Pages

Monday, January 16, 2017

తెలంగాణాలో దర్శనీయ ప్రదేశాలు:: Tourism Places in Telangana



తెలంగాణాలో దర్శనీయ ప్రదేశాలు:: Tourism Places in Telangana


తెలంగాణాలో దర్శనీయ ప్రదేశాలు:: Tourism Places in Telangana
 కొమ్మాల:-   వరంగల్‌కు 40 కి.మీ. దూరంలో ఉంది. ఈ కొమ్మాల తీర్థం పాండవులు తపస్సు చేసిన ప్రాంతం. ఈ గ్రామంలోని ఒక గుట్టుకు పాండవుల గుట్ట అని పేరు. దీనిపై కోనేరు ఉంది.
లక్నవరం చెరువు:-ములుగు నుంచి ఏటూరు నాగారం వెళ్లే మార్గంలో వరంగల్‌కు 70 కి.మీ. దూరంలో ఈ చెరువు ఉంది.
 రామప్ప చెరువు:-

ఈ చెరువు పాలంపేట రామప్ప ఆలయం దగ్గర్లో ఉంది. కాకతీయ గణపతి దేవుని కాలంలో (1213లో) రేచర్ల రుద్రుడు నిర్మించాడు. కాకతీయ ప్రభువులు ఆలయం సమీపంలోనే చెరువు ఉండాలన్న సంప్రదాయాన్ని పాటించేవారు. అందుకే  రామప్ప చెరువును తవ్వించారు. ఈ చెరువు ప్రాంతంలో ప్రకృతి సౌందర్యం ఉట్టిపడుతుంది.

ఘనపురం ఆలయాలు:

పాలంపేటకు 8 కి.మీ. దూరంలో కాకతీయుల కాలానికి చెందిన 22 దేవాలయాలు ఉన్నా యి. ప్రధాన ఆలయం శైవాలయం. రామప్ప దేవాలయం నిర్మాణం జరిగిన కొంతకాలానికి ఈ ఆలయాన్ని నిర్మించారు. గ్రామం చివర రెడ్డి గుడి అనే దేవాలయం ఉంది.

 ఘనపురం తటాకం

ములుగు తాలూకాలో ఉంది. ఇక్కడ అనపోతుని శాసనం కలదు. ఇక్కడ ఎండాకాలంలో చల్లని నీరు ప్రవహిస్తూ, వర్షాకాలంలో నీరు ప్రవహించదు.

 కొమరవెల్లి

జనగామకు 13 కి.మీ. దూరంలో వీరశైవ మతకేంద్రం ఉంది. ఇక్కడ మట్టితో చేసిన 4 అడుగుల విగ్రహం ఉంది. 4 చేతులలో త్రిశూలం, నాగాస్త్రం, ఒక పాత్ర ఉన్నాయి. ఇక్కడి ప్రధాన దైవ కొమరెల్లి మల్లన్న.

 పాకాల చెరువు

ఈ చెరువు విహార సరస్సు. దీని నుంచి 5 పంట కాలువలు కలవు. వరంగల్‌కు 70 కి.మీ దూరంలో పచ్చటి చెట్లు పెరిగిన గుట్టల మధ్య ఈ చెరువు ఉంది. కాకతీయ గణపతి దేవుడు ఈ చెరువును తవ్వించినట్టు చెబుతారు. పాకాల చెరువు చుట్టూ 9 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పాకాల వన్యమృగ అభయారణ్యం ఉంది. శీతాకాలంలో వలస వచ్చే పక్షులతో పాటు పెద్ద పులులు, చిరుతలు, జింకలు కూడా అందులో ఉన్నాయి. మున్నేరు వాగు ఈ సరస్సుకు ఆధారం.

 పెంబర్తి
:కాకతీయులు తమ రథాలను, ఆలయాలను అలంకరించుకోవడానికి దళసరి రేకును విరివిగా ఉపయోగించేవారు. ఈ అలంకరణ అనేది ఒక కళ. కాకతీయ సామ్రాజ్యం క్షీణించిన తర్వాత ఈ కళ పతనమైంది. అయితే నిజాం నవాబుల కాలంలో ఈ కళను పునరుద్ధరించారు. వరంగల్‌కు 60 కి.మీ. దూరంలోని పెంబర్తి కళాభిమానులు తప్పక సందర్శించే ప్రాంతం.

