తినే పదార్థాలను న్యూస్ పేపర్లో చుడుతున్నారా బీ కేర్ ఫుల్.. ఎందుకంటే..!!
ప్రతి ఒక్కరు
తప్పక తెలుసుకోవాలి.చదివి అందరికి చేరేలా షేర్ చేయండి.
ఇంట్లో వేసిన
మిరపకాయ బజ్జీలు, పునుగులు,
పూరీల లాంటివి బాగా నూనె
పీల్చినప్పుడు.. వాటి నుంచి నూనె పోవడానికి న్యూస్‌పేపర్లలో పెడుతున్నారా? రోడ్డు పక్కన బండ్ల మీద ఏదైనా ఆహారం తిన్న
తర్వాత చేతులు తుడుచుకోడానికి పాత న్యూస్‌పేపర్లు ఉపయోగిస్తున్నారా? అలా అయితే మీరు కాస్తంత జాగ్రత్తగా
వ్యవహరించాల్సిందే.
ఎందుకంటే.. అలా
చేశారంటే మీ శరీరంలోకి గ్రాఫైట్ వెళ్తుందట. పేపర్లమీద కథనాలు ప్రింట్ చేయడానికి
ఉపయోగించే ఇంకులో గ్రాఫైట్ ఉంటుంది. పత్రిక పొడిగా ఉన్నంతసేపు.. అంటే చదివేటప్పుడు
దాంతో ఎలాంటి సమస్య ఉండదు. కానీ, అది ఏమాత్రం
తడిగా అయినా.. చాలా ప్రమాదకరంగా మారుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇళ్లలో ఏవైనా
స్నాక్స్ చేసుకున్నప్పుడు వాటి నుంచి నూనె తీసేయడానికి చాలామంది ఇళ్లలో ఉండే పాత
న్యూస్‌పేపర్లు ఉపయోగిస్తారని, అది చాలా
ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. అలా ఏయడం వల్ల ఆహారనాళిక ద్వారా నేరుగా గ్రాఫైట్
మన శరీరంలోకి చేరిపోయి, మన మూత్రపిండాలు,
కాలేయాలను దెబ్బతీయడంతో
పాటు.. ఎముకలు, కణజాలాల
ఎదుగుదలను కూడా నిరోధిస్తుంది. సాధారణంగా మన శరీరంలోకి వివిధ మార్గాల ద్వారా చేరే
ప్రమాదకరమైన విష పదార్థాలు మలవిసర్జన ద్వారానే వెళ్లిపోతాయి.
కానీ గ్రాఫైట్ మాత్రం అలా ఎట్టి పరిస్థితుల్లోనూ
వెళ్లదు. అది ఎక్కడికీ పోకుండా మన బాడీలోనే పేరుకుపోతుంది. దాంతో ప్రమాదం మరింత
పెరుగుతుంది. అందువల్ల న్యూస్‌పేపర్లను కేవలం చదవడానికి మాత్రమే ఉపయోగించడం
మంచిదని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. ఈ మంచి విషయం పది మందికీ చేరాలా షేర్
చేయండి.
No comments:
Post a Comment