Pages

Showing posts with label నీతి. Show all posts
Showing posts with label నీతి. Show all posts

Wednesday, June 7, 2017

‌MORALITIES అబ్రహం లింకన్ తన కుమారుడి ఉపాధ్యాయుడికి వ్రాసిన లేఖ..

‌MORALITIES అబ్రహం లింకన్ తన కుమారుడి ఉపాధ్యాయుడికి వ్రాసిన లేఖ..

ఈరోజు నుండి నాకొడుకుకి విద్యాలయంలో విద్యాబ్యాసం మొదలవుతున్నది. కొంత కాలం వాడికి అక్కడి పరిస్థితులు అన్ని కొత్తగా వింతగా అనిపిస్తాయి, వాడిని సున్నితంగా చూసుకుంటారనే భావిస్తున్నాను. ఈరోజు వాడికి ఒక సాహసం వంటిది, ఈసాహాసం వాడికి ఖండఖండాంతరాలు తిరిగే అవకాశం ఇవ్వచ్చు. చరిత్రలో సాహసాలు రాజ్యాలనీ, యుద్దలనీ , వేదననీ మాత్రమే మిగిల్చాయి. కానీ జీవితం మీద సాహసం చెయ్యటానికి, ఒక మంచి మనిషిగా మిగలటానికి వాడికి నమ్మకం, ప్రేమ, దైర్యం అవసరం.

ప్రియమైన ఉపాధ్యాయులారా..
నా కొడుకుని మీచేతులలోకి తీసుకుని వాడికి అవసరమైనవన్నినేర్పండి. కానీ సున్నితంగా వాడి మనసుకి అర్థమయ్యేలా. మనుష్యులు అందరూ నీతిమంతులు కారనీ - మనుష్యులు అందరూ సత్యవాదులు కారనీ - వాడు నేర్వాలని నాకు తెలుసు. కానీ ప్రతి నీచుడికి ఒక ఉత్తముడు కూడా ఉంటాడని - ప్రతి స్వార్ధ రాజకీయనాయకుడికి ఒక నిబద్ద నాయకుడు కూడా ఉంటాడని వాడికి భోదించండి. ప్రతి శత్రువుకి ఒక మిత్రుడు కూడా ఉంటాడని వాడికి తెలియపరచండి.ఈర్ష్యకు వాడిని దూరం చెయ్యండి. మాట్లాడే మాట మీద నియంత్రణ, మాటల్లో గొప్పతనం వాడికి నేర్పండి.ఎదుటివారి మీద ఆదారపడి బ్రతకటం కన్నా, సొంత కాళ్ళ మీద నిలబడటం గౌరవం అని భోదించండి. మీవల్లనయితే నిశబ్దపు నవ్వులో రహస్యాన్ని విప్పండి. సాద్యమైతే పుస్తకాలు, వాటి గొప్పతనం వాడు తెలుసుకునేలా చేయండి.

అదే సమయంలో... ఆకాశంలోని పక్షులలో, ఎండలోని తేనటీగల్లో, పచ్చని కొండల్లోని పువ్వులలో ఎడతెగని మర్మాన్ని గ్రహించేటంత నిశబ్ద ఖాళీ సమయాన్ని కూడా వాడికి ఇవ్వండి. ప్రకృతిని వాడు ఆరాధించి, ఆస్వాదించే మనస్సుని పెంచండి.
వంచనకన్న ఓటమి మంచిదని, గొప్పగా ఉంటుందని మీ పాఠశాలలో భోదించండి. దొరికిన 100 రూపాయల కన్నా సంపాదించిన 10 రూపాయలు విలువ ఎక్కువని వాడికి చెప్పండి. వాడికి వచ్చే సొంత మంచి ఆలోచనలపై నమ్మకాన్ని కలిగి ఉండటం నేర్పించండి. వాడి ఆలోచనలు తప్పు అని అందరూ అంటున్నా సరే.

సున్నితస్తులతో సున్నితంగా, మొండివాళ్ళతో మొండిగా ఎలా ఉండాలో నేర్పించండి.
అందరూ వేలంవెర్రిగా ఒకే మందలో చేరి పోతునప్పుడు గుడ్డిగా అనుసరించక ప్రకక్కు నిలబడగలిగి, నిర్ణయించుకోగల సామర్ద్యాన్ని నాకొడుక్కి ఇవ్వండి. ఎవరు ఏది చెప్పిన, వినడాన్నిభోదించండి.అయితే విన్న అన్నిటిని, సత్యపు జల్లెడలో వడకట్టి, పైన నిలిచే మంచి మాత్రమే గ్రహించటాన్ని నేర్పించండి.

మీవల్లనయితే విషాదంలో నవ్వటం ఎలానో భోదించండి. ఓటమిని-గెలుపుని, సుఖాన్ని-ధుఃఖాన్నికూడా సమానంగా ఎలా స్వీకరించి ఆనందించాలో భోదించండి. కన్నీరు లజ్జాకరం కాదని భోదించండి. వాడిదగ్గర ఉన్నది నలుగురికి పంచటం నేర్పించండి. అలాగే అతి చనువు పట్ల జాగురూకత భోదించండి. అలాగే బలాన్ని బుద్దిని అత్యదిక ధరకు అమ్ముకోవటం భోదించండి. కానీ వాడి హృదయంపైన, అత్మపైన అమ్మకపు ధర అతికించుకోవద్దు అని చెప్పండి.

సత్యం తనవైపు ఉన్నదని తెలిసినప్పుడు లోకుల మూకుమ్మడి కేకలను పట్టించుకోకుండా, దైర్యంగా నిలబడటాన్ని, పోరాడటాన్నిభోదించండి. వాడికి అన్ని నెమ్మదిగా నేర్పించండి, సున్నితంగా ప్రవర్తించండి, అలా అని గారాభం, ఎత్తుకు తిప్పటం చేయకండి. వాడికి తప్పు అంటే భయం నేర్పండి, వీటితోపాటు ఎంత కష్టానికైనా దైర్యంగా నిలబడే సహనాన్ని భోదించండి. ఎందుకంటే నిప్పులో కాలినాకే నిజమైన బంగారం బయటకి వస్తుంది.
వాడిమీద వాడికి ఉత్కృష్టమైన విశ్వాసాన్ని పెంచండి. అది వాడికి సమస్త మానవాళిమీద అదే విశ్వాసాన్ని పెంచుతుంది. ఇవన్నీ వాడు తెలుసుకున్ననాడు వాడు మనుష్యులలో ఉత్తముడిగా మిగులుతాడు.

ఇదంతా పెద్ద పట్టికే. తండ్రిగా వాడు అలా ఉండాలని నా కోరిక. అలా తయారుచేయటానికి నా ప్రయత్నం నేను చేస్తాను. కానీ మీవల్లనేమవుతుందో అది మీరు చేయండి. వాడు ఒక పసిపిల్లవాడు, మనం ఎలా మలుస్తామో అలా పెరుగుతాడు. జాగ్రత్తగా చూసుకోండి..
-అబ్రహం లింకన్

Wednesday, October 19, 2016

తల్లి కడుపున పుట్టిన వారు చదవండి.

తల్లి కడుపున పుట్టిన వారు చదవండి.

