Pages

Sunday, July 31, 2016

పెళ్ళికి ముందు



 పెళ్ళికి ముందు

గోపి  :  ఆమాటకోసమే ఎదురు చూస్తున్నా!


రాధ  :  నన్ను వదలి వెళ్ళిపోతావా?


గోపి   : చఛ ఆ ఆలోచనే లేదు.


రాధ   :  నన్ను ప్రేమిస్తున్నావు కదా?


గో      :  24 గంటలు అదే ధ్యాస!


రాధ   : నన్నేపుడూ మోసం చెయ్యవు కదా!


గోపి    : చచ్చినా చచ్చినా చెయ్యను.


రాధ      : నన్ను కిస్ చేస్తావా?


గోపి      : ఆ అవకాశాన్ని ఎందుకు వదులుకుంటాను.


రాధ.   : నన్ను కొడతావా?


గోపి     : పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు!


రాధ.    : నేను నిన్ను నమ్మొచ్చా?


గో        : ఎస్


రాధ.   : గోపీ


పెళ్ళి తర్వాత .....(కింద నుండి పైకి చదవండి)

 

 

 

 

ఒకసారి ఒక ట్రైన్ ...... అర్ధరాత్రి వేళ..... పట్టాలొదిలి .... పొలాల్లోంచి ... పరుగెత్తటం మొదలెట్టింది....
ఏమి జరిగిందో అర్ధం కాక ........
జనాల హాహాకారాలు, అరుపులూ, కేకలతో ఆ ట్రైన్ అంతా హోరెత్తిపోయింది.
కాస్సేపు అయ్యాక, ట్రైన్ మరలా పట్టాల మీదకొచ్చేసింది. కొంతమంది సర్దుకున్నారు. ఇంకొంత మంది ఇంకా గగ్గోలు పెడుతూనే వున్నారు.
స్టేషన్ వచ్చాక, ట్రైన్ ఆగింది. అందరూ రొప్పుతూ ..... ఇంజన్ దగ్గర కి పరుగెత్తారు. అంతా డ్రైవర్ పైన విరుచుకు పడ్డారు.
కేబిన్లోనుంచి .... డ్రైవర్ బయటకు వచ్చి....
డ్రైవర్ : " ఒకడు పట్టాలు మీద అడ్డంగా నిల్చున్నాడు "
ఓ ప్యాసెంజరు ( కోపంతో ) : " ఒక్కడి కోసం .... ఇంతమంది ప్రాణాలతో ఆడుకుంటావా ? తొక్కి పడేయ్యాల్సింది ... వెధవని "
డ్రైవర్ : " నేనూ అలానే.... చేద్దామనుకున్నా ... కానీ ఆ వెధవ .... సడెన్ గా పొలాల్లో కి పరుగెత్తాడు మరి 

No comments:

Post a Comment

.