Pages

Wednesday, January 4, 2017

సబీర్ భాటియా (పంజాబీ: ਸਬੀਰ ਭਾਟਿਯਾ, హిందీ: सबीर भाटिया)

సబీర్ భాటియా (పంజాబీ: ਸਬੀਰ ਭਾਟਿਯਾ, హిందీ: सबीर भाटिया) (జననం డిసెంబర్ 30, 1968) ఒక భారతీయ అమెరికన్ . ఇతను హాట్ మెయిల్ ఈమెయిల్ సర్వీసు యొక్క సహ-వ్యవస్థాపకుడు. భాటియా ఆస్తుల విలువ 200 మిలియన్ల USD.


🌷జీవిత చరిత్ర🌷

🍀సబీర్ భాటియా భారతదేశంలోని చండీఘర్ లో ఒక హిందూ పంజాబీ కుటుంబములో జన్మించాడు. అతని తండ్రి, బలదేవ్ భాటియా భారత సైన్యంలో అధికారిగా పనిచేసారు, తరువాత ఆయన భారత రక్షణ మంత్రిత్వశాఖలో చేరారు, అతని తల్లి దమన్ భాటియా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక సీనియర్ అధికారిణి. భాటియా బెంగుళూరులోని సెయింట్ జోసెఫ్స్ బాలుర ఉన్నత పాఠశాలలో విద్య నభ్యసించాడు. 1986లో అతను పిలాని లోని బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (BITS) లో తన అండర్ గ్రాడ్యుయేట్ విద్యను ప్రారంభించి BITS లో రెండు సంవత్సరములు గడిచిన తర్వాత కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (కాల్ టెక్) కు బదిలీ చేయబడ్డాడు. కాల్ టెక్ నుండి గ్రాడ్యుయేట్ పట్టా పుచ్చుకున్న తర్వాత సబీర్ ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్ లో M.S. చేయటానికి 1989లో స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయమునకు వెళ్ళాడు. స్టాన్ఫోర్డ్ లో, అతను అల్ట్రాలో పవర్ VLSI డిజైన్ పై పనిచేసాడు.

🍀స్టాన్ఫోర్డ్ లో, అతను స్టీవ్ జాబ్స్ మరియు స్కాట్ మాక్ నీలీ వంటి వ్యవస్థాపకులను చూసి ప్రభావితుడయ్యాడు మరియు చిట్టచివరకు తను కూడా అలా అవాలని నిశ్చయించుకున్నాడు. మాస్టర్స్ తరువాత Ph.D. చేయటానికి బదులు, అతను ఆపిల్ లో చేరాలని నిర్ణయించుకున్నాడు.

🌷హాట్ మెయిల్ వ్యవస్థాపకుడు🌷

🍀సబీర్ భాటియా ఫైర్ పవర్ సిస్టమ్స్ ఇన్కార్పోరేషన్ అనే కొత్తగా ప్రారంభించిన ఒక సంస్థలో చేరి అక్కడ రెండు సంవత్సరములు పనిచేసాడు. 1994లో, సబీర్ ఇంటర్నెట్ కు సంబంధించిన నూతన ఆలోచనల పై పని చేయటం ప్రారంభించాడు మరియు ఆపిల్ కంప్యూటర్, ఇన్కార్పోరేషన్ లో తన సహోద్యోగి అయిన జాక్ స్మిత్ తో జతకట్టాడు.

🍀ఆ ఇద్దరికీ జావా సాఫ్ట్ అనే పేరుతో ఒక వెబ్ - ఆధారిత డేటా బేస్ గురించిన ఆలోచన వచ్చింది. ఈ ఆలోచనను అమలులో పెడుతూ ఉండగా, తత్ఫలితంగా వారు వెబ్-ఆధారిత ఈ-మెయిల్ వ్యవస్థ యొక్క శక్తిని గ్రహించారు. ఆ విధంగా HoTMaiL (మొదటి బడి అక్షరములు HTML లోని వర్ణక్రమాన్ని సూచిస్తాయి— HTML అనేది వెబ్ పేజి యొక్క మూలాన్ని రాయటానికి ఉపయోగించే భాషను రూపొందించాలని నిర్ణయించారు. అందరి దృష్టిని ఆకర్షించటానికి, ఆ ఈ-మెయిల్ సర్వీసు ఉచితంగా అందజేయబడింది మరియు ఆ వెబ్ సైట్ లో ఉన్న ప్రకటనల ద్వారా దానికి రాబడి వచ్చింది. డ్రేపర్ ఫిషర్ వెంచర్స్ ఆ ప్రాజెక్ట్ లో $300,000 పెట్టుబడి పెట్టింది మరియు జూలై 4, 1996న ఆ సర్వీసు ప్రారంభమైంది.

