Pages

Sunday, June 20, 2021

how to apply for 10th duplicate certificate SSC డూప్లికేట్ MEMO పొందడం ఎలా

how to apply for 10th duplicate certificate SSC డూప్లికేట్ MEMO పొందడం ఎలా


www.bsetelangana.gov.in వెబ్ సైట్ నుండి డూప్లికేట్ SSC Proforma డౌన్లోడ్ చేసుకోవాలి.


ఏ పాఠశాలలో అయితే SSC పూర్తిచేసారో,ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా సంబంధిత అప్లికేషన్ ఫార్వర్డ్ చేయబడుతుంది.
 SBI నుండి Rs.250 చాలన్ ద్వారా ఈ క్రింద తెలుపబడిన హెడ్ ఆఫ్అకౌంట్స్ నందు చెల్లించాలి.

0202-Edn.sporrs.Arts and culture
01-Gen.Edn
102-Secondary.Edn

 006-Director of Govt.Examinations
 800-User charges

DDO Code: 25000303001


 Rs.50 స్టాంప్ పేపర్ పై జూనియర్ సివిల్ జడ్జి లేదా నోటరీ ద్వారా అఫిడవిట్ సమర్పించాలి.
Online ద్వారా అప్లై చేసి
 SSC MEMO పోయినట్లు పోలీస్ స్టేషన్ నుండి NOT FOUND సర్టిఫికెట్ పొందాలి లేదా డిప్యూటీ తహసీల్దార్ నుండి సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది.
 అభ్యర్థి నుండి SSC MEMO అప్పటివరకు సస్పెండ్ అవ్వలేదని డిక్లరేషన్ ఇవ్వాలి.
 ఒకవేళ ఒరిజినల్ MEMO దొరికితే,డూప్లికేట్ MEMO Director of Govt.Examinations కి అప్పగించాల్సి ఉంటుంది.
 సంబంధిత ప్రధానోపాధ్యాయుల నుండి అభ్యర్థి అప్లికేషను ఫార్వర్డ్ చేస్తూ Covering Letter DGE కి సమర్పించాల.

ATM card missing what to do? atm card pote em cheyali?

ATM card missing what to do? atm card pote em cheyali?


SBI:డెబిట్ కార్డు పోయిందా? ఫోన్ ద్వారానే బ్లాక్ చేయండి.. కొత్త కార్డు పొందండి..
కోవిడ్ నేప‌థ్యంలో ఇంటి వ‌ద్ద ప‌లు ర‌కాల సేవ‌లు అందించేందుకు సిద్ధ‌మైంది ఎస్‌బీఐ. ఇంటి వ‌ద్దే క్షేమంగా ఉండండి.. అత్య‌వ‌స‌ర  సేవ‌ల‌ను బ్యాంకుకి రావ‌ల‌సిన అవ‌స‌రం లేకుండానే అందిస్తాము అంటుంది ఎస్‌బీఐ. ఇందులో భాగంగానే ఏటీఎమ్ కార్డు పోతే బ్యాంకుకి రాన‌వ‌స‌రం లేదు అని చెప్తుంది. కొత్త ఎస్‌బీఐ డెబిట్‌ కార్డు కూడా ఫోన్ ద్వారానే పొంద‌వ‌చ్చు.


ఎస్‌బీఐ ఖాతాదారులు త‌మ డెబిట్ కార్డును పొగొట్టుకున్న‌ట్లు గుర్తిస్తే, ఫోన్ ద్వారా వెంట‌నే కార్డును బ్లాక్ చేయోచ్చు.  
అంతేకాదు పాత కార్డు స్థానంలో కొత్త కార్డును పొంద‌చ్చు.
ఇందుకోసం ఎస్‌బీఐ ఇచ్చిన
ఈ రెండు టోల్‌ఫ్రీ నెంబ‌ర్ల‌
1800112211,
18004253800 ల‌లో
ఏదో ఒక‌దానికి కాల్ చేయాల్సి ఉంటుంది.

ఖాతాదారుల‌కు అత్య‌వ‌స‌ర బ్యాంకింగ్ సేవ‌ల అందించ‌డం కోసం ఈ రెండు నెంబ‌ర్ల‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన‌ట్లు ఎస్‌బీఐ వెల్ల‌డించింది.
ఒక‌వేళ డెబిట్ కార్డు పోయినా, ఏటీఎమ్‌ల వ‌ద్ద గానీ, మ‌రిక్క‌డైనా మ‌ర్చిపోయినా ఈ టోల్ ఫ్రీ నెంబ‌ర్ల‌కు ఫోన్ చేయాలి. బ్లాక్ చేయ‌డం కోసం ఎస్‌బీఐ నెట్ బ్యాకింగ్ వంటి ఆప్ష‌న్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇత‌ర మార్గాల‌తో పోలిస్తే ఇందుకు ప‌ట్టే స‌మ‌యం చాలా త‌క్కువ‌.


