GROUP-3 NEW SYLLABUS - (PANCHAYATH SECRETARY)
🔲గ్రూప్-3కి కొత్త సిలబస్
ఖరారు చేసిన ఏపీపీఎస్సీ1,054 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్
హైదరాబాద్, నవంబరు 18(ఆంధ్రజ్యోతి):
గ్రూప్-3 సర్వీసె్‌సకు (పంచాయతీ కార్యదర్శులు) కొత్త సిలబ్‌సను ఏపీపీఎస్సీ శుక్రవారం ఖరారు చేసింది.
స్ర్కీనింగ్ టెస్ట్, మెయిన్స్‌కు ఒకే సిలబస్ ఉంటుంది.
అయితే స్ర్కీనింగ్ టెస్ట్‌తో పోలిస్తే మెయిన్స్ సిలబస్ మరింత విపులంగా, విస్తృత స్థాయిలో ఉంటుంది.
www.psc.ap.gov.in వెబ్‌సైట్లో కొత్త సిలబస్ అందుబాటులో ఉంది.
స్ర్కీనింగ్ టెస్ట్ సిలబ్‌సలో
కరెంట్ అఫైర్స్,
బేసిక్ జనరల్ సైన్స్,
ఆధునిక భారత దేశ చరిత్ర,
భారతలో ఆర్థికాభివృద్ధి,
భారత రాజ్యాంగం,
ఏపీ పునర్విభజన-పరిణామాలు,
భారతలో పంచాయతీరాజ్ వ్యవస్థ,
ఏపీ పంచాయతీరాజ్ వ్యవస్థ,
ఏపీ పంచాయితీరాజ్ అభివృద్ధి పథకాలు,
రూరల్ ఎకానమీ ఆఫ్ ఏపీ,
రూరల్ క్రెడిట్ సినారియో ఆఫ్ ఏపీ, మహిళాసాధికారత, ఆర్థిక పురోభివృద్ధి,
లాజికల్ రీజనింగ్,
ఎనలిటికల్ ఎబిలిటీ అండ్
డేటా ఇంటర్‌ప్రిటేషన్
తదితర 13 అంశాలు ఉన్నాయి.
మెయిన్స్ సిలబ్‌సను రెండు పేపర్లుగా విభజించారు.
పేపర్-1లో
జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీపై ప్రశ్నలు ఉంటాయి.
పేపర్-2లో
గ్రామీణాభివృద్ధిపై, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలపై ప్రశ్నలు ఉంటాయి.
స్ర్కీనింగ్ టెస్ట్ 150 మార్కులకు ఆబ్జెక్టివ్ టైప్‌లో ఉంటుంది.
మెయిన్ పరీక్షను కంప్యూటర్ బేస్డ్‌గా 150 మార్కుల చొప్పున రెండు పేపర్లు రాయాల్సి ఉంటుంది.
మొత్తం మీద స్ర్కీనింగ్ టెస్ట్ 150 మార్కులకు, మెయిన్స్ 300 మార్కులకు నిర్వహిస్తారు.
ఈ కొత్త సిలబ్‌సతోనే 1,054 పంచాయితీ కార్యదర్శి పోస్టులను భర్తీ చేసేందుకు త్వరలో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
ఏదేని డిగ్రీ కలిగిన వారికి అర్హత ఉంటుంది.
ఈ ఏడాది జూలై 1 నాటికి 42 సంవత్సరాలకు మించని వారందరూ అర్హులే.
[28/12, 9:39 PM] Thamasari: ఏపీపీఎస్సీ గ్రూప్ - II స్క్రీనింగ్ టెస్ట్ 150 Marks
ఎ) కరెంట్ అఫైర్స్ - రాజకీయ, ఆర్థిక, సామాజిక, శాస్త్ర, సాంకేతిక, కళలు, క్రీడలు, సాంస్కృతిక, పాలనా రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ అంశాలు.
