Pages

Monday, September 26, 2016

Ethical stories in Telugu

నాన్న కు ప్రేమతో👌👌👌
 ఓ కుర్రాడు 👲
కోపంతో ఇల్లు వదిలి వచ్చేశాడు😤
ఎంత కోపంతో వచ్చాడంటే..
తను చూసుకోలేదు
తన కాళ్లకు వాళ్ల నాన్న బూట్లు
 వేసుకు వచ్చేశాడని.👞👞

కొడుక్కి ఒక మోటార్ సైకిల్
కొనలేని వాడు కొడుకు ఇంజనీర్
కావాలని కలలు కనడం ఎందుకో..
అంటూ తండ్రిని తిట్టుకుంటూ మరీ ఇంటినుండి బయటికి వచ్చేశాడు.😁

చాలా పెద్దవాడినయ్యాక గాని ఇంటికి తిరిగి వెళ్ళను అని నిశ్చయించుకున్నాడు. 😒

ఇంటి నుండి వచ్చేప్పుడు
కోపం కొద్దీ… ఎప్పుడూ
ముట్టుకోనివ్వని వాళ్ల నాన్న పర్సు
కొట్టుకోచ్చేశాడు 😉
అమ్మకి కూడా తెలియకుండా
రాసే లెక్కలన్నీ దాంట్లోనే
 ఉంటాయని వాడి నమ్మకం.👲

నడుస్తుంటే బూట్లలో ఏదో తగులుతోంది .
కరుస్తూ ఉన్నట్టు ఉంది .
బూటు లోపల సాఫ్ట్ గా లేదు .
మడమ నొప్పెడుతోంది .😣
అయినా అతని కోపం దానిని లెక్కచెయ్యనివ్వలేదు .
లోపల తడి తడి గా అనిపించింది .
కాలు ఎత్తి చూశాడు....
బూటు అడుగున చిన్న కన్నం..👞
కుంటుతూనే బస్ స్టాండ్ వచ్చాడు
ఎటైనా వెళ్లిపోదామని..!! 🚶

విచారణ లో వాకబు చేస్తే
తెలిసింది గంట దాకా బస్ ఏదీ లేదని 🚌

సరే ఏంచేస్తాం. అప్పటి దాకా …
 నాన్న పర్సు లో ఏంఉందో చూద్దామని
పర్సు తెరిచాడు ఈ కుర్రాడు .👲

ఆఫీసు లో 40,000 అప్పు తీసుకున్న లోన్ రశీదు 📄
కొడుకు కోసం కొన్న లాప్ టాప్ బిల్లు📃
అఫీసుకు వచ్చేటప్పుడు శుభ్రమైన బూట్లుతో రమ్మని మేనేజర్ ఇచ్చిన మెమో📜
పాత స్కూటర్ తెండి – కొత్త మోటార్ సైకిల్ తో వెళ్ళండి . గొప్ప ఎక్చేంజ్ మేలా అని రాసి ఉన్న కరపత్రం..📑
ఇవి కనబడ్డాయి కుర్రాడికి తండ్రి పర్సులో…

వాటిని చూసాక ఈ కుర్రాడి కళ్ళు చెమర్చాయ్😓

వెంటనే ఇంటికి పరుగు పెట్టాడు .🏃
 సోల్ లేని ఆ బూట్లు ఈసారి నొప్పి కలిగించలేదు .
ఇళ్లంతా వెతికాడు, కానీ ఇంట్లో
 నాన్న లేడు. స్కూటరూ లేదు .😔
 అతడికి తెలిసిపోయింది.....
నాన్న తన స్కూటర్ తీసుకొని
 ఎక్స్చేంజ్ మేలా కు వెళ్లాడని..
అతి ప్రేమగా చూసుకుంటున్న
తన స్కూటర్ ను అక్కడిచ్చి..
తన కోసం బైక్ తేడానికే ఖచ్చితంగా వెళ్లాడని…😳

ఆ కుర్రాడి కళ్ళు చెమరుస్తున్నాయి.😪

పరుగు పరుగున ఎక్స్చేంజ్ ఆఫర్ ఇస్తున్న చోటికి వెళ్ళాడు . 🏃

వాళ్ల నాన్న అక్కడే ఉన్నాడు,
 ఎక్స్చేంజ్ షాపు కుర్రాడితో బేరం ఆడుతున్నాడు.
ప్రస్తుతం యూత్ కి బాగా ఇష్టమైన
 మోడల్ బైక్ ఏదో చూపించు..
దాని మీద నా కొడుకు హీరో లా
 ఉండాలి అని చెబుతున్నాడు..👨

వెనకాలే నిల్చుని తండ్రి మాటలు వింటూ ఏడుస్తున్న ఆ కొడుకు కన్నీరు తండ్రి భుజాల మీద పడసాగింది. 😭
అప్పుడు తండ్రి వెనక్కి తిరిగి చూసాడు. 👨

