టీచర్ : సతీ సావిత్రి కధ లో నువ్వు తెలుసుకున్నది ఏమిటి? చెప్పరా.
స్టూడెంట్ : భార్య నుండి భర్తను ఆ యముడు కూడా కాపాడలేడని!!
😀😝
సరసు(డాక్టర్ తో): మా వారు రాత్రిళ్ళు నిద్ర పోకుండా ఒకటే మాటలాడుతున్నారండి.
డాక్టర్: మీ వారికి పగలు మాటలాడే అవకాశం ఇవ్వమ్మా.
😁😁😁😁
బంటి (చంటి తో) : పెళ్లిచూపులకు వెళితే తన్ని పంపించారురా.
చంటి : ఎందుకు?
బంటి : మా అమ్మాయి బంగారం అన్నారురా , అయితే తాకట్టు పెట్టుకోవచ్చా అని అడిగానంతే.
😛😛😛😛
(అమ్ములు వాళ్ళ నాన్నా వెంకటప్పతో )
అమ్ములు:"మన కుటుంబానికి ఇంత అన్యాయము చేసిన ఆ చంటిగాడిని
చంపి పగ తీర్చుకుంటా నాన్నా!" పిడికిలి బిగించి శపథం చేసింది
అమ్ములు వాళ్ళ నాన్నాతో.
వెంకటప్ప:"ఒకేసారి చంపకు.........పెళ్ళిచేసుకో............
.ప్రతిక్షణం కుళ్ళి కుళ్ళి చావాలివాడు" చెప్పాడు వాళ్ళ నాన్న
😄😄😄😄
ముత్యాలరావు(సుబ్బారావుతో):"ఆ డాక్టర్ నిజంగా దేవుడే! మా ఆవిడ బద్దకాన్ని, ఆయాసాన్నిచిటికెలో పోగొట్టాడు తెలుసా?" అన్నాడు ముత్యాల రావు.
సుబ్బారావు:ఎలా?
ముత్యాలరావు: "వయసు పెరుగుతోంది కదమ్మా అన్నాడు. అంతే ఆ మరుసటి రోజు నుండే చకచక అన్ని పనులు చేస్తోంది."
😀😀😀😀
చింతామణి:(అప్పారావు తో): ఏమండీ శాంపిల్ అంటే ఏమిటి?
అప్పారావు: పెళ్లి చూపుల్లో నువ్వు చూపిన వినయం లాటింది!
😀😀😀😄
(చింతామణి, వరహాల రావు భార్యాభర్తలు)
ఇద్దరు ఒక సాయంత్రం నడుస్తుండగా గాడిద ఎదురొచ్చింది.
వరహాల రావుని ఆట పట్టించాలనుకున్న చింతామణి "ఏమండీ మీ బంధువొస్తోంది...పలకరించండి"
అంది నవ్వుతూ.
వరహాల రావు: "నమస్తే అత్త గారు..............బాగున్నారా?"
నేను మీ అమ్మాయి "Evening Walk" కి బయలుదేరామండి" అని
పలకరించాడు వరహాల రావు.
😀😀😄😄
అప్పారావు:-- "ఇలా మనం పార్కులో కబుర్లు చెబుతూ ఈ చిప్స్ తింటుంటే నీకే మనిపిస్తోంది?"
.
ఐశ్వర్య :-- నువ్వే ఎక్కువ తింటున్నావనిపిస్తోంది!
😀😀😄😄
దోమకు చీమ కి పెళ్లి అయింది,
ఫస్ట్ నైట్ రోజున దోమ బయట కూర్చున్నది,
ఆ దారంట వెళ్తున్న ఏనుగు ఏంటి కొత్తగా పెళ్లి చేసుకొని బయట కూర్చున్నావేంటీ?
దోమ : దొంగ ముండ ఆల్ ఔట్ ఆన్ చేసి పడుకుంది సార్ ..
😄😄😄😄
ఇక మన పెళ్ళి జరగదు
నిన్న మీ ఇంటికి వెళ్ళా... అప్పుడే అర్దమైంది ఇక మన పెళ్ళి జరగదని..
ఎమైంది. మానాన్నని కలిసావా ?
.
-
లేదు. మీ చెల్లిని చూసా. కత్తిలా ఉంది.
😄😄😄😄
భర్త భార్యతో : నేను పోయినతరువాత నాలాంటివాడు నీకు దొరకడు తెలుసా?
.
భార్య: అప్పుడు కుడా మీలాంటి వాడు ఎందుకు లెండి.
😄😄😄😄
పంతులు : ఒరేయ్ బబ్లూ వాస్తవానికి భ్రమకి తేడా ఏంటి రా ?
.
బబ్లూ : మీరు చెప్పడం వాస్తవం అది మేము వింటున్నామనుకోవడం భ్రమ
ఒక రోజు అడవిలో ఒక చిరుత పులి సిగిరెట్ తాగుతుంది...
ఇంతలో అక్కడికి ఒక చిట్టెలుక వచ్చి, " సోదరా ఇలాంటి అలవాట్లు మానెయ్. పద మన అడవి ఎంత అందంగా ఉంటుందో చూపిస్తాను ".
సరే అని చిరుత సిగరెట్ పక్కన పడేసి దాని వెంట వెళ్ళింది.
కొంత దూరం వెళ్ళాక ఒక ఏనుగు గంజాయి తీసుకుంటూ కనిపించింది. దానికి కూడా అలానే చెప్పి వెంట తీసుకు వెళ్ళింది చిట్టెలుక.
ఇంకొంత దూరం వెళ్ళాక ఒక సింహం విస్కీ తాగుతూ కనిపించింది. ఆ సింహానికి కూడా అదే మాట చెప్పింది.
సింహం తన చేతిలో ఉన్న గ్లాస్ పక్కన పెట్టి ఆ చిట్టెలుకని నాలుగు పీకింది..
అది చూసి ఏనుగుకి కోపం వచ్చింది.. " ఎందుకు పాపం దాన్ని అలా కొడతావ్? "
" ఇది నిన్న కూడా ఇలానే ' ' తాగి వచ్చి నన్ను 3 గంటలు అడవి అంతా తిప్పింది..."
No comments:
Post a Comment