బి) భారత రాజ్యాంగ సమాఖ్య విధానం, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు, న్యాయవ్యవస్థ, న్యాయ సమీక్ష, స్థానిక ప్రభుత్వాలు, ఆదేశిక సూత్రాలు, కేంద్ర - రాష్ట్ర చట్టసభలు, కేంద్ర - రాష్ట్రాల మధ్య పరిపాలన, చట్టపరమైన సంబంధాలు, ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల పరిపాలనా తీరు.
సి) భారత ఆర్థికాభివృద్ధి - మధ్యయుగ భారత ఆర్థిక వ్యవస్థ, స్వాతంత్య్ర పూర్వపు భారత ఆర్థిక వ్యవస్థ, స్వాంతంత్య్రానంతరం దేశంలో అభివృద్ధి ప్రణాళికలు - ఆర్థిక, పారిశ్రామిక విధానాలు, కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ, కార్మిక విధానాలు, భారతదేశంలో వ్యవసాయం, హరిత విప్లవం ప్రాధాన్యం, జనాభా, ప్రాంతాల వారీగా ఆర్థిక వ్యత్యాసాలు.
ఏపీపీఎస్సీ > గ్రూప్-II > పేపర్ - 1 > జనరల్ స్టడీస్ 150 Marks
1. జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం కలిగిన సంఘటనలు
2. అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ వర్తమాన అంశాలు
3. శాస్త్ర సాంకేతిక రంగాలు, సమాచార సాంకేతికతలో సమకాలీన అభివృద్ధి; దైనందిన జీవితంలో సామన్యశాస్త్రం వినియోగం.
4. భారత జాతీయోద్యమంపై ప్రత్యేక దృష్టితో సామాజిక, ఆర్థిక, రాజకీయ ఆధునిక భారతదేశ చరిత్ర
5. భారత రాజకీయ వ్యవస్థ, పాలనః రాజ్యాంగ అంశాలు, ప్రభుత్వ విధానాలు, సంస్కరణలు, ఈ-గవర్నెన్స్ కార్యక్రమాలు
6. భారత స్వాతంత్య్రం తర్వాత భారత ఆర్థిక అభివృద్ధి
7. భారత ఉపఖండం - భౌతిక భూగోళశాస్త్రం
8..విపత్తు నిర్వహణ, విపత్తులు సంభవించే ప్రాంతాలు, నష్ట నివారణ ఉపశమన చర్యలు, రిమోట్ సెన్సింగ్, జీఐఎస్ సహాయంతో విపత్తు అంచనా
9. సుస్థిర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ
10. లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్
11. దత్తాంశ విశ్లేషణ (ఎ) ట్యాబులేషన్ ఆఫ్ డేటా (బి) విజువల్ రిప్రజంటేషన్ ఆఫ్ డేటా (సి) బేసిక్ డేటా విశ్లేషణ.
12. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన - పరిపాలన, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ, న్యాయ సంబంధిత చిక్కులు/ సమస్యలు. వాటిలో
ఎ) రాజధానిని కోల్పోవడం - కొత్త రాజధాని నిర్మాణంలో ఎదురయ్యే సవాళ్లు, దానివల్ల కలిగే ఆర్థిక పరమైన చిక్కులు
బి) ఉమ్మడి సంస్థల పంపకం, పునర్నిర్మాణం
సి) ఉద్యోగుల పంపకం, వారి పున:స్థాపన, స్థానికత సమస్యలు
డి) వాణిజ్యం, పారిశ్రామికవేత్తలపై విభజన ప్రభావం
ఇ) రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వనరులకు సంబంధించిన చిక్కులు
ఎఫ్) రాష్ట్ర విభజన అనంతరం మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెట్టుబడులకు అవకాశాలు
జి) సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, జనాభా అంశాలపై రాష్ట్ర విభజన ప్రభావం
హెచ్) నదీ జలాల పంపకం, వాటి పర్యవసాన సమస్యలపై రాష్ట్ర విభజన ప్రభావం
ఐ) ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం - 2014, కొన్ని నిబంధనల్లో ఏకపక్ష ధోరణులు
ఏపీపీఎస్సీ > గ్రూప్-II > పేపర్ - 2 > సెక్షన్ - 1 >
ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్ర 75 Marks
1. ఆంధ్రప్రదేశ్ భౌగోళిక పరిస్థితులు - చరిత్ర దాని ప్రభావం. శాతవాహనులు- సామాజిక, ఆర్థిక, మత నిర్మాణం, సాహిత్య సేవ, వాస్తు, శిల్పం. వేంగి తూర్పు చాళుక్యులు - సామాజిక, సాంస్కృతిక సేవ - తెలుగు భాష, సాహిత్యం అభివృద్ధి.