సుధాకర్ ఆఫీసులో UDC గా పని చేస్తున్నాడు,మనిషి మంచివాడే కానీ పూర్తిగా భార్యా విధేయుడని మిగతా స్టాఫంతా చెవులు కోరుక్కుంటుటారు   ,
సుధాకర్ ఆరోజు ఎందుకో చాలా చిరాకుగా ఉన్నాడు
ఆఫీసు ప్యూన్ వచ్చి మిమ్మల్ని బాస్ పిలుస్తున్నారు వెళ్ళమని చెప్పేసరికి ఆ చిరాకు ఇంకా నషాళానికంటింది,
ఆ(..ఏంటట ?వెళ్తాలే అన్నాడు మరింత చిరాకుగా..ఈయన గారి వాలకం చూసిన ప్యూను నాకెందుకులే అని వెళ్ళిపోయాడు,
వెళ్ళకపోతే బావుండదు,
పైగా బాస్,
ఆవులిస్తే పేగులు లెక్కపెట్టే రకం,
పైకి ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు కానీ ఆ కళ్ళే చెపుతాయి ఆయన పట్టుదలను, అందుకే ఆయన కళ్ళు చూస్తే అబద్దం చెప్పలేం బాబోయ్ అంటుంటారు స్టాఫంతా.
అలాగని చెడ్డవాడూ కాదు,
మెున్న ప్యూను కూతురుకి మంచి మార్కులు వస్తే పై చదువులకు డబ్బు లేకపోతే తనే స్వయంగా వెళ్ళి ఆ అమ్మాయిని కాలేజి లో చేర్పించాడు,స్టాఫ్ లో అందరూ ఓకరికి తెలియకుండా ఓకరు ఆయన సాయం పోందిన వారే..
అందుకే ఆయనంటే భయంతో కూడిన అభిమానం అందరికీ..
ఎట్టకేల కి బాస్ రూం లోకి అడుగుపెట్టి విష్ చేసాడు సుధాకర్..
బాస్ సుధాకర్ వైపు చూడకుండానే ఫైలు చూసుకుంటూ
ఏమయ్యా సుధాకర్? ఏంటి ఇవాళ చిరాగ్గా ఉన్నావ్,ఎనీ ప్రాబ్లెం ?అన్నాడు
సుధాకర్ కు చిరాకంతా ఎగిరిపోయింది,చిరాకు స్ధానం లో కన్ఫ్యూషన్ చోటు చేసుకుంది,నేను చిరాగ్గా ఉన్నట్టు మీరెలా కనుక్కున్నారు సర్ ?అని మనసులో మాట బయటకు అనేసి నాలుక్కరచుకున్నాడు..
బాస్ నవ్వుతూ..నీవు ఎప్పుడూ అంత విసురుగా నా కేబిన్ డోరు తీయలేదు అందుకే అడిగాను ఎనీ ప్రాబ్లం ?
అవును సర్..మా అమ్మ నే ప్రాబ్లం సర్ !
మీ అమ్మ ప్రాబ్లమా ? ఆశ్చర్యపోయాడు బాస్.
ఇఫ్ యు డోంట్ మైన్,
నీ పర్సనల్ విషయం లో తల దూర్చరాదు,
కానీ మీ అమ్మ ఎలా ప్రాబ్లమో చెప్పగలవా? ముందు కూర్చో...అన్నారు
కూర్చోగానే ధైర్యం వచ్చేసింది సుధాకర్ కు,ఇక చెప్పసాగాడు తన తల్లి గురించి,
చాలా ప్రాబ్లం గా ఉంది సర్ మా అమ్మతో
రాత్రుల్లు దగ్గుతూ నిద్ర లేకుండా చేస్తుంది, మేం చేసిన వంట ఆమెకు రుచించదు, బాత్రూం అంతా గలీజు చేస్తుంది, ఓక్కోసారి బట్టల్లోనే ఓంటికి, రెంటికి కూడా చేసుకుంటుంది సర్, భరించలేకున్నాం సర్ కంపుతో, నాభార్య తో మా అమ్మ గురించి రోజూ గోడవనే సర్, చివరకు నా భార్య పోరు పడలేక మూడురోజుల క్రితం వ్రుధ్ధాశ్రమం లో వదిలేసి వచ్చా సర్, వదిలేసి వచ్చినప్పటినుండి ఈరోజు వరకు భోజనం చేయటం లేదట, వ్రుధ్ధాశ్రమం వారు గంట, గంటకు ఫోన్ చేసి మీ అమ్మను తీసికెళ్ళమని ఫోన్ లతో చంపేస్తున్నారు సర్, ఏదో ఇంత ముద్ద తిని చావచ్చు గదా, మా ప్రాణాలు తీయకుంటే..అందుకే ఈ చిరాకు సర్.. క్షమించండి సర్. అన్నాడు
అంతా విన్న బాస్ గట్టిగా నిట్టూర్పు వదలి నిజమే సుధాకర్, ఈ తల్లిదండ్రులు కడదాక మనతోనే ఉండాలనుకుంటారు, కానీ ఇది వారనుకున్నట్టు సత్తెకాలం కాదు కదా, పరిస్థితి బట్టి వారూ మారాలి, ఎనీ హౌ చాలా సఫర్ అవుతున్నావు సుధాకర్, ఈ చిరాకు పని మీద చూపించకు.. ఓకే..
అబ్బే లేదు సర్...
సరే, నీకు పర్శనల్ గా చెపుతున్నాను, నీమీద నమ్మకంతో.. ఈ రెడ్ కలర్ ఫైలు చాలా కాన్ఫిడెన్షియల్.. నాకు ఆఫీసులో నమ్మకం లేదు, అందుకే నీ దగ్గర ఉంచుతున్నాను, నేను ఎప్పుడు అడిగితే అప్పుడు చూపాలి, ఆఫీసులో ఎట్టి పరిస్థితి లో పెట్టరాదు, ఎప్పుడూ నీ వెంటే ఉంచుకోవాలి, ఈ పని నీవు చెయ్యగలవా?
నామీద మీరంత నమ్మకం పట్టుకున్నాక ఈ పని నేను చెయ్యలేక పోవడం ఏంటి సర్? చేస్తాను, అని ఫైలు తీసుకుని బయట పడ్డాడు,
ఆరోజు నుండి మెుదలైంది తలనోప్పి సుధాకర్ కు, బాస్ చీటికి, మాటికి ఆఖరుకు రాత్రిపూట కూడా ఫోన్ చేసి మరీ ఫైలు చెక్ చేసుకునే వాడు, తిరగలేక ,మెుయ్యలేక చివరకు ఫైలు చూస్తేనే దడ పుడుతుంది సుధాకర్ కు,
ఓరోజు బాస్ సుధాకర్ తో మనిద్దరం బెంగుళూరు కు వెళుతున్నాం, ఫైలు తో రెడీగా ఉండు, నీ లగేజ్ సర్జుకుని రమ్మన్నాడు, ఇంతమంది స్టాఫ్ లో నన్నోకరినే తీసుకెళుతుంటే లోలోపల గర్వంగా కూడా ఫీలయ్యాడు, అప్పటికే సుధాకర్ బాస్ కు దగ్గరయ్యాడని స్టాఫ్ లో క్రేజ్ కూడా పెరిగింది, ఇద్దరూ రైలులో ప్రయాణం చేస్తున్నారు, TC గారు టికెట్ చెకింగ్ కు వచ్చారు,బాస్ సుధాకర్ టికెట్స్ చూపించమన్నారు,సుధాకర్ అవాక్కయ్యాడు,నా దగ్గర టికెట్స్ లేవు,మీరెప్పుడిచ్చారు ?
బాస్ కు చిర్రెత్తుకోచ్చింది,
యూ ఫూల్ ! టికెట్స్ బుక్ చేయమని కూడా నేను నీకు చెప్పాలా ?నీకు తెలియదా ?అనేసరికి గడ,గడ వణికిపోయాడు సుధాకర్..ఇప్పుడెలా ?
సర్,మీరెలాగో అడ్జస్ట్ అవండి,నేను టాయ్ లెట్ లో దూరిపోతాను అని బాస్ సమాధానం కోసం కూడా ఎదురుచూడకుండా టాయ్ లెట్ లో దూరిపోయాడు,రాత్రంతా టాయ్ లెట్ కంపుతో వాంతులయ్యాయి,తలపట్టేసింది,
మెుత్తానికి బెంగుళూరు చేరారు,
సారీ ,సుధాకర్..నీకు నేను చెప్పాల్సింది,TC ఓక్కరికి అడ్జస్ట్ చేసాడు నా పాత పరిచయం వల్ల..అయాం సారీ..
బాస్ అంతటవాడు సారీ చెప్పే సరికి మనవాడికి ఛాతీ ఉప్పోంగి ..సర్ విత్ ప్లెజర్ సర్ అన్నాడు..
బెంగుళూర్ లో తనఇంటికి తీసుకెళ్ళాడు సుధాకర్ ను,
బాస్ ఇల్లు ఇంద్ర భవనం లా ఉంది
ముఖ్యం గా బాస్ తల్లిగారు రాజమాత ఉన్నారు ...బెడ్ మీద
బాస్ ఇంట్లోకి వెళ్తూనే సరాసరి తన తల్లి ఉన్న గది కి వెళ్ళి ఆమె పాదాలు స్ప్రుశించాడు.. ఆమె కళ్ళు తెరచి కోడుకుని చూసి ఏరా? ఇదేనా రావడం? భోంచేసావా?
ఇంకా లేదమ్మా,
ముందు స్నానం చేసి భోం చెయ్,
అలాగే నమ్మా..
పనివాడి కన్నా హీనం గా ఆమె ముందు నిలబడ్డ తన బాస్ ను చూసి ఈయన మా బాసేనా?  అన్న అనుమానం వచ్చింది సుధాకర్ కు, అన్నింటికన్నా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే స్వయానా బాస్ భార్యనే దగ్గరుండి అత్తగారికి సపర్యలు చేయడం,
సుధాకర్ లో ఇవన్నీ చూసిన వెంటనే తనలో అంతర్మధనం మెుదలైంది,
తనకు, తన బాస్ కు ఎంత తేడా?
అంత హోదాలో ఉన్నా కూడా ఇసుమంతైనా విసుగు లేకపోవడం ఎలా సాధ్యం?
ఈ ఆలోచన లతో రాత్రి నిద్ర రాలేదు, తన తల్లి రూపమే కళ్ళముందు కనబడుతుంది,
తెల్లారింది.. రాత్రంతా నిద్ర లేక సుధాకర్ కళ్ళు ఎర్రబడ్డాయి..
బాస్ సుధాకర్ ను పిలిచి ఏమోయ్ సుధాకర్ క్రోత్త చోటు నిద్ర వచ్చినట్టుగా లేదు కదా,
అవును సర్,
సరే, స్నానము చేసి టిఫిన్ చేయ్, ముందు ఆ ఫైలు తీసుకురా,
ఫైలు అనగానే సుధాకర్ కు చిర్రెత్తు కోచ్చింది, ఏమైనా కానిమ్మని సర్, ఇక ఆ ఫైలు నేను మోయలేను, నన్నోదియ్యండి ప్లీజ్.. అన్నాడు
ఏం? అంత బరువు గా ఉందా ఆఫైల్?
ఫైలు బరువు కాదు దాన్ని మెయింటనెన్స్ చేయడమే బరువైంది సర్..
బాస్ కొద్ది నిముషాలు మౌనం గా ఉన్నాడు, నేను తోందరపడ్డానా? అనే అపరాధభావం సుధాకర్ మెుహం లో కోట్టోచ్చినట్టుగా కనబడుతుంది.
తరువాత బాస్ మెల్లగా లేచి సుధాకర్ భుజం పై చేయి వేసి
వంద గ్రాముల బరువు కూడా చెయ్యని ఫైలు ను నీవు కనీసం మూడురోజులు మెుయ్యలేక పోయావే, మరి నిన్ను మీ అమ్మ తన కడుపులో తోమ్మిది నెలలు ఎలా మోసిందంటావ్?
ఊహించని ప్రశ్న కు సుధాకర్ కు దిమ్మ తిరిగిపోయింది..
సర్.. అంటూ నీళ్ళు నమిలాడు
ఎవరెవరో వాడిన టాయ్ లెట్ ను రాత్రంతా భరించావు,
మరి నీ కన్నతల్లి వాసనని భరించలేక పోయావా?
సుధాకర్ కళ్ళు నీళ్ళ సుడులయ్యాయి, ఆమె తిన్న ఆహారం తోనే నీవు ఆమె కడుపులో తోమ్మిది నెలలు బ్రతికావు, అప్పుడు రాలేదా వాసన?
నిన్ను కనడానికి ఆమె ఎంత నోప్పి ని భరించిందో నీవు ఊహించగలవా?
నీ పుట్టుక తో ఆమె కళాకాంతులు కోల్పోయిన సంగతైనవనీకు తెలుసా?
భూమి మీద పడ్డాక నీ ముడ్డి నీవే కడుక్కున్నావా?
ఎన్ని సంవత్సరాలు ఆమె నీకు ఊడిగం చేసిందో చెప్పగలవా?
నాన్న తన్నుల నుండి నిన్ను ఎన్ని సార్లు కాపాడిందో గుర్తుకు తెచ్చుకో సుధాకర్? స్రుష్టి లో మనకు బలమైన మద్దతుదారు అంటే ఆ ఓక్కరు అమ్మనే ..
నీ కడుపు నింపడానికి ఆమె ఎన్ని సార్లు కడుపు కాల్చుకుందో నీకు తెలుసా? కనీసం ఆ కోణం లో ఆలోచించావా?
నీవు ఆమెను వ్రుధ్ధాశ్రమం లో వదిలినట్టుగా
ఆరోజుల్లో ఆమె కూడా నిన్ను అనాథ శరణాలయం లో వదిలేలింటే నీ గతి ఏమయ్యేది ?
సుధాకర్ కు నోట మాట రావడం లేదు,
కళ్ళలో నీరు ధారాపాతంగా తనకు తెలియకుండానే కారిపోతున్నాయి,
అమాంతంగా తన బాస్ కాళ్ళ మీద పడ్డాడు,తన కళ్ళనీరు బాస్ పాదాలను తడిపేస్తున్నాయి..
నన్ను క్షమించండి సర్, నేను ఎంత పెద్ద తప్పు చేసానో తెలిసి వచ్చింది ,బుద్ధి వచ్చింది..
బాస్ నవ్వుతూ సుధాకర్ ను లేపి నీకు తెలిసిరావాలనే ఇదంతాచేసాను అంటూ ఆ ఎర్రఫైలు తెరిచి చూపాడు, అందులో నాలుగు తెల్ల కాగితాలు తప్ప మరేమీ లేవు,
సుధాకర్ వెంటనే బాస్ తల్లి పాదాలకు నమస్కరించాడు
బాస్ తో సర్ నాకు సెలవు కావాలి సర్!
దేనికి?
"మా అమ్మను వ్రుధ్ధాశ్రమం నుండి నా ఇంటికి తెచ్చుకోడానికి "

