తెలంగాణ 'గురుకుల' పోస్టుల పరీక్షా విధానం....
👉గురుకులాల్లో పోస్టుల భర్తీకి కొత్త విధానం
👉 తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
👉 అమలుకు టీఎస్‌పీఎస్సీకి అనుమతి
👉 ఆబ్జెక్టివ్ ప్రశ్నలతో రాత పరీక్షలు
👉 ప్రాథమిక, ప్రధాన పరీక్షలుగా నిర్వహణ
✍ తెలంగాణ గురుకులాల్లో ఉద్యోగాల భర్తీకి కొత్త పరీక్షల విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.
పరీక్ష నిర్వహణ, భర్తీ బాధ్యతలను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు అప్పగించిన ప్రభుత్వం ...పరీక్షల విధానాన్ని కూడా కమిషన్ నిర్వహించే (గ్రూప్1,2) పరీక్షల స్థాయిలోనే నిర్దేశించింది. గురుకులాల్లో ఖాళీగా ఉన్న 2444 పోస్టుల భర్తీకి సంబంధించి ఈ కొత్త పరీక్షల విధానాన్ని ఆమోదిస్తూ తెలంగాణ ప్రభుత్వం గురువారం(జూన్ 30) ఉత్తర్వులు జారీ చేసింది.
👉🏼దీనిని చేపట్టేందుకు పబ్లిక్ సర్వీసు కమిషన్‌కు అనుమతించింది. గురుకుల పాఠశాలల్లోని ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ (టీజీటీ), పోస్టుగ్రాడ్యుయేట్ ఉపాధ్యాయులు (పీజీటీ), ప్రత్యేక (ఆర్ట్, క్రాఫ్, సంగీత)ఉపాధ్యాయులు, గురుకుల జూనియర్ కళాశాలల అధ్యాపకులు, డిగ్రీ కళాశాలల అధ్యాపకులు, వ్యాయామ సంచాలకుడు (ఫిజికల్ డైరెక్టర్) పోస్టులకు, ప్రిన్సిపాళ్ల పోస్టులకు నిర్వహించాల్సిన పరీక్షలు, వాటిల్లోనూ పాఠ్యాంశాలు, వాటికి కేటాయించిన మార్కులకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
📉ఆబ్జెక్టివ్ తరహా విధానంలో రాత పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది. ప్రాథమిక, ప్రధాన పరీక్షలు జరుపుతామని తెలిపింది. ప్రిన్సిపాల్, జూనియర్, డిగ్రీ అధ్యాపకుల పోస్టులకు రాత పరీక్షలతో పాటు మౌఖిక పరీక్ష (ఇంటర్య్వూ)లు నిర్వహిస్తామని తెలిపింది.
✏గురుకుల విద్యాసంస్థలకు సంబంధించిన ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులను తొలిసారిగా ప్రత్యక్ష నియామకాల ద్వారా తొలిసారిగా పబ్లిక్ సర్వీసు కమిషన్ ద్వారా భర్తీ చేస్తున్నందున కొత్త విధానాన్ని రూపొందించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ
🔹ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వం పరీక్షల విధానం అమలుకు అనుమతించినందున త్వరలోనే పబ్లిక్ సర్వీసు కమిషన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనుంది.
🔻తాజా ఉత్తర్వుల ప్రకారం పరీక్షల విధానం ఈ కింది విధంగా ఉంటుంది.
1. ఉపాధ్యాయ (టీజీటీ, పీజీటీ) పోస్టులు
🔹ప్రాథమిక పరీక్ష (మార్కులు 150)
*
🔹 పేపర్1లో జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, ఆంగ్ల ప్రాథమిక భాషా పరిజ్ఞానం (బేసిక్ ప్రొఫియెన్సీ ఇన్ ఇంగ్లిష్)
🔹 మొత్తం ప్రశ్నలు 150, కాలవ్యవధి 150 నిమిషాలు, మార్కులు 150
ప్రధాన పరీక్ష (మార్కులు300)
🔹 పేపర్1లో శిక్షణ శాస్త్రం(పెడగోగి)/ పాఠశాల యాజమాన్య, పరిపాలన (స్కూల్ మేనేజ్‌మెంట్, అడ్మినిస్ట్రేషన్).( పోస్టు స్వభావం ఆధారంగా ప్రశ్నలు)
🔹మొత్తం ప్రశ్నలు 150, కాలవ్యవధి 150 నిమిషాలు, మార్కులు 150
🔹 పేపర్2లో సంబంధిత సబెక్ట్‌పై పరిజ్ఞానం, అవగాహన
🔹 మొత్తం ప్రశ్నలు 150, కాలవ్యవధి 150 నిమిషాలు, మార్కులు 150
*2. ప్రిన్సిపాల్స్ *
🔹ప్రాథమిక పరీక్ష (మార్కులు 150)
🔹 పేపర్1లో జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, ఆంగ్ల ప్రాథమిక భాషా పరిజ్ఞానం (బేసిక్ ప్రొఫియెన్సీ ఇన్ ఇంగ్లిష్)
🔹 మొత్తం ప్రశ్నలు 150, సమయం 150 నిమిషాలు, మార్కులు 150
ప్రధాన పరీక్ష (మార్కులు 330)
🔹 పేపర్1లో శిక్షణ శాస్త్రం(పెడగోగి)/ పాఠశాల యాజమాన్య, పరిపాలన ( స్కూల్ మేనేజ్‌మెంట్, అడ్మినిస్ట్రేషన్). పోస్టు స్వభావం ఆధారంగా ప్రశ్నలు.
