Pages

Thursday, December 29, 2016

సావిత్రిబాయి పూలే Savitri Bai Pule

 సావిత్రిబాయి పూలే .


👉 సమాజంలో సంస్కరణ భావాలను కార్యాచరణ ద్వారానే ప్రచారం చేయగలం. అందుకు సాహిత్యం కూడా అవసరపడుతుంది               👉 పద్దెనిమిదో శతాబ్దంలో తత్వకవులు మౌఖికంగా ఎన్నో గీతాలు పాడి ప్రచారం చేశారు.                                        👉 మరోవైపు అలాంటి భావాలనే సంస్కర్తలు రాసి సామాజికులకు వినిపించారు.                                 👉  అలాంటి వారిలో సావిత్రి బాయి పూలే ఒకరు.                                       👉🙏 సంస్కర్తలలో చాలామంది పురుషులే ఉన్నారు. కాని ఒక మహిళా సంస్కర్త అయిన సావిత్రిబాయి ఆలోచనలు ఆనాడు ఎలా ఉన్నాయో, ఆమె కవితలు ఎలా ప్రతిబింబిస్తున్నాయో చూద్దాం👏:

👉 పద్దెనిమిదో శతాబ్దంలో కరుడుగట్టిన భూస్వామ్య మత వ్యవస్థకు వ్యతిరేకంగా, పీష్వాల క్రూర రాజ్య హింసను ఎదిరిస్తూ తన జీవిత భాగస్వామి జ్యోతిరావు పూలే అడుగుల్లో అడుగులేస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థకోసం పాటుపడిన తొలి మహిళ సావిత్రిబాయి పూలే.            👉  దళితులు , స్త్రీల  అభివృద్ధికోసం సావిత్రిబాయ సమస్త జీవితాన్ని వెచ్చించారు. 👉 మూఢా చారాలకు, మూఢనమ్మకాలకు, అనైతిక పోకడలకు వ్యతిరేకంగా ఉద్యమస్ఫూర్తితో ఆమె పనిచేశారు.                              👉  ఈ ఉద్యమంలో ఎవరో రాసిన సాహిత్యాన్ని ఆమె ఆసరాగ తీసుకోలేదు. తానే స్వయం గా రచిస్తూ ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థకే కాదు, ప్రత్యామ్నాయ సాహిత్యానికి కూడా మార్గాలు తెరిచారు.           తమ సాహిత్యం ద్వారా విజ్ఞాన కాంతులు ప్రసరింపచేశారు                              👉 సావిత్రిబాయి సాహిత్యంలో కవితలు, వ్యాసాలు, లేఖలు, ప్రసంగాలు లభి స్తాయి. రెండు కవితా సంకలనాలు రచించారు. అందులో ఒకటి 23 సంవత్సరాల వయసులోనే పూర్తిచేస్తే రెండవ దానిని జ్యోతిరావ్‌ పూలే మరణానంతరం తమ జీవితచరిత్ర రూపంలో రాశారు.                                       👉 *మొదటి కవితా సంకలనం 1854
లో అచ్చయితే రెండవది 1891
లో అచ్చయింది*.

