Pages

Showing posts with label మతం. Show all posts
Showing posts with label మతం. Show all posts

Sunday, August 13, 2017

జొరాస్ట్రియన్ మతము (Zoroastrianism)

జొరాస్ట్రియన్ మతము (Zoroastrianism)

జొరాస్ట్రియన్ మతము (Zoroastrianism) ఈ మతముము "మజ్దాఇజం" అనికూడా అంటారు. జొరాస్త్ర మతము (Zoroastrianism) అనేది ఇరాన్(పూర్వపు పర్షియా) దేశానికి చెందిన ఒక మతము. దీనిని జొరాస్టర్ (జరాతుష్ట్ర, జర్-తోష్త్) స్థాపించారు. ఈమతములో దేవుని పేరు అహూరా మజ్దా. ఈ మతస్థుల పవిత్రగ్రంధం, "జెండ్-అవెస్తా" లేదా "అవెస్తా". ఈ మతము ప్రాచీన పర్షియాలో పుట్టినా ఈ మతస్థులు ఎక్కువగా భారతదేశంలో నివసిస్తున్నారు. అందులోనూ ముంబాయిలో ఎక్కువగా నివసిస్తున్నారు.

జొరాస్త్ర మతమును అనుసరించే వారిని జొరాస్త్రీయన్లు అని అందురు. ఈ మతము క్రైస్తవ మతములకంటే పూర్వం ఆవిర్భవించింది. జొరాస్త్రీయన్ల మత గ్రంథమైన అవెస్త (Avesta) లో దేవుడి పేరు ఆహూరా మజ్దా (Ahura Mazda).

జొరాస్త్ర మతము క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో సంపూర్ణ మతంగా రూపాంతరం చెందడానికి ముఖ్య కారణం జొరాస్తర్ (Zoroaster) అను ప్రవక్త. ఆర్యుల తెగలకు చెందిన ఈ ప్రవక్త జీవించిన కాలము తెలియరాకున్నది. కొన్ని అధ్యయనాల ప్రకారం ఇతడు క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల నుండి క్రీస్తుపూర్వం 500 వ సంవత్సరాల మధ్య జీవించాడని తెలుపుచున్నవి .

ఆర్యుల సమాజంలో బహు విగ్రాహాల ఆరాధన, జంతు బలులు ఉండేవి. యుక్త వయసులో ఉన్న జొరాస్తర్ (జరాతుస్త్ర) కు స్వప్నంలో సృష్టి కర్త అయిన అహురా మాజ్డ పంపిన ఓహు మనా (Vohu Manah) అను దేవ దూత దర్శనమిచ్చి దైవ ప్రకటకన చెప్పగా దేవుడుఒక్కడే అని నమ్మిన జొరాస్తర్ ఆయ పెద్దలకు వ్యతిరేకంగా ప్రచారం చేయసాగాడు. పూజారులు నమ్మే దేవతలను దేవుళ్ళను దెయ్యాలుగా వర్ణించసాగాడు. దెయ్యాల మతాన్ని వీడమని వారితో చెప్పేవాడు. ఆగ్రహించిన పెద్దలు జొరాస్తర్ ను అంతంచేయాలనుకొని పలుమార్లు విఫలమయ్యారు. జొరాస్తర్ తన బోధనలతో బాక్ట్రియా (Bactria) సామ్రాజ్యపు రాజైన విష్తాస్ప (Vishtaspa) ను ప్రభావితం చేయగలిగాడు. జొరాస్తర్ ముగ్గురు స్త్రీలను వివాహం చేసుకొని ఆరుగురు పిల్లలకు తండ్రి అయ్యాడు. శతాబ్దాల తరువాత బాక్ట్రియాలో ఉన్న ప్రజలు జొరాస్త్రమతాన్ని స్వీకరించారు. చివరికి ట్యురాన్ (Turan) సామ్రాజ్యానికి, పర్షియాసామ్రాజ్యానికి జరిగిన యుద్ధంలో ట్యురాన్ దేశపు రాజుచేతిలో జొరాస్తర్ మరణించాడు. మరణానికి ముందే జొరాస్తర్ తన వంశంనుండి ముగ్గురు రక్షకులుకన్యకలకు జన్మిస్తారని ప్రవచించాడు.

జొరాస్తర్ జీవించిన కాలంలో ఆకాశం, రాళ్ళు, భూమి, నక్షత్రాలు, గ్రహాలు, నదులు, సముద్రాల ఘోష, మరణం, అగ్ని, సమాధులు - ఇవన్నీ విగ్రహాల రూపాలు దాల్చాయి. కాలక్రమేణా ఇండో-ఆర్యన్ తెగల్లో చీలికలు వచ్చాయి. దానితో వారు ఒకే దేవుడిని ఆరాధించే వారిగా (Monotheists) మరియు అనేక దేవుళ్ళను ఆరాధించేవారిగా (Polytheists) చీలిపోయారు. ఫలితంగా అనేక దేవుళ్ళను ఆరాధించే శాఖ వారు పాకిస్తాన్, హిమాలయాల గూండా భారత దేశానికి చేరుకొని నాలుగు వేదాలు (ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం) వ్రాసుకోగా, ఒకే దేవుడిని ఆరాధించే శాఖ వారు మాత్రం అక్కడే స్థిరపడి ప్రవక్త జొరాష్టర్ చెప్పిన సిద్దాంతాలు ఆచరించారు.

జొరాస్త్రీయన్లు చదివే అవెస్త గ్రంథమునకు, భారతీయ వేదాలకు చాలా దగ్గర పోలికలు ఉంటాయి. అవెస్త గ్రంథము - యశ్న (worship), గాత (Psalms), వెందిదాద్ (law against demons), యస్త (worship hymns), కోర్ద అవెస్త (litanies and prayers) అను ఐదు భాగాలుగా విభజించబడింది. ఈ గ్రంథము గ్రీకువీరుడైన అలగ్జాండర్, అరబ్బులు వంటి శత్రుదేశ రాజుల ఆక్రమణలవల్ల అవెస్త చాలా వరకూ నాశనమైయ్యింది . నేడు గ్రంథములో కొంత భాగం మాత్రమే మిగిలియున్నది.[4] కన్నడ భాష తెలుగు భాషకు దగ్గరగా ఉన్నట్టు అవెస్తలో ఉపయోగించిన భాష కూడా సంస్కృత భాషకు చాలా దగ్గరగా ఉంటుంది.

జొరాస్త్రీయన్లు అగ్నిని అహురా మజ్దా దేవుడి చిహ్నంగా భావిస్తారు. గుంపుగా ఒకచోట చేరి అగ్నికి ఎదురుగా కూర్చుని అవెస్తాలోని మంత్రాలు చదువుతూ యజ్ఞాలు నిర్వహిస్తారు. జొరాస్త్ర మతము ఏర్పడిన క్రొత్తలో జోరాస్త్రీయన్లకు ఎటువంటి దేవాలయాలు ఉండేవి కాదు. గ్రీకు చరిత్రకారుడైన హెరోడొటస్ (Herodotus) జీవించిన కాలం తర్వాత జొరాష్ట్రియన్లు అగ్ని ఎక్కువసేపు మండే విధంగా కట్టడాలు నిర్మించుకొన్నారు. అవే అగ్ని దేవాలయాలు (Fire Temples). నేడు అగ్ని దేవాలయాలు టర్కీ, ఇరాన్, భారత దేశం లోను మిగిలియున్నాయి.

