అత్యాశ :-
ఒక మానవుడు విచారంగా
కుర్చుని బాధపడుతున్నాడు . అటు వైపు వచ్చిన ఓ సన్యాసీ అతడి దుఃఖం కి కారణం
తెలుసుకోవాలనుకున్నాడు .
సన్యాసీ :- ఓ మానవా !
ఏమిటి నీ బాధ ?
మానవుడు :- జీవితం లో
సంతోషమే లేదు స్వామి .
వెంటనే ఆ సన్యాసీ తన
చూపుడు వేలును అక్కడున్న రాయికేసి చాచాడు .
ఆ రాయి బంగారు రాయి గా
మారిపోయింది .
సన్యాసీ :- ఇప్పుడు
సంతోషమేన ?
మానవుడు :- ఆఆ ...అదొక
రాయే కదా !
ఈ సారి తన చూపుడు వేలుతో
ప్రక్కనే ఉన్న చెట్టును బంగారు చెట్టు గా మార్చేసాడు .
సన్యాసీ :- ఇప్పుడేమంటావు
?
మానవుడు :- అదొక చెట్టే
కదా !
మల్లి చూపుడు వేలును
ఇంటివైపు చూపించాడు . ఇల్లు బంగారు ఇల్లు గా మారిపోయింది .
సన్యాసీ :- ఇది చాలా ?
మానవుడు :- అదొక ఇల్లే
కదా !
సన్యాసీ :- ఇంత
బంగారాన్నిచినా నీకు సంతోషం కలగలేదే ! అయితే నీకేం కావాలి ?
మానవుడు :- నీ చూపుడు
వేలు కావాలి స్వామి .
సుందరి భగవంతుడికోసం
కఠోరమైన తపస్సు చేసింది.
ఎప్పుడూ మగవాళ్లే
చేస్తారు...
అలాంటిది ఒక స్త్రీ
తనకోసం తపస్సు చేయడం చూసి అబ్బురపడి...
భగవంతుడు వెంటనే
ప్రత్యక్షమై...
"ఓ స్త్రీ... నేను
నీ భక్తికి మెచ్చాను. నీకు ఒకటి కాదు 3 వరాలు ఇస్తాను. అంతే కాదు. నీకు ఏ
వరమిస్తే... అది నీ భర్తకు 10 రెట్లు
ఎక్కువయ్యే వరం కూడా ఇస్తాను అన్నాడు.
అందుకు...ఆమె సంతోషించి, "స్వామి... నాకు
ఎవ్వరికీ లేనంత అందాన్నివ్వు" అనడిగింది.
దేవుడు, "తధాస్తూ... మరి నీ భర్తకు కూడా ఈ అందం
పదిరెట్లు ఎక్కువవుతుంది" అని చెప్పి వరమిచ్చాడు.
సరేనంది ఆమె. ఆ తరువాత రెండో వరం కోరింది.
" 100 కోట్ల
ధనాన్నివ్వు స్వామీ " అంది.
దేవుడు మళ్ళీ సరేనన్నాడు.
కాని, ఇచ్చేముందు
"నీ భర్తకు ఈ ధనం 10 రెట్లు
ఎక్కువవుతుంది. ఒక్కసారి ఆలోచించుకో... బాగా డబ్బు వచ్చాక.... నిన్ను
పట్టించుకోడేమో" అన్నాడు.
"అదేం లేదు స్వామీ మీరు ఇవ్వండి" అందామె.
దేవుడు మళ్ళీ తధాస్తు అన్నాడు. ఇంక మూడో కోరిక కోరమన్నాడు.
అందుకామె నెమ్మదిగా
చెప్పింది... "స్వామీ.... ఈ రాత్రికి.. నాకు Mild Heart stroke (తేలికపాటి గుండెనొప్పి)ని ఇవ్వండి..."
అంది.
దేవుడు.......
కెవ్వుమన్నాడు.........!
! కధలో నీతి:- ఆడవాళ్ళతో పెట్టుకొద్దమ్మా!
No comments:
Post a Comment