👉 18వ మరియు 19వ శతాబ్దాలలో భారతదేశ సమాజం భూస్వామ్య విలువలతో నడిచేది.  కుల వ్యవస్థ సమాజంలోని అన్ని వర్గాల ప్రజలమీద పూర్తి ఆధిపత్యాన్ని కలిగివుండేది. దళితులు, మహిళల పరిస్థితి చాల దయ నీయంగా ఉండేది. దళితుల మీద అనేక ఆంక్షలు విధించేవారు.                        👉 కులాల నియంత్రణలో ఉన్న భారతీయ సమాజంలో మానవ విలువలు అడుగంటిపోయాయి. సర్వత్రా ఈర్ష్యాద్వేషాలు. మూఢాచారాలు, మూఢనమ్మకాలు, అజ్ఞానం, దారిద్య్రం, అంటరానితనం. శతాబ్దాల క్రితం సమాజంలో ఓ తెలివైన వర్గం పెద్దపెద్ద కుట్రలు పన్నింది.                        👉 సావిత్రిబాయి తమ రచనల ద్వారా ఒక్కొక్క కుట్రను పటాపంచలు చేశారు. సావిత్రిబాయి సమాజంలో నెలకొన్న అజ్ఞానాన్ని తెలుసుకోమని, తెలుసుకొని దానిని జీవితంలోనుంచి తరిమివేయమని చెపుతారు.                                👉 ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా మనదేశంలో మత ధార్మిక విషయాలు సమాజంలో ప్రభావం చూపుతున్నాయి. మూఢనమ్మకాలను పెంచి పోషిస్తున్నాయి. శాస్త్రీయ దృక్పథాన్ని ప్రజలలోం పెంపొందించవలసిన బాధ్యత ప్రభుత్వాలమీద ఉంది అని రాజ్యాంగం స్పష్టం చేస్తున్నా ఈ రోజు దానిని ఏమాత్రం ఖాతరు చేయని పరిస్థితి                    👉 *ఒక కవితలో సావిత్రిబాయి వైజ్ఞానిక దృక్పథంతో ఈ స్థితిని వివరిస్తారు; రాయికి కుంకుమపెట్టి/నూనెలో ముంచి/దేనినైతే దేవత అంటున్నారో/ నిజానికది రాయేకదా’’ అంటూ రాళ్ళకు మొక్కితే పిల్లలు పుడితే/ మరి అకారణంగా  / స్త్రీ పురుషులు పెళ్ళెందుకు చేసుకుంటారు?’’ అని ప్రశ్నిస్తారు. నేటి సమాజంలో  దళితులు, శూద్రులు, మహిళల దుర్దశకు కారణాలనేకం.  శూద్రులు పనిచేయకూడదని, పనిచేసి ధనం సంపాదించకూడదని మను చెప్తాడు. ఈ విషయాన్ని సావిత్రిబాయి ఒక కవితలో ఇలా ప్రస్తావిస్తారు;                

👉 సమకాలీన సామాజిక అంశాలనే కాదు, చారిత్రక అంశా లను కూడ సావిత్రిబాయి తమ కవితలలో రాశారు. నలరాజు, బలి మహారాజు, ఛత్రపతి శివాజీ, తారాబాయి మొదలైనవారి గురించి కవితలలో ప్రస్తావించారు. అంతేకాదు, ప్రకృతిమీద రాసిన కవితలు ఆమె వర్ణనాశక్తిని తెలియచేస్తాయి. ఆమె రాసిన సీతాకోక చిలుకలు’ కవిత మంచి ఉదాహరణ. రంగురంగుల అందమైన/ సీతాకోక చిలుకలు/ మెరిసే కళ్ళు, ఇంద్రధనుస్సు నవ్వు/ దేహంపై పట్టుల్లాంటి/రెక్కలు/చిన్న పెద్ద, ముడుచుకుని ఉండె/ పసుపు రంగు రెక్కలు/ అయినా, ఆకాశంలోకి ఎగురుతాయి/వాటి రూపం రంగు మనో హరం/సీతాకోక చిలుకలను చూస్తూ చూస్తూ/నన్ను నేను మరచిపోయాను’’. *👉మొదటి కవితా సంకలనంలో అమ్మ గురించి, మాతృభూమి గురించి అలగే జ్యోతిరావ్‌ పూలే గురించి ఎంతో ఆత్మీయంగా కవయిత్రి తమ భావాలను పంచుకుంటారు.                 👉 👉అమ్మగురించి రాస్తూ ఇలా అంటారు ‘ఆమె ముందు సముద్రం కూడ/చిన్నబోతుంది/ ఆమె ముందు ఆకాశం కూడ/ తలదించుకుంటుంది’’.