జొరాస్త్రీరియన్ల నమ్మకం ప్రకారం సృష్టి కర్త అహుర మాజ్డా. ఇతడు సత్యము, వెలుగు, పరిశుద్ధత, క్రమము, న్యాయము, బలము, ఓర్పుకు గుర్తు.ఈ ప్రపంచం మంచికి చెడుకి మధ్య యున్న యుద్ధ భూమి. అందువల్ల ప్రతి మనుష్యుడు దుష్టత్వం నుండి దూరంగా ఉండుట ద్వారా తన ఉనికిని కాపాడుకొని, మత ఆచారాల ద్వారా పరిశుద్ధపరచుకోవాలి.జొరాస్త్రీరియన్ల నమ్మకం ప్రకారం దేవుడు తన నుండి దృశ్యమైన ప్రపంచాన్ని మరియు అదృశ్యమైన ప్రపంచాన్ని సృష్టించాడు. కనుక సృష్టిని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి మానవుడి బాధ్యత.దేవుడు ఆత్మ స్వారూప్యాలను మొదటగా సృష్టించాడు. అగ్ని, నీరు, గాలి, మట్టి, మొక్కలు, జంతువులు, మనుష్యులు కలిగియున్న ప్రపంచము దేవుని శరీరమువలే యున్నది. అయితే ఆయన ఆత్మఎల్లప్పుడూ సృష్టిని సంరక్షించుకొనుచున్నది. ఆది మానవుడినుండి సంరక్షణా దూతలను, మష్యె (Mashye), మష్యానె ( Mashyane) అను మొదటి స్త్రీ పురుషులను సృష్టించాడు దేవుడు. ఈ స్త్రీ పురుషుల నుండియే సమస్త మానవ జాతి ఆవిర్భవించింది.దేవుని సులక్షణాలను ప్రతిబంబించే మరియు భౌతిక ప్రపంచంలో దుష్టుడితో పోరాడటంలో దేవునికి సాయపడే దైవ స్వరూపాలు ఉంటాయి. వీటిలో గొప్పవైన ఆరు అమరమైన స్వరూపాలు లేక అమేష స్పెంతాస్. ఇంకా దేవ దూతలు వగైరా ఉంటాయి. దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి అర్పణలతో కూడిన యజ్ఞాలు, ప్రార్థనలు చేస్తారు.మనిషి సహజంగా దైవ స్వరూపం కలిగి దైవ లక్షణాలు కలిగియుంటాడు. మనుష్యులకు రెండు అవకాశాలుంటాయి - ఒకటి నీతిగా ఉండి దేవుడి బోధనలు పాటించడం, రెండవది దుష్టత్వాన్ని పాటించి నాశనమవ్వడం. మనిషి ఎంచుకొన్న మార్గాన్ని బట్టి దేవుడు ఆ మనుష్యుని ఖర్మను నిర్ణయిస్తాడు. పాప ప్రాయిశ్చిత్తం చేసుకొనే విధానం గురించి, సత్ప్రవర్తన గురించి దేవుడు విజ్ఞానాన్ని ఇస్తాడు. కాని తనను ఆరాధించేవారు చేసిన పాపాలను మోయడు.దేవుడు భౌతిక ప్రపంచం సృష్టించక ముందే ఆత్మీయ ప్రపంచాన్ని సృష్టించాడు. ఆత్మీయ ప్రపంచం దుష్టశక్తికి అతీతమైనది. భౌతిక ప్రపంచం ఎప్పుడూ దుష్టుడి ఆక్రమణకి గురవ్వుతూవుంటుంది ఎందుకనగా దుష్టుడు అక్కడ నివాసమేర్పరచుకొన్నాడు. కనుక మనుష్యులు తమకు ఎదురయ్యే ప్రమాదాలను గుర్తించాలి. వాటివైపు వెళ్ళకూడదు. అగ్ని, నీరు, భూమి, గాలి - వీటిని దుష్ట స్వరూపాలు లోపలికి వెళ్ళి కాలుష్యం చేయకుండా కాపాడాలి. మృత దేహాలను ఖననం చేయకూడదు, పాతిబెట్టకూడదు, నీటిలో పడవేయకూడదు. రాబందులకు, ఇతర పక్షులకు ఆహారంగా వేయాలి.జొరాస్త్ర మతము ప్రవక్త అయిన జొరాస్తర్ బోధనలపై ఆధారపడియున్నది. ఒక కథ ప్రకారం దేవుడే స్వయంగా జరాతుస్త్రకు దర్శనమిచ్చి సృష్టి రహస్యాలను, సన్మార్గంలో పయనించడానికి మానవులు పాటించవలసిన నియమాలను తెలిపాడు. జొరాస్తర్ బోధనలు జెండ్ అవెస్తా (Zend Avesta) లో దొరకుతాయి. జొరాస్త్రీయన్లు జరతుస్త్ర పుట్టుక 3000 సంవత్సరాల పాటూ సాగే సృష్టి చక్రం ఆరంభాన్ని తెలియజెప్పిందని నమ్ముతారు. బోధనలను భద్రపరచడానికి, మానవాళిని నడిపించడానికి ప్రవక్త భూమి పై ప్రతి యుగం చివరలో అవతారమెత్తుతాడు. బోధనలను భద్రపరచడానికి, మానవాళిని నడిపించడానికి ప్రవక్త భూమి పై ప్రతి యుగం చివరలో అవతారమెత్తుతాడు. జొరాస్తర్ కుమారుడైన షోశ్యాంత్ (మూడవ ప్రవక్త) తీర్పు దినాన్ని, భౌతిక ప్రపంచంలో దుష్ట శక్తుల సంహారం గురించి ప్రవచిస్తాడు.జొరాస్త్రీయన్ల నమ్మకం ప్రకారం మరణము అనేది ఆత్మ శరీరంలోంచి బయటకు వెళిపోవడం వల్ల సంభవిస్తుంది, ఆపై శరీరం అపవిత్రమైపోతుంది. ఆత్మ శరీరం నుండి బయటకు వెడలిన తరువాత 3 రోజులవరకూ ఆ శరీరం వద్ద తిరుగుతూ తరువాత దేనా అనే ఆత్మ సాయంతో ఆత్మీయ లోకానికి వెళ్ళిపోతుంది. అక్కడున్న దేవ దూత విచ్చేసిన ఆత్మ అంతిమతీర్పు దినానికి ముందు తాత్కాలికంగా స్వర్గానికి వెళ్ళాలో నరకానికి వెళ్ళాలో నిర్ణయిస్తుంది. జొరాస్త్రీయన్ల నమ్మకం ప్రకారం అంతిమ తీర్పు దినములో దేవుడు మరణించిన ఆత్మలను లేపి రెండవసారి విచారణకు సిద్ధం చేస్తాడు. అన్ని మంచి ఆత్మలు స్వర్గంలో శాశ్వత స్థానాన్ని పొందుతాయి, మిగిలిన ఆత్మలు నిత్య జీవం పొందేవరకూ తాత్కాలికంగా శిక్షలు పొందుతాయి. కొంతమంది జొరాస్త్రీయన్లు దైవ నిర్ణయం ప్రకారం ఆత్మలు పొరపాట్లను అధికమించి, సిద్దిత్వం పొందాలని భూమ్మీదే జన్మిస్తాయని, కనుక ఆత్మలు తమ వ్యక్తిత్వాన్ని శుద్ధీకరించుకోవడానికి, వెలుగుమయం చేసుకోవడానికి ఆత్మలకు భూమ్మీద జీవనం ఒక అవకాశమని నమ్ముతారు. జొరాస్త్రీయన్ పుస్తకాలు స్వర్గాన్ని సంపూర్ణ సంతోషకరమైన ప్రదేశమని, దేవుని వెలుగుతో అలంకరించబడినదని; నరకాన్ని పాపపు అత్మలు శిక్షలు పొందే శీతలమైన, చీకటియన ప్రదేశంగా చెబుతాయి.దుష్ట శక్తి వల్ల భూమ్మీద జీవనం ప్రమాదంతో కూడియున్నదని జొరాస్త్రీయన్లు నమ్ముతారు. దేవుడు చెప్పిన ఆజ్ఞలను పాటించకపోవడము వల్ల కాదు కాని, జొరాస్తర్ చెప్పిన మూడు ఆజ్ఞలు (మంచి ఆలోచన, మాటలు, మంచి కార్యాలు) పాటించకపోవడం వల్ల మనుష్యులు వ్యభిచారము, దొంగతనము, పంచభూతాలను మలినం చేయడం, ఇతర నమ్మకాలను ఆచరించడం, చనిపోయిన వాటిని తొలగించకపోవడం, చనిపోయినవాటిని ముట్టుకోవడం, దేవుడిని ప్రార్థనలు - యాగాలు చేయకపోవడం, దెయ్యాలను ఆరాధించడం, కుస్తీ ధరించకపోవడం, పై వస్త్రం ధరించకపోవడం, దురుద్దేశ్యంతో వ్యాపారం చేయడం, లేఖనాల్లో చెప్పినట్లు వివాహం చేసుకోకపోవడం వంటి అనేక పాపాలు చేస్తారు.ప్రతీ 3000 సంవత్సరాలకు ఒకసారి దేవుడు సమస్త దుష్ట శక్తులను అంతం చేసి తీర్పు దినాన్ని ప్రకటిస్తాడు, అన్ని ఆత్మలను లేపి రెండవసారి విచారణకు గురిచేస్తాడు. ఆ విచారణలో విధేయులైన ఆత్మలు స్వర్గంలో నిత్యజీవాన్ని పొందుతాయి, మిగిలిన ఆత్మలు నరకంలో నిత్య శిక్షలకు గురవుతాయి.జొరాష్ట్రియన్లు కూడా హిందువులవలే దేవునితో సంభాషించడానికి యజ్ఞాలు నిర్వహిస్తారు. వీటినే యస్నాలు అని అందురు. మానవాళి కోసం నిర్వహించే ఈ యజ్ఞాలను అనుభవజ్ఞులైన పూజారులు తమ అగ్ని దేవాలయంలో అవెస్తాలో వాక్యములు / మంత్రాలు చదువుతూ చేస్తారు. జొరాస్త్రీయన్లు తమ దేవాలయాల్లో రోజుకి ఐదు సార్లు పూజలు నిర్వహిస్తారు. ఇదే కాకుండా నాజోత్ అనే ఉపనయన తంతును బాలురకు, బాలికలకు నిర్వహిస్తారు. నాజొట్ ను ఎవరికైనా జోరాస్త్ర మార్గంలో ప్రయాణం సాగించే ముందు చేస్తారు.