2. క్రీ.శ. 11 - 16 శతాబ్దాల మధ్య ఆంధ్ర దేశంలో సామాజిక, సాంస్కృతిక, మతపరమైన స్థితిగతులు; తెలుగు భాష, సాహిత్యం, వాస్తు, చిత్రలేఖనం అభివృద్ధి. ఆంధ్ర చరిత్ర, సాంస్కృతిక రంగాలకు కుతుబ్‌షాహీల సేవ
3. యూరోపియన్ల రాక - వాణిజ్య వ్యాపార కేంద్రాలు - కంపెనీ పాలనలో ఆంధ్ర. - 1857 తిరుగుబాటు - ఆంధ్రలో బ్రిటిష్ పాలనపై ప్రభావం - సామాజిక, సాంస్కృతిక చైతన్యం, జస్టిస్ పార్టీ/ ఆత్మగౌరవ ఉద్యమాలు. 1885 - 1947 మధ్య ఆంధ్రలో జాతీయోద్యమ వ్యాప్తి/ విస్తరణ/ పరిణామం - సోషలిస్టులు, కమ్యూనిస్టుల పాత్ర - జమీందారీ వ్యతిరేక, కిసాన్ ఉద్యమాలు. జాతీయవాద కవిత్వం.
4. ఆంధ్రోద్యమ పుట్టుక, వ్యాప్తి - ఆంధ్ర మహాసభల పాత్ర - ప్రముఖ నాయకులు - 1953లో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు దారితీసిన ముఖ్యమైన సంఘటనలు. ఆంధ్ర ఉద్యమంలో పత్రికల పాత్ర..
5. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావానికి దారితీసిన సంఘటనలు - విశాలంధ్ర మహాసభ, రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ సంఘం, దాని సిఫార్సులు - పెద్ద మనుషుల ఒప్పందం - 1956 నుంచి 2014 మధ్యలో ప్రధాన సాంఘిక, సంస్కృతిక, సంఘటనలు.
6. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన - పరిపాలన, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ, న్యాయ సంబంధిత చిక్కులు/ సమస్యలు. వాటిలో
ఎ) రాజధానిని కోల్పోవడం - కొత్త రాజధాని నిర్మాణంలో ఎదురయ్యే సవాళ్లు, దానివల్ల కలిగే ఆర్థికపరమైన చిక్కుళ్లు
బి) ఉమ్మడి ఆస్తుల పంపకం, పునర్నిర్మాణం
సి) ఉద్యోగుల పంపకం, వారి పునఃస్థాపన, స్థానికత సమస్యలు
డి) వాణిజ్యం, పారిశ్రామికవేత్తలపై విభజన ప్రభావం
ఇ) రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వనరులకు సంబంధించిన చిక్కులు
ఎఫ్) రాష్ట్ర విభజన అనంతరం మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెట్టుబడులకు అవకాశాలు
జి) సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, జనాభా అంశాలపై రాష్ట్ర విభజన ప్రభావం
హెచ్) నదీ జలాల పంపకం, వాటి పర్యవసాన సమస్యలపై రాష్ట్ర విభజన ప్రభావం
ఐ) ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం - 2014, కొన్ని నిబంధనల్లో ఏకపక్ష ధోరణులు.