 ఏటూరి నాగారం

వరంగల్‌కు దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో, గోదావరి తీరాన అభయారణ్యం ఉంది. అందులో తేళ్లు, పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు ఉన్నాయి. చుట్టూ చిన్నచిన్న గుట్టలతో, పచ్చని చిట్టడవులతో ఈ అభయారణ్యాన్ని చూసినా కొద్దీ చూడాలనిపిస్తుంది. ఏటూరి నాగారం సమీపంలోని తాడ్వాయ్‌లోనూ అటవీశాఖ కాటేజీలను నిర్వహిస్తుంది. ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి అక్టోబర్-మే నెలల మధ్యకాలం అనువైనది.

తాటికొండ

: ఘన్‌పూర్ రైల్వే స్టేషన్‌కు 7 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ రెండు కోటలు ఉన్నాయి. దీన్ని సర్దార్ సర్వాయి పాపన్న కట్టించాడని ప్రతీతి.

 పాలకుర్తి

 ఈ గ్రామం ఘనపురం రైల్వే స్టేషన్ నుంచి 29 కి.మీ. దూరంలో ఉంది. పాలేరు............. వాగు ఇక్కడి నుంచే పుడుతుంది. అందుకే పాలకుర్తి అనే పేరు వచ్చింది. ఇక్కడ నరసింహ స్వామి ఆలయం ఉంది. దీనికి సోమనాథాలయం అనే పేరు వచ్చింది. వీరశైవ మతవాది అయిన కవి పాలకుర్తి సోమనాథుడు

శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం - వేములవాడ:*

కరీంనగర్‌కు 35 కి.మీ. దూరంలో కలదు. ఇక్కడ ధర్మ కుండం అనే కోనేరు ఉంది. వేములవాడ చాళుక్యరాజు రాజాధిత్యుడు ఈ ఆలయ నిర్మాత. అర్జునుడి మనుమడు నరేంద్రుడు నిర్మించాడనేది స్థల పురాణం. ఈ ఆలయంలో 22 శివ లింగాలున్నాయి. అందులో రామాలయం, మహిషాసురమర్దని ఆలయం, కాశీ విశ్వనాథాలయం చూడదగినవి.

 కాళేశ్వరం

: గోదావరి ఉపనది కాళేశ్వరం కలిసేచోట ఉంది. స్కాంద పురాణంలో దీని ప్రస్తావన కలదు. ఇక్కడి శిల్పాలపై బౌద్ద-జైన శిల్ప రీతుల ప్రభావం కనిపిస్తుంది. వేంగిరాజు విష్ణువర్ధనుడు ఈ ప్రాంతాన్ని జయించినట్లు ఆధారాలున్నాయి. ఆయన దండయాత్ర నాటికి నగరంలో 26 కోనేరులు ఉండేవట. కాకతీయ ప్రోలరాజు బంగారంతో తులాభారం తూగి, దాన్ని స్వామికి ఇచ్చాడని స్థానికుల అభిప్రాయం. ఇక్కడి ముక్తేశ్వరాలయంలో 2 శివలింగాలుండటం విశేషం. ముక్తేశ్వర స్వామి లింగంలో 2 రంధ్రాలుండటం మరో విశేషం. ఇక్కడ బ్రహ్మకు గుడికట్టారు. 1246 నాటి కాకతీయ గణపతి దేవుని శాసనం ఇక్కడుంది.

 ధర్మపురి:

 కరీంనగర్‌కు 65 కి.మీ. దూరంలో ఉంది. దేశంలోని 108 పుణ్యక్షేత్రాల్లో ధర్మపురి ఒకటి. దీనికి దక్షిణ కాశీ అని పేరు.

రామగిరి దుర్గం:

 కరీంనగర్‌కు 40 కి.మీ. దూరంలో బేగంపేట గ్రామం వద్ద ఉన్న ఎత్తైన పర్వతాన్ని రామగిరి అంటారు. 
తెలంగాణలోనే అతిపెద్ద శత్రుదుర్భేద్యమైన కోట ఇక్కడ ఉంది. ఇక్కడి సీతారామాలయం దగ్గర్లో పాండవ లంక ఉంది.

నాగనూరు కోట:

 ఇది కాకతీయుల నిర్మాణం. కరీంనగర్‌కు 8 కి.మీ. దూరంలో ఉంది. కోటలో 3 ఆలయాలు ఉన్నాయి.

