ఆమెకి అత్తగారితో అస్సలు పడటం లేదు.
ఆమెతో నిత్యం వాదులాటే...
రోజూ మాటలయుద్ధమే.
ఇక ఉండలేననుకుంది.
తండ్రి దగ్గరకి వచ్చి
"నాన్నా.... ఈ అత్తని అంతం చేసెయ్యాలి... అది బతికున్నంతకాలం నాకు శాంతి
లేదు. కాసింత విషం ఇవ్వు నాన్నా
.....ఆ ముసలి దాన్ని
చంపేస్తాను.
పీడ విరగడౌతుంది."
అంది.
తండ్రి "సరేనమ్మా...
అయితే ఆమె ఉన్నట్టుండి చనిపోతే అందరికీ నీ మీదే అనుమానం వస్తుంది. కాబట్టి
నెమ్మదినెమ్మదిగా పనిచేసే విష మూలికలు ఇస్తాను.
అన్నంలో కలిపి ఇవ్వు.
ఎవ్వరికీ అనుమానం రాకుండా ఆమెతో ప్రేమ నటించు. ఆమె చెప్పినట్టుచెయ్యి.
ఆమెకి కూడా నువ్వు విషo
ఇస్తున్నట్టు అనుమానం
రాకూడదు. నీ భర్తకూ అనుమానం రాకూడదు." అన్నాడు.
ఆయన విషం ఇచ్చాడు.
కూతురు తెచ్చుకుంది.
రోజుకింత అన్నంలో కలిపి
అత్తకు పెట్టడం మొదలుపెట్టింది.
ఆమె పట్ల ప్రేమగా
వ్యవహరించేది. అత్తా అత్తా అంటూ ఆమె చుట్టూ తిరిగేది.
అత్త మాటలన్నా
పట్టించుకునేది కాదు. సేవలు చేస్తూనే ఉండేది.
అటు అత్తలోనూ క్రమీపీ
మార్పు రావడం మొదలైంది.
"నా కోడలు
బంగారం" అంటూ పదిమందికీ చెప్పుకోవడం మొదలుపెట్టింది.
కూతురు పట్ల ఎంత ప్రేమ
చూపేదో కోడలు పట్లా అంతే ప్రేమ చూపించేది.
ఇంకొన్నాళ్లకి కోడలు
మనసులో పశ్చాత్తాపం మొదలైంది.
"అయ్యో ఇంత మంచి
అత్తను చంపుకుంటున్నానా... నా' చేజేతులా విషం
పెడుతున్నానా?" అని బాధ
పడసాగింది.
ఉండబట్టలేక తండ్రి
దగ్గరికి పరుగుపరుగున వెళ్లింది.
"నాన్నా ...
విషానికి విరుగుడు ఇవ్వు నాన్నా... అంత మంచి ఆమెను చంపుకోలేను. ఆమె నాకు అమ్మ
తరువాత అమ్మ లాంటిది." అంటూ కన్నీరు పెట్టుకుంది.
తండ్రి నవ్వాడు.
"అమ్మా...
నేనిచ్చిన దానిలో విషం లేదు. అవి బలం మూలికలు మాత్రమే... వాటిలో విషం లేదు...
విషం నీ మనసులో ఉండేది...
ఇప్పుడు అది కూడా విరుగుడైపోయింది." అన్నాడు.
ఈ స్టోరీ అందరూ
షేర్ చేయండి
కొంత మందికి అయ్యిన కనువిప్పు కలుగుతుంది ఈ స్టోరీ
చదువుతే.
No comments:
Post a Comment