Pages

Showing posts with label క్రీడలు. Show all posts
Showing posts with label క్రీడలు. Show all posts

Monday, September 12, 2016

పూజారి శైలజ..!



పూజారి శైలజ..!

పద్నాలుగు సంవత్సరాల క్రితం క్రీడాప్రేమికులకు పరిచయం అవసరం లేని పేరు..!
22 అంతర్జాతీయ అవార్డులు..
26జాతీయ అవార్డులు..
మరెన్నో పతకాలు..!
ఈ రోజున తినడానికి తిండి కూడా లేని పరిస్ధితిలో..
ఇదిగో... ఇలా రోడ్డున పడి, ఎవరైనా సాయం చేస్తారా అన్నట్లుగా కూర్చుని ఉంది..
ప్రభుత్వం వెంటనే స్పందించాలి..
సింధుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు10 కోట్లకు పైగా ఇచ్చారు..
అది మీ డబ్బు కాదు..
మేము కష్టపడి సంపాదిస్తే, వచ్చిన సొమ్ము..
అంత డబ్బు ఇచ్చినా మేమేమీ అనలేదు..
ఎందుకో తెలుసా?
ఆడపిల్లలు కష్టపడి మనదేశ ప్రతిష్టను ప్రపంచానికి చాటి చెప్పారు అని..
ఈ రోజున అదే ఆడపడుచు కష్టపడుతోంది..
ఇవ్వండి.. మా డబ్బులే ఇవ్వండి..
కోట్లు అవసరం లేదు..
మీరు ఆ రోజున తనకు ఇచ్చిన మాట మీద నిలబడి, తనకు ఒక ఉద్యోగం ఇవ్వండి..
ఎకరాలు ఎకరాలు స్థలాలు అవసరం లేదు..
ఒక చిన్న ఇల్లు ఇవ్వండి చాలు..!ఇది మనదేశ ప్రభుత్వపెద్దలకు వెళ్లేలా షేర్ చేయండి ..





మూడ నమ్మకం
౦౦౦౦౦౦౦౦౦౦౦౦
వాస్తులు పె౦చునా  ఆస్తులు
పస్తులతో పెరుగునా అ౦తస్తులు
జాతకాలు మార్చునా బతుకులు
పూజలతొ దొరుకునా మెతుకులు
********************
జ్యోతిష్య౦ పె౦చునా ఆయస్సు
మ౦త్రాలకు ఆగునా ఉషస్సు
తపస్సుతో మారునా మనస్సు
నమ్మకు నమ్మకు మూడనమ్మక౦
*********************
పిల్లి ఎదురొస్తె అరిష్ట౦
తుమ్మితే పోతు౦దా అద్రుష్ట౦
బల్లి పడితే వస్తు౦దా కష్టం
ఇవన్నీ నమ్మితేనే మనకు నష్ట౦
*********************
చిలుక కె౦ ఎరుక నీ జీవితం
య౦త్ర౦ కె౦ ఎరుక నీ జాతక౦
మ౦త్ర౦ కె౦ ఎరుక నీ వ్యాపక౦
ఇ౦కెన్నాళ్ళీ మూడనమ్మకాల నాటకం
మూడనమ్మకాలే అ౦త
 

Sunday, July 10, 2016

క్రికెట్‌లో బౌలింగ్‌ చేశాక బంతి పిచ్‌పై పడే ముందుకన్నా, పిచ్‌ను తాకిన తర్వాత దాని వేగం ఎక్కువగా ఉంటుంది. ఎందువల్ల?

 ప్రశ్న: క్రికెట్‌లో బౌలింగ్‌ చేశాక బంతి పిచ్‌పై పడే ముందుకన్నా, పిచ్‌ను తాకిన తర్వాత దాని వేగం ఎక్కువగా ఉంటుంది. ఎందువల్ల?