మాత్రుదేవోభవ

అమ్మ ని నాన్న ని....
భారం..... అనుకోవద్దు....
వారు...
మన బంధం...
మన బాధ్యత..
మన ప్రాణం.             

కోటీశ్వరులు కావడం అందరికీ సాధ్యం కాదు

 జీవితం లో నేర్చుకోవాల్సినవి కొన్ని

👉1. కోటీశ్వరులు కావడం అందరికీ సాధ్యం కాదు, కానీ నిజాయితీపరులు కావడం ప్రతి ఒక్కరికీ సాధ్యమే.

👉2. సుత్తితో ఒక్క దెబ్బ వెయ్యగానే బండరాయి ముక్కలవదు. దెబ్బ వెనుక దెబ్బ వెయ్యాలి. ఒక్క ప్రయత్నంలోనే విజయం సిద్థించదు. ఎడతెగని ప్రయత్నం కావాలి.
👉3. ఒకసారి బట్టలు మాసిపోతే మనిషి ఎక్కడ కూర్చోడాన్కిఅయినా సిద్దపడతాడు. అలాగే ఒకసారి నడత చెడిందంటే ఎలాంటి పనులుచేయడానికైనా సందేహించడు మనిషి.
👉4. మనం మన ఆలోచనలకు బందీలం. ఆలోచనలను మార్చుకోనిదే దేన్ని మార్చలేం.
👉5. గొడుగు వర్షాన్ని ఆపలేకపోవచ్చు. కానీ వర్షంలో తడిసిపోకుండా రక్షణ ఇస్తుంది. అలాగే ఆత్మ విశ్వాసం విజయాన్ని తెచ్చిపెట్టలేకపోవచ్చు. కానీ విజయపథలో ఎదురయ్యే అవరోధాలను అధిగమించగల శక్తిని ఇస్తుంది.
👉6. బలవంతుడికీ బలహీనుడికీ మధ్య జరిగే ఘర్షణలో ప్రేక్షకపాత్ర వహించడమంటే.. తటస్థంగా ఉన్నట్లు కాదు. బలవంతుడి పక్షం వహించినట్లు.
👉7. అతి నిద్ర, బద్దకం, భయం, కోపం, నిరాశావాదం- ఈ ఐదు అతి చెడ్డ గుణాలు. వీటిని పొరపాటున దగ్గరకు రానిచ్చినా జీవితంలో పైకి రావడం, సుఖపడడం జరగదు.
👉8. అహంకారము ప్రతి ఒక్కరినుంచీ – అఖరికి భగవంతుడి నుంచి కూడా దూరం చేస్తుంది.
👉9. ఉపాయాన్నిఅలోచించేటప్పుడే రాగల అపాయాన్ని కూడా అంచనా వేయాలి.
👉10. నీ తప్పును ఈరోజు కప్పిపుచ్చకలిగినా రేపటి దాని పర్యవసానాన్ని మాత్రం తప్పించుకోలేవు.
👉11. మంచివారు దూరం కావడం, చెడ్డవారు దగ్గర కావడమే దుఃఖాని కి నిదర్శనం.
👉12. బలహీనుడిని బలవంతుడు కొడితే బలవంతుడిని భగవంతుడు కొడతాడు.
👉13. కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటగలవు. కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేవు.
👉14. పక్షులకు కొంత ధాన్యం, పశువులకి కొంత గ్రాసం, మనిషికి కొంత సాయం… ఇదే జీవితం.
👉15. ఉత్తమ గుణాల వల్ల మవిషి ఉన్నతుడవుతాడు కానీ ఉన్నత పదవి వల్ల కాదు… - శిఖరం మీద కూర్చొన్నంత మాత్రాన కాకి గరుడ పక్షి కాలేదు.
👉16. తలపై మోసే భారాన్ని ఇతరులు కొంత పంచుకుంటే బాధ తగ్గుతుంది. కానీ ఆకలి బాధనూ, అజ్ఞాన బాధనూ ఎవరికి వారే తగ్గించుకోవాలి.
👉17. మంచివారు దూరంకావడం, చెడ్డవారు దగ్గరకావడమే దుఃఖానికి నిదర్శనం.
👉18. మెరుగు పెట్టకుండా రత్నానికి, - కష్టాలు ఎదుర్కోకుండా మనిషికి గుర్తింపు రాదు.
👉19. కేవలం డబ్బుంటే సరిపోదు. మంచి వ్యక్తిత్వం ఉంటనే సమాజం గౌరవిస్తుంది.
👉20. ఎవరి వయస్సుకు తగ్గంటు వారి ఆలోచనలు, ప్రవర్తన ఉంటనే ఆ వ్యక్తికి గౌరవం ఉంటుంది.          

