ప్రశ్న: కాంతి లేని సమయాల్లో కిరణజన్య సంయోగ క్రియ జరగదెందుకు?
ట్యూబ్‌లైట్ కాంతిలో ఈ క్రియ జరగుతుందా?
జవాబు: మొక్కల్లో జరిగే ఆ చర్య పేరే కిరణ జన్య సంయోగ క్రియ (Photo-synthesis). కాంతి కిరణాల సమక్షంలో జరిగేది కాబట్టే ఆ పేరు. ఈ క్రియలో పాల్గొనే నీరు, కార్బన్ డయాక్సైడుల కన్నా వాటి నుంచి ఏర్పడే పిండి పదార్థాలకు శక్తి ఎక్కువ. అంటే శక్తి తక్కువ ఉన్న పదార్థాలు కలిసి శక్తి ఎక్కువగా ఉన్న పదార్థాలుగా మారాయన్నమాట. శక్తిని సృష్టించలేమనీ, నశింపచేయ లేమని శక్తి నిత్యత్వ సూత్రం (Law of conservation of energy)లో చదువుకుని ఉంటారు. కాబట్టి కాంతిశక్తే
పిండిపదార్థాలలో నిగూఢమవుతుందన్నమాట. కాంతి లేకుండా కిరణ జన్య సంయోగ క్రియ జరగదు. ట్యూబ్‌లైటు వెలుగులో కూడా ఈ క్రియ జరుగుతుంది. అయితే ఈ కాంతి తీవ్రత తక్కువ కాబట్టి నెమ్మదిగా జరుగుతుంది.
No comments:
Post a Comment