ఏపీపీఎస్సీ > గ్రూప్-II > పేపర్ - 2 > సెక్షన్ - 2 >
భారత రాజ్యాంగం - విహంగ వీక్షణం 75 Marks
1. భారత రాజ్యాంగ స్వభావం - రాజ్యాంగ అభివృద్ధి - భారత రాజ్యాంగ ప్రధాన లక్షణాలు - ప్రవేశిక - ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు వాటి సంబంధం - ప్రాథమిక విధులు, విశేష లక్షణాలు - కేంద్ర, సమాఖ్య వ్యవస్థలు.
2. భారత ప్రభుత్వ నిర్మాణం, విధులు - శాసన, కార్యనిర్వాహక, న్యాయ నిర్వాహక - శాసన నిర్వాహక రకాలు - ఏక శాసనసభ, ద్విశాసనసభ - కార్యనిర్వాహక - పార్లమెంటరీ తరహా, న్యాయనిర్వహణ - న్యాయసమీక్ష, న్యాయ వ్యవస్థ క్రియాశీలత.
3. కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన నిర్వాహక, కార్యనిర్వాహక అధికారాల పంపిణీ; కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన, పరిపాలన, ఆర్థిక సంబంధాలు - రాజ్యాంగ సంస్థల అధికారాలు, విధులు - యూపీఎస్సీ, రాష్ట్ర స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, కాగ్.
4. కేంద్ర రాష్ట్ర సంబంధాలు - సంస్కరణల అవసరం - రాజ్‌మన్నార్ కమిటీ, సర్కారియా కమిషన్, ఎం.ఎం. పూంచీ కమిషన్, నీతి ఆయోగ్ - భారత రాజ్యాంగ కేంద్ర, సమాఖ్య లక్షణాలు.
5. రాజ్యాంగ సవరణ విధానం - కేంద్రీకరణ వర్సెస్ వికేంద్రీకరణ - సామాజిక అభివృద్ధి పథకాలు - బల్వంత్‌రాయ్ మెహతా, అశోక్‌మెహతా కమిటీలు - 73వ, 74వ రాజ్యాంగ సవరణలు, వాటి అమలు.
6. భారత రాజ్యాంగ పార్టీలు - జాతీయం, ప్రాంతీయం - ఏక పార్టీ, ద్విపార్టీ, బహుళ పార్టీ వ్యవస్థలు - ప్రాంతీయ తత్వం, ఉప ప్రాంతీయ తత్వం - కొత్త రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్ - జాతీయ సమైక్యత - భారత ఐక్యతకు ముప్పు/ సవాళ్లు. శ్రీకృష్ణ కమిటీ.
7. భారత్‌లో సంక్షేమ యంత్రాంగం - ఎస్సీ ఎస్టీ మైనారిటీల ప్రొవిజన్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు - ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం - జాతీయ రాష్ట్రీయ ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్లు, మహిళా కమిషన్, జాతీయ, రాష్ట్రీయ మైనారిటీ కమిషన్స్ - మానవ హక్కుల కమిషన్ - సమాచార హక్కు చట్టం - లోక్‌పాల్, లోకాయుక్త.
ఏపీపీఎస్సీ > గ్రూప్-III > పేపర్ - 3 > సెక్షన్ - 1
భారత ప్రణాళికా వ్యవస్థ, భారత ఆర్థిక వ్యవస్థ 75 Marks
భారత ఆర్థిక ప్రణాళికా వ్యవస్థ: పంచవర్ష ప్రణాళికల సామాజిక, ఆర్థిక లక్ష్యాలు - కేటాయింపులు - ప్రత్యామ్నాయ వ్యూహాలు - లక్ష్యాలు, విజయాలు - వివిధ ప్రణాళికల వైఫల్యానికి కారణాలు - 1991 నూతన ఆర్థిక సంస్కరణలు - సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ (ఎల్‌పీజీ). ఆర్థిక వ్యవస్థ నియంత్రణ, నియంత్రణ సంస్థల ఏర్పాటు.
