Pages

Thursday, January 5, 2017

E-Filling of Income Tax in Telugu

E-Filling of Income Tax in Telugu


ఆదాయం 2,50,000/- లు కన్నా ఎక్కువ గా ఉన్న వారు జూలై 31 లోగా రిటర్న్ దాఖలు చేయవలసి ఉంటుంది. ఫిబ్రవరి లో సమర్పించిన ఫారం--16 ఆధారం గా రిటర్న్ దాఖలు చేయాలి.

ఆన్ లైన్ ద్వారా ఇ--రిటర్న్ సులభం గా దాఖలు చేయవచ్చు.

💖పేరు రిజిస్టర్ చేసుకొనుట✍�

 www.incometaxindiaefiling. gov.in వెబ్సైటు లోకి ప్రవేశించి register your self అను ఆప్షన్ ఎంచు కోవాలి.దానిలో passward తదితర వివరాలు పూర్తి చేసిన తదుపరి మెయిల్ కు వచ్చిన లింక్ కాపీ చేసి బ్రౌజర్ లో పేస్ట్ చేసిన తరువాత మొబైల్ కు వచ్చిన పిన్ నంబర్ ని నమోదు చేస్తే రిజిస్ట్రేషన్ పూర్తి అయినట్లే.మీ passward జాగ్రత గా ఉంచు కోవాలి.

 💖ఫారం--26 AS ✍�

ఇ--ఫైలింగ్ చేసేందుకు ఫారం--26 AS ను పరిశీలించుకోవాలి.పైన తెలిపిన వెబ్సైట్ లోకి ప్రవేశించిన తదుపరి view form 26 AS ని ఎంచు కోవాలి.దానిలో యూజర్ ఐడీ అంటే పాన్ నంబర్, రిజిస్ట్రేషన్ లో మనం ఎంచుకొన్న పాస్వర్డ్ తదితర అంశాలను నమోదు చేసిన తదుపరి ఫారం 26 AS ను క్లిక్ చేసి ఎసెస్మెంట్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవటం ద్వారా ఫారం 26 AS ఓపెన్ అవుతుంది. దానిలో ఆ ఇయర్ మనం చెల్లించిన పన్ను సక్రమం గా నమోదు ఐనదీ లేనిదీ పరిశీలించుకోవచ్చు.ఫారం లో పన్ను నమోదు సక్రమంగా ఉన్నప్పుడే ఇ--రిటర్న్ చేయాలి.

💖 ఫారం--26 AS లో నమోదు ల పరిశీలన✍�

ఫారం--26 AS లో మనం పరిశీలన చేసినప్పుడు మనం చెల్లించిన పన్ను సక్రమం గా నమోదు కానట్లఇతే DDO కు తెలియజేయాలి. తప్పులను సరచేయ వలసిన భాద్యత DDO లదే.

💖ఇ--ఫైలింగ్ చేయటం✍�

ఫారం 26 AS లో పన్ను నమోదు సక్రమం గా ఉన్నట్లు సంతృప్తి చెందిన తరువాత ఇ--ఫైలింగ్ చేయటం ప్రారంభించాలి.
Incometaxindiaefiling.gov.in వెబ్సైట్ లోకి ప్రవేశించిన తరువాత Quick e file ITR--I & ITR--4S ఎంపిక చేసుకోవాలి.
పాన్ నంబర్, passward, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి లాగిన్ అవ్వాలి.వెంటనే ఆధార్ నంబరు ఎంటర్ చేయాలి.అనంతరం పాన్ నంబర్, ITR పేరు(ITR--1) అసెస్మెంట్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి.తరువాత ఇవ్వబడిన 3 ఆప్షన్ లు 1.పాన్ ఆధారంగా 2.గతం లో దాఖలు చేసిన రిటర్న్ ఆధారంగా 3.నూతన చిరునామా లలో ఒకటి ఎంపిక చేసుకొని లాగిన్ అవ్వాలి.
తదుపరి వచ్చే ఫారం లో వ్యక్తిగత వివరాలు, ఆదాయం వివరాలు,పన్ను వివరాలు,పన్ను చెల్లింపు వివరాలు,80జి వివరాలు నమోదు చేసి, సబ్మిట్ చేయాలి(వీటిని సేవ్ కూడా చేసుకోవచ్చు).26 AS లో నమోదు ఐన పన్ను, ఇ--ఫైలింగ్ లో పన్ను ఒకే విధంగా ఉండాలి.లేనట్లయితే నోటీసులు ఇస్తారు.

💖ఎకనాలెఢ్జెమెంట్✍�

ITR--1 సబ్మిట్ చేసిన తరువాత ఎకనాలెఢ్జెమెంట్ ఆప్షన్స్ వస్తాయి. దానిలో NO CVC అనే ఆప్షన్ ఎంపిక చేసుకొని తదుపరి వచ్చిన ఆప్షన్స్ లో Mobile OTP ఆప్షన్ ఎంపిక చేసుకుంటే మన ఫోన్ కి, మెయిల్ కి OTP వస్తుంది.ఆ passward ను నమోదు చేస్తే ఎకనాలెఢ్జెమెంట్ మన మెయిల్ కు వస్తుంది.దాని నుండి ఎకనాలెఢ్జెమెంట్ డౌన్ లోడ్ చేసుకొని భద్రపరచుకోవాలి.దీనిని CPC బెంగుళూరు కు పంప వలసినదీ?? లేనిదీ?? దీని కింది భాగంలో లోనే రాశి ఉంటుంది.పంపాలి అని రాసి ఉంటే, 3 నెలల లోపు పంపాలి.

No comments:

Post a Comment

.