 వరాహస్వామి ఆలయం 

కమాన్‌పూర్ మండల కేంద్రంలో ఉంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో రెండేరెండు వరాహస్వామి ఆలయాల్లో ఇది ఒకటి. బండపై చెక్కిన విగ్రహం వెంట్రుకలు కనిపించడం విశేషం. స్థల పురాణం ప్రకారం 600 సంవత్సరాల చరిత్ర ఉంది. 
కరీంనగర్‌కు 60 కి.మీ. దూరంలో ఉంది.

 కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం

: 400ల ఏండ్ల క్రితం కొడిమ్యాల పర్గణాలో సింగం సంజీవుడనే యాదవ కులస్థుడు స్థాపించాడు. ఇక్కడి విగ్రహం రెండు ముఖాలతో (నారసింహస్వామి ముఖం, ఆంజనేయస్వామి ముఖం) ఉండటం విశేషం.

 కొత్తకొండ కోర మీసాల స్వామి:

భీమదేవరపల్లి మండలం, కొత్తకొండలో ఉంది. ఇది ఉత్తర తెలంగాణలోనే ప్రసిద్ధమైన వీరభద్ర క్షేత్రం.

 మత్స్యగిరీంద్రుడు:

 13వ శతాబ్దంలో కాకతీయుల కాలంలో మత్స్య గిరీంద్రుని ఆలయాన్ని నిర్మించారు. ఇది కరీంనగర్‌కు 30 కి.మీ. దూరంలో ఉంది.

 మంథని:

 మంథని అంటే వేద విద్యలకు పుట్టినిల్లు. ఇక్కడ లక్ష్మీనారాయణ, ఓంకారేశ్వర, మహాలక్ష్మి అమ్మవార్ల ఆలయాలతోపాటు జైన, బౌద్ద మతాల ఆలయాలు ఉన్నాయి.

 బాసర:

బాసరలో జ్ఞాన సరస్వతీ దేవాలయం ఉంది. బాసరను వ్యాసపురి అని కూడా అంటారు. ఇది గోదావరి తీరంలో ఉంది.

 బాసరకు పేరు

 - వ్యాసుడు తపస్సు చేసి సరస్వతీదేవిని ప్రతిష్టించినందుకు వ్యాసర అనే పేరు వచ్చింది. వ్యాసర క్రమంగా బాసర అయింది. బాసర ఆలయం దేశంలోనే రెండో అతిపెద్ద సరస్వతి దేవాలయం (మొదటిది జమ్ముకశ్మీర్‌లో ఉంది.).

నాగోబా ఆలయం

: ముట్నూరుకు దగ్గరలో కేస్లాపూర్ గ్రామంలో ఉంది. నాగోబా అంటే సర్ప దేవత. వేలమంది గిరిజనులు నాగుల చవితి సందర్భంలో ఇక్కడ మహా ఉత్సవం చేస్తారు.

 అగస్త్యేశ్వరాలయం

: గోదావరి తీరంలో అగస్త్యుడు తపస్సు చేసిన ప్రాంతం. చెన్నూరులో ఉన్న ఈ ఆలయాన్ని ఉత్తర వాహిని అంటారు. ఇది అతి ప్రాచీన ఆలయం. 1289లో కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు ఈ ఆలయాన్ని పునర్‌నిర్మించాడు. అల్లాఉద్దీన్ ఖిల్జీ సేనాని మాలిక్ కపూర్ ఈ ఆలయంపై దాడిచేసి ధ్వంసం చేశాడు. శ్రీ కృష్ణ దేవరాయలు ఈ ఆలయాన్ని పునరుద్ధరించినట్లుగా ఇక్కడి తెలుగు కన్నడ భాషా లిపిలో ఉన్న శాసనం చెబుతుంది. ఇక్కడ గోదావరి నది ఉత్తరంగా ప్రవహిస్తుంది. ఈ ఆలయంలోని అఖండ జ్యోతి 400 ఏండ్లుగా వెలుగుతూనే ఉందని స్థానికులు చెబుతారు.

 జైనాద్ ఆలయం

ఆదిలాబాద్‌కు 21 కి.మీ. దూరంలో ఉంది. ఈ ప్రాంతాన్ని పల్లవ రాజులు పాలించారు. ఇక్కడ శ్రీ లక్ష్మీ నారాయణస్వామి ఆలయం జైన మందిరాన్ని పోలి ఉంది.

