భాషా చమత్కారాలు
*మహాకవి శ్రీశ్రీ మద్రాసులో ఓ చిన్న హోటల్ కెళ్ళాడు. "టిఫినేముంది?" అనడిగాడు. "దోసై" అన్నాడు హోటల్ వాడు. "సరే వేసై" అన్నాడు శ్రీశ్రీ.
మరోసారి వైజాగ్ లో ఓ హోటల్ కి వెళ్లి టిఫినేముంది ఆని అడిగాడు. "అట్లు" తప్ప మరేం లేవు సర్ అన్నాడు వాడు. "సరే అట్లే కానీ" అన్నాడు శ్రీశ్రీ.
ఇంకోసారి ఓ మిత్రుడు ఊరెళ్తూంటే వీడ్కోలివ్వటానికి మద్రాస్ సెంట్రల్ స్టేషన్ కెళ్ళాడు. ప్లాట్ ఫాం పై ఓ పరిచయస్తుడు కనిపించి "ఊరికేనా?" అనడిగాడు. "లేదు ఊరికే" అని బదులిచ్చాడు శ్రీశ్రీ.
ఒక ఊరిలో ఒక చోట ఒక బోర్డ్ పై "ఇక్కడ వేడి తేనీరు దొరుకును" అని వ్రాసి ఉండటంతో "అరే ! ఇక్కడ వేడితే కాని నీరు దొరకదా?" అనడిగాడు.
ఓ ఇంటి ముందు "కుక్కలున్నవి జాగ్రత్త" అనే బోర్డ్ చూసి, ఆశ్చర్యం నటిస్తూ "అరే ఇంతకుముందిక్కడ మనుషులుండే వారే" అనన్నాడు.
ఓ కుర్రాడు ఒక పద్యం వల్లె వేస్తున్నాడు "ఎవడు రాత్రి లోకకంఠకుడు,"అని వల్లె వేయటం విని "ఒరే ! మొద్దబ్బాయ్ ! అలాకాదురా ! అది 'ఎవడురా త్రిలోక కంఠకుడు" అని సరి చేశాడు.
శ్రీ గరికపాటివారి చమత్కారాలు!!
ప్రశ్న:
ఉదయం లేవగానే
మహిళలు..మంగళసూత్రాలు
కళ్ళకద్దుకుంటారు.దేనికి?
జవాబు:
వాటిమీదున్న గౌరవంతో మాత్రం కాదు!
భర్త మంగళసూత్రాలు ఉంచాడా,
అర్ధరాత్రివేళ ఏ అవసరానికో లాగేశాడా
అన్న అనుమానంతో చూసి,
ఆ పూటకు దక్కాయన్న సంతోషంతో కళ్ళకద్దుకుంటారు!
ప్రశ్న:
పెళ్ళిలో పెళ్ళికూతురు గౌరీపూజ చేస్తుంది కదా! మరి పెళ్ళికొడుకు ఏ పూజ చేస్తాడు?
జవాబు:
'డౌరీ' పూజ!!
ప్రశ్న:
ఆడవాళ్ళు అవధానం చెబితే?
జవాబు :
ఏముంది.! 'గ్రామర్' తగ్గి 'గ్లామర్' పెరుగుతుంది!!
ప్రశ్న :
మన టీవీ యాంకర్లకి ఒత్తులు పలకడం సరిగా రావడం లేదు! ఏం చేయాలి?
జవాబు:
లక్ష 'ఒత్తుల' నోము చేయిస్తే సరి!
No comments:
Post a Comment