👉అజ్ఞానం  అనే
శత్రువొక్కటే మనందరికి.
దానిని తన్ని తరిమి కొడ్దాం
దానిని మించిన మరో
శత్రువు లేదు మనకు

👉వెతికి తీయండి
మనస్సు లోపల చూసి పట్టుకోండి
వెతికి పట్టుకున్నారా శత్రువుని?
చూశారా శత్రువుని?
బాగా ఆలోచించి చెప్పండి పిల్లల్లారా
దాని పేరు చెప్పండి వెంటనే మరి
మీకు  తెలియదా?

👉ఓటమిని ఒప్పుకోకండి, కొంచెం ఆలోచించండి
సరే ఆ దుష్ట శత్రువు పేరు
నేనే చెప్తాను
నా మాటను జాగ్రత్తగా వినండి
అలసత్వాన్ని వీడండి
దాని పేరు అజ్ఞానం
గట్టిగా పట్టుకుని దాని గొంతు పిసికేయండి
జీవితం నుంచి తరిమిగొట్టండి

👉విద్య లేదు జ్ఞానం లేదు
చదువుకుని విద్యావంతులు కావాలనే ఆలోచన లేదు
తెలివి ఉన్నా వ్యర్థంగా కోల్పోతారు
వారిని మనుషులని ఎలా అనను?

👉చేతులు ముడుచుకుని కూర్చుంటారు
పశువులు కూడా అలా వ్యవహరించవు
ఆలోచన లేదు, ఆచరణ లేదు
వారిని మనుషులని ఎలా అనను?

👉ఇంటి నిండా పిల్లలు
చే యరు వారిని పోషించడానికి
ఎలాంటి ప్రయత్నం
వారిని మనుషులని ఎలా అనను?

👉 *దొరకదు వారికి ఎవరి సహానుభూతి
సహాయం చేయరు వారికి ఎవరు
పట్టించుకోరు*  *వారిని ఎవరు
సవారిని మునుషులని ఎలా అనను*?

👉జ్యోతిష్యం, పంచాంగం, హస్తరేఖల చుట్టూ
తిరిగెదరు మూర్ఖులు
స్వర్గం నరకం కల్పనలో మునిగిపోయెదరు
పశువుల జీవితంలో కూడా
ఇలాంటి భ్రమలకు లేదు ఎలాంటి స్థానం
వారిని మనుషులని ఎలా అనను?

👉భార్య పాపం పనిచేస్తూనే ఉంటుంది
ఏకష్టం లేకుండా భర్త నిస్సిగ్గుతో తింటూనేఉంటాడు

👉పశువులలో కూడా లేదు ఇలాంటి వింత
వారిని మనుషులని ఎలా అనను?

👉ఇంట్లో బయట దారిద్య్రం ఆవరించే
లేరెవరు కనీసం పలకరించడానికి
అందరూ వారిని ధిక్కరించుదురు
వారిని మనుషులని ఎలా అనను?

👉చదువలేరు రాయలేరు
మంచి మాటను చెవిన పెట్టరు
పశువులు సైతం అర్థం చేసుకుంటాయి
కానీ, ఈ మూఢులకు మాత్రం అర్థం కాదు
వారిని మనుషులని ఎలా అనను?

👉తమ పశుత్వం పట్ల లేదు సిగ్గు
అదే సుఖమని భావించెదరు
పశు మార్గంలో నడిచెదరు
వారిని మనుషులని ఎలా అనను?

*👉ఎవరైతే ఇతరులకు సహాయం చేయరో
సేవ, త్యాగం, దయ, మమతలను దరిచేయనీయరో
ఎలాంటి సద్గుణాలను అలవర్చుకోరో
వారిని మనుషులని ఎలా అనను*?

*👉బానిసత్వం గురించి బాధ పడని వారు
అభివృద్ధి సంకల్పంలేని వారు
మానవత్వాన్ని అణగద్రొక్కే వారిని
మనుషులని ఎలా అనను*?

👉పశు పక్షులు  క్రిమి కీటకాలు*, వానరులు నరులు
పుట్టుక గిట్టుక సమస్త చరాచరులకు సమానం*
ఈ మాత్రం జీవిత సత్యం కూడా తెలియని వారు
వారిని మనుషులని ఎలా అనను*?                       

No comments:

Post a Comment

.