భక్తుడి తపస్సుకు మెచ్చి
దేవుడు
ప్రత్యక్షమయ్యాడు ....
ఏమి వరం కావాలి భక్తా ?????భక్తుడు = ఈ ప్రపంచం లో ఉన్న వాళ్ళందరకు ఒక్కొక్కరికి 100 కోట్లు ఇవ్వండి!
దేవుడు = ఒకే ఇస్తాను ..... అలా వచ్చిన డబ్బుతో ఏమి చేస్తావు ???
భక్తుడు = డబ్బు వుంటే ఏదైనా చెయ్యొచ్చు .... ముందుగా ఒక ఇల్లు కట్టుకొంటాను
దేవుడు = ఎవరు కడతారు ????
⭕
భక్తుడు = ఎవరేమిటి డబ్బు పారేస్తే ఈ వూళ్ళో ఎవరినా కడతారు
దేవుడు = ఎవరికీ పారేస్తావు ??? వాళ్ళ దగ్గర కుడా 100 కోట్లు డబ్బు ఉంటుంది కదా .... వాళ్ళే నీకు పారేస్తారు ఇల్లు కట్టివ్విమని......
భక్తుడు = ఈ ఊళ్ళో ఎవరు కట్టకపోతే ప్రక్క ఊరినుంచి కూలిలను తెప్పిస్తాను ఎక్కువ డబ్బు ఇచ్చి .....
దేవుడు = ఆ పక్క ఊరిలో వాళ్ళందరి దగ్గర కుడా 100 కోట్లు వుంటాయి కదా
భక్తుడు = ఎవరు కట్టటానికి ముందుకు రాకపోతే మంచి కట్టిన ఇంటినే కొంటాను నాకు డబ్బుకు లోటు లేదు కదా.......
దేవుడు = ఎవరు అమ్ముతారు ???? ఎవరికీ డబ్బు అవసరం ఉంటుంది ????? అందరి దగ్గర 100 కోట్లు వుంటాయి కదా
భక్తుడు = సరే ఇదే పాకలో ఉంటాను ..... రోజు మంచి తిండి తింటాను
దేవుడు = ఎక్కడా ????
⭕ భక్తుడు = ఈ వూళ్ళో అనేక హోటల్ వున్నాయి తిండికి లోటేమిటి ??
దేవుడు = ఎవరు వండుతారు ?????
⭕ భక్తుడు = హోటల్ కాకపొతే మంచి బియ్యం కొనుక్కొంటాం!
దేవుడు = ఎవరు పండిస్తారు ??? అందరి దగ్గరా డబ్బులు వుంటాయి కదా ...
భక్తుడు = అసలు నీ ఉదేశ్యం ఏమిటి స్వామి ??????
దేవుడు = అందరి దగ్గరా అవసరానికి మించి డబ్బులు వున్నప్పుడు ఎవరు మాత్రం కష్టపడతారు ????? అందరు కూర్చొని తిన్దామనుకొంటారు కదా ....
భక్తుడు = నిజమే సామి నాకు అర్ధం అయ్యింది ......
దేవుడు = అందుకే కష్టే ఫలి అన్నారు ..... కష్టానికి తగ్గ ఫలితమే రావాలి కాని అంతకు మించి వస్తే అనర్ధమే ......
భక్తుడు = సామీ నా కళ్ళు తెరిపించావు ... 😜నాకు ఒక్కడికే 100 కోట్లు ఇవ్వు సామి! ఇంకెవరికి ఇవ్వకు! .....
దేవుడు = మీరు మారరురా! మారరు గాక మారరు.....!
మానవ శరీరంలో మీరు ఊహించని ఎన్నో అధ్బుతాలు దాగి ఉన్నాయి. మీ గురించి మీరు అంచనా వేసిన దానికంటే కూడా ఎన్నో రెట్లు ఎక్కువ సామర్ధ్యం మీలో ఉందన్న విషయం మీకు తెలిసుండకపోవచ్చు. ఇప్పుడు మేము చెప్పబోయే విషయాలు వింటే ఆశ్చర్యపోక మానరు..!!
