Pages

Sunday, July 10, 2016

క్రికెట్‌లో బౌలింగ్‌ చేశాక బంతి పిచ్‌పై పడే ముందుకన్నా, పిచ్‌ను తాకిన తర్వాత దాని వేగం ఎక్కువగా ఉంటుంది. ఎందువల్ల?

 ప్రశ్న: క్రికెట్‌లో బౌలింగ్‌ చేశాక బంతి పిచ్‌పై పడే ముందుకన్నా, పిచ్‌ను తాకిన తర్వాత దాని వేగం ఎక్కువగా ఉంటుంది. ఎందువల్ల?

జవాబు: చలనంలో ఉన్న ప్రతీ వస్తువుకు కొంత శక్తి ఉంటుంది. వేగంగా ప్రవహిస్తున్న నీటికి, వేగంగా వీస్తున్న గాలికి ఉన్న శక్తి మనకు తెలిసిందే. ఈ శక్తిని గతిజ శక్తి అంటారు. బొంగరంలాంటి వస్తువు వేగంగా తన చుట్టూ తాను తిరుగుతుంటే ఆ భ్రమణ వేగం వల్ల కలిగే శక్తిని భ్రమణ గతిజ శక్తి అంటారు. ఇప్పుడు క్రికెట్‌ బంతి విషయానికి వద్దాం. ఈ బంతి వేగంతో ముందుకు వెళ్లడం వల్ల గతిజ శక్తి కలిగి ఉంటుంది. బౌలర్‌ బంతిని తిప్పుతూ విసరడం వల్ల అది తన చుట్టూ తాను తిరుగుతూ ముందుకు వెళుతుంది. అందువల్ల దానికి భ్రమణ గతిజ శక్తి కూడా ఉంటుంది. ఈ రెండు గతిజ శక్తులతో బంతి పిచ్‌పై పడుతుంది. అపుడు బంతికి పిచ్‌కు మధ్య కలిగిన ఘర్షణవల్ల భ్రమణ గతిజ శక్తిలోని స్వల్పభాగం ఉష్ణశక్తి రూపంలోకి మారినా మిగతాదంతా గతిజశక్తిగా మారి బంతికి అంతకుముందున్న గతిజ శక్తికి తోడవుతుంది. ఇలా గతిజ శక్తి పెరగడం వల్ల పిచ్‌పై పడే వేగంకన్నా ఎక్కువ వేగాన్ని సంతరించుకుని బంతి వికెట్‌లవైపు దూసుకుపోతుంది.

No comments:

Post a Comment

.