భారత ఆర్థిక విధానాలు: వ్యవసాయ విధానాలు - 1986 నుంచి పారిశ్రామిక విధానాలు - ఐటీ పరిశ్రమలు - ఆర్‌బీఐ అసమతుల్యత, ద్రవ్యలోటు - నూతన విదేశీ వాణిజ్య విధానం. కరెంట్ అకౌంట్ అసమానతలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు.
సహజ వనరుల లభ్యత - అభివృద్ధి: జనాభా - పరిమాణం, కూర్పు, పెరుగుదల - ధోరణులు, వృత్తిపరమైన శ్రామిక విభజన - మానవాభివృద్ధి సూచీ. డెమోగ్రఫిక్ డివిడెండ్.
ద్రవ్యం బ్యాంకింగ్, ప్రభుత్వ విత్తం: ద్రవ్య భావన, ద్రవ్య సరఫరా చర్యలు - బ్యాంకులు, పరపతి సృష్టి కారకాలు, పరిష్కారాలు - పన్ను, పన్నేతర ఆదాయం.
వృద్ధి వివరణ - మాపనాలు: వృద్ధి, అభివృద్ధి, అల్పాభివృద్ధి - అల్పాభివృద్ధి లక్షణాలు - అభివృద్ధి దశలు - మూలధన సమీకరణ వనరులు - వృద్ధి వ్యూహం - అభివృద్ధి -ఎదుగుదల మధ్య తేడా, ఎదుగుదల మాపనం. డీరెగ్యులేషన్, ఎదుగుదల.
ఏపీపీఎస్సీ > గ్రూప్-III > పేపర్ - 3 > సెక్షన్ - 2
ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి సమకాలీన సమస్యలు 75 Marks
1. జాతీయాదాయం, భావనలు - స్థూల జాతీయోత్పత్తి - నికర జాతీయోత్పత్తి, మానవాభివృద్ధి సూచీ (అభివృద్ధి మాపనంగా) -ఆంధ్రప్రదేశ్ ఆదాయం, ఉద్యోగితలో వ్యవసాయం పాత్ర.
2. ఆంధ్రప్రదేశ్ పంచవర్ష ప్రణాళికలు -కేటాయింపులు - ప్రభుత్వ రంగ ప్రణాళికలకు ఆర్థిక సహాయం - ఆంధ్రప్రదేశ్ పంచవర్ష ప్రణాళికలకు వనరుల కేటాయింపు.
3. ఆంధ్రప్రదేశ్ భూ సంస్కరణలు - భూసంస్కరణల అవసరం - ఆంధ్రప్రదేశ్‌లో భూకమతాల స్వరూపం - అడవులు, సాగు నేల, సాగునీటి పారుదల విస్తీర్ణం - పంటల విధానం - వ్యవసాయ రుణాల వనరులు - వ్యవసాయ సబ్సిడీలు - ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా పంపిణీ వ్యవస్థ.
4. ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు - వృద్ధి స్వరూపం - చిన్న, కుటీర పరిశ్రమల పాత్ర - సహకార వ్యవస్థ - ఆంధ్రప్రదేశ్ మొత్తం పరపతిలో సహకార సంఘాల వాటా.
5. ఆంధ్రప్రదేశ్‌లో సేవారంగం - ప్రాముఖ్యం - ఆంధ్రప్రదేశ్‌లో రవాణా, విద్యుత్, సమాచారం, పర్యాటకం, సమాచార సాంకేతికతలకు ప్రాధాన్యమిస్తూ సేవారంగం కూర్పు, వృద్ధి.
No comments:
Post a Comment