Monday, September 26, 2016

Ethical stories in Telugu

నాన్న కు ప్రేమతో👌👌👌
 ఓ కుర్రాడు 👲
కోపంతో ఇల్లు వదిలి వచ్చేశాడు😤
ఎంత కోపంతో వచ్చాడంటే..
తను చూసుకోలేదు
తన కాళ్లకు వాళ్ల నాన్న బూట్లు
 వేసుకు వచ్చేశాడని.👞👞

కొడుక్కి ఒక మోటార్ సైకిల్
కొనలేని వాడు కొడుకు ఇంజనీర్
కావాలని కలలు కనడం ఎందుకో..
అంటూ తండ్రిని తిట్టుకుంటూ మరీ ఇంటినుండి బయటికి వచ్చేశాడు.😁

చాలా పెద్దవాడినయ్యాక గాని ఇంటికి తిరిగి వెళ్ళను అని నిశ్చయించుకున్నాడు. 😒

ఇంటి నుండి వచ్చేప్పుడు
కోపం కొద్దీ… ఎప్పుడూ
ముట్టుకోనివ్వని వాళ్ల నాన్న పర్సు
కొట్టుకోచ్చేశాడు 😉
అమ్మకి కూడా తెలియకుండా
రాసే లెక్కలన్నీ దాంట్లోనే
 ఉంటాయని వాడి నమ్మకం.👲

నడుస్తుంటే బూట్లలో ఏదో తగులుతోంది .
కరుస్తూ ఉన్నట్టు ఉంది .
బూటు లోపల సాఫ్ట్ గా లేదు .
మడమ నొప్పెడుతోంది .😣
అయినా అతని కోపం దానిని లెక్కచెయ్యనివ్వలేదు .
లోపల తడి తడి గా అనిపించింది .
కాలు ఎత్తి చూశాడు....
బూటు అడుగున చిన్న కన్నం..👞
కుంటుతూనే బస్ స్టాండ్ వచ్చాడు
ఎటైనా వెళ్లిపోదామని..!! 🚶

విచారణ లో వాకబు చేస్తే
తెలిసింది గంట దాకా బస్ ఏదీ లేదని 🚌

సరే ఏంచేస్తాం. అప్పటి దాకా …
 నాన్న పర్సు లో ఏంఉందో చూద్దామని
పర్సు తెరిచాడు ఈ కుర్రాడు .👲

ఆఫీసు లో 40,000 అప్పు తీసుకున్న లోన్ రశీదు 📄
కొడుకు కోసం కొన్న లాప్ టాప్ బిల్లు📃
అఫీసుకు వచ్చేటప్పుడు శుభ్రమైన బూట్లుతో రమ్మని మేనేజర్ ఇచ్చిన మెమో📜
పాత స్కూటర్ తెండి – కొత్త మోటార్ సైకిల్ తో వెళ్ళండి . గొప్ప ఎక్చేంజ్ మేలా అని రాసి ఉన్న కరపత్రం..📑
ఇవి కనబడ్డాయి కుర్రాడికి తండ్రి పర్సులో…

వాటిని చూసాక ఈ కుర్రాడి కళ్ళు చెమర్చాయ్😓

వెంటనే ఇంటికి పరుగు పెట్టాడు .🏃
 సోల్ లేని ఆ బూట్లు ఈసారి నొప్పి కలిగించలేదు .
ఇళ్లంతా వెతికాడు, కానీ ఇంట్లో
 నాన్న లేడు. స్కూటరూ లేదు .😔
 అతడికి తెలిసిపోయింది.....
నాన్న తన స్కూటర్ తీసుకొని
 ఎక్స్చేంజ్ మేలా కు వెళ్లాడని..
అతి ప్రేమగా చూసుకుంటున్న
తన స్కూటర్ ను అక్కడిచ్చి..
తన కోసం బైక్ తేడానికే ఖచ్చితంగా వెళ్లాడని…😳

ఆ కుర్రాడి కళ్ళు చెమరుస్తున్నాయి.😪

పరుగు పరుగున ఎక్స్చేంజ్ ఆఫర్ ఇస్తున్న చోటికి వెళ్ళాడు . 🏃

వాళ్ల నాన్న అక్కడే ఉన్నాడు,
 ఎక్స్చేంజ్ షాపు కుర్రాడితో బేరం ఆడుతున్నాడు.
ప్రస్తుతం యూత్ కి బాగా ఇష్టమైన
 మోడల్ బైక్ ఏదో చూపించు..
దాని మీద నా కొడుకు హీరో లా
 ఉండాలి అని చెబుతున్నాడు..👨

వెనకాలే నిల్చుని తండ్రి మాటలు వింటూ ఏడుస్తున్న ఆ కొడుకు కన్నీరు తండ్రి భుజాల మీద పడసాగింది. 😭
అప్పుడు తండ్రి వెనక్కి తిరిగి చూసాడు. 👨

అప్పుడు ఆ అబ్బాయి నాన్నని కౌగిలించుకొని
”వద్దు నాన్నా ! వద్దు నాన్నా !
నాకు మోటార్ సైకిల్ వద్దు నాన్నా.."
అంటూ ఏడవసాగాడు !😭

ఇంటికి వెళుతూ వెళుతూ…
తండ్రి కోసం కోఠిలో కొత్త షూస్ కొని తీసుకువెళ్ళారు
ఆ తండ్రీకొడుకులిద్దరూ….!👬

మీకోసం
తన జీతాన్నే కాదు...
జీవితాన్నీ దారపోసి....
సర్వస్వాన్నీ సమర్పించిన
ఆయన 👨
త్యాగాన్ని గుర్తించండి !
బంధాన్ని గౌరవించండి !!
మనసారా ప్రేమించండి !!!
కథ.👍🍀

ఇద్దరు మిత్రులు ఒక రోజు ఉదయం ఒక నిర్జనారణ్యం గుండా నడుచుకుంటూ వెళుతున్నారు. అకస్మాత్తుగా వారి సమీపంలోని ఒక పొద వైపు నుంచి ఓ సన్యాసి ఆదుర్దాగా, ఆయాసంతో రొప్పుతూ వస్తూ కనిపించాడు. వాళ్ళిద్దరూ ఆయన్ను ఆపి “ఏం జరిగింది? ఎందుకలా భయపడుతున్నారు?” అని అడిగారు. అందుకాయన… “అదిగో అక్కడ కనిపిస్తున్న పొదలో మనుషుల్ని చంపేది ఉంది.” వాళ్ళిద్దరూ భయంతో… “అంటే అక్కడ పులి ఉందా?” అని అడిగారు.

“కాదు. కానీ దానికన్నా ప్రమాదకరమైనది. నేను కొన్ని మూలికల కోసం తవ్వుతుండగా అది బయటపడింది.” అన్నాడాయన.”ఇంతకీ ఏమిటది?” అని అడిగారు వాళ్ళిద్దరూ కంగారుగా. “బంగారు నాణేల గుట్ట” అన్నాడు సన్యాసి. వాళ్ళిద్దరూ సంతోషంగా “ఎక్కడ?” అని అడిగారు.

“అదిగో ఆ పొదల్లోనే” అని వేలు చూపించి తన దారిన పోయాడా సన్యాసి. వాళ్ళిద్దరూ ఆ పొదవైపు పరుగెత్తుకుంటూ వెళ్ళి చూస్తే నిజంగానే అక్కడ బంగారు నాణేలు కనిపించాయి. “ఈ సన్యాసి ఎంత మూర్ఖుడు? బంగారు నిక్షేపాన్ని పట్టుకుని మనుషుల్ని చంపేది అంటాడేమిటి?” అన్నాడొక మిత్రుడు.

“అతడి సంగతి వదిలేయ్. ముందుగా ఇప్పుడేం చేయాలో ఆలోచిద్దాం. పట్టపగలే బహిరంగంగా దీన్ని మోసుకుపోతే ఊర్లో జనాలు అనుమానపడే అవకాశం ఉంది. మనలో ఒకరం దీనికి కాపలాగా ఉందాం. మరొకరు ఊర్లోకి వెళ్ళి భోజనం తీసుకు వద్దాం.” అన్నాడు మరో మిత్రుడు.

అనుకున్నట్టే ఒక మిత్రుడు బంగారానికి కాపలాగా ఉన్నాడు. రెండోవాడు ఊర్లోకి వెళ్లాడు. ఈలోగా మొదటి వాడు ఇలా అనుకున్నాడు. “ఛ… ఈ రోజు నేను ఒంటరిగా ఇక్కడికి వచ్చుంటే ఎంత బాగుండేది? ఇప్పుడు అనవసరంగా నేను అతనికి సగం బంగారం ఇవ్వాల్సి వస్తుంది. బంగారం కూడా మరీ ఎక్కువగా లేదు. నా కుటుంబం చాలా పెద్దది. దాన్ని పోషించడానికి ఈ బంగారం అంతా నాకే దక్కితే బాగుంటుంది కదా! వాడు వచ్చీ రాగానే కత్తితో పొడిచి చంపేస్తాను. ఎవరికీ అనుమానం రాదు. బంగారం అంతా నేనే తీసుకోవచ్చు.” అలా అనుకుని కత్తిని నూరి సిద్ధంగా ఉంచుకున్నాడు.

