Pages

Monday, December 26, 2016

నీలం రాజశేఖరరెడ్, తేళ్ళ లక్ష్మీకాంతమ్మ, కొక్కొండ వెంకటరత్నం పంతులు, మాకినేని బసవపున్నయ్య

డిసెంబర్ 13 నీలం రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా..

🌷నీలం రాజశేఖరరెడ్డి భారతీయ కమ్యూనిస్టు నేత మరియు మాజీ భారత రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి సోదరుడు. 1918లో అనంతపురం దగ్గర ఇల్లూరు గ్రామంలో నీలం చిన్నపరెడ్డి, సుబ్బమ్మ దంపతులకు జన్మించారు.🌷

🍀స్వాతంత్య్ర సమరయోధులు కల్లూరు సుబ్బారావు బెనారస్ జాతీయ కళాశాలలో రాజశేఖరరెడ్డిని, తరిమెల నాగిరెడ్డి ని చేర్పించారు.

 🌷మానవునికున్న ఆస్తిలో కెల్లా ప్రియమైనది జీవితమే! అలాంటి జీవితాన్ని గడిపే అవకాశం మనిషికి ఒకసారి మాత్రమే లభిస్తుంది. మానవజాతి విముక్తికోసం నా జీవితాన్ని వినియోగించాను అని సంతృప్తి పడగల జీవితాన్ని ప్రతి మానవుడూ గడపాలి-y అన్న లెనిన్ మాటలు నీలంకు ఆదర్శం.🌷

🍀1943 జనవరిలో అనంతపురం జిల్లా కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాకి ప్రథమ కార్యదర్శిగా ఆయన ఎన్నికయ్యారు. 1946లో 'అనంతపురం జిల్లా కమ్యూనిస్టు పార్టీ చరిత్ర రాశారు. 1938లో కమ్యూనిస్టు పార్టీలో చేరి మూడు సంవత్సరాలు రహస్య జీవితం గడిపాడు. 1941-42లో యుద్ధాన్ని వ్యతిరేకరించినందుకు, యుద్ధ వ్యతిరేక కార్యకలాపాలను ముమ్మరం చేసినందుకు రెండున్నర సంవత్సరాలు జైలు జీవితం. ఆగ్రా సెంట్రల్ జైలు, బెనారస్ జిల్లా జైలు, చెరైలీ సెంట్రల్ జైలు, రాజమండ్రి, ఆలీపూర్, వెల్లూరు... ఇలా దేశంలో ప్రసిద్ధి పొందిన అన్ని జైళ్లల్లోనూ బందీ అయ్యారు.

🍀ఆయన ఆస్తిని 1952 ప్రాంతాల్లో పోలీసులు జప్తు చేశారు. భూస్వామ్య కుటుంబంలో జన్మించిన నీలం తన యావదాస్తిని కమ్యూనిస్టు ఉద్యమానికే అంకితం చేశారు. చండ్ర రాజేశ్వరరావు, తమ్మారెడ్డి సత్యనారాయణ ల పేరుతో ఏర్పాటైన ట్రస్టులకు అధ్యక్షుడిగా పనిచేశారు.

 🌸1994 డిసెంబరు 13న నీలం కన్నుమూశారు.🌸

🌷చండ్ర రాజేశ్వరరావు పౌండేషను మార్కిస్టు అధ్యయనానికి హైదరాబాదు శివార్లలోని కొండాపూర్లో ఏర్పాటుచేసిన పరిశోధనా కేంద్రానికి రాజశేఖరరెడ్డి స్మృత్యర్ధం "నీలం రాజశేఖరరెడ్డి పరిశోధనా కేంద్రం" అని పేరుపెట్టారు.🌷                                             


















డిసెంబర్ 13 తేళ్ళ లక్ష్మీకాంతమ్మ  వర్ధంతి సందర్భంగా..... 🌹🌻

🌺తేళ్ల లక్ష్మీకాంతమ్మ (జూలై 16, 1924 - డిసెంబర్ 13, 2007) ఖమ్మం జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధురాలు, భారత జాతీయ కాంగ్రేసు నాయకురాలు మరియు పార్లమెంటు సభ్యురాలు. ప్రముఖ తెలుగు పాప్ సింగర్ స్మిత ఆమె మనవరాలే.లక్ష్మీకాంతమ్మ 1924, జూలై 16న జన్మించింది. ఈమె స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లాలోని ఆలంపూర్. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయము నుండి ఆర్థిక శాస్త్రములో ఎం.ఏ పట్టా పొందిన లక్ష్మీకాంతమ్మ టి.వి.సుబ్బారావును వివాహం చేసుకుంది. వీరికి ఒక కూతురు.