అప్పుడు ఆ అబ్బాయి నాన్నని కౌగిలించుకొని
”వద్దు నాన్నా ! వద్దు నాన్నా !
నాకు మోటార్ సైకిల్ వద్దు నాన్నా.."
అంటూ ఏడవసాగాడు !😭

ఇంటికి వెళుతూ వెళుతూ…
తండ్రి కోసం కోఠిలో కొత్త షూస్ కొని తీసుకువెళ్ళారు
ఆ తండ్రీకొడుకులిద్దరూ….!👬

మీకోసం
తన జీతాన్నే కాదు...
జీవితాన్నీ దారపోసి....
సర్వస్వాన్నీ సమర్పించిన
ఆయన 👨
త్యాగాన్ని గుర్తించండి !
బంధాన్ని గౌరవించండి !!
మనసారా ప్రేమించండి !!!
కథ.👍🍀

ఇద్దరు మిత్రులు ఒక రోజు ఉదయం ఒక నిర్జనారణ్యం గుండా నడుచుకుంటూ వెళుతున్నారు. అకస్మాత్తుగా వారి సమీపంలోని ఒక పొద వైపు నుంచి ఓ సన్యాసి ఆదుర్దాగా, ఆయాసంతో రొప్పుతూ వస్తూ కనిపించాడు. వాళ్ళిద్దరూ ఆయన్ను ఆపి “ఏం జరిగింది? ఎందుకలా భయపడుతున్నారు?” అని అడిగారు. అందుకాయన… “అదిగో అక్కడ కనిపిస్తున్న పొదలో మనుషుల్ని చంపేది ఉంది.” వాళ్ళిద్దరూ భయంతో… “అంటే అక్కడ పులి ఉందా?” అని అడిగారు.

“కాదు. కానీ దానికన్నా ప్రమాదకరమైనది. నేను కొన్ని మూలికల కోసం తవ్వుతుండగా అది బయటపడింది.” అన్నాడాయన.”ఇంతకీ ఏమిటది?” అని అడిగారు వాళ్ళిద్దరూ కంగారుగా. “బంగారు నాణేల గుట్ట” అన్నాడు సన్యాసి. వాళ్ళిద్దరూ సంతోషంగా “ఎక్కడ?” అని అడిగారు.

“అదిగో ఆ పొదల్లోనే” అని వేలు చూపించి తన దారిన పోయాడా సన్యాసి. వాళ్ళిద్దరూ ఆ పొదవైపు పరుగెత్తుకుంటూ వెళ్ళి చూస్తే నిజంగానే అక్కడ బంగారు నాణేలు కనిపించాయి. “ఈ సన్యాసి ఎంత మూర్ఖుడు? బంగారు నిక్షేపాన్ని పట్టుకుని మనుషుల్ని చంపేది అంటాడేమిటి?” అన్నాడొక మిత్రుడు.

“అతడి సంగతి వదిలేయ్. ముందుగా ఇప్పుడేం చేయాలో ఆలోచిద్దాం. పట్టపగలే బహిరంగంగా దీన్ని మోసుకుపోతే ఊర్లో జనాలు అనుమానపడే అవకాశం ఉంది. మనలో ఒకరం దీనికి కాపలాగా ఉందాం. మరొకరు ఊర్లోకి వెళ్ళి భోజనం తీసుకు వద్దాం.” అన్నాడు మరో మిత్రుడు.

అనుకున్నట్టే ఒక మిత్రుడు బంగారానికి కాపలాగా ఉన్నాడు. రెండోవాడు ఊర్లోకి వెళ్లాడు. ఈలోగా మొదటి వాడు ఇలా అనుకున్నాడు. “ఛ… ఈ రోజు నేను ఒంటరిగా ఇక్కడికి వచ్చుంటే ఎంత బాగుండేది? ఇప్పుడు అనవసరంగా నేను అతనికి సగం బంగారం ఇవ్వాల్సి వస్తుంది. బంగారం కూడా మరీ ఎక్కువగా లేదు. నా కుటుంబం చాలా పెద్దది. దాన్ని పోషించడానికి ఈ బంగారం అంతా నాకే దక్కితే బాగుంటుంది కదా! వాడు వచ్చీ రాగానే కత్తితో పొడిచి చంపేస్తాను. ఎవరికీ అనుమానం రాదు. బంగారం అంతా నేనే తీసుకోవచ్చు.” అలా అనుకుని కత్తిని నూరి సిద్ధంగా ఉంచుకున్నాడు.

ఇదిలా ఉండగా ఊర్లోకి వెళ్ళిన రెండో వాడి ఆలోచన ఇలాఉంది… “వాడికి సగం భాగం ఎందుకివ్వాలి? మొత్తం బంగారం నేనే తీసుకుంటే పోలా! అసలే నాకు చాలా అప్పులున్నాయి. నా జీవితంలో నేను ఏదీ వెనుకేసుకోలేదు. వాడికేమో అప్పులు లేవు. ఉన్నవాళ్ళు స్నేహితులుగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా బంగారమంతా నాకే దక్కాలి. కాబట్టి నేను తీసుకెళ్ళే భోజనంలో విషం కలుపుతాను. అది తిని వాడు చనిపోతాడు. ఎవరికీ తెలియకుండా బంగారమంతా నేనే తీసుకోవచ్చు” అనుకున్నాడు. అలా అతడు భోజనంలో విషం కలిపి మిత్రుడి కోసం నిధి దగ్గరకు తీసుకెళ్ళాడు.