ఇదిలా ఉండగా ఊర్లోకి వెళ్ళిన రెండో వాడి ఆలోచన ఇలాఉంది… “వాడికి సగం భాగం ఎందుకివ్వాలి? మొత్తం బంగారం నేనే తీసుకుంటే పోలా! అసలే నాకు చాలా అప్పులున్నాయి. నా జీవితంలో నేను ఏదీ వెనుకేసుకోలేదు. వాడికేమో అప్పులు లేవు. ఉన్నవాళ్ళు స్నేహితులుగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా బంగారమంతా నాకే దక్కాలి. కాబట్టి నేను తీసుకెళ్ళే భోజనంలో విషం కలుపుతాను. అది తిని వాడు చనిపోతాడు. ఎవరికీ తెలియకుండా బంగారమంతా నేనే తీసుకోవచ్చు” అనుకున్నాడు. అలా అతడు భోజనంలో విషం కలిపి మిత్రుడి కోసం నిధి దగ్గరకు తీసుకెళ్ళాడు.

అతను దగ్గరికి వెళ్ళగానే అక్కడే కత్తితో పొంచి ఉన్న రెండోవాడు ఒక్క ఉదుటున మీదకు దూకి కత్తితో పొడిచి చంపేశాడు. “పిచ్చివాడు. సగం బంగారం కోసం ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఇంక నేను భోంచేస్తాను.” అనుకునిఏ మాత్రం అనుమానం లేకుండా తెచ్చిన అన్నాన్ని తిన్నాడు. అరగంట తర్వాత అతని ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. “సన్యాసి మాటలు ఎంత నిజమో కదా” అనుకున్నాడు చివరి క్షణాల్లో.😤😤

🌸గమనిక: రూపాయి.. రూపాయి.. నువ్వేం చేస్తావు? అంటే… తోబుట్టువుల మధ్య వైరం పెంచుతాను. తల్లీ బిడ్డల మధ్య చిచ్చుబెడతాను, చివరికి స్నేహితులను కూడా దూరం చేస్తాను అంటుంది ఆ రూపాయి…. అని పెద్దల నానుడి. కాబట్టి ఆ రూపాయి విషయంలో జాగ్రత్త.



:@2::
---
ఒక వ్యాపారి చాలా సంవత్సరాలుగా భవనాలు, ఇతర
కట్టడాలు నిర్మించే వృత్తిలో ఉండేవాడు. తనకు సహాin యంగా
ఒక వ్యక్తిని పర్యవేక్షకుడిగా నియమించుకున్నాడు.
దాదాపు పాతిక సంవత్సరాలు ఆ పర్యవేక్షకుడు ఆ వ్యాపారి
దగ్గర నమ్మకంగా పనిచేశాడు. ఒకరోజు ఆ వ్యాపారి అతణ్ని పిలిచి
''మనం ఇపుడు ఒక భవంతిని నిర్మించాలి. ఎంత ఖర్చయినా
ఫరవాలేదు. ఆ భవనం 'నభూతో న భవిష్యతి' అనే రీతిలో
అద్భుతంగా ఉండాలి'' అన్నాడు. అలాగేనన్న
పర్యవేక్షకుడు మనసులో మాత్రం, 'నేను ఇన్ని
సంవత్సరాలు నమ్మకంగా, విశ్వాసంగా పనిచేశాను.
నాకు ఏం మిగిలింది- ఆయన నెలనెలా ఇచ్చే జీతం రాళ్ళు తప్ప.
అంచేత ఈ భవన నిర్మాణానికి కేటాయించిన చాలా
భాగం డబ్బు సొంతం చేసుకుంటాను' అనుకున్నాడు. అలా
తలచిన ఆ వ్యక్తి ఆ భవనాన్ని చౌకగా దొరికే ముడిసరకులతో
నిర్మించి పైకి మాత్రం కళాత్మకంగా ఉండేలా వివిధ నగిషీలతో
శిల్పాకృతులతో తీర్చిదిద్దాడు. పైకి అద్భుతంగా
కనిపిస్తూ బలహీనంగా తయారైన ఆ భవనాన్ని తన యజమానికి
చూపించాడు.
యజమాని ఆనందపడుతూ, ''మిత్రమా ఈ భవంతి మహత్తరంగా
ఉంది. ఇన్నాళ్లు నమ్మకంగా పనిచేశావు... నేను ఈ
వ్యాపారం వదిలి వేరే దేశం వెళ్లిపోతున్నాను. అత్యంత
విశ్వాసపాత్రుడిగా ఇన్ని సంవత్సరాలుగా నన్నే అంటిపెట్టుకొని
ఉన్న నీకు అపురూపమైన జ్ఞాపికలా మిగిలిపోయే ఒక అద్భుతమైన
కానుకను ఇవ్వాలనుకున్నాను. ఈ భవంతి నీకోసమే!''
అంటూ భవనాన్ని అప్పగించి వెళ్ళిపోయాడు.
ఆ యజమాని వెళ్ళిన
కొద్దిసేపటికి ఆ పర్యవేక్షకుడు కుప్పకూలిపోయాడు.

త్వరలో
కూలబోయే ఆ భవనంలాగే.
మనిషి ధర్మం తప్పకూడదనీ,
తుది శ్వాస వరకూ దాన్ని
విడిచిపెట్టరాదనీ,
 అధర్మంగా 'అర్థాన్ని' సంపాదించితే అనర్థమే
తప్ప ఏ పరమార్థమూ నెరవేరదనీ ఈ కథలోని నీతి.

Monday, September 12, 2016

Neeti khatalu




 అత్యాశ :-
ఒక మానవుడు విచారంగా కుర్చుని బాధపడుతున్నాడు . అటు వైపు వచ్చిన ఓ సన్యాసీ అతడి దుఃఖం కి కారణం తెలుసుకోవాలనుకున్నాడు .
సన్యాసీ :- ఓ మానవా ! ఏమిటి నీ బాధ ?
మానవుడు :- జీవితం లో సంతోషమే లేదు స్వామి .
వెంటనే ఆ సన్యాసీ తన చూపుడు వేలును అక్కడున్న రాయికేసి చాచాడు .
ఆ రాయి బంగారు రాయి గా మారిపోయింది .
సన్యాసీ :- ఇప్పుడు సంతోషమేన ?
మానవుడు :- ఆఆ ...అదొక రాయే కదా !
ఈ సారి తన చూపుడు వేలుతో ప్రక్కనే ఉన్న చెట్టును బంగారు చెట్టు గా మార్చేసాడు .
సన్యాసీ :- ఇప్పుడేమంటావు ?
మానవుడు :- అదొక చెట్టే కదా !
మల్లి చూపుడు వేలును ఇంటివైపు చూపించాడు . ఇల్లు బంగారు ఇల్లు గా మారిపోయింది .
సన్యాసీ :- ఇది చాలా ?
మానవుడు :- అదొక ఇల్లే కదా !
సన్యాసీ :- ఇంత బంగారాన్నిచినా నీకు సంతోషం కలగలేదే ! అయితే నీకేం కావాలి ?
మానవుడు :- నీ చూపుడు వేలు కావాలి స్వామి .



సుందరి భగవంతుడికోసం కఠోరమైన తపస్సు చేసింది.
ఎప్పుడూ మగవాళ్లే చేస్తారు...
అలాంటిది ఒక స్త్రీ తనకోసం తపస్సు చేయడం చూసి అబ్బురపడి...
భగవంతుడు వెంటనే ప్రత్యక్షమై...
"ఓ స్త్రీ... నేను నీ భక్తికి మెచ్చాను. నీకు ఒకటి కాదు 3  వరాలు ఇస్తాను. అంతే కాదు. నీకు ఏ వరమిస్తే... అది నీ భర్తకు 10 రెట్లు ఎక్కువయ్యే వరం కూడా ఇస్తాను అన్నాడు.
అందుకు...ఆమె సంతోషించి,  "స్వామి... నాకు ఎవ్వరికీ లేనంత అందాన్నివ్వు" అనడిగింది.
దేవుడు, "తధాస్తూ... మరి నీ భర్తకు కూడా ఈ అందం పదిరెట్లు ఎక్కువవుతుంది" అని చెప్పి వరమిచ్చాడు.
 సరేనంది ఆమె. ఆ తరువాత రెండో వరం కోరింది. " 100 కోట్ల ధనాన్నివ్వు స్వామీ " అంది.
దేవుడు మళ్ళీ సరేనన్నాడు. కాని, ఇచ్చేముందు "నీ భర్తకు ఈ ధనం 10 రెట్లు ఎక్కువవుతుంది. ఒక్కసారి ఆలోచించుకో... బాగా డబ్బు వచ్చాక.... నిన్ను పట్టించుకోడేమో" అన్నాడు.
 "అదేం లేదు స్వామీ మీరు ఇవ్వండి" అందామె. దేవుడు మళ్ళీ తధాస్తు అన్నాడు. ఇంక మూడో కోరిక కోరమన్నాడు.
అందుకామె నెమ్మదిగా చెప్పింది... "స్వామీ.... ఈ రాత్రికి.. నాకు Mild Heart stroke (తేలికపాటి గుండెనొప్పి)ని ఇవ్వండి..." అంది.
దేవుడు....... కెవ్వుమన్నాడు.........!
!  కధలో నీతి:- ఆడవాళ్ళతో పెట్టుకొద్దమ్మా!