 సిరిచెల్మ సోమేశ్వరాలయం:

 ఇచ్చోడకు 14 కి.మీ. దూరం లో ఉంది. 7వ శతాబ్దానికి చెందిన సోమేశ్వరాలయంలో శైవ, వైష్ణవ, జైన, బౌద్ధ మత శిల్ప సంపద కలదు. ఇక్కడ శ్రీ కృష్ణ దేవరాయలు భార్యతో కలిసి అర్చన చేసినట్లుగా శాసనాధారం.

 నిర్మల్:

 దీని చుట్టూ దుర్గం కలదు. పూర్వం వెలమ రాజుల పాలనలో ఉండేది. ఇక్కడ మహదేవ మందిరం ఉంది.

 కన్విట్ తాలూకాలోని మహుర గొప్ప చారిత్రక స్థలం

. ఇక్కడ ప్రాచీన రేణుకాదేవి మందిరం ఉంది. ఈమెను ఏకవీరాదేవి అంటారు.


ఇతర చూడదగిన ప్రాంతాలు:

1. రామకృష్ణాపురంలోని గాంధర్వ కొండ, పోచమ్మ ఆలయం,

2. కుంటాలలోని సోమేశ్వరాలయం,

3. సిరిసిల్లలోని వేంకటేశ్వరాలయం,

4. బెల్లంపల్లిలోని బుగ్గరామేశ్వరాలయం, నిర్మల్‌లోని మహదేవాలయం.

 ఏడు జలపాతాలు: 

బోధ్ నియోజకవర్గంలో 15 కి.మీ. పరిధిలో 7 జలపాతాలు కలవు. అవి:1. కుంటల 2. పొచ్చెర 3. లఖంపూర్ 4. గాజిలి 5. పొచ్చెల పాలధార 6. ఘన్‌పూర్ జలపాతం 7. కనకాయి జలపాతం........

 జమలాపురం

(తెలంగాణ తిరుపతి): ఇది ఎర్రుపాలెం (మం)లో ఉంది. వేంకటేశ్వరస్వామి దేవాలయం సూదిబోడపై కలదు. స్థల పురాణం ప్రకారం ఇక్కడి రెండు గుహలలో ఒకటైన వైకుంఠ గుహలో జాబాలి మహర్షి తన శిష్యులకు వేదం నేర్పాడని కథనం. మరొక గుహ పేరు కైలాస గుహ. ఈ దేవాలయాన్ని కాకతీయుల కాలంలో కట్టిఉండొచ్చని చరిత్రకారుల అభిప్రాయం.

 శ్రీ బాలజీ
 వేంకటేశ్వరస్వామి: అన్నపురెడ్డిపల్లిలో ఉంది. ఇది ఖమ్మం జిల్లాలోని అతిపెద్ద దేవాలయాల్లో ఒకటి. అన్నపు రెడ్డి అనే కాకతీయ సేనాపతి నిర్మించిన ఆలయాన్ని 1870లో వెంకటప్పయ్య పునర్‌నిర్మించాడు. మీర్ మహబూబ్ అలీఖాన్ అనే సుల్తాన్ పాలనా కాలంలో కాళ్లూరి వెంకటప్పయ్య మైసూరు ప్రాంతం నుంచి వలస వచ్చి దేవాలయాన్ని నిలబెట్టాడు.

నీలాద్రి ఆలయం:

 దీన్ని కాకతీయుల కాలంలో నిర్మించారు. ఇది 1996 -97 సంవత్సరాల మధ్య దట్టమైన అడవుల నుంచి బయటపడింది. ఇక్కడ శివరాత్రి ఉత్సవం బాగా జరుగుతుంది. ఇక్కడ ఉన్న జెండా గుట్ట కాకతీయుల విజయాన్ని తెలుపుతుంది.

 రామాలయం

(వనం కృష్ణాలయం): ముదిగొండ (మం) వనం కృష్ణరాయలు కట్టించినందున ఈ ఆలయానికి ఆ పేరు వచ్చింది.

 కూసుమంచి శివాలయం:

 ఇది కాకతీయుల కళా నైపుణ్యానికి నిదర్శనం. ఈ ఆలయం చుట్టూ నిర్మించిన కళా ఖండాలు రమణీయమైనవి.             

No comments:

Post a Comment

.