Motivate Your Self.
కుదిరితే పరిగెత్తు.. ,
లేకపోతే నడువు...
అదీ చేతకాకపోతే...
పాకుతూ పో.... ,
అంతేకానీ ఒకే చోట అలా కదలకుండా
ఉండిపోకు...
ఉద్యోగం రాలేదని,
వ్యాపారం దెబ్బతినిందని,
స్నేహితుడొకడు మోసం చేశాడని,
ప్రేమించినవాళ్ళు వదిలి వెళ్ళి
పోయారని...
అలాగే ఉండిపోతే ఎలా?
దేహానికి తప్ప,
దాహానికి పనికిరాని ఆ సముద్రపు
కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే...
తలుచుకుంటే...
నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు
కూడా...
నీ ముందు తలదించుకునేలా చేయగల
సత్తా నీది,
అలాంటిది ఇప్పుడొచ్చిన ఆ కాస్త
కష్టానికే తలొంచేస్తే ఎలా?
సృష్టిలో చలనం ఉన్నది ఏదీ
ఆగిపోకూడదు...,
పారే నది..,
వీచే గాలి...,
ఊగే చెట్టు...,
ఉదయించే సూర్యుడు....
అనుకున్నది సాధించాలని నీలో
కసికసిగా ప్రవహిస్తుందే ఆ నెత్తురుతో సహా....,,
ఏదీ
ఏది ఆగిపోడానికి వీల్లేదు..,
లే...
బయలుదేరు...
నిన్ను
కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక భాదల సంకెళ్ళను తెంచేసుకో... ,
పడ్డ
చోటు నుండే పరుగు మొదలుపెట్టు...
నువ్వు
పడుకునే పరుపు...
నిన్ను
చీదరించుకోకముందే బద్దకాన్ని వదిలేయ్... ,
నీ
అద్దం....
నిన్ను
ప్రశ్నించకముందే సమాదానం వెతుక్కో... ,
నీ
నీడ నిన్ను వదిలేయకముందే వెలుగులోకి వచ్చేయ్..,
మళ్ళీ
చెప్తున్నా...
కన్నీళ్ళు
కారిస్తే కాదు...,
చెమట
చుక్కని చిందిస్తేనే చరిత్రను రాయగలవని తెలుసుకో..
*చదివితే ఇవి పదాలు మాత్రమే,
ఆచరిస్తే...
అస్త్రాలు.
No comments:
Post a Comment