Monday, August 29, 2016

మహా భారతం నుండి నేర్చుకోవాల్సిన 14 ముఖ్యమైన పాఠాలు

మహా భారతం నుండి
 నేర్చుకోవాల్సిన 14 ముఖ్యమైన పాఠాలు

1.జీవితంలో గెలవడానికి జాలి, దయ, మంచితనం మాత్రమే ఉంటే చాలదు:
కర్ణుడు అంటేనే మంచితనానికి, దాన, ధర్మలకి పెట్టింది పేరు, కాని సమయాన్ని బట్టి నడుచుకోక పోవడం వలన చెడు (కౌరవుల) వైపు నిలబడి ప్రాణాలని పోగొట్టుకున్నాడు, కావున జీవితంలో గెలవాలంటే మంచితనంతో పాటు చుట్టూ ఉండే సమాజ పరిస్థితులని, సమయాన్ని బట్టి నడుచుకోవాలి.

2.చెడు స్నేహం ఊహలకి కూడా అందని విధంగా మీ జీవితం నాశనం చేయొచ్చు:
శకుని..పరోక్షంగా కౌరవ సామ్రాజ్యం మొత్తాన్ని నాశనం చేసి,వారితో స్నేహంగా వారి ఆస్థానంలో ఉంటూనే వారికి కలలో కూడా ఊహించని పరాజయాన్ని మిగిల్చాడు, శకుని లాంటి జీవితంలో చాలామంది సలహాలని దూరం పెట్టాలి.

3. ఎటువంటి బేధాలు చూడని నిజమైన స్నేహం జీవితంలో ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది:
పాండవులు శ్రీ కృష్ణుడుని ,కౌరవులు కర్ణుడుని పొందటం అది వారికి యుద్ధం సమయంలో ఏ స్థాయిలో ఉపయోగపడిందో తెలిసినదే ,కర్ణుడి లేని రారాజు బలం ఏ పాటిదో ,కౌరవ సేనకు కర్ణుడు ఏ స్థాయి ధైర్యమో తెలిసిన సంగతే కదా, కుల,మత, పేద మరియు ధనిక భేదాలని చూడకుండా మంచివారితో స్నేహం చేసేవారు ఖచ్చితంగా జీవితంలో గెలుస్తారు.

4.అధికం అనేది అత్యంత ప్రమాదకరం:
కౌరవుల తల్లి అయిన గాంధారీ కి వంద మంది కుమారులు ఉండటం వల్ల వారిని పెంచటంలో చాలా కష్టపడాల్సి వచ్చింది, ,రాజ్యాన్ని బిడ్డలకి సమంగా పంచటమూ వారి బాగోగులు చూస్తూ క్రమశిక్షణతో పెంచటమూ కూడా చాలా కష్టం, అలాగే దుర్యోధనుడికి ఉన్న అధికమైన కోపం, అధికమైన రాజ్యకాంక్ష కారణంగా కౌరవులు నాశనం అయ్యారు..! కాబట్టి అన్ని చోట్ల ముఖ్యంగా చెడు పక్షాన అధికం అనేది అత్యంత ప్రమాదకరం.

5. ఎవరి పనులు వారే చేసుకోవడం:
అరణ్య వాసం, అజ్ఞాతవాసంలోఉన్న పాండవులకి వాళ్ళు నేర్చుకున్న ఇంటి, వంట పనులు చాలా ఉపయోగపడ్డాయి, అలాగే మనకి కూడా మన అవసరాల కోసం అయిన కొన్ని పనులు నేర్చుకోవాలి.

6.మనకి సంభందించిన దాని కోసం ఎంత కష్టమైన పోరాడాలి:
కౌరవులతో పోల్చుకుంటే పాండవుల సైన్యం చాలా తక్కువగా ఉన్న పాండవులు తమ కష్టాన్ని మాత్రమే నమ్ముకొని చిత్తశుద్దితో పోరాటం చేసి విజేతలుగా నిలిచారు.

7. అతి ప్రేమ నష్టం కలిగిస్తుంది:
ద్రుతరాష్ట్రుడు అటు బిడ్డల మీద ప్రేమ ఇటు తను నమ్ముకున్న సిద్దాంతాల మధ్య ఎలా నలిగిపోయాడో ,కొడుకుల వినాశనం అంతా తెలుస్తున్నా వారి తప్పులని ఆపలేకపోయాడు ,అదే ద్రుతరాష్ట్రుడు తన బిడ్డల మీద అంత ప్రేమని పెంచుకోక వారిని క్రమశిక్షణలో పెట్టి ఉంటే విషయం అంత వరకూ వెళ్ళేది కాదేమో. ఎవరి మీద అయిన అతి ప్రేమ, అతి నమ్మకం నాశనానికి, మోసానికి దారితీస్తాయి.

8. విద్య జీవితాంతం నేర్చుకోవటమే మీకు ఉత్తమ బహుమతి:
అర్జునుడు తన జీవితం ఆసాంతం విద్యలు నేర్చుకుంటూనే ఉన్నాడు .ద్రోణా చార్యుల వారి నుండీ యుద్ద శాస్త్రం ,దైవ సంబందమైన ఆయుధాల వాడకం ఇంద్రుడు ద్వారా ,మహదేవుడి నుండి పాశుపతాస్త్రం, యుధిష్టరుడు, కృష్ణుడి నుండి మరెన్నో రాజ నీతులు ఇలా ప్రతి దశలోనూ అభ్యసించటమే అర్జునుడికి ఓ ప్రత్యెక స్థానం దక్కింది, నిత్యం నేర్చుకోవడం వలన ఖచ్చితంగా విజయం సాధించవచ్చు.

9.కొన్నిసార్లు శత్రువులు కూడా మిత్రుల రూపంలో ఎదురవుతారు:
కౌరవుల పక్షాన ఎంతో మంది ఉన్నా వాస్తవానికి వారిలో చాలా మంది పాండవులకి సహాయపడ్డ వాళ్ళే ,బీష్మ ,విదుర ,ద్రోణ రహస్యంగా పాండవులకి ఎంత సహాయం చేసారో తెలిసినదే ,ఇక విదురుడు అయితే కౌరవుల ప్రతీ అడుగు పాండవులకి మోసుకొచ్చిన వాడు కదా.

10.స్రీలని ఆపదల నుండి కాపాడటం :
నిజానికి ద్రౌపది ఐదుగురు భర్తలకూ సంపన్నులూ,అత్యంత బలవంతులు కూడా కానీ సభామందిరాన అవమానం ఆపలేకపోవటంలో విఫలమయ్యారు కదా.

11. అర్ధ జ్ఞానం అత్యంత ప్రమాదకరం:
పద్మవ్యూహం లోనికే ప్రవేశించటమే కానీ బయటపడటం తెలియక తనకున్న అర్ధ జ్ఞానమతో అభిమన్య్యుడు వంటి మహావీరుడే నేల రాలిపోయాడు. ఏ పనిని అయిన పూర్తిగా తెలుసుకున్నకే మొదలుపెట్టాలి, అలా తెలుసుకోకపోతే ఆ పనిని మధ్యలోనే వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది.

*12.
కేవలం ద్రౌపదికి జరిగిన అవమానం వలన, ఆమె కౌరవ సామ్రాజ్యం మీద పెంచుకున్న కోపం చివరికి కౌరవులని వాళ్ళ సామ్రాజ్యాన్ని నామ రూపాలు లేకుండా చేసింది,

13. నీకు ఆసక్తి ఉంటే నిన్ను ఎవ్వరూ ఆపలేరు:
చాలా మందికి తెలిసినంత వరకూ అర్జునుడే ప్రపంచం మొత్తంలో అతిపెద్ద విలికాడు ,కానీ కుటిల రాజకీయాల వలన తన వేలుని కోల్పోయిన ఏకలవ్యుడు, అర్జునుడిని మించిన వీరుడు నేరుగా గురు శిక్షణ లేకున్నా ,అతనికి ఉన్న ఆసక్తే అర్జునుడి కన్నా గొప్ప వీరుణ్ణి చేసింది. కావున ఏదైనా సాధించాలంటే ముందుగా మనకు దాని పైన అమితమైన ఆసక్తి ఉండాలి లేకపోతే సాధించలేము.

