ATM card missing what to do? atm card pote em cheyali?
SBI:డెబిట్ కార్డు పోయిందా? ఫోన్ ద్వారానే బ్లాక్ చేయండి.. కొత్త కార్డు పొందండి..
కోవిడ్ నేపథ్యంలో ఇంటి వద్ద పలు రకాల సేవలు అందించేందుకు సిద్ధమైంది ఎస్‌బీఐ. ఇంటి వద్దే క్షేమంగా ఉండండి.. అత్యవసర సేవలను బ్యాంకుకి రావలసిన అవసరం లేకుండానే అందిస్తాము అంటుంది ఎస్‌బీఐ. ఇందులో భాగంగానే ఏటీఎమ్ కార్డు పోతే బ్యాంకుకి రానవసరం లేదు అని చెప్తుంది. కొత్త ఎస్‌బీఐ డెబిట్ కార్డు కూడా ఫోన్ ద్వారానే పొందవచ్చు.
ఎస్‌బీఐ ఖాతాదారులు తమ డెబిట్ కార్డును పొగొట్టుకున్నట్లు గుర్తిస్తే, ఫోన్ ద్వారా వెంటనే కార్డును బ్లాక్ చేయోచ్చు.
అంతేకాదు పాత కార్డు స్థానంలో కొత్త కార్డును పొందచ్చు.
ఇందుకోసం ఎస్‌బీఐ ఇచ్చిన
ఈ రెండు టోల్‌ఫ్రీ నెంబర్ల
1800112211,
18004253800 లలో
ఏదో ఒకదానికి కాల్ చేయాల్సి ఉంటుంది.
ఖాతాదారులకు అత్యవసర బ్యాంకింగ్ సేవల అందించడం కోసం ఈ రెండు నెంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఎస్‌బీఐ వెల్లడించింది.
ఒకవేళ డెబిట్ కార్డు పోయినా, ఏటీఎమ్‌ల వద్ద గానీ, మరిక్కడైనా మర్చిపోయినా ఈ టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేయాలి. బ్లాక్ చేయడం కోసం ఎస్‌బీఐ నెట్ బ్యాకింగ్ వంటి ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇతర మార్గాలతో పోలిస్తే ఇందుకు పట్టే సమయం చాలా తక్కువ.
ఇదే కాకుండా.. డెబిట్ లేదా క్రెడిట్ కార్డు పిన్ జనరేషన్, బ్యాలెన్స్ తెలుసుకోవడం, చివరి 5 లావాదేవీలు గురించి తెలుసుకోవడం, వీటి గురించి ఎస్ఎమ్ఎస్ రూపంలో సమాచారం పొందడం కోసం ఈ టోల్‌ఫ్రీ నెంబర్లకు కాల్ చేయవచ్చు.
No comments:
Post a Comment