స్కూలు తనిఖీకి వచ్చిన
ఇన్ స్పెక్టర్ ఓ క్లాస్ లో నొట్సులు తనిఖీ చేస్తూ "మోహన్, ఇటు రా" అని పిల్చాడు. ఆ మోహన్ వణుక్కుంటూ
వచ్చాడు.
"రామాయాణం ఎవరు
రాశారు?"
""నేను కాదు
సార్"
"పోనీ భారతం ఎవరు
రాశారు?"
"అది కూడా నేను
కాద్సార్"
ఇన్ స్పెక్టర్ టిచర్ కేసి
తిరిగి కళ్ళెగరేశాడు.
టీచర్ గుడ్లు మిటకరించి
" మిమ్మల్ని చూసి భయపడుతున్నాడల్లే ఉంది సార్. వాడే రాసి ఉంటాడు.".
అక్కడ్నుంచి ఇన్
స్పెక్టర్ నేరుగా హెడ్ మాస్టర్ రూమ్ కి వెళ్లి "ఏమిటండీ ఇది? స్టూడెంటేమో రామాయాణం, భారతం వాడు రాయలేదంటాడు. టీచరేమో వాడే రాసి
ఉంటాడని అంటాడు. ఇట్లాగేనా ఈ స్కూల్లో చదువు నేర్పడం?"
హెడ్ మాస్టర్ "ఆ
టీచర్ కొత్తగా వచ్చాడండీ. రామాయణం రాముడు రాశాడనీ, భారతం భరతుడు రాశాడనీ వాడికి
తెలీదనుకుంటా"'
ఇన్ స్పెక్టర్ గిర్రున
తిరిగి వచ్చిన దారినే చక్కా పోయాడు.
తర్వాత తన పై అధికారులకి
రాసిన రిపోర్ట్ లో ఇలా రాశాడు. "ఈ స్కూల్లో పరిస్థితి ఘోరం గా ఉంది.
స్టూడెంట్లు మనసు పెట్టి పాఠాలు చదవరు, టీచర్లు సరిగా చదువు చెప్పరు. ఒక్క హెడ్ మాస్టర్ ఒక్కడే కాస్త బుర్ర ఉన్న
వాడిలా తొస్తోంది"....
పరీక్ష బాగానే
రాశాననుకున్న ఒక విద్యార్థి తనకు సున్నా మార్కులు వచ్చే సరికి ఆశ్చర్యపోయాడు.
రీవాల్యుయెషన్ కోసం దరఖాస్తు చేశాడు. మళ్ళీ సున్నా మార్కులే వచ్చాయి. తాను
ప్రశ్నలన్నిటికీ జవాబులు రాసినా ఎం దుకిలా జరుగుతుందో అర్థంకాక న్యాయస్థానాన్ని
ఆశ్రయించాడు. అక్కడ కోర్టులో తన క్లయింటు రాసిన జవాబులు సరి అయినవేనని, తప్పు అయితే రుజువు చేయమని వాదించాడు
విద్యార్థి తరపు లాయరు. ఆ ప్రశ్నలనీ, విద్యార్ధి రాసిన జవాబులని చదివి వినిపించమన్నారు జడ్జి గారు. అవి ఇలా
ఉన్నాయి:
ప్రశ్న: టిప్పు సుల్తాన్
ఏ యుద్ధంలో మరణించాడు ?
జవాబు : అతను పాల్గొన్న
చివరి యుద్ధంలో
ప్రశ్న : భారత దేశానికి
స్వాతంత్ర్యం ఇస్తూ ఎక్కడ సంతకం చేశారు ?
జవాబు : పేజీ చివరన
ప్రశ్న : మహాత్మా గాంధీ
ఎప్పుడు జన్మించారు ?
జవాబు : ఆయన పుట్టిన
రోజున
ప్రశ్న : భార్యా భర్తల
మధ్య విడాకులకు ప్రధాన కారణం ఏంటి ?
జవాబు : పెళ్ళి
ప్రశ్న : ఆరు మామిడి
పళ్ళను ఎనిమిది మందికి సమానంగా ఎలా పంచుతావు ?
జవాబు : మాంగో షేక్ చేసి
ప్రశ్న : గంగా ఫ్లోస్ ఇన్
విచ్ స్టేట్ ?
జవాబు : లిక్విడ్ స్టేట్
ప్రశ్న : భారతదేశంలో
ఎక్కువ మంచు పడే చోటు ?
