నా బడి
బాల్యం
ప్రవహించే
జీవనది.
నా
బడి
వెచ్చనైన
అమ్మ ఒడి.
నా
బడి
పిల్లల
కేరింతల పులకరింత.
నా
బడి
స్వచ్ఛమైన
చిరునవ్వుల మేళ
నా
బడి
సహపంక్తి
భోజ నాల జాతర
కానీ,
ఇప్పుడు
నా
బడి
కార్పోరేటు
కాలుష్యంతో మసిబారిన గోడలు.
ప్రైవేటీకరణ
తో
పొగసూరిన
జాడలు.
నిర్లక్షానికి
care of
address
అయ్యో!
నీది గవర్నమెంటు బడా? అని
సానుభూతి చూపే లోకం.
ఐనా,
నా
బడి మళ్ళీ
ఫీనిక్స్
పక్షిలా
పునరుజ్జీవం
పొందుతుంది.
అప్పుడు
వేయి
పూలు వికసిస్తాయి.
లక్ష
నక్షత్రాలు మెరుస్తాయి.
కోటి
వసంతాలు
కురుస్తాయి....
No comments:
Post a Comment