మీకు ‘ఆధార్’ ఉందా? లేకుంటే త్వరపడండి.. ఎందుకంటే..?
🌍ఆధార్ కార్డు కనుక మీకు లేకుంటే త్వరపడండి. లేదంటే భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇకముందు 12 అంకెల ఆధార్ నంబరు యూనివర్సల్ పేమెంట్ ఐడీ కానుంది. భారత్ ఇంటర్‌ఫేస్ ఫర్ మనీ(బీహెచ్ఐఎం) యాప్ ద్వారా ఇక ముందు జరిగే లావాదేవీలకు ఆధార్ నంబరు కీలకంగా మారనుంది.
🌍భీం యాప్‌లో ఆధార్ నంబరును పేమెంట్ ఐడీగా నమోదు చేసుకున్నాక బయోమెట్రిక్‌తోకానీ, యూపీఐ కోసం బ్యాంకుల్లో ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం కానీ ఉండదు. దేశంలోని మొత్తం బ్యాంకు ఖాతాల్లో మూడొంతుల అకౌంట్లు ఇప్పటికే ఆధార్‌తో అనుసంధానమైన నేపథ్యంలో మరికొన్ని వారాల్లో ‘భీం’ యాప్‌లో ఆధార్ నంబరుతో లావాదేవీలు జరిపేలా సరికొత్త ఆప్షన్‌ను జోడించనున్నారు. దాదాపు 38 కోట్ల మంది తమ బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ను అనుసంధానం చేసుకున్నారని, దీనివల్ల యూపీఐ యాప్ ద్వారా ముందస్తు రిజిస్ట్రేషన్ లేకుండానే డబ్బులను నేరుగా పొందే అవకాశం ఉందని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ అజయ్ భూషణ్ పాండే తెలిపారు.
💠ప్రస్తుతం ‘భీం’ యాప్‌లో మొబైల్ నంబర్, బ్యాంక్ అకౌంట్ నంబరు, ఐఎఫ్ఎస్‌సీ కోడ్ తదితర ఐదు ఆప్షన్లు ఉన్నాయి. త్వరలో రాబోతున్న ఆధార్ నంబరు ఆరో ఆప్షన్ కానుందని పాండే వివరించారు.
No comments:
Post a Comment