Pages

Wednesday, September 21, 2016

అంజలి

 అంజలి

శతృవు
చిటికెన వేలంతే
అయినా అనాదిగా
సరిహద్దులు రక్తంతో తడుస్తునే ఉన్నాయి!

పెద్దరికమా
ఇకనైనా నీ ఓపికను
బేరీజు వేసుకో!

కవ్వింపు చర్యలతో
కాగల కార్యాలేవీ లేవు
శతృవు మన ఉప్పుతిన్న
విశ్వాస ఘాతకుడు!

నిరంతర అనుమానాల మధ్య
వానితో చేసే చెలిమేదైనా
భ్రమే!

అవసరాలకోసమే
మిత్ర కూటాలేర్పడుతున్నప్పుడు
మన వాళ్ళంటూ
ఎవరూ ఉండరు
అంతా పగవాళ్ళే!

కడుపులో కత్తులు దాచుకున్న వానితో
ఎంత కాలం కౌగిలించుకుంటావ్?

హద్దు మీరినప్పుడే కదా
సరి హద్దుల్ని చెరిపే మోకా
దొరికేది!

యుద్ధం వాంఛనీయం కాకపోవచ్చు
అనివార్యమైనప్పుడన్నా
విజయంతోనే అమరులకు
అంజలి ఘటించాలి!
అంజలి ఘటించాలి!!





No comments:

Post a Comment

.