ఎన్నో శాఖలతో విస్తరించి
వున్న నేను...
కొన్ని చోట్ల ఆకు పచ్చని ఆకులతో..
ఇంకొన్ని చోట్ల
విచ్చుకున్న పువ్వు లతో..
మరికొన్ని చోట్ల ఎండిన
ఆకులతో..
నన్నే నమ్ముకొని..
నాపై నమ్మకం ఉంచి..
నా మీదే గూడు
కట్టుకొన్న..
పక్షి జాతులు..
నా క్రింద నా నీడలో వుండే
వివిధ
మతాలు..
జాతులు..
మనుష్యులు..
జంతు జాతులు..
ఎండలో నా నీడతో..
వర్షంలో నా ఆకుల
గొడుగుతో..
చలిలో నా వొడిలో..
సేదతీరతాయి..
తెలంగాణ ప్రజల గొంతుకను
నేను..
ప్రత్యేక రాష్ట్రం
ఏర్పడడానికి కారణం నేను..
ఒక నమ్మకం.. ఒక భరోసా..ఒక
విశ్వాసం.. సమస్త హరితం తో
అలరారుతున్న వృక్షాన్ని
నేను..
పిల్లల మర్రి వృక్షాన్ని
నేను..
కానీ త్వరలో.. అతి
త్వరలో..
నేను మోడు బార బోతున్నాను
నా కొమ్మలు కొమ్మలు
కొట్టి వేయ బడుతున్నాయి..
వికసించే నా పువ్వులు
విసిరేయబడుతున్నాయి..
తలలేని మొండెం లా..
చేతులు లేని కాయం లా..
నీరే నా జీవనాధారం,
దాన్ని
తీసుకెళుతున్నారు..
ప్రకృతే నా సహచరి దానిని
దూరం చేస్తున్నారు..
మనుషులే నా గొంతుక ఆ ధ్వనిని మూగ బోయేలా చేస్తున్నారు..
నా చుట్టూ వుండే ప్రకృతిని,
నాకున్న నీటి లభ్యతను,
నాకున్న గాలిని..
నాకు దూరం చేస్తూ నన్ను
మూడు భాగాలుగా విడగొడవుతున్నారు..
త్వరలోనే నేనొక మోడు బారే
కాండాన్ని..
నేనే.. నేనే.. మీ
పాలమూరును.
మీరు పిలుచుకునే
మహబూబునగర్ ను ..!
నేను చేసిన తప్పు ఒకటే
అసమర్థులకు ఆశ్రయం ఇవ్వడమే....
No comments:
Post a Comment