మానవ శరీరం గురించి అద్దిరిపోయే విషయాలు:
* మన కడుపులో ఉండే ఆమ్లము (acid) రేజర్ బ్లేడ్ లను కూడా కరిగించగలదు.
అలాగని ట్రై చేసేరు..!!
* మనం రోజుకి సగటున 40 నుండి 100 వెంట్రుకలు కోల్పోతున్నాం.
కొత్తవి కూడా వస్తాయి లెండి..!!
* మన ఒక్కో వెంట్రుక 3 నుండి 7 సంవత్సరాల వరకు పెరుగుతూనే ఉంటాయి.
తర్వాత అవి రాలిపోయి వాటి స్థానంలో వేరేవి పెరుగుతాయిలెండి..!!
* ఒక్క అంగుళం చర్మం మీద 3 కోట్లకు పైగా బాక్టీరియా ఉంటుంది.
ఎం బంటీ నీ సబ్బు స్లో నా ఏంటి..??
* రోజుకి మన గుండె ఉత్పత్తి చేసే శక్తితో ఓ సాధారణ ట్రక్ ని 30 కిలో మీటర్ల వరకు నడిపించవచ్చు.
ఇంకెప్పుడైనా పెట్రోల్ అయిపోతే ఇది ట్రై చేయండి..!!
* లేవకుండా ఒక మనిషి నిద్రించిన రికార్డు 11 రోజులు.
మీరు ఆ రికార్డు బ్రేక్ చేస్తారా..??
* 90 శాతం కి పైగా జబ్బులు స్ట్రెస్ వల్లనే అని తేలింది.
కొన్ని విషయాలు లైట్ తీసుకో భయ్యా..!!
* శరీరం నుండి తల వేరు చేసినా.. తల 15 సెకన్ల వరకు స్పృహ కోల్పోదు.
ఎమన్నా చెప్పాలనుకుంటే త్వరగా చెప్పేయ్..!!
* మీరు పడుకునే గది ఎంత చల్లగా ఉంటె... మీకు పీడ కలలు వచ్చే అవకాశాలు అంత పెరుగుతాయి.
వెచ్చగా ఉంటె కలలోకి అప్సరసలు వస్తారని కాదు..!!
* నిద్రించే సమయంలో మన వాసనా పీల్చే భావం పనిచేయదు.
గ్యాస్ స్టవ్ సరిగ్గా కట్టేసారో లేదో చూసుకోండి..!!
* మనవ శరీరం లో ఉన్న DNA మరియు అరటిపండులో ఉన్న DNA 50 శాతం కలుస్తాయి.
అరటిపండులో మీ చుట్టాలెవరైనా ఉన్నారేమో చెక్ చేసుకోండి..!!
* మనం తిన్నది అరగడానికి మన శరీరంలో ఏవైతే సహాయ పడతాయో... చనిపోయిన 3 రోజులకి అవే మనల్ని తినడం మొదలపెడతాయి.
బాస్ అంటే ఎంత మర్యాదో చూడండి..!!
* గుండె పోటు వల్ల చనిపోయే వారిలో 20 శాతం మంది సోమవారం నాడే చనిపోతారు.
ఉద్యోగం తల్చుకుంటే అంత భయం మరి..!!
* 7 గంటల కన్నా తక్కువ నిద్రిస్తే.. త్వరగా చనిపోతారు.
ఫోన్ ని పక్కకు పెట్టి నిద్ర పై ద్యాస పెట్టండి. ఏమో మీరు చనిపోయే టైం కి కొత్త ఫోన్ వస్తే అది వాడకుండానే చనిపోతారేమో..!! ఒక్కసారి ఆలోచించండి.
* వెలి ముద్రలు ఉన్నట్టే.. నాలుక ముద్రలు కూడా ఒకరితో ఒకరికి పోలిక లేకుండా ఉంటాయి.