🍀లక్ష్మీకాంతమ్మ ఖమ్మం నుండి 1957లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికై ఆ తర్వాత 1962లో ఖమ్మం లోకసభ నియోజకవర్గం నుండి ఎన్నికై పార్లమెంటు సభ్యురాలయ్యింది. వరుసుగా మూడు సార్లు అదే నియోజకవర్గమునుండి ఎన్నికై 1977వరకు లోక్‌సభలో ఖమ్మంకు ప్రాతినిధ్యం వహించింది. 1967లో పార్లమెంటు బృందంలో సదస్యురాలిగా ఆస్ట్రేలియాను పర్యటించింది. 1978లో జనతా పార్టీ తరఫున హైదరాబాదు నగరంలోని హిమాయత్ నగర్ శాసనసభా నియోజకవర్గం నుండి గెలుపొందింది.

🍀పార్లమెంటు కమిటీ కార్యనిర్వాహక సభ్యురాలిగా ఉన్న లక్ష్మీకాంతమ్మ ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ వైఖరిని బహిరంగంగా విమర్శించి ఆమె ఆ కాలంలో వార్తలకు ఎక్కింది. ఇందిరాగాంధీ పాలనను తీవ్రంగా నిరసించి జనతాపార్టీలో చేరింది. జనతా పార్టీ ఏర్పాటులో కీలకపాత్ర పోషించి, పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేసిన లక్ష్మీకాంతమ్మ, 1978 శాసనసభా ఎన్నికలలో ఓటమి తర్వాత, వృద్ధాప్యం వల్ల చాలా కాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంది.ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ లో చేరింది.

🌷లక్ష్మీకాంతమ్మ, మాజీ ప్రధాని పి.వి.నరసింహారావుకు సన్నిహితురాలు. నరసింహారావు రచించిన ఆత్మకథా ఆధారిత నవల ది ఇన్‌సైడర్‌లోని అరుణ పాత్రకు స్ఫూర్తి లక్ష్మీకాంతమ్మేనని భావిస్తున్నారు.🌷

🍁ఈమె తెలుగులో ప్రగతి పథంలో మహిళలు అనే పుస్తకాన్ని, ఆంగ్లంలో కో-ఆపరేషన్ టుడే అండ్ టుమారో అనే పుస్తకాల్ని ప్రచురించారు. బాద్షాఖాన్ జీవితచరిత్రను తెలుగులోకి అనువదించింది.🍁

*🌸లక్ష్మీకాంతమ్మ 83 యేళ్ల వయసులో విజయవాడలోని తన కూతురు ఇంట్లో డిసెంబర్ 13, 2007న మరణించింది.?                    







                  


డిసెంబర్ 14 మాకినేని బసవపున్నయ్య జయంతి సందర్భంగా.....🌹🌻

🌷మాకినేని బసవపున్నయ్య🌷

🌸మాకినేని బసవపున్నయ్య (డిసెంబర్ 14, 1914 - ఏప్రిల్ 12, 1992) మార్క్స్, లెనిన్ సిద్ధాంతాలకు కట్టుబడి జీవితాంతం పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడాడు.🌸

🌷జననం🌷

🌸ఈయన గుంటూరు జిల్లా తూర్పు పాలెంలో 1914, డిసెంబర్ 14 న జన్మించాడు.🌸

🌷రాజకీయ ప్రస్థానం🌷

🍁గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో బి.ఎ చదివాడు. 1930లో స్వాతంత్ర్య పోరాటములో పాలు పంచుకొని, కాంగ్రెస్ నాయకత్వము ఉద్యమాన్ని తాత్కాలికంగా ఆపు చేయడంతో అసంతృప్తి చెంది 1934లో కమ్యూనిస్ట్ పార్టీలో చేరాడు. గుంటూరు జిల్లా పార్టీ ఆర్గనైజర్ గా 1934-40 కాలంలో పనిచేశాడు. 1936లో జరిగిన విద్యార్థిసంఘం సంస్థాపక మహాసభలో జతీయ స్థాయి ఉప కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. 1940 వరకు ఆంధ్ర రాష్ట్ర విద్యార్థిసంఘం కార్యదర్శిగా విద్యార్థిఉద్యమం నడిపాడు. అదే సంవత్సరం గుంటూరు జిల్లా పార్టీ కార్యదర్శి బాధ్యత స్వీకరించాడు. 1943లో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. 1948లో కలకత్తాలో జరిగిన సి.పి.ఐ ద్వితీయ మహాసభలో కేంద్ర కమిటీకి ఎన్నికయ్యాడు. ఆ తరువాత 1950లో పొలిట్ బ్యూరోకి ఎన్నికయ్యాడు. ఆ స్థానంలో 40 సంవత్సరాలు కొనసాగాడు.

