెల్లించొచ్చు. ఇక యూపీఐ ద్వారా కూడా మీరు ఇతరులకు ఈ యాప్‌ నుంచి చెల్లింపులు చేయొచ్చు. యూపీఐ లేని ఖాతాదారులకు డబ్బులు పంపాలంటే ఐఎ్‌ఫఎస్సీ, ఖాతా నంబరు వివరాలను ఎంటర్‌ చేసి పంపొచ్చు 
ASK 'DOUBTS' in Comment Box

అబ్దుల్ కలాం గారి చిన్నప్పటి ఒక సంఘటన:



 అబ్దుల్ కలాం గారి చిన్నప్పటి ఒక సంఘటన:

ఒకరోజు పగలంతా ఎక్కువగా పని ఉండటంతో
అబ్దుల్ కలాం గారి వాళ్ళమ్మ బాగా అలసిపోయింది.
🔸ఆ రోజు రాత్రి వంట పూర్తయిందనీ...........,
భోజనానికి రమ్మని....... ఆమె పిలవడంతో
అబ్దుల్ కలాం గారు, తన తండ్రితో కలిసి భోజనం
చేయడానికి సిద్దపడ్డారు.
🔸తన తండ్రి ముందు ఒక ప్లేట్ లో పెట్టిన
రొట్టెలు బాగా మాడిపోయి ఉండటాన్ని చూసిన
అబ్దుల్ కలాం గారు, ఆయన వాటిని తినే ముందు
తన తల్లిని ఏమైనా కోప్పడతారేమోనని............,
మౌనంగా అలాగే చూస్తూ ఉండిపోయారు.
🔸కానీ ఆయన ఆ రొట్టెలను తిని........., ఆమెను
ఏమీ అనకుండా లేచి వెళ్ళిపోయాడు.
🔸కొద్దిసేపటికి ఆమె, తన భర్త దగ్గరకు
వెళ్ళి........ రొట్టెలు మాడిపోయినందుకు
క్షమించమని.......కోరింది.
వెంటనే ఆయన, “ నాకు మాడిపోయిన రొట్టెలంటే
చాలా ఇష్టం..... అని ఎంతో ప్రేమగా ఆమెతో
అన్నారు.
🔸ఇదంతా గమనించిన అబ్దుల్ కలాం గారు,
కొద్దిసేపటి తర్వాత తన తండ్రి దగ్గరకు వెళ్ళి
మీకు నిజంగా మాడిపోయిన రొట్టెలు అంటే అంత
ఇష్టమా.....? అని అడిగారు.
🔸ఆయన అబ్దుల్ కలాం గారి తల నిమురుతూ......,
మీ అమ్మ పగలంతా కష్టపడి ఎంతో
అలసిపోయింది.
🔸అంత అలసటలో కూడా విసుగు
లేకుండా వంట చేసింది.
🔸ఒక్కపూట మాడిపోయిన రొట్టెలు తింటే మనకేమీ
కాదు.
🔸 కానీ ఆ రొట్టెలు మాడిపోయాయని
విమర్శిస్తే........, ఆమె మనసు ఎంతగానో బాధ
పడుతుంది.
🔹అలా బాధ పెట్టడం నాకిష్టం లేదు.
🔸జీవితంలో ఎవరైనా కొన్ని సందర్భాలలో పొరపాట్లు
చేయడం సహజం.
🔸ఆ పొరపాట్లను ఆధారంగా చేసుకొని విమర్శించడం
మంచిది కాదని........ఆయన అన్నారు.
🔹ఈ సంఘటన ద్వారా అబ్దుల్ కలాం గారు చెప్పిన
విషయం,
ఎదుటివారు చేసిన పొరపాట్లను చూసి తొందరపడి
విమర్శించి వారి మనసులను బాధ పెట్టకండి.
🔹బంధాలను బలపరుచుకుంటూ జీవితాలను
కొనసాగించండి   
.