Pages

Showing posts with label నమ్మకాలు. Show all posts
Showing posts with label నమ్మకాలు. Show all posts

Friday, December 2, 2016

మీరు పుట్టిన నెలను బట్టి మీ లవ్ లైఫ్ ఎలా ఉంటుంది ?

మీరు పుట్టిన నెలను బట్టి మీ లవ్ లైఫ్ ఎలా ఉంటుంది ?

Image of life

మనం పుట్టిన నెల మన గురించి చాలా చెబుతుంది. మనం ఏంటి,మనం ఏ విషయాలను ఇష్టపడతాం, మన వ్యక్తిత్వం ఏంటి అనే విషయాలను వివరిస్తుంది.

మనం పుట్టిన నెల మన గురించి చాలా చెబుతుంది. మనం ఏంటి, మనం ఏ విషయాలను ఇష్టపడతాం, మన వ్యక్తిత్వం ఏంటి అనే విషయాలను వివరిస్తుంది. ఒక వ్యక్తి క్యారెక్టర్ ని.. వాళ్లు పుట్టిన నెలను బట్టి తెలుసుకోవడం న్యూమరాలజీలో భాగం.

అయితే.. చాలా మంది సైంటిస్ట్ లు.. ఒక వ్యక్తి జీవితంలో.. లవ్ లైఫ్ ఎలా ఉంటుంది అనే దాన్ని పుట్టిన నెలను బట్టి తెలుసుకోవచ్చని నిరూపిస్తున్నారు. మరి మీరు పుట్టిన నెల మీ లవ్ లైఫ్ ని ఎలా వివరిస్తుంది. మీరు ఏ నెలలో పుట్టారో దాన్ని బట్టి తెలుసుకోండి..
  
💦జనవరి
జనవరిలో పుట్టినవాళ్లు ఇండిపెండెంట్ గా ఉంటారు. లీడర్స్ గా పుడతారు. వీళ్లు చాలా ఎట్రాక్టివ్ గా ఉంటారు. ఇతరులు ఎలాంటి సందేహం లేకుండా వీళ్లను ఫాలో అవుతారు. వీళ్లు మనుషుల తప్పులను, బలహీనతలను చూడరు. చాలా నిజాయితీగా ప్రేమిస్తారు.
  
💦ఫిబ్రవరి
ఫిబ్రవరిలో పుట్టినవాళ్లు చాలా ఎట్రాక్టివ్ గా ఉంటారు. చాలా సిగ్గు కలిగి ఉంటారు. అలాగే నిజాయితీగా, గౌరవంగా ఉంటారు. చాలా రొమాంటిక్ గా ఉంటారు.
  
💦మార్చ్
మార్చిలో పుట్టినవాళ్లు.. ట్రావెలింగ్ అంటే ఇష్టపడతారు. చాలా సిగ్గుతో, ప్రేమ కలిగి ఉంటారు. కాస్త నిర్మొహమాటం ఎక్కువ. చాలా నిజాయితీగా ఉంటారు.
  
💦ఏప్రిల్
ఏప్రిల్ లో పుట్టినవాళ్లు.. డైనమిక్ అండ్ యాక్టివ్ గా ఉంటారు. వీళ్లు చాలా ఎట్రాక్టివ్ గా ఉంటారు. వాళ్ల సమస్యలను పరిష్కరించుకోవడానికి స్నేహితులు కావాలి.
  
💦మే
మేలో పుట్టిన వాళ్లు.. వాళ్ల స్వంత నిర్ణయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి వీళ్లు మ్యుజిషీయన్స్, యాక్టర్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ. కష్టపడతారు. కుటుంబాన్ని ప్రేమిస్తారు. ఎక్కువ మంది పిల్లలు ఉండటాన్ని ఇష్టపడరు.
  
💦జూన్
జూన్ లో పుట్టిన వాళ్లు చాలా అసూయ కలిగి ఉంటారు. కానీ చాలా రొమాంటిక్ గా ఉంటారు. వీళ్లు ఫెంటాస్టిక్ లవర్స్, చాలా సాన్నిహిత్యంగా ఉంటారు.
  
💦జూలై
జూలైలో పుట్టిన వాళ్లు చాలా జాలి కలిగి ఉంటారు. నిజాయితీగా ఉంటారు. వాళ్ల రిలేషన్స్ బాగా కాపాడుకుంటారు. వీళ్లను అర్థం చేసుకోవడం కష్టం. ఒకసారి హర్ట్ అయ్యారంటే.. రికవర్ అవడానికి సమయం పడుతుంది.
  