🍁మార్క్స్, లెనిన్ సిద్ధాంతాలకు కట్టుబడి జీవితాంతం పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడాడు. తెలంగాణా రైతాంగ పోరాటములో ప్రముఖ పాత్ర వహించాడు. సుందరయ్య లాంటి నాయకులతో కలిసి తెలంగాణా సాయుధ పోరాటములో పాల్గొన్నాడు. భారత దేశములో విప్లవ సాధనకు అనుసరించవలిసిన వ్యూహం గురించి కమ్యూనిస్ట్ పార్టీలో చర్చ మొదలు పెట్టాడు. ఈ చర్చ చివరకు 1964లో సి.పి.ఐ (యం) ఆవిర్భావానికి దారి తీసింది. ఈ సందర్భములో బసవపున్నయ్య సోవియట్ కమ్యూనిస్ట్ నాయకులు స్టాలిన్, మాలటొవ్, సుస్లోవ్, మాలెంకోవ్ లతో చర్చలు జరిపాడు. 1957లో జరిగిన ప్రపంచ కమ్యూనిస్ట్ పార్టీల మహాసభలలో మావొసేతుంగ్, లీషావ్ చీ, చౌ ఎన్ లై లతో చర్చలు జరిపాడు. కమ్యూనిస్ట్ సిద్ధాంతము పట్ల నిబద్ధతతో బాటు ప్రగాఢమైన దేశభక్తి కలవాడు.

🌸రాజ్యసభ సభ్యునిగా 1952 నుంచి 1966 వరకు పీడిత ప్రజా సమస్యలపై పోరాటం చేశాడు. చైనాతో యుద్ధం సందర్భముగా కాంగ్రెస్ ప్రభుత్వము రెండు సార్లు జైలులో పెట్టింది. బసవపున్నయ్య ఆనాడు చెప్పిన అంశాలను చాలాకాలము తరువాత భారత పాలక వర్గాలు అంగీకరించాయి.🌸

🍁సి.పి.ఐ (యం) అధికార పత్రిక పీపుల్స్ డెమోక్రసీ సంపాదకునిగా 14 సంవత్సరాలు పనిచేశాడు.🍁

🌷మరణం🌷

🌸బసవపున్నయ్య ఢిల్లీలోని తన నివాసములో 1992, ఏప్రిల్ 12 న మరణించాడు.🌸                    



























డిసెంబర్ 14 మహామహోపాధ్యాయ "కొక్కొండ వెంకటరత్నం పంతులు"  వర్ధంతివ సందర్భంగా.....🌹🌻

🌷కొక్కొండ వెంకటరత్నం పంతులు (మార్చి 14, 1842 -14 డిసెంబర్, 1915), మహామహోపాధ్యాయ బిరుదు పొందిన ఆధునికాంధ్రులలో రెండవ వ్యక్తిగా ఘనత వహించిన సంగీతజ్ఞుడు, కవి, నాటక రచయిత, పత్రికాసంపాదకుడు, ఉపాధ్యాయుడు, గ్రాంధికం తప్ప ఇతర భాష మాట్లాడని వాడు. వీరు "ఆంధ్రభాషా జాన్‌సన్" అనే గౌరవం పొందిన పండితులు. ఆంధ్ర వాజ్మయంలో నవయుగ ప్రవర్తక త్రయం (చిన్నయసూరి, వెంకటరత్నము, వీరేశలింగము) లో వీరు మధ్యమ స్థానాన్ని ఆక్రమించారు.🌷

🍀ఇరవై రెండు సంవత్సరాలు మద్రాసు రాజధాని కళాశాలలోను, ఎనిమిది సంవత్సరాలు రాజమండ్రి కళాశాలలోను తెలుగు పండితులుగా పనిచేసారు. పుట్టుకతో ద్వైత మతానికి చెందినా శంకరాద్వైతాన్ని స్వీకరించి నియోగియైనవారు. శ్రీ బిల్వనాథ క్షేత్రంలో బిల్వేశ్వరుని ఉపాసించి వారి కరుణాసిద్ధిని పొందిన మహాభక్తులు.

🍀ఈయన 1871 లో ‘ఆంధ్రభాషా సంజీవిని’అనే పత్రికను 20 వత్సరాలు నడిపారు. చెన్నైలో ఆంధ్రులచే నడుపడిన పత్రికలో ఇదే మొదటిది. తర్వాత ‘హాస్యవర్ధని’ అనే పత్రికను నడిపాడు. హిందూ శ్రేయోభివర్ధనీ సభను స్థాపించి, ఆంధ్రభాషలో వక్తృత్వం, ఉపన్యాస పద్ధతి నెలకొల్పి వాటిద్వారా ఆర్యమత ప్రచారం కావించారు.