జవాబు : మందు గ్లాసులో
ప్రశ్న : హిందూ చట్టం
రెండవ వివాహాన్ని ఎందుకు అంగీకరించదు ?
జవాబు : భారతీయ చట్టం
లోని ఆర్టికల్ 20 (2) ప్రకారం ఒక మనిషి
చేసిన
ఒకే నేరానికి రెండు
సార్లు శిక్ష విధించకూడదు కాబట్టి..
హైదరాబాద్ బస్టాండ్ లో ఒక
ముసలావిడ వైజాగ్ వెళ్లే బస్సు ఎక్కింది, ఎక్కగానే డ్రైవర్ తో... బాబు నేను నిద్రపోతానేమో, విజయవాడ రాగానే నన్ను లేపుతావా అన్నది...?
డ్రైవర్: ఓకే పడుకోండి
ఆ ముసలావిడకు నమ్మకం లేక
పక్కనే ఉన్న తోటి ప్రయాణికులకు కూడా చెప్పింది, అందరూ సరే అన్నారు
చాలా దూరం ప్రయాణం తరువాత ముసలావిడ నిద్ర లేచింది, విజయవాడ ఇంకా రాలేదా బాబు?
అయ్యో సారీ బామ్మగారు
మర్చిపోయాను, విజయవాడ దాటేసి 100కి.మీలు వచ్చేశాము.. ఆమె ఏడవడం మొదలుపెట్టింది,
మర్యాదగా వెనక్కి తిప్పి
విజయవాడ తీసుకెళ్లమని గోల చేసింది, ఆమెకు తోటి ప్రయాణికులు
కూడా ఆమెకు సపోర్ట్ చేశారు, డ్రైవర్ వెనక్కి తిప్పి విజయవాడ తీసుకొచచి
ఆమెను దింపడానికి ట్రై చేశాడు.
డ్రైవర్.. బామ్మగారు
విజయవాడ వచ్చేసింది దిగండి...
ఆమె తన బ్యాగు నుండి
రెండు ట్యాబ్లెట్స్ తీసి ఇలా అన్నది
నాకు బీపీ ఉంది బిడ్డ..
విజయవాడ రాగానే ట్యాబ్లెట్స్ వేసుకోమని బస్సు ఎక్కేటప్పుడు మా అబ్బాయి చెప్పాడు...
నేను కూడా వైజాగ్
వెళ్లాలి, ఇప్పుడు పోనీయ్యి
బాబు వైజాగ్....
బామ్మ ROCKSSSSS
డ్రైవర్ బాబు SHOCKZZZZZ
ఒక్కరే నవ్వకండి....
పక్కవారికి కూడా షేర్ చేయండి
: భార్యాభర్తలు అంటే ఎవరు
స్వామీ...?
స్వామిజి 😇: జీవితాంతం
భార్యను భయపెట్టాలని ప్రయత్నించి భయపడుతూ బ్రతికేవాడు భర్తయితే, భర్తకు భయపడినట్టు నటించి భర్తను భయపెట్టి
బ్రతికేది భార్య. భార్యాభర్తలంటే వీళ్ళే నాయనా....
Boys Talk-
Boy 1 :- ఏంట్రా మనము ఎంత చదివినా అస్సలు పాస్ అవ్వడంలేదు.
Boy 2 :- అవునురా ... ఐతే
చచ్చిపోదామా????????
Boy 1 :- వద్దురా బాబు ,
మళ్ళీ పుడితే LKG నుండి చదవాలి. నావల్లకాదు!!!
భార్య : మీ కోసం ఇడ్లీలు
చేశా తినండి.
భర్త : వద్దులేవోయ్...
నువ్వు చేసిన ఇడ్లీలు తింటే సగం పళ్లు రాలిపోతాయ్!
భార్య: తినకపోతే మొత్తం
పళ్లు రాలిపోతాయ్...
భర్త : ఆ....
టీచర్: అరేయ్ ప్రపంచం లో
దేశాలు ఎన్ని ఉన్నాయ్ రా?
చింటూ: మీకెమన్నా పిచ్చా
మాష్టారూ? ప్రపంచం లో దేశం
ఒకటే ఉంది.. భారత
దేశం.. మిగతావన్నీ 'విదేశాలే' పిచ్చి మాష్టారూ....
No comments:
Post a Comment