💦ఆగస్ట్
ఆగస్ట్ లో పుట్టినవాళ్లు.. సమాజానికి పిల్లర్స్ లాంటి వాళ్లు. ఇతరులను ప్రోత్సహిస్తారు. తేలికగా డబ్బు సంపాదిస్తారు. చాలా ఎట్రాక్టివ్ గా ఉంటారు. అలాగే రొమాంటిక్, కేరింగ్, లవింగ్ గా ఉంటారు.
  
💦సెప్టెంబర్
సెప్టెంబర్ లో పుట్టినవాళ్లు చాలా తెలివైనవాళ్లు. వీళ్ల పెద్ద వీక్ నెస్ డిప్రెషన్. వీళ్లు చాలా త్వరగా కాంప్రమైజ్ అవుతారు. చాలా కేర్ ఫుల్ గా ఉంటారు. చాలా నిజాయితీగా, సెన్సిటివ్ గా, నాలెడ్జ్ కలిగి ఉంటారు. సీక్రెట్స్ దాచుకుంటారు. ఫీలింగ్స్ ని చెప్పరు.
  
💦అక్టోబర్
అక్టోబర్ లో పుట్టినవాళ్లు చాలా లక్కీ పర్సన్స్. వాళ్ల లక్ష్యాలను సాధిస్తారు. చాలా ఎమోషనల్ గా ఉంటారు. ప్రతి ఒక్కరినీ ప్రేమిస్తారు, ఇష్టపడతారు.. అలాగే వాళ్ల నుంచి కూడా అదే కోరుకుంటారు. కొన్నిసార్లు కాన్ఫిడెన్స్ కోల్పోతారు.
  
💦నవంబర్
నవంబర్ లో పుట్టినవాళ్లు శారీరక ఎట్రాక్షన్ కలిగి ఉంటారు. కొన్ని సార్లు చాలా సెన్సిటివ్ ఫీలై.. ఒత్తిడికి గురవుతారు. వీళ్లు చాలా తెలివైనవాళ్లు, చాలా షార్ప్ గా ఆలోచిస్తారు. వీళ్ల ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోగలుగుతారు. చాలా రొమాంటిక్ గా ఉంటారు.
  
💦డిసెంబర్
డిసెంబర్ లో పుట్టినవాళ్లు ఫిలాసఫర్స్ అవుతారు. చాలా తేలికగా లక్, వెల్త్ పొందుతారు. ఓర్పు తక్కువ. పొగడ్తలను ఇష్టపడతారు.  
             ప్రపంచం అవకాశాల పుట్ట.

మనకు కనిపించే ప్రతి వ్యక్తి , ప్రతి సంఘటనా ఏదో ఒక అవకాశం చెప్పాలని వస్తాయి

 దేవుడు మనల్ని స్వేచ్ఛా జీవులుగా పుట్టించాడు.

చెడిపోవడానికి, బాగుపడడానికి కావలసిన అవకాశాలను, ఆయుధాలను ఇచ్చాడు.

ఛాయస్ మనదే. చీకటి నుండి వెలుగులోకి, అజ్ఞ్ఞానం లోంచి జ్ఞ్ఞానం లోకి,

అనారోగ్యం నుండి ఆరోగ్యం లోకి వెళ్ళడానికి నిర్ణయాధికారం  మనకే ఇచ్చాడు.

 పేదరికంలోంచి సంపదలోకి వెళ్ళడానికి అన్ని అవకాశాలిచ్చాడు.

ఏ నిర్ణయమైనా మనదే

జీవితాన్ని నందనవనంగా మార్చుకోవడం మన చేతిలోనే వుంది

                   

Sunday, November 6, 2016

ఒక్కొక్క నెలలో పుట్టిన వారి మనస్తత్వం ఒక్కోలా ఉంటుందంట.! Astrology

ఒక్కొక్క నెలలో పుట్టిన వారి మనస్తత్వం ఒక్కోలా ఉంటుందంట.!

Astrology
జనవరి:
అందంగా ఉంటారు. కలల్ని నిజం చేసుకుంటారు. ఎక్కడైనా తగ్గగలరు, నెగ్గగలరు. సాధించాలన్న పట్టుదల ఎక్కువ.

ఫిబ్రవరి:
ఏదైనా విషయానికి తొందరగా బాధపడిపోతారు. కోపం కూడా ఎక్కువే. ఎదుటివారిపై వెంటనే ఆ కోపాన్ని చూపిస్తారు.

మార్చి:
భావోద్వేగాలు ఎక్కువగా చూపిస్తారు. ఆ ఫీలింగ్స్ ఎదుటివారి ఆలోచనలకు దారితీస్తుంది.

ఏప్రిల్:
ఎదుటివారితో కలిసి పనిచేయడానికి ఇష్టపడతారు. నమ్మకం ఎక్కువ. సున్నితమైన మనసు కలిగిన వారు.