🍀శ్రవ్యకావ్యాలను, 5 రూపకాలను, అజామీళోపాఖ్యానం అనే యక్షగానమును రచించాడు. ఈయన అనువదించిన ఐదు రూపకాలలో కేవలం మూడు మాత్రమే ముద్రించబడ్డాయి. అవి నరకాసుర విజయవ్యాయోగం (1872), ధనుంజయ విజయ వ్యాయోగం (1894), ఆంధ్ర్రపసన్న రాఘవం (1897) . ‘పౌండరీకం’ అనే భాణము, శ్రీమతి బాధవం అనే నాటకము ముద్రితం కాలేదు. సంస్కృత నాటకాలను అనువదించడంలో పద్యానికి పద్యం, గద్యానికి గద్యం వరుసగా వ్రాసే పద్ధతిని ఈయనే ఏర్పరచాడు. ఈ పద్ధతి నేటికీ అవలంభించబడుతోంది.
🍀నరకాసుర విజయవ్యాయోగం రెండవ సంస్కృతాంధ్రనువాదమైనా, లభ్యమైన వాటిలో నరకాసుర విజయవ్యాయోగమే మొదటి సంస్కృతాంధ్రానువాదంగా పేర్కొనబడుతుంది.

🌷జీవిత విశేషాలు🌷

🍀తల్లి రామాంబ, తండ్రి నరసింగరావు పంతులు గారు. జననం మార్చి24, 1843 వినుకొండలో. వీరు మాధ్యులు. తండ్రిగారు1845 లో మరణించారు.మేనమామ అప్పయ సోమయాజి. నందిరాజు లక్ష్మీనారాయణ దీక్షితులు గారు వెంకటరత్నంగారి తల్లికి పెదతండ్రి. వెంకటరత్నం గారు సంస్కృతాంధ్ర గ్రంథములు ఇంటివద్దనే చదువుతూ ఇంగ్లీషు పాఠశాలలో చదివారు. 1855 లో వివాహం. మేనరిక్కం. 15 వ ఏటనే గుంటూరు కలెక్టరు కచ్చేరీలో గుమాస్తాగా ఉద్యోగంలో చేరారు. చిన్నప్పుడే కవిత్వం అబ్బినది. వెంకటరత్నం పంతులు గారు స్మార్తులైనారు. 1856 లో మొట్టమొదటి పర్యాయము చన్నపట్టణం వెళ్ళారు. 1856 కాళయుక్తసంవత్సరంలో కంపెనీసర్కారు వారి సర్వే పార్టీలో ఉద్యోగమునకు దరకాస్తుచేశారు. సేలంలో సర్వే పార్టీలో ఉద్యోగం వచ్చింది. అటుతరువాత కోయంబత్తూరు దగ్గర పాల్ఘాట్ కు వెళ్లి అక్కడ తెలుగు పాఠశాల పెట్టారు. అందులో కన్నడం మరియు అరవం కూడా బోధించేవారు.

