Right to Education RTE act
విద్యాహాక్కు చట్టo ముఖ్యాంశాలు-సెక్షన్లు వివరణ
ఈచట్టంలో
07 అధ్యాయాలు;38 సెక్షన్లు;01 షెడ్యూల్ ఉన్నాయి.
విద్యాహక్కు
చట్టం-2009 లోని ఆంశాలు భారత
రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 29,30నియమాలకు లోబడి ఉంటాయి.
2009 జూలై 20న
భారత పార్లమెంట్ విద్యహక్కు చట్టాన్ని ఆమోదించింది.
ఆగస్ట్
26న భారత రాష్ట్రపతి ఆమోదాన్ని
పొందినది.
01 ఏప్రిల్ 2010
నుండి అమలులోకి వచిన్ది.
ఈ
చట్టం జమ్మూకాశ్మీర్ రాష్ట్రాన్ని మినహాయించి భారతదేశానికి అంతటికీ వర్తిస్తుంది.
ఈ
చట్టాన్ని పకడ్బందీగా అమలుచేస్తున్న దేశం చిలీ.
ప్రపంచంవ్యాప్తంగా
135 దేశాల్లో ఈ చట్టం
అమలవుతుతోంది.
భారతదేశంలో
మెదటిసారిగా ఉత్తరప్రదేశ్ లో విద్యాహక్కుచట్టం అమలయ్యిoది.
విద్యాహక్కు
చట్టం- 7 అధ్యాయాలు
*అధ్యాయం-1**
చట్టం
పేరు,పరిధి,అమలు,వివిధ పదాలకు సంబందించిన
అర్ధాలు,నిర్వచనాలు పొందుపర్చారు.ఈ
వివరాలను 1 నుండి 3 సెక్షన్ల ద్వారా తెలిపారు.
**అధ్యాయం-2**
ఉచిత
విద్యకు బాలల హక్కు,బడిలో ప్రవేశం,బదిలీ ధ్రువీకరణ పత్రం మొ!!
అంశాలను పొందుపర్చారు. వివరాలను 4,5
సెక్షన్ ల ద్వారా తెలిపారు.
**అధ్యాయం-3**
కేంద్ర
ప్రభుత్వం,రాష్ట్ర ప్రభుత్వం,స్థానిక ప్రభుత్వం,తల్లిదండ్రుల బాధ్యత,పూర్వ ప్రాధమిక విద్యాకేంద్రాల
ఏర్పాటు మొ!! అంశాలను పొందుపర్చారు.వివరాలను 6-11 సెక్షన్ ల ద్వారా తెలిపారు.
**ఆధ్యాయo-4**
బడులు
ఉపాధ్యాయుల బాధ్యతలకు సంబందించిన వివరాలు పొందుపర్చారు.వివరాలను 12 నుండి 28 సెక్షన్ల ద్వారా తెలిపారు.
***అధ్యాయం-5***
నాణ్యమైన
విద్యకు సంబందించిన విద్యా ప్రణాళికలు,పాఠ్యప్రణాళికలు,ముల్యాoకానా
విధానాలు మొ!! అంశాలను పొందుపర్చారు.వివరాలను 29,30 సెక్షన్ల ద్వారా తెలిపారు.
**అధ్యాయం-6***
బాలల
హక్కుల సంరక్షణ,పర్యవేక్షణ,
పిర్యాదుల పరిష్కారం,
జాతీయ,రాష్ట్ర
స్తాయిలో సలహా సంఘాల ఏర్పాటు మొ!! అంశాలను పొందుపర్చారు.వివరాలను సెక్షన్ 31-34 ద్వారా తెలిపారు.
**అధ్యాయం-7**
చట్టం
గురించి ఆదేశాలు,జారీచేసే అధికారాలు,ప్రాసిక్యూషన్,
చేపట్టాల్సిన చర్యలు,నియమ నిబంధనలు రూపొందించడం గురించిన అంశాలను
పొందుపర్చారు.వివరాలు 35.38 సెక్షన్ల ద్వారా వివరించారు.
