Pages

Monday, September 12, 2016

Happy Teacher's day



గుండెలోని
రుధిరధారలను
వూపిరిగా మలచి
అజ్ఞానాంధకారాల్ని
విజ్ఞానజ్యోతితో పారదోలి
జీవన సత్యాన్ని తెలియజేసే
నిస్వార్ధపర అల్పసంతోషులు
గురువులు!
మందీ,మార్భలమున్న
మహారాజునైనా,
సాయుధబలగాలున్న
సైన్యాధిపతినైనా,
కూడుకీ, గుడ్డకీి లేని
కడుపేద కుచేలుడినైనా
కుబేరునిగా చేసే గురువు,
తన జీవితాన్ని
కొవ్వొత్తిలా కరిగించి
విద్యార్ధుల జీవితాల్ని వెలిగించి
వారికి చేయూతనిచ్చి
సత్సమాజాన్ని నిర్మించి
లోకాన్ని రక్షించి
మార్గనిర్దేశం చేసే
ప్రతిభాన్విత మహిమాశిరోమణి
గురువు!
అమ్మ మాటను నేర్ఫితే
గురువు రాతను, చేతను
నడకను, నడతను
విలువలను, విజయాలను
అణువణువునా స్ఫూర్తిని నింపి
సమాజంలో సగర్వంగా నిలబెడతారు!
అమ్మ ప్రేమకు
కన్న పేగుకైనా
విలువ కట్టే ,ఈ రోజులే కాదు
యుగాలు మారిన
జగాలు చెదరిన
నాటికి, నేటికి, ఎన్నటికీ
మారని స్థానం గురువు!
అమ్మ బతుకునిస్తే,
గురువు బతుకునూ,భవిష్యత్తునూ
అక్షరాలనూ నేర్ఫించి
అక్షరులుగా జేసే
విజ్ఞాన విధాతలైన గురువులకు
మేన ప్రాణం మెదిలినంతకాలం
మదిలో, హృదిలో స్మరిస్తూ
సదా! సర్వదా గౌరవిద్దాం!
ఉపాధ్యాయ లోకానికి
ముకుళిత హస్తాలతో ప్రణమిల్లుదాం!.

No comments:

Post a Comment

.