🔹 మొత్తం ప్రశ్నలు 150, సమయం 150 నిమిషాలు, మార్కులు 150
🔹పేపర్2లో విద్యాహక్కుచట్టం, జాతీయ పాఠ్యాంశ ప్రణాళికలు, పాఠశాల సంస్థ, ఉపాధ్యాయ సాధికారిత, శిశు అభివృద్ధి
🔹మొత్తం ప్రశ్నలు 150, సమయం 150 నిమిషాలు, మార్కులు 150
🔹 మౌఖిక పరీక్షలు/ప్రదర్శన (డెమాన్‌స్ట్రేషన్/వైవా-వోస్) మార్కులు: 30
🔹 మొత్తం మార్కులు 330
3. జూనియర్ అధ్యాపకులు
🔹ప్రాథమిక పరీక్ష (మార్కులు150)
🔹 పేపర్1లో జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, ఆంగ్ల ప్రాథమిక భాషా పరిజ్ఞానం (బేసిక్ ప్రొఫియెన్సీ ఇన్ ఇంగ్లిష్)
🔹 మొత్తం ప్రశ్నలు 150, సమయం 150 నిమిషాలు, మార్కులు 150
ప్రధానపరీక్ష (మార్కులు 330)
🔹 పేపర్1లో శిక్షణ శాస్త్రం(పెడగోగి)/ పాఠశాల యాజమాన్య, పరిపాలన (స్కూల్ మేనేజ్‌మెంట్, అడ్మినిస్ట్రేషన్). పోస్టు స్వభావం ఆధారంగా ప్రశ్నలు.
🔹 మొత్తం ప్రశ్నలు 100, కాలవ్యవధి 90 నిమిషాలు, మార్కులు 100
🔹 పేపర్2లో సంబంధిత సబెక్ట్‌పై పరిజ్ఞానం, అవగాహన
🔹మొత్తం ప్రశ్నలు 200, సమయం 180 నిమిషాలు, మార్కులు 200
🔹మౌఖిక పరీక్షలు/ప్రదర్శన (డెమాన్‌స్ట్రేషన్/వైవా-వోస్) మార్కులు: 30
🔹మొత్తం మార్కులు 330
4. డిగ్రీ కళాశాలల లెక్చరర్లు, ఫిజికల్ డైరెక్టర్లు
🔹ప్రాథమిక పరీక్ష (మార్కులు 150)
🔹 పేపర్1లో జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, ఆంగ్ల ప్రాథమిక భాషా పరిజ్ఞానం (బేసిక్ ప్రొఫిషియెన్సీ ఇన్ ఇంగ్లిష్)
🔹మొత్తం ప్రశ్నలు 150, సమయం 150 నిమిషాలు, మార్కులు 150
🔹ప్రధానపరీక్ష (మార్కులు 330)
🔹 పేపర్1లో సంబంధిత సబెక్ట్‌పై పరిజ్ఞానం, అవగాహన
🔹 మొత్తం ప్రశ్నలు 150, సమయం 150, నిమిషాలు, మార్కులు 300
🔹 మౌఖిక పరీక్షలు/ప్రదర్శన (డెమాన్‌స్ట్రేషన్/వైవా-వోస్) మార్కులు: 30
🔹 మొత్తం మార్కులు 330
5. ప్రత్యేక ఉపాధ్యాయులు
🔹 (ఆర్ట్/క్రాఫ్ట్/మ్యూజిక్)
పరీక్ష (మార్కులు 200)
🔹 పేపర్1లో జనరల్ స్టడీస్, సబ్జెక్టు డిసిప్లిన్, నాలెడ్జి
🔹 మొత్తం ప్రశ్నలు 200, కాలవ్యవది 180 నిమిషాలు, మార్కులు 200
No comments:
Post a Comment