జవాబు: చలనంలో ఉన్న ప్రతీ వస్తువుకు కొంత శక్తి ఉంటుంది. వేగంగా ప్రవహిస్తున్న నీటికి, వేగంగా వీస్తున్న గాలికి ఉన్న శక్తి మనకు తెలిసిందే. ఈ శక్తిని గతిజ శక్తి అంటారు. బొంగరంలాంటి వస్తువు వేగంగా తన చుట్టూ తాను తిరుగుతుంటే ఆ భ్రమణ వేగం వల్ల కలిగే శక్తిని భ్రమణ గతిజ శక్తి అంటారు. ఇప్పుడు క్రికెట్‌ బంతి విషయానికి వద్దాం. ఈ బంతి వేగంతో ముందుకు వెళ్లడం వల్ల గతిజ శక్తి కలిగి ఉంటుంది. బౌలర్‌ బంతిని తిప్పుతూ విసరడం వల్ల అది తన చుట్టూ తాను తిరుగుతూ ముందుకు వెళుతుంది. అందువల్ల దానికి భ్రమణ గతిజ శక్తి కూడా ఉంటుంది. ఈ రెండు గతిజ శక్తులతో బంతి పిచ్‌పై పడుతుంది. అపుడు బంతికి పిచ్‌కు మధ్య కలిగిన ఘర్షణవల్ల భ్రమణ గతిజ శక్తిలోని స్వల్పభాగం ఉష్ణశక్తి రూపంలోకి మారినా మిగతాదంతా గతిజశక్తిగా మారి బంతికి అంతకుముందున్న గతిజ శక్తికి తోడవుతుంది. ఇలా గతిజ శక్తి పెరగడం వల్ల పిచ్‌పై పడే వేగంకన్నా ఎక్కువ వేగాన్ని సంతరించుకుని బంతి వికెట్‌లవైపు దూసుకుపోతుంది.

Friday, June 10, 2016

visa

అమెరికా వెళ్లాలనుకునేవారు వీసాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలిసి ఉంటుంది. ఎంతో మంది ఈ వీసాల గురించి తెలియక దళారుల చేతుల్లో మోసపోయి లబోదిబోమంటున్నారు. ఈ మధ్యనే ఇద్దరు భారతీయ సోదరులు వీసాల విషయంలో మోసం చేశారని అమెరికా కోర్టు ఏడేళ్లు శిక్ష విధించింది. తాజాగా ఇద్దరు ఇండియన్ అమెరికన్ కపుల్స్ కూడా ఇలా దొంగ వీసాలను ఇస్తూ జైలు ఊచలు లెక్కబెట్టారు. వీరు ఉద్యోగాల వీసా ఇస్తామని చెప్పి చాలామందిని మోసం చేసిన కేసులో జైలు ఊచలు లెక్కబెడుతున్నారు. మాములుగా అయితే అమెరికా వెళ్లే వారికి.. ఆ వ్యక్తి పనిని బట్టి, అక్కడ ఉండే కాలపరిమితిని బట్టి వీసాలు మంజూరు చేస్తుంటారు. ఒక్కోరకం వీసాకి ఒక్కో ప్రత్యేక నిబంధనలు ఉంటాయి.

అసలు అమెరికా వెళ్లాలంటే ఏ వీసాలు ఉండాలి. ఎక్కువ మంది జనాలకు తెలియని రకరకాల వీసాలేంటో ఓ లుక్కేద్దాం.
Source:

బి-1 వీసా:

అమెరికాలో బహుమతులు అందుకోవటానికి, కాన్ఫరెన్స్లకు వెళ్లే వారు, క్రీడల్లో పాల్గొనటానికి వెళ్లే వారికి బి-1 వీసాను మంజూరు చేస్తారు. వ్యాపార పనుల నిమిత్తం అమెరికాకు వెళ్లే వారికి ఈ కేటగిరీ వీసానే మంజూరు చేస్తారు.