🍀ఆరు నెలల లోపే, ఆ వెబ్ సైట్ ఒక మిలియన్ పైగా చందాదారులను ఆకర్షించింది. వెబ్-ఆధారిత ఈమెయిల్ సౌకర్యము పై ఆసక్తి పెరగటంతో, మైక్రోసాఫ్ట్ చిట్టచివరకు దానిని పరిగణలోకి తీసుకుంది. డిసెంబర్ 30, 1997 (భాటియా యొక్క 29వ పుట్టినరోజు) న $400 మిలియన్లకు హాట్ మెయిల్ మైక్రోసాఫ్ట్ సంస్థకు అమ్మబడింది. ప్రోత్సాహ పారిశ్రామికత్వానికి యునైటెడ్ స్టేట్స్ లో అనుకూలంగా ఉన్న పరిస్థితులకు అతను ఈ ఘనతను ఆపాదించాడు. ఒక ముఖాముఖీలో, అతను "తను భారతదేశంలో ఇప్పటికీ హాట్ మెయిల్ ను సృష్టించలేనని" పేర్కొంటూ భారత ప్రభుత్వాన్ని ఆక్షేపించాడు.

🌷ఇతర కార్యక్రమాలు🌷

🍀హాట్ మెయిల్ ను అమ్మివేసిన తర్వాత, భాటియా ఒక సంవత్సరం పాటు మైక్రోసాఫ్ట్ లో పనిచేసాడు మరియు ఏప్రిల్ 1999లో వేరొక వెబ్ సైట్, ఆర్జూ ఇంక్, ను ప్రారంభించటానికి సంస్థను విడిచిపెట్టాడు. డాట్-కామ్ పొంగు చల్లారినప్పుడు ఆ సంస్థ మూతపడింది. 2010లో, అతను ఆర్జూను ఒక రవాణా పోర్టల్ (ప్రవేశము) గా పునః ప్రారంభించాడు.

🍀అతను (సహ-వ్యవస్థాపకులు షిరాజ్ కంగా మరియు విరాఫ్ జాక్ లతో పాటు) బ్లాగ్ ఎవ్రీవేర్ అనే వెబ్ సైట్ ను ప్రారంభించాడు. ఈ వెబ్ సైట్ వృద్ది చెందుతున్న బ్లాగోస్పియర్ నుండి లాభాలు ఆర్జించాలని ప్రయత్నిస్తోంది.

🍀2006లో, అతను ఒక నెట్వర్క్ సెక్యూరిటీ విక్రేత మరియు SSL VPN-ప్లస్ యొక్క సృష్టికర్త అయిన నియోయాక్సెల్ కు ప్రధాన ముదుపుదారుడు అయ్యాడు.

🍀నవంబర్ 2007లో, అతను మైక్రోసాఫ్ట్ ఆఫీస్ కు ప్రత్యామ్నాయంగా లైవ్ డాక్యుమెంట్స్ అనే ఆన్లైన్ ఆఫీస్ ను విడుదల చేసాడు. ఈ అప్లికేషను వాడుకదారులు వారి డాక్యుమెంట్లను ఆఫ్ లైన్ మరియు ఆన్ లైన్ రెండిటిలోనూ ఉపయోగించుకోవటానికి, రియల్-టైం (ఒక పని జరగటానికి పట్టే వాస్తవ సమయం) లో ఆ డాక్యుమెంట్లను దిద్దుబాటు చేయటానికి, ఇతరులతో కలిసి పనిచేయటానికి, పంచుకోవటానికి మరియు డాక్యుమెంట్లను వివిధ కంప్యూటర్లు మరియు వాడుకదారుల మధ్య సంతులనం చేయటానికి వీలు కల్పిస్తుంది. వాడుకదారులు వారి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్లగ్-ఇన్ కు కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇది ఆఫీసు డాక్యుమెంట్ నమూనాలు అన్నింటికి పూర్తి పొందికతో పాటు, ఆఫ్ లైన్ మరియు ఆన్ లైన్ సమూహములలో ఉత్తమమైన దానిని పొందటానికి వీలు కల్పిస్తుంది.

🍀భారతదేశ గృహములలోని కేబుల్ టెలివిజన్ ద్వారా అంతర్జాలంలోకి ప్రవేశించే అవకాశం కూడా అతను ప్రయత్నించాడు.