సూక్తులు

అపకీర్తి, కుటిలత్వము రాకుండునట్లు, అబద్దమాడకుము [5]అసూయ దెయ్యము నీ వైపు చూడకుండునట్లు, ప్రపంచపు నిధి ప్రీతికరముగా లేకుండునట్లు నీవు ఆశ కలిగియుండకుము.ఆవేశపడకుము, ఎందుకనగా ఆవేశము వచ్చినప్పుడు బాధ్యతలు, మంచికార్యాలు మరుగున పడును, ప్రతి పాపము ఆలోచనలోకి వచ్చును.[6]ఆందోళన పడకుము, ఎందుకనగా ఆందోళన ప్రపంచంలో ఉన్న ఆనందాన్ని అధికమించును.హాని, పశ్చాతాపము నీ వద్దకు రాకుండునట్లు, మోహపడకుము.చేవలసిన పని పూర్తి కాకుండా ఉండునట్లు సోమరితనమును చేరనీయకుము.చక్కని గుణములు కలిగిన భార్యను ఎంచుకొనుముకలిగియున్న సంపదను బట్టి గర్వించకుము, ఎందుకనగా ఆఖరిలో అన్నింటినీ వదిలేయాల్సిందే.

ప్రస్తుత స్థితి

2004 గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా జొరాస్త్రీయన్ల సంఖ్య 1,45,000 నుండి 2,10,000 వరకూ ఉంది. 2001 భారత్ జనగణన ప్రకారం 69,601 పార్శీలు భారత్ లో గలరు. క్రీస్తు శకం తరువాత జొరాస్త్రీయన్లు కొన్ని వందల సంఖ్యలో భారతదేశంలో ఉన్న గుజరాత్ రాష్ట్రంలోకి అడుగుపెట్టారు. వీరినే పార్శీయులు అని అంటారు. కుస్తీ యజ్ఞోపవీతము (ఒడుగు / జంధ్యం) ధరించే ఆచారము వీరిలో కూడా ఉంది. భారత దేశంలో జోరాస్త్ర మతమునకు పార్శీ మతమనికూడా పేరు.

 ప్రముఖ పార్శీలు
దాదాభాయి నౌరోజీ, జమ్సేట్జి టాటా ,ఫిరోజ్ షా ,మెహతాఫిరోజ్ గాంధీజుబిన్ మెహతాఅర్దెషీర్ ఇరానీగోద్రెజ్ కుటుంబం, వాడియా కుటుంబం, టాటా కుటుంబం వగైరాలు.

 ప్రపంచంలోనే వీరు మహా జ్ఞానులుగా ప్రసిద్ది. యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఆకాశంలో నక్షత్రాన్ని వెంబడిస్తూ వెళ్ళిన ముగ్గురు తూర్పు దేశపు జ్ఞానులు ఈ జొరాస్ట్రియన్లే కావడం గమనార్హం. సికింద్రాబాద్ లోని "పార్సీగుట్ట"లో వీరి నివాసగృహాలు, స్మశానాలు ఉన్నాయి.

Sunday, May 21, 2017

ఎవరికీ మోక్షం - హిందూ ధర్మచక్రం


ఎవరికీ మోక్షం - హిందూ ధర్మచక్రం

త్రిలోకసంచారి అయిన నారదుడు ఒకసారి భూమి మీద ఉన్న విష్ణుభక్తులను పలకరించేందుకు బయల్దేరాడు. అక్కడ ముందుగా ఆయన నిత్యం హరినామస్మరణలో లీనమయ్యే ఓ ముని దగ్గరకు వెళ్లాడు.

