Pages

Showing posts with label సింపుల్ గా జీవించు వినమ్రతతో మెలుగు !. Show all posts
Showing posts with label సింపుల్ గా జీవించు వినమ్రతతో మెలుగు !. Show all posts

Sunday, May 28, 2017

సింపుల్ గా జీవించు వినమ్రతతో మెలుగు !

సింపుల్ గా జీవించు  వినమ్రతతో మెలుగు !


మనసారా ప్రేమించు !   .....    తృప్తిగా ఉండు !
 వింబుల్డన్ ప్లేయర్ Arthur Ashe మనకు అందిస్తున్న ఈ మెస్సేజ్ చదివితే మనం ఎలా ఆలోచించాలో తెలుస్తుంది .

1983 లో ఆర్థర్ గుండె ఆపరేషన్ కోసం రక్తం ఎక్కించుకోవలసి వచ్చింది . ఆ రక్తం ద్వారా అతడికి వచ్చింది AIDS
ఈ విషయం పేపర్లద్వారా ప్రపంచం అంతటా తెలిసింది . .
అనేక ఉత్తరాలు . మెయిళ్ళు. అతడికి ఎన్నెన్నో సానుభూతి వచనాలు . అందులో ఒక మె యిలు లో ఇలా ఉంది .

“ ఆర్ధర్ ! నీకే ఇలా అయ్యింది ఏమిటి ? ఇంతటి భయంకరమైన వ్యాధికి దేవుడు నిన్నే ఎంచుకున్నాడేమిటి ?”
.
ఈ మెయిలు చదివిన ఆర్థర్ దానికి సమాధానం ఇలా ఇచ్చాడు .

“డియర్ మిస్టర్ ! మీ మెయిలు నన్ను ఆలోచింప చేసింది .

5 కోట్ల మంది పిల్లలు టెన్నిస్ ఆడడం మొదలు పెడితే ,

500 000 మంది మాత్రమె ప్రొఫెషనల్ టెన్నిస్ లోకి వచ్చారు ,

వారిలో

50 వేల మంది మాత్రమె Circuit దశకు చేరుకున్నారు .

వారిలో

5 వేల మంది మాత్రమె గ్రాండ్ స్లామ్ కి చేరుకోగలిగారు.

వారిలో

50 మంది మాత్రమె వింబుల్డన్ కి వచ్చారు .

వారిలో

4 గురు మాత్రమె సెమీ ఫైనల్స్ కి వచ్చారు .

వారిలో

ఇద్దరు మాత్రమె ఫైనల్స్ కి వచ్చారు .

వారిలో

నేను మాత్రమె టైటిల్ గెలుచుకున్నాను .

మిత్రమా ? అప్పుడు నేను అడిగానా ?
 .
నాకు మాత్రమె ఈ గెలుపును ఎందుకు ఇచ్చావు అని దేముడిని నేను అడగలేదు కదా !

నాకు అంతటి సంతోషాన్ని ఇచ్చినప్పుడు ఆయనను ఎందుకు ఇచ్చావు అని అడగం
.
బాధను కలుగచేసినపుడు ఎందుకు అడగాలి ?

సంతోషం నిన్ను ఆహ్లాదపరుస్తుంది . పరీక్షలు నిన్ను ధైర్యవంతుడిని చేస్తాయి 🌴

బాధలు నిన్ను మానవుడిని చేస్తాయి . ఓటమి నీకు వినయాన్ని నేర్పుతుంది 🌴

విజయం నిన్ను ఆనందపరుస్తుంది . నమ్మకం నిన్ను నడిపిస్తుంది 🌴

నీ జీవితం నీకు ఆనందం కలిగించకపోవచ్చు  నీలా జీవించాలని కలలు కనే వాళ్ళు ఎందఱో ఉంటారు🌴

ఆకాశం లో ఎగిరే విమానాన్ని చూసి అందులో వెడితే ఎంతో బాగుంటుంది అని ఒక పిల్లవాడు అనుకుంటాడు .🌴కిందని ఉన్న మనుషులను చూసిఇంటికి ఎప్పుడు వెడదామా అని ఆ విమానం నడిపే పైలట్ అనుకుంటాడు అదే జీవితం !