14.మంచి వ్యూహం విజయానికి తప్పనిసరి:
పాండవులకే కనుక కృష్ణుడు తన అతిచక్కని వ్యూహం లేకపోయి ఉంటే పాండవులు విజయాన్ని సాధించ గలిగే వారు కాదు ఏమో, ఏ పని చెయ్యాలన్న ఒక మంచి ప్లాన్(వ్యూహం) ఉండాలి అలా అయితేనే ఆ పనిని సక్రమంగా పూర్తి చేయగలుగుతాం.   ...మీ...సైకాలజిస్ట్ ...ప్రత్యుష సుబ్బారావు  గుంటూరు

Friday, July 29, 2016

help .

కొత్తగా రిలీజ్ అయిన సినిమాకు నేను నా పిల్లలతో థీయేటరుకు వెళ్ళాను.

' టిక్కెట్టు ఎంతండీ? " ఆని అడిగాను........

" కొత్త సినిమా కదా! అందులో ప్రముఖ హీరో సినిమా మరి.,.ఒక్కొక్క టికెట్టు
  500 రూ.  ఇవ్వమంటారా? " కౌంటరులోని వ్యక్తి........

ఒక్కనిమిషం ఆలోచించాను.......మేము నలుగురం . అంటే 2000 రూ.
ఒక్క 2 గంటల సినిమాకు ఖర్చు........వెంటనే సినిమా హాలు బయటకు
వచ్చి ఆటో ఎక్కాను. ఆటోవాలా " ఎక్కడికి వెళ్ళాలి సార్ ?" అని అడిగాడు.

పిల్లలు.........భార్య కాస్త దిగులుగా ఉన్నట్టు అనిపించింది. అయినా
సరే అనుకుని ఆటోవాలాతో పక్కనే ఉన్న వృద్ధాశ్రమానికి వెళ్ళమని
చెప్పేశాను. ఆటోవాలా కూడా మమ్మల్ని అక్కడ దింపేసి వెళ్ళిపోయాడు.

వృద్ధాశ్రమంలోకి వెళ్ళి  ఒకపూట ఈ వృద్ధులకు భోజనానికి ఎంత అవుతుందని
అడిగాను.......ఆశ్రమంలోని వ్యక్తి 1500 రూ. అవుతుందని చెప్పగానే

" నా దగ్గర 2000 రూ. ఉన్నాయి........ఈ పూటకు ఈ పెద్దవాళ్ళకు
  బోజనాలు పెట్టించండి....మరొక చిన్న విన్నపం.....నాకు నా తల్లిదండ్రులు
  చిన్నప్పుడే చనిపోయారు. మేము కూడా ఈ రోజు ఇక్కడే భోంచేసి
  మా పిల్లలు తాతయ్యలతో, నాన్నమ్మలతో, అమ్మమ్మలతో గడుపడానికి
  మాకు అవకాశాన్ని ఇవ్వండి దయచేసి " అని అన్నాను.

సినిమాకు తీసుకెళ్ళకుండా ఇక్కడికి తీసుకుని వచ్చానని నాపై కాసేపు
అలిగినా........అక్కడ ఆ పెద్దలతో ఆటలు....పాటలు కథలతో
మా పిల్లలు ......మేము చాలా సంతోషంగా గడిపి వచ్చాము....

భోంచేసి బయటికి రాగానే ఒక పెద్దమ్మ నన్ను నా కుటుంబాన్ని ఇలా
దీవించింది.......

" మాకు కూడా మనవళ్ళు.........మనవరాళ్ళు ఉన్నారు. వారితో ఆడుకోవాలని
   ఎన్నెన్నో కథలు చెప్పాలని ఉండేది ...మాకు భోజనాన్ని అందించడమే
   కాకుండా మా సొంత కొడుకులా మాతో గడిపి వెళుతున్నందుకు మీరు
   మీ కుటుంబం కలకాలం సుఖ సంతోషాలతో నిండు నూరేళ్ళూ ఆనందంగా
   ఉండాలని ఈ పండుటాకు దీవిస్తోంది. నీలాంటి వారికి దేవుడు అన్ని
   విధాలుగా తోడుగా ఉంటాడు......జాగ్రత్తగా వెళ్ళిరండి "

నా భార్య కళ్ళల్లో ఓ గర్వంతో కూడిన ఆనందం......నా పిల్లల మొహంలో
సినిమాకు వెళ్ళినా కనపడని సంతోషం కనిపించింది.......మంచి పనిచేశానన్న
తృప్తితో ఇంటికి వచ్చాను...........
.............విజయపథం...






కోపం దాని పర్యావసనం 😡  ఒక ఆఫిసర్ 👨 చిరాకుగా ఉన్నప్పుడు అతని కింద పనిచేసే గుమాస్తా 👴🏻 ఒక ఫైలు 📂 తీసుకొచ్చాడూ    ఆ ఫైలులో చిన్న తప్పుంది దానికి ఆఫిసర్ 👨కోపంగా😡 ఏ..మయ్యా 30 ఏళ్ళుగా పనిచేస్తున్నావు ఈ మాత్రం చాతగాదూ..? నీతో పని చేయించుకునే బదులు ఏ అడ్డగాడిది 🐴తో చేయించుకున్నా నాకింత సుఖం దక్కేది అన్నాడు.. గుమాస్తా 👴🏻 భాధపడుతూ ఇంటికి 🏡వెళ్ళీ హాల్లో కుచున్నాడు అతని భార్య 💁🏻 కాఫీ తెచ్చి ఇచ్చింది దాంట్లో చెక్కర🍚 వేయడం మర్చిపోయింది వెంటనే అతడు కోపంగా 😡 ఒసేయ్... 30 ఏళ్ళుగా కాపురం చేస్తున్నావు కాఫీలో పంచదార వేయడం రాదూ..? నీతో కాపురం చేసేకన్నా... అడ్డగాడిద🐴తో కాపురం చేస్తే  కాసింత సుఖం దక్కేది అన్నాడు... దాంతో అతడి భార్య 💁🏻 చిరాకుగా లోపలికి వెళ్ళింది లోపల హోంవర్క్ చేయకుండా టీవీ 📺 చూస్తూ కూర్చున్న పిల్లవాడిని 🙇🏻 ఒక్కటి పీకింది👋 ఆ పిల్లవాడు కోపంగా  బెడ్రూంలోకి వెళ్ళి అక్కడ వున్న కుక్కను 🐕 ఒక్క తన్ను తన్నాడు ఆ కుక్క అరుస్తూ బయటికి పరుగెత్తుతూ మధ్యలో హాల్లో కాళ్లు చాపుకునీ కూర్చున్న గుమాస్తాను👴🏻 కరిచిందీ.... కుక్క 🐕 కరవడం వల్ల గుమాస్తా👴🏻 2రోజులు ఆఫీసుకి వెల్లలేకపోయాడు... దాంతో ఆఫిసరే 👨🏻 2రోజులూ మొత్తం పని చేసుకోవాల్సి వచ్చింది.....                           ...............నీతి.................... తనకోపమే😡తనశత్రువు....  తనశాంతమే😌తనకురక్ష....
 

"అందమైన స్త్రీ "ఎయిర్ హోస్టెస్ ను పిలిచి ..

ప్రయాణికులతో పూర్తిగా నిండి , రద్దీగా ఉన్న విమానంలోకి ఒక అందమైన ప్రయాణికురాలు ప్రవేశించి తన సీటు కోసం వెతుకసాగింది.
రెండు చేతులు లేని ఒక వ్యక్తి ప్రక్క తన సీటు ఉండడాన్ని చూసి, అతని ప్రక్కన కూర్చోవడానికి సందేహించింది.......!!!

ఆ "అందమైన స్త్రీ "ఎయిర్ హోస్టెస్ ను పిలిచి ..
" నేను ఇక్కడ కూర్చుని సుఖంగా ప్రయాణం చేయలేను. నా సీటును మార్చగలరా?'' అని అడిగింది.
"మేడమ్! దయచేసి కారణం తెలుసుకోవచ్చా?" అడిగింది ఎయిర్ హోస్టెస్.
" ఇలాంటి వారంటే నాకు అసహ్యం.వీరి ప్రక్కన కూర్చుని ప్రయాణించడం నాకు ఇష్టం ఉండదు." అంది ఆ అందమైన స్త్రీ.
చూడడానికి హుందాగా - అందంగా - నాగరికంగా కనిపిస్తున్న ఆమె నోటి నుండి వచ్చిన ఈ మాటలను విని ఎయిర్ హోస్టెస్ చాలా ఆశ్చర్యపోయి చూసింది.
ఆ అందమైన స్త్రీ మళ్లి తనకు "ఈ సీటు వద్దు. మరో సీటు కావాలని డిమాండ్ చేసింది."
"కొద్దిసేపు ఓపిక పట్టండి. నేను మీకోరికను నెరవేర్చే ప్రయత్నం చేస్తాను." అని ఎయిర్ హోస్టెస్ ఎక్కడైనా సీటు ఖాళిగా ఉందేమోనని వెతికింది. కాని ఎక్కడా దొరకలేదు.