 బి-2 వీసా:
దీన్నే విజిటర్ వీసా లేదా టూరిస్ట్ వీసా అని కూడా అంటారు. అమెరికాను చూడటానికి, అక్కడ విశ్రాంతి తీసుకోవటానికి, బంధుమిత్రులతో గడపటానికి వెళ్లాలంటే బి-2 కేటగిరీ వీసాను పొందాల్సిందే. దీంతోపాటు సోషల్ సర్వీస్ ఈవెంట్స్లో పాల్గొనేవారు, రెమ్యూనరేషన్ తీసుకోకుండా ప్రదర్శనలు ఇచ్చే కళాకారులు, క్రీడాకారులకు ఈ వీసాను ఇస్తారు.

 సి- వీసా:
అమెరికా మీదుగా మరొక దేశానికి వెళ్లాలంటే ఈ వీసా ఉండాలి.

 డి- వీసా:
అమెరికాలోని విమానాల్లో లేదా నౌకల్లో పనిచేసే బృందంలో ఉద్యోగిగా జాయిన్ కావాలంటే డి- వీసా పొందాలి

 ఎఫ్‌-1 వీసా:
ఇది విద్యార్థులకు సంబంధించిన వీసా. అమెరికాలో అకడమిక్ కోర్సుల్లో చదువుకోవాలనుకునే వారు ఈ వీసాను పొందాలి.

 హెచ్‌-1బి వీసా:
అమెరికాలో తాత్కాలిక ఉద్యోగం చేయాలనుకునేవారు ఈ వీసాను తీసుకోవాల్సిందే. ఇక అమెరికాలో పర్మినెంట్, ప్రభుత్వ సంబంధిత ఉద్యోగాలు చేయాలంటే గ్రీన్కార్డు హోల్డర్ అయి ఉండాలి. అద్భుతమైన పరిజ్ఞానం అవసరమయ్యే స్పెషాలిటీ ఆక్యుపేషన్స్లో పని చేసేవారికి మాత్రమే ఈ వీసాను ఇస్తారు. అమెరికాలో పిటిషన్ అమోదం ఉంటేనే ఇండియా నుంచి అక్కడికి వెళ్లే అవకాశం ఉంది.

 జె వీసా:
ఎక్చ్సేంజ్ విజిటర్లకు ఈ వీసాలు ఇస్తారు.

 ఎల్‌ వీసా:
ఇండియాలోని బహుళజాతి సంస్థలు అమెరికాలోని తన కంపెనీల్లో ఉద్యోగం చేయటానికి తీసుకుంటే, ఆ ఉద్యోగి ఈ వీసాను తీసుకోవాల్సిందే.

 ఎమ్‌-1 వీసా:
వృత్తి విద్యా సర్టిఫికేషన్లు పొందేవారికి ఈ వీసా అవసరం.

 ఓ- వీసా:
టెలివిజన్, సినిమా, లలిత కళలు, క్రీడలు, శాస్త్రవిజ్ఞానానికి సంబంధించిన వారు వెళ్లటం కోసం ఓ వీసా తీసుకోవాలి.

 పి-1 వీసా:
అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులున్న కళాకారులు, క్రీడాకారులు ఈ వీసా కోసం అప్లై చేస్తారు.

 పి-2 వీసా:
ప్రభుత్వాలు ఇచ్చిపుచ్చుకునే ఏర్పాటు కింద కళాకారులకు వెల్కమ్ చెబుతుంటుంది. ఇలా అమెరికాకి వెళ్లే కళాకారులకు పి-2 వీసా ఉండాలి.

 పి-3 వీసా:
కల్చరల్ ప్రోగ్రామ్స్లో ప్రదర్శనలు ఇవ్వటానికి వెళ్లే ఆర్టిస్టులు, కళాకారులకి ఈ వీసా అవసరం.

 R-1 వీసా:
మతసంబంధమైన విషయాలకోసం వెళితే ఆర్-వీసా ఉండాలి.
.