అతను దగ్గరికి వెళ్ళగానే అక్కడే కత్తితో పొంచి ఉన్న రెండోవాడు ఒక్క ఉదుటున మీదకు దూకి కత్తితో పొడిచి చంపేశాడు. “పిచ్చివాడు. సగం బంగారం కోసం ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఇంక నేను భోంచేస్తాను.” అనుకునిఏ మాత్రం అనుమానం లేకుండా తెచ్చిన అన్నాన్ని తిన్నాడు. అరగంట తర్వాత అతని ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. “సన్యాసి మాటలు ఎంత నిజమో కదా” అనుకున్నాడు చివరి క్షణాల్లో.😤😤

🌸గమనిక: రూపాయి.. రూపాయి.. నువ్వేం చేస్తావు? అంటే… తోబుట్టువుల మధ్య వైరం పెంచుతాను. తల్లీ బిడ్డల మధ్య చిచ్చుబెడతాను, చివరికి స్నేహితులను కూడా దూరం చేస్తాను అంటుంది ఆ రూపాయి…. అని పెద్దల నానుడి. కాబట్టి ఆ రూపాయి విషయంలో జాగ్రత్త.



:@2::
---
ఒక వ్యాపారి చాలా సంవత్సరాలుగా భవనాలు, ఇతర
కట్టడాలు నిర్మించే వృత్తిలో ఉండేవాడు. తనకు సహాin యంగా
ఒక వ్యక్తిని పర్యవేక్షకుడిగా నియమించుకున్నాడు.
దాదాపు పాతిక సంవత్సరాలు ఆ పర్యవేక్షకుడు ఆ వ్యాపారి
దగ్గర నమ్మకంగా పనిచేశాడు. ఒకరోజు ఆ వ్యాపారి అతణ్ని పిలిచి
''మనం ఇపుడు ఒక భవంతిని నిర్మించాలి. ఎంత ఖర్చయినా
ఫరవాలేదు. ఆ భవనం 'నభూతో న భవిష్యతి' అనే రీతిలో
అద్భుతంగా ఉండాలి'' అన్నాడు. అలాగేనన్న
పర్యవేక్షకుడు మనసులో మాత్రం, 'నేను ఇన్ని
సంవత్సరాలు నమ్మకంగా, విశ్వాసంగా పనిచేశాను.
నాకు ఏం మిగిలింది- ఆయన నెలనెలా ఇచ్చే జీతం రాళ్ళు తప్ప.
అంచేత ఈ భవన నిర్మాణానికి కేటాయించిన చాలా
భాగం డబ్బు సొంతం చేసుకుంటాను' అనుకున్నాడు. అలా
తలచిన ఆ వ్యక్తి ఆ భవనాన్ని చౌకగా దొరికే ముడిసరకులతో
నిర్మించి పైకి మాత్రం కళాత్మకంగా ఉండేలా వివిధ నగిషీలతో
శిల్పాకృతులతో తీర్చిదిద్దాడు. పైకి అద్భుతంగా
కనిపిస్తూ బలహీనంగా తయారైన ఆ భవనాన్ని తన యజమానికి
చూపించాడు.
యజమాని ఆనందపడుతూ, ''మిత్రమా ఈ భవంతి మహత్తరంగా
ఉంది. ఇన్నాళ్లు నమ్మకంగా పనిచేశావు... నేను ఈ
వ్యాపారం వదిలి వేరే దేశం వెళ్లిపోతున్నాను. అత్యంత
విశ్వాసపాత్రుడిగా ఇన్ని సంవత్సరాలుగా నన్నే అంటిపెట్టుకొని
ఉన్న నీకు అపురూపమైన జ్ఞాపికలా మిగిలిపోయే ఒక అద్భుతమైన
కానుకను ఇవ్వాలనుకున్నాను. ఈ భవంతి నీకోసమే!''
అంటూ భవనాన్ని అప్పగించి వెళ్ళిపోయాడు.
ఆ యజమాని వెళ్ళిన
కొద్దిసేపటికి ఆ పర్యవేక్షకుడు కుప్పకూలిపోయాడు.

త్వరలో
కూలబోయే ఆ భవనంలాగే.
మనిషి ధర్మం తప్పకూడదనీ,
తుది శ్వాస వరకూ దాన్ని
విడిచిపెట్టరాదనీ,
 అధర్మంగా 'అర్థాన్ని' సంపాదించితే అనర్థమే
తప్ప ఏ పరమార్థమూ నెరవేరదనీ ఈ కథలోని నీతి.

No comments:

Post a Comment

.