గీతాంజలి. -రవీంద్రనాథ్ టాగోర్.
అంతరాత్మ అంటేనే భయం.
ఎంతో దూరం నడచి ఒంటరిగా
ఈ సహజ సంకేతానికి వచ్చాను.
కాని ఈ నిశ్చల నిశ్శబ్ద నిశీధంలో
ఎవరిదో అడుగుల చప్పుడు
నా వెనుకనే వినిపిస్తూ ఉంది.
అతని నుంచి తప్పించుకోవాలని
వెంటనే ప్రక్కకు తొలుగుతాను.
కాని అతన్ని తప్పించుకోలేను.
అతను త్వరత్వరగా నడిచి
తన ఉనికికి గుర్తుగా ధూళి రేపుతాడు.
నేను మాట్లాడిన ప్రతిమాటకూ
అతను బిగ్గరగా శృతి కలుపుతాడు
అతను ఎవరో అనుకున్నావు కదూ
నన్ను అంటిపెట్టుకొని గోలచేస్తూ ఉండే
చిన్నారి నా అంతరాత్మనే ప్రభూ!
అతను చాలా అల్లరివాడు.
అతన్ని తోడుగా తీసుకొని
నీ ఇంటి ముందుకు రావాలంటే భయం.
No comments:
Post a Comment