బలవంతంగా ఎవరైనా మీ ఆస్తి లాక్కుందాం అనుకుంటే.. నేను వెలి ముద్ర వేయను.. నాలుక ముద్ర వేస్తాను అని చెప్పండి..!!
* ఒకవేళ మన కళ్ళు కెమెరా అయితే.. 576 మెగా పిక్సెల్స్ ఉన్న కెమెరాలా ఉండేది.
ప్రపంచంలో ఉన్న బెస్ట్ కెమెరా మీ దగ్గరే ఉంది.!!
* మనిషి కన్నుని తయ్యారుచేయాలంటే కొన్ని లక్షల కోట్లు కర్చవుతుందట.
వాటిని అమ్మితే అంత రావులెండి..!!
* మన నోరు 100 కోట్లకు పైగా రుచులను గుర్తించగలదు.
ఏదిపడితే అది ట్రై చేయకండి..!!
* మీకు 60 ఏళ్ళు వచ్చే సరికి నోటిలో ఉండే టేస్ట్ బడ్స్ సగానికి పైగా చనిపోతాయి.
అంత లోపే ఎం తినాలనుకుంటున్నారో అవి తినేయండి..!!
* మీకు ఎంత ఎక్కువ IQ ఉంటె.. అన్ని కలలుగంటారు.
కలలు రాకపోతే మీకు IQ లేదని కాదులెండి..!!
* మన కాళ్ళ గోర్లకన్నా చేతి గోర్లు 4 రెట్లు త్వరగా పెరుగుతాయి.
అంటే చేతి గోర్లు వారానికోసారి కట్ చేసుకుంటే... కాళ్ళ గోర్లు ఎన్ని రోజులకి కట్ చేయాలి..??
* చింపాంజీ శరీరం పై ఉన్నన్ని వెంట్రుకలే మన శరీరం పై కూడా ఉంటాయి. కాకపోతే మనవి చాలా సన్నగా ఉంటాయి.
కావాలంటే ఈ సారి చింపాంజీ కనిపించినప్పుడు లెక్కపెట్టుకోండి..!!
* మన శరీరం 30 నిమిషాలలో ఉత్పత్తి చేసే వేడితో 114 లీటర్ల నీటిని వేడి చేయవచ్చు.
రేపటి నుండి హీటర్ వాడడం మానేయండి..!!
* మన చర్మం నిమిషానికి 50000 సెల్స్ ని వదిలేస్తుంది. అంటే జీవిత కాలంలో అది 18 కిలోలనమాట.
పౌడర్ అవసరం లేదిక..!!
* మీ బెడ్ పై ఉండే దుమ్ములో సగానికి పైగా మీ చర్మందే.
ఇకనుండి బయట దుమ్ము ఎక్కువగా ఉందని బాధపడకండి..!!
* మన బ్రెయిన్ 25 వాట్స్ విద్యుత్త్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ పవర్ తో ఓ బుల్బ్ ని వెలిగించవచ్చు.
ఇంకెప్పుడైనా రాత్రి పూట కరెంటు పోతే భయపడకండి..!!
* మీకు 40 ఏళ్ళు వచ్చే వరకు మీరు ఎదుగుతూనే ఉంటారు.
రోజు కొల్చుకోండి..!!
* మన బ్రెయిన్ పగటి పూటకన్నా రాత్రి పూటనే చురుకుగా పనిచేస్తుంది.
అందుకే కదా ఆఫీస్ లో కన్నా.. పార్టీలలో ఎక్కువ యాక్టివ్ గా ఉంటారు..!!
* ఒక సంవత్సరంలో 15000 కలలుగంటారట.
మీకు వాటిలో ఎన్ని గుర్తున్నాయి..??
* మీరు వింటున్న మ్యూజిక్ కి తగ్గట్టుగా మీ గుండె కొట్టుకోవడం ప్రారంభమవుతుంది.
జాగ్రత్త మరీ స్లోగా ఉన్న సాంగ్ వినకండి..!!