డబ్బే ఆనందం అనుకుంటే డబ్బు ఉన్న ఆసామీలు అందరూ రోడ్ల మీద డాన్స్ లు చేస్తూ కనిపించాలి . కానీ రోడ్డుమీద నిక్కరు లేకుండా ఉండే పిల్లలు హాయిగా ఆనందంగా ఆడుకుంటూ కనిపిస్తారు 🌴
అధికారమే భద్రత అనుకుంటే VIP లు అందరూ ఎటువంటి రక్షణా లేకుండా తిరగాలి . కానీ అలా జరగడం లేదు .సింపుల్ గా ఉండే వాళ్ళే హాయిగా తిరుగుతున్నారు . హాయిగా నిద్రపోతున్నారు 🌴

చూడు నేస్తం !
.సింపుల్ గా జీవించు !
వినమ్రతతో మెలుగు !
మనసారా ప్రేమించు !
తృప్తిగా ఉండు !

Saturday, May 21, 2016

జీవిత సారాంశము..

జీవిత సారాంశము..

బిడ్డ పుట్టినప్పుడు:
"లాలీ  లాలీ లాలీ లాలీ...
లాలీ లాలీ లాలీ లాలీ...
వటపత్రసాయికి
వరహాల  లాలీ
రాజీవనేత్రునికి రతనాల లాలీ
 మురిపాల కృష్ణునికి ముత్యాల  లాలీ..."

 16 ఏళ్ళకి:
"పదహారు ప్రాయంలో
నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి.
నేటి సరికొత్త  జాజిపువ్వల్లె
 నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి..."

 18 ఏళ్ళకి:
"ఎక్కడ ఉన్నా పక్కన  నువ్వే  ఉన్నట్టుంటుంది
చెలీ ఇదేం అల్లరీ..
నా  నీడైనా అచ్చం  నీలా  కనిపిస్తూ  వుంది..
అరే ఇదేం గారడీ..
నేను  కూడా  నువ్వయానా
 పేరుకైనా  నేను  లేనా..."


  25 ఏళ్ళకి:
"My Love is Gone
My Love is Gone
My Love is Gone
My Love is Gone
పోయే  పోయే లవ్వేపోయే
పోతే పోయిందే ..
its gone, its gone,
 its gone, my love is gone."


35 ఏళ్ళకి:
"ఎందుకే  రవణమ్మా పెళ్ళెందుకే రవణమ్మా
ఎందుకే రవణమ్మా పెళ్ళెందుకెే రవణమ్మా
తాను  దూర సందు లేదు
తాను  దూర సందు లేదు
తాను  దూర సందు లేదు
మెడకేమో డోల రవణమ్మా
సతాయించాకే రవణమ్మా
బాగోదే రవణమ్మా
 ఛీ ఛీ అంటారే రవణమ్మా"

45 ఏళ్ళకి:
"జన్మమెత్తితిరా..
అనుభవించితిరా..
జన్మమెత్తితిరా..
అనుభవించితిరా..
బ్రతుకు సమరములో.. 
పండిపోయితిరా..
బ్రతుకు సమరములో.. 
పండిపోయితిరా..
 మంచి తెలిసి మానవుడిగా మారినానురా...."

55 ఏళ్ళకి:
"సంసారం  ఒక చదరంగం
అనుబంధం  ఒక రణరంగం
స్వార్ధాల మత్తులో సాగేటి ఆటలో
ఆవేశాలు రుణపాశాలు తెంచే  వేళలో
సంసారం  ఒక చదరంగం
 అనుబంధం  ఒక రణరంగం.."


65 ఏళ్ళకి:
 (పురుషుడు)
"కాశీకి  పోయాను  రామాహరి
గంగ తీర్థమ్ము  తెచ్చాను  రామాహరి
గంగ తీర్థమ్ము తెచ్చాను రామాహరి.."
(స్త్రీ)
"కాశీకి పోలేదు రామాహరి
ఊరి కాల్వలో నీళ్ళండి రామాహరి
 మురుగు  కాల్వలో నీళ్ళండి రామాహరి.."

75 ఏళ్ళకి:
"జగమంత  కుటుంబం నాది
ఏకాకి  జీవితం నాది
సంసారం సాగరం నాదే
 సన్యాసం శూన్యం నాదే"

85 ఏళ్ళకి:
"రాలి పోయే పువ్వా నీకు రాగాలెందుకే
తోటమాలి నీ తోడు  లేదులే
వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే...
 లోకమెన్నడో చీకటాయెలే..."

100 ఏళ్ళకి:
"చుక్కలో కెక్కినాడు చక్కనోడు ఎప్పటికి ఎవ్వరికీ చిక్కనోడు.

.