అయ్యా! వైకుంఠం నుంచి ఎప్పుడు వచ్చారు. విష్ణుభగవానుడు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీరు తరచూ వైకుంఠానికి వెళ్తూ ఉంటారా?’ అని ప్రశ్నలతో ముంచెత్తాడు ఆ ముని. విష్ణుమూర్తుల వారు బాగానే ఉన్నారు. నేను వైకుంఠానికి తరచూ వెళ్తూనే ఉంటాను,’ అంటూ బదులిచ్చారు నారదులవారు. అయితే స్వామీ! ఈసారి మీరు వైకుంఠానికి వెళ్లినప్పుడు నాకు మోక్షం ఎప్పుడు ప్రసాదిస్తారో దయచేసి స్వామివారిని అడగండిఅని వేడుకున్నాడు ఆ ముని. సరేనంటూ నారదులవారు ముందుకు సాగిపోయారు. ఈసారి ఆయనకు ఒక చెప్పులు కుట్టుకునేవాడు కనిపించాడు. మిమ్మల్ని చూస్తే సాక్షాత్తూ ఆ విష్ణుమూర్తినే చూసినట్లుంది. దయచేయండి స్వామీ! ఎలా ఉన్నారు? వైకుంఠం నుంచి ఎప్పుడు వచ్చారు? స్వామి ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు?’ అంటూ చెప్పులు కుట్టుకునేవాడు కూడా ప్రశ్నలతో నారదుని ముంచెత్తాడు.

స్వామి బాగానే ఉన్నారు. నేను మళ్లీ అక్కడికే వెళ్తున్నాను. నీ గురించి ఏమన్నా అడగమంటావా!అన్నారు నారదులవారు. అడగడానికి ఇంకేముంది తండ్రీ! ఆ స్వామివారి కటాక్షం ఎప్పుడు లభిస్తుందో, నాకు మోక్షం ఎప్పుడు సిద్ధిస్తుందో కనుక్కోండి చాలుఅని వేడుకున్నాడు చెప్పులు కుట్టుకునేవాడు. అలాగేనంటూ నారదులవారు తిరిగి వైకుంఠానికి బయల్దేరారు. వైకుంఠంలో నారదులవారు స్వామిని చూసిన వెంటనే, తాను భూలోకంలో కలిసి వచ్చిన భక్తుల గురించి చెప్పారు. వారి సందేహాలను కూడా స్వామి ముందు ఉంచారు. నాలో ఐక్యమయ్యేందుకు ఆ ముని మరెన్నో జన్మలు వేచి ఉండాలి. కానీ ఆ చెప్పులు కుట్టుకునే అతనిది మాత్రం ఇదే చివరి జన్మఅన్నారు విష్ణుమూర్తి.

స్వామివారి మాటలు విన్న నారదులవారు అయోమయంలో పడిపోయారు. నిత్యం హరినామస్మరణ చేసే మునికి మరెన్నో జన్మలు ఉండటం ఏంటి? సాధారణ సంసారిగా జీవిస్తున్న ఆ చెప్పులు కుట్టుకునేవాడికి ఇదే ఆఖరు జన్మ కావడం ఏంటి? అన్న ఆలోచనలో మునిగిపోయాడు. నారదుని మనసులో ఉన్న సంశయాన్ని కనిపెట్టారు స్వామి. నీ అనుమానం తీరే ఉపాయం ఉంది. నువ్వు ఈసారి వారిద్దరినీ కలిసినప్పుడు, ‘స్వామివారు ఏం చేస్తున్నారు?’ అని వాళ్లు అడుగుతారు కదా! అప్పుడు ఆయన సూది బెజ్జంలోచి ఏనుగుని పంపిస్తున్నారుఅని చెప్పు. వారి స్పందన చూశాక నీకే అర్థమవుతుంది. ఎవరు గొప్ప భక్తులో!అన్నారు స్వామి.

విష్ణుమూర్తి చెప్పినట్లుగానే నారదుడు తిరిగి భూలోకానికి బయల్దేరాడు. ముందుగా ఆయనకి ముని ఎదురుపడ్డాడు. ఎప్పటిలాగే నారదులవారిని కుశలప్రశ్నలు అడుగుతూ, పనిలో పనిగా స్వామివారు ఏం చేస్తున్నారు?’ అని అడిగాడు ముని. ఆ ఏముంది! వేలెడంత సూది బెజ్జంలోంచి కొండంత ఏనుగుని పంపిస్తున్నారుఅన్నారు నారదులవారు. భలేవారే! సూది బెజ్జంలోంచి ఏనుగుని పంపించడం ఎలా సాధ్యం. మీరు నాతో పరాచికాలు ఆడుతున్నట్లున్నారు, లేదా ఏదో భ్రాంతికి గురై ఉంటారుఅన్నాడు ముని చిరునవ్వుతో. నారదులవారు అక్కడి నుంచి సాగిపోయారు. మరికొంత దూరం వెళ్లాక ఆయనకి మునుపటి చెప్పులు కుట్టుకునే అతను కనిపించాడు.

అయ్యా! దయచేయండి! ఎక్కడి నుంచి రాక? ఈ మధ్య కాలంలో వైకుంఠానికి వెళ్లారా? స్వామివారు ఎలా ఉన్నారు?’ అని అడిగాడు ఆ చెప్పులు కుట్టుకునే అతను. అంతా బాగానే ఉందయ్యా! నేను వైకుంఠానికి వెళ్లే సమయంలో స్వామివారు ఒక సూదిబెజ్జంలోంచి ఏనుగుని ఎక్కిస్తున్నారుఅన్నారు నారదులవారు. మంచిది మంచిది. స్వామివారు తల్చుకుంటే సాధ్యం కానిది ఏముంది!అన్నాడు భక్తుడు. అదేంటీ! స్వామివారు ఎంత గొప్పవారైతే మాత్రం అంత అసాధ్యమైన కార్యాన్ని చేయగలరని నువ్వు నమ్ముతున్నావా!అని ఆశ్చర్యంగా అడిగాడు నారదుడు.

భలేవారే భగవంతునికి అసాధ్యం అంటూ ఏముంటుంది. ఇదిగో ఈ మర్రి పండుని చూడండి. ఈ మర్రి పండులో వేలాది గింజలు ఉన్నాయి కదా! ఆ గింజలన్నీ మళ్లీ మర్రి చెట్లుగా మారతాయి కదా! పోనీ అక్కడితో ఆగుతుందాఆ మర్రి చెట్టు ఊడలు కిందకి దిగి విశాలమైన వనంగా మారుతుంది. ఇంత చిన్న పండులో అన్ని మహావృక్షాలు ఇమిడి ఉన్నప్పుడు స్వామివారు చేసినదానిలో ఆశ్చర్యం ఏముంది. సృష్టిలో ఇలాంటి అద్భుతాలన్నీ ఆయనకి సాధ్యమే కదా!అన్నాడు చెప్పులు కుట్టుకునేవాడు. పైకి ఎంతో సాధారణంగా కనిపించే ఆ భక్తుని మనసులో భగవంతుని పట్ల ఉన్న విశ్వాసం ఎంత బలమైనదో నారదులవారికి అర్థమైంది. మోక్షం అతన్నే ఎందుకు వరించిందో తెలిసివచ్చింది.
ఈ పరిపక్వత  మన అందరిలో వచ్చినప్పుడే మనం నిజమైన స్వామీ భక్తులం అవుతాము
ఏమంటారు ???
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

Thursday, February 23, 2017

శివరాత్రికి ఏం చేయాలి? ఎలా జరుపుకోవాలి?

శివరాత్రికి ఏం చేయాలి? ఎలా జరుపుకోవాలి? 



