Pages

Saturday, October 1, 2016

శరీరంలో రక్త ప్రసరణ సరిగా లేదని తెలిపే సంకేతాలు

 శరీరంలో రక్త ప్రసరణ సరిగా లేదని తెలిపే సంకేతాలు…......


👉🏻చేతులు మరియు కాళ్ళు చల్లబడుతాయి లేదా చల్లగా ఉంటాయి:
సరైన రక్తప్రసరణ నార్మల్ బాడీ టెంపరేచర్ ను మెయింటైన్ చేయడానికి సహాయపడుతుంది. అందువల్ల, బలహీనమైన బ్లడ్ సర్క్యులేషన్ సాదారణ స్థాయి నుండి శరీర ఉష్ణోగ్రత తగ్గిపోవడానికి కారణం అవుతుంది. దాంతో చలి, జ్వరం, కాళ్ళు మరియు చేతులు చల్లబడటం జరుగుతుంది.

👉🏻ఆకలి ఉండదు: బలహీనమైన బ్లడ్ సర్క్యులేషన్ వల్ల కాలేయం ఆకలి సంకేతాలను బ్రెయిన్‌కు పంపడం నివారిస్తుంది. దాంతో ఆకలి లేకపోవడం వల్ల చాలా తక్కువగా తినడం లేదా తినకుండానే ఉండటం వల్ల బరువు తగ్గడానికి కారణం అవుతుంది.

 👉🏻అలసట: బలహీనమైన రక్తప్రసరణ వల్ల శరీరంలో అవయవాలకు తక్కువ ఆక్సిజన్ మరియు పోషకాలు సప్లై అవుతాయి . దాంతో అలసిపోయినట్లు అనుభూతి కలుగుతుంది .
👉🏻 జీర్ణ సమస్యలు: బలహీనమైన రక్తప్రసరణ వల్ల శరీరం మొత్తానికి రక్త శుద్ది తక్కువగా ఉంటుంది. అందువలన జీర్ణక్రియ తగ్గుతుంది మరియు మలబద్దక సమస్యలకు దారితీస్తుంది.
👉🏻 బ్రెయిన్ ఫంక్షన్స్ చురుగ్గా ఉండవు: బ్రెయిన్ ఫంక్షన్స్ చురుగ్గా ఉండాలంటే, రక్తప్రసరణ మెరుగ్గా ఉండాలి . రక్తప్రసరణ మెరుగ్గా లేనట్లైతే అలసటకు గురిచేస్తుంది, ఏకాగ్రత ఉండదు మరియు మతిమరుపు వంటి లక్షణాలు ఎదుర్కోవల్సి వస్తుంది.

..."ఓం సర్వేజన సుఖినో భవంతు"..
 

No comments:

Post a Comment

.