🍀కోయంబత్తూరులో నారాయణ అయ్యర్ వారి వద్ద సంగీతం నేర్చుకున్నారు. 1864 లో వారి తల్లిగారు ఉడుపి యాత్రలో మరణించారు. 1863లో సర్వే పార్టీ మూసివేసినతరువాత 1866 లో చన్నపట్టణం రెవెన్యూబోర్డులో ఉద్యోగం చేశారు. 1870 లో చన్నపట్టణంలో హిందూ ప్రొప్రయటరీ స్కూలులో తెలుగు పండితులుగా చేరారు. 1870 సంవత్సరములో హిందూశ్రేయోభివర్ధనీ సమాజమును స్థాపించి దానిలో విద్యార్థులను, ఉపాధ్యాయులను, ఉద్యోగస్తులను సమావేశ పరచి ఒకొక్క సారి ఒకొక్క విషయమునుగూర్చి ఉపన్యాసముచేశేవారు. 1871 లో ఆంధ్ర భాషాసంజీవని పత్రిక స్ధాపించారు. అందులో పత్రికాలక్షణములు గురించి, పత్రికాసంపాదకులక్షణముల గురించి పద్యాలు వ్రాసేవారు. ఆ ఆంధ్ర భాషాసంజీవనిలో ఇంగ్లీషు పత్రికలమాదిరి Editorials ప్రారంభించారు. ఆ పత్రిక 1871 నుండీ 1883 వరకూ నడచింది. అటుతరువాత మళ్ళీ 1892 నుడీ 1900 వరకూ నడిచింది. బందరునుండి ప్రచురించబడే పురుషార్ధప్రదాయనీ పత్రిక 1872 జూలై సంకలనంలో కొక్కొండవారి ఆంధ్ర భాషాసంజీవని గూర్చి ప్రశంసిస్తూ ఇంగ్లీషులోను తెలుగులోనూ సమీక్షలు ప్రకటించారు. ఆ పత్రికలో ప్రచురించబడిన ముఖ్యవిషయములను ఇంగ్లీషు ప్రభుత్వ ట్రాన్సలేటర్ ( Govt. Translator) లెఫ్టనెన్టు కర్నల్ లేన్ దొర గారు (Lt.Col Lane) ఇంగ్లీషులోకి తర్జుమాచేసి ప్రతినెలా మద్రాసు ప్రభుత్వమునకు రిపోర్టు పంపిచేవారు. 1874 నవంబరులో వీరి ఆంధ్రభాషా సంజీవని పత్రికలో సంజీవిని సమాచారమని పేరుతో దేశ పరిపాలన వ్యవహారములను గూర్చిన 16 ప్రశ్నలు ప్రకటించారు. ఈ ప్రశ్నలు తమ పాఠకులు చదివి తమ అభిప్రాయాలను కారణాలు ఉదాహరణలు వ్రాసి పంపమని పత్రికాధివతి కోరారు. ఆ 16 ప్రశ్నలనూ గూడా ప్రభుత్వ ట్రాన్స్ లేటర్ కర్నల్ లేన్ దొర ఇంగ్లీషులోకి తర్జుమా చేసి ప్రభుత్వానికి పంపారు. ఆ 16 ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమువారు ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ స్వాతంత్ర్య చరిత్ర మొదటి సంకలనములో 58 వ చారిత్రక పఠముగా "Report on Telugu Newspaper for November 1874"లో ఉంది.

🍀1874 అక్టోబరులో స్ధాపించిన కందుకూరి వీరేశలింగం గారి వివేకవర్ధని పత్రిక ఆంధ్ర భాషాసంజీవనికి పోటీ పత్రికగా నుండేది.

🍀1871 లో కందుకూరి వీరేశలింగంగారు కొక్కొండ వెంకటరత్నంగారిని గొప్పగా ప్రశంసిస్తూ వ్రాసిన లేఖ వకటి 1951 జులై నెల భారతి ప్రచురణలో నిడదవోలు వెంకటరావు గారు ప్రచురించారు. కానీ 1874 నుంచీ వివేకవర్ధనిలో కందుకూరి వీరేశలింగం గారు కొక్కొండవారి సంజీవనిపై విమర్శలు ప్రచురించటము ప్రారంభించారు.

🍀1875 లో వెంకటరత్నంగారు "హాస్యవర్ధని" స్థాపించారు, 1876 లో కందుకూరి వీరేశలింగం గారు "హాస్య సంజీవని" ప్రచురణ ప్రారంభించారు. ఆ విధముగా కొక్కొండ వారికీ, కందుకూరి వారికీ వ్యంగ్య వాదోపవాదాలు కొనసాగుతూ వుండేవి. 1877 లో కొక్కొెండ వెంకటరత్నం గారు మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో తెలుగు పండితులుగా నియమింప బడ్డారు. 1890 లో ప్రెసిడెన్సీ కాలేజీలో కొక్కొండ వారు ఆంధ్రభాషా వర్ధని స్థాపించారు. బ్రిటిష్ ప్రభుత్వమువారు కేవలం సంస్కృత పండితులకే ఇచ్చేటటువంటి మహామహోపధ్యాయ బిరుదును అందుకున్న ప్రప్రథము ఆంధ్ర పండితుడు శ్రీ వెంకటరత్నం గారు. 1907 లో ఆ బిరుదు వారికి ఇవ్వబడింది. రాజమండ్రీలో జరిగేటటువంటి ఆంధ్ర సాహిత్యపరిషత్తు సమావేశములకు కొక్కొండ వెంకటరత్నం గారు 1912 ఏప్రిల్23 వతేదీన, 1913 ఏప్రిల్ 22 తేదీన జరిగిన సమావెేశమునకు అధ్యక్షత వహించారు.

🌸ఈయన రచించిన మహాశ్వేత (1867) తెలుగులో తొలి నవలగా కొంతమంది భావిస్తారు. వీరు డిసెంబర్ 14 1915 తేదీన పరమపదించారు.🌸                                                                       

No comments:

Post a Comment

.