సనాతన సంస్కృతిలో పండుగలంటే కేవలం విశ్రాంతి కోసమో, ఆహ్లాదం కోసమో ఉద్ద్యేశించబడినవి కావు. ప్రతి సంబరంలోనూ ఆధ్యాత్మికత, దైవికత ఉంటుంది. ప్రతి పండుగకు వైజ్ఞానిక, ఆరోగ్య, శాస్త్రీయ కారణాలుంటాయి. 

అంతరిక్షం నుంచి ప్రసరించే కాస్మిక్ కిరణాలను, విద్యుత్ అయస్కాంత్ తరంగాలను దృష్టిలో ఉంచుకుని, ఏ రోజున ఏ పని చేయడం వలన మనిషి జీవనం వికసిస్తుందో, ఇంతకముందు ఉన్న స్థితి నుంచి మరింత గొప్ప స్థితికి ఎదిగే అవకాశం లభిస్తుందో, గమనించి ఆయా రోజులలో ప్రత్యేక పర్వదినాలు ఏర్పరిచారు మన మహర్షులు. 

శివరాత్రే యోగరాత్రి. శివరాత్రికి రోజు ప్రకృతిలో ఉండే తరంగాలు, అంతరిక్షం నుంచి వెలువడే కాస్మిక్ కిరణాలు విశ్వ మానవ వికాసానికి, మనిషి తన పరిపూర్ణమైన రూపాన్ని తెలుసుకోవడానికి, ఆత్మ సాక్షాత్కారానికి తోడ్పడుతాయి. అందుకే శివరాత్రికి కొన్ని ప్రత్యేక నియమాలు విధించారు;-

  • ఉపవాసం శివరాత్రికి చేసే ఉపవాసానికి, జాగరణకు విశేష ప్రాధాన్యం ఉంది. 
  • శివరాత్రి అందరూ ఉపవాసం చేయాలని శాస్త్రం చేయాలి. 
  • చిన్నపిల్లలకు, ముసలివాళ్ళకు, అనారోగ్యంతో బాధపడేవాళ్ళకు, గర్భవతులకు, ఔషధసేవనం చేయాల్సిన వాళ్ళకు మినహాయింపు ఇచ్చింది శాస్త్రం. 
  • ఉపవాసం ఉండే ముందు రోజు, ఉపవాసం మరుసటి రోజు మాంసాహారం, గుడ్డు మొదలైనవి తినకూడదు, మద్యపానం చేయకూడదు. 
  • ఎలాగూ ఉపవాసం చేస్తున్నాం కదా, ఉదయం లేస్తే ఆకలి తట్టుకోవడం కష్టమని, ఆలస్యంగా లేస్తారు కొందరు. అలా చేయకూడదు. 
  • ఉపవాసం ఉండేరోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తలపై నుంచి స్నానం చేసి, ఈ రోజు నేను శివునకు ప్రీతికరంగా శివరాత్రి ఉపవాసం చేస్తున్నాను అని సంకల్పం చెప్పుకోవాలి. 
  • ఉపవాసం అనే పదానికి అర్ధం దగ్గరగా ఉండడం అని. భగవంతునికి మనసును, ఇంద్రియాలను దగ్గరగా జరపడమే ఉపవాసం. 
  • ఆరోగ్యపరంగా చూసినప్పుడు ఉపవాసం శరీరంలో ఉన్న విషపదార్ధాలను తొలగించడంతో పాటు శరీరంలో ప్రాణశక్తిని, ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుంది. 
  • మరీ నీళ్ళు కూడా తాగకుండా ఉపవసించమని ఎవరు చెప్పలేదు. అలా చేయకూడదు కూడా. ఎందుకంటే శరీరాన్ని కష్టపెడుతూ, భగవంతుని వైపు మనసును తిప్పడం కష్టం. 
  • జీవారాధాన అట్లాగే మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఎంత బియ్యం, ఇతర ఆహారపదార్ధాలు మిగిలుతాయో, వాటిని ఆకలితో ఉన్న పేదలకు పంచాలి. అష్టమూర్తి తత్వంలో శివుడు లోకంలో జీవుల రూపంలో సంచరిస్తూ ఉంటాడు. అన్నార్తుల ఆకలిని తీర్చడం కూడా ఈశ్వరసేవయే అవుతుంది. అందుకే స్వామి వివేకానంద 'జీవారాధానే శివారాధాన' అన్నారు. ఉపవాస నియమాలు కూడా అవే చెప్తాయి. 
  • శివరాత్రి రోజు ప్రకృతిలో ఉన్న శివశక్తిని శరీరం గ్రహించాలంటే, వెన్నును నిటారుగా పెట్టి కూర్చోవాలి. 
  • అంటే కూర్చునే సమయంలో ముందుకు వంగి కూర్చోవడం లాంటివి చేయకుండా, 
  • మీ వెన్నుపూస నిటారుగా ఉండేలా కూర్చోవాలి, నిలబడాలి. 
  • మౌనవ్రతం శివరాత్రి రోజు చేసే మౌనవ్రతం చాలా అద్భుత ఫలితాలను ఇస్తుంది. మానసికప్రశాంతతను చేకూరుస్తుంది. 
  • మౌనం అనగానే నోరు మూసుకుని కూర్చోవడం అని భావించవద్దు. 
  • వ్రతంలో త్రికరణములు (మనోవాక్కాయములు) ఏకం కావాలి. మనసును మౌనం ఆవరించినప్పుడు మౌనవ్రతం సంపూర్ణమవుతుంది. 
  • అందువల్ల అనవసరమైన ఆలోచనలను, వాదనలను కట్టిపెట్టి, మనసును శివుని పై కేంద్రీకరించాలి. అవసరమైతే శివాలయానికి వెళ్ళండి, 
  • అక్కడ రుద్రాభిషేకం చేస్తారు. రుద్రం ఒకసారి చదవటానికి అరగంట పడుతుంది. 
  • మీరు అభిషేకం చేయించుకోకపోయిన ఫర్వాలేదు, 
  • శివాలయంలో ప్రశాంతంగా కళ్ళు మూసుకుని కూర్చుని, పండితులచే చదవబడుతున్న రుద్ర - నమకచమకాలను వినండి. 
  • ఆ తర్వాత వచ్చే ఫలితాలను చూడండి. 
  • ఉద్యోగస్తులు, ముఖ్యంగా ప్రైవేటు రంగంలో పని చేస్తున్నవారికి ఆ రోజు సెలవు ఉండకపోవచ్చు. 
  • విదేశాల్లో చదువుతున్న విద్యార్ధులకు అదే పరిస్థితి ఎదురుకావచ్చు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? 
  • అవసరమైంతవరకే మాట్లాడండి, అనవసరమైన మాటలు కట్టిపెట్టండి. ఎవరితోను గొడవ పడకండి, తిట్టకండి. సాధ్యమైనంత తక్కువ మాట్లాడండి. 
  • ఇంటి వచ్చాక, కాళ్ళుచేతులు ముఖం శుభ్రపరుచుకుని, శివుడి ముందో, ఆలయంలోనో కాసేపు కన్నులు మూసుకుని మౌనంగా కూర్చోండి. 
  • అభిషేకం శివుడు అభిషేక ప్రియుడు. శివుడికి కాసిన్ని నీరు పోసిన, సంతోషంతో పొంగిపోతాడు. 
  • శివరాత్రి నాడు అందరూ వర్ణ, లింగ, జాతి, కుల భేధం లేకుండా శివుడిని అర్చించడం వలన, అభిషేకించడం వలన సదాశివుని అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడ తొలగిపోతుంది. 
  • జాగరణ శివరాత్రికి చేసే జాగరణ మనలో ఉన్న శివత్వాన్ని జాగృతం చేస్తుంది. జాగరణం మనలో ఉన్న శివుడిని జాగృతం చేస్తుంది, తమస్సును తొలగిస్తుంది. 
  • సినిమాలు చూస్తునో, పిచ్చి కబుర్లు చెప్పుకుంటూనో, కాలక్షేపం చేస్తూనో చేసే జాగరణకు అది జాగరణ అవ్వదు, కాలక్షేపం మాత్రమే అవుతుంది. 
  • అప్పుడు పుణ్యం రాకపోగా, ఆ సమయంలో మట్లాడిన చెడు మాటల వలన పాపం వస్తుంది. 
  • మంత్ర జపం శివరాత్రి మొత్తం శివనామంతో, ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మహామంత్ర జపం/స్మరణతో జాగరణ మీలో నిక్షిప్తమై ఉన్న అనంతమైన శక్తిని జాగృతం చేస్తుంది. 
  • శివోహం అనే భావనను కలిగిస్తుంది. శివరాత్రి మరునాడు ఉదయం శివాలయాన్నిసందర్శించి, ప్రసాదం తీసుకుని, ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతం ముంగించాలి. 
  • అందరూ గుర్తుపెట్టుకోవలసిన ముఖ్య విషయం, శివరాత్రి నాడు ఉపవాసం, జాగరణ చేసినవారు, 
  • తరువాతి రోజు రాత్రి వరకు నిద్రించకూడదు. అప్పుడే సంపూర్ణఫలం దక్కుంతుదని చెప్తారు...
 తెలుగు లోమీరు కని వినీ ఎరుగని మంచి విషయాల కొరకు;క్లిక్- https://telugufb.blogspot.com/
 .
పిల్లలకు/పెద్దలకు అందిరికి పనికి వచ్చే విసయాల కొరకు;- https://telugufb.blogspot.com/
 .
హిందూమతానికి సంబందించిన విసయలకోరకు;-https://telugufb.blogspot.com/
.
తెలుగు లో విజ్ఞానానికి ;- https://telugufb.blogspot.com/