🍀జనవరి 2008లో, సబీర్ తన సరికొత్త వ్యాపార సంస్థ SabSeBolo.com ప్రారంభాన్ని గురించి ప్రకటించాడు, ఇది ఒక ఉచిత వెబ్-ఆధారిత టెలీ కాన్ఫరెన్సింగ్ వ్యవస్థ ("సబ్ సే బోలో" అనగా హిందీలో " ప్రతి ఒక్కరితో మాట్లాడదాం" అని అర్ధం). 14 జూన్ 2009న, సబీర్ భాటియా యొక్క సబ్సేబోలో, బయట పెట్టబడని మొత్తానికి ఇంటర్నెట్ టెలీఫోన్ సర్వీసు స్టార్ట్అప్ Jaxtr ను సొంతం చేసుకుంది. Jaxtr అదే వ్యాపార సంస్థ పేరుతో పనిచేస్తుంది మరియు తన అతిపెద్ద వాడుకదారుల జాబితాతో సబ్సేబోలోకి సహాయం చేస్తుంది.

🍀అతని భవిష్యత్తు ఆలోచనలలో భారతదేశంలో నానోసిటీ అనే పేరుతో ఒక కొత్త నగరాన్ని వృద్ధి చేయాలనే ఆలోచన ఉంది. నానో సిటీ యొక్క లక్ష్యం సిలికాన్ వ్యాలీలో కనిపించే స్పందన మరియు నవకల్పనల ఆవరణ-వ్యవస్థను ప్రతిబింబించటం.

🌷వ్యక్తిగత జీవితం🌷

🍀అతను 2008లో బైద్యనాథ్ సంస్థ వారసురాలైన నాగపూరుకు చెందిన, తానియా శర్మను వివాహం చేసుకున్నాడు. వారిద్దరికీ ఒకరితో ఒకరికి ఎనిమిది సంవత్సరముల స్నేహం ఉంది. వారు మలేషియాలోని లాంగ్ కావిలో ఒక వ్యక్తిగత వేడుకలో వివాహం చేసుకున్నారు.

🌷పురస్కారాలు🌷

🍀వెంచర్ కాపిటల్ సంస్థ (సాహస మూలధన సంస్థ) డ్రేపర్ ఫిషర్ జుర్వెట్సన్ నుండి "ఆ సంవత్సరపు అవస్థాపకుడు," పురస్కారం అందుకున్నాడు (1998)

🍀నూతన ఆర్థిక వ్యవస్థలో కొత్త ఒరవడిని సృష్టించిన ఉత్తమమైన పదిమంది వ్యక్తుల యొక్క అప్ సైడ్ పత్రిక జాబితా "ఎలైట్ 100, "లో చేరాడు

🍀రాబోయే కొద్ది సంవత్సరములలో సాంకేతికత పై గొప్ప ప్రభావం చూపుతారని భావిస్తున్న 100 మంది యువ ఆవిష్కర్తలకు MIT ఇచ్చే TR100 పురస్కార గ్రహీత

🍀శాన్ జోస్ మెర్క్యురీ న్యూస్ మరియు POV పత్రికలచే అత్యంత విజయవంతమైన పదిమందిలో ఒకడుగా ఎన్నికయ్యాడు (1998)

🍀TIME చేత అంతర్జాతీయ వ్యాపారములో "గమనించదగిన వ్యక్తు"లలో ఒకడుగా పేరుపొందాడు (2002)                       
[8:12 AM, 12/30/2016] +91 94415 65994: 🌻🌹డిసెంబర్ 30 "రుడ్యార్డ్ కిప్లింగ్" జయంతి సందర్భంగా..... 🌹🌻

🍀రుడ్యార్డ్ కిప్లింగ్ (డిసెంబర్ 30, 1865 – జనవరి 18, 1936) ప్రసిద్ధ ఆంగ్ల రచయిత మరియు కవి. బొంబాయిలో జన్మించాడు. ఈయన రాసిన చాలా కథలను ఆంగ్ల చందమామ పుస్తకంలో ప్రచురితమైనాయి.

🍀 1894 లో ఆయన రాసిన ది జంగిల్ బుక్ అనే కథా సంకలనంతో ప్రపంచవ్యాప్తంగా పాఠకులకు చేరువయ్యాడు. కథా సాహిత్యంలో ఆయన ఒక దార్శనికుడుగా కొనియాడబడ్దాడు. పిల్లల సాహిత్యంలో ఆయన చేసిన కృషి అజరామరమైనది.

🍀సాహిత్యంలో ఆయన చేసిన విశేష కృషికి గాను 1907 లో ఆయనకు నోబెల్ బహుమతి లభించింది. నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి ఆంగ్ల రచయిత ఆయనే కావడం విశేషం. అంతే కాకుండా నోబెల్ బహుమతి నందుకున్న అతి పిన్న వయస్కుడిగా కూడా గుర్తింపు పొందాడు.                      

No comments:

Post a Comment

.