ఆ ఎయిర్ హోస్టెస్ తిరిగి వచ్చి "మేడమ్! ఈ ఎకనామి క్లాస్ లోని సీట్లన్నీ పూర్తిగా నిండిపోయాయి. అయినా మా విమానంలో ప్రయాణించే వ్యక్తుల కంఫర్ట్ కోసం పూర్తి స్థాయిలో ప్రయత్నించడం మా ఫాలసి. కెప్టెన్తో మాట్లాడి వచ్చి చెబుతాను కాస్త ఓపిక పట్టండి." అంటూ కెప్టెన్ దగ్గరికి వెళ్లింది.

కొన్ని క్షణాల తరువాత తిరిగి వచ్చి " మేడమ్! మీకు కలిగిన అసౌఖర్యానికి చింతిస్తున్నాము. ఈ విమానం మొత్తంలో ఫస్ట్ క్లాసులోని ఒకే ఒక సీటు ఖాళిగా ఉంది.మావాళ్లతో మాట్లాడి ఒక అసాధారణమైన నిర్ణయం తీసుకున్నాము. ఒక ఎకనామి క్లాస్ లోని వ్యక్తిని ఫస్ట్ క్లాసులోకి పంపడం మా కంపని చరిత్రలోనే మొదటిసారి.....

ఆ అందమైన స్త్రీ ఆనందంగా ఏదో చెప్పబోయే లోపల ....

ఎయిర్ హోస్టెస్ ఆమె పక్కసీట్లో కూర్చున్న వ్యక్తితో...
" సార్! దయచేసి ఎకనామి క్లాస్ నుండి ఫస్ట్ క్లాసులోకి రాగలరా? ఒక సంస్కారం తెలియని వ్యక్తి ప్రక్కన కూర్చుని ప్రయాణించవలసిన దురదృష్టాన్ని మేము మీకు తప్పించాలనుకుంటున్నాము." అంది.
ఎయిర్ హోస్టెస్ మాటలను విన్న మిగతా ప్రయాణికులందరూ ఒక్కసారిగా.. చప్పట్లు చరుస్తూ ఆ నిర్ణయాన్ని స్వాగతించసాగారు.
ఆ అందమైన స్త్రీ ముఖం పాలిపోయింది.
అప్పుడా వ్యక్తి లేచి నిలుచుని ...
"నేనొక మాజి సైనికుడిని.కాశ్మీర్ బోర్డర్ లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ లో నా రెండు చేతులను కోల్పోయాను.
మొదట ఈమె మాటలు విన్న తరువాత 'ఇలాంటి వాళ్ల కోసమా మా జీవితాన్ని ఫణంగా పెట్టింది.' అనిపించింది.
కాని, మీ అందరి ప్రతిస్పందన చూశాకా దేశం కోసం నా రెండు చేతులను కోల్పోయినందుకు గర్వపడుతున్నాను."
...... అంటూ ప్రయాణికుల చప్పట్ల మధ్య ఫస్ట్ క్లాసులోకి వెళ్లిపోయాడు.
ఆ అందమైన స్త్రీ రెండు సీట్లలోనూ ఒక్కతే సిగ్గుతో కూలబడిపోయింది...........

Sunday, June 19, 2016

human ethics



మానవుడు_మనిషి...
సూర్యోదయం వేళ మనకు తెలుసు. వేపపూత కాలం మనమెరుగుదుము. ప్రతి ఏటా మామిడి కాయలు కాసే సమయం మనకు కరతలామలకం. ప్రకృతిలో ప్రతీదీ నియమానుసారం నడుస్తోంది. కాని, మనిషి ఒక్కడే ఎందుకో అడుగడుగునా తడబడుతుంటాడు!
మనం ప్రపంచాన్ని నమ్మాలి. అంటే, తోటి మనుషుల్ని నమ్మగలగాలి. మనకు వచ్చే సంపదలు ఎవరో తెచ్చివ్వాలని ఆశించకూడదు. మన ఆనందాన్ని మరెవరో కొనితేవాలని అనుకోకూడదు. మన మనసు ద్వారాలు ఎల్లవేళలా తెరిచి ఉంచితే ఆ ఆనందం, ఆ సంపద రావాల్సిన వేళకు అవే వస్తాయి! మనకోసం విధి రాసిపెట్టి ఉంటే వాటినెవరైనా ఆపగలరా! వాటికోసం సహనం వహించాల్సిన బాధ్యత మనకు లేదా!

ఒక తాబేలు కుటుంబమంతా కలిసి ఒకసారి దూరాన కొండల వెనకనున్న అడవిలోకి వనభోజనానికి వెళ్లింది. తీరా అక్కడికి వెళ్ళి చూసుకుంటే ఆహారమంతా ఉంది కాని, వాటిలో ఉప్పు పొట్లం కనిపించలేదు. అందరిలోకీ అతివేగంగా వెళ్ళగలదని చిరుతాబేలును తొందరగా ఇంటికి వెళ్ళి ఉప్పు తీసుకురమ్మని తక్కిన తాబేళ్లు పురమాయించాయి. చిరుతాబేలు ఎప్పుడు తిరిగివస్తుందా, తెచ్చుకున్నది ఎప్పుడు తిందామా అని అవి ఎదురుచూడసాగాయి. చూస్తుండగా ఆరు వారాలు గడిచిపోయాయి. కాని, ఆ చిరు తాబేలు జాడ లేదు. 'ఇంక దీనికోసం ఎన్నాళ్లాగుతాం? ఇంట్లో ఏదోటి తింటూ అది హాయిగానే ఉండుంటుంది. మనకు ఆకలేస్తున్నది. ఇలాగే తినేద్దాం...' అని కూడబలుక్కుని మూటలు విప్పాయి అక్కడున్న తాబేళ్లు. అంతలో వెనకవైపు చెట్ల గుబుర్ల లోంచి ఆ చిరుతాబేలు ఒక్క గెంతులో వాళ్ల ముందుకు దూకింది. 'ఆరు వారాల్నించి మిమ్మల్ని అక్కడ్నించి కనిపెడుతూనే ఉన్నా! చివరికి నా అనుమానం నిజమే అయింది. నేను లేకుండా మీరంతా కలిసి తినటానికి సిద్ధమవుతారని నాకు ముందే తెలుసు' అంది.

మనలో కొందరు ఆ చిరుతాబేలు లాంటివారే! వాళ్లూ తోటివారిని నమ్మరు.
తమ పని తాము చేయరు. అంతా తామనుకున్నట్టు జరగాలనుకుంటారు. ఈ అపనమ్మకంవల్ల తాము చేయాల్సిన పని మానేసి తోటివాళ్లు శ్రమ పడాలనుకుంటారు. బాధ్యత తీసుకోవాలనుకుంటారు. దీనివల్ల తమకు మేలు జరగదు సరికదా- ఎవరికీ మంచి జరగదు. ఈ వివేకం వారికుండదు.

దీనికి కారణం తమకే అంతా తెలుసుననుకునే అహంకారం. తక్కిన వారికన్న తామే ముఖ్యులమనుకునే అహంభావం. ఇతరుల అభిప్రాయంకన్నా తాము నమ్మిందే నిజమనుకునే మూర్ఖత్వం. తాము చేసేదేదీ తప్పు కాదనుకుంటారు. అన్నిటికీ అతీతులమనుకుంటారు. కేవలం ఇదొక మొండితనమని వారికి తోచదు. ఈ అహంకారంతో స్వార్థం తలెత్తుతుంది. ఇది అనర్థదాయకమని ఎవరు చెప్పినా వారు వినరు, కనరు, గ్రహించుకోరు.

అలాకాక, కాస్త పట్టువిడుపులుంటే ఇతరుల అభిప్రాయాలకూ కొంచెం విలువనిస్తే ఫలితం అత్యద్భుతంగా ఉంటుంది. 'నేను' 'నాది' అన్న మాటలు విడిచిపెట్టి అంతా 'మనం', 'మనది' అని అనుకోవటంలో ఎంత సంతోషముందో, అందరికీ ఎంత లాభదాయకమో అవగతమవుతుంది.

ప్రకృతితో సహజీవనం చేసే జంతువులు, పక్షులనుంచి మనిషి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. భగవంతుడి సృష్టిలో ఐకమత్యంగా జీవించటం సహజ గుణం. విభేదించి ఒంటరిగా బతకటం విపరీత లక్షణం. వీటిలో ఏది కావాలో నిర్ణయించుకోవటం మనిషి చేతుల్లోనే ఉంది!...
మాయమైపోతున్న మనిషి..
.