Sunday, October 16, 2016

బ్రహ్మా ముహూర్తం అంటే ఏంటి ? బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేవాలా ?

బ్రహ్మా  ముహూర్తం అంటే ఏంటి ?

బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేవాలా ?

బ్రహ్మా ముహూర్తం..!! ఈ పదాన్ని మనం చిన్నప్పటి నుంచి వినే ఉంటాం. కానీ.. దీనికి సరైన అర్థం, పరమార్థం మాత్రం చాలామందికి తెలియదు. బ్రహ్మా ముహూర్తం తెల్లవారుజామున అని తెలుసు కానీ.. కరెక్ట్ సమయం మాత్రం చాలామందికి తెలియదు.అసలు బ్రహ్మా ముహూర్తం అంటే ఏంటి ? బ్రహ్మాముహూర్తంలో నిద్రలేవాలని, పూజ చేయాలని, పిల్లలు చదువుకోవాలని ఎందుకు సూచిస్తారు ? బ్రహ్మా ముహూర్తానికి ఎందుకంత ప్రాధాన్యత ? బ్రహ్మ ముహూర్తంలోనే ఎందుకు నిద్రలేవాలి ? ఇలాంటి అనుమానాలన్నింటికీ.. పరిష్కారం దొరికింది. తెలుసుకోవాలని ఉందా.. అయితే.. ఈ ఆర్టికల్ లోకి ఎంటర్ అయిపోండి.

బ్రాహ్మా  ముహూర్తం

సుర్యోదయానికి 48 నిమిషాల ముందు సమయాన్ని బ్రాహ్మా  ముహూర్తం అంటారు.

ఆఖరి నిమిషాలు

రాత్రిభాగంలోని ఆఖరి 48 నిమిషాలను.. సూర్యోదయానికి ముందు 48 నిమిషాలను బ్రహ్మా  ముహూర్తం అంటారు.
  
పూజలు
బ్రహ్మా ముహూర్తం పూజలు, జపాలకు మంత్ర సాధనకు విశిష్టమైన సమయంగా చెబుతారు.

విద్యార్థులకు

విద్యార్థులు బ్రాహ్మా ముహూర్తం లో లేచి చదువుకుంటే బాగా గుర్తుంటుందని నమ్ముతారు.
  
జీవక్రియలు

మన శరీరంలో జీవ గడియారం ఉంటుంది. దీన్ని అనుసరించే మన జీవక్రియలన్నీ జరుగుతాయి. అలాగే ఉదయం మనలో కార్టిసోల్ హార్మోన్ ఎక్కువ మోతాదులో విడుదల అవుతుంది. ఈ హార్మోన్ మనలోని ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపుతుంది. అందుకే పిల్లలు బ్రహ్మా ముహూర్తంలో చదువుకుంటే చక్కగా గుర్తుంటుందట.
  
ఒత్తిడి
అలాగే ముందు రోజు భరించిన ఒత్తిడులు అన్ని నిద్రలో మరిచిపోతాం కాబట్టి మెదడు ఉత్తేజంతో ఉంటుంది. పరిసరాలు కూడా నిశ్శబ్దంగా ఉంటాయి. ఈ అన్ని కారణాల వల్ల చదివినది మెదడులో జాగ్రత్తగా నిక్షిప్తం అవుతుంది.

పెద్దవాళ్లు ఎందుకు లేవాలి ?

ఆయుర్వేదం ప్రకారం రాత్రి తోందరగా నిద్రపోయి ఉదయం సూర్యోదయానికి ముందే నిద్ర లేచేవారికి ఆరోగ్య సమస్యలు రావు.

ఫ్రెష్ ఆక్సిజన్

రాత్రంతా చెట్లు వదిలిన ఆక్సిజన్ వేకువ జామున కాలుష్యం బారిన పడకుండా ఎక్కువ పరిమాణం లో మనకు అందుబాటులో ఉంటుంది. వాకింగ్ కు వెళ్లేవారికి ఇది చాలా ఉపయెాగ పడుతుంది.

గృహిణులు ఎందుకు లేవాలి.?

గృహిణులకు నిద్ర లేచిన దగ్గర నుంచి ఎన్నో పనులు , పిల్లల సంరక్షణ, ఇంట్లో పెద్దవారి సంరక్షణ , వంట పనులు,ఇంటి పనులతో క్షణం తీరిక లేకూండా గడుపుతారు. అలాంటి వారికి ఒత్తిడి లేని మానసిక ,శారీరక ఆరోగ్యం చాలా అవసరం.

ఆందోళన

బ్రహ్మా ముహూర్తంలో లేవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది.ఉదయాన్నే నిద్రలేస్తే...ఇంటిపనులన్ని... ఆందోళన లేకుండా అయిపోతాయి....

సూర్యోదయము
ప్రతిరోజూ సూర్యోదయము చూసే అలవాటు ఉన్నవారికి గుండె,మెదడు,ప్రశాంతంగా ఆరోగ్యంగ ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి....

