చిట్టికథ
ఒక సారి సోక్రటీస్ దగ్గరకు అతని మిత్రుడు ఒకడు వచ్చి నీకు తెలుసా నీ మిత్రుడు గురించి నీను ఒక విషయం విన్నాను" అని ఎంతో ఉత్సాహంగా ఇంకేదో చెప్పబోతున్న అతన్ని సోక్రటీస్ ఆపి "నీవు నా మిత్రుడు గురించి చెప్పబోయే ముందు ఒక్క నిముషం సావధానంగా నీవు చెప్పబోయే విషయాన్ని కోద్దిగా జల్లెడ పడదాం దీన్ని నీను "మూడు జల్లెడ్ల పరీక్ష (Triple Filter Test)" అంటాను అని అడగటం మొదలు పెట్టాడు.మొదటి జల్లెడ"నిజం" - "నీవు నా స్నేహితుడి గురించి చెప్పాబోయే విషయం ఖచ్చితంగా నిజమైనదని నీకు తెలుసా ?" అని అడిగాడు.
అందుకు ఆ స్నేహితుడు "లేదు, ఎవరో అంటుండగా విన్నాను" అని అన్నాడు.
"అంటే నీవు చెప్పబోయే విషయం నిజమైనదే అని నీకు తెలీదన్న మాట" అని సోక్రటీస్ అన్నాడు.
సరే రెండో జల్లెడ "మంచి " - " నీవు నాకు చెప్పబోయే విషయం నా మిత్రుని గురించిన మంచి విషయమా ?" అని అడిగాడు సోక్రటీస్.
"కాదు" అన్నాడు సోక్రటీస్ స్నేహితుడు .
"అంటే నీవు నా మిత్రుని గురించి చెడు చెప్పాలను కున్నావు, అది కుడా నీకు కచ్చితంగా నిజమని తెలీని విషయం- సరే ఇంక మూడో జల్లెడకు వెళదాం"అన్నాడు సోక్రటీస్.
మూడో జల్లెడ "ఉపయోగం" - "నీవు నా మిత్రుని గురించి చెప్పబోయే విషయం నాకు వుపయోగామైనదా ? " అని సోక్రటీస్ అడిగాడు.
"లేదు" అన్నాడు ఆ మిత్రుడు.
"అయితే నీవు చెప్పబోయే విషయం నిజమైనది, మంచిది, వుపయోగకరమైనది కానపుడు నాకు చెప్పటం ఎందుకు ?" అని సోక్రటీస్ అన్నాడు.
నీతి : మన గురించి, మన వాళ్ళ గురించి చెడు వార్తలను, విషయాలను మోసే వాళ్ళు చాలా మంది వుంటారు. ఒక విషయం (చాడి) వినేముందు ఈ మూడు జల్లెడల పద్ధతి అనుసరిస్తే, మన బంధాలు నిలబడతాయి, మంచి పెంపొందుతుంది. చాడీలు నివారిన్చబడతాయి.
మాతృభాష
కల్వరాల రాజ్యాన్ని వీరరాఘవుడనే మహారాజు పరిపాలించేవాడు. అతడు వివిధ రాజ్యాల కళాకారులను ఆహ్వానించి, వారితో కళా ప్రదర్శనలు ఇప్పించి, మంచి బహుమతులు ఇచ్చేవాడు. ఒక రోజు వారి రాజ్యానికి అమరేశప్ప అనే పండితుడు వచ్చ్హాడు. అతడు అనేక భాషలను అనర్గళంగా మాట్లాడగలడు."మహారాజా! మీ పండితులెవరైనా నా మాతృభాష కనుక్కోగలరా?" అని అమరేశప్ప సవాలు విసిరాడు.
ఆస్ధాన పండితులంతా వేర్వేరు భాషలలో వివిధ ప్రశ్నలు అడిగారు. ఏ భాషలో ఏ ప్రశ్న అడిగినా ఆ పండితుడు ఏ మాత్రం తడుముకోకుండా, ఆ భాషే తన మాతృభాష అయినట్లుగా సమాధానం చెప్పసాగాడు. చివరికి ఆస్ధానపండితులు చేతులెత్తేశారు.
"మీ రాజ్యంలో నా మాతృభాషను కనిరపెట్టగల మేధావులే లేరా?" అన్నాడు ఆ పండితుడు మహారాజు మహామంత్రివైపు చూశాడు.
మహామంత్రి ఆ పండితుడిని తనకు తెలిసిన కొన్ని భాషలలో ప్రశ్నలు అడగసాగాడు. ఆ పండితుడు తడుముకోకుండా జవాబులు చెప్ప సాగాడు. చివరికి విసుగు చెందిన, మహామంత్రి కోపంతో ఒక సైనికుడి ఖడ్గం తీసుకొని పండితుడిపై వేటు వేయబోయాడు.
"అమ్మో! కాపాడండి!" అని అరిచాడు ఆ పండితుడు కన్నడంలో.
మహామంత్రి ఖడ్గాన్ని దించి, చిరునవ్వుతో "మహారాజా! ఆ పండితుడి మాతృభాష కన్నడం, మనం ఆపదలో ఉన్నప్పుడు మనం మాట్లాడే మాటలు మాతృభాషలోనే ఉంటాయి." అని చెప్పాడు.
పండితుడు మాతృభాష కన్నడమే అని అంగీకరించాడు. ఓటమితో తలదించుకుని సభ నుండి వెళ్ళిపోయాడు.
No comments:
Post a Comment