మే:
తొందరగా ఆకర్షితులవుతారు మరియు అందరిపై ప్రేమను ఒకేరకంగా చూపిస్తారు.

జూన్:
కొత్తవాళ్లతో స్నేహం చేయడానికి ఇష్టపడతారు. స్నేహితులతో కలిసి పరిహాసం చేయడం, ఆకర్షణీయమైన వ్యక్తులు కనిపించగానే ఇష్టపడతారు.

జూలై:
అహంకారంగా ఉంటారు. ఖ్యాతిని కోరుకుంటారు. తొందరగా భావోద్వాగానికి లోనవ్వడం అనూహ్య మార్పులకు దారితీస్తుంది.

ఆగస్ట్:
ఎప్పుడూ ఏదో ఒక అనుమానంతో ఉంటారు. సరదాగా ఉండటం, రహస్యాలను తెలుసుకోవడం, మంచి సంగీతం వినడం, పగటి కలలు కనడం, తొందరగా బాధపడటం, ఇక నమ్మినవారు మోసం చేస్తే వారిని అఇష్టపడతారు.

సెప్టెంబర్:
స్నేహితుల సమస్యను తెలుసుకొని తీర్చడం, వారిని ఓదార్చడం ఎక్కువ. చాలా తెలివైన వారు, భయం అంటే తెలియదు, ప్రేమ మరియు మన అనుకున్న వారిని చాలా కేరింగ్ గా చూసుకుంటారు.

అక్టోబర్:
చాట్ చేయడానికి ఇష్టపడతారు. అపద్ధం చెబుతారు కానీ నటించరు. స్నేహితులను తొందరగా బాధపెట్టిన మళ్ళీ కలగోపుగా మాటలు కలుపుతారు. చాలా స్మార్ట్, ఆకర్షనీయులు, హాట్ అండ్ సెక్సీ.

నవంబర్:
నమ్మదగిన వారు, విశ్వాసం ఎక్కువ. ఏదైనా చేయాలనుకుంటే దాని గురించే ఆలోచిస్తారు. ప్రమాదకరమైన వారు కూడా. కలివిడిగా ఉంటారు. సీక్రెట్స్ చెప్పరు మరుయు స్వతంత్రంగా ఉంటారు.

డిసెంబర్:
చూడటానికి చాలా బాగుంటారు. విశ్వాసం ఎక్కువ, ఉదారమైన మనసు కలవారు. దేశభక్తి ఎక్కువ. ప్రతి విషయంలోనూ పోటీ పడతారు. అర్థం చేసుకోవడం చాలాకష్టం. ప్రేమగా ఉంటారు, సులభంగా హర్ట్ అవుతారు. పై నెలలతో పోల్చితే అన్ని విషయాలలోనూ ఉన్నతంగా ఉంటారు.
 Astrologer.

Saturday, July 9, 2016

మీ ఇంటికి... ఇల్లాలికి శుభం జ‌ర‌గాలంటే... కొన్ని నిమాలను పాటించాలి. భర్త అనురాగం పెరగటానికి... సంతాన భాగ్యానికి... సిరిసంపదలు పొందటానికి... వ్యాధులు రాకుండా ఉండటానికి ఈ నియమాలు పాటించి చూడండి

భార్య మంగళ సూత్రo లో పిన్నీసులున్నాయా..

మీ ఇంటికి... ఇల్లాలికి శుభం జ‌ర‌గాలంటే... కొన్ని నిమాలను పాటించాలి. భర్త అనురాగం పెరగటానికి... సంతాన భాగ్యానికి... సిరిసంపదలు పొందటానికి... వ్యాధులు రాకుండా ఉండటానికి ఈ నియమాలు పాటించి చూడండి.

- మంగళ సూత్రంలో పిన్నీసులు ఉంచరాదు. అలానే కొన్నిసార్లు హెయిర్ పిన్నులను కూడా తాత్కాలికంగానైనా స్త్రీలు మంగళ సూత్రానికి ఉంచుతుంటారు. మంగళ సూత్రం వేద మంత్రాల సహితంగా ప్రభావితం కాబడిన భర్త ఆయువుపట్టు. మంగళ సూత్రం రూపంలో హృదయం వద్ద చేరి ఉంది. ఇనుప వస్తువులు [పిన్నీసులు, ఇనుముతో చేసినవి] దివ్య శక్తులను ఆకర్షించుకొను గుణం ఉన్నాయి. అవి మంగళ సూత్రంలో దివ్య శక్తులను ఆకర్షించి భర్తను శక్తి హీనుడిని చేస్తాయి. భర్తకు అనారోగ్యం, భార్యాభర్తల పట్ల అనురాగం తగ్గటం ఇలాంటి దుష్ఫలితాలొస్తాయి. ఈ అలవాటు ఉంటే వెంటనే సరి చేసుకోవాలి.