ఆరోగ్యము

బ్రహ్మా ముహూర్తంలో  నిద్రలేవడం వల్ల సూర్యుని లేలేత కిరణాలు మన పైన ప్రసరిస్తాయి సూర్యరశ్మి లో ఉండే విటమిన్ డి ఎముకల బలానికి సహయపడుతుంది.....              

Tuesday, October 4, 2016

హైం ద వ సం స్కృ తి లో 8, 18 అం కె ల కు గ ల ప్రా ధా న్య త

హైం ద వ సం స్కృ తి లో 8, 18     అం కె ల కు  గ ల  ప్రా ధా న్య త


అష్ట లక్ష్మి: ఆది లక్ష్మి, ధాన్యలక్ష్మి , ధైర్యలక్ష్మి , గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి

అష్టాదశ పీఠాలు:

1. శ్రీ శాంకరీదేవి ( ఎకోమలి , శ్రీలంక )
2. శ్రీ కామాక్షీదేవి (కంచి, తమిళనాడు)
3. శ్రీ శృంఖలాదేవి ( ప్రదుమ్నం, గుజరాత్)
4. శ్రీ చాముండేశ్వరీదేవి ( మైసూరు,కర్నాటక)
5. శ్రీ జోగులాంబాదేవి (అల్లంపురం, ఆంధ్రప్రదేశ్)
6. శ్రీ భ్రమరాంబాదేవి ( శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్)
7. శ్రీమహాలక్ష్మి దేవి ( కొల్హాపూర్, మహారాష్ట్ర)
8. శ్రీ ఏకవీరాదేవి ( నాందేడ్ , మహారాష్ట్ర )
9. శ్రీమహాకాళీదేవి ( ఉజ్జయినీ, మధ్యప్రదేశ్ )
10. శ్రీ పురుహూతికాదేవి (పీఠాపురం, ఆంధ్రప్రదేశ్ )
11. శ్రీ గిరిజాదేవి ( కటక్, ఒరిస్సా)
12. శ్రీ మానిక్యాంబాదేవి ( ద్రాక్షారామం, ఆంధ్రప్రదేశ్)
13. శ్రీ కామరూపిణీదేవి (గౌహతి, అస్సాం)
14. శ్రీ మాధవేశ్వరి దేవి ( ప్రయాగ, ఉత్తరప్రదేశ్)
15. శ్రీ వైష్ణవీదేవి ( జ్వాలాకేతం, హిమాచలప్రదేశ్)
16. శ్రీ మాంగల్య గౌరీదేవి ( గయా, బీహార్)
17. శ్రీ విశాలాక్షీదేవి ( వారణాశి, ఉత్తరప్రదేశ్)
18. శ్రీ సరస్వతీదేవి ( జమ్మూ కాశ్మీర్)


అష్టా దశ పురాణాలు:

1. బ్రహ్మపురాణం
2. పద్మపురాణం
3. నారద పురాణం
4. మార్కండేయపురాణం
5. విష్ణుపురాణం
6. శివపురాణం
7. భాగవతపురాణం
8. అగ్నిపురాణం
9. భవిష్యపురాణం
10. బ్రహ్మవైవర్త పురాణం
11. లింగపురాణం
12. వరాహపురాణం
13. స్కందపురాణం
14. వామనపురాణం
15. కుర్మపురాణం
16. మత్స్యపురాణం
17. గరుడపురాణం
18. బ్రహ్మాండపురాణం


అయ్యప్ప స్వామి గుడి మెట్లు:18

1. పొన్నంబలమేడు
2. గౌదేంమల
3. నాగమల
4. సుందరమల
5. చిత్తంబలమల
6. ఖల్గిమల
7. మాతంగమల
8. మైలదుమల
9. శ్రీపదమల
10. దేవరమల
11. నిలక్కలమల
12. తలప్పరమల
13. నీలిమల
14. కరిమల
15. పుతుసేరిమల
16. కలకేట్టిమల
17. ఇంచిప్పరమల
18. శబరిమల


అష్టదిక్పాలకులు:

1. తూర్పు (ఇంద్రుడు)
2. ఆగ్నేయం (అగ్ని)
3. దక్షిణం (యముడు)
4. నైరుతి (నిరుతి)
5. పశ్చిమం (వరుణుడు)
6. వాయువ్యం (వాయువు)
7. ఉత్తరం (కుబేరుడు)
8. ఈశాన్యం (ఈశానుడు)


అష్టమూర్తులు:

1. భూమి
2. ఆకాశం
3. వాయువు
4. జలము
5. అగ్ని
6. సూర్యుడు
7. చంద్రుడు
8. యజ్గ్యము చేసిన పురుషుడు.


అష్టఐశ్వర్యాలు:

1. ధనము
2. ధాన్యము
3. వాహనాలు
4. బంధువులు
5. మిత్రులు
6. బృత్యులు
7. పుత్రసంతానం
8. దాసిజనపరివారము


అష్టకష్టాలు:

1. అప్పు
2. యాచన
3. ముసలితనం
4. వ్యభిచారం
5. చోరత్వం
6. దారిద్యం
7. రోగం
8. ఎంగిలి భోజనం


అష్టఆవరణాలు:

1. విభూది
2. రుద్రాక్ష
3. మంత్రము
4. గురువు
5. లింగము
6. జంగమ మాహేశ్వరుడు
7. తీర్థము
8. ప్రసాదము


అష్టవిధ వివాహములు:

1. బ్రాహ్మం
2. దైవం
3. ఆర్షం
4. ప్రాజాపత్యం
5. ఆసురం
6. గాంధర్వం
7. రాక్షసం
8. ఫైశాచం


అష్టభోగాలు:

1. గంధం
2. తాంబూలం
3. పుష్పం
4. భోజనం
5. వస్త్రం
6. సతి
7. స్నానం
8. సంయోగం


అష్టాంగ యోగములు:

1. యమము
2. నియమము
3. ఆసనము
4. ప్రాణాయామము
5. ప్రత్యాహారము
6. ధారణ
7. ద్యానము
8. సమాధి

.     

Monday, September 12, 2016

మహా భారతం నుండి నేర్చుకోవాల్సిన 14 ముఖ్యమైన పాఠాలు



మహా భారతం నుండి నేర్చుకోవాల్సిన 14 ముఖ్యమైన పాఠాలు


1.జీవితంలో గెలవడానికి జాలి, దయ, మంచితనం మాత్రమే ఉంటే చాలదు:
కర్ణుడు అంటేనే మంచితనానికి, దాన, ధర్మలకి పెట్టింది పేరు, కాని సమయాన్ని బట్టి నడుచుకోక పోవడం వలన చెడు (కౌరవుల) వైపు నిలబడి ప్రాణాలని పోగొట్టుకున్నాడు, కావున జీవితంలో గెలవాలంటే మంచితనంతో పాటు చుట్టూ ఉండే సమాజ పరిస్థితులని, సమయాన్ని బట్టి నడుచుకోవాలి.

2.చెడు స్నేహం ఊహలకి కూడా అందని విధంగా మీ జీవితం నాశనం చేయొచ్చు:
శకుని..పరోక్షంగా కౌరవ సామ్రాజ్యం మొత్తాన్ని నాశనం చేసి,వారితో స్నేహంగా వారి ఆస్థానంలో ఉంటూనే వారికి కలలో కూడా ఊహించని పరాజయాన్ని మిగిల్చాడు, శకుని లాంటి జీవితంలో చాలామంది సలహాలని దూరం పెట్టాలి.