ఇదే కాకుండా.. డెబిట్ లేదా క్రెడిట్ కార్డు పిన్ జ‌న‌రేష‌న్‌, బ్యాలెన్స్ తెలుసుకోవ‌డం, చివ‌రి 5 లావాదేవీలు గురించి తెలుసుకోవ‌డం, వీటి గురించి ఎస్ఎమ్ఎస్ రూపంలో స‌మాచారం పొంద‌డం కోసం ఈ టోల్‌ఫ్రీ నెంబ‌ర్ల‌కు కాల్ చేయ‌వ‌చ్చు.

Fathers day history in telugu why fathers day is celebrated in telugu

 Fathers day history in telugu why fathers day is celebrated in telugu

 

 నాన్నల దినోత్సవ శుభాకాంక్షలు
జూన్ మూడో ఆదివారం ప్రపంచ తండ్రుల దినోత్సవం(ఫాద‌ర్స్ డే)


ప్రతి ఏడాది జూన్ మూడో ఆదివారం ప్రపంచ తండ్రుల దినోత్సవం (ఫాద‌ర్స్ డే) జ‌రుపుకుంటారు
తండ్రి విలువను ప్రపంచానికి చాటి చెప్పాలనే ఉద్దేశంతో ఏటా జూన్‌ మూడో ఆదివారం ఈ దినోత్సవం నిర్వహిస్తున్నారు. మొదటిసారిగా వాషింగ్టన్‌లో ఓ యువతి ఇందుకు చొరవ చూపింది. తన చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో తండ్రే అన్నీ అయి ఆరుగురు కూతుళ్లను పెంచి పెద్ద చేశాడు. అందుకే ఈయన పుట్టిన రోజును తండ్రుల దినోత్సవంగా జరిపింది. కాలక్రమంలో 1966లో అధికారికంగా గుర్తింపు లభించింది.
1910లో వాషింగ్ట‌న్‌లో ప్రపంచ నాన్నల దినోత్సవం ప్రారంభం అయింది. కాకపోతే 1972 లో తండ్రుల దినోత్సవానికి గుర్తింపు వచ్చింది. పిల్లల కోసం తన జీవితాన్ని ధారపోసే తండ్రుల కోసం సంవత్సరంలో ఒక రోజు ఉండాలన్న ఉద్దేశంతో ప్రపంచ ఫాదర్స్ డేను ప్రారంభించారు. 

తల్లులకు గౌరవంగా ప్రపంచ మాతృ దినోత్సవం ఉంది. అయితే.. తల్లులతో పాటు.. పిల్లల ఎదుగుదలలో ముఖ్య పాత్ర పోషించి బాధ్యతకు మారుపేరుగా నిలిచే తండ్రికి కూడా ఒక రోజు ఉండాలని యూఎస్‌కు చెందిన సోనోరా స్మార్ట్ డాడ్ అనే మహిళ ఈ ప్రచారాన్ని మొదలు పెట్టింది. అలా వాషింగ్ట‌న్‌లో మొదటిసారి 1910లో ప్రపంచ నాన్నల దినోత్సవాన్ని జరిపారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 52 దేశాలు ప్రపంచ తండ్రుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. ఆ దేశాలన్ని కలిసి జూన్ మూడో ఆదివారాన్ని ప్రపంచ తండ్రుల దినోత్సవంగా జరుపుకుంటున్నాయి.

ఒకప్పుడు నాన్నంటే పిల్లలకు ఎంతో భయం.. ఇప్పుడు పరిస్థితులు మారాయి. నాన్న స్నేహితుడుగా మారిపోయాడు. త్యాగానికి ప్రతిరూపమయ్యాడు. పిల్లల భవిత కోసం కొవ్వొత్తిలా కరిగిపోతున్నాడు. నాన్న మనసు మంచుకొండలా మారింది. మారాం చేసినా.. తప్పు చేసినా పాతరోజుల్లో తండ్రి మందలిస్తే నేడు ఆస్థానాన్ని అమ్మకు వదిలేసి తాను మాత్రం ఆప్యాయతనే పంచుతున్నాడు. బిడ్డ ఓటమి పాలైనా భుజాలపై చెయ్యేసి ఊరడించే అమృతమూర్తి.

 నాన్న అంటే
 ఓ వెన్నుముక
ఓ బాధ్యత
ఓ స్నేహితుడు
ఓ సలహా
ఓ దిక్చూచి
ఓ ఆదర్శం
ఓ భరోసా
ఓ మార్గదర్శి
ఓ హీరో
ఓ నిచ్చెన
ఓ గురువు
ఓ రక్షకుడు
ఓ అనురాగం
ఓ ఆప్యాయత
ఓ త్యాగజీవి
తన పిల్లలు ఉన్నత స్థాయిలో ఉండాలని.కష్టంలో,బాధలో నేనున్నా అని భుజం తట్టి. ప్రతి విజయంలో వెన్నంటే ఉంటూ జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దే న్నానలకు

శుభాకాంక్షలు

.