***విద్యాహక్కు
చట్టంలోని 38 సెక్షన్లు-ప్రాధాన్యత**
ఈ చట్టాన్ని ఉచిత నిర్బంధ విద్యకు బాలలహక్కు చట్టం-2009 గా పిలుస్తారు.చట్టంలోని వివిధ భావనలు-నిర్వచనాలు.
ఈ చట్టాన్ని ఉచిత నిర్బంధ విద్యకు బాలలహక్కు చట్టం-2009 గా పిలుస్తారు.చట్టంలోని వివిధ భావనలు-నిర్వచనాలు.
- 6-14 సం!! ఉన్న బాల బాలికలందరికి పరిసర ప్రాంత పాఠశాలల యందు ప్రాధమిక విద్యను పూర్తి చేసేవరకు ఉచిత నిర్బంధ విద్య పొందే హక్కు.
- 4⃣6-14 సం!! నిండిన బాల బాలికలను పాఠశాలలో చేర్చకపోయినా లేదా చేర్చిన తరువాత ప్రాధమిక విద్యను పూర్తిచేయకపోయినా వారి వారి వయస్సుకు
- తగ్గ తరగతిలో చేర్చుకోవాలి.వయస్సుకు తగిన తరగతిలో ప్రవేశం పొందిన బాలలు తోటి వారితో సమాన సామర్ధ్యాలు పొందడానికి,సిఫారసు చేసిన పద్దతిలో,సిఫారసు చేసిన
- కాలవ్యవధిలో ప్రత్యేక శిక్షణ పొందే హక్కును కలిగియుంటారు.
- 5⃣విద్యార్ధి వేరే బడిలో ప్రవేశం పొందడానికి బదిలీ కోరే హక్కును కలిగియుంటాడు.అయితే బదిలీ ధ్రువీకరణ పత్రం ఆలస్యం అయిందని వేరే బడిలో ప్రవేశం ఇవ్వకపోవడానికి,ఆలస్యంగా చేర్చుకోవడానికి కారణంగా చూపడానికి వీలులేదు.
- **
- 6⃣ఈ చట్టం అమలు తేదీనుండి 3సo!!లోపు పాఠశాలల్లో తరగతి గదులను ఏర్పాటుచేయాలి.
- 7⃣ఈ చట్టం అమలుకు నిధులను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకోవాలి(65:35)
- 8⃣రాష్ట్రప్రభుత్వ బాధ్యతలు
- *6-14 సం!! వయస్సున్న బాలబాలికలందరికీ ఉచితంగా ప్రాధమిక విద్యను అందించడం.
- *పరిసర ప్రాంతాల్లో 'బడి' అందుబాటులో ఉండే విధంగా చూడడం.
- 9⃣స్ధానిక ప్రభుత్వ బాధ్యతలు
- **14సం!! బాలబాలికలందరి రికార్డులు నిర్వహించడం.
- పాఠశాల భవనం,బోదనా సిబ్బంది,బోదనా పరికరాలతో సహా మౌళిక సదుపాయాలు కల్పించడం.
- విద్యాక్యాలెండర్ నిర్ణయించడం మొ!!
- 1⃣0⃣6-14 సం!! పిల్లలను పరిసర ప్రాంతాల్లోని ప్రాధమిక పాఠశాలల్లో చేర్పించడం తల్లిదండ్రుల బాధ్యత.
- 1⃣1⃣3సం!!:మించిన బాలలను ప్రాధమిక విద్యకు సంసిద్దులను చేయడానికి 6 సం!! నిండేవరకు బాలలందరికీ శైశవదశ సంరక్షణ,ఉచిత పూర్వ పాఠశాల విద్యనందించడానికి అవసరమైన ఏర్పాట్లను సంబంధిత ప్రభుత్వమే చేయాలి.
- 1⃣2⃣బడుల పరిసర ప్రాంతాలకు చెందిన బలహీన వర్గాలకు,ప్రతికూల పరిస్తితులు ఎదుర్కొంటున్న బ్రున్దాలకు చెందిన బాలలకు 1వ తరగతిలోని విధ్యార్దుల సంఖ్యలో 25%ప్రైవేటుకు కేటాయించి ప్రాధమిక విద్యను పూర్తి చేసేంతవరకు ఉచిత నిర్బంధ విద్యను అందజేయాలీ.