- స్త్రీలు ధరించే గాజులు మట్టి గాజులై ఉంటే చాలా మంచిది. ఈ గాజులు ఐశ్వర్యాన్ని కలిగించటమే కాక, వీటి శబ్దం శుభాలను, అనురాగాలను పెంచుతుంది.

- ఇంట్లో గుర్రం బొమ్మలు ఉంచ‌డం అంత క్షేమం కాదని, డబ్బు విపరీతంగా ఖర్చవుతుందని చాలా మంది నమ్మకం.
- సంపదలను, ఎక్కువగా ప్రదర్శించ‌డం వల్ల నరఘోష ఏర్పడుతుంది. తద్వారా చెడు జరుగుతుంది. అలంకారాదులు సాధారణంగా ఉండేలా చూసుకోవటం,
సాధారణ జీవిత విధానాన్ని పాటించటం ఇలా నరదృష్టి నుంచి తప్పించుకోవచ్చు.

- ఆడపడుచులు, అత్తమామలతో విభేదాలు ఎక్కువైతే, వారు మిమ్మలను ఇబ్బందులు పెడుతుంటే వారు పడుకునే దిండు కింద తులసి వేరు ఉంచండి వారు మిమ్మల్ని ఆప్యాయంగా చూసుకుంటారు. విరోధాలు తగ్గిపోతాయి.

- వంట చేసేప్పుడు రెండు బియ్యం గింజలు భక్తిగా అగ్నికి సమర్పించండి... వంటకాలు ఎంతో రుచిగాను, ఆరోగ్యకరంగాను ఉంటాయి.

- భర్త తాగి వచ్చి హింస పెడుతుంటే ఉదయం పూట టిఫిన్ చేసిన తరువాత ఒక చిన్న స్పూన్ అంటే సుమారు అర గ్రాము కరక్కాయ పౌడరును ఆరు చెంచాల నీటిలో కలిపి తాగించండి. ఇలా అరవై రోజులు చేస్తే.... వాళ్లకు తాగుడుపై విరక్తి కలుగుతుంది. కరక్కాయ పొడి ఆరోగ్యానికి చాలామంచిది. మొదట దీనిని తాగనని మారాం చేస్తారు. కొద్దిగా బతిమాలి తాగించటం అలవాటు చేయండి ఈ ఔషధాన్ని. తాగుడు ఖాయంగా మానుతారని పలువురు అనుభవపూర్వకంగా చెబుతున్నారు.

- సుఖ సంతోషాలు కరువైనవారు పసుపు రంగు పూలు ధరించండి, క్రమేపీ స్థితి మెరుగవుతుంది.

- అప్పుల బాధ ఎక్కువగా వుంటే తెలుపు పూలు ధరించటం వల్ల రుణ బాధలు తగ్గుతాయి.
- ఆరోగ్యం సరిగా లేని వారు, శరీరం నొప్పులు వున్నవారు మరువం, మందారాలు కలిపి ధరించండి. ఇరవై రోజులలో ఫలితం కనిపిస్తుంది.
- పెళ్ళి చూపులప్పుడు ఎరుపు పూలు, పసుపు పూలు కలిపి మాలకట్టి ధ‌రించండి వివాహం విషయంలో కన్యలకు ఎంతో శుభకరంగా ఫలితాలొస్తాయి .

- మంచి తీర్థంలో రెండు తులసి దళాలు వేస్తే అవి మానస సరోవర జలాలంత పవిత్రమవుతాయి.

- కూర్చునే పీఠానికి శుభ్రం చేసి నాలుగు మూలలా బొట్లు పెట్టి కూర్చోవాలి. చాపైతే విభూది బొట్లు గుడ్డను ఆసనంగా వాడితే కుంకుమ బొట్లను పెట్టండి.

- భర్త బయటకు వెళ్ళుటకు షర్ట్ వేసుకుంటుంటే, గుండీలు మీరు పెట్టండి. మీ కుడి చేతిని తాకి వెళ్లమనండి. భర్తకు ఆ రోజు సంపాదనా , విజయం సంతోషం వెంట ఉంటాయి.
ఆ... ఇవన్నీ మూఢ నమ్మకాలు. అలా జరుగుతుందా.. ఇలా ఎందుకు జరుగుతుందనే సోమరిపోతు వాదనలు చేసేవారిని వదిలేయండి. ప్రపంచవ్యాప్తంగా నమ్మకాలు అనుభవాలను బట్టే కలుగుతాయి. వీటిని పాటించటానికి మీకు ఖర్చేమీ కాదు కదా? కొంచెం శ్రద్ధ కావాలి అంతే.
.