3. ఎటువంటి బేధాలు చూడని నిజమైన స్నేహం జీవితంలో ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది:
పాండవులు శ్రీ కృష్ణుడుని ,కౌరవులు కర్ణుడుని పొందటం అది వారికి యుద్ధం సమయంలో ఏ స్థాయిలో ఉపయోగపడిందో తెలిసినదే ,కర్ణుడి లేని రారాజు బలం ఏ పాటిదో ,కౌరవ సేనకు కర్ణుడు ఏ స్థాయి ధైర్యమో తెలిసిన సంగతే కదా, కుల,మత, పేద మరియు ధనిక భేదాలని చూడకుండా మంచివారితో స్నేహం చేసేవారు ఖచ్చితంగా జీవితంలో గెలుస్తారు.

4.అధికం అనేది అత్యంత ప్రమాదకరం:
కౌరవుల తల్లి అయిన గాంధారీ కి వంద మంది కుమారులు ఉండటం వల్ల వారిని పెంచటంలో చాలా కష్టపడాల్సి వచ్చింది, ,రాజ్యాన్ని బిడ్డలకి సమంగా పంచటమూ వారి బాగోగులు చూస్తూ క్రమశిక్షణతో పెంచటమూ కూడా చాలా కష్టం, అలాగే దుర్యోధనుడికి ఉన్న అధికమైన కోపం, అధికమైన రాజ్యకాంక్ష కారణంగా కౌరవులు నాశనం అయ్యారు..! కాబట్టి అన్ని చోట్ల ముఖ్యంగా చెడు పక్షాన అధికం అనేది అత్యంత ప్రమాదకరం.

5. ఎవరి పనులు వారే చేసుకోవడం:
అరణ్య వాసం, అజ్ఞాతవాసంలోఉన్న పాండవులకి వాళ్ళు నేర్చుకున్న ఇంటి, వంట పనులు చాలా ఉపయోగపడ్డాయి, అలాగే మనకి కూడా మన అవసరాల కోసం అయిన కొన్ని పనులు నేర్చుకోవాలి.

6.మనకి సంభందించిన దాని కోసం ఎంత కష్టమైన పోరాడాలి:
కౌరవులతో పోల్చుకుంటే పాండవుల సైన్యం చాలా తక్కువగా ఉన్న పాండవులు తమ కష్టాన్ని మాత్రమే నమ్ముకొని చిత్తశుద్దితో పోరాటం చేసి విజేతలుగా నిలిచారు.

7. అతి ప్రేమ నష్టం కలిగిస్తుంది:
ద్రుతరాష్ట్రుడు అటు బిడ్డల మీద ప్రేమ ఇటు తను నమ్ముకున్న సిద్దాంతాల మధ్య ఎలా నలిగిపోయాడో ,కొడుకుల వినాశనం అంతా తెలుస్తున్నా వారి తప్పులని ఆపలేకపోయాడు ,అదే ద్రుతరాష్ట్రుడు తన బిడ్డల మీద అంత ప్రేమని పెంచుకోక వారిని క్రమశిక్షణలో పెట్టి ఉంటే విషయం అంత వరకూ వెళ్ళేది కాదేమో. ఎవరి మీద అయిన అతి ప్రేమ, అతి నమ్మకం నాశనానికి, మోసానికి దారితీస్తాయి.

8. విద్య జీవితాంతం నేర్చుకోవటమే మీకు ఉత్తమ బహుమతి:
అర్జునుడు తన జీవితం ఆసాంతం విద్యలు నేర్చుకుంటూనే ఉన్నాడు .ద్రోణా చార్యుల వారి నుండీ యుద్ద శాస్త్రం ,దైవ సంబందమైన ఆయుధాల వాడకం ఇంద్రుడు ద్వారా ,మహదేవుడి నుండి పాశుపతాస్త్రం, యుధిష్టరుడు, కృష్ణుడి నుండి మరెన్నో రాజ నీతులు ఇలా ప్రతి దశలోనూ అభ్యసించటమే అర్జునుడికి ఓ ప్రత్యెక స్థానం దక్కింది, నిత్యం నేర్చుకోవడం వలన ఖచ్చితంగా విజయం సాధించవచ్చు.

9.కొన్నిసార్లు శత్రువులు కూడా మిత్రుల రూపంలో ఎదురవుతారు:
కౌరవుల పక్షాన ఎంతో మంది ఉన్నా వాస్తవానికి వారిలో చాలా మంది పాండవులకి సహాయపడ్డ వాళ్ళే ,బీష్మ ,విదుర ,ద్రోణ రహస్యంగా పాండవులకి ఎంత సహాయం చేసారో తెలిసినదే ,ఇక విదురుడు అయితే కౌరవుల ప్రతీ అడుగు పాండవులకి మోసుకొచ్చిన వాడు కదా.

10.స్రీలని ఆపదల నుండి కాపాడటం :
నిజానికి ద్రౌపది ఐదుగురు భర్తలకూ సంపన్నులూ,అత్యంత బలవంతులు కూడా కానీ సభామందిరాన అవమానం ఆపలేకపోవటంలో విఫలమయ్యారు కదా.

11. అర్ధ జ్ఞానం అత్యంత ప్రమాదకరం:
పద్మవ్యూహం లోనికే ప్రవేశించటమే కానీ బయటపడటం తెలియక తనకున్న అర్ధ జ్ఞానమతో అభిమన్య్యుడు వంటి మహావీరుడే నేల రాలిపోయాడు. ఏ పనిని అయిన పూర్తిగా తెలుసుకున్నకే మొదలుపెట్టాలి, అలా తెలుసుకోకపోతే ఆ పనిని మధ్యలోనే వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది.

12.
కేవలం ద్రౌపదికి జరిగిన అవమానం వలన, ఆమె కౌరవ సామ్రాజ్యం మీద పెంచుకున్న కోపం చివరికి కౌరవులని వాళ్ళ సామ్రాజ్యాన్ని నామ రూపాలు లేకుండా చేసింది,

13. నీకు ఆసక్తి ఉంటే నిన్ను ఎవ్వరూ ఆపలేరు:
చాలా మందికి తెలిసినంత వరకూ అర్జునుడే ప్రపంచం మొత్తంలో అతిపెద్ద విలికాడు ,కానీ కుటిల రాజకీయాల వలన తన వేలుని కోల్పోయిన ఏకలవ్యుడు, అర్జునుడిని మించిన వీరుడు నేరుగా గురు శిక్షణ లేకున్నా ,అతనికి ఉన్న ఆసక్తే అర్జునుడి కన్నా గొప్ప వీరుణ్ణి చేసింది. కావున ఏదైనా సాధించాలంటే ముందుగా మనకు దాని పైన అమితమైన ఆసక్తి ఉండాలి లేకపోతే సాధించలేము.

14.మంచి వ్యూహం విజయానికి తప్పనిసరి:
పాండవులకే కనుక కృష్ణుడు తన అతిచక్కని వ్యూహం లేకపోయి ఉంటే పాండవులు విజయాన్ని సాధించ గలిగే వారు కాదు ఏమో, ఏ పని చెయ్యాలన్న ఒక మంచి ప్లాన్(వ్యూహం) ఉండాలి అలా అయితేనే ఆ పనిని సక్రమంగా పూర్తి చేయగలుగుతాం.
.