Pages

Thursday, May 19, 2016

Friendship in telugu

స్నేహం పాతబడిన కొద్దీ బాగుంటుంది.

  • శత్రువు ఒక్కడైనా  ఎక్కువే. మిత్రులు వంద అయినా తక్కువే.
  • విశ్వాసం లేకుండా స్నేహం ఉండదు.
  • మనిషికి అవసరంలో ఆదుకున్న మిత్రుడికన్నా ప్రియమైనది ఏదీ ఉండదు.
  • కష్టకాలంలోనే మిత్రుడెవరో తెలుస్తుంది .
  • అహంకారి కి మిత్రులుండరు .
  • ఇచ్చింది మరిచిపోవడం, పుచ్చుకున్నది జ్ఞాపకం ఉంచుకోవడమే స్నేహం .
  • ఎవరితోనైనా స్నేహం చేయడం సులభమే, కానీ ఎక్కువ కాలం నిలుపుకోగలగడమే కష్టం.
  • చెడ్డ మిత్రుల కన్నా మిత్రుడు లేక పోవడమే నయం.
  • నీ తప్పును, నీ తెలివి తక్కువ పనులను నీ ముందుంచువాడే నిజమైన నీ స్నేహితుడు .
  • మనిషిని బట్టే అతని స్నేహితుడు ఉంటారు .
  • మాటలకే పరిమితమయ్యే మిత్రుడెపుడు నీ మిత్రుడుగా ఉండలేడు .
  • మిత్రున్ని మించిన అద్దం లేదు మిత్రుడు లేకుండా ఏ మనిషి సర్వసంపూర్ణుడు కాలేడు .
  • స్నేహం కన్నా గొప్పది ఈ లోకంలో లేదు !!            

No comments:

Post a Comment

.