మీకు ఈ పోస్టు కనుక నచ్చితే షేర్ చేయడం మరువకండి..!!
ఏమి మనిషి జీవితం రా ఇది.....
ఒక రోజు దేవుడు ఓ కుక్కని తయారు చేసాడు.
దేవుడు అన్నాడు: రోజంతా ఇంటి ముందు కూర్చో.
ఎవరైనా తెలియని వాళ్ళు వస్తే
అరువు.
నేను నీకు 20 ఏళ్ళు ఆయుషుని ఇస్తాను.🤘🏼
🐕కుక్క: స్వామి ఇదేమి బాలేదు… నేను అన్ని
ఏళ్ళు అరవలెను.
కాబట్టి ఇదుగో 10
ఏళ్ళు నీకు ఇచెస్తను.
10 ఏళ్ళు మాత్రమే
అరుస్తాను సరేనా !
దేవుడు: సరే..👍🏼
ఆ తర్వాతి రోజు దేవుడు ఒక కోతి ని తయారు చేసాడు.
దేవుడు: నీ కోతి చేష్టలు చేస్తూ జనాల్ని సంతోష పరుచు.
నీకు 20 ఏళ్ళు ఆయుషు
ఇస్తున్నాను.🤘🏼
🐒కోతి: ఏంటి !!
కోతి చేష్టలు 20 ఏళ్ళ ! అమ్మో!
కుక్క తన 10 ఏళ్ళు నీకు ఇచ్చింది గా !
నేను అలాగే ఇస్తాను.
దేవుడు : సరే…👍🏼
మరుసటి రోజు దేవుడు మరల ఒక ఆవుని తయారు చేసాడు.
దేవుడు: నువ్వు రైతుతో పాటు పొలానికి వెళ్లి రోజంతా
ఎండలో కస్టపడి
సాయత్రం పాలు ఇస్తూ,
రైతుకి సహాయం చేయి.
నీకు 60 ఏళ్ళు ఆయుషు ఇస్తునాను.🤘🏼
🐄ఆవు: 60 ఏళ్ళు ఈ గొడ్డు చాకిరీ నేను చేయలేను.
నాకు కూడా 20 ఏళ్ళు ఇచి
మిగతా 40 ఏళ్ళు నువ్వే తీసుకో…
దేవుడు: సరే…👍🏼
తర్వాత రోజు దేవుడు మనిషి ని తయారు చేసాడు.
దేవుడు: తిను, తాగు , ఆడుకో, పెళ్లి చేసుకో,
నీ జీవితాన్ని ఆనందించు..
నేను నీకు 20 ఏళ్ళు
ఆయుషు ని ఇస్తునాను.🤘🏼
🤔మనిషి: ఏంటి? 20 ఏళ్లే నా? చూడు , నా 20 ఏళ్ళు తో పాటు ఆవు నీకు ఇచ్చిన 40,
కోతి మరియు కుక్కకి ఇచిన
10 +10 మొత్తం : 80 ఏళ్ళు
కావాలి…
దేవుడు: సరే…👍🏼
అందుకే మొదట 20 ఏళ్ళు మనిషి తింటున్నాడు,
నిద్రపోతున్నాడు, ఆడుకుంటున్నాడు,
ఆనందిస్తున్నాడు.. 😍😜
తరవాత 40 ఏళ్ళు
ఆవు చేస్తున్నాటు తన కుటుంభానికి
సహాయం చేయటానికి గొడ్డు చాకిరీ చేస్తున్నాడు.🐄
ఆ తర్వాత 10 ఏళ్ళు
కోతి చేష్టలు చేస్తూ తన
మనవల్లు , మనవరల్లని
నవ్విస్తున్నాడు.. 🐒
తరవాత 10 ....
ఇంటి ముందు కూర్చొని
వచ్చే పోయే వాళ్ళని
అరుస్తుంటాడు….🐕
*ఏమి మనిషి జీవితం రా ఇది..
No comments:
Post a Comment