- 1⃣3⃣బడిలో ప్రవేశానికి ఏంపిక విధానం,క్యపిటేషన్ రుసుము ఉండకూడదు.
- 1⃣4⃣వయస్సు నిర్దారణ లేని కారణంగా ప్రవేశాన్ని తిరస్కరించకూడదు.
- ******
- 1⃣5⃣విద్యాసంస్థలలో ఎప్పుడైనా ప్రవేశాన్ని కల్పించాలి.
- 1⃣6⃣బడిలో ప్రవేశం పొందిన బాలబాలికలను ప్రాధమిక విద్య పూర్తయ్యేవరకు ఏ తరగతిలో నైనా మళ్ళీ కొనసాగించకూడదు,బడి నుండి తీసివేయరాదు.
- 1⃣7⃣ఏ బాలుడు/బాలికను కూడా శారీరక,మానసిక వేధింపులకు గురిచేయకూడదు.
- 1⃣8⃣ & 1⃣9⃣ గుర్తింపు పత్రం లేకుండా ఏ బడిని ప్రారంబించకూడదు.
- 2⃣0⃣షెడ్యూల్ని సవరించే అధికారం సంబంధిత ప్రభుత్వానికి ఉంటుంది.
- 2⃣1⃣బడి యాజమాన్య సంఘం(SMC) ఏర్పాటు,విధులు
- 2⃣2⃣బడి అభివృద్ధి ప్రణాళిక
- 2⃣3⃣కేంద్రప్రభుత్వ ప్రకటన ద్వారా అధీక్రుతo చేసిన అకాడమిక్ సంస్థ నిర్దారించిన కనీస అర్హతలున్న ఏ వ్యకినాయినా టీచర్గా నియమించవచు.
- ******
- 2⃣4⃣టీచర్ల విధులు-సమస్యల పరిష్కారం
- 2⃣5⃣చట్టం అమలులోకి వచిన 6 నెలలలోపు షెడ్యూల్ నిర్దారించిన విద్యార్ధుల-టీచర్ల నిష్పత్తి ప్రతి బడిలోనూ ఉండేలా ప్రభుత్వం (లేదా) స్థానిక ప్రభుత్వం చూడాలి.
- ***
- 2⃣6⃣టీచర్ ఖాళీలను భర్తీ చేయుట,ఉపాధ్యాయ ఖాళీల సంఖ్య 10% నికి మించరాదు.
- 2⃣7⃣10 సం!! ఒకసారి జరిగే జనాభా గణన,ప్రక్రుతీ వైపరీత్యాలలో సహాయ విధులు,పార్లమెంట్,రాష్ట్ర శాసనసభ,స్థానిక ఎన్నికలకు సంబందించిన విధులను మినహాయించి టీచర్లను ఏ ఇతర విద్యేతర పనులకు పంపకూడదు.
- 2⃣8⃣ఏ టీచరు కూడా ప్రైవేట్
- టూషన్లు,ప్రైవేట్ బోధనా పనులు చేపట్టరాదు.
- 2⃣9⃣పాఠ్యప్రణాళిక-ముల్యాoకన విధానం.
- 3⃣0⃣ప్రాథమిక విద్య పూర్తయిన వెంటనే ధ్రువీకరణ పత్రం ఇవ్వాలి
- 3⃣1⃣విద్యకు బాలల హక్కుల పరిరక్షణ
- 3⃣2⃣పిర్యాదుల పరిష్కారం
- 3⃣3⃣జాతీయ సలహా సంఘం
- 3⃣4⃣రాష్ట్ర సలహా సంఘం3⃣5⃣ఆదేశాలు జారీచేసే అధికారాలు
- ⃣6⃣నేరనిరూపణకు ముందస్తు అనుమతి
- ⃣8⃣ఈ చట్టం అమలు చేయడానికి,నియమ నిబంధనలు రూపొందించడానికి, సంబంధిత ప్రభుత్వాలకే అధికారం
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends
RTE 